పిల్లలమర్రి ఎఱకేశ్వర దేవాలయం

ఎఱకేశ్వర దేవాలయం, తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లా, పిల్లలమర్రి గ్రామానికి పశ్చిమ వైవున్న ఒక శివాలయం.

మూసీ నది ఒడ్డున ఉన్న ఈ దేవాలయాన్ని సా.శ 1208లో కాకతీయులకు సామంతులైన రేచర్ల కుటుంబానికి చెందిన బాటిరెడ్డి భార్య ఎఱకసాని నిర్మించింది. పిల్లలమర్రి గ్రామంలో రాతి, గ్రానైట్ చెక్కబడిన నాలుగు దేవాలయాలలో ఈ ఎఱకేశ్వర దేవాలయం ఒకటి. మిగిలిన మూడు దేవాలయాలు (పార్వతి-మహాదేవ నామేశ్వర దేవాలయం, త్రికూటేశ్వర ఆలయం, చెన్నకేశవ దేవాలయం) ఈ దేవాలయానికి తూర్పున 250 మీటర్ల దూరంలో ఉన్నాయి. .

ఎఱకేశ్వర దేవాలయం (పిల్లలమర్రి)
పిల్లలమర్రి ఎఱకేశ్వర దేవాలయం
పిల్లలమర్రి ఎఱకేశ్వర దేవాలయం
ఎఱకేశ్వర దేవాలయం (పిల్లలమర్రి) is located in Telangana
ఎఱకేశ్వర దేవాలయం (పిల్లలమర్రి)
తెలంగాణలో దేవాలయ స్థానం
భౌగోళికం
భౌగోళికాంశాలు17°10′11″N 79°34′56″E / 17.169683°N 79.582198°E / 17.169683; 79.582198
దేశంభారతదేశం
రాష్ట్రంతెలంగాణ
జిల్లాసూర్యాపేట
స్థలంపిల్లలమర్రి
సంస్కృతి
దైవంచెన్నకేశవ స్వామి
వాస్తుశైలి
నిర్మాణ శైలులుకాకతీయ నిర్మాణ శైలి
చరిత్ర, నిర్వహణ
నిర్మించిన తేదీc. 1208 CE

స్థానం

65వ జాతీయ రహదారిలో రాష్ట్ర రాజధాని హైదరాబాదు నుండి 153 కి.మీ దూరంలో, సూర్యాపేట పట్టణానికి వాయువ్యంగా 8 కి.మీ దూరంలో ఈ పిల్లలమర్రి గ్రామం ఉంది.

చరిత్ర

పిల్లలమర్రి ఎఱకేశ్వర దేవాలయం 
ఎఱకేశ్వర దేవాలయ అంతస్తు ప్రణాళిక

13వ శతాబ్దం ప్రారంభంలో (సా.శ 1203-1208) కాకతీయుల దగ్గర సామంతులుగా పనిచేసిన రేచర్ల అధిపతులు ఈ దేవాలయాన్ని నిర్మించారు. సా.శ 1208లో పిల్లలమర్రిలో రేచర్ల కుటుంబానికి చెందిన బాటిరెడ్డి భార్య ఎఱకసాని ఈ దేవాలయాన్ని నిర్మించినట్లు ఇక్కడున్న ఒక శాసనంలో పేర్కొనబడింది. అందువల్ల ఇక్కడి దేవుడికి ఎఱకేశ్వరుడు అనే పేరు పెట్టారు. 14వ శతాబ్దం ప్రారంభంలో అల్లావుద్దీన్ ఖిల్జీ దక్కన్ ప్రాంతంలో జరిపిన దాడుల సమయంలో ఈ ఆలయం ధ్వంసం చేయబడింది. ఆ తరువాత ముసునూరి నాయక రాజవంశానికి చెందిన కాపయ్య నాయకుడికి సేవలందిస్తున్న స్థానిక ఫ్యూడటరీ చీఫ్ ద్వారా ఎఱకేశ్వర స్వామిని తిరిగి స్థాపించినట్లు సా.శ 1357నాటి శాసనంలో పేర్కొనబడింది.

ఇక్కడి ప్రాంగణంలో దేవాలయ చరిత్ర, పిల్లలమర్రి గ్రామ చరిత్ర గురించి తెలుగులో రాతి శాసనాలు ఉన్నాయి. సా.శ 1195(శాక. 1117) నాటి శాసనంలో మొదటి ప్రతాపరుద్రుని పాలన గురించి, సా.శ 1208 (శాక 1130) నాటి శాసనంలో గణపతిదేవుని పాలన గురించి ప్రస్తావించబడింది.

1926, 1927లో పురావస్తు శాస్త్రవేత్త, ఎపిగ్రాఫిస్ట్ గులాం యజ్దానీ ఆధ్వర్యంలో ఈ దేవాలయ తొలి పురావస్తు సర్వేలు, డాక్యుమెంటేషన్ పూర్తయి, 1929లో ప్రచురించబడ్డాయి. పిల్లలమర్రిలోని నాలుగు దేవాలయాలు శిథిలావస్థలో ఉన్నాయని, వాటికి తప్పుగా పేరు పెట్టబడ్డాయని ఈ అధ్యయనంలో తేలింది.

  • సోమేశ్వర గుడి (ఇప్పుడు ఎఱకేశ్వర దేవాలయం)
  • నరసింహదేవ దేవాలయం (ఇప్పుడు నామేశ్వర దేవాలయం)
  • ముకండేశ్వర దేవాలయం (ఇప్పుడు త్రికూటేశ్వర దేవాలయం)
  • రామేశ్వర దేవాలయం (ఇప్పుడు చెన్నకేశవ దేవాలయం)

నిర్మాణ శైలి

ములుగు జిల్లాలోని రామప్ప దేవాలయం, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కోట గుళ్ళు దేవాలయం, కాకతీయ శకంలోని ఇతర దేవాలయాల నిర్మాణ శైలిని పోలినట్లుగా ఈ దేవాలయ నిర్మాణ శైలి ఉంటుంది. ఈ దేవాలయం ఒక ఉపపీఠంపై ఉంచబడి, శిలువ ఆకారంలో ఉంటుంది. దీనికి తూర్పు, ఉత్తర, దక్షిణాలలో మూడు వరండాలు, పశ్చిమాన గర్భాలయం ఉన్నాయి. శిఖర గర్భగుడిని ఇటుక, సున్నంతో తయారు చేశారు. ఈ దేవాలయ నిర్మాణంలో ఉపయోగించిన రాయి ఆసక్తికరమైన ధ్వని లక్షణాలను కలిగి ఉందని చెప్పబడింది. గుడి రాయిని నాణెంతో తట్టినప్పుడు, అది లోహంలా శబ్ధాన్ని చేస్తున్నట్టు అనిపిస్తుంది. దేవాలయంలో స్తంభాలు, గోడలు చెక్కబడ్డాయి. గోడలు ఫ్రెస్కోలతో పెయింట్ చేయబడ్డాయి.

చిత్రమాలిక

ఇవికూడా చూడండి

మూలాలు

బయటి లింకులు

Tags:

పిల్లలమర్రి ఎఱకేశ్వర దేవాలయం స్థానంపిల్లలమర్రి ఎఱకేశ్వర దేవాలయం చరిత్రపిల్లలమర్రి ఎఱకేశ్వర దేవాలయం నిర్మాణ శైలిపిల్లలమర్రి ఎఱకేశ్వర దేవాలయం చిత్రమాలికపిల్లలమర్రి ఎఱకేశ్వర దేవాలయం ఇవికూడా చూడండిపిల్లలమర్రి ఎఱకేశ్వర దేవాలయం మూలాలుపిల్లలమర్రి ఎఱకేశ్వర దేవాలయం బయటి లింకులుపిల్లలమర్రి ఎఱకేశ్వర దేవాలయంకాకతీయతెలంగాణనామేశ్వర దేవాలయం (పిల్లలమర్రి)పిల్లలమర్రిమూసీ నదిశైవముసూర్యాపేట జిల్లా

🔥 Trending searches on Wiki తెలుగు:

కానుగసింగిరెడ్డి నారాయణరెడ్డికాకినాడ లోక్‌సభ నియోజకవర్గంహార్సిలీ హిల్స్సర్పంచిదసరాబాలకాండమిథునరాశిఇంగువభూమిఘట్టమనేని మహేశ్ ‌బాబులలితా సహస్ర నామములు- 1-100రక్త పింజరిమధుమేహంతెలుగు ప్రజలుఇంటి పేర్లుకీర్తి సురేష్అమెరికా రాజ్యాంగంఛత్రపతి (సినిమా)అష్టదిగ్గజములుహెబ్బా పటేల్పరశురాముడుఊరు పేరు భైరవకోనH (అక్షరం)పార్లమెంటు సభ్యుడుప్రధాన సంఖ్యముఖేష్ అంబానీకురుక్షేత్ర సంగ్రామంరాయలసీమసంపన్న శ్రేణితెలుగు సినిమాల జాబితాఅక్కినేని నాగేశ్వరరావు నటించిన సినిమాలుయోగి ఆదిత్యనాథ్బర్రెలక్కగజేంద్ర మోక్షంఅమెరికా సంయుక్త రాష్ట్రాలుసికింద్రాబాద్ జంక్షన్ రైల్వే స్టేషనుట్రూ లవర్కల్వకుంట్ల కవితపక్షవాతంత్యాగరాజుసూర్యుడుఅ ఆభారత స్వాతంత్ర్య సమరయోధులు-జాబితా20వ శతాబ్దం ముందు తెలుగు పల్లెల్లో జీవనశైలిఈశాన్యంవారాహికరోనా వైరస్ 2019తెలుగు కథనయన తారరాయ్‌బరేలి జిల్లాపూనమ్ కౌర్జానీ లీవర్అయోధ్యపాల కూరచార్మినార్సప్త చిరంజీవులుభారతదేశ పంచవర్ష ప్రణాళికలుఉత్తరాషాఢ నక్షత్రముదీపావళిరాధిక కుమారస్వామిజయసుధచిరంజీవి నటించిన సినిమాల జాబితాచతుర్యుగాలుడర్టీ హరితాటిసత్య సాయి బాబాఆంధ్రప్రదేశ్‌లో 2024 భారత సార్వత్రిక ఎన్నికలుసింహంచేతబడిఆశ్రిత దగ్గుబాటిఫ్లోరెన్స్ నైటింగేల్ఆంధ్రప్రదేశ్ లోక్‌సభ నియోజకవర్గాల జాబితాకమల్ హాసన్ నటించిన సినిమాలుకాకతీయుల శాసనాలులైంగిక విద్యకొంపెల్ల మాధవీలతశుక్రుడు జ్యోతిషం🡆 More