థామస్ బాబింగ్టన్ మెకాలే

థామస్ బాబింగ్టన్ మెకాలే (1800 అక్టోబరు 25 – 1859 డిసెంబరు 28) భారతీయ శిక్షాస్మృతి (ఇండియన్ పీనల్ కోడ్) సృష్టికర్త.

మొదటి లా కమిషన్ ఛైర్మన్. అంతేకాకుండా భారతదేశంలో ఆంగ్ల విద్యాబోధనకు పునాది వేసాడు. ఆయన లార్డ్ మెకాలేగా పిలువబడేవాడు.

The Right Honorable
ది లార్డ్ మెకాలే
థామస్ బాబింగ్టన్ మెకాలే
ఆంటోయిన్ క్లాడెట్ వేసిన మెకాలే ఫోటోగ్రావర్
యుద్ధ కార్యదర్శి
In office
27 సెప్టెంబరు 1839 – 30 ఆగస్టు 1841
చక్రవర్తివిక్టోరియా, యునైటెడ్ కింగ్‌డమ్
ప్రథాన మంత్రివిస్కౌంట్ మెల్బోర్న్
అంతకు ముందు వారువిస్కౌంట్ హోవిక్
తరువాత వారుసర్ హెన్రీ హార్డింగ్
పేమాష్టర్-జనరల్
In office
7 జూలై 1846 – 8 మే 1848
చక్రవర్తివిక్టోరియా, యునైటెడ్ కింగ్‌డమ్
ప్రథాన మంత్రిలార్డ్ జాన్ రస్సెల్
అంతకు ముందు వారుబింగ్‌హామ్ బారింగ్
తరువాత వారుది ఎర్ల్ గ్రాన్‌విల్లే
వ్యక్తిగత వివరాలు
జననం(1800-10-25)1800 అక్టోబరు 25
లీసెస్టర్‌షైర్, ఇంగ్లాండ్
మరణం1859 డిసెంబరు 28(1859-12-28) (వయసు 59)
లండన్, ఇంగ్లాండ్
జాతీయతబ్రిటిష్
రాజకీయ పార్టీవిగ్
కళాశాలట్రినిటీ కాలేజ్, కేంబ్రిడ్జ్
వృత్తిరాజకీయ నాయకుడు
నైపుణ్యంచరిత్రకారుడు
సంతకంథామస్ బాబింగ్టన్ మెకాలే

జీవిత చరిత్ర

థామస్ బాబింగ్టన్ మెకాలే, 1వ బారన్ మెకాలే, PC, FRS, FRSE బ్రిటీష్ చరిత్రకారుడు. విగ్ రాజకీయవేత్త, 1834లో సుప్రీం కౌన్సిల్ మెంబర్ గా అతను భారతదేశానికి వచ్చాడు. అక్కడి పరిస్థితులను గమనించి ఫిబ్రవరి 1835 నాటి తన మినిట్ ఆన్ ఇండియన్ ఎడ్యుకేషన్ ద్వారా భారతదేశానికి పాశ్చాత్య సంస్థాగత విద్యను పరిచయం చేసారు. తద్వారా  ప్రజలు ఎవరి సమస్యలు వారే పరిష్కరించుకుంటారని, ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని లార్డ్ మెకాలే భావించాడు.

లార్డ్ మెకాలే భారతదేశంలో కేవలం నాలుగేళ్లు మాత్రమే ఉన్నా విద్యావ్యవస్థను పటిష్టం చేసేందుకు గట్టి ప్రయత్నాలే చేసాడు. అదే సమయంలో అతను మొదటి లా కమిషన్ ఛైర్మన్ గా ఉన్నాడు. అపుడే నాటి ఫ్రెంచి పీనల్ కోడ్, లివింగ్‌స్టోన్స్ కోడ్ ఆఫ్ లూసియానా వంటి  ప్రామాణిక గ్రంథాలను  అధ్యయనం  చేసాడు. అలాగే భారతీయుల ప్రామాణిక గ్రంథాలైన మనుస్మృతి, యాజ్ఞవల్క్య స్మృతిని కూడా పరిగణనలోకి తీసుకున్నాడు. జైలు శిక్షల విషయంలో కూడా తన అభిప్రాయాలకంటే, నాటి  దేశ మత, సాంఘిక, సామాజిక వ్యవస్థలకు, ఆఛార వ్యవహారాలకు విలువ ఇచ్చి, వారి అభిప్రాయాలను గౌరవించి, తన మేధస్సు తో ఇండియన్ పీనల్ కోడ్ చిత్తుప్రతిని తయారు చేశాడు. 1835లో బ్రిటిష్ ప్రభుత్వానికి ఈ ప్రతిని సమర్పించాడు. అతను చేసిన కృషి ఫలితంగానే ఇండియన్ పీనల్ కోడ్ 1860 అక్టోబరు 6 నాడు చట్టసభలో ఆమోదం పొందింది. 1862 సంవత్సరంలో ఐపిసి అమలులోకి వచ్చింది. లార్డ్ మెకాలే యుద్ద కార్యదర్శిగా 1839 - 1841 మధ్య పనిచేశాడు. పేమాస్టర్-జనరల్ గా 1846 - 1848 మధ్య లార్డ్ మెకాలే విధులు నిర్వర్తించాడు.

భారతదేశంలో మెకాలేయిజం ద్వారా దేశీయ విద్యా , వృత్తిపరమైన ఆచారాలు అణచివేయబడ్డాయి. అన్ని పాఠశాలల్లో ఆంగ్ల భాషను అధికారిక బోధనా భాషగా మార్చడం జరిగింది. ఆంగ్లం మాట్లాడే భారతీయులకు మాత్రమే ఉపాధ్యాయులుగా శిక్షణ ఇవ్వడం వంటివి చేసారు. అతని మినిట్ ఆన్ ఇండియన్ ఎడ్యుకేషన్ ద్వారా ఒక మంచి యూరోపియన్ లైబ్రరీలోని షెల్ఫ్ భారతదేశం, అరేబియా మొత్తం స్థానిక సాహిత్యం కలిగి ఉంటుందని తెలియచేసారు. అతని ది హిస్టరీ ఆఫ్ ఇంగ్లాండ్ లో పాశ్చాత్య యూరోపియన్ సంస్కృతి ఆధిక్యత, దాని సామాజిక రాజకీయ పురోగతి.. వాటి అనివార్యత గురించి తన వాదనను వ్యక్తం చేసారు. ఇది విగ్ చరిత్రకు ఒక ప్రధాన ఉదాహరణ.

మూలాలు

బాహ్య లంకెలు

థామస్ బాబింగ్టన్ మెకాలే 
వికీవ్యాఖ్యలో ఈ విషయానికి సంబంధించిన వ్యాఖ్యలు చూడండి.

Tags:

ఇండియన్ పీనల్ కోడ్

🔥 Trending searches on Wiki తెలుగు:

పులివెందుల శాసనసభ నియోజకవర్గందర్శి శాసనసభ నియోజకవర్గంధనూరాశిజాషువాసప్తర్షులుఉగాదిజే.సీ. ప్రభాకర రెడ్డిరామావతారంఅర్జునుడుభారత ఎన్నికల కమిషనుపొడుపు కథలుభీష్ముడుతేలువిద్యార్థితెలంగాణ శాసనసభశ్రీలీల (నటి)శని (జ్యోతిషం)శుక్రాచార్యుడుతొలిప్రేమగుంటకలగరగొట్టిపాటి రవి కుమార్ఆవారాబలి చక్రవర్తిత్యాగరాజుషిర్డీ సాయిబాబాఈనాడువేంకటేశ్వరుడుదశదిశలుతెలుగు భాష చరిత్రపాలపిట్టతాజ్ మహల్భారతీయుడు (సినిమా)సజ్జా తేజఉష్ణోగ్రతమామిడిఅమితాబ్ బచ్చన్ఛత్రపతి శివాజీదశరథుడుబుధుడు (జ్యోతిషం)కె.ఎల్. రాహుల్రాజా (1999 సినిమా)ప్లీహముజయలలిత (నటి)చెమటకాయలుపూర్వాషాఢ నక్షత్రముబౌద్ధ మతంగరుత్మంతుడుఋతువులు (భారతీయ కాలం)సజ్జల రామకృష్ణా రెడ్డిఇంద్రుడుజహీరాబాదు లోక్‌సభ నియోజకవర్గంవారాహితెలంగాణ ఉద్యమంవర్ధమాన మహావీరుడుతెలుగు పదాలురెజీనాట్రూ లవర్భోపాల్ దుర్ఘటనదేవదాసినువ్వు నేనుకమ్మతంతిరండి. కె. అరుణమియా ఖలీఫాకోమటిరెడ్డి వెంకటరెడ్డిఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డు కులాల జాబితాయానిమల్ (2023 సినిమా)సెక్స్ (అయోమయ నివృత్తి)నర్మదా నదిజీలకర్రతూర్పు చాళుక్యులుగృహ ప్రవేశంబలగంసర్ ఆర్థర్ కాటన్ ఆనకట్టజాతీయ పౌర సేవల దినోత్సవంవిశ్వబ్రాహ్మణవిరాట పర్వము ప్రథమాశ్వాసముఈడెన్ గార్డెన్స్🡆 More