షేక్ ముజిబుర్ రహ్మాన్

షేక్ ముజిబుర్ రహ్మాన్ (Bengali: শেখ মুজিবুর রহমান; Bengali pronunciation: ) (1920 మార్చి 17 – 1975 ఆగస్టు 15) బంగ్లా రాజకీయ నాయకుడు.

బంగ్లాదేశ్ వ్యవస్థాపక నేత. దేశానికి అధ్యక్షునిగా రెండు సార్లు వ్యవహరించారు,  1972 నుంచి 1975 వరకూ స్ట్రాంగ్ మేన్ ప్రీమియర్ గా వ్యవహరించారు. రహ్మాన్ అవామీ లీగ్ నాయకుడు. ఆయనను ప్రముఖంగా బంగబంధు అని వ్యవహరిస్తారు. బంగ్లాదేశ్ విమోచనోద్యమంలో ప్రధాన నాయకుడన్న ప్రశస్తి పొందారు, 20వ శతాబ్దికి చెందిన పలువురు జాతిపితలతో ఆయనను పోలుస్తూంటారు. ఆయన కుమార్తె షేక్ హసీనా వాజెద్ బంగ్లాదేశ్ ప్రస్తుత ప్రధాని.

బంగబంధు
షేక్ ముజిబుర్ రహ్మాన్
শেখ মুজিবুর রহমান
షేక్ ముజిబుర్ రహ్మాన్
1950లో షేక్ ముజిబుర్ రహ్మాన్
మొదటి, నాలుగు బంగ్లాదేశ్ అధ్యక్షుడు
In office
11 ఏప్రిల్ 1971 – 12 జనవరి 1972
ప్రథాన మంత్రితాజుద్దీన్ అహ్మద్
అంతకు ముందు వారుపదవి స్థాపన
తరువాత వారుసయ్యద్ నజ్రుల్ ఇస్లాం (తాత్కాలిక)
In office
25 జనవరి 1975 – 15 ఆగస్టు 1975
ప్రథాన మంత్రిమహమ్మద్ మన్సుర్ అలీ
అంతకు ముందు వారుమహ్మద్ మహమ్మదుల్లా
తరువాత వారుఖోండాకర్ ముస్తాక్ అహ్మద్
రెండవ బంగ్లాదేశ్ ప్రధానమంత్రి
In office
12 జనవరి 1972 – 24 జనవరి 1975
అధ్యక్షుడుఅబు సయ్యద్ చౌధురి
మహ్మద్ మహమ్మదుల్లా
అంతకు ముందు వారుతాజుద్దీన్ అహ్మద్
తరువాత వారుమహమ్మద్ మన్సూర్ అలీ
వ్యక్తిగత వివరాలు
జననం(1920-03-17)1920 మార్చి 17
తుంగిపరా, బెంగాల్ ప్రెసిడెన్సీ, బ్రిటీష్ ఇండియా
(ప్రస్తుతం బంగ్లాదేశ్ లో ఉంది)
మరణం1975 ఆగస్టు 15(1975-08-15) (వయసు 55)
ఢాకా, బంగ్లాదేశ్
జాతీయతబంగ్లాదేశీ
రాజకీయ పార్టీబంగ్లాదేశ్ కృషిక్ శ్రామిక్ అవామీలీగ్ (1975)
ఇతర రాజకీయ
పదవులు
ఆలిండియా ముస్లిం లీగ్ (1949కి ముందు)
బంగ్లాదేశ్ అవామీ లీగ్ (1949–1975)
జీవిత భాగస్వామిషేక్ ఫజిలతున్నీసా ముజిబ్
సంతానంషేక్ హసీనా
షేక్ రెహానా
షేక్ కమల్
షేక్ జమాల్
షేక్ రసేల్
కళాశాలమౌలానా అజాద్ కళాశాల
ఢాకా విశ్వవిద్యాలయం

సామ్యవాది అయిన రహ్మాన్ తన విశిష్టమైన, ఆకర్షణీయమైన ప్రసంగ శక్తి వల్ల అవామీ లీగ్ లోనూ, తూర్పు పాకిస్తానీ రాజకీయాల్లోనూ ఉన్నతస్థానాలకు వేగంగా చేరుకున్నారు. తూర్పు పాకిస్తాన్ ప్రావిన్సులో మెజారీటీ అయిన బెంగాలీలపై పాకిస్తాన్ లో సంస్థాగతంగా చూపిస్తున్న జాతివివక్షను వ్యతిరేకించే నాయకునిగా ఆయన పేరొందారు. వర్గాల మధ్య ఉద్రిక్తలు తారాస్థాయికి చేరిపోయినప్పుడు, ఆయన 6-అంశాల స్వయం ప్రతిపత్తి పథకాన్ని రూపొందించగా, దేశద్రోహం చట్టం ప్రయోగించి ఫీల్డ్ మార్షల్ ఆయూబ్ ఖాన్ ప్రభుత్వం ఖైదుచేసింది. 1970ల్లో నిర్వహించిన పాకిస్తాన్ తొలి ప్రజాస్వామ్య ఎన్నికల్లో అవామీ లీగ్ ను గెలుపు దిశగా నడిపించారు. మెజారిటీ సాధించినా సైనిక నియంతలు రహ్మాన్ ను ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ఆహ్వానించలేదు. ఈ పరిణామాలతో తూర్పు పాకిస్తాన్లో ప్రజల ఆందోళన శాసనోల్లంఘన రూపాన్ని తీసుకోగా 1971 మార్చి 7లో చేసిన చారిత్రాత్మకమైన ప్రసంగంలో బంగ్లాదేశీ స్వాతంత్ర్య పోరాటాన్ని ప్రకటించారు. 1971 మార్చి 26న పాకిస్తానీ సైన్యం ప్రజల నిరసనలకు ప్రతిస్పందిస్తూ ఆపరేషన్ సెర్చ్ లైట్ ఏర్పరిచి, దానిలో భాగంగా ప్రధానిగా ఎన్నికైన రహ్మాన్ ను అరెస్టు చేసి, పశ్చిమ పాకిస్తాన్ జైల్లో ఏకాంతవాస శిక్ష వేశారు, 1971 బంగ్లాదేశ్ జాతిహననంలో భాగంగా బెంగాలీ ప్రజలు, విద్యార్థులు, మేధావులు, రాజకీయ నాయకులు, సైనిక తిరుగుబాటుదారులను హత్యచేశారు. బంగ్లాదేశ్ విమోచనం తర్వాత రహ్మాన్ ను పాకిస్తానీ ఖైదు నుంచి విడుదల చేయగా, జనవరి 1972లో ఢాకా చేరుకున్నారు.

కొత్తగా ఏర్పడ్డ దేశానికి స్వీకరించిన పార్లమెంటరీ విధానంలో రహ్మాన్ ప్రధానమంత్రి అయ్యారు. ఆయన ప్రభుత్వం సామ్యవాదం, మతరహిత ప్రజాస్వామ్యాలను దేశ విధానాలుగా చట్టం చేశారు. 1973లో జరిగిన తొలి సాధారణ ఎన్నికల్లో అవామీ లీగ్ భారీ మెజారిటీతో విజయం సాధించింది. ఏదేమైనా రహ్మాన్ విపరీతమైన నిరుద్యోగం, పేదరికం, లంచగొండితనం ఎదుర్కోవాల్సి వచ్చింది. 1974లో కరువు వచ్చింది. దేశీయ మైనారిటీలకు రాజ్యాంగపరమైన గుర్తింపు నిరాకరించడం, భద్రతా దళాలు-మరీ ముఖ్యంగా జాతీయ భద్రతా బలగం పారామిలిటియా పాల్పడుతున్న మానవ హక్కుల హననం వంటివి ప్రభుత్వాన్ని తీవ్ర విమర్శలకు గురిచేశాయి. పెరుగుతున్న రాజకీయ ఆందోళనల మధ్య రహ్మాన్ ఏక పార్టీ సామ్యవాద పాలనకు 1975 జనవరిలో తెరతీశారు. ఆరు నెలలకు ఆయనను, ఆయన కుటుంబంలో చాలామందినీ తిరగబడ్డ సైనికాధికారులు సైనిక తిరుగుబాటు సమయంలో చంపేశారు. ఆపైన మార్షల్ లా ప్రభుత్వం ఒకటి ఏర్పడింది.

2004లో బిబిసి బెంగాలీ అభిప్రాయ సేకరణలో రహ్మాన్ సార్వకాలికంగా అతిగొప్ప బెంగాలీగా ఎన్నికయ్యారు.

Notes

Tags:

Bengali languageషేక్ హసీనా

🔥 Trending searches on Wiki తెలుగు:

గురజాడ అప్పారావుఆంధ్రప్రదేశ్ రాష్ట్రీయ చిహ్నాలు.టెట్రాడెకేన్కడప లోక్‌సభ నియోజకవర్గంభారత జాతీయగీతంరెండవ ప్రపంచ యుద్ధంపుష్యమి నక్షత్రముశ్యామశాస్త్రిభాషా భాగాలుఆయాసంసంక్రాంతిఛత్రపతి శివాజీశ్రవణ కుమారుడుసిద్ధు జొన్నలగడ్డకాలేయండామన్మాధవీ లతబ్రహ్మంగారి కాలజ్ఞానంరాజంపేట లోక్‌సభ నియోజకవర్గంమలబద్దకంయోనిమ్యాడ్ (2023 తెలుగు సినిమా)కన్యారాశితెలుగుహైదరాబాదుగాయత్రీ మంత్రంశుభాకాంక్షలు (సినిమా)తెలుగు సంవత్సరాలుశాసనసభ సభ్యుడుత్రిష కృష్ణన్నీ మనసు నాకు తెలుసుతమిళ అక్షరమాలఫహాద్ ఫాజిల్యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీఆది శంకరాచార్యులుప్రశ్న (జ్యోతిష శాస్త్రము)వాతావరణంకీర్తి సురేష్జై శ్రీరామ్ (2013 సినిమా)భారతదేశంలో కోడి పందాలుఆంధ్రప్రదేశ్‌లో 2024 భారత సార్వత్రిక ఎన్నికలునాయీ బ్రాహ్మణులుయతిచిరంజీవి నటించిన సినిమాల జాబితాఅమెరికా రాజ్యాంగంథామస్ జెఫర్సన్అమ్మల గన్నయమ్మ (పద్యం)భారతదేశ చరిత్రఆల్ఫోన్సో మామిడివిజయనగర సామ్రాజ్యంకస్తూరి రంగ రంగా (పాట)అమెజాన్ ప్రైమ్ వీడియోచెమటకాయలువేమన శతకముపునర్వసు నక్షత్రముగ్లోబల్ వార్మింగ్నీటి కాలుష్యంభారతదేశ రాజకీయ పార్టీల జాబితాసీ.ఎం.రమేష్అమ్మసప్త చిరంజీవులుఇంగువకొమురం భీమ్సౌందర్యఆషికా రంగనాథ్తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థఅంగారకుడుతెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్తమిళ భాషసప్తర్షులుసింహంపాముతెలుగు వికీపీడియారాష్ట్రపతి పాలనభలే అబ్బాయిలు (1969 సినిమా)కొబ్బరిదొంగ మొగుడుసజ్జలుఅష్ట దిక్కులు🡆 More