ఘాజియాబాద్: ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం లోని నగరం

ఘాజియాబాద్ ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో ఎగువ గంగా మైదానంలో ఉన్న నగరం.

జాతీయ రాజధాని ప్రాంతంలో భాగం. ఇది ఘాజియాబాద్ జిల్లా ముఖ్యపట్టణం, పశ్చిమ ఉత్తర ప్రదేశ్‌లో అతిపెద్ద నగరం. దీని జనాభా 17,29,000. నగర పరిపాలనను మునిసిపల్ కార్పొరేషను నిర్వహిస్తుంది. ఘాజియాబాద్ మునిసిపల్ కార్పొరేషన్‌ను 5 జోన్‌లుగా విభజించారు - సిటీ జోన్, కవి నగర్ జోన్, విజయ్ నగర్ జోన్, మోహన్ నగర్ జోన్, వసుంధర జోన్. మున్సిపల్ కార్పొరేషనులో 100 వార్డులున్నాయి. రోడ్లు, రైల్వేల ద్వారా నగరానికి చక్కటి రవాణా సౌకర్యం ఉంది. ఇది ఉత్తర భారతదేశంలో ప్రధానమైన రైలు జంక్షన్. దీనిని కొన్నిసార్లు "ఉత్తర ప్రదేశ్ ముఖద్వారం" అని పిలుస్తారు. సిటీ మేయర్స్ ఫౌండేషన్ సర్వేలో ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో రెండవదిగా నగరాన్ని పేర్కొంది. ఈ నగరాన్ని హిండన్ నది రెండుగా విభజిస్తోంది. అవి పశ్చిమాన ఉన్న ట్రాన్స్-హిండన్, తూర్పున ఉన్న సిస్-హిండన్.

ఘాజియాబాద్
మెట్రో నగరం
ఘాజియాబాద్: చరిత్ర, జనాభా, వాతావరణం
ఘాజియాబాద్: చరిత్ర, జనాభా, వాతావరణంఘాజియాబాద్: చరిత్ర, జనాభా, వాతావరణం
ఘాజియాబాద్: చరిత్ర, జనాభా, వాతావరణంఘాజియాబాద్: చరిత్ర, జనాభా, వాతావరణం
ఘాజియాబాద్: చరిత్ర, జనాభా, వాతావరణం
పైనుండీ సదిశలో:
ఇందిరాపురం, షిప్రా మాల్, క్లాక్ హౌస్, హిండన్ విమానాశ్రయం, కౌశాంబి, ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజిమెంట్ టెక్నాలజీ
Nickname: 
ఉత్తర ప్రదేశ్ ముఖద్వారం
Map of Ghaziabad
Map of Ghaziabad
ఘాజియాబాద్
ఉత్తర ప్రదేశ్ పటంలో నగర స్థానం
Coordinates: 28°40′N 77°25′E / 28.67°N 77.42°E / 28.67; 77.42
దేశంభారతదేశం
రాష్ట్రంఉత్తర ప్రదేశ్
జిల్లాఘాజియాబాద్
Founded byఘాజీయుద్దీన్
Area
 • Total210 km2 (80 sq mi)
Elevation
214 మీ (702 అ.)
Population
 (2011 census provisional data)
 • Total17,29,000
 • Density8,200/km2 (21,000/sq mi)
Demonymఘాజియాబాదీ
భాషలు
 • అధికారికహిందీ
Time zoneUTC+5:30 (IST)
PIN
201 XXX
టెలిఫోన్ కోడ్91-120

చరిత్ర

ఘాజియాబాద్: చరిత్ర, జనాభా, వాతావరణం 
ఘాజియాబాద్ లోని ఢిల్లీ గేట్,

ఘాజియాబాద్ నగరాన్ని సా.శ 1740 లో ఘాజీ-ఉద్-దీన్ స్థాపించాడు. అతను మొగలు చక్రవర్తి ముహమ్మద్ షా ఆస్థానంలో మంత్రిగా ఉండేవాడు. అతని పేరు మీద "ఘాజీయుద్దీన్ నగర్" అని దీనికి పేరు పెట్టాడు. 1864 లో రైల్వేలు మొదలైనపుడు అది ప్రస్తుత పేరుకు మారింది. మొగలుల కాలంలో ఘాజియాబాద్, ముఖ్యంగా ఘాజియాబాద్ లోని హిండన్ ఒడ్డు, మొగలు రాజ కుటుంబానికి పిక్నిక్ స్థలంగా ఉండేది.

సయ్యద్ అహ్మద్ ఖాన్ ప్రారంభించిన సైంటిఫిక్ సొసైటీ, ఇక్కడి విద్యా ఉద్యమానికి ఒక మైలురాయిగా పరిగణిస్తారు. ఢిల్లీ, లాహోర్ లను కలిపే సింధ్, పంజాబ్, ఢిల్లీ రైల్వే ఘాజియాబాద్ ద్వారా వెళ్తుంది. దాన్ని కూడా అదే సంవత్సరంలో ప్రారంభించారు. 1870 లో అమృత్సర్ - షహరాన్పూర్ మార్గం పూర్తికావడంతో ఘాజియాబాద్ కూడలిగా మారింది

జనాభా

2011 జనాభా లెక్కల ప్రకారం ఘాజియాబాద్ నగర సముదాయంలో జనాభా 23,58,525. అందులో పురుషులు 12,56,783, ఆడవారు 11,01,742. అక్షరాస్యత 93.81%. కాన్పూర్ తరువాత ఉత్తర ప్రదేశ్‌లో ఇది రెండవ అతిపెద్ద పారిశ్రామిక నగరం.

మతం

72.93% మందితో హిందూ మతం అత్యంత ప్రాచుర్యం పొందింది. తరువాత 25.35% ముస్లింలు, 0.41% మంది క్రైస్తవులు, 0.49% సిక్కులూ ఉన్నారు. సుమారు 0.07% మంది బౌద్ధులు, 0.35% జైనులు కూడా ఉన్నారు.. ఘాజియాబాద్‌లో హిందువుల కోసం ఇస్కాన్ ఆలయం, ముస్లింలకు జామా మసీదు, క్రైస్తవులకు హోలీ ట్రినిటీ చర్చి, సిక్కులకు శ్రీ గురు సింగ్ సభ గురుద్వారా వంటి అనేక మతపరమైన ప్రదేశాలు ఉన్నాయి.

వాతావరణం

హిమాలయాలు, కుమావున్ గర్హ్వాల్ కొండలలో కురిసే మంచు, రాజస్థాన్ ఎడారిలో రేగే దుమ్ము తుఫానులు నగర శీతోష్ణస్థితిపై ప్రభావాన్ని చూపుతాయి. రుతుపవనాలు జూన్ చివరిలో లేదా జూలై మొదటి వారంలో వస్తాయి. సాధారణంగా అక్టోబరు వరకు వర్షం పడుతుంది.

రవాణా

రోడ్డు

జాతీయ రహదారి 24 ఘాజియాబాద్ గుండా పోతుంది..

రైలు

ఘాజియాబాద్ జంక్షన్ రైల్వే స్టేషన్ ద్వారా దేశం లోని పలు ప్రాంతాలకు చక్కటి రైలు సౌఉకర్యం ఉంది.

విమానాలు

హిండాన్ దేశీయ విమానాశ్రయం ఘాజియాబాద్‌కు సేవలు అందించే విమానాశ్రయం, ఇది 2019 అక్టోబరులో కార్యకలాపాలు ప్రారంభించింది. సమీప అంతర్జాతీయ విమానాశ్రయం ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం.

మూలాలు

Tags:

ఘాజియాబాద్ చరిత్రఘాజియాబాద్ జనాభాఘాజియాబాద్ వాతావరణంఘాజియాబాద్ రవాణాఘాజియాబాద్ మూలాలుఘాజియాబాద్ఉత్తర భారతదేశంఉత్తరప్రదేశ్ఘాజియాబాద్ జిల్లాజాతీయ రాజధాని ప్రాంతం (భారత దేశం)

🔥 Trending searches on Wiki తెలుగు:

పల్లెల్లో కులవృత్తులుమాధవీ లతచింతామణి (నాటకం)సింధు లోయ నాగరికతడొక్కా మాణిక్యవరప్రసాద్భారత రాజ్యాంగ సవరణల జాబితామహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పధకంభారతదేశ ప్రధానమంత్రిఓటుస్త్రీయన్టీ రామారావు నటించిన సినిమాల జాబితాభారత రాజ్యాంగ ఆధికరణలుత్రిఫల చూర్ణంయోగి ఆదిత్యనాథ్పిత్తాశయముశ్రీదేవి (నటి)2023 తెలంగాణ శాసనసభ ఎన్నికలుసాయిపల్లవిశ్రీ కృష్ణదేవ రాయలుపరశురాముడుఏప్రిల్ 26ఆంధ్రప్రదేశ్ రాష్ట్రీయ చిహ్నాలు.పరిపూర్ణానంద స్వామిఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీయువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీకేతిరెడ్డి వెంకటరామిరెడ్డిచంద్రుడుచిరుధాన్యంనువ్వుల నూనెజాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్దశావతారములుకంప్యూటరుగ్రామ పంచాయతీదగ్గుబాటి వెంకటేష్చంపకమాలనన్నెచోడుడుచాళుక్యులువిజయ్ దేవరకొండవిశ్వబ్రాహ్మణఅమెజాన్ ప్రైమ్ వీడియోఅల్లసాని పెద్దనవాట్స్‌యాప్మహామృత్యుంజయ మంత్రంఇజ్రాయిల్కన్యకా పరమేశ్వరికాటసాని రామిరెడ్డిమహాత్మా గాంధీసెక్స్ (అయోమయ నివృత్తి)భారత రాజ్యాంగం - ఆదేశిక సూత్రాలుషిర్డీ సాయిబాబాకన్యారాశిభారత ఆర్ధిక వ్యవస్థతిరుపతిపది ఆజ్ఞలుసుమతీ శతకముక్వినోవాపురాణాలుద్విపదసీతాదేవితొట్టెంపూడి గోపీచంద్మిథునరాశిగోవిందుడు అందరివాడేలేరాజీవ్ గాంధీఅశ్వని నక్షత్రముపిఠాపురం శాసనసభ నియోజకవర్గంఉత్తరాషాఢ నక్షత్రముసిద్ధు జొన్నలగడ్డపుష్కరంబ్రాహ్మణ గోత్రాల జాబితాధర్మంతెలుగు భాష చరిత్రపూరీ జగన్నాథ దేవాలయంకుక్కే సుబ్రహ్మణ్య దేవాలయంసన్ రైజర్స్ హైదరాబాద్2024 భారతదేశ ఎన్నికలు🡆 More