సిప్రాలి

సిప్రాలి ఒక వ్యంగ్య రచనా సంపుటి మూల రచన శ్రీశ్రీ.

తెలుగు సాహిత్యంలో శ్రీశ్రీ వ్రాయని సాహితీ ప్రక్రియ లేదు. ఐతే చాలా తక్కువమందికి తెలిసిన విషయం ఏమిటంటే, శ్రీశ్రీ వ్యంగ్య సాహిత్యంతో అంటే పేరడీ సాహిత్యంతో కూడా ఎన్నో రచనలు చేసి తెలుగు సాహితీ ప్రియులను ఆనందింప చేశాడు. శ్రీశ్రీ పేరడీ రచనలలో భాగంగానే ‘సిప్రాలి’ అనే శీర్షిక క్రింద ఒక గ్రంధం ప్రచురణ జరిగింది అది బహుళ ప్రాచుర్యం కూడా పొందింది. ‘సిప్రాలి’లో రమారమి అన్ని పద్యాలకు “సిరిసిరి” అనే మకుటం వొచ్చేటట్టు రచన చేసాడు. శ్రీ అనే పదం తెలుగులో ప్రకృతి ఐతే సిరి అనే పదం వికృతి కాబట్టి దీనికి మకుటం శ్రీశ్రీకి బదులు సిరిసిరి అని పెట్టి ఉంటాడు. అంటే తన గ్రంధం యొక్క పేరు పెట్టటంలో కూడా కవి పేరడీ చేశాడు అన్నమాట.

“ఒక మూల రచనకు అధిక్షేపాణాత్మకమైన, హేళనాత్మకమైన, హాస్యాత్మకమైన రచనతో కూడిన అనుకరణను మాత్రమే పేరడీ అని అంటారు”. పూర్వము వికటకవిగా పేరు పొందిన తెనాలి రామకృష్ణ కవి పేరడీకి ఆద్యుడని భావన చేయవచ్చు. ఆధునిక యగంలో అనేకమంది కవులు పేరడీకి వన్నె తెచ్చారు. ప్రాచీన కవుల నుంచి ఆధునిక కవుల వరకు అన్ని రచనలకు పేరడీలు కట్టారు. ఆధునిక కవులలో జలసూత్రం రుక్మిణీనాధ శాస్త్రి (జరుక్ శాస్త్రి) గారు పేరడీకి కొత్త ఒరవడిని, పోకడలను, ప్రజాదరణ తీసుకొచ్చాడు. బమ్మెర పోతన, తిక్కన, ఎర్రన్న, శ్రీశ్రీ, విశ్వనాథ సత్యనారాయణ, దేవులపల్లి కృష్ణ శాస్త్రి ఇలా ఒకరేంటి దాదాపు ప్రాచీన, ఆధునిక కవులందరి రచనలకు పేరడీకి రచనలకు గురి అయ్యాయి అవి విరివిగా లభ్యమౌతున్నాయి.

మూల రచన శ్రీశ్రీ పేరడీ రచన
సుమతీ శతకము లోని పద్యము
ఛందస్సు: కందం
ఏఱకుమీ కసుగాయలు,
దూఱకుమీ బంధుజనుల దోషము సుమ్మీ,
పాఱకుమీ రణమందున,
మీఱకుమీ గురువు నాజ్ఞ మేదిని సుమతీ
ఛందస్సు: కందం
కోయకుమీ సొరకాయలు
వ్రాయకుమీ నవలలని అవాకు చెవాకుల్
డాయకుమీ అరవఫిలిం
చేయకుమీ చేబదుళ్లు సిరిసిరి మువ్వా

ఇది కూడా చూడండి

శ్రీశ్రీ ఒక వ్యంగ్య వైతాళికుడు – శ్రీశ్రీ సాహితీ ప్రక్రియలో మరో పార్శ్వము

మూలాలు

Tags:

శ్రీశ్రీ

🔥 Trending searches on Wiki తెలుగు:

దగ్గుబాటి పురంధేశ్వరివడ్డీముదిరాజ్ (కులం)మహేంద్రసింగ్ ధోనిమద్దెలచెరువు సూర్యనారాయణరెడ్డివిడాకులువందే భారత్ ఎక్స్‌ప్రెస్దాశరథి కృష్ణమాచార్యపమేలా సత్పతిభారతదేశంజాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్నాయీ బ్రాహ్మణులుఆరూరి రమేష్స్వాతి నక్షత్రముఉగాదిఘట్టమనేని కృష్ణమృణాల్ ఠాకూర్కోల్‌కతా నైట్‌రైడర్స్వై.యస్.అవినాష్‌రెడ్డినువ్వు నేనువల్లభనేని వంశీ మోహన్2019 భారత సార్వత్రిక ఎన్నికలుకల్పనా చావ్లానోటాఅన్నవరంజవాహర్ లాల్ నెహ్రూఅమెరికా సంయుక్త రాష్ట్రాలుఅలంకారంకీర్తి రెడ్డిరకుల్ ప్రీత్ సింగ్అయోధ్య రామమందిరంసుమతీ శతకముఆది పర్వముసురవరం ప్రతాపరెడ్డివడ్రంగియోనిఆవేశం (1994 సినిమా)సంకటహర చతుర్థిభూమా అఖిల ప్రియతెలుగుసన్ రైజర్స్ హైదరాబాద్కమ్మన్యుమోనియాసామెతల జాబితాపటిక బెల్లంప్రస్తుత భారత ముఖ్యమంత్రుల జాబితాజాతిరత్నాలు (2021 సినిమా)కాళోజీ నారాయణరావుతెలంగాణ పుణ్యక్షేత్రాల జాబితాభారతీయ స్టేట్ బ్యాంకు2024 భారత సార్వత్రిక ఎన్నికలుమహాత్మా గాంధీకొడాలి శ్రీ వెంకటేశ్వరరావుకబడ్డీమొదటి పేజీఇస్లాం మత సెలవులువిజయవాడమానవ శాస్త్రంటంగుటూరి అంజయ్యసెక్యులరిజంశ్రీనాథుడుసమంతతెలుగు కవులు - బిరుదులునరసింహ శతకముబ్రాహ్మణ గోత్రాల జాబితాకర్ర పెండలంతెలంగాణవైజయంతీ మూవీస్జెర్రి కాటుతెలుగు సినిమాల జాబితాహల్లులుబస్వరాజు సారయ్యమహాభారతంభోపాల్ దుర్ఘటనఅర్జునుడుప్రధాన సంఖ్యచేవెళ్ళ లోక్‌సభ నియోజకవర్గంఆది శంకరాచార్యులుకర్కాటకరాశి🡆 More