జాదవ్‌పూర్ విశ్వవిద్యాలయం

జాదవ్‌పూర్ విశ్వవిద్యాలయం (JU ) (Bengali: যাদবপুর বিশ্ববিদ্যালয় ) భారత దేశంలోని ఒక విశ్వవిద్యాలయం , పరిశోధన సంస్థ.

పశ్చిమ బెంగాల్ లోని కలకత్తాలో ఉన్న ఈ యూనివర్సిటీకి రెండు క్యాంపస్ లు ఉన్నాయి- ప్రధాన క్యాంపస్ జాదవ్‌పూర్లో ఉండగా రెండవది అయిన నూతన క్యాంపస్ సాల్ట్ లేక్ ప్రాంతంలో ఉంది. ఇండియన్ అసోసియేషన్ ఫర్ ది కల్టివేషన్ ఆఫ్ సైన్సు, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ బయాలజీ , సెంట్రల్ గ్లాస్ అండ్ సిరామిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వంటి ఎన్నో ప్రముఖ పరిశోధనా సంస్థలతో జాదవ్‌పూర్ విశ్వవిద్యాలయానికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. భారతదేశంలోని అత్యున్నత ఇంజనీరింగ్ కళాశాలలలో ఈ సంస్థ ఒకటిగా ఉంది. "అత్యున్నత ప్రమాణాలు సాధించగలిగే సామర్థ్యం" ఉన్నయూనివర్సిటీలలో ఒకటిగా ఇది యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ చే గుర్తింపు పొందింది. ఇంతే కాక జాదవ్‌పూర్ విశ్వవిద్యాలయం నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడిటేషన్ కౌన్సిల్ చే రెండు సందర్భాలలో ఫైవ్ స్టార్ యూనివర్సిటిగా గుర్తింపును కూడా పొందింది.

దస్త్రం:Jadavpur University Logo.svg
జాదవ్‌పూర్ యూనివర్సిటీ లోగో

చరిత్ర

దస్త్రం:Ju50.PNG
జాదవ్పూర్ విశ్వవిద్యాలయం యొక్క స్వర్ణోత్సవ చిహ్నం

1906లో జాతీయ స్థాయిలో సాహిత్య, శాస్త్రీయ , సాంకేతిక విద్యను అందించే ఉద్దేశంతో నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ను స్థాపించడం జరిగింది. అప్పటి గవర్నర్ జనరల్ లార్డ్ కర్జన్ ఆధ్వర్యంలో ఒకవైపు తూర్పు బెంగాల్ (ఇదే 1971 లో బంగ్లాదేశ్గా మారింది)గా మరో వైపు పశ్చిమ బెంగాల్ , ఒడిషాగా సంస్థానం విడిపోయిన ఈ సంవత్సరం బెంగాల్ చరిత్రలో ఎంతో కీలకమైన సంవత్సరం. ఇదే 1906 సంవత్సరంలో రవీంద్రనాథ్ ఠాగూర్, అరబిందో ఘోష్, రాజా సుబోధ్ చంద్ర మల్లిక్ , బ్రజేంద్ర కిషోర్ రాయ్ చౌదరి వంటి వారు "జాతీయ నియంత్రణలో జాతీయ పద్ధతులలో" పేదలకు విద్యను అందించే ఒక సంస్థను స్థాపించడం ద్వారా బెంగాల్ విభజనను వ్యతిరేకించాలని నిర్ణయించడం జరిగింది. రాష్‌బేహరీ ఘోష్ మొదటి అధ్యక్షుడుగా NCE సంస్థ ప్రారంభించబడింది.

1921 లో భారతదేశంలో కెమికల్ ఇంజనీరింగ్ను ఒక బోధనాంశంగా ప్రవేశపెట్టిన మొదటి సంస్థగా ఈ సంస్థ గుర్తింపు పొందింది. 1940 వరకూ ఈ సంస్థ దాదాపు ఒక స్వతంత్ర విశ్వవిద్యాలయం గానే పనిచేసింది. 1947లో భారతదేశ స్వాతంత్రం తరువాత భారత ప్రభుత్వం యొక్క విధానాలకు అనుగుణంగా పశ్చిమ బెంగాల్ రాష్ట్ర శాసన సభ ఈ సంస్థను 1955 డిసెంబరు 24 న పూర్తి స్వతంత్ర ప్రతిపత్తి గల జాదవ్‌పూర్ విశ్వవిద్యాలయంగా మార్చే ఉద్దేశంతో జాదవ్‌పూర్ యూనివర్సిటీ చట్టం 1955ను చేయడం జరిగింది. అప్పటి నుండి ఈ రోజునే ఈ యూనివర్సిటీ స్నాతకోత్సవం జరపడం జరుగుతుంది.

విశ్వవిద్యాలయ చిహ్నము

తామర రేకులతో ఆవరించబడి ఉన్న మూడు వత్తులతో వెలుగుతున్న దీపం ఈ విశ్వవిద్యాలయ చిహ్నంగా ఉంది. దీపం జ్ఞానానికి చిహ్నం. మూడు వత్తులూ మేధో శిక్షణ, భావోద్వేగాలు , సృజనాత్మకత లను పెంపొందించడం, ఆధ్యాత్మిక అభివృద్ధి లను సూచిస్తాయి. చుట్టూ ఆవరించి ఉన్న తామర రేకులు కళలు , సంస్కృతిని సూచిస్తాయి. రవీంద్రనాథ్ ఠాగూర్ యొక్క శాంతినికేతన్ లోని విశ్వభారతి విశ్వవిద్యాలయంలోని కళా భవన్ లో పనిచేసిన అతి గొప్ప గురువులలో ఒకరు , బెంగాల్ స్కూల్ ఆఫ్ ఆర్ట్ లో ఒక కీలక సభ్యుడు అయిన దివంగత నందన్లాల్ బోస్ చే ఈ చిహ్నం రూపొందించబడింది. 2005 డిసెంబరు 24 న జరిగిన యూనివర్సిటీ స్వర్ణోత్సవ వేడుకల సందర్భంగా 'తెలుసుకోవడం అంటే ఎదగడమే' అనే ఉద్దేశంతో ఒక ప్రత్యేక చిహ్నాన్ని రూపొందించడం జరిగింది. ఇదే సంవత్సరం నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ శతాబ్ది కాలాన్ని కూడా పూర్తి చేసుకుంది.

ఆవరణ

జాదవ్‌పూర్ విశ్వవిద్యాలయం రెండు పట్టణాలలో క్యాంపస్ లను కలిగి ఉండగా వీటిలో ఒకటి జాదవ్‌పూర్ (58 ఎకరాలు) లోను మరిఒకటి సాల్ట్ లేక్ (26 ఎకరాలు) లోను ఉన్నాయి. జాదవ్పూర్ లో పని చేయకుండా ఉన్న నేషనల్ ఇన్స్త్రుమెంట్స్ అనే CSIR ను స్వాధీనం చేసుకోవడం ద్వారా దేశంలో ఈ విధంగా చేసిన మొదటి యూనివర్సిటీగా ఇది పేరు పొందింది. ప్రధాన క్యాంపస్ అయిన జాదవ్పూర్ లో జాదవ్పూర్ విశ్వవిద్యాలయ కేంద్ర లైబ్రరీ , బ్లూ యర్త్ వర్క్ షాప్ తో పాటు ఇంజనీరింగ్, సైన్సు , ఆర్ట్స్ కు సంబంధించిన చాలా వరకు శాఖలు ఉన్నాయి. ఐదు ఇంజనీరింగ్ విభాగాలు సాల్ట్ లేక్ క్యాంపస్ నుండి పని చేస్తాయి. సాల్ట్ లేక్ క్యాంపస్ లోని ప్రధాన మైదానాన్ని బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ కు లీజుకు ఇవ్వడంతో ఇక్కడ అనేక రాష్ట్ర స్థాయి , వివిధ రాష్ట్రాల మధ్య క్రికెట్ పోటీలు తరచుగా జరుగుతుంటాయి. కొత్తగా వచ్చిన నేషనల్ ఇన్స్త్రుమెంట్స్ క్యాంపస్ లో ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ , టెలికమ్యునికేషన్ తో సహా వివిధ శాఖలకు కొత్తగా పరిశోధనాశాలలు నిర్మించే స్థలం సమకూరుతుందని భావిస్తున్నారు.

జాదవ్పూర్ విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉన్న ప్రత్యేక సంస్థలు

  • జాదవ్పూర్ విద్యాపీట్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్
  • ఇన్స్టిట్యూట్ ఆఫ్ బిజినెస్ మేనేజమేంట్
  • జె. డి.బిర్లా ఇనిస్టిట్యూట్
  • మెరైన్ ఇంజనీరింగ్ అండ్ రిసెర్చ్ ఇనిస్టిట్యూట్ (ఇది తిరిగి ఇండియన్ మారిటైం యూనివర్సిటీకి తిరిగి అనుబంధం కానుంది)

శ్రేణీకరణలు

ఐఐటిలు తప్ప చాలా వరకు భారత ఇంజనీరింగ్ కళాశాలలు దిగువపట్టభద్ర బోధన పై ప్రధానంగా దృష్టి పెడుతుండగా జాదవ్‌పూర్ విశ్వవిద్యాలయం మాత్రం తన పరిశోధనా కార్యక్రమాలకు పేరు పొందటమే కాక తన ఇంజనీరింగ్ విభాగం లోని పరిశోధనల ఫలితాలలో భారతదేశంలోనే 6వ స్థానంలో ఉంది.

ఈ విశ్వవిద్యాలయం సాధించిన మరికొన్ని ర్యాంకులు ఇలా ఉన్నాయి.

  • జాదవ్‌పూర్ విశ్వవిద్యాలయం ఐఏఎస్ 2009 యొక్క 6వ ర్యాంకును సాధించింది. [1] or [2]
  • ఈ విశ్వవిద్యాలయం యొక్క ఇంజనీరింగ్ , టెక్నాలజీ విభాగం 2009లో దేశంలోనే 10వ స్థానాన్ని పొందింది. (మింట్ సి-ఫోర్) [3]
  • ఈ విశ్వవిద్యాలయం యొక్క ఇంజనీరింగ్ , టెక్నాలజీ విభాగం 2009 లో దేశంలోనే 12 వ స్థానాన్ని పొందింది. (అవుట్ లుక్) [4]
  • ఇంజనీరింగ్ , టెక్నాలజీ విభాగం దేశంలోనే 11వ స్థానాన్ని (ఇండియాటుడే 2007) పొందింది. [5]
  • ఆర్ట్స్ విభాగము భారతదేశంలో 29వ స్థానాన్ని పొందింది. (ఇండియాటుడే 2008)
  • ఇంజనీరింగ్ , టెక్నాలజీ విభాగం దేశంలోనే 11 వ స్థానాన్ని (ఇండియాటుడే 2007) పొందింది.[6]

ప్రముఖ అధ్యాపకులు

  • త్రిగుణ సేన్- (మెకానికల్ ఇంజనీరింగ్)- 'జాదవ్పూర్ విశ్వవిద్యాలయ పిత',యూనివర్సిటీ మొదటి రెక్టర్ , ఉపకులపతి, తదుపరి బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం ఉపకులాధిపతి, రాజ్య సభ సభ్యులు, విద్య, పెట్రోలియం, బొగ్గు , ఖనిజాల శాఖకు కేంద్ర మంత్రి, పద్మ భూషణ్ అవార్డు గ్రహీత.
  • అమర్త్యా సేన్ (ఎకనామిక్స్)- గతంలో కేంబ్రిడ్జ్ లోని ట్రినిటీ కాలేజ్ అధిపతి , అల్ఫ్రెడ్ నోబెల్ సంస్మరణార్థం ఆర్థిక శాస్త్రంలో ఇచ్చే బ్యాంకు ఆఫ్ స్వీడన్ బహుమతి గ్రహీత.
  • బుద్ధదేబ్ బసు (సమకాలీన సాహిత్యం)- బెంగాలీ కవి, నాటక కర్త,నవలా రచయిత, అనువాదకులు , వ్యాసకర్త, సమకాలీన సాహిత్య విభాగ స్థాపకులు (ఇది భారతదేశంలోనే పూర్తి స్థాయి సాహిత్య విభాగం కావడం మాత్రమే కాక ఆసియా లోనే ఇది ఇటువంటి మొదటి విభాగం), సాహిత్య అకాడమి అవార్డు గ్రహీత, రబీంద్ర పురస్కారం , పద్మ భూషణ్.
  • డేవిడ్ మెక్ కచియన్ (సమకాలీన సాహిత్యం)- ప్రొఫెసర్ , సమకాలీన సాహిత్య విభాగంలో రీడర్, ఇంగ్లీష్ లో భారతీయ రచనల అధ్యయనానికి ఆద్యుడు.
  • సుధింద్రనాథ్ దత్త (సమకాలీన సాహిత్యం)- ప్రముఖ బెంగాలీ కవి, అనువాదకులు , పండితులు.
  • సుబోద్ చంద్ర సేన్ గుప్త (ఇంగ్లీష్)- ప్రముఖ పండితులు , విమర్శకులు.
  • అలోక్ రంజన్ దాస్ గుప్త- [7] (సమకాలీన సాహిత్యం)- కవి, గోథె మెడల్,సాహిత్య అకాడమి , ఆనంద పురస్కారం.
  • శంఖ ఘోష్ (బెంగాలి)- బెంగాలీ కవి, రెండు సార్లు సాహిత్య అకాడమీ అవార్డ్ గ్రహీత, రబీంద్ర పురస్కారం, దేశికోత్తమ.
  • సుకుమారి భట్టాచార్జీ (సంస్కృతము , సమకాలీన సాహిత్యం)- ప్రముఖ చరిత్రకారులు , వైదిక సంస్కృతి , హిందుత్వ వ్యాఖ్యాత.
  • అజిత్ దత్త (బెంగాలి)- బెంగాలీ కవి
  • నబనీత దేవ్ సేన్ (సమకాలీన సాహిత్యం)- ట్రావెలోగ్ లు, కథానికలు , పద్య రచయిత, సాహిత్య అకాడమి , పద్మశ్రీ అవార్డు గ్రహీత.
  • మానబేంద్ర బందోపాధ్యాయ (సమకాలీన సాహిత్యం)- అనువాదకులు ,సాహిత్య అకాడమి అవార్డు గ్రహీత.
  • అమియ దేవ్ (సమకాలీన సాహిత్యం)- విద్యాసాగర్ యూనివర్సిటీ ఉప కులపతి
  • స్వపన్ మజుందార్ (సమకాలీన సాహిత్యం)- శాంతినికేతన్ లోని రబీంద్ర భవన్ యొక్క పూర్వ అధ్యక్షులు
  • శిబాజి బందోపాధ్యాయ (సమకాలీన సాహిత్యం)- ప్రముఖ విమర్శకులు , బెంగాలి సాహిత్య చరిత్రకారులు
  • కేటకి కుశారి డైసన్ (ఆంగ్లం)- విద్యావిషయక , సృజనాత్మక రచయిత, ఆనంద పురస్కార గ్రహీత (రెండు సార్లు)
  • మాలిని భట్టాచార్య (ఆంగ్లం)- స్త్రీవాద కార్యకర్త , పండితురాలు, గతంలో లోక్ సభ సభ్యురాలు, జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు
  • సుకాంత చౌధురి (ఆంగ్లం)- ప్రముఖ సాంస్కృతిక పునరుజ్జీవన పండితులు, టాగోర్ అనువాదకులు
  • సుప్రియా చౌధురి (ఆంగ్లం)- ప్రముఖ సాంస్కృతిక పునరుజ్జీవన పండితులు, టాగోర్ అనువాదకులు
  • స్వపన్ చక్రవర్తి (ఆంగ్లం)- భారత జాతీయ గ్రంథాలయ సంచాలకులు
  • ఆనంద దేబ్ ముఖర్జీ (జియాలజీ)- ప్రముఖ శాస్త్రవేత్త
  • ఆనంద లాల్ (ఆంగ్లం)- టాగోర్ అనువాదకులు , నాటక విమర్శకులు
  • ఇందిరా చౌధురి (ఆంగ్లం)- కన్సల్టెంట్ ఆర్చైవిస్ట్, టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రిసెర్చ్, ముంబై; రబీంద్ర పురస్కార గ్రహీత
  • రిమి బి. ఛటర్జీ (ఆంగ్లం)- వోడాఫోన్ క్రాస్ వర్డ్ బుక్ అవార్డుకు షార్ట్ లిస్టు అయిన నవలా రచయిత , అనువాదకులు
  • శంకర్ ఛటర్జీ (జియాలజీ)- డైనోసార్ శకం ముగింపుకి, భారత దేశానికి ఉన్న సంబంధం పై ప్రపంచమంతటా చర్చకు తెరతీసిన బెంగాలీ భౌగోళిక శాస్త్రవేత్త , శిలాజాల అధ్యయనవేత్త

ప్రముఖ పూర్వ విద్యార్ధులు

సుబీర్ రాహ భారత ఆయిల్ రంగంలో ముఖ్యంగా ప్రభుత్వ రంగంలో తనదైన ముద్రను చూపించిన వ్యాపారవేత్త. గతంలో ఆయిల్ , నాచురల్ గ్యాస్ కమిషన్కు ఛైర్మన్ గా , మేనేజింగ్ డైరెక్టర్ గా పనిచేసారు.

కబీర్ సుమన్ (గతంలో సుమన్ చటోపాధ్యాయ) వైవిధ్య బెంగాలీ గాయకులు-స్వరకర్త- పాటల రచయిత, తృణమూల్ కాంగ్రెస్ నుండి లోక్ సభకు ఎంపికైన పార్లమెంట్ సభ్యులు

ఋతుపర్ణ ఘోష్ అనేక జాతీయ అవార్డులు గెలుచుకున్న సినిమా దర్శకులు, మాటలు , స్క్రీన్ ప్లే రచయిత

మౌషుమి భౌమిక్ బెంగాలీ గాయకులు-స్వరకర్త- పాటల రచయిత , సాంప్రదాయ సంగీత విద్వాంసులు

సోహిని హల్దార్ ప్రముఖ బెంగాలీ నాటక నటి , జాతీయ అవార్డు పొందిన సినిమా నటి.

పరమిత మండల్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా లోని అర్బానా-చామ్పైన్ లో ఉన్న యూనివర్సిటీ ఆఫ్ ఇల్లినాయిస్లో అసిస్టెంట్ ప్రొఫెసర్

కునాల్ బసు నవలా రచయిత , సెడ్ బిజినెస్ స్కూల్లో ప్రొఫెసర్

సిద్ధార్థ దత్త జాదవ్పూర్ విశ్వవిద్యాలయం ఉప కులపతి

చిరంజిబ్ భట్టాచార్జీ జాదవ్పూర్ విశ్వవిద్యాలయoలో కెమికల్ ఇంజనీరింగ్ విభాగంలో ప్రొఫెసర్

దేబాసిష్ సర్కార్ కలకత్తా విశ్వవిద్యాలయం కెమికల్ ఇంజనీరింగ్ విభాగంలో అధ్యాపకులు

పాయల్ సర్కార్ జాదవ్పూర్ విశ్వవిద్యాలయం చరిత్ర శాఖ నుండి పట్టభద్రురాలైన ఈమె ఒక బెంగాలీ నటి.

ఇది కూడా చూడండి

వివరణ

వెలుపలి లింకులు

Tags:

జాదవ్‌పూర్ విశ్వవిద్యాలయం చరిత్రజాదవ్‌పూర్ విశ్వవిద్యాలయం విశ్వవిద్యాలయ చిహ్నముజాదవ్‌పూర్ విశ్వవిద్యాలయం ఆవరణజాదవ్‌పూర్ విశ్వవిద్యాలయం జాదవ్పూర్ విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉన్న ప్రత్యేక సంస్థలుజాదవ్‌పూర్ విశ్వవిద్యాలయం శ్రేణీకరణలుజాదవ్‌పూర్ విశ్వవిద్యాలయం ప్రముఖ అధ్యాపకులుజాదవ్‌పూర్ విశ్వవిద్యాలయం ప్రముఖ పూర్వ విద్యార్ధులుజాదవ్‌పూర్ విశ్వవిద్యాలయం ఇది కూడా చూడండిజాదవ్‌పూర్ విశ్వవిద్యాలయం వివరణజాదవ్‌పూర్ విశ్వవిద్యాలయం వెలుపలి లింకులుజాదవ్‌పూర్ విశ్వవిద్యాలయంBengali languageకలకత్తాజాదవ్‌పూర్పశ్చిమ బెంగాల్భారత దేశంయూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్విశ్వవిద్యాలయం

🔥 Trending searches on Wiki తెలుగు:

గాయత్రీ మంత్రంవారాహిరోజా సెల్వమణివృత్తులుతెలుగునాట జానపద కళలుబమ్మెర పోతనకాశీతెలుగు వికీపీడియాచరవాణి (సెల్ ఫోన్)మంతెన సత్యనారాయణ రాజుయతి2014 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుసత్య సాయి బాబాశ్రీనివాస రామానుజన్దివ్యభారతిఅశ్వత్థామభారతదేశంపన్ను (ఆర్థిక వ్యవస్థ)దశరథుడుతాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రివిభక్తిశ్రవణ కుమారుడుశ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయం (వేములవాడ)సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్భద్రాచలంధనూరాశిపుష్యమి నక్షత్రముసాక్షి (దినపత్రిక)ఇక్ష్వాకులుదూదేకులవై.ఎస్.వివేకానందరెడ్డి హత్యకుంభరాశిబొడ్రాయిఆరోగ్యంజూనియర్ ఎన్.టి.ఆర్కస్తూరి రంగ రంగా (పాట)ట్విట్టర్ఫ్యామిలీ స్టార్హనుమజ్జయంతిభువనేశ్వర్ కుమార్తేటగీతితెలుగు భాష చరిత్రతెలుగు విద్యార్థిమెదక్ లోక్‌సభ నియోజకవర్గం2009 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుకృత్తిక నక్షత్రముకార్తెఉగాదిపేర్ని వెంకటరామయ్యజగ్జీవన్ రాంతెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకడియం కావ్యపెరిక క్షత్రియులుLభీష్ముడుగౌతమ బుద్ధుడుస్త్రీవాదంరాజంపేట శాసనసభ నియోజకవర్గంజిల్లేడుజీమెయిల్హైదరాబాదు లోక్‌సభ నియోజకవర్గందిల్ రాజుమీనాక్షి అమ్మవారి ఆలయంజాంబవంతుడునువ్వులుగూగుల్అభిమన్యుడురాకేష్ మాస్టర్భారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులురైతునవగ్రహాలుబ్రాహ్మణులుసుస్థిర అభివృద్ధి లక్ష్యాలుపి.వి.మిధున్ రెడ్డిఅవకాడోతీన్మార్ మల్లన్నతెలంగాణ చరిత్ర🡆 More