శీలా వీర్రాజు: రచయిత, చిత్రకారుడు

శీలా వీర్రాజు (1939 ఏప్రిల్ 22 - 2022 జూన్ 1) ప్రముఖ చిత్రకారుడు, సాహితీవేత్త.

ఆయన రాసిన మైనా నవల తెలుగు సాహిత్యంలో విశేషమైన ప్రశంసలు అందుకుంది. దీనికిగాను 1969లో ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడెమీ ఉత్తమ నవల పురస్కారం దక్కింది. అలాగే ఆయన రచించిన పలు రచనలకు ప్రతిష్టాత్మక పురస్కారాలు వరించాయి. ఆయన శీలావీ గా సుపరిచితుడు.

శీలా వీర్రాజు కవి, చిత్రకారుడు
శీలా వీర్రాజు: బాల్యం, కెరీర్, రచనలు
వ్యక్తిగత వివరాలు
జననం (1939-04-22) 1939 ఏప్రిల్ 22 (వయసు 85)
రాజమండ్రి, తూర్పు గోదావరి, ఆంధ్రప్రదేశ్
మరణం2022 జూన్ 1
జాతీయతభారతీయుడు
జీవిత భాగస్వామిసుభద్రాదేవి
తల్లివీరబద్రమ్మ
తండ్రిశీలా సూర్యనారాయణ

బాల్యం

1939 ఏప్రిల్ 22న రాజమండ్రిలో జన్మించాడు. డిగ్రీ వరకు విద్యాభ్యాసం అక్కడే కొనసాగింది. కళాశాల విద్య అభ్యసించే సమయంలోనే ఆయన కథలు రాయడం ప్రారంభించాడు.

కెరీర్

1961లో హైదరాబాదు నుండి వెలువడే కృష్ణాపత్రికలో సబ్ ఎడిటర్‌గా చేరి రెండేళ్లు పనిచేశాడు. 1963 జులైలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వ సమాచార పౌర సంబంధ శాఖలో అనువాదకుడిగా చేరి 1990 జనవరి 31న స్వచ్ఛంద పదవీవిరమణ చేశాడు. చిత్రకారుడిగా, కవిగా, కథారచయితగా, నవలారచయితగా బహుముఖ ప్రతిభను ప్రదర్శించాడు. యువభారతితో కలసి పనిచేసాడు. శీలా వీర్రాజు చిత్రాల ప్రదర్శనను రాజమహేంద్రవరంలోని దామెర్ల ఆర్ట్‌గ్యాలరీలో ఉంచారు.

రచనలు

కవిత్వం

  1. కొడిగట్టిన సూర్యుడు
  2. హృదయం దొరికింది
  3. మళ్ళీ వెలుగు
  4. కిటికీ కన్ను
  5. ఎర్రడబ్బా రైలు
  6. పడుగుపేకల మధ్య జీవితం
  7. శీలా వీర్రాజు కవిత్వం ( పై ఆరు కవితాసంపుటాల బృహద్గ్రంథం)
  8. బతుకు బాట
  9. ఒక అసంబద్ధ నిజం

నవలలు

  1. వెలుగు రేఖలు
  2. కాంతిపూలు
  3. మైనా
  4. కరుణించని దేవత

కథాసంపుటాలు

  1. సమాధి
  2. మబ్బుతెరలు
  3. వీర్రాజు కథలు
  4. హ్లాదిని
  5. రంగుటద్దాలు
  6. పగా మైనస్ ద్వేషం
  7. వాళ్ళ మధ్య వంతెన
  8. మనసులోని కుంచె
  9. ఊరు వీడ్కోలు చెప్పింది
  10. శీలావీర్రాజు కథలు (8 కథాసంపుటాల హార్డ్ బౌండ్)

ఇతరాలు

  1. కలానికి ఇటూ అటూ(వ్యాస సంపుటి)
  2. శిల్పరేఖ (లేపాక్షి రేఖాచిత్రాలు)
  3. శీలావీర్రాజు చిత్రకారీయం (వర్ణచిత్రాల ఆల్బమ్‌)

పురస్కారాలు

  1. 1967లో కొడిగట్టిన సూర్యుడు కవితాసంపుటికి ఫ్రీవర్స్ ఫ్రంట్ మొట్టమొదటి అవార్డు
  2. 1969లో మైనా నవలకు ఆం.ప్ర.సాహిత్య అకాడెమీ ఉత్తమ నవల పురస్కారం
  3. 1991లో శీలావీర్రాజు కథలు సంపుటానికి తెలుగువిశ్వవిద్యాలయం ఉత్తమ కథల సంపుటి బహుమతి
  4. 1994లో కొండేపూడి శ్రీనివాసరావు సాహితీ సత్కారం.
  5. డా. బోయి భీమన్న వచన కవితా పురస్కారం - లక్ష రూపాయల నగదు, ప్రసంశపత్రం (బోయి భీమన్న సాహిత్య పీఠం, తెలుగు విశ్వవిద్యాలయం, 19.09.2014).

మరణం

83 ఏళ్ళ శీలా వీర్రాజు 2022 జూన్ నెల 1వ తారీకు నాడు(బుధవారం) సాయంత్రం హైదరాబాదు సరూర్‌నగర్‌లోని స్వగృహంలో గుండెపోటుతో మృతిచెందారు. ఆయనికి భార్య సుభద్ర, కూతురు పల్లవి ఉన్నారు. శీలా సుభద్రాదేవి కూడా సాహితీవేత్త.

మూలాలు

Tags:

శీలా వీర్రాజు బాల్యంశీలా వీర్రాజు కెరీర్శీలా వీర్రాజు రచనలుశీలా వీర్రాజు పురస్కారాలుశీలా వీర్రాజు మరణంశీలా వీర్రాజు మూలాలుశీలా వీర్రాజు

🔥 Trending searches on Wiki తెలుగు:

హనుమంతుడువిద్యభారతదేశంలో సెక్యులరిజంవై.ఎస్.వివేకానందరెడ్డిఫేస్‌బుక్గౌడదొమ్మరాజు గుకేష్కందుకూరి వీరేశలింగం పంతులుఇంటి పేర్లుపూర్వాభాద్ర నక్షత్రముస్త్రీకల్వకుంట్ల కవితకులంకేతువు జ్యోతిషంస్వామి వివేకానందదశావతారములుమహర్షి రాఘవకాళోజీ నారాయణరావు2023 తెలంగాణ శాసనసభ ఎన్నికలుపులివెందుల శాసనసభ నియోజకవర్గంబద్దెనఐడెన్ మార్క్‌రమ్సూర్య నమస్కారాలుగ్లెన్ ఫిలిప్స్తొలిప్రేమశాతవాహనులు2024 భారత సార్వత్రిక ఎన్నికలుపిఠాపురంబాల కార్మికులుజగ్జీవన్ రాంఖమ్మం లోక్‌సభ నియోజకవర్గంభారతదేశ రాజకీయ పార్టీల జాబితాతెలంగాణా బీసీ కులాల జాబితాజగ్గయ్యపేట శాసనసభ నియోజకవర్గంతెలుగునాట జానపద కళలునోటాప్రకాష్ రాజ్లైంగిక విద్యబోడె రామచంద్ర యాదవ్ఔటర్ రింగు రోడ్డు, హైదరాబాద్ఈనాడురాకేష్ మాస్టర్సర్వే సత్యనారాయణశివపురాణంతూర్పు చాళుక్యులుఆప్రికాట్గరుడ పురాణంసౌర కుటుంబంమూర్ఛలు (ఫిట్స్)తెలుగు సంవత్సరాలుఅమెజాన్ (కంపెనీ)భలే అబ్బాయిలు (1969 సినిమా)మాచెర్ల శాసనసభ నియోజకవర్గంపిత్తాశయముమృగశిర నక్షత్రముకాశీ2019 భారత సార్వత్రిక ఎన్నికలుగుడివాడ శాసనసభ నియోజకవర్గంగూగ్లి ఎల్మో మార్కోనిస్టాక్ మార్కెట్రవీంద్రనాథ్ ఠాగూర్మహాకాళేశ్వర జ్యోతిర్లింగంవెలిచాల జగపతి రావుకొణతాల రామకృష్ణకొమురం భీమ్కామసూత్రబమ్మెర పోతనహార్సిలీ హిల్స్అయోధ్య రామమందిరంసత్యనారాయణ వ్రతంగాయత్రీ మంత్రంనానార్థాలుశ్రీ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రముశ్రవణ నక్షత్రముభారత జాతీయ క్రికెట్ జట్టువందే భారత్ ఎక్స్‌ప్రెస్🡆 More