రాండమ్ ఏక్సెస్ మెమరీ

రాండమ్ ఏక్సెస్ మెమరీ సాధారణ మెమరీ.

కంప్యూటరు పనిచేసేటప్పుడు డేటా తాత్కాలికంగా ఇందులో నిల్వ ఉంటుంది. కంప్యూటరు ఆఫ్ చేయగానే ఇందులోని సమాచారమంతా చెరిగిపోతుంది. ఇది తాత్కాలిక మెమరీ. రాండమ్ ఏక్సెస్ మెమరీని సంక్షిప్తంగా ర్యామ్ (RAM) అంటారు.

రాండమ్ ఏక్సెస్ మెమరీ
సామ్సంగ్ 0 1 జి.బి-డి.డి.ఆర్2-ల్యాప్ టాప్ ర్యామ్

రాండమ్ యాక్సెస్ మెమరీ అనేది కంప్యూటర్ మెమరీలో ఒక రూపం. ఈ మెమరీని ఏ క్రమంలోనైనా చదవవచ్చు, మార్చవచ్చు, సాధారణంగా డేటాను, మెషిన్ కోడ్‌ను నిల్వ చేయడానికి దీన్ని ఉపయోగిస్తారు. మెమరీ లోపల డేటా భౌతిక స్థానంతో సంబంధం లేకుండా డేటా అంశాలను దాదాపు ఒకే సమయంలో చదవడానికి లేదా వ్రాయడానికీ ఇది వీలు కలిగిస్తుంది. దీనికి విరుద్ధంగా, హార్డ్ డిస్క్‌లు, CD-RW లు, DVD-RW లు, పాత మాగ్నెటిక్ టేపులు, డ్రమ్ మెమరీ వంటి ఇతర డైరెక్ట్-యాక్సెస్ డేటా నిల్వ మాధ్యమాలలో, డేటా అంశాలను చదవడానికీ, రాయడానికీ పట్టే సమయం వాటి భౌతిక స్థానాలను బట్టి గణనీయంగా మారుతుంది. మీడియా భ్రమణ వేగం, చేయి కదలిక వంటి యాంత్రిక పరిమితులే దీనికి కారణం.

నేటి సాంకేతిక పరిజ్ఞానంలో, ర్యాండమ్ యాక్సెస్ మెమరీ MOS (మెటల్-ఆక్సైడ్-సెమీకండక్టర్) మెమరీ కణాలతో ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ (IC) చిప్‌ల రూపంలో ఉంటుంది. RAM సాధారణంగా అస్థిర రకాలైన మెమరీలతో ( డైనమిక్ రాండమ్-యాక్సెస్ మెమరీ (DRAM) మాడ్యూల్స్ వంటివి ) సంబంధం కలిగి ఉంటుంది, దీనికి విద్యుత్తు సరఫరా ఆపెయ్యగానే దీనిలో నిల్వ ఉన్న సమాచారం పోతుంది. అయితే అస్థిరత లేని RAM ను కూడా అభివృద్ధి చేసాఉ. రీడ్ ఆపరేషన్ల కోసం మాత్రమే ర్యాండం యాక్సెస్ ను అనుమతించే ఇతర రకాల అస్థిర మెమరీలు ఉన్నాయి. కానీ అవి రాసేందుకు పనికిరావు. అనేక రకాల రీడ్ ఓన్లీ మెమరీలు దీనికి ఉదాహరణలు.

రకాలు

విస్తృతంగా ఉపయోగంలో ఉన్న రెండు ఆధునిక RAM రూపాలు స్టాటిక్ RAM (SRAM), డైనమిక్ RAM (DRAM). SRAM లో, ఆరు ట్రాన్సిస్టర్లున్న మెమరీ సెల్ స్థితిని ఉపయోగించి ఒక బిట్ డేటాను నిల్వ చేస్తాయి. ఇవి సాధారణంగా ఆరు MOSFET లను (మెటల్-ఆక్సైడ్-సెమీకండక్టర్ ఫీల్డ్-ఎఫెక్ట్ ట్రాన్సిస్టర్లు) ఉపయోగిస్తాయి. RAM యొక్క ఈ రూపం చాలా ఖరీదైనది. కానీ సాధారణంగా వేగంగా ఉంటుంది. DRAM కన్నా తక్కువ డైనమిక్ శక్తి తీసుకుంటుంది. ఆధునిక కంప్యూటర్లలో, SRAM ను ఎక్కువగా CPU కాష్ మెమరీగా ఉపయోగిస్తున్నారు. DRAM అనేది ఒక ట్రాన్సిస్టర్, ఒక కెపాసిటర్ ల జంట (సాధారణంగా ఒక MOSFET, MOS కెపాసిటర్ ) ను ఉపయోగించి కొంత డేటాను నిల్వ చేస్తుంది. ఈ రెంటినీ కలిపి DRAM సెల్‌ అంటారు. కెపాసిటర్ అధిక లేదా స్వల్ప ఛార్జ్ (వరుసగా 1 లేదా 0) కలిగి ఉంటుంది. ట్రాన్సిస్టర్ ఒక స్విచ్ లాగా పనిచేస్తుంది. ఇది చిప్‌లోని కంట్రోల్ సర్క్యూట్రీని కెపాసిటర్ యొక్క ఛార్జ్ స్థితిని చదవడానికి లేదా మార్చడానికి అనుమతిస్తుంది. ఈ రకమైన మెమరీ స్టాటిక్ ర్యామ్ కంటే తక్కువ ఖర్చుతో కూడుకున్నది కాబట్టి, ఆధునిక కంప్యూటర్లలో ఉపయోగించే కంప్యూటర్ మెమరీకి ప్రధాన రూపం ఇదే.

ఇవి కూడా చూడండి

రీడ్ ఓన్లీ మెమరీ - (ROM)

మూలాలు

Tags:

🔥 Trending searches on Wiki తెలుగు:

హైపోథైరాయిడిజంకమల్ హాసన్బ్రహ్మంగారి కాలజ్ఞానంరమణ మహర్షినయన తారజ్యోతిషంకాళోజీ నారాయణరావుకామసూత్రఇంటి పేర్లుఐక్యరాజ్య సమితిదత్తాత్రేయపమేలా సత్పతితంగేడుఅలంకారంజ్ఞానపీఠ పురస్కారంతెలంగాణలో 2024 భారత సార్వత్రిక ఎన్నికలుపార్వతివై.యస్. రాజశేఖరరెడ్డివై.యస్.రాజారెడ్డిమీనరాశిహనుమజ్జయంతికుక్కతిథిభారతీయ శిక్షాస్మృతి73 వ రాజ్యాంగ సవరణప్రధాన సంఖ్యసుధ (నటి)వాట్స్‌యాప్తహశీల్దార్విడదల రజినినందమూరి బాలకృష్ణసజ్జల రామకృష్ణా రెడ్డిరియా కపూర్హైదరాబాదు మెట్రో స్టేషన్ల జాబితాఉలవలుపాముపాండవులురాజ్యసభపునర్వసు నక్షత్రమురాజీవ్ గాంధీభారత రాజ్యాంగ సవరణల జాబితాకల్క్యావతారముధ్వజ స్తంభంమామిడినాయుడుఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానంఢిల్లీ డేర్ డెవిల్స్స్వాతి నక్షత్రముభీమసేనుడువాసిరెడ్డి పద్మక్వినోవాసింగిరెడ్డి నారాయణరెడ్డిప్రకటనపంచతంత్రంఇండియన్ ప్రీమియర్ లీగ్బతుకమ్మమారేడుసంధిజాతీయ విద్యా విధానం 2020మధుమేహంపూర్వాభాద్ర నక్షత్రముపులిక్రియ (వ్యాకరణం)చతుర్యుగాలుమిథునరాశిభారతదేశ చరిత్రఆటలమ్మసాక్షి (దినపత్రిక)సాహిత్యంవిద్యకాకినాడ లోక్‌సభ నియోజకవర్గంప్లీహముహరే కృష్ణ (మంత్రం)లోక్‌సభనీరురెడ్డిస్వర్ణకమలంజవాహర్ లాల్ నెహ్రూ🡆 More