జిల్లా ప్రజాపరిషత్

జిల్లా ప్రజాపరిషత్ మూడంచెలుగల పంచాయతీ రాజ్ వ్యవస్థలో జిల్లా స్థాయి స్థానిక స్వపరిపాలనా సంస్థ.

ప్రభుత్వ ప్రకటన ద్వారా జిల్లా ప్రజాపరిషత్తులను ఏర్పరుస్తారు. సాధారణంగా ప్రతి జిల్లాకి ఒక జిల్లా పరిషత్తు వుంటుంది. పూర్తి పట్టణ జిల్లా అయితే జిల్లా పరిషత్తు వుండదు. మండల ప్రజాపరిషత్ తో పాటు జిల్లా ప్రజాపరిషత్తులకు ఎన్నికలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్వహిస్తుంది.

జిల్లా ప్రజాపరిషత్
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, కోరుకొల్లు, ఆం.ప్ర

విధులు

  1. తమ పరిధిలో గల గ్రామపంచాయితీ, మండల ప్రజాపరిషత్తుల పర్యవేక్షణ
  2. మండల పరిషత్ ప్రణాళికల సమన్వయం చేసి జిల్లా ప్రణాళిక తయారి
  3. జిల్లా పరిధిలో మండల పరిషత్ బడ్జెట్ ల ఆమోదం
  4. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా అందే నిధులను మండల పరిషత్తుల మధ్య పంపిణి
  5. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల అమలు
  6. పథకాల నిర్వహణ
  7. జిల్లా అభివృద్ధికి సలహాలు
  8. రక్షిత మంచినీరు, రోడ్డు రవాణా, ప్రజలకు ఆరోగ్య కేంద్రాలు, పశువులకు ఆరోగ్య కేంద్రాల సౌకర్యాల కల్పన
  9. ఉన్నత పాఠశాలలు, వృత్తి విద్య పాఠశాలల ఏర్పాటు, నిర్వహణ
  10. రాష్ట్ర ప్రభుత్వ అనుమతితో వివిధ కార్యక్రమాలకోసం రుణాల సేకరణ

ఆర్థిక వనరులు

  1. భూమి శిస్తు, రాష్ట్ర పన్నులలో భాగం
  2. మండల పరిషత్లు, ప్రజలు ఇచ్చే విరాళాలు
  3. ప్రభుత్వ గ్రాంటులు
  4. పథకాలకు ప్రభుత్వం ఇచ్చే నిధులు

నిర్మాణం

జిల్లా ప్రజాపరిషత్తులో క్రింది సభ్యులుంటారు

  • ప్రాదేశిక నియోజకవర్గాల నుండి ఎన్నికైనవారు. వీరిని జడ్పిటిసి (Zilla Parishad Territorial Constituency : ZPTC) సభ్యులంటారు. రాజకీయ పార్టీలు అభ్యర్థులను నిలబెట్టవచ్చు. షెడ్యూల్డ్ కులాలు, తెగలు, వెనుకబడిన తరగతులు, స్త్రీలకు సీట్లు కేటాయింపు ఉంది. వీరి పదవీకాలం 5 సంవత్సరాలు.
  • జిల్లా పరిధిలోని శాసనసభ నియోజకవర్గాల శాసనసభ్యులు
  • జిల్లాలో ఓటరుగా నమోదైన రాజ్యసభ సభ్యులు
  • జిల్లాలో ఓటరుగా నమోదైన అల్పసంఖ్యాక వర్గాలకు చెందిన కోఆప్ట్ చేయబడిన ఇద్దరు సభ్యులు.

సమావేశాలకు శాశ్వత ఆహ్వానితులు. వీరికి సమావేశాలలో ఓటు హక్కు లేదు

  • జిల్లా లోని మండల ప్రజాపరిషత్ అధ్యక్షులు
  • జిల్లా మార్కెటింగ్ సంఘ ఛైర్మన్
  • జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు
  • జిల్లా సహకార కేంద్ర బ్యాంకు ఛైర్మన్
  • జిల్లా కలెక్టరు

పదవులు, కమిటీలు

ఛైర్మన్

ప్రాదేశికి నియోజకవర్గాల నుండి ఎన్నికైన జిల్లా పరిషత్ సభ్యులు ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ను ఎన్నుకుంటారు. ఛైర్మన్ పదవికి, షెడ్యూల్డ్ కులాలు, తెగలు, వెనుకబడిన తరగతులు, స్త్రీలకు సీట్లు కేటాయింపు ఉంది.

వైస్ ఛైర్మన్

ప్రాదేశికి నియోజకవర్గాల నుండి ఎన్నికైన జిల్లా పరిషత్ సభ్యులు వైస్ ఛైర్మన్ ను ఎన్నుకుంటారు.

జిల్లా ప్రజాపరిషత్ ముఖ్య పాలనాధికారి

జిల్లా ప్రజాపరిషత్ ప్రధాన పాలనాధికారిని ప్రభుత్వం నియమిస్తుంది. ఈ అధికారికి జిల్లా పరిషత్తు పరిధిలో పనిచేసే అధికారుల, సంస్థలపై అజామాయిషీ అధికారం వుంటుంది. జిల్లా ప్రజాపరిషత్ సమావేశాలకు హాజరు కావచ్చు. సమావేశంలో ఓటుహక్కు వుండదు. జిల్లా ప్రజాపరిషత్ నిర్ణయాల అమలు బాధ్యత ఈ అధికారిదే.

స్థాయీ కమిటీలు

క్రింద తెలిపిన స్థాయీ కమీటీలు వుంటాయి. వీటన్నిటిని ఛైర్మన్ ఏర్పాటు చేస్తాడు. ఛైర్మన్ కూడా వీటన్నిటిలో సభ్యుడు. జిల్లా కలెక్టరు హాజరు కావచ్చు కానీ ఓటు హక్కు వుండదు.

మూలాలు

బయటి లింకులు

Tags:

జిల్లా ప్రజాపరిషత్ విధులుజిల్లా ప్రజాపరిషత్ ఆర్థిక వనరులుజిల్లా ప్రజాపరిషత్ నిర్మాణంజిల్లా ప్రజాపరిషత్ పదవులు, కమిటీలుజిల్లా ప్రజాపరిషత్ మూలాలుజిల్లా ప్రజాపరిషత్ బయటి లింకులుజిల్లా ప్రజాపరిషత్ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘంపంచాయితీమండల ప్రజాపరిషత్

🔥 Trending searches on Wiki తెలుగు:

శుక్రుడు జ్యోతిషంఇండుపుజవాహర్ లాల్ నెహ్రూజాతీయ అర్హత, ప్రవేశ పరీక్షకర్ణుడుగురజాడ అప్పారావుమంతెన సత్యనారాయణ రాజుఆలివ్ నూనెవై.ఎస్. జగన్మోహన్ రెడ్డినామవాచకం (తెలుగు వ్యాకరణం)సమాచార హక్కుజాతీయ మహిళ కమిషన్భారత రాజ్యాంగం - ఆదేశిక సూత్రాలుచిరంజీవి నటించిన సినిమాల జాబితాకృష్ణ గాడి వీర ప్రేమ గాథసత్య సాయి బాబాజూనియర్ ఎన్.టి.ఆర్విశ్వబ్రాహ్మణఆరుద్ర నక్షత్రమురాయలసీమహస్తప్రయోగంఉప రాష్ట్రపతిపాండ్యులుగూగుల్దేశాల జాబితా – జనసంఖ్య క్రమంలోభూకంపంమఖ నక్షత్రమురుక్మిణీ కళ్యాణంకాళోజీ నారాయణరావుపొడుపు కథలునాయకత్వంభూమి వాతావరణంఅలంకారముమంచు మోహన్ బాబుదుర్యోధనుడునయన తారసర్వేపల్లి రాధాకృష్ణన్హెపటైటిస్‌-బిగోపరాజు సమరంఓం నమో వేంకటేశాయఆంధ్రప్రదేశ్రాజ్యసభశ్రీకాళహస్తిరబీ పంటతెలంగాణ తల్లివిద్యుత్తుఅనుపమ పరమేశ్వరన్పరిటాల రవిషోయబ్ ఉల్లాఖాన్భారతదేశ రాజకీయ పార్టీల జాబితాఒగ్గు కథఢిల్లీ సల్తనత్దక్షిణ భారతదేశంసంధ్యావందనంమేషరాశిఅక్కినేని అఖిల్కన్నెగంటి బ్రహ్మానందంశ్రీశైల క్షేత్రంశకుంతలభారత రాజ్యాంగ సవరణల జాబితాలోక్‌సభసమంతరోజా సెల్వమణితెలంగాణ ప్రభుత్వ పథకాలుశ్రీరామనవమికృష్ణా నదికాళేశ్వరం ఎత్తిపోతల పథకంసరోజినీ నాయుడుబమ్మెర పోతనతెలంగాణ మండలాలుకారకత్వంయోగి ఆదిత్యనాథ్అక్షరమాలభారతదేశంలో జాతీయ వనాలునవధాన్యాలుఐనవోలు మల్లన్న స్వామి దేవాలయంచేతబడిమహాభారతం🡆 More