మహాయానం అనేది కొన్ని బౌద్ధ సాంప్రదాయాల, గ్రంథాల, తత్వాల, ఆచారాల సమ్మేళనం.
మహాయాన బౌద్ధం సా.శ.పూ 1 వ శతాబ్దం నుంచి ఇది భారతదేశంలో బౌద్ధమతంలో మరో ప్రముఖ శాఖ అయిన థేరవాదంతో పాటు అభివృద్ధి చెందింది. ఈ సాంప్రదాయం ప్రధాన బౌద్ధ గ్రంథాలను, బోధనలకు ఆమోదిస్తుంది. ఆపై మహాయాన సూత్రాలు, బోధిసత్వుని మార్గం, ప్రజ్ఞాపారమిత లాంటి భావనలను చేర్చింది. మంత్ర సాంప్రదాయమైన వజ్రయానం మహాయానంలో ఉపవిభాగం. వజ్రయానంలో కొన్ని తాంత్రిక సాధనలతో బుద్ధతత్వాన్ని చేరుకోవచ్చు.
2010 లో జరిపిన ఒక సర్వే ప్రకారం ప్రస్తుతం ఉన్న బౌద్ధమతావలంబీకులలో సింహ భాగం మహాయాన బౌద్ధ సాంప్రదాయానికి చెందిన వారే (తూర్పు ఆసియా మహాయానం 53%, వజ్రయానం 6%) ఉన్నారు. థేరవాద సాంప్రదాయానికి చెందిన వారు 36%.
మూలాలు
ఆధార గ్రంథాలు
Akira, Hirakawa; Groner, Paul (editor and translator) (1993). A History of Indian Buddhism. Delhi: Motilal Banarsidass.
Lowenstein, Tom (1996). The Vision of the Buddha, Boston: Little Brown, ISBN1-903296-91-9
Schopen, G. "The inscription on the Kusan image of Amitabha and the character of the early Mahayana in India", Journal of the International Association of Buddhist Studies 10, 1990
This article uses material from the Wikipedia తెలుగు article మహాయానం, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). అదనంగా సూచించని పక్షంలో పాఠ్యం CC BY-SA 4.0 క్రింద లభ్యం Images, videos and audio are available under their respective licenses. ®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki తెలుగు (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.