వావిళ్ళ వెంకటేశ్వర శాస్త్రి: తెలుగు రచయిత

వావిళ్ళ వెంకటేశ్వర శాస్త్రి (1884 - 1956) పండితులు, భాషా పోషకులు, ప్రచురణ కర్త.

వీరు సుప్రసిద్ధ వావిళ్ళ వారి వంశంలో వావిళ్ళ రామస్వామి శాస్త్రులు దంపతులకు జన్మించారు. వీరి తండ్రి స్థాపించిన వావిళ్ళ సంస్థను బాగా అభివృద్ధి చేశారు. ప్రాచీనాంధ్ర ప్రబంధాలను, శతకాలనే కాక నూతన గ్రంథాలను కూడా కొన్నింటిని ప్రకటించారు.

వావిళ్ళ వెంకటేశ్వరశాస్త్రి
వావిళ్ళ వెంకటేశ్వర శాస్త్రి: బాల్యము, విద్య , వివాహం, వావిళ్ళ ప్రెస్ నిర్వహణ, మూలాలు
జననంవావిళ్ళ వెంకటేశ్వరశాస్త్రి
1884
మరణం1956
వృత్తిప్రచురణకర్త
భార్య / భర్తసుబ్బమ్మ
తండ్రివావిళ్ల రామస్వామి శాస్త్రులు
తల్లిజ్ఞానాంబ

ఆంధ్ర గ్రంథ ముద్రణకు వీరు చేసిన సేవకు గాను ఆంధ్ర విశ్వకళా పరిషత్తు ఇతనికి 1955లో కళాప్రపూర్ణ గౌరవంతో సన్మానించింది.

బాల్యము, విద్య , వివాహం

వెంకటేశ్వర శాస్త్రి వావిళ్ళ రామస్వామిశాస్త్రి, జ్ఞాంబ దంపతుల ప్రథమ సంతానం. చిన్నవయసులోనే తండ్రిని కోల్పోయిన శాస్త్రి తన మేనమామ వేదం వేంకటరాయ శస్త్రి, శ్రీ ఉడాలి దండిగుంట సూర్యనారాయణశాస్త్రుల వద్ద సంస్కృతాంధ్ర సాహిత్యాలలో పాండిత్యం సంపాదించారు. కర్నూలు మున్సిపల్ హైస్కూలులో కొన్నేళ్ళు చదివి, చెన్నపురి పచ్చయప్ప హైస్కూలులో మెట్రిక్యులేషన్ పరీక్ష ఉత్తీర్ణత పొంది అక్కడి కళాశాలలోనే ఎఫ్.ఏ దాకా చదివారు.

వెంకటేశ్వర శాస్త్రికి భువనపల్లి సీతారామయ్య గారి కుమార్తె సుబ్బమ్మతో పదిహేనేళ్ళ వయసులో వివాహం జరిగింది. ఆయన నిస్సంతుగా, వీలూనామా రాయకుండా మరణించడంతో ఆయన తదనంతరం వావిళ్ళ ప్రెస్సు మనుగడ ప్రమాదంలో పడింది. తరువాత చాలాకాలానికి అల్లాడి వారి కృషి ఫలితంగా మళ్ళీ విజయవంతంగా పనిచేసింది.

వావిళ్ళ ప్రెస్ నిర్వహణ

తన తండ్రి స్థాపించిన "ఆది సరస్వతీనిలయము" ప్రెస్సుకు 1906లో వావిళ్ళ ప్రెస్సు అన్న పేరు పెట్టి నిర్వహణ బాధ్యతలు స్వీకరించారు. కాలక్రమంలో బాలశిక్ష మొదలుకుని అన్ని రకాలైన పుస్తకాలను వందల సంఖ్యలో తెలుగు, సంస్కృత, తమిళ, ఆంగ్ల భాషల్లో ప్రచురించారు. "వావిళ్ళ వారి గ్రంథాలలో తప్పులుండవు" అనే కీర్తిని కూడా పొందారు.

"ఆనంద మఠం" గ్రంథానికి తెలుగు ముద్రణ, తిలక్ గీతారహస్యానికి మరాఠీ నుండి చేసిన తెలుగు అనువాదం వీరు ప్రచురించిన పుస్తకాల్లో కొన్ని. తెలుగులో "త్రిలింగ" వార పత్రికకు, ఆంగ్లంలో "ఫెడరేటెడ్ ఇండియా" మాసపత్రికకూ సంపాదకత్వం వహించారు.

మూలాలు

బయటి లింకులు

‍* Vavilla Venkateswara Sastrulu in The Great Indian patriots by P. Rajeswar Rao

Tags:

వావిళ్ళ వెంకటేశ్వర శాస్త్రి బాల్యము, విద్య , వివాహంవావిళ్ళ వెంకటేశ్వర శాస్త్రి వావిళ్ళ ప్రెస్ నిర్వహణవావిళ్ళ వెంకటేశ్వర శాస్త్రి మూలాలువావిళ్ళ వెంకటేశ్వర శాస్త్రి బయటి లింకులువావిళ్ళ వెంకటేశ్వర శాస్త్రివావిళ్ళ రామస్వామి శాస్త్రులు

🔥 Trending searches on Wiki తెలుగు:

పొడపత్రిశ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాసావిత్రిబాయి ఫూలేకపిల్ సిబల్ధ్వనితెలుగు వాక్యంబ్రాహ్మణులుజొన్నశ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం (భద్రాచలం)మలబద్దకంవిష్ణువుమక్కారోహిణి నక్షత్రంచిరంజీవి నటించిన సినిమాల జాబితాభారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థగ్రీన్‌హౌస్ ప్రభావంఆల్కహాలుఆటవెలదితమలపాకుపింగళి సూరనామాత్యుడురాజమండ్రిసరస్వతిమొదటి భారత స్వాతంత్ర్య యుద్ధంతెలంగాణ ప్రజా సమితిఉండవల్లి శ్రీదేవిచతుర్వేదాలుఆంధ్రజ్యోతిఝాన్సీ లక్ష్మీబాయిసీతారామ కళ్యాణంశివలింగంరక్త పింజరిబుధుడు (జ్యోతిషం)భారత ఎన్నికల కమిషనుతెలంగాణకు హరితహారంసురేఖా వాణిరాజశేఖర చరిత్రముసంగీతంఎయిడ్స్యూట్యూబ్అరిస్టాటిల్కె.విశ్వనాథ్అమెజాన్ ప్రైమ్ వీడియోజాషువాగరుడ పురాణంప్రియదర్శి పులికొండగోధుమప్రభాస్తెలుగుజమ్మి చెట్టుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులుతెలుగు పత్రికలుశ్రీకాళహస్తికామసూత్రనామవాచకం (తెలుగు వ్యాకరణం)ఆనం వివేకానంద రెడ్డిసంక్రాంతినీతి ఆయోగ్గైనకాలజీమహాత్మా గాంధీఖోరాన్ముదిరాజు క్షత్రియులువృత్తులుఅటార్నీ జనరల్ఉత్తర ఫల్గుణి నక్షత్రముకాకతీయులుప్రకటనదాస్‌ కా ధమ్కీఎస్. పి. బాలసుబ్రహ్మణ్యంసమాసంపుష్పంభారతదేశ ప్రధానమంత్రిబోయకేతువు జ్యోతిషంతంగేడులోక్‌సభధూర్జటితోట చంద్రశేఖర్శైలజారెడ్డి అల్లుడు🡆 More