రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ

తెలుగు సాహిత్యపు ఆధునిక వచన శైలీ నిర్మాతలలో అనంతకృష్ణశర్మ (జనవరి 23, 1893 - మార్చి 11, 1979) అగ్రేసరుడు.

విమర్శనా రీతులలో వీరు మార్గదర్శకుడు. అన్నమాచార్యులు వారి కృతులను - కొన్ని వందల కృతులను - ఆయన స్వరపరచి తెలుగువారికి అందించాడు. వేమనపై సాధికారమైన విమర్శ గ్రంథాన్ని వెలువరించాడు. సంగీత సాహిత్యాలు రెండింటిలోనూ సమ స్కందులు. మైసూరు మహారాజా కళాశాలలో ముప్పైఎనిమిది సంవత్సరాలు అధ్యాపకత్వం నిర్వహించేరు. ఏకసంథాగ్రాహిగా పేరు పడినవాడు.

రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మ
రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ
తిరుపతిఅన్నమాచార్య ప్రాజెక్టు నందలి రాళ్ళపల్లి ఫోటో
జననం(1893-01-23)1893 జనవరి 23
రాళ్ళపల్లె గ్రామం, అనంతపురం జిల్లా
మరణం1979 మార్చి 11(1979-03-11) (వయసు 86)
వృత్తిరచయిత, విమర్శకుడు, అధ్యాపకుడు
తల్లిదండ్రులు
  • కర్నమడకల కృష్ణమాచార్యులు (తండ్రి)
  • అలమేలు మంగమ్మ (తల్లి)

బాల్యం

జీవనకాలం: జనవరి 23, 1893 - మార్చి 11, 1979. తల్లిదండ్రులు: అలమేలు మంగమ్మ, కర్నమడకల కృష్ణమాచార్యులు. జన్మస్థలం: అనంతపురం జిల్లా, కంబదూరు మండలం రాళ్లపల్లె గ్రామం. తండ్రి వద్దనే సంస్కృతాంధ్ర భాషలలో ప్రావీణ్యత సంపాదించి, మైసూరు పరకాల మఠంలో ఉన్నత సంస్కృత విద్యను అభ్యసించాడు. ఆయన తల్లి అలివేలు మంగమ్మ సంగీత గురువులు. ఆమె సంస్కృతం, తెలుగు, కన్నడం, తమిళ భాషలలోని భజన కీర్తనలు, పెళ్ళి పాటలు, జోలపాటలు, పూజ పాటలు కథా గేయాలు చిన్ననాడే శర్మగారికి నేర్పింది. మేనమామ గారి ప్రోత్సాహంతో ఫిడేలు వాయించడం నేర్చుకున్నాడు.

సంగీత సాహిత్యాలు

చామరాజునగరం రామశాస్త్రిగారి వద్ద శాకుంతలం, ఉత్తరరామ చరిత్ర, ముద్రా రాక్షసం, అనర్ఘరాఘవం, కాదంబరి వాటిని చదివాడు. సామాజిక స్పృహ వాదులైన నేటి సమాజానికి ఆదర్శప్రాయుడైన వేమన గురించి శర్మగారు తమ వేమనోపన్యాసాలలో అనేక విషయాలు ఆవిష్కరించాడు. నిగమశర్మ అక్క, నాచన సోముని నవీన గుణములు, తిక్కన తీర్చిన సీతమ్మ, రాయలనాటి రసికత అనే ఆయన వ్యాసాలు బాగా ప్రసిద్ధమైనవి. కట్టమంచి రామలింగారెడ్డి గారితో పరిచయం కలిగి, వారి ఆహ్వానం మీద 1912లో మొట్టమొదటిసారిగా ఏర్పరచిన తెలుగు పండిత పదవిని అలంకరించాడు. అప్పటి నుండి తెలుగులో రచనా వ్యాసంగాలు, ఉపన్యాసాలు మొదలుపెట్టాడు. కాళిదాసు రచించిన రఘువంశం ఆంధ్రీకరించాడు. పెద్దన పెద్దతనము అను విమర్శనాత్మక వ్యాసాన్ని రాశాడు. రాళళ

సంగీతప్రియులైన శర్మ కృష్ణప్పగారి వద్ద నాలుగైదు సంవత్సరాలు శాస్తీయసంగీతాన్ని అభ్యసించారు. తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారి చెలికాని అన్నారావు తాళ్ళపాక కవుల కీర్తనల పరిష్కరణ కార్యం నిర్వహించవలసిందిగా ఆయన్ను కోరారు. ఆయన ఏడు సంవత్సరాలు (1950-57) సంకీర్తనలను పరిశీలించి కొన్నింటికి స్వరకల్పన గావించి వాటి గొప్పతనాన్ని చాటాడు. రేడియోకు ఆకాశవాణియని పేరు పెట్టినది ఆయనే.

రాయలసీమ సాహిత్యములో చిరస్థాయిగా నిలిచిపోయే పెనుకొండ - కొండ పాటను రాళ్లపల్లి అనంతకృష్ణశర్మ వ్రాశాడు. ఈ పాటను జ్ఞప్తికి తెచ్చుకోవడం ఇక్కడ సమంజసము.

సత్కారాలు

మైసూరులో జరిగిన 4వ సంగీత సమ్మేళనంలో గాన కళాసింధు బిరుదుతో సత్కరించారు. బెంగుళూరు గాయక సమాజం సంగీత కళారత్న బిరుదుతో సత్కరించింది. కేంద్ర సంగీత నాటక అకాడమీ 1970లో ఫెలోషిప్ నిచ్చి సత్కరించింది. శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం గౌరవ డి.లిట్. పట్టంతో గౌరవించింది. ఆయన 1979, మార్చి 11న పరమపదించాడు. ఆయనకు ఇద్దరు కొడుకులు, ముగ్గురు కూతుర్లు.

ప్రాచుర్యం, వారసత్వం

రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ సంప్రదాయ పాండిత్యానికి, సాహిత్య విమర్శకు గొప్ప పేరొందిన పండితుడు. విశ్వవిద్యాలయాలు వ్యవస్థీకృతమైన దశలో డిగ్రీలు లేని పాండిత్యాన్ని అంగీకరించడం, ఆచార్యత్వాన్ని ఇవ్వడం చేయని విధానాల వల్ల రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ వలె క్షుణ్ణంగా సంప్రదాయ విమర్శ సాహిత్యాన్ని వివేచన చేయగల సమర్థుల సేవలు వినియోగించుకోకపోవడంతో వారి పాండిత్యం నుంచి విశ్వవిద్యాలయ పరిశోధన వ్యవస్థలు ప్రయోజనం పొందలేకపోయాయి. విశ్వవిద్యాలయ వ్యవస్థలోని తెలుగు సాహిత్య విమర్శల్లో ప్రామాణ్యాలు లోపించడం, సంప్రదాయిక సంస్కృత సాహిత్య విమర్శ పద్ధతుల నుంచి ప్రయోజనం పొందకపోవడం వంటివి ఇటువంటి పండితులు విశ్వవిద్యాలయాల్లో కొలువు కాకపోవడం వల్లనే వచ్చిందని సాహిత్య పరిశోధకుడు వెల్చేరు నారాయణరావు పేర్కొన్నాడు.

బాహ్య లింకులు

రాళ్లపల్లి అనంత కృష్ణ శర్మ - జీవిత చరిత్ర

వనరులు

మూలాలు

Tags:

రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ బాల్యంరాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ సంగీత సాహిత్యాలురాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ సత్కారాలురాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ ప్రాచుర్యం, వారసత్వంరాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ బాహ్య లింకులురాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ వనరులురాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ మూలాలురాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ18931979అన్నమాచార్యులుజనవరి 23మహారాజా కళాశాలమార్చి 11మైసూరువేమన

🔥 Trending searches on Wiki తెలుగు:

చార్మినార్అల్లు అర్జున్ఎం. ఎం. కీరవాణిరామోజీరావువిల్హేల్మ్ కన్రాడ్ రాంట్జెన్ఖలిస్తాన్ ఉద్యమంబోదకాలుకమల్ హాసన్ నటించిన సినిమాలువంతెనకుక్కే సుబ్రహ్మణ్య దేవాలయంస్వామి వివేకానందచంద్రగుప్త మౌర్యుడుఅన్నపూర్ణ (నటి)ప్రియురాలు పిలిచిందిబాలగంగాధర తిలక్సుభాష్ చంద్రబోస్తెలుగు కవులు - బిరుదులుకార్తెభారతదేశ పేరు పుట్టుపూర్వోత్తరాలుబగళాముఖీ దేవిమల్లు భట్టివిక్రమార్కఘట్టమనేని కృష్ణశక్తిపీఠాలుతెలుగుగర్భాశయ ఫైబ్రాయిడ్స్క్లోమముభారతరత్నక్వినోవాబాలకాండలగ్నంకల్వకుంట్ల చంద్రశేఖరరావుమాదయ్యగారి మల్లనడేటింగ్శ్రీశైల క్షేత్రంభారత జాతీయగీతంఆనందవర్ధనుడుసరస్వతివిశ్వబ్రాహ్మణఝాన్సీ లక్ష్మీబాయివయ్యారిభామ (కలుపుమొక్క)భద్రాచలంరవి కిషన్తెలంగాణ రాష్ట్ర సమితిసంఖ్యగోధుమషేర్ మార్కెట్తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం (భద్రాచలం)భారతదేశంలో కోడి పందాలుటెలిగ్రామ్రవితేజపంచ లింగాలుపూర్వ ఫల్గుణి నక్షత్రమురాహుల్ గాంధీకూన రవికుమార్కస్తూరి రంగ రంగా (పాట)ప్రజా రాజ్యం పార్టీఎస్. పి. బాలసుబ్రహ్మణ్యంచెట్టుతిరుపతిహస్త నక్షత్రముబైబిల్దృశ్య కళలుపీడనంఇక్ష్వాకులుదాశరథి కృష్ణమాచార్యతిరుమల శ్రీవారి మెట్టువాల్తేరు వీరయ్యభారత కేంద్ర మంత్రిమండలిభారత రాజ్యాంగ పీఠికG20 2023 ఇండియా సమిట్నడుము నొప్పిసంభోగంకె.విశ్వనాథ్దశ రూపకాలుఆదిరెడ్డి భవానితెలుగు సంవత్సరాలుతీన్మార్ మల్లన్న🡆 More