ఎడ్మండ్ హిల్లరీ: న్యూజిలాండ్ పర్వతారోహకుడు

సర్ ఎడ్మండ్ పర్సీవల్ హిల్లరీ, కె.జి, ఓ.ఎన్.జి, కె.బి.ఈ (జూలై 20, 1919 – జనవరి 11, 2008) న్యూజిలాండ్కు చెందిన పర్వతారోహకుడు, అన్వేషకుడు.

33 యేళ్ళ వయసులో 1953, మే 29న షేర్పా పర్వతారోహకుడు టెన్సింగ్ నార్కేతో పాటు ఎవరెస్టు శిఖరాన్ని చేరుకొని ప్రపంచములో అత్యంత ఎత్తైన శిఖరాన్ని అధిరోహించిన మొట్టమొదటి వ్యక్తులుగా చరిత్ర సృష్టించారు. వీరు జాన్ హంట్ నాయకత్వములోని తొమ్మిదవ బ్రిటీషు అధిరోహణా బృందములో భాగంగా ఎవరెస్టును ఎక్కారు.

సర్ ఎడ్మండ్ హిల్లరీ
ఎడ్మండ్ హిల్లరీ: బాల్యం, పర్వతారోహణ, నేపాలీల మానవతా మూర్తి
జననం(1919-07-20)1919 జూలై 20
టువాకౌ, నార్త్ ఐలాండ్, న్యూజీలాండ్
మరణం2008 జనవరి 11(2008-01-11) (వయసు 88)
జీవిత భాగస్వామిలూయిస్ మేరీ రోస్ (1953-1975), జూన్ మల్‌గ్రూ (1989-)
పిల్లలుపీటర్ (1954), సారా (1955), , బెలిండా (1959-1975)
తల్లిదండ్రులుపర్సీవల్ అగస్టస్ హిల్లరీ , గెట్రూడ్ హిల్లరీ (క్లార్క్)

బాల్యం

ఎడ్మండ్ హిల్లరీ 1919 జూలై 20న న్యూజిలాండ్‌ లోని ఆక్లాండ్‌లో జన్మించాడు. 1920లో వారి కుటుంబం ఆక్లాండ్‌కు దక్షిణంగా ఉన్న త్వాకౌ పట్టణానికి నివాసం మార్చారు. హిల్లరీ విద్యాభ్యాసం త్వాకౌ ప్రాథమిక పాఠశాలలోను, ఆక్లాండ్ గ్రామర్ పాఠశాలలోనూ కొనసాగింది.

పర్వతారోహణ

16 సంవత్సరాల వయస్సులోనే హిల్లరీ పర్వతారోహణపై మక్కువ చూపినాడు. 1939లో దక్షణ ఆల్ప్స్ పర్వతాలలో ఉన్న ఆలివర్ పర్వత శిఖరాన్ని అధిరోహించడం అతని జీవితంలో తొలి ప్రధాన సాహస కృత్యం. ఎవరెస్ట్ అధిరోహణే కాకుండా హిమాలయ పర్వతాలలో ఉన్న ముఖ్యమైన మరో 10 శిఖరాలను కూడా హిల్లరీ అధిరోహించాడు.

ఎవరెస్టు అధిరోహణ

8848 మీటర్ల ఎత్తుతో ప్రపంచంలోనే అత్యంత ఎత్తుగల హిమాలయ పర్వతాలలోని ఎవరెస్టు శిఖరం అధిరోహణ అత్యంత సాహసమైన కృత్యం. టెన్సింగ్ నార్కేతో పాటు ఎడ్మండ్ హిల్లరీ 1953, మార్చి 29 నాడు ఈ శిఖరాన్ని చేరుకొని ఈ ఘనత సాధించిన తొలి వ్యక్తులలో ఒకడిగా అవతరించాడు.

నేపాలీల మానవతా మూర్తి

ఎడ్మండ్ హిల్లరీ నేపాలీల ముఖ్యంగా షెర్పాల దృష్టిలో దైవసమానుడు. ఎవరెస్టు అధిరోహణ సమయంలో అక్కడి షెర్పాల దయనీయ జీవితాన్ని చూసి చలించిపోయాడు. అక్కడ పాఠశాలలు, ఆసుపత్రులు ఏర్పాటు చేసి షెర్పాల జీవితంలో వెలుగులు నింపినాడు. హిల్లరీ మరణానంతరం షెర్పాలు వెన్నతో దీపాలు వెలిగించి ప్రత్యేక బౌద్ధ ప్రార్థనలు చేశారు.

గుర్తింపులు

  • ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించి తమ దేశ గౌరవాన్ని నిలబెట్టినందుకు న్యూజీలాండ్ ప్రభుత్వం 5 డాలర్ల కరెన్సీ నోటుపై హిల్లరీ బొమ్మను ముద్రించి అతని ప్రతిభను గౌరవించింది.
  • బ్రిటన్ జట్టులోని సభ్యుడిగా హిల్లరీ సాధించిన విజయాన్ని గౌరవిస్తూ బ్రిటన్ రాణి రెండో ఎలిజబెత్ హిల్లరీని సత్కరించింది.
  • న్యూజిలాండ్ లోని ఎన్నో పాఠశాలలకు, సంస్థలకు హిల్లరీ పేరు పెట్టినారు.
  • భారత్ లోని డార్జిలింగ్లో సెయింట్ పౌల్ పాఠశాలలోని ఒక భవనానికి కూడా హిల్లరీ పేరు పెట్టబడింది.

విషాదకర సంఘటన

1975లో ఎడ్మండ్ హిల్లరీ నేపాల్లో సేవాకార్యక్రమాలలో భాగంగా ఆసుపత్రి నిర్మాణం జరుగుతున్నప్పుడు తనను కలుసుకోవడానికి వస్తున్న భార్య, కుమారై ప్రయాణిస్తున్న విమానం కూలిపోయి మరణం చెందడం హిల్లరీ జీవితంలో అత్యంత విషాదకరమైన సంఘటన.

మరణం

2008, జనవరి 11 న హిల్లరీ ఆక్లాండ్‌లో మరణించాడు. అప్పుడు అతని వయస్సు 88 సంవత్సరాలు. న్యూమోనియా వ్యాధితో బాధపడుతున్న హిల్లరీకి గుండెపోటు రావడంతో ఆక్లాండ్ ఆసుపత్రిలో మరణించాడు.

మూలాలు

Tags:

ఎడ్మండ్ హిల్లరీ బాల్యంఎడ్మండ్ హిల్లరీ పర్వతారోహణఎడ్మండ్ హిల్లరీ నేపాలీల మానవతా మూర్తిఎడ్మండ్ హిల్లరీ గుర్తింపులుఎడ్మండ్ హిల్లరీ విషాదకర సంఘటనఎడ్మండ్ హిల్లరీ మరణంఎడ్మండ్ హిల్లరీ మూలాలుఎడ్మండ్ హిల్లరీ191919532008ఎవరెస్టుజనవరి 11జూలై 20టెన్సింగ్ నార్కేన్యూజిలాండ్మే 29

🔥 Trending searches on Wiki తెలుగు:

ఘిల్లిఆవర్తన పట్టికరవితేజఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డు కులాల జాబితా73 వ రాజ్యాంగ సవరణవ్యవస్థాపకతశుక్రుడు జ్యోతిషంరాయప్రోలు సుబ్బారావుభారతీయ జనతా పార్టీశ్రీకాళహస్తీశ్వర దేవస్థానంశివ కార్తీకేయన్వసంత వెంకట కృష్ణ ప్రసాద్అంగచూషణభారత జాతీయపతాకంఫజల్‌హక్ ఫారూఖీమంగళసూత్రంకలమట వెంకటరమణ మూర్తిహర్భజన్ సింగ్వాతావరణంతేలులావు శ్రీకృష్ణ దేవరాయలుసింహంకాశీడామన్అనకాపల్లి లోక్‌సభ నియోజకవర్గంరేవతి నక్షత్రంనవరత్నాలుసచిన్ టెండుల్కర్దంత విన్యాసంఏలూరుతెలుగు సినిమాల జాబితావంగా గీతభారతదేశంలో మహిళలుసామజవరగమనతంగేడుపచ్చకామెర్లుకాపు, తెలగ, బలిజపరమాణు సంఖ్య ప్రకారం మూలకాలుఆర్తీ అగర్వాల్పునర్వసు నక్షత్రముమహాకాళేశ్వర జ్యోతిర్లింగంపేరుఅర్జునుడుఅక్కినేని నాగార్జునగోత్రాలుకమ్మవాయు కాలుష్యంనరేంద్ర మోదీవిష్ణువు వేయి నామములు- 1-1000పురాణాలుభారత జాతీయ కాంగ్రెస్వెబ్‌సైటుభారత జాతీయ చిహ్నంఆప్రికాట్ఈశాన్యంవిశాఖపట్నంరామ్ పోతినేనిపద్మశాలీలుచెమటకాయలుధ్వజ స్తంభం2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుప్రశాంత్ నీల్ఛందస్సుశ్రీ చక్రంపూజా హెగ్డేభారత రాజ్యాంగ పీఠికఎస్. జానకిశ్రీ కృష్ణుడుచదరంగం (ఆట)ఏ.పి.జె. అబ్దుల్ కలామ్నవలా సాహిత్యముకుక్కఅమర్ సింగ్ చంకీలాహైదరాబాదు లోక్‌సభ నియోజకవర్గంఏడిద నాగేశ్వరరావుకార్తెనల్లమిల్లి రామకృష్ణా రెడ్డికృష్ణా నదిరోజా సెల్వమణి🡆 More