హార్డ్ డిస్క్ డ్రైవ్: డేటా నిల్వ పరికరం

హార్డ్ డిస్క్ డ్రైవును (Hard Disk Drive - HDD), సాధారణంగా హార్డుడ్రైవు అనో లేదా హార్డుడిస్కు అనో పిలుస్తూ ఉంటారు.

కంప్యూటరులో సమాచారాన్నంతటినీ ఈ హార్డుడిస్కులోనే నిక్షిప్తమై ఉంటుంది. ఇందులో నిక్షిప్తమైన సమాచారం కంప్యూటరుకు విద్యుత్తు సరఫరా నిలిపేసినా చెరిగిపోకుండా ఉంటుంది. హార్డుడిస్కులలో సమాచారాన్ని గుండ్రంగా ఉండే అయస్కాంత రేకులపై భద్రపరుస్తారు. ఈ అయస్కాంత రేకులు వేగంగా తిరగటం వలన అందులో ఉన్న సమాచారాన్ని చదవచ్చు లేదా కొత్త సమాచారాన్ని భద్రపరచవచ్చు. ఒక్కో హార్డు డిస్కు డ్రైవులో ఒకటికంటే ఎక్కువగా అయస్కాంత రేకులు(డిస్కులు) ఉండవచ్చు, అందువలన హార్డుడిస్కులకూ హార్డుడ్రైవులకూ మధ్యన ఉన్న బేధాన్ని గుర్తుంచుకోవాలి. ఒకప్పటి హార్డుడ్రైవులలో ఉండే డిస్కులను మార్చుకోగలిగే సౌకర్యం ఉండేది, ఇప్పుడు వస్తున్న హార్డుడ్రైవులకు అటువంటి సౌకర్యం లేకుండా పూర్తిగా మూసేస్తున్నారు.

హార్డ్ డిస్క్ డ్రైవ్: డేటా నిల్వ పరికరం
IBMవారు తయారు చేసిన హార్డుడ్రైవుపై తొడుగును తొలగిస్తే లోపట అయస్కాంత రేకులు ఈ విధంగా కనపడతాయి.

హార్డుడ్రైవులను మొదటగా కంప్యూటర్లలో ఉపయోగించటానికి తయారు చేసారు. 21వ శతాబ్దం వచ్చేసరికి హార్డుడ్రైవుల వాడకం కంప్యూటర్లలోనే కాకుండా కెమేరాలలోనూ, వీడియోగేములలోనూ, మొబైలు ఫోనులలోనూ, TVలలోనూ, TiVO వంటి పివిఆర్(PVR)లలోనూ, వీడియో ప్లేయర్లలోనూ(eg: hard disk Players) ఉపయోగించటం మొదలుపెట్టారు. భద్రపరచాల్సిన సమాచారం పెరిగిపోవటం, సమాచారం యొక్క విలువ కూడా పెరుగుతూ ఉండటం వలన హార్డుడ్రైవులను ఉపయోగించి రెయిడ్(RAID), నాస్(NAS), సాన్(SAN) వంటి వ్యవస్తల రూపకల్పనకు బాటలు వేసింది. ఈ వ్యవస్థలలో మామూలు హార్డుడ్రైవులనే సమీష్టిగా ఉపయోగించి ఎంత సమాచారాన్నయినా మరింత మన్నికగా భద్రపరచుకోగలిగే అవకాశం ఉంది.

సాంకేతికాలు

హార్డ్ డిస్క్ డ్రైవ్: డేటా నిల్వ పరికరం 
హార్డుడ్రైవు అంతర్భాగాలు

హార్డ్ డిస్కులను గాజు, సిరామిక్ లేదా అల్యూమినియం వంటి "హార్డ్" పదార్థాల నుండి తయారు చేస్తారు. ఇది తరువాత లోహపు పలుచని పొరతో పూత పూయబడుతుంది, దీనిని అయస్కాంతీకరించవచ్చు లేదా డీమాగ్నిటైజ్ చేయవచ్చు. హార్డుడిస్కులలో సమాచారాన్ని భద్రపరచటానికి, అయస్కాంతశక్తి ద్వారా ప్రభావితమైయ్యే ఒక ఇనుప(ferromagnetic) పదార్ధంతో తయారు చేస్తారు. ఈ ఇనుప పదార్ధంపై అయస్కాంత శక్తిని ఒక దిశగా ప్రసరించి ద్వారా దానిని ఆ దిశగా మలచి, 1 లేదా 0గా గుర్తిస్తారు. ఇలా హార్డుడిస్కుపై ఒక్కో ప్రాంతంలో ఒక్కో సంఖ్యను భద్రపరచి చివరికి పూర్తి సమాచారాన్ని నిక్షిప్తం చేయగలుగుతారు.

మూలాలు

Tags:

అయస్కాంతంకంప్యూటరు

🔥 Trending searches on Wiki తెలుగు:

వ్యాసుడుగుంటూరు లోక్‌సభ నియోజకవర్గంబ్రాహ్మణులుగరుత్మంతుడురామ్ చ​రణ్ తేజప్రశ్న (జ్యోతిష శాస్త్రము)మహేంద్రసింగ్ ధోనిఅమెజాన్ (కంపెనీ)కడియం కావ్యకామసూత్రతెలుగు కవులు - బిరుదులుకెనడామా తెలుగు తల్లికి మల్లె పూదండభారతీయ శిక్షాస్మృతితెలంగాణ లోక్‌సభ నియోజకవర్గాల జాబితాచిరుధాన్యంమామిడితీన్మార్ సావిత్రి (జ్యోతి)చాట్‌జిపిటివాస్తు శాస్త్రంబమ్మెర పోతనతెలుగు సినిమాల జాబితాహైదరాబాదు మెట్రో స్టేషన్ల జాబితాతీన్మార్ మల్లన్నఆంధ్రప్రదేశ్సలేశ్వరంవారాహినరేంద్ర మోదీరక్త పింజరిజగ్జీవన్ రాంప్రజా రాజ్యం పార్టీఅష్ట దిక్కులుభారత రాజ్యాంగం - ప్రాథమిక విధులుభారతదేశంలో కోడి పందాలుఆరోగ్యంభారత జాతీయ మానవ హక్కుల కమిషన్నవలా సాహిత్యముదక్షిణామూర్తి ఆలయంరోజా సెల్వమణివేమన శతకమునీ మనసు నాకు తెలుసుఅమెరికా సంయుక్త రాష్ట్రాలువందే భారత్ ఎక్స్‌ప్రెస్2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుమ్యాడ్ (2023 తెలుగు సినిమా)సంస్కృతంఇంద్రుడుభారతదేశ పంచవర్ష ప్రణాళికలుచతుర్యుగాలుఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థఆరూరి రమేష్ఉమ్రాహ్ఆషికా రంగనాథ్ఉష్ణోగ్రతమారేడువిజయశాంతిఫ్లిప్‌కార్ట్పెద్దమనుషుల ఒప్పందంనువ్వు నేనుహైదరాబాదు లోక్‌సభ నియోజకవర్గంబలి చక్రవర్తిబాలకాండగ్లెన్ ఫిలిప్స్భారత రాజ్యాంగం - ఆదేశిక సూత్రాలుచేతబడివరలక్ష్మి శరత్ కుమార్భారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులుయువరాజ్ సింగ్భారతదేశ సరిహద్దులుసప్తర్షులురావణుడుటిల్లు స్క్వేర్హస్త నక్షత్రముఅన్నమాచార్య కీర్తనలురుద్రమ దేవి🡆 More