కాళరాత్రీ దుర్గా

కాళరాత్రీ దుర్గాదేవి నవదుర్గల్లో ఏడవ అవతారం.

కాళీ, మహాకాళీ, భధ్రకాళీ, భైరవి, మృత్యు, రుద్రాణి, చాముండా, చండీ, దుర్గా వంటి అమ్మవారి అవతారాలలో ఈ కాళరాత్రీదేవి కూడా ఒకరు. నవరాత్రుల  ఏడవ రోజు అయిన ఆశ్వీయుజ శుద్ధ సప్తమినాడు ఈ అమ్మవారిని పూజిస్తారు. దేవి పురాణములో దుర్గా దేవిని సర్వాంతర్యామి , సర్వలోకాల్లో , సర్వజీవులలో ఆమె నివసిస్తుంది .

కాళరాత్రీ దుర్గా
కాళరాత్రీ దుర్గాదేవి

చరిత్ర

ఆశ్వయుజ శుక్ల పక్ష పాడ్యమి నుండి తొమ్మిది దినములు ( నవరాత్రి ) భక్తులు దుర్గా దేవిని శక్తి దేవతగా తొమ్మిది అవతారాలను పూజిస్తారు. దేవిభాగవతములో దుర్గాదేవి చరిత్ర ఉన్నది. దుర్గాదేవి నవరత్నమణి దీపకాంతులతో ప్రకాశించే లోకంలో , వేదములలో చెప్పినట్లు సింహవాహనారూఢ ఆయన దుర్గాదేవిప్రకాశిస్తుంది. దుర్గాదేవిని శివుని లో మిగిలిన సగం ఆకారంగా భావిస్తారు. సింహం స్వారీ చేయడం కనిపిస్తుంది. సింహం శక్తిని సూచిస్తుండగా, దుర్గాదేవిని త్రియాంబకే అని పిలుస్తారు, అనగా అగ్ని ,సూర్యుడు, చంద్రుడు ఆమె కళ్లలో ప్రకాశిస్తుంటారు . దుర్గా అనే పదం అంటే కష్టములనుంచి ప్రజలను రక్షించేది . ప్రపంచములో సర్వోనుత్తమైన శక్తి దుర్గ దేవి .

కాళరాత్రి దుర్గాదేవి : స్వరూపము చూచటకు మిక్కిలి భయానకము, ఈమె నాసికాశ్వాసప్రశ్వాసలు భయంకరములైన అగ్నిజ్వాలలను కలిగి ఉంటాయి . ఈమె వాహనము గాడిద ( గార్దభము), తన ఒక కుడిచేతి వరముద్ర ద్వారా అందఱికిని వరములను ప్రసాదించుచుండును. మఱియొక కుడిచేయి అభయముద్రను కలిగియుండును. ఒక ఎడమచేతిలో ఇనుప ఆయుధమును ( వజ్రాయుధం ), మఱొక ఎడమచేతిలో ఖడ్గమును ధరించియుండును. ఈమె ఎల్లప్పుడును శుభఫలములనే ప్రసాదించుచుండును. అందువలన ఈమెను శుభంకరి అని అందురు. కాళరాత్రి దుర్గ దుష్టులను అంతమొందించును. ఈమెను స్మరించినంత మాత్రముననే రాక్షసులు భూతప్రేతపిశాచములు భయముతో పారిపోవును , ఈమె యనుగ్రహమున గ్రహబాధలు తొలగిపోవును. కాళరాత్రి దుర్గను ఉపాసించువారికి అగ్ని, జలము, జంతువులు, భయముగాని, శత్రువుల భయముగాని, ఏ మాత్రమును ఉండవు. భయవిముక్తులగుదురు. కాళరాత్రిమాత దేవి సర్వశుభంకరి. ఈమెను ఉపాసించువారికి కలుగు శుభములు అనంతములు. మనము నిరంతరము ఈమె స్మరణ ధ్యానములను, పూజలను చేయుట ఇహపర ఫలసాధకము.

భారతదేశము లో దుర్గా దేవి పూజలు

నవరాత్రి అనేది చెడుపై మంచి విజయాన్ని జరుపుకునే పండుగ, భారతదేశం అంతటా వివిధ రకాలుగా జరుపుకుంటారు. దేవి భక్తులు ఉపవాసాలు పాటిస్తారు, డాండియా , గార్బా వేడుకలు , దుర్గా పూజ జరుపుకుంటారు, ఇది బెంగాలీల పండుగ. ప్రజలు చాలా సందర్భాలలో కాశీ, కాళరాత్రి ఒకటేనని ప్రజలు అనుకున్నా, ఇది కాదు. దేవిని కాళరాత్రి దుర్గా భీకర రూపంగా పరిగణించబడుతుంది. కాళరాత్రి దుర్గాదేవిని రాక్షసులు, అన్ని ప్రతికూల శక్తులను నాశనం చేసే వ్యక్తిగా పేర్కొంటారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రములోనే గాక , భారత దేశము లో వివిధ రాష్ట్రములలో ఢిల్లీ,, గుజరాత్, , మహారాష్ట్ర, , జమ్మూ & కాశ్మీర్, గువహతి, ఉత్తర ప్రదేశ్,, హిమాచల్ ప్రదేశ్, బీహార్ , తమిళ నాడు , ఆంధ్ర ప్రదేశ్ , తెలంగాణ , కర్ణాటక , కేరళ రాష్ట్రాలలో చాల వేడుకగా , వారి సంప్రదాయం ప్రకారముగా దుర్గా దేవిని ఎన్నో రూపాలుగా పూజిస్తారు

మూలాలు

Tags:

దుర్గాదేవిసప్తమి

🔥 Trending searches on Wiki తెలుగు:

ఋగ్వేదంమాధవీ లతట్రావిస్ హెడ్వై.ఎస్.వివేకానందరెడ్డిఅ ఆభారత ఆర్ధిక వ్యవస్థఅక్కినేని నాగార్జునసాలార్ ‌జంగ్ మ్యూజియంఇంద్రుడుఉప రాష్ట్రపతివేయి స్తంభాల గుడిశాసనసభకరోనా వైరస్ 2019జ్యేష్ట నక్షత్రంసెక్స్ (అయోమయ నివృత్తి)లావు శ్రీకృష్ణ దేవరాయలుభారత రాజ్యాంగ పీఠికఆర్యవైశ్య కుల జాబితాసిద్ధు జొన్నలగడ్డవర్షంకుక్కే సుబ్రహ్మణ్య దేవాలయంఎన్నికలుఅష్ట దిక్కులుబాలకాండవిష్ణువుశ్యామశాస్త్రిసప్తర్షులుదక్షిణామూర్తిఆంధ్రప్రదేశ్ నదులు, ఉపనదులుజై శ్రీరామ్ (2013 సినిమా)రౌద్రం రణం రుధిరంశ్రవణ కుమారుడుఆంధ్ర విశ్వవిద్యాలయంత్రిష కృష్ణన్తమిళ భాషతెలంగాణ రాష్ట్ర సమితిరష్మి గౌతమ్సుభాష్ చంద్రబోస్నూరు వరహాలుచంద్రగిరి శాసనసభ నియోజకవర్గంక్వినోవావెలిచాల జగపతి రావుభీమా (2024 సినిమా)ఉష్ణోగ్రతహనుమంతుడుసంస్కృతంఅమెరికా సంయుక్త రాష్ట్రాలుసింహరాశిబైండ్లస్వాతి నక్షత్రముసురేఖా వాణిమహేంద్రగిరివడదెబ్బకీర్తి సురేష్లలితా సహస్రనామ స్తోత్రంకేంద్రపాలిత ప్రాంతంవృషభరాశిపోకిరిభారత జాతీయ కాంగ్రెస్శ్రీముఖిరాప్తాడు శాసనసభ నియోజకవర్గంమహమ్మద్ సిరాజ్కూచిపూడి నృత్యంనన్నయ్యవిజయ్ (నటుడు)ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీఝాన్సీ లక్ష్మీబాయి2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలునవరత్నాలుదివ్యభారతిడిస్నీ+ హాట్‌స్టార్టెట్రాడెకేన్గర్భిణి స్త్రీలు తీసుకోవలసిన జాగ్రత్తలుశ్రీ సత్యనారాయణస్వామి దేవస్థానం (అన్నవరం)పాలకొండ శాసనసభ నియోజకవర్గంఎఱ్రాప్రగడ🡆 More