బరింద్ర కుమార్ ఘోష్

 

బరింద్ర కుమార్ ఘోష్
బరింద్ర కుమార్ ఘోష్
బరింద్ర కుమార్ ఘోష్
జననం(1880-01-05)1880 జనవరి 5
క్రోయ్డాన్, లండన్
మరణం1959 ఏప్రిల్ 18(1959-04-18) (వయసు 79)
జాతీయతఇండియన్
వృత్తిజర్నలిస్ట్, విప్లవకారుడు
బంధువులుశ్రీ అరబిందో (తమ్ముడు)
మన్మోహన్ ఘోష్ (తమ్ముడు)

బరీంద్ర కుమార్ ఘోష్ లేదా బరీంద్ర ఘోష్, లేదా, లేదా బరింద్రనాథ్, లేదా ప్రఖ్యాతంగా బరిన్ ఘోష్ (5 జనవరి 1880 - 18 ఏప్రిల్ 1959) ఒక భారతీయ విప్లవకారుడు మఱియు పాత్రికేయుడు. బెంగాల్‌లో విప్లవాత్మక సంస్థ అయిన జుగంతర్ బెంగాలీ వారపత్రిక వ్యవస్థాపక సభ్యులలో ఆయన ఒకరు. బరీంద్ర ఘోష్ ప్రముఖ తత్త్వవేత్త అయిన శ్రీ అరబిందో తమ్ముడు.

జీవిత విశేషాలు

బరీంద్ర ఘోష్ 5 జనవరి 1880న లండన్ సమీపంలోని క్రోయ్‌డాన్‌లో జన్మించాడు. అయితే అతని పూర్వీకుల గ్రామం ప్రస్తుత పశ్చిమ బెంగాల్‌లోని హుగ్లీ జిల్లాలోని కొన్నాగర్ . అతని తండ్రి డాక్టర్ కృష్ణధన్ ఘోష్ వైద్యుడు మఱియు జిల్లా సర్జన్. అతని తల్లి స్వర్ణలత బ్రహ్మ మతము స్థాపకుడు మఱియు సంఘ సంస్కర్త, పండితుడు అయిన రాజనారాయణ్ బసు కుమార్తె. విప్లవకారుడు మఱియు తరువాతి జీవితంలో ఆధ్యాత్మికవేత్తగా మారిన అరబిందో ఘోష్ బరీంద్రనాథ్ యొక్క మూడవ అన్నయ్య. అతని రెండవ అన్నయ్య, మన్మోహన్ ఘోష్, ఆంగ్ల సాహిత్యంలో పండితుడు, కవి మఱియు కలకత్తాలోని ప్రెసిడెన్సీ కాలేజీలో, ఢాకా విశ్వవిద్యాలయంలో ఇంగ్లీష్ ప్రొఫెసర్. అతనికి సరోజినీ ఘోష్ అనే అక్క కూడా ఉంది.

బరీంద్రనాథ్ డియోఘర్‌లోని పాఠశాలలో ప్రాధమిక విద్యనభసించాడు. 1901లో ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన తర్వాత పాట్నా కళాశాలలో చేరాడు. అటుపై బరోడాలో సైనిక శిక్షణ పొందాడు. ఈ సమయంలో, (19వ శతాబ్దం చివరలో - 20వ శతాబ్దం ప్రారంభంలో) బరీంద్రనాధ్ అరబిందోచే ప్రభావితమయ్యాడు. అందుకు కారణంగా విప్లవ ఉద్యమం వైపు ఆకర్షితుడయ్యాడు.

బరీంద్రనాథ్ 1902లో కోల్‌కతాకు తిరిగి వచ్చి జతీంద్రనాథ్ బెనర్జీ సహాయంతో బెంగాల్‌లో అనేక విప్లవ సమూహాలను ఏర్పాటు చేయడం ప్రారంభించాడు. 1906లో, అతను బెంగాలీ వారపత్రిక అయిన జుగంతర్‌ను ప్రచురించడం ప్రారంభించాడు. ఇది ప్రారంభించిన కొలది కాలానికే జుగంతర్ అనే విప్లవ సంస్థను ప్రారంభించాడు. అనుశీలన్ సమితి యొక్క అంతర్గత వృత్తం నుండి జుగంతర్ ఏర్పడింది. ఇది భారత నేల నుండి బ్రిటిష్ వారిని తరిమికొట్టడానికి సాయుధ మిలిటెన్సీ కార్యకలాపాలకు సన్నాహాలకు చేయీత నిచ్చింది.

బరీంద్రనాథ్, జతీంద్రనాథ్ ముఖర్జీ అలియాస్ బాఘా జతిన్ బెంగాల్ అంతటా అనేక మంది యువ విప్లవకారుల నియామకంలో కీలకపాత్రను పోషించారు. విప్లవకారులు కోల్‌కతాలోని మణిక్తలాలో మానిక్తల బృందాన్ని ఏర్పాటు చేశారు. ఒక రహస్య ప్రదేశలో వారు బాంబుల తయారీని ప్రారంభించి అక్కడే ఆయుధాలు మఱియు మందుగుండు సామగ్రిని సేకరించేవారు.

30 ఏప్రిల్ 1908న ఇద్దరు విప్లవకారులు ఖుదీరామ్ మఱియు ప్రఫుల్ల చేత కింగ్స్‌ఫోర్డ్‌ అనే అధికారని చంపడానికి ప్రయత్నించిన తరువాత, పోలీసులు తన దర్యాప్తును తీవ్రతరం చేశారు. దీని కారణంగా 2 మే 1908న అతని సహచరులతో పాటు బరీంద్రనాథ్ ను మఱియు అరబిందో ఘోష్‌లను అరెస్టు చేశారు. విచారణ (దీనినే అలీపూర్ బాంబ్ కేసు అని పిలుస్తారు) ప్రారంభంలో అరబిందో ఘోష్, బరీంద్రనాథ్ మఱియు ఉల్లాస్కర్ దత్తాలకు మరణశిక్ష విధించింది. అయితే, దేశబంధు చిత్తరంజన్ దాస్ ద్వారా శిక్ష జీవిత ఖైదుగా తగ్గించబడింది. బరీంద్రనాథ్ 1909లో ఇతర దోషులతో పాటు అండమాన్‌లోని సెల్యులార్ జైలుకు బహిష్కరించబడ్డాడు. సెల్యులార్ జైలులో, బరీంద్రనాథ్వినాయక్ దామోదర్ సావర్కర్ పక్క ఖైదీగా నియమించబడ్డాడు. బరీంద్రనాథ్ 1915లో సెల్యులార్ జైలు నుండి విజయవంతంగా పారిపోగలిగాడు. 1915లో బరీంద్రనాథ్ సెల్యులార్ జైలు నుండి విజయవంతంగా తప్పించుకోగలిగిన ఏకైక స్వాతంత్ర్య సమరయోధుడు. కానీ బాఘా జతిన్‌తో బాలాసోర్ యుద్ధం తర్వాత బ్రిటీష్ వారు మళ్లీ పూరీ నుండి బరీంద్రనాథ్ ను పట్టుకున్నారు.


పట్టుకున్నాక బరీంద్రనాథ్ మరలా అండమాన్ సెల్యులార్ జైలుకు పంపబడ్డాడు. అక్కడ అతను 5 సంవత్సరాల పాటు ఒంటరి నిర్బంధంలో ఉంచబడ్డాడు. 1920లో సాధారణ క్షమాభిక్ష సమయంలో, బరీంద్రనాథ్ విడుదలయ్యాడు. అప్పుడు కోల్‌కతాకు తిరిగి వచ్చాడు. కోల్‌కతాలో ఒక ఆశ్రమాన్ని స్థాపించారు. అతను తన జ్ఞాపకాలను ప్రచురించాడు "నా ప్రవాసం యొక్క కథ - అండమాన్‌లో పన్నెండేళ్ళు". 1923లో, అతను పాండిచ్చేరికి బయలుదేరాడు, అక్కడ తన అన్నయ్య అరబిందో ఘోష్ శ్రీ అరబిందో ఆశ్రమాన్ని స్థాపించాడు. అటుపై కొంతకాలం అతను ఆధ్యాత్మికత సాధన పట్ల అరబిందోచే ప్రభావితమయ్యాడు.


బరీంద్రనాథ్ 1929లో కోల్‌కతాకు తిరిగి వచ్చి జర్నలిజంలో చేరాడు. 1933లో అతను ది డాన్ ఆఫ్ ఇండియా అనే ఆంగ్ల వారపత్రికను ప్రారంభించాడు. అతను ది స్టేట్స్‌మన్ వార్తాపత్రికతో అనుబంధం కలిగి ఉన్నాడు. 1950లో బెంగాలీ దినపత్రిక దైనిక్ బాసుమతికి సంపాదకుడయ్యాడు. ఈ సమయంలో అతనికి వివాహం జరిగింది. అతను 1959 ఏప్రిల్ 18న మరణించాడు.

రచనలు

బరీంద్ర ఘోష్ రాసిన పుస్తకాలు క్రిందివి:

  • ద్వీపంతరేర్ బన్షి
  • పథేర్ ఇంగిట్
  • అమర్ ఆత్మకథ
  • అగ్నిజగ్
  • రిషి రాజనారాయణ
  • ది టేల్ ఆఫ్ మై ఎక్సైల్
  • శ్రీ అరబిందో


ఇతర పుస్తకాలు

  • బరీంద్రకుమార్ ఘోష్, పథేర్ ఇంగిట్, కలకత్తా, 1337 ( బెంగాలీ సంవత్సరం ).
  • ఉపేంద్ర నాథ్ బంద్యోపాధ్యాయ, నిర్బాసిటర్ ఆత్మకథ, కలకత్తా, 1352 ( బెంగాలీ సంవత్సరం ).
  • RC మజుందార్, హిస్టరీ ఆఫ్ ది ఫ్రీడమ్ మూవ్‌మెంట్ ఇన్ ఇండియా, II, కలకత్తా, 1963.

ప్రస్తావనలు

Tags:

🔥 Trending searches on Wiki తెలుగు:

మరణానంతర కర్మలుముదిరాజ్ (కులం)ఆవర్తన పట్టికసాయిపల్లవిపెళ్ళి చూపులు (2016 సినిమా)ఛత్రపతి సాహు మహరాజ్కాకతీయులుసింహరాశితెలుగు సినిమాలు 2024భారత రాజ్యాంగం - ప్రాథమిక హక్కులుహేమా మాలినివిద్య2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల ఫలితాలుపూర్వ ఫల్గుణి నక్షత్రముమే 6అల్లు అర్జున్తెలంగాణ పుణ్యక్షేత్రాల జాబితాబ్లూ బెర్రీతెనాలి రామకృష్ణుడువెలిచాల జగపతి రావుఆల్కీన్లుశతక సాహిత్యముఅరకు లోక్‌సభ నియోజకవర్గంకమల్ హాసన్ఆహారపు గొలుసుమాచర్లగౌతమ బుద్ధుడుహైదరాబాదుఏలూరు లోక్‌సభ నియోజకవర్గంవేమనపులస చేపఅశ్వగంధరామప్ప దేవాలయంతెలుగు సినిమాపి.వెంక‌ట్రామి రెడ్డికరక్కాయసవర్ణదీర్ఘ సంధిసదాఅల్లూరి సీతారామరాజుక్రికెట్ఎయిడ్స్నరసింహావతారంకొండా విశ్వేశ్వర్ రెడ్డిఅక్బర్ఆంధ్రప్రదేశ్ జనాభా గణాంకాలుసంఖ్యహస్త నక్షత్రముషిర్డీ సాయిబాబాఅలెగ్జాండర్పిత్తాశయముజూనియర్ ఎన్.టి.ఆర్కస్తూరి రంగ రంగా (పాట)Lకోవై సరళఆది శంకరాచార్యులుసరోజినీ నాయుడువిశ్వామిత్రుడుయూట్యూబ్చరవాణి (సెల్ ఫోన్)కర్నూలుఆంధ్రప్రదేశ్ లోక్‌సభ నియోజకవర్గాల జాబితానందమూరి తారక రామారావుసురేఖా వాణిజోర్దార్ సుజాతభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులుయతిసలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్భూమిభారత జాతీయ ప్రతిజ్ఞపెద్దపల్లి లోక్‌సభ నియోజకవర్గంభద్రాచలంవై.యస్. రాజశేఖరరెడ్డికొంపెల్ల మాధవీలతఆయాసంరామావతారంగోత్రాలుమహబూబాబాద్ లోక్‌సభ నియోజకవర్గంతెలుగు సినిమాల జాబితా🡆 More