జాన్ నేపియర్

లాగరిధమ్స్ గురించి ఎంతోమందికి తెలుసు.

క్లిష్టమైన సమస్యలను త్వరితగతిలో చేయాలంటే ఇప్పటికీ ఎంతో మంది లాగరిధమ్స్ నే ఉపయోగిస్తారు. క్యాలిక్యులేటర్లు, కంప్యూటర్లు వచ్చి లాగరిథంమ్స్ వాడకాన్ని తగ్గించాయి. కాని దాని వైశిష్ట్యాన్ని మాత్రం కొంచెంకూడా తగ్గించలేకపోయాయి. ఈ వేళ ఏ విజ్ఞాన శాస్త్రాన్ని తీసుకున్నా లాగరిథమ్స్ వాడటం తప్పనిసరిగా జరుగుతోంది. అంత ప్రాముఖ్యాన్ని పొందిన లాగరిథమ్స్ సృష్టి కర్త జాన్ నేపియర్.

జాన్ నేపియర్
జాన్ నేపియర్
జాన్ నేపియర్ (1550–1617)
జననం1550
మెర్చిస్టన్ టవర్, ఎడిన్ బర్గ్
మరణంఏప్రిల్,4,1917.
ఎడింబర్గ్
జాతీయతస్కాటిష్
రంగములుగణిత శాస్త్రము
చదువుకున్న సంస్థలుసెయింట్ ఆండ్రూస్ విశ్వవిద్యాలయం
ప్రసిద్ధిలాగరిథమ్స్
నేపియర్ స్కేళ్ళు
దశాంశవిధానము
ప్రభావితులుహెన్రీ బిగ్స్

బాల్యం

ఈయన స్కాట్ లాండ్కు చెందిన గణిత శాస్త్రవేత్త. 1550 లో ఎడిన్ బర్గ్ లో జన్మించాడు. గమ్మత్తు ఏమిటంటే అప్పుడు ఈయన తండ్రి వయస్సు కేవలం 16 సంవత్సరాలే. 13 సంవత్సరాల వయస్సులో నేపియర్ సెయింట్ ఆండ్రూన్ విశ్వవిద్యాలయంలో చేరాడు. కాని డిగ్రీ మాత్రం పుచ్చుకోలేదు. నేపియర్ తరువాతి జీవితం గూర్చి సరిగా తెలియలేదు. బహుశా విదేశాలకు వెళ్ళి ఉండవచ్చని చరిత్రకారుల అభిప్రాయం. 1571 లో నేపియర్ మళ్ళీ జన్మస్థలం చేరుకున్నాడు. 1572 లో పెళ్ళి చేసుకున్నాడు. కొన్నాళ్ళ తరువాత భార్య చనిపోయిందని తరువాత మళ్ళీ పెళ్ళి చేసుకున్నాడని తెలుస్తోంది. ఈయనకు వివాదస్పదమైన విషయాలంటె మహా యిష్ఠం. 1593 లో మతాధికారులగురించి ఒక పుస్తకం రాసాడు.అందులో 1688-1700 మధ్య కాలంలో పోప్ లు ప్రపంచాన్ని నాశనం చేస్తారని రాసాడు. ఈ పుస్తకం ఎంతో గొడవను రేపింది. ఇది 21 సార్లు ప్రచురించబడింది.అందులో పదిసార్లు నేపియర్ జీవిత కాలంలోనే జరగటం విశేషం.

జీవితం

ఆ తరువాత నేపియర్ యుద్ధ పరికరాలు తయారు చేయడంలో నిమగ్నుడయ్యాడు. కాచివేసే దర్పణాలను రెండు రకాల వాటిని రోపొందించాడు. వీటి సాయంతో శత్రువును దెబ్బకొట్టడం తేలికగా ఉండేది. ఒక లోహరథాన్ని తయారుచేశాడు. ఈ రథం పైకి ఎక్కి సురక్షితంగా ఉండి శత్రువుల మీద తుపాకీ తూటాలు వర్షాన్ని కురిపించవచ్చు. ఇంతటి అమోఘమైన నైపుణ్యాన్ని ప్రదర్శించిన నేపియర్ తన ప్రతిభా పాటవాలను గణితంలో కూడా చూపడం మొదలుపొట్టాడు. నేపియర్ రాడ్ అనే పరికరాన్ని తయారు చేసి ఈ పరికరం సాయంతో కూడికలు, తీసివేతలు, వర్గమూలాలు చేయటం చాలా తేలికగ ఉండేది. 1593 నాటికి నేపియర్ లాగరిథమ్స్ ను రంగంలోకి తీసుకుని వచ్చాడు. రకరకాల గణిత విన్యాసాలను అతి తేలికగా అతి తొందరగా చేయటానికి లాగరిథమ్స్ కు మించింది లేకపోయింది. నేపియన్ అంటే లాగరిథమ్స్ అనే ముద్ర పడింది. ఈయన ఏప్రియల్ 4, 1617 న మరిణించాడు.

సేవలు

నేపియర్ గణిత శాస్త్రానికి చేసిన సేవలు తెలియాలంటే "డిస్క్రిప్షన్ ఆఫ్ మార్వెలాన్స్ కానన్ ఆఫ్ లాగరిథమ్స్ " (1614 ప్రచురణ), "కనస్ట్రక్షన్ ఆఫ్ ది మార్వెలాన్స్ కానన్ ఆఫ్ లాగరిథమ్స్ " (1620 ప్రచురణ) సంపుటాలను చూస్తే చాలు గణిత శాస్త్రంలో లాగరిథమ్&శ్ ఒక నవ శకాన్ని సృష్టించింది. ఈ లాగరిథమ్స్ నిలిచియున్నంత కాలం నేపియర్ నిలిచే ఉంటాడు.

చిత్రమాలిక

యివి కూడా చూడండి

Tags:

జాన్ నేపియర్ బాల్యంజాన్ నేపియర్ జీవితంజాన్ నేపియర్ సేవలుజాన్ నేపియర్ చిత్రమాలికజాన్ నేపియర్ యివి కూడా చూడండిజాన్ నేపియర్

🔥 Trending searches on Wiki తెలుగు:

కొమురం భీమ్అబ్యూజాకుక్కశ్రీశైల క్షేత్రంఅన్నపూర్ణ (నటి)విజయనగర సామ్రాజ్యంఎస్. ఎస్. రాజమౌళితెలుగు నెలలుతరిగొండ వెంగమాంబఉగాదిఅల్లు అర్జున్కాన్సర్మఖ నక్షత్రమునాగార్జునసాగర్రాజమండ్రినవగ్రహాలు జ్యోతిషంతెలంగాణ ఆసరా పింఛను పథకంఅల్లూరి సీతారామరాజుప్రభాస్పింగళి సూరనామాత్యుడుపరాగసంపర్కముపొంగూరు నారాయణతెలుగు జర్నలిజంఅర్జున్ దాస్భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుల జాబితాగుణింతంఉబ్బసమురామాయణంఉత్తరాభాద్ర నక్షత్రముపాల్కురికి సోమనాథుడుయూరీ గగారిన్కుంభరాశిబి.ఆర్. అంబేడ్కర్శిబి చక్రవర్తిశ్రీశైలం (శ్రీశైలం మండలం)శ్రీనివాస రామానుజన్సురేఖా వాణికుక్కే సుబ్రహ్మణ్య దేవాలయంవిజయశాంతిరాజనీతి శాస్త్రమునందమూరి బాలకృష్ణకేతువు జ్యోతిషంఆటలమ్మరాశికాలేయంత్రిఫల చూర్ణంపాముఆంధ్రజ్యోతివిభక్తిఅశ్వని నక్షత్రముఅండమాన్ నికోబార్ దీవులుకోటప్ప కొండజూనియర్ ఎన్.టి.ఆర్నవరసాలుఆస్ట్రేలియాజాతీయములునిర్వహణభారతీయ జనతా పార్టీసమ్మక్క సారక్క జాతరఖోరాన్ముస్లిం లీగ్అలెగ్జాండర్ఏ.పి.జె. అబ్దుల్ కలామ్ఛందస్సుపార్శ్వపు తలనొప్పితెలుగు వికీపీడియాజీవన నైపుణ్యంత్రివిక్రమ్ శ్రీనివాస్అన్నమయ్యకల్వకుంట్ల కవితతెలంగాణ దళితబంధు పథకంబ్రాహ్మణులుభూగర్భ జలంప్రాకృతిక వ్యవసాయందీక్షిత్ శెట్టియుద్ధకాండ🡆 More