కంపాక్ట్ డిస్క్

కంపాక్ట్ డిస్క్ లేదా సి.డి.

ఆరంభంలో ఇది డిజిటల్ ఆడియోను రికార్డు చేయడానికి, భద్రపరచడానికి తయారుచేయబడింది. అక్టోబరు 1982నుండి కంపాక్ట్ డిస్కులు మార్కెట్‌లో లభిస్తున్నాయి. ఇప్పటికీ ఇవి డేటా, ఆడియో ఫైళ్ళకు సర్వసాధారణంగా వాడుతున్నారు. సాధారణంగా వాడే సి.డి.ల వ్యాసం 120 మి.మీ. ఇందులో 80 నిముషాల నిడివి గల ఆడియోను భద్రపరచవచ్చును. 60 మి.మీ. - 80 మి.మీ. మధ్య వ్యాసం ఉండే "మినీ సి.డి."లలో 24 నిముషాల ఆడియోను రికార్డు చేయొచ్చును. సీడీ పై భద్రపరిచిన డేటా ను బట్టి, లేదా భద్రపరచిన విధానాన్ని బట్టి (FORMAT) రకరకాల ఆ సీడీని వీసీడీ, ఆడియో సీడీ లేదా డేటా సీడీ అని పిలుస్తారు. వీసీడీ అంటే వీడియో సీడీ. దీనిలో సుమారు ఒక గంట సేపు నిడివి గల వీడియో భద్రపరచవచ్చు.

కంపాక్ట్ డిస్క్
కంపాక్ట్ డిస్క్
కంపాక్ట్ డిస్క్
కంపాక్ట్ డిస్క్‌ ఉపరితలంపై అతి దగ్గరగా ఉన్న "ట్రాక్"లపై కాంతి "డైఫ్రాక్షన్" చెందడం వలన "దృశ్య స్పెక్ట్రమ్‌"లోని రంగులన్నీ కనిపిస్తుంటాయి.
మీడియా టైప్ఆప్టికల్ డిస్క్
ఎన్‌కోడింగ్వివిధ విధానాలు
సామర్ధ్యంసాధారణంగా 700 MB ( 80 నిముషాల వరకు నిడివి గల ఆడియో ఫైళ్ళు)
చదివే విధానం
(Read mechanism)
780 nm తరంగ దైర్ఘ్యం ఉండే సెమికండక్టర్ లేజర్
రూపొందించిన వారుఫిలిప్స్ , సోనీ కంపెనీలు
వినియోగంఆడియో , డేటా భద్రపరచడం కోసం

సి.డి.లను రూపొదించడానికి వినియోగించిన సాంకేతిక పరిజ్ఞానం తరువాత మరింత అభివృద్ధి చెందింది. తత్ఫలితంగా మరిన్ని ప్రత్యేక సదుపాయాలున్న డిస్కులు ఆవిర్భవించాయి. CD-ROM, CD-R (ఒకేమారు "వ్రాయ"గలిగేవి), CD-RW (మళ్ళీ మళ్ళీ వ్రాయగలిగేవి), సూపర్ ఆడియో సిడి, విడియో కంపాక్ట్ డిస్క్ (VCD), సూపర్ విడియో కంపాక్ట్ డిస్క్ (SVCD), ఫొటో సిడి, పిక్చర్ సిడి, CD-i, Enhanced CD - ఇలా ఎన్నో రకాల డిస్కులు లభిస్తున్నాయి. CD-ROM , CD-R లు ఇప్పటికీ అత్యధికంగా వాడుతున్న మీడియా సాధనాలు. 2004లో ప్రపంచ వ్యాప్తంగా 30 బిలియన్ డిస్కులు (CD audio, CD-ROM, CD-R) అమ్ముడయ్యాయి.

అంతకు ముందు వెలువడినా గాని అంతగా విజయవంతం కాని లేజర్ డిస్క్ టెక్నాలజీయే కంపాక్ట్ డిస్క్ ఆవిర్భావానికి పునాది. 1977లో ఫిలిప్స్ కంపెనీ ఆప్టికల్ లేజర్ డిస్క్ టెక్నాలజీలను అభివృద్ధి చేసింది. 1979లో సోనీ , ఫిలిప్స్ కంపెనీలు సంయుక్తంగా ఏర్పాటు చేసిన జాయింట్ టాస్క్ ఫోర్స్ ఈ కంపాక్ట్ డిస్కులను రూపొందించింది. ఒక సంవత్సరం ప్రణాళిక , శ్రమ అనంతరం తయారైన ప్రమాణాలకు అనుగుణంగా తక్కిన పరిశోధన నడిచింది. ఈ ప్రయత్నంలో పారిశ్రామికంగా డిస్కులను తయారు చేయడానికి అవసరమైన నిర్మాణ పరిజ్ఞానాన్ని ఫిలిప్స్ అందించింది. ఇంకా ఫిలిప్స్ సమకూర్చిన Eight-to-Fourteen Modulation (EFM) మరింత "ప్లే టైమ్" అందించడానికి, గీతలు, ముద్రలనుండి రక్షణ కల్పించడానికి ఉపయోగపడే విధానం. సోనీ నుండి error-correction విధానం, CIRC విధానం సమకూరాయి. ఇలా కంపాక్ట్ డిస్క్ అనేది పలువురి సమష్టి కృషి ఆధారంగా రూపొందిన విజ్ఞానం. Compact Disc Story, లో ఈ ప్రయత్నంలో జరిగిన ప్రయోగాలు, చర్చలు, నిర్ణయాల గురించి చెప్పబడింది.

ఇవి కూడా ఛూడండి

మూలాలు

బయటి లింకులు

Tags:

ఆప్టికల్ డిస్క్వ్యాసం

🔥 Trending searches on Wiki తెలుగు:

జవహర్ నవోదయ విద్యాలయంపేరుగోల్కొండగుంటూరుఇంద్రుడుమదర్ థెరీసాగర్భాశయముసింధు లోయ నాగరికతతిథినూరు వరహాలుఐడెన్ మార్క్‌రమ్గొట్టిపాటి రవి కుమార్హైదరాబాదు మెట్రో స్టేషన్ల జాబితాభారత ఎన్నికల కమిషనుఉపనయనముఘట్టమనేని కృష్ణతెలుగు వికీపీడియామా తెలుగు తల్లికి మల్లె పూదండభారత రాజ్యాంగం - ప్రాథమిక హక్కులుజవాహర్ లాల్ నెహ్రూచరాస్తిసలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ఆల్ఫోన్సో మామిడిఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీజనసేన పార్టీవినాయక చవితిగోదావరిగరుడ పురాణంత్రినాథ వ్రతకల్పంజాతిరత్నాలు (2021 సినిమా)జీలకర్రటమాటోఅనసూయ భరధ్వాజ్హైపర్ ఆదికాకతీయులుమెదక్ లోక్‌సభ నియోజకవర్గంపూజా హెగ్డేతులారాశిపేర్ల వారీగా తెలుగు సినిమాల జాబితాఇజ్రాయిల్వాసుకి (నటి)తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్శ్రీశైల క్షేత్రంచంద్రుడుసోరియాసిస్రష్మి గౌతమ్ఉపద్రష్ట సునీతరోహిణి నక్షత్రంసంస్కృతంనువ్వు వస్తావనిచదలవాడ ఉమేశ్ చంద్రనందిగం సురేష్ బాబుతెలంగాణ చరిత్రసిద్ధార్థ్వై.యస్.భారతిభారతీయ శిక్షాస్మృతితాటి ముంజలునాగార్జునసాగర్పెదకూరపాడు శాసనసభ నియోజకవర్గందశరథుడుబాలకాండరాశిసామెతల జాబితారవితేజసిరికిం జెప్పడు (పద్యం)జయలలిత (నటి)దాశరథి కృష్ణమాచార్యకార్తెఅన్నప్రాశనబైబిల్పూర్వ ఫల్గుణి నక్షత్రముపి.సుశీలసాలార్ ‌జంగ్ మ్యూజియంచరవాణి (సెల్ ఫోన్)తెలంగాణా బీసీ కులాల జాబితావృత్తులుఆర్యవైశ్య కుల జాబితా🡆 More