ఫెలోపియన్ నాళాలు

ఫెలోపియన్ నాళాలు (Fallopian tubes) స్త్రీ జననేంద్రియ వ్యవస్థలో ఒక భాగము.

ఈ నాళాలు అండాశయం నుండి గర్భకోశం వరకు వ్యాపించి ఉంటాయి. ఇటలీకి చెందిన వైద్య శాస్త్రవేత్త గాబ్రియల్ ఫెలోపియో (Gabriele Fallopio) పేరుమీద వీటికి నామకరణం జరిగింది.

ఫెలోపియన్ నాళాలు
ఫెలోపియన్ నాళాలు
Schematic frontal view of female anatomy
ఫెలోపియన్ నాళాలు
Vessels of the uterus and its appendages, rear view. (Fallopian tubes visible at top right and top left.)
లాటిన్ tuba uterina
గ్రే'స్ subject #267 1257
ధమని tubal branches of ovarian artery, tubal branch of uterine artery
లింఫు lumbar lymph nodes
Precursor Müllerian duct
MeSH Fallopian+Tubes
Dorlands/Elsevier t_21/12827008

నిర్మాణము

మనుషులలో రెండు ఫెలోపియన్ నాళాలు గర్బాశయానికి పైభాగంలో రెండు వైపులా కార్నువా ప్రాంతంలో తెరుచుకుంటాయి. వీని రెండవ చివర కటి ప్రాంతంలో అండకోశం చుట్టుప్రక్కల ఫింబ్రియా అనే సీ అనిమోన్ వంటి నిర్మాణంలో అంతమౌతుంది. ఈ విధంగా ఇవి కడుపును బయటికి కలుపుతాయి. ఇవి ఇంచుమించు 7 నుండి 14 సెం.మీ. పొడవుంటాయి.


భాగాలు

ఫెలోపియన్ నాళాలు నాలుగు భాగాలుగా చేయవచ్చును:

  • ఇన్ఫండిబ్యులమ్ - ఫింబ్రియా కలిగిన భాగం.
  • ఏంపుల్లా - సాధారణంగా ఫలదీకరణం జరిగే ప్రదేశం.
  • ఇస్థమస్
  • గర్భాశయంలోని భాగము - అన్నింటి కన్నా సన్నని ప్రదేశం.
ఫెలోపియన్ నాళాలు 
ఫెలోపియన్ నాళంలోని పొరలు.

ఫెలోపియన్ నాళంలో మూడు పొరలుంటాయి:

  • మ్యూకస్ పొర - the distinctive folds of the mucosa are the most unusual feature. The folds contain ciliated cells and "peg cells". The region of the fallopian tube can be approximated by looking at the mucosa, because the folds are most elaborate at the ampulla and almost nonexistent at the intramural portion.
  • కండరపు పొర
  • సీరస్ పొర

ఫలదీకరణం

అండాశయంలో అండాలు అభివృద్ధి చెందినప్పుడు ఒక తిత్తిలో అమరి ఉంటాయి. సరైన సమయంలో ఇవి పగిలి అండం విడుదలయి ఫెలోపియన్ నాళంలోనికి చేరుతుంది. అక్కడి నుండి గర్భాశయం వైపు ప్రయాణిస్తుంది. శుక్రకణాలతో ఫలదీకరణం జరిగి, అది గర్భాశయం చేరి ప్రతిస్థాపించబడుతుంది. దీనితో గర్భం ప్రారంభమౌతుంది.

అరుదుగా ఫెలోపియన్ నాళంలోనే ప్రతిస్థాపన జరిగి ఫెలోపియన్ గర్భం వస్తుంది. ఇవి సాధారణంగా గర్భస్రావం జరిగి ఎక్కువకాలం నిలువలేవు.

పిండాభివృద్ధి

పిండ వ్యవస్థలో రెండు జతల నాళాలు బీజకణాలు ను బయటకు తీసుకొనిపోతాయి. ఒక జత ముల్లేరియన్ వాహిక (Mullerian duct) ల నుండి స్త్రీలలో ఫెలోపియన్ నాళాలు, గర్భకోశం, యోని తయారౌతాయి. రెండవ జత ఉల్ఫియన్ వాహిక (Wolffian duct) ల నుండి పురుషులలో శుక్ర వాహిక తయారౌతాయి.

వ్యాధులు

కటి ప్రాంతంలోని ఇన్ ఫెక్షన్ ఫెలోపియన్ నాళాలకు సోకవచ్చును. కొన్ని క్షయ వ్యాధులు కూడా ఇలా వచ్చి నాళాలు కుంచించుకొని పోయి ప్రవాహానికి అడ్డం కలిగించవచ్చును. దీని వలన వంద్యత్వం లేదా గర్భం కలుగవచ్చును.

శస్త్రచికిత్స

కుటుంబ నియంత్రణలో భాగంగా ఫెలోపియన్ నాళాలలో చిన్న భాగాన్ని తొలగించడాన్ని ట్యూబెక్టమీ అంటారు. వీనిలోని అడ్డంకుల్ని తొలగించి నాళాన్ని సరిచేసే శస్త్రచికిత్సను ట్యూబోప్లాస్టీ అంటారు.

మూలాలు

Tags:

ఫెలోపియన్ నాళాలు నిర్మాణముఫెలోపియన్ నాళాలు ఫలదీకరణంఫెలోపియన్ నాళాలు పిండాభివృద్ధిఫెలోపియన్ నాళాలు వ్యాధులుఫెలోపియన్ నాళాలు మూలాలుఫెలోపియన్ నాళాలుఅండాశయంఇటలీగర్భకోశంగాబ్రియల్ ఫెలోపియో

🔥 Trending searches on Wiki తెలుగు:

బర్రెలక్కకాలేయంఊర్వశివిజయ్ దేవరకొండకాపు, తెలగ, బలిజదాశరథి కృష్ణమాచార్యభారత జాతీయ కాంగ్రెస్మియా ఖలీఫాలగ్నంఅలంకారంపావని గంగిరెడ్డిఉమ్మెత్తఅమ్మకోసంవిద్యారావుచార్లెస్ శోభరాజ్ప్రభుదేవాసరోజినీ నాయుడుకిరణ్ రావుభారతీయ రైల్వేలులలితా సహస్ర నామములు- 1-100బోడె ప్రసాద్సుభాష్ చంద్రబోస్ఆంధ్రప్రదేశ్ మండలాలుసత్య కృష్ణన్మెదడురాగంనయన తారమామిడిదగ్గుబాటి పురంధేశ్వరినువ్వు లేక నేను లేనుకలబందPHఉప రాష్ట్రపతికామాక్షి అమ్మవారి దేవాలయం (కంచి)పక్షవాతంభారత స్వాతంత్ర్యోద్యమంసింగిరెడ్డి నారాయణరెడ్డిభారతదేశ పేరు పుట్టుపూర్వోత్తరాలుకొణతాల రామకృష్ణఎస్. పి. బాలసుబ్రహ్మణ్యంవృశ్చిక రాశిరాహువు జ్యోతిషంఅన్నయ్య (సినిమా)డిస్నీ+ హాట్‌స్టార్సౌర కుటుంబంతొట్టెంపూడి గోపీచంద్నక్షత్రం (జ్యోతిషం)కంగనా రనౌత్అశ్వని నాచప్పఅష్టదిగ్గజములుసమాచార హక్కుఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌క్లోమముపర్యాయపదంగుంటూరు కారంఇస్లాం మతంతెలుగు నెలలుసుస్థిర అభివృద్ధి లక్ష్యాలుఆంధ్రప్రదేశ్ చరిత్రధనిష్ఠ నక్షత్రముఅయ్యప్ప స్వామి అష్టోత్తర శత నామావళిహైదరాబాదుఉషా మెహతాతెలుగువావిలికాన్సర్తెలుగు పదాలురజాకార్లురమ్యకృష్ణఎల్లమ్మనువ్వొస్తానంటే నేనొద్దంటానాకాజల్ అగర్వాల్కెఫిన్హస్త నక్షత్రమురోహిణి నక్షత్రంనరసింహ (సినిమా)జె. చిత్తరంజన్ దాస్ఎనుముల రేవంత్ రెడ్డిఅల్లసాని పెద్దన🡆 More