అంత్యప్రాసాలంకారము

అంత్యప్రాసాలంకారము తెలుగు భాషకు చెందిన ఒక రకమైన అలంకారము.

మొదటి పాదం చివరి భాగంలో ఏ అక్షరంతో (అక్షరాలతో) ముగిసిందో, రెండో పాదం కూడా అదే అక్షరంతో (అక్షరాలతో) ముగుసినట్లైతే అది అంత్య ప్రాసం అవుతుంది. కూచిమంచి జగ్గకవి కి అంత్యప్రాసాలంకారము లనిన చాలా యిష్టం అలాంటి పద్యములు అతను వ్రాసిన ‘భక్తమందారశతకము’ లో ఆరు కలవు. అంత్య ప్రాస ముద్ర ఆరుద్ర గారి శైలిలో ప్రాస మీద ఆశతో ధ్యాస ఎక్కువగా పెట్టి వేటూరి గారు చాలా పాటలు వ్రాశారు.

అంత్యప్రాసాలంకారము

ఉదాహరణ-1

శ్రీరఘురామ ! చారుతులసీ దళధామ ! శమక్షమాది శృం
గారగుణాభిరామ ! త్రిజగన్నుత శౌర్యరమా లలామ ! దు
ర్వారక బంధరాక్షస విరామ ! జగజ్జన కల్మషార్ణవో
త్తారక నామ ! భద్రగిరి దాశరథీ ! కరుణాపయోనిధీ !

పదాంతమందున్న రామ - ధామ - అభిరామ - లలామ - విరామ - నామ - ఇంతవరకొక అంత్యప్రాసము దాశరథీ ! కరుణాపయోనిధీ ! ఇది యొక అంత్యప్రాసము.

అంత్యప్రాసమున్నదని పద్యమున, కుండవలసిన ప్రాసమును తొలగింపరాదు.

భక్త మందార శతకంలో పద్యం

కూచిమంచి జగ్గకవి రాసిన ఈ పద్యములో అంత్య ప్రాసాలంకారం ఉన్నది.

అతసీపుష్పసమానకోమల వినీలాంగున్, సముద్యన్మహో-
న్నత కోదండనిషంగగంగు, బలవన్నక్తంచరాఖగ్వప-
ర్వతజీమూతతురంగుఁ, గింకరజనవ్రాతావనాత్యంతర-
మ్యతరాపాంగుని, నిన్ భజింతు మది, రామా! భక్తమందారమా!

సినిమా పాటలలో అలంకారము

  • తోటలో నారాజు తొంగి చూసెను నాడు; నీటిలో ఆ రాజు నీడ నవ్వెను నేడు - ఏకవీర సినిమా కోసం సి.నారాయణరెడ్డి గారి పాట. : ఇందులో "నాడు", "నేడు" పదాలు అంత్యప్రాసము.
  • రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకో, వాలిపోయే పొద్దా నీకు వర్ణాలెందుకో, : రచన: వేటూరి సుందరరామమూర్తి.
  • నటరాజ శతసహస్ర రవితేజ నటగాయక వైతాళిక మునిజన భోజ : రచన: సి.నారాయణరెడ్డి
  • కైలాసాన కార్తీకాన శివ రూపం, ప్రమిదేలేని ప్రమధాలోకం హిమ దీపం
  • పంచ భూతములు ముఖ పంచకమై, ఆరు ఋతువులు ఆహార్యములై, త్రికాలములు నేత్రత్రయమై,  చతుర్వేదములు ప్రాకారములై
  • ఏకులము నీదంటే గోకులము నాదంది మాధవుడు యాదవుడు మాకులమే లెమ్మంది
  • కృషి ఉంటె మనుషులు ఋషు లౌతారు మహా పురుషులౌతారు
  • రాలు పూల తేనియకై రాతిపూల తుమ్మెదనై
  • అలలు కదిలినా పాటే, ఆకు మెదిలినా పాటే, కలలు చెదిరినా పాటే, కలత చెందినా పాటే
  • ఆకాశ దేశాన, ఆషాఢ మాసాన, మెరిసేటి ఓ మేఘమా, విరహమో, దాహమో, విడలేని మోహమో

మూలాలు

Tags:

అంత్యప్రాసాలంకారము ఉదాహరణ-1అంత్యప్రాసాలంకారము భక్త మందార శతకంలో పద్యంఅంత్యప్రాసాలంకారము సినిమా పాటలలో అలంకారముఅంత్యప్రాసాలంకారము మూలాలుఅంత్యప్రాసాలంకారముఅక్షరంఅలంకారముకూచిమంచి జగ్గకవితెలుగుపాదం

🔥 Trending searches on Wiki తెలుగు:

ఈనాడువిద్యుత్తుజ్యోతిషంతెలంగాణా బీసీ కులాల జాబితాద్వాదశ జ్యోతిర్లింగాలువిశాఖ నక్షత్రముభారత జాతీయ చిహ్నంనవగ్రహాలువిజయశాంతిఅష్ట దిక్కులుయుద్ధకాండశ్రీశ్రీ రచనల జాబితాకుక్కఉపనయనము20వ శతాబ్దం ముందు తెలుగు పల్లెల్లో జీవనశైలిరెడ్డిజాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్నాయకత్వంభారతదేశ అత్యున్నత న్యాయస్థానంఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు2023 కర్ణాటక శాసనసభ ఎన్నికలుతెలుగు కథనిర్మలమ్మపిట్ట కథలుఅల వైకుంఠపురములోగ్రామ పంచాయతీఅమరావతిఆర్. విద్యాసాగ‌ర్‌రావుఇన్‌స్టాగ్రామ్వాస్తు శాస్త్రంమధుమేహంవిరాట్ కోహ్లిభారత రాజ్యాంగ పీఠికరంప ఉద్యమంపెరిక క్షత్రియులుసీతాపతి చలో తిరుపతికరికాల చోళుడుభారత కేంద్ర బడ్జెట్ 2023 - 24రెండవ ప్రపంచ యుద్ధంరాష్ట్రకూటులుభాషా భాగాలుకుంభరాశిమలబద్దకంఎస్. పి. బాలసుబ్రహ్మణ్యంకలబందశ్రీలీల (నటి)హృదయం (2022 సినిమా)శోభితా ధూళిపాళ్లకంప్యూటరుసంధిపావని గంగిరెడ్డిఆలివ్ నూనెఅలంకారముతెలంగాణ జాతరలుచే గువేరామకరరాశిబూర్గుల రామకృష్ణారావుతెలుగు వికీపీడియాశేషాద్రి నాయుడునారా చంద్రబాబునాయుడుసాయిపల్లవిభగత్ సింగ్తెలంగాణ రాష్ట్ర శాసన సభఆర్థర్ కాటన్మే 1రంజాన్గంగా పుష్కరంసోరియాసిస్యాదవభారతదేశంలో విద్యచంద్ర గ్రహణంశాకుంతలంసీవీ ఆనంద్పార్వతిభారత రాజ్యాంగం - ప్రాథమిక హక్కులుఆంధ్ర మహాసభ (తెలంగాణ)శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయం (వేములవాడ)భారత క్రికెట్ జట్టు🡆 More