రత్నగిరి జిల్లా: మహారాష్ట్ర లోని జిల్లా

మహారాష్ట్ర లోని జిల్లాలలో రత్నగిరి జిల్లా (హిందీ:रत्नागिरी जिल्हा) ఒకటి.

రత్నగిరి పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది. జిల్లా 11% నగరీకరణ చేయబడి ఉంది. జిల్లా కొంకణ్ డివిషన్‌లో భాగంగా ఉంది.

రత్నగిరి జిల్లా
रत्नागिरी जिल्हा
మహారాష్ట్ర పటంలో రత్నగిరి జిల్లా స్థానం
మహారాష్ట్ర పటంలో రత్నగిరి జిల్లా స్థానం
దేశంభారతదేశం
రాష్ట్రంమహారాష్ట్ర
డివిజనుకొంకణ్
ముఖ్య పట్టణంRatnagiri
మండలాలు1. Mandangad,
2. Dapoli,
3. Khed,
4. Chiplun,
5. Guhagar,
6. Sangameshwar,
7. Ratnagiri,
8. Lanja,
9. Rajapur
Government
 • లోకసభ నియోజకవర్గాలు1. Ratnagiri-Sindhudurg (shared with Sindhudurg district),
2. Raigad (shared with Raigad district) (Based on Election Commission website)
 • శాసనసభ నియోజకవర్గాలు5
Area
 • మొత్తం8,208 km2 (3,169 sq mi)
Population
 (2001)
 • మొత్తం16,96,777
 • Density210/km2 (540/sq mi)
జనాభా వివరాలు
 • అక్షరాస్యత65.13%
ప్రధాన రహదార్లుNH-17, NH-204
Websiteఅధికారిక జాలస్థలి
రత్నగిరి జిల్లా
రత్నగిరి జిల్లా: సరిహద్దులు, చరిత్ర, విభాగాలురత్నగిరి జిల్లా: సరిహద్దులు, చరిత్ర, విభాగాలు
రత్నగిరి జిల్లా: సరిహద్దులు, చరిత్ర, విభాగాలురత్నగిరి జిల్లా: సరిహద్దులు, చరిత్ర, విభాగాలు
రత్నగిరి జిల్లా: సరిహద్దులు, చరిత్ర, విభాగాలు
సముద్రం నుండి సువర్ణదుర్గ్ కోట దృశ్యం, చిప్లూన్ సమీపంలోని కొండలు, మార్లేశ్వర్ జలపాతాలు, రత్నగిరి సమీపంలోని వెల్నేశ్వర్ బీచ్, గణపతిపూలే వద్ద గణేశ దేవాలయం

సరిహద్దులు

జిల్లా పశ్చిమ సరిహద్దులో అరేబియన్ సముద్రం, దక్షిణ సరిహద్దులో సింధుదుర్గ్ జిల్లా, ఉత్తర సరిహద్దులో రాయ్‌గడ్ జిల్లా, సతారా జిల్లా, సాంగ్లి జిల్లా, తూర్పు సరిహద్దులో కొల్హాపూర్ జిల్లా ఉన్నాయి.

చరిత్ర

జిల్లా మాహారాష్ట్రా కొంకణ్ భూభాగంలో ఉంది. కొంకణ్ భూభాగాన్ని మయూర, నల, శిలహరాలు, చాళుఖ్యులు, కదంబాలు, పోర్చుగీసు, మరాఠీలు చివరగా బ్రిట్ష్ పాలకులు పాలించారు. రత్నగిరి జిల్లా 1832లో రూపొందించబడింది. 1948లో సవంత్వాది స్వతంత్ర రాజ్యం ఇండియన్ యూనియన్‌లో విలీనం అయింది. 1956లో బాంబే భూభాగం రత్నగిరి జిల్లాలో భాగంగా మారింది. 1960లో మహారాష్ట్ర రాష్ట్రం రూపొందించిన తరువాత రత్నగిరి జిల్లా మహారాష్ట్ర రాష్ట్రంలో భాగం అయింది. 1981లో రత్నగిరి జిల్లా నుండి కొంతభూభాగం విభజించి సింధుదుర్గ్ జిల్లా రూపొందించబడింది. రత్నగిరి జిల్లాలో 9 తాలూకాలు ఉన్నాయి.

పేరు వెనుక చరిత్ర

రత్న అంటే మరాఠీలో రత్నం అని అర్ధం అలాగే గిరి అంటే పర్వతం. రత్నగిరి అంటే రత్నాల పర్వతం అని అర్ధం. డాక్టర్ అంబేద్కర్, లోకమాన్య తిలక్, వి.డి. సవార్కర్, బాబా పాఠక్, సానే గురూజీ, హుతత్మ, అనంత్ కంహరె, అనేక మంది జాతిరత్నాలను దేశానికి అందించింది కనుక ఇది రత్నగిరి అయిందని భావిస్తున్నారు.

.

విభాగాలు

జిల్లాలో 9 తాలూకాలు ఉన్నాయి:-

3

జిల్లాలో 5 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి :-

5
  1. రత్నగిరి - సింధుదుర్గ్ (పార్లమెంటు నియోజకవర్గం):-రత్నగిరి జిల్లా దక్షిణ ప్రాంతం చిప్లన్, రత్నగిరి, రాజపూర్ నియోజకవర్గాలు, సింధుదుర్గ్ మొత్తం జిల్లా.
  2. రాయ్గడ్ (పార్లమెంటు నియోజకవర్గం) :- రత్నగిరి జిల్లా ఉత్తర ప్రాంతం గుహగర్, దపొలి నియోజకవర్గాలు, పొరుగున ఉన్న రాజ్‌గడ్ ప్రాంతాలు. .

భౌగోళికం

రత్నగిరి జిల్లా కొంకణ్ భూభాగంలోని 6 జిల్లాలలో ఒకటి. జిల్లా 17° డిగ్రీల ఉత్తత అక్షాంశం, 73°19' తూర్పు రృఖాంశంలో ఉంది. జిల్లాలో ప్రధానంగా షస్త్రి, బోర్, ముచ్కుండి, కజలి, సావిత్రి, వాధిష్టి నదులు ప్రవహిస్తున్నాయి. రత్నగిరి నగరం జిల్లా కేంద్రంగా ఉంది. నగరంలో రత్నగిరి కోట, లైట్ హౌస్, గిఒతాభవన్, అక్వేరియం, పిసికల్చర్ కాలేజ్, తిబా ప్యాలెస్, విమానాశ్రయం, రేడియో స్టేషను, టెలివిజన్ స్టేషను ఉన్నాయి. నగరానికి సమీపంలో మిర్జోల్ ఇండస్ట్రియల్ ఎస్టేట్ ఉంది. రత్నగిరి కోటకు ఇరువైపులా ఉన్న రెండు సముద్రతీరాలలో ఒక దానిలో తెల్లని ఇసుక మరొక దానిలో నల్లని ఇసుక ఉండడం విశేషం.

పర్యాటక ఆకర్షణలు

జిల్లాలో గణపతిపులే ష్రీ గణపతి ఆలయం, ఆరె-వారె, మర్లేశ్వర్, కామృశ్వర్ ఆలయాలు మొదలైన పర్యాటక ఆకర్షణలు ఉన్నాయి. వీటిలో అత్యంతసుందర ప్రదేశం రత్నగిరి.

చిప్లాన్ సమీపంలో ఉన్న పరశురామ ఆలయం, గణపతిపులె, పవాస్ అనేకమంది పర్యాటకులను ఆకర్షిస్తుంది. చుప్లిన్ లోని గుహలు, ఖెద్, దభోల్, సంగమేశ్వర్, గౌహని వెల్గౌం, వాడే పడేల్ కూడా ఆకర్షణీయంగా ఉంటాయి. పాపాంచ్, సుదాన్ అప్పాకాసిని మొదలైన ప్రదేశాలు కొంకణ్ భూభాగంలో బుద్ధమత ప్రభావానికి సాక్ష్యంగా నిలిచాయి. కొంకణ్‌లో బుద్ధిజం మత ఆరభంభకాలంలోనే (క్రీ.పూ 560-481) లోనే మొదలైంది. చిప్లిన్, కోల్, పబోల్ గుహలు సర్తావాలాలు (కరవన్- మానవుడు) గురించిన విషయాలను తెలియజేస్తున్నాయి. చుప్లిన్ సమీపంలో సవార్డే వద్ద ఉన్న శివమఠ్ శివాజీ మహరాజ్ కాలంనాటి శిల్పకళావైభవాన్ని చాటి చెప్తుంది. దపోలి తాలూకాలో ఉన్న అగ్రికల్చరల్ యూనివర్శిటీ ప్రధాన ఆకర్షణలలో ఒకటి అని చెప్పవచ్చు.

రాజపూర్ గంగ

రాజపూర్ గంగ ఒక ప్రకృతి దృశ్యం. ఇక్కడ ప్రతి మూడు సంవత్సరాలకు 14 చిన్న నీటి కొలనులు ఏర్పడతాయి. ఇది పవిత్ర గంగాజలం వంటిదని భక్తులు విశ్వసిస్తుంటారు. ఇవి వివిధ ఉష్ణోగ్రతలలో సుమారు 3 అడుగుల లోతు ఉంటాయి. ఇది ఒక భౌగోళిక అద్భుతమని భావిస్తున్నారు.

తిబా ప్యాలెస్

తిబా ప్యాలెస్బ్1910-11 లో నిర్మించబడింది. ఇది దేశబహిష్కరణగావించబడిన బర్మా రాజు- రాణి కొరకు నిర్మించబడింది. వారు ఈ ప్యాలెస్‌లో 1911-1916 వరకు నివసించారు. వారు నివసించిన దానికి గుర్తుగా ఇక్కడ రెండు సమాధిలు ఉన్నాయి. భవిష్యత్తులో ఇక్కడ మ్యూజియం కాని హెరిటేజ్ హోటల్స్ కాని నిర్మించాలని యోచన ఉంది.

మాల్గుండ్

మాల్గుండ్ ప్రముఖ మరాఠీ కవి కేశవ్‌సూత్ జన్మస్థలం. ఇది ఒక చిన్న ప్రశాంతమైన గ్రామం. గణపతిపులే నుండి ఇది 1 కి.మీ దూరంలో ఉంది. కవి వివసించిన గృహం ప్రస్తుతం మరమ్మాత్తులు చేయబడుతుంది. ఇది విద్యార్థుల హాస్టల్‌గా మార్చబడుతుంది. మరాఠీ సాహిత్య పరిషద్ కవి ఙాపకార్ద్జం " కేశవ్సూత్ " పేరిట స్మారక చిహ్నం నిర్మించింది.

వెలాస్ బీచ్

వెలాస్ బీచ్ అన్నీ బీచులలంటిదే అయినా దీనికి ఒక ప్రత్యేకత ఉంది. ప్రతిసంవత్సరం ఇక్కడ ఆలివ్ రైడిల్ తాబేళ్ళు వేలాది మైళ్ళలను దాటి వలస వచ్చి గుడ్లుపెట్టి వెళుతుంటాయి. సముద్రతీరం వెంట ప్రతిసంవత్సరం 20-60 గూళ్ళు కనపిస్తాయి. వెలాస్ తాబేలు ఉత్సవాన్ని రెండు లాభాపేక్షరహిత సంస్థలు (షయాద్రి నిసాగ్రా, కేశవ్ మిత్రా మండలం ) నిర్వహిస్తుంటాయి.

జైగాడ్ కోట

జైగాడ్ కోట :- సంగమృశ్వర్ నదీ ముఖద్వారం వద్ద నిర్మించబడింది. ఇది గణపతి పులే నుండి 25 కి.మీ దూరంలో ఉంది.17వ శతాబ్ధానికి చెందిన ఈ కోట సముద్రతీరంలో ఆకర్ష్ణీయంగా కనిపిస్తుంది. జైగాడ్స్ సీ ఫోర్ట్ షెల్టర్డ్ బేలో ఉంది. ఇక్కడ సముద్రతీరం చిన్నది, సురక్షితమైనది.

పవాస్

పవాస్ రత్నగిరి నగరం నుండి 15 కి.మీ దూరంలో ఉంది. ప్రశాంతమైన ఈ ప్రదేశం సహజ సౌందర్యంతో దీనికి మరొక ప్రత్యేకత కూడా ఉంది. ఇక్కడ స్వరూపానంద్ తన నివాసంగా మార్చుకున్నాడు. అయన నివసించిన ప్రదేశం ప్రస్తుతం ఒక ఆశ్రమంగా మారింది.

వెల్నేశ్వర్

రత్నగిరికి 170 కి.మీ దూరంలో ఉన్న వెల్నేశ్వర్ చిన్న గ్రామం ఇది. ఇక్కడ సముద్రతీరం శుభ్రంగా ఉంటుంది. ఇక్కడ కొబ్బరి చెట్లు బారులు తీరి ఉండి రాళ్ళు లేని ప్రాంతంగా ఉంటుంది కనుక ఈతకు అనుకూలంగా ఉంటుంది. ఇక్కడ ఉన్న " వెల్నేశ్వర్" అనే పురాతన శివాలయం అనేకమంది భక్తులను ఆకర్షిస్తుంది. పరమశివుని నివాసమైన ఈ ప్రాంతం పర్యాటకులకు స్వర్గాన్ని తలపింపజేస్తుంది.

రత్నదుర్గ్

రత్నదుర్గ్ బహమని పాలనా కాలంలో నిర్మించబడింది. తరువాత ఇది ఆదిల్షాహ్ స్వతం అయింది. 1670 శివాజీ ఈ కోటను స్వాధీనపరచుకున్నాడు. 1761లో ఇది సదాశివరావ్ స్వతం అయింది. 1790 లో ధొంబు భాస్కర్ ప్రతిబిధి కోటను పునర్నిర్మించి బలపరిచాడు. తరువాత కోట ఎప్పుడూ ఎలాంటి యుద్ధాలను కాని విధ్వంసాన్ని కాని ఎదుర్కొనలేదు.

గురునాడా కోట

ఈ కోట గురునాడా ఆకారంలో ఉంటుంది. పొడవు 1300 మీటర్లు వెడల్పు 1000 మీటర్లు. కోట మూడు వైపులా సముద్రం ఉంటుంది. నాలుగవ వైపు మాత్రమే భూమి ఉంటుంది. కోటలో ఇప్పటికీ లైట్ హౌస్ ఉంది. ఇక్కడ అందమైన భగవతి ఆలయం ఉంది. ఆలయ సమీపంలో మెట్లబావి ఒకటి ఉంది.

మర్లేశ్వర్ ఆలయం

మార్లేశ్వర్ ఆలయం సయాద్రి కొండమీద ఉంది. ఇక్కడ ఉన్న మర్లేశ్వర్ జలపాతం ప్రధాన పర్యాటక ఆకర్షణగా ఉంది. ఇది మరల్ గ్రామం వద్ద ఉంది. ఇది దియోరుఖ్ గ్రామానికి 16 కి.మీ దూరంలో ఉంది. రత్నగిరి ప్రముఖ విద్యాకేంద్రంగా గుద్తించబడుతుంది. రత్నగిరిలో అందమైన ప్రదేశాలు, వివిధ కాలేజీలు ఉన్నాయి. చిప్లాన్ పలు వద్ద పెద్ద కాలేజీలు ఉన్నాయి. రత్నగిరి కొంకణ భూభాగంలో ఉంది. రత్నగిరి అందమైన ప్రదేశాలకు ప్రసిద్ధి చెంది ఉంది.

2001 లో గణాంకాలు

విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 1,612,672,
ఇది దాదాపు. గునియా - బిస్సౌ దేశ జనసంఖ్యకు సమానం.
అమెరికాలోని. ఇదాహో నగర జనసంఖ్యకు సమం..
640 భారతదేశ జిల్లాలలో. 311వ స్థానంలో ఉంది..
1చ.కి.మీ జనసాంద్రత. 196
2001-11 కుటుంబనియంత్రణ శాతం. -4.96%.
స్త్రీ పురుష నిష్పత్తి. 1123:1000
జాతియ సరాసరి (928) కంటే.
అక్షరాస్యత శాతం. 82.43%.
జాతియ సరాసరి (72%) కంటే.

జిల్లాలో ప్రధానంగా మరాఠీ, కొంకణి భాషలు వాడుకలో ఉన్నాయి.

ప్రముఖులు

రత్నగిరి జిల్లా నలుగురు భారతరత్నాల అవార్డ్ గ్రహీతలకు (ధొండో కేశవ్, లోకమాన్య తిలక్, డాక్టర్ పాండురంగ వమన్ కానే, బి.ఆర్. అంబేద్కర్) స్వస్థలంగా ఉంది.

ప్రయాణసౌకర్యాలు

రత్నగిరి రాష్ట్ర రాజధాని ముంబయితో జాతీయరహదారి 66 (ముందుగా జాతీయరహదారి 17) ద్వారా చక్కగా అనుసంధానమై ఉంది. ఈ రహదారి జిల్లాను గోవా, కర్ణాటక రాష్ట్రంలోని మంగుళూరు లతో అనుసంధానిస్తుంది. రత్నగిరి రైలు మార్గం ముంబయి వద్ద కొంకణి రైలు మార్గంతో కలుస్తుంది.

వాయు మార్గం

రత్నగిరిలో ఒక విమానాశ్రయం నిర్మించబడి ఉన్నాప్పటికీ ఇది వాణిజ్య అవసరాలకు ఉపకరించడం లేదు.

సముద్ర మార్గం

జిల్లా పశ్చిమ సరిహద్దులో అరేబియన్ సముద్రతీరంలో పలు చిన్నచిన్న రేవులు ఉన్నాయి.

See also

  • Malvani

మూలాలు

వెలుపలి లింకులు

వెలుపలి లింకులు

Tags:

రత్నగిరి జిల్లా సరిహద్దులురత్నగిరి జిల్లా చరిత్రరత్నగిరి జిల్లా విభాగాలురత్నగిరి జిల్లా భౌగోళికంరత్నగిరి జిల్లా పర్యాటక ఆకర్షణలురత్నగిరి జిల్లా 2001 లో గణాంకాలురత్నగిరి జిల్లా ప్రముఖులురత్నగిరి జిల్లా ప్రయాణసౌకర్యాలురత్నగిరి జిల్లా మూలాలురత్నగిరి జిల్లా వెలుపలి లింకులురత్నగిరి జిల్లా వెలుపలి లింకులురత్నగిరి జిల్లామహారాష్ట్ర

🔥 Trending searches on Wiki తెలుగు:

వై.యస్. రాజశేఖరరెడ్డిఅభిజ్ఞాన శాకుంతలముభారత రాజ్యాంగంసుందర కాండఆది పర్వముఎన్నికలుతెలుగు వికీపీడియాసంక్రాంతివయ్యారిభామ (కలుపుమొక్క)భారత స్వాతంత్ర్యోద్యమంగూండాఆత్మకూరు శాసనసభ నియోజకవర్గంజవాహర్ లాల్ నెహ్రూమల్లియ రేచనలలిత కళలుచంద్రశేఖర వేంకట రామన్భారత రాజ్యాంగం - ప్రాథమిక విధులుచిత్త నక్షత్రముపంచ లింగాలుభారత రాజ్యాంగ ఆధికరణలుబుజ్జీ ఇలారాహైదరాబాదుమహాభారతంఆవుతెలంగాణమంగ్లీ (సత్యవతి)మహాత్మా గాంధీఉత్తర ఫల్గుణి నక్షత్రముకమల్ హాసన్ నటించిన సినిమాలుశివలింగంపూజా హెగ్డేమేకపాటి చంద్రశేఖర్ రెడ్డిదగ్గు మందుగురువు (జ్యోతిషం)విశాఖ నక్షత్రముఆస్ట్రేలియాగోధుమకేతువు జ్యోతిషంశ్రీదేవి (నటి)తెలుగు సంవత్సరాలుతెలుగు కులాలుఆంధ్రప్రదేశ్ వెనుకబడిన కులాల జాబితాదేవదాసిన్యూటన్ సూత్రాలుగూగుల్పరిటాల రవిహెపటైటిస్‌-బిభారత జాతీయ కాంగ్రెస్జీవన నైపుణ్యంఇంద్రుడుతెలుగు నాటకంశ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లావేడి నీటి బుగ్గనెల్లూరు చరిత్రపాములపర్తి వెంకట నరసింహారావుగోత్రాలుమఖ నక్షత్రముహిమాలయాలువినాయక్ దామోదర్ సావర్కర్జ్యోతిషందాస్‌ కా ధమ్కీబలగంపూర్వాషాఢ నక్షత్రముసీతాదేవిరెండవ ప్రపంచ యుద్ధంభానుప్రియఆతుకూరి మొల్లకె.విజయరామారావుఆటవెలదిరాజోలు శాసనసభ నియోజకవర్గంత్రివిక్రమ్ శ్రీనివాస్నరసింహ శతకముఆదిరెడ్డి భవానిభీష్ముడుకులంరాష్ట్రపతి పాలనతోలుబొమ్మలాటనోటి పుండు🡆 More