స్వాతి నక్షత్రము

Uttara nakshatram 1 padam

ఈ నక్షత్రం వారి గుణగణాలు

స్వాతి నక్షత్రాధిపతి రాహువు. స్వాతి నక్షత్ర నాలుగు పాదాలు తులారాశిలో ఉంటాయి. కనుక ఈ నక్షత్రంలో జన్మించిన వాళ్ళు రాహుప్రభావంతో కల్పనా శక్తి శుక్రప్రభావంతో సౌందర్యారాధనా శక్తి కలిగి కళారంగంలో ప్రభావం చూపగలిగి ఉంటారు. స్వాతి నక్షత్రజాతకులు శాస్త్రజ్ఞులుగా మేధా సంపత్తిని కలిగి ఉంటారు. వీరు శాస్త్రజ్ఞులుగా, అధికారులుగా, మేధావులుగా రాణిస్తారు. స్వాతినక్షత్రం దేవగణం కనుక ధార్మికత, సాత్విక గుణం కలిగి ప్రవర్తిస్తారు. శుక్రుడి ప్రభావం కారణంగా కళలను ఆరాధిస్తారు. ఈ నక్షత్రజాతకులు చిన్న వయసులో దాదాపు 18 సంవత్సరాలు కొన్ని సమస్యలను ఎదుర్కొన్నా యుక్తవయసులో మంచి అభివృద్ధిని సాధిస్తారు. కష్ట కాలపరిమితి నక్షత్రపాదాలను అనుసరించి తగ్గుతూ ఉంటుంది. బాల్యంలో విద్యాభ్యాసానికి కొన్ని ఆటంకాలు ఎదురైనా పట్టుదల వహిస్తే మంచి ఫలితాలు సాధించ వచ్చు. యుక్తవయసులో గురుదశ వస్తుంది కనుక ఆర్థికంగా సామాజికంగా మంచి అభివృద్ధి కలిగి సాధిస్తారు. శని ఈ రాశిలో ఉచ్ఛ స్థితిని పొందుతాడు కనుక, గోచార రీత్యా శని నాలుగు, అయిదు స్థానాల ఆధిపత్యం కారణంగా శని దశ వీరికి యోగిస్తుంది. బుధుడికి ఇది మిత్రరాశి కనుక, గోచార రీత్యా బుధుడు నవమ స్థానాధిపత్యం వహించి యోగకారకుడౌతాడు కనుక బుధ దశ వీరికి యోగిస్తుంది. శుక్ర, రాహువుల ప్రభావం చంద్రుడి శుక్రస్థాన స్థితి కారణంగా, సాత్విక గుణం కారణంగా ఈ రాశి వారు కళారంగ ప్రవేశం చేస్తే సుస్థిరతను సాధించి రాణించే అవకాశాలు ఎక్కువ. బాహ్యంగానూ, గుప్తంగానూ శత్రువులు ఉంటారు. బాహ్యాకర్షణ, అంతర్గత ఆకర్షణ కలిగి ఉంటారు. మార్గదర్శకమైన నడవడి కలిగిఉంటారు. కళాత్మకమైన వస్తు సేకరణ చేస్తారు. ఇతరుల అసూయకు లోను ఔతారు. అకారణమైన నిందకు గురి ఔతారు. ఒక వైపు వాదనలు విని ఏక పక్ష నిర్ణయాలు తీసుకునే కారణంగా అనేకులను దూరం చేసుకుంటారు. దాని వలన కొంత నష్టపోతారు. నిర్ణయాలు తీసుకునే విషయంలో సమాజాన్ని పట్టించుకోరు. సరి అయిన నిర్ణయాలు తీసుకోని కారణంగా కొన్ని సమస్యలు ఎదుర్కొన్నా అభివృద్ధి మాత్రం కుంటు పడదు. దాతృత్వం ప్రోత్సహిస్తారు కాని దానగుణం తక్కువ. ధనం పొదుపుగా ఖర్చు చేస్తారు. జల కారకుడైన శుక్రుడి ప్రభావితం వీరికి విదేశీ యానం, విదేశీ ధనార్జన కలిగిస్తుంది.

నక్షత్రములలో ఇది పదిహేనవది.

నక్షత్రం అధిపతి గణము జాతి జంతువు వృక్షము నాడి పక్షి అధిదేవత రాశి
స్వాతి రాహువు దేవ పురుష మహిషము మద్ది అంత్య వాయువు తుల

స్వాతి నక్షత్ర జాతకుల తారాఫలాలు

తార నామం తారలు ఫలం
జన్మ తార ఆర్ద్ర, స్వాతి, శతభిష శరీరశ్రమ
సంపత్తార పునర్వసు, విశాఖ, పూర్వాభద్ర ధన లాభం
విపత్తార పుష్యమి, అనూరాధ, ఉత్తరా భద్ర కార్యహాని
సంపత్తార ఆశ్లేష, జ్యేష్ట, రేవతి క్షేమం
ప్రత్యక్ తార అశ్విని, మఖ, మూల ప్రయత్న భంగం
సాధన తార భరణి, పూర్వ ఫల్గుణి, పూర్వాషాఢ కార్య సిద్ధి, శుభం
నైత్య తార కృత్తిక, ఉత్తర ఫల్గుణి, ఉత్తరాషాఢ బంధనం
మిత్ర తార రోహిణి, హస్త, శ్రవణం సుఖం
అతిమిత్ర తార మృగశిర, చిత్త, ధనిష్ఠ సుఖం, లాభం

స్వాతి నక్షత్రము నవాంశ

  • 1 వ పాదము - ధనసురాశి.
  • 2 వ పాదము - మకరరాశి.
  • 3 వ పాదము - తులారాశి.

చిత్రమాలిక

వనరులు

Tags:

స్వాతి నక్షత్రము ఈ నక్షత్రం వారి గుణగణాలుస్వాతి నక్షత్రము

🔥 Trending searches on Wiki తెలుగు:

ఇస్లామీయ ఐదు కలిమాలుఖండంఇస్లాం మతంకింజరాపు అచ్చెన్నాయుడుసవర్ణదీర్ఘ సంధిడి.వై. చంద్రచూడ్గూగుల్గౌతమ బుద్ధుడుప్రీతీ జింటాభారత రాజ్యాంగ పీఠికకరోనా వైరస్ 2019జవాహర్ లాల్ నెహ్రూనవగ్రహాలు జ్యోతిషంభారత జాతీయపతాకంజొన్నగాయత్రీ మంత్రంఅయోధ్యభరణి నక్షత్రముధనిష్ఠ నక్షత్రముశ్రీ తిరుపతమ్మ అమ్మవారి దేవస్థానం (పెనుగంచిప్రోలు)ముహమ్మద్ ప్రవక్తపూరీ జగన్నాథ దేవాలయంమిరపకాయభారత రాజ్యాంగ ఆధికరణలుపూర్వాషాఢ నక్షత్రముషడ్రుచులుస్టార్ మామహా జనపదాలుపాల కూరరాగంతాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రిమెరుపురావణుడుఅమృత అయ్యర్రామ్ చ​రణ్ తేజప్రొద్దుటూరుమాదిగఋతువులు (భారతీయ కాలం)కల్పనా చావ్లాసన్ రైజర్స్ హైదరాబాద్సాక్షి (దినపత్రిక)ట్రావిస్ హెడ్నువ్వు నాకు నచ్చావ్వాట్స్‌యాప్అమ్మవిజయనగర సామ్రాజ్యంపిఠాపురంపవన్ కళ్యాణ్త్రిఫల చూర్ణంరాబర్ట్ ఓపెన్‌హైమర్చంద్రయాన్-3అరుణాచలంబైబిల్సజ్జా తేజఅంగచూషణహైదరాబాద్ రేస్ క్లబ్న్యుమోనియాట్రూ లవర్విరాట్ కోహ్లిఅక్కినేని నాగార్జున నటించిన చిత్రాలులిబియాజయలలిత (నటి)అంగుళంపిఠాపురం శాసనసభ నియోజకవర్గంపంచభూతలింగ క్షేత్రాలురామదాసుహోళీకస్తూరి రంగ రంగా (పాట)జ్యోతిషంప్లీహముఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థపేర్ల వారీగా తెలుగు సినిమాల జాబితాపసుపు గణపతి పూజఎఱ్రాప్రగడక్రికెట్శివ కార్తీకేయన్🡆 More