గుజ్జన గూళ్ళు

ఇది కేవలం సంసారపు శిక్షణ ఇచ్చే ఆట.

దీన్ని బువ్వలాట అని కూడా అంటారు. ఈ ఆటను పూర్వం ఉమ్మడి కుటుంబాల్లో చిన్న పిల్లలు ఆడుకునేవారు. ఈ ఆటలో పిల్లలు ఎందరైనా పాల్గొనవచ్చును. పిల్లలు తమ పెద్దలనడిగి బియ్యము, పప్పులు, మరమరాలు, బెల్లం, పంచదార తెచ్చుకొని తాము ఆడుకొని లక్కపిడతల్లో (చెక్కతో చేయబడిన చిన్న వంట సామాగ్రి) పోసి వాటిని పొయ్యి మీద పెట్టినట్లు, దించినట్లు నటిస్తూ కొంతసేపటికి అందరూ కలిసి తింటారు. ఈ ఆట ఆడినప్పుడు బొమ్మల పెళ్ళి చేసి రెండు జట్లుగా చీలి వియ్యాలవారికి విందు పెట్టుటకై గుజ్జన గూళ్ళు పెడతారు. బాగా పండిన చింతకాయలను తెచ్చి నేర్పుతో దానిలోని గుజ్జును గుల్ల చెడకుండా వుండునట్లు పూర్తిగా తీసివేసి, ఆ గుల్లలో బియ్యము పోసి, దానిని మండుచున్న పొయ్యిలోని కుమ్ములోని పెట్టి అవి ఉడికిన తరువాత ఆ పిల్లలు 'గుజ్జన గూళ్ళు' అని వేడుకగా తింటారు. ఈ గుజ్జన గూళ్ళు ఆటను రుక్మిణి, గరిక ఆడినట్లు భాగవతంలోను, మనుచరిత్రలోనూ ఉంది.

గుజ్జన గూళ్ళు
లక్కపిడతలు

నేటి పరిస్థితి

గుజ్జన గూళ్ళు 
ఆధునిక కిచెన్ సెట్

ఆధునిక విద్య, ఆధునిక ఆటలు, ఉమ్మడి కుటుంబాల విచ్చిన్నం వల్ల ఈ ఆట నేడు దాదాపు పూర్తిగా అంతరించిపోయింది. భారతీయ సంప్రదాయాన్ని, కుటుంబ వ్యవస్థను ప్రతిబంబించే ఈ ఆట ఆధునిక సంస్కృతి ప్రభావానికి గురై మరుగున పడింది. గాజుల సత్యనారాయణ తన పెద్దబాల శిక్ష పుస్తకంలో గుజ్జన గూళ్ళు గురించి రాసాడు. ఇప్పటికీ బువ్వలాటలో వాడే లక్క పిడతలను విశాఖపట్నం జిల్లా ఏటికొప్పాకలో తయారుచేస్తారు. బువ్వాలట సామాన్లను నగరాల్లో జరిగే హస్త కళా ప్రదర్శనల్లో అమ్ముతారు.

మూలాలు

Tags:

పంచదారపప్పులుపొయ్యిబియ్యముబెల్లంమరమరాలుశిక్షణ

🔥 Trending searches on Wiki తెలుగు:

పెళ్ళి చూపులు (2016 సినిమా)షిర్డీ సాయిబాబాతూర్పుబోదకాలుఉలవలుఅశ్వని నక్షత్రముఋతువులు (భారతీయ కాలం)జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్తెలంగాణ తల్లిస్వామి వివేకానందరాహువు జ్యోతిషంశరత్ బాబునవధాన్యాలుపాల కూరజూనియర్ ఎన్.టి.ఆర్కాపు, తెలగ, బలిజకాంచనసంఖ్యధర్మవరపు సుబ్రహ్మణ్యంగూగుల్పావని గంగిరెడ్డివినాయక చవితిభారతదేశ పేరు పుట్టుపూర్వోత్తరాలుశ్రీనాథుడుతిరుపతిరాం చరణ్ తేజవేమనకస్తూరి రంగ రంగా (పాట)కల్వకుంట్ల చంద్రశేఖరరావుహర్షవర్థనుడుహనుమంతుడువాట్స్‌యాప్ఆంధ్రప్రదేశ్ గవర్నర్లుఛందస్సుగ్రంథాలయంవిడదల రజినిఎల్లమ్మపరమాణు సంఖ్య ప్రకారం మూలకాలుద్రౌపదిఅనుష్క శెట్టిఆయాసంరామోజీరావునెల్లూరుకర్ణుడుతిప్పతీగనివేదా పేతురాజ్ఘట్టమనేని మహేశ్ ‌బాబురక్తపోటునవరత్నాలుగుత్తా రామినీడుకావ్య కళ్యాణ్ రామ్మాదిగనక్షత్రం (జ్యోతిషం)నారా చంద్రబాబునాయుడుదేవీ ప్రసాద్సంక్రాంతియాగంటికోడి రామ్మూర్తి నాయుడుక్రికెట్నాగోబా జాతరగోదావరికర్మ సిద్ధాంతంరక్తంతెలుగు శాసనాలుమర్రిచాకలి ఐలమ్మడార్విన్ జీవపరిణామ సిద్ధాంతంరమణ మహర్షిచిరుధాన్యందావీదువ్యవసాయంఎస్. పి. బాలసుబ్రహ్మణ్యంవారసుడు (2023 సినిమా)రత్నపాపకృష్ణా నదితెల్లబట్టఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీఇందిరా గాంధీ🡆 More