మైఖేల్ మధుసూదన్ దత్: బెంగాలీ కవి

మైఖేల్ మధుసూదన్ దత్ (దత్త), (Bengali: মাইকেল মধুসূদন দত্ত మైఖేల్ మొధుసూదొనొ దొత్తొ) (1824-1873), 19వ శతాబ్దపు ప్రముఖ బెంగాలీ కవి, నాటక రచయిత.

తూర్పు బెంగాల్ (ప్రస్తుత బంగ్లాదేశ్) లోని జెస్సోర్ సమీపములోని సాగర్‌దారి గ్రామంలో మధుసూదన్ దత్ గా జన్మించాడు. బెంగాలీ నాటకరంగ ఆద్యులలో ఒకడు. ఈయన ప్రసిద్ధ కృతి మేఘ్‌నాథ్ బద్ద్ కావ్య (Bengali: মেঘনাদবধ কাব্য), విషాదభరిత కావ్యం. తొమ్మిది అంకాలతో శైలిలోనూ, వస్తువులోనూ బెంగాళీ సాహిత్యంలో అద్వితీయమైనది ఈ కావ్యం. ఈయన బాధలు, ప్రేమ ప్రలాపాల గురించి స్త్రీ గొంతుకతో అనేక కవితలు కూడా వ్రాశాడు.

మైఖేల్ మధుసూదన్ దత్
మైఖేల్ మధుసూదన్ దత్: బెంగాలీ కవి
మైఖేల్ మధుసూదన్ దత్
జననం: 25 జనవరి 1824
వృత్తి: కవి, నాటక రచయిత

బాల్యంనుండే, మధుసూదన్ ఆచార వ్యవహారాలలో ఆంగ్లేయునివలె ఉండాలని ఉవ్విల్లూరాడు. హిందూ జమిందారీ కుటుంబంలో పుట్టిన ఈయన, తన కుటుంబం యొక్క అభీష్టానికి వ్యతిరేకంగా క్రైస్తవాన్ని స్వీకరించి మైఖేల్ అనే పేరు పెట్టుకున్నాడు. అయితే ఆ తరువాత జీవితంలో తన ఆంగ్లేయ, పాశ్చాత్య మోజుకు పశ్చాత్తాపపడి తన మాతృభూమికి మద్దతునిచ్చాడు. ఆ దశలోని ఈయన వ్రాసిన కవితలు, గేయాలలో అది ప్రతిఫలించింది.

మధుసూదన్ దత్త్ ను బెంగాళీ సాహిత్వపు గొప్ప కవులలో ఒకడిగా, బెంగాళీ సానెట్ పితగా పరిగణిస్తారు. ఈయన అమృతాక్షర ఛందస్సు (బ్లాంక్ వర్స్) బాగా ఆపోసనపట్టాడు. మధుసూదన్ దత్త్ జూన్ 29, 1873న కలకత్తాలో మరణించాడు. భారతీయ టెన్నిస్ క్రీడాకారుడు లియాండర్ పేస్ ఈయన సంతతి వాడే.

బాల్యము, విద్య

మధుసూదన్ దత్త్ విద్యాభ్యాసం షేక్‌పూరా గ్రామంలోని పాతమసీదులో పర్షియన్ నేర్చుకోవడంతో ప్రారంభమైంది. చాలా అసమానమైన ప్రతిభ బుద్ధి కలిగిన విద్యార్థిగా చిన్నతనం నుండే సాహితీ ప్రతిభ కలిగిన బాలమేధావిగా ఉపాధ్యాయుల దృష్టిని ఆకర్షించాడు. ఊహాత్మకత మెండుగా ఉండేది. చిన్నతనం నుండే ఇంటి వద్ద, కలకత్తాలో ఆంగ్ల విద్య, ఐరోపా సాహిత్యంతో పరిచయమేర్పడటం వల్ల దత్తాను ఆంగ్లేయుల అలవాటు, ఆచార వ్యవహరాలు, పద్ధతులు, ఆలోచనా ధోరణి అవలంభించేలా ప్రేరేపించాయి. దత్తా జీవితంలో అలాంటి తొలి ప్రభావం హిందూ కళాశాలలో ఆయన గురువు కెప్టేన్ డి.ఎల్.రిచర్డ్‌సన్. దత్తా ఆయన వలెనే థామస్ బాబింగ్టన్ మెకాలేకు మద్దతిచ్చాడు.

ప్రముఖ కృతులు

మూలాలు

Tags:

Bengali languageకావ్యముబంగ్లాదేశ్మేఘనాథ వధ కావ్యంరచయిత

🔥 Trending searches on Wiki తెలుగు:

తెలుగు సంవత్సరాలుజాతీయములుతోటపల్లి మధుతిరుమలడామన్భారతదేశ చరిత్రశ్యామశాస్త్రిరమ్యకృష్ణభాషా భాగాలుదీపావళికల్పనా చావ్లాపసుపు గణపతి పూజఅంగచూషణభారత జీవిత బీమా సంస్థపరిపూర్ణానంద స్వామిమిథునరాశిసిద్ధు జొన్నలగడ్డకుతుబ్ షాహీ సమాధులుYదొమ్మరాజు గుకేష్శ్రీదేవి (నటి)జెర్రి కాటుజాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్తెలంగాణ ఉద్యమంట్విట్టర్ఆవారాచిత్త నక్షత్రము20వ శతాబ్దం ముందు తెలుగు పల్లెల్లో జీవనశైలిభారత స్వాతంత్ర్య సమరయోధులు-జాబితాడీజే టిల్లుఓం భీమ్ బుష్సెక్యులరిజంధనిష్ఠ నక్షత్రమునితీశ్ కుమార్ రెడ్డిచిరంజీవులుఆవర్తన పట్టికజార్ఖండ్గూగుల్ఆహారంసురేఖా వాణిరజాకార్భారతదేశ అత్యున్నత న్యాయస్థానంపటికమూర్ఛలు (ఫిట్స్)నర్మదా నదివిజయనగరంవృషభరాశిసముద్రఖనిపంచాయితీ రాజ్ (గ్రామీణ స్వపరిపాలన వ్యవస్థ)రమ్య పసుపులేటిశ్రీ చక్రంభారతీయ సంస్కృతివెంకటేశ్ అయ్యర్సావిత్రి (నటి)మహాభారతంపక్షవాతంరాజోలు శాసనసభ నియోజకవర్గంగోత్రాలు జాబితాశ్రీ కృష్ణదేవ రాయలుఅల్లు అర్జున్వాసిరెడ్డి పద్మఅ ఆతాటి ముంజలుగర్భిణి స్త్రీలు తీసుకోవలసిన జాగ్రత్తలుగోదావరిరామోజీరావుపెమ్మసాని నాయకులుభారతదేశంలో కోడి పందాలుచంద్రుడుకర్నూలురైలుఅశోకుడుజయలలిత (నటి)దువ్వూరి రామిరెడ్డిలగ్నంపేర్ల వారీగా తెలుగు సినిమాల జాబితా🡆 More