జోలెపాళ్యం మంగమ్మ

జోలెపాళ్యం మంగమ్మ ఆల్ ఇండియా రేడియోలో మొట్టమొదటి మహిళా న్యూస్ రీడర్‌గా ప్రసిద్ధురాలు.

జోలెపాళ్యం మంగమ్మ
జోలెపాళ్యం మంగమ్మ

జీవిత విశేషాలు

ఈమె చిత్తూరు జిల్లా మదనపల్లెలో 1925, సెప్టెంబరు 12న జన్మించింది. ఎం.ఎ., బి.ఎడ్ చదివింది. ఢిల్లీ విశ్వవిద్యాలయం నుండి డాక్టరేట్ పట్టాను పొందింది. ఈమెకు తెలుగు, ఇంగ్లీషు, ఫ్రెంచ్, ఎస్పరాంటో, తమిళ, హిందీ భాషలలో ప్రావీణ్యం ఉంది. ఈమె ఆలిండియా రేడియో న్యూఢిల్లీలో 10 సంవత్సరాలు ఎడిటర్‌గా, న్యూస్ రీడర్‌గా పనిచేసింది. 1962 నుండి నేషనల్ ఆర్కీవ్స్, ఢిల్లీలో పరిశోధనలు చేసింది. బోధనా రంగంలో సుమారు పాతిక సంవత్సరాల అనుభవం సంపాదించింది. ఈమె కేంద్ర సమాచారశాఖ, విదేశాంగశాఖలలో కీలకమైన పదవులను నిర్వహించింది. ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మొదలైన సంస్థలలో జీవిత సభ్యురాలు. ఇంకా ఈమె అనిబీసెంట్‌ ఎడ్యుకేషనల్‌ ట్రస్టు ఉపాధ్యక్షురాలిగా, గాంధీ ఆర్గనైజేషన్‌ ఫర్‌ రూరల్‌ డెవల్‌పమెంట్‌ అధ్యక్షురాలిగా, లోక్‌అదాలత్‌లో సభ్యురాలిగా వివిధ హోదాల్లో సేవలను అందించింది. ఈమె ఇంగ్లీషు, తెలుగు భాషలలో పలు పుస్తకాలను రచించింది. న్యూఢిల్లీ తెలుగు అకాడమీ ఉగాది పురస్కారం, కుప్పం రెడ్డమ్మ సాహితీ పురస్కారం, సిద్ధార్థ కళాపీఠం (విజయవాడ) విశిష్ట అవార్డు మొదలైన సత్కారాలను పొందింది. సరోజినీ నాయుడు అనుయాయిగా ఈమె పేరుగడించింది. ఆంధ్రానైటింగేల్ అనే బిరుదును సంపాదించింది.

రచనలు

తెలుగు

  1. తెలుగులో అచ్చయిన తొలి పుస్తకాలు (1746-1856)
  2. ఆంధ్రదేశంలో క్రైస్తవ మిషనరీల సేవ
  3. ఇండియన్‌ పార్లమెంట్‌
  4. శ్రీ అరబిందో
  5. విప్లవవీరుడు అల్లూరిసీతారామరాజు
  6. అనిబీసెంట్‌

ఇంగ్లీషు

  1. ప్రింటింగ్ ఇండియా
  2. అల్లూరి సీతారామరాజు
  3. లాస్ట్ పాలెగార్ ఎన్‌కౌంటర్ విత్ ది బ్రిటిష్ ఇన్ ది సీడెడ్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, 1846-1847
  4. ది రేట్ స్కూల్స్ ఆఫ్ గోదావరి

మరణం

ఈమె మదనపల్లెలోని తన స్వగృహంలో 2017, ఫిబ్రవరి 1వ తేదీన తన 92వ యేట వృద్ధాప్య సమస్యలతో మరణించింది.

మూలాలు

Tags:

జోలెపాళ్యం మంగమ్మ జీవిత విశేషాలుజోలెపాళ్యం మంగమ్మ రచనలుజోలెపాళ్యం మంగమ్మ మరణంజోలెపాళ్యం మంగమ్మ మూలాలుజోలెపాళ్యం మంగమ్మఆకాశవాణి

🔥 Trending searches on Wiki తెలుగు:

తమన్నా భాటియాబి.ఆర్. అంబేద్కర్అనూరాధ నక్షత్రంకృతి శెట్టికిరణ్ రావుగజము (పొడవు)చోళ సామ్రాజ్యంనారా చంద్రబాబునాయుడుతెలంగాణ లోక్‌సభ నియోజకవర్గాల జాబితాసిద్ధు జొన్నలగడ్డకన్నెగంటి బ్రహ్మానందంపది ఆజ్ఞలుధర్మవరం శాసనసభ నియోజకవర్గంఆంధ్ర విశ్వవిద్యాలయంకాపు, తెలగ, బలిజరమ్యకృష్ణశుభ్‌మ‌న్ గిల్యూట్యూబ్కె. మణికంఠన్బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిశ్రీవిష్ణు (నటుడు)రమణ మహర్షికీర్తి సురేష్చెల్లమెల్ల సుగుణ కుమారి20వ శతాబ్దం ముందు తెలుగు పల్లెల్లో జీవనశైలిసీ.ఎం.రమేష్కర్కాటకరాశిభారత రాజ్యాంగ ఆధికరణలుమశూచిపాలపిట్టపద్మశాలీలుసుస్థిర అభివృద్ధి లక్ష్యాలుకర్ణాటకపాల కూరబలి చక్రవర్తిభారతదేశంలో విద్యరక్తంచార్మినార్చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామిరంగస్థలం (సినిమా)ఆంధ్రప్రదేశ్ మండలాలుగాయత్రీ మంత్రంశ్రీశైలం (శ్రీశైలం మండలం)వ్యతిరేక పదాల జాబితాతిథిపొట్టి శ్రీరాములులవ్ స్టోరీ (2021 సినిమా)రోహిత్ శర్మఅయోధ్య రామమందిరంబరాక్ ఒబామావనపర్తిభారతదేశంశకుంతలదీపావళిబాల్యవివాహాలురెడ్డిచంద్రయాన్-3ఆరోగ్యంకుక్కే సుబ్రహ్మణ్య దేవాలయంగూగుల్వైరస్భారతదేశంలో బ్రిటిషు పాలనభారతీయ రిజర్వ్ బ్యాంక్తాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రిఇస్లామీయ ఐదు కలిమాలునాని (నటుడు)గౌతమ బుద్ధుడుగుడ్ ఫ్రైడేదత్తాత్రేయచిరుధాన్యంగేమ్ ఛేంజర్మహా జనపదాలుఛందస్సువినాయక్ దామోదర్ సావర్కర్హనుమంతుడుమానవ శరీరముబతుకమ్మ🡆 More