ఓం బిర్లా

ఓం బిర్లా (జ.1962 నవంబరు 23) భారతదేశ రాజకీయ నాయకుడు.

అతను భారతదేశానికి 17వ లోక్‌సభ స్పీకరుగా ఉన్నారు. అతను రాజస్థాన్ లోని కోటా-బుండి పార్లమెంటు నియోజకవర్గం నుండి ఎన్నికయ్యాడు. అంతకు ముందు అతను రాజస్థాన్ రాష్ట్ర శాసనసభకు శాసనసభ్యునిగా కోటా దక్షిణ నియోజకవర్గం నుండి ఎన్నికయ్యాడు. 2019 జూన్ 19 న అతను లోక్‌సభ స్పీకరుగా పదవీ బాధ్యతలు చేపట్టాడు. అతను భారతీయ జనతా పార్టీ సభ్యుడు.

ఓం బిర్లా
ఓం బిర్లా


17వ లోక్‌సభ స్పీకరు
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
19 జూన్ 2019
డిప్యూటీ ఖాళీ
ముందు సుమిత్రా మహాజన్

లోక్‌సభ సభ్యుడు
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
16 మే 2014
ముందు లియారాజ్ సింగ్
నియోజకవర్గం కోటా

రాజస్థాన్ రాష్ట్ర శాసససభ సభ్యుడు
పదవీ కాలం
8 డిసెంబరు 2003 – 16 మే 2014
ముందు శాంతి ధరివాల్
తరువాత సందీప్ శర్మ
నియోజకవర్గం కోటా సౌత్

వ్యక్తిగత వివరాలు

జననం (1962-11-23) 1962 నవంబరు 23 (వయసు 61)
కోటా, రాజస్థాన్, భారతదేశం
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
జీవిత భాగస్వామి డా. అమితా బిర్లా
సంతానం 2
నివాసం 20 అక్బర్ రోడ్, న్యూఢిల్లీ (అధికార)
కోటా, రాజస్థాన్ (ప్రైవేట్)
పూర్వ విద్యార్థి ప్రభుత్వ కామర్స్ కళాశాల, కోటా
మహర్షి దయానంద్ సరస్వతి విశ్వవిద్యాలయం
వృత్తి రాజకీయ నాయకుడు, పరోపకారి
మతం హిందూ మతం
మూలం సభ్యుని సమాచారం

ప్రారంభ జీవితం

ఓం బిర్లా 1962 నవంబరు 23న శ్రీకృష్ణ బిర్లా, శకుంతలాదేవి దంపతులకు జన్మించాడు. అతను కోటాలోని ప్రభుత్వ కామర్స్ కళాశాల నుండి మాస్టర్స్ డిగ్రీని పొందాడు. తరువాత ఆజ్మీరు లోని మహర్షి దయానంద్ సరస్వతి విశ్వవిద్యాలయం నుండి కామర్స్ డిగ్రీని పొందాడు. రామమందిరం నిర్మాణ ఉద్యమంలో పాల్గొన్నందుకు గాను బిర్లా ఉత్తరప్రదేశ్ లో జైలుశిక్ష అనుభవించాడు.

శాసనసభ్యునిగా

అతను 2003లో మొట్టమొదటి సారి రాజస్థాన్ లోని కోటా దక్షిణ నియోజకవర్గం నుండి శాసనసభ్యునిగా ఎన్నికయ్యాడు. అతను భారత కాంగ్రెస్ అభ్యర్థి శాంతి ధరివాల్ ను 10,101 ఓట్ల మెజారితో ఓడించాడు. 2008లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో అతను 24, 300 ఓట్ల తేడాతో కాంగ్రెస్ అభ్యర్థి రాం కిషన్ వెర్మ చేతిలో ఓడిపోయాడు. పార్లమెంటు సభ్యునిగా ఎంపిక కాక ముందు అతను 2013లో మూడవసారి అసెంబ్లీ ఎన్నికలలో పాల్గొని కాంగ్రెస్ అభ్యర్థి పంకజ్ మెహ్రాను 50,000 ఓట్ల తేడాతో ఓడించాడు. అతని 2003-08 పదవీ కాలంలో రాజస్థాన్ ప్రభుత్వంలో పార్లమెంట్ సెక్రటరీగా వ్యవహరించాడు.

పార్లమెంటు సభ్యునిగా

అతను 16వ, 17వ లోక్‌సభలకు సభ్యునిగా కోట (రాజస్థాన్) పార్లమెంటు నియోజకవర్గం నుండి ఎంపిక అయ్యాడు.అతను 16వ లోక్‌సభలో సామాజిక న్యాయం, సాధికారకత కొరకు ఎనర్జీ, కన్సాల్టేటివ్ స్టాండింగ్ కమిటీ సభ్యునిగా వ్యవహరించాడు. 17వ లోక్‌సభలో లోక్‌సభ స్పీకరుగా ఎంపిక అయ్యాడు.

సామాజిక సేవలు

ఒక క్రియాశీల పార్లెమెంటు సభ్యునిగా కోట (రాజస్థాన్) పార్లమెంటు నియోజక వర్గ పరిథిలో అనేక సామాజిక సంక్షేమ కార్యక్రమాలను నిర్వహించాడు. అందులో "పరీధాన్" అనే కార్యక్రమళ్ 2012లో ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో భాగంగా అతను బట్టలు, పుస్తకాలను సమాజంలో బలహీన వర్గాల ప్రజలకు అందజేయడం, రక్త దాన శిబిరాలను నిర్వహించాడు. అతను పేద ప్రజలకు ఉచితంగా భోజనం, మందులు సరఫరా కార్యక్రమం కూడా చేపట్టాడు.

నిర్వహించిన పద

  • జిల్లా అధ్యక్షుడు, భారతీయ జనతా యువ మోర్చా, కోటా. (1987–91)
  • రాష్ట్ర అధ్యక్షుడు, భారతీయ యువమోర్చా, రాజస్థాన్ రాష్ట్రం. (1991-1997)
  • జాతీయ ఉపాధ్యక్షుడు, భారతీయ జనతా యువమోర్చా. (1997-2003)
  • వైస్ చైర్మన్, జాతీయ కో-ఆపరేటివ్ కన్సూమర్ ఫెడరేషన్ లిమిటెడ్.
  • చైర్మన్, CONFED, జైపూర్. (జూన్ 1992 నుండి జూన్ 1995)
  • లోక్‌సభ స్పీకరు, (19 జూన్ 2019)

ఇది కూడా చూడండి

మూలాలు

బయటి లంకెలు

లోక్‌సభ
అంతకు ముందువారు
జయరాజ్ సింగ్
పార్లమెంటు సభ్యుడు
కోటా పార్లమెంటు నియోజకవర్గం

2014 – ప్రస్తుతం
తరువాత వారు
Incumbent
రాజకీయ కార్యాలయాలు
అంతకు ముందువారు
సుమిత్ర మహాజన్
లోక్‌సభ స్పీకరు
2019 – ప్రస్తుతం
Incumbent

Tags:

ఓం బిర్లా ప్రారంభ జీవితంఓం బిర్లా సామాజిక సేవలుఓం బిర్లా నిర్వహించిన పదఓం బిర్లా ఇది కూడా చూడండిఓం బిర్లా మూలాలుఓం బిర్లా బయటి లంకెలుఓం బిర్లాకోట సౌత్ శాసనసభ నియోజకవర్గంభారతీయ జనతా పార్టీ

🔥 Trending searches on Wiki తెలుగు:

కన్నెగంటి బ్రహ్మానందంఇండుపుపశ్చిమ గోదావరి జిల్లాపల్లవులుఅష్టదిగ్గజములుసరోజినీ నాయుడునోటి పుండువిశాఖపట్నంరావణాసురవై.యస్. రాజశేఖరరెడ్డిహరిద్వార్ఋతువులు (భారతీయ కాలం)ద్రౌపది ముర్ముఉమ్మెత్తవిద్యసహాయ నిరాకరణోద్యమంస్వర్ణ దేవాలయం, శ్రీపురంసర్కారు వారి పాటదసరాభారత జాతీయ కాంగ్రెస్భారత రాజ్యాంగ సవరణల జాబితాకుటుంబంభారతదేశ ప్రధానమంత్రిభారత ప్రభుత్వంబ్రహ్మపుత్రా నదిలగ్నంగిడుగు వెంకట రామమూర్తిహార్దిక్ పాండ్యాపూర్వ ఫల్గుణి నక్షత్రమునందమూరి బాలకృష్ణఐశ్వర్య రాయ్లలిత కళలుఈశాన్యంపారిశ్రామిక విప్లవంశ్రీరామనవమిఆలంపూర్ జోగులాంబ దేవాలయంశ్రీశైల క్షేత్రంత్రిష కృష్ణన్చక్రిస్వాతి నక్షత్రమురాజా రవివర్మగన్నేరు చెట్టుకార్తెఅంగారకుడు (జ్యోతిషం)లలితా సహస్ర నామములు- 1-100కొండపల్లి బొమ్మలువేయి స్తంభాల గుడిఅనుష్క శెట్టికర్ణాటకమిషన్ ఇంపాజిబుల్నల్గొండ జిల్లాకుంభమేళాసప్తచక్రాలుమానవ శరీరమునాని (నటుడు)సోరియాసిస్కాశీదేశాల జాబితా – వైశాల్యం క్రమంలోరూపవతి (సినిమా)త్రిఫల చూర్ణంతెలంగాణ తల్లిలైంగిక విద్యజ్యేష్ట నక్షత్రంతెలుగు కులాలుకాజల్ అగర్వాల్కాసర్ల శ్యామ్శతక సాహిత్యమురామప్ప దేవాలయంవాల్మీకిఅనూరాధ నక్షత్రంరావు గోపాలరావుశాతవాహనులుపి.టి.ఉషధర్మవరపు సుబ్రహ్మణ్యంఖండంబాబర్వై.యస్.అవినాష్‌రెడ్డినివేదా పేతురాజ్🡆 More