త్వమేవాహం

త్వమేవాహం ఆరుద్ర కలం పేరుతో భాగవతుల సదాశివశంకర శాస్త్రి రాసిన కావ్యం.

ఈ రచన తెలంగాణాలో నిజాం నిరంకుశత్వానికి అద్దంపడుతుంది. "త్వమేవాహం" అనగా ” నువ్వే నేను, నేనే నువ్వు” అని అర్థం. ఆధునిక మహా కావ్య త్రయం లో త్వమేవాహం ఒకటి. ఇది 1948లో రాసిన కావ్యం. మృత్యువు ఒక వ్యక్తితో నువ్వే నేను  అంటుంది. ఒకచోట రచయిత సమాజంలోని ఘటనలను, దృక్పధాలను ఊహాజనితమైన గడియారంతో పోలుస్తాడు.

త్వమేవాహం
ముఖచిత్రం
పుస్తక ముఖచిత్రం
కృతికర్త: ఆరుద్ర
దేశం: భారత దేశము
భాష: తెలుగు
విభాగం (కళా ప్రక్రియ): ఈ రచన తెలంగాణాలో నిజాం నిరంకుశత్వానికి అద్దంపడుతుంది.
ప్రచురణ:
విడుదల: 1948
ముద్రణా సంవత్సరాలు: 1948

నేపథ్యం

1940 దశకంలో తెలంగాణాలో రజాకార్ల ఆకృత్యాలకు బలైపోయిన మహిళల దుస్థితి గురించి కృష్ణ పత్రికలో ప్రచురితమైన వ్యాసాన్ని చదివిన ఆరుద్ర అప్పట్లో చలించిపోయాడు. తెలంగాణాలో రజాకార్లు చేస్తున్న ఆకృత్యాలపై గుండెల్లో పుట్టిన తన ఆవేదనను ఈ కావ్యరూపంలో మలిచాడు. ఈ రచన తెలంగాణాలో నిజాం నిరంకుశత్వానికి అద్దంపడుతుంది. రజాకార్ల ఆకృత్యాలపై రచించిన ఈ "త్వమేవాహం" అనే కావ్యం ఎందరో తెలంగాణావాదులకు స్ఫూర్తినిచ్చింది. తెలంగాణా సాయుధ పోరాటం నేపథ్యంలో వచ్చిన ముఖ్య రచనలలో ఒకటిగా అది నిలిచింది. ఈ కావ్యాన్ని చదివి "నేనిక పద్యాలు రాయకపోయినా ఫరవాలేదు" అని మహాకవి శ్రీశ్రీ అంతటి గొప్ప కవి నుండి ప్రశంసలందుకున్నారంటే ఆ రచన ఎంత ఉన్నతమైందో అర్థం చేసుకోవచ్చు.

సాహిత్యలోకంలో ప్రభంజనంలా దూసుకొచ్చిన ఈ ఈ కావ్యానికి 'తెలంగాణ' అనే శీర్షికను పెట్టాలనుకున్నాడు . అయితే శ్రీశ్రీ ఆ విషయం తెలుసుకొని... ఏనుగుమీద ఏనుగు అని పేరు రాస్తే ఎట్లా ఉంటుందో, ఈ పుస్తకానికి తెలంగాణ అని పేరు పెడితే అట్లాగే ఉంటుంది అని చమత్కరించారట. అప్పుడు 'త్వమేవాహం' అని శీర్షికగా పెట్టారు. శ్రీశ్రీ దానికి టిప్పణి రాస్తూ దానికి “త్వమేవాహం” అనే పేరు సార్ధకంగా ఉంటుందని సూచించారు.

నిజాం నిరంకుశత్వాన్ని నిర్భయం గా ప్రత్యక్షర శిల్పం గా మలిచాడు. అయితే దీనికి టీకా ,టిప్పణి ఉంటేనే చదువరులకు అర్థం అవుతుంది. .అందుకే మొదటి ప్రచురణ జన రంజకం కాలేదు .తర్వాత దాశరధి తో చక్కని ఉపోద్ఘాతం రాయించి ప్రచురించాడు. అతడు నిజం గా ఆరుద్ర హృదయాన్ని అద్భుతం గా ఆవిష్క రించాడు . .అప్పటి నుంచే త్వమేవాహం  చదువరుల హస్తాలను ,మస్తకాలను   అలంకరించింది . హరీంద్రనాథ ఛటోపాధ్యాయ  రాసిన ”తెలంగాణా విప్లవ గాధలు ”     ఆరుద్ర త్వమేవాహం కు ప్రేరణ. దీన్ని ఆరు కధలుగా కూర్చి కదా కావ్యం చేశాడు .ఈ ప్రక్రియ లో ఇదే మొదటిది.

లఘు టిప్పణి - శ్రీశ్రీ

ఈ పుస్తకం యొక్క టిప్పణిలో శ్రీశ్రీ "తెలంగాణ విప్లవం త్వమేవాహం రచనక్ ప్రొద్భలం నిస్సందేహంగా రేపు ఏర్పడబోతున్న సామ్యవాద వ్యవస్థకు త్వమేవాహం పునాది." అని రాసాడు. ఇది తెలంగాణ కావ్యమని రచయిత ఎక్కడా చెప్పలేదు. కానీ కావ్యం నిండా ఈ విషయం తెలుసుకోవడానికి ఎన్నో అవకాశాలిచ్చాడు. ఈ కావ్యానికి కాలమే ప్రధాన వస్తువు.

మూలాలు

Tags:

తెలంగాణభాగవతుల సదాశివశంకర శాస్త్రి

🔥 Trending searches on Wiki తెలుగు:

గ్రామంరంగస్థలం (సినిమా)సిమ్రాన్రాజ్యసభభారతదేశ చరిత్రబలి చక్రవర్తిలగ్నంఎస్. పి. బాలసుబ్రహ్మణ్యంఅంగచూషణఉత్తరాభాద్ర నక్షత్రముధర్మో రక్షతి రక్షితఃభారతీయ సంస్కృతిఆంధ్రప్రదేశ్ జిల్లాల జాబితాజాతీయ అర్హత, ప్రవేశ పరీక్షఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితావృషణంఇంద్రుడుఉగాదిభారత రాజ్యాంగం - ఆదేశిక సూత్రాలునిర్వహణకన్యకా పరమేశ్వరిసుభాష్ చంద్రబోస్చోళ సామ్రాజ్యందశావతారములుపార్లమెంటు సభ్యుడుచంద్రయాన్-3పర్యాయపదంకందుకూరి వీరేశలింగం పంతులుపవన్ కళ్యాణ్రామోజీరావురాయలసీమభారత జాతీయ కాంగ్రెస్శ్రీశైల క్షేత్రంసిద్ధు జొన్నలగడ్డఅండమాన్ నికోబార్ దీవులురేణూ దేశాయ్సూర్యుడువిశాఖపట్నంఅష్టదిక్కులు - దిక్పాలకులు - పట్టణాలుయవలున్యుమోనియాపమేలా సత్పతిఉల్లిపాయతెలంగాణ రాష్ట్ర సమితిఅష్ట దిక్కులుఅరిస్టాటిల్తెలంగాణ గవర్నర్ల జాబితాజయలలిత (నటి)వెబ్‌సైటుదువ్వాడ శ్రీనివాస్అల్లు అర్జున్అమితాబ్ బచ్చన్సునీల్ గవాస్కర్కేదార్‌నాథ్ ఆలయంతెల్ల గులాబీలుఅధిక ఉమ్మనీరుకన్యారాశిగజేంద్ర మోక్షంఎన్నికలుఛార్మీ కౌర్తిక్కనసంస్కృతంరామప్ప దేవాలయంపరిసరాల పరిశుభ్రతశివుడుఆషికా రంగనాథ్మదన్ మోహన్ మాలవ్యాహైదరాబాదు మెట్రో స్టేషన్ల జాబితాగ్యాస్ ట్రబుల్దేవీఅభయంరామాయణంభారత జాతీయగీతంబైబిల్పది ఆజ్ఞలుఅ ఆకర్కాటకరాశికీర్తి రెడ్డివై.యస్.అవినాష్‌రెడ్డి🡆 More