వల్లంపాటి వెంకటసుబ్బయ్య

వల్లంపాటి వెంకటసుబ్బయ్య (మార్చి 15, 1937 - జనవరి 2, 2007) సాహితీ విమర్శకుడు, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత.

వల్లంపాటి వెంకటసుబ్బయ్య
వల్లంపాటి వెంకటసుబ్బయ్య
జననం(1937-03-15)1937 మార్చి 15
రొంపిచెర్ల, చిత్తూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్
మరణం2007 జనవరి 2(2007-01-02) (వయసు 69)
విద్యఎం. ఎ, ఎం. లిట్
వృత్తిరచయిత, విమర్శకుడు, లెక్చరర్
పురస్కారాలుకేంద్ర సాహిత్య అకాడెమీ

జననం

వల్లంపాటి 1937, మార్చి 15చిత్తూరు జిల్లా రొంపిచర్ల లో జన్మించాడు. ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడిగా వృత్తిని ప్రారంభించి, ఇంగ్లీషులో ఎం.ఏ చేసి, తరువాత హైదరాబాదు లోని సెంటర్‌ ఫర్‌ ఇంగ్లీష్‌ అండ్‌ ఫారెన్‌ లాంగ్వేజెస్‌ నుంచి ఎం.లిట్‌ పొందాడు. మదనపల్లె బీసెంట్‌ థియేసాఫికల్‌ కాలేజీలో లెక్చరర్‌గా పనిచేసి పదవీ విరమణ చేసాడు.

వల్లంపాటి కథకుడిగా తన రచనా వ్యాసంగాన్ని మొదలుపెట్టాడు. పరిష్కారం, మిథ్య మొదలైన కథానికలు 40 దాకా ప్రచురించాడు. ఆయన రాసిన ఇంధ్రధనస్సు, దూర తీరాలు నవలలు ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రికలో బహుమతులు పొందాయి. వల్లంపాటి సాహితీ విమర్శకుడిగా సుప్రసిద్ధుడు. ఆయన రాసిన కథా శిల్పం, నవలాశిల్పం, విమర్శా శిల్పం పుస్తకాలు తెలుగు సాహిత్య విమర్శకు ప్రామాణికాలు. అనువాదకుడిగా కుడా ఆయన ప్రసిద్ధుడే. ఇంగ్లీషు నుంచి, కన్నడం నుంచి తెలుగులోకి ఎన్నో గ్రంధాలు, కథలను అనువదించాడు. తస్లీమా నస్రీన్‌ రచించిన లజ్జ, బ్రిటిష్‌ రచయిత ఇ.హెచ్‌.కార్‌ రచించిన చరిత్ర అంటే ఏమిటి...? ఆయన చేసిన అనువాద రచనలలో కొన్ని.

ఆయన రాసిన కథాశిల్పం రచనకు 1999 సంవత్సరానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. ఇదే పుస్తకానికి తెలుగు విశ్వవిద్యాలయం ఉత్తమ సాహిత్య విమర్శ గ్రంథంగా ఎంపిక చేసి, సత్కరించింది.

మరణం

2007, జనవరి 2 న వల్లంపాటి మదనపల్లెలో మరణించాడు.

రచనల జాబితా

    నవలలు
  • ఇంద్ర ధనుస్సు - 1962
  • దూర తీరాలు - 1964
  • మమతలు - మంచుతెరలు - 1972
  • జానకి పెళ్ళి - 1974
    కథలు
  • బండి కదిలింది
  • రానున్న శిశిరం
  • బంధాలు
    సాహితీ విమర్శ, పరిశోధన
  • కథా శిల్పం - 1996
  • నవలా శిల్పం - 1995
  • నిమర్శా శిల్పం - 2002
  • అనుశీలన - 1985
  • నాటికవులు - 1963
  • వల్లంపాటి సాహిత్య వ్యాసాలు - 1997
  • రాయలసీమలో ఆధునిక సాహిత్యం - సామాజిక సాంస్కృతిక విశ్లేషణ - 2006
    అనువాదాలు
  • ప్రపంచ చరిత్ర
  • చరిత్ర అంటే ఏవిటి?
  • చరిత్రలో ఏమి జరిగింది?
  • ప్రాచీన భారతదేశం ప్రగతి
  • సంప్రదాయ వాదం - 1998
  • భారతదేశం చరిత్ర - (ఆర్.ఎస్.శర్మ 2002)
  • బతుకంతా (కన్నడ నవల)
  • లజ్జ
  • నవల-ప్రజలు
    ఇంకా
  • ఎన్నో సంకలనాలు, సంపుటాలకు ముందు మాటలు వ్రాసాడు
  • తెలుగు, కన్న, ఇంగ్లీషు భాషలలోకి, వాటినుండి అనువాదాలు చేశాడు
  • ఇండో - ఆంగ్ల సాహిత్యానికి సంబంధించిన షుమారు 15 పరిశోధనా పత్రాలను లిటరరీ క్రిటేరియన్ వంటి పత్రికలలో ప్రచురించాడు.

సత్కారాలు

  • తాపీ ధర్మారావు అవార్డు - 1993
  • కొండేపూడి సాహిత్య సత్కారం. - 1995
  • తెలుగు యూనివర్శిటీ అవార్డు - 1997
  • గజ్జల మల్లారెడ్డి అవార్డు - 2000
  • కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు - 2000

వనరులు

Tags:

వల్లంపాటి వెంకటసుబ్బయ్య జననంవల్లంపాటి వెంకటసుబ్బయ్య మరణంవల్లంపాటి వెంకటసుబ్బయ్య రచనల జాబితావల్లంపాటి వెంకటసుబ్బయ్య సత్కారాలువల్లంపాటి వెంకటసుబ్బయ్య వనరులువల్లంపాటి వెంకటసుబ్బయ్య19372007జనవరి 2మార్చి 15

🔥 Trending searches on Wiki తెలుగు:

అర్జునుడుభారత రాజ్యాంగ ఆధికరణలుమహేంద్రసింగ్ ధోనిఅన్నప్రాశనతామర పువ్వుమలేరియాగరుడ పురాణంవరంగల్ లోక్‌సభ నియోజకవర్గంనయన తారనాగార్జునసాగర్రాబర్ట్ ఓపెన్‌హైమర్రాహుల్ గాంధీలలితా సహస్రనామ స్తోత్రంమృగశిర నక్షత్రముమర్రితెలుగునాట జానపద కళలుక్రిక్‌బజ్దశరథుడుఅలంకారంద్రౌపది ముర్ముజీలకర్రగర్భిణి స్త్రీలు తీసుకోవలసిన జాగ్రత్తలువరిబీజంరాయప్రోలు సుబ్బారావుసోరియాసిస్పోలుబోయిన అనిల్ కుమార్ యాదవ్ధనిష్ఠ నక్షత్రముభారత జాతీయ చిహ్నందిల్ రాజునారా చంద్రబాబునాయుడుమాయదారి మోసగాడుజూనియర్ ఎన్.టి.ఆర్అమెజాన్ (కంపెనీ)సుమతీ శతకమునానాజాతి సమితిరాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్సింహంశ్రీకాకుళం జిల్లాఎన్నికలుజ్యోతీరావ్ ఫులేఅన్నమయ్యరవీంద్రనాథ్ ఠాగూర్ఆటవెలదియేసు శిష్యులురాహువు జ్యోతిషంభారతీయ జనతా పార్టీలలితా సహస్ర నామములు- 1-100నామనక్షత్రముఅరుణాచలంగ్రామ పంచాయతీయూట్యూబ్కమల్ హాసన్సునాముఖిరావణుడుసాలార్ ‌జంగ్ మ్యూజియంబౌద్ధ మతంకులంపసుపు గణపతి పూజశ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవాలయంగౌతమ బుద్ధుడుకరోనా వైరస్ 2019పుష్యమి నక్షత్రముఆంధ్రజ్యోతిపులివెందుల శాసనసభ నియోజకవర్గంరెడ్డిహనుమాన్ చాలీసాసింగిరెడ్డి నారాయణరెడ్డిగుంటూరువంగా గీతబుధుడుఆంధ్రప్రదేశ్ చరిత్రశ్రీ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రముఅష్టదిక్కులు - దిక్పాలకులు - పట్టణాలుతెలుగు సినిమాతెలుగు నాటకరంగంమండల ప్రజాపరిషత్కన్యారాశిపెద్దమనుషుల ఒప్పందంసమాసం🡆 More