అంట్యాకుల పైడిరాజు: చిత్రకారుడు, శిల్పి

అంట్యాకుల పైడిరాజు విజయనగరం జిల్లాకు చెందిన ప్రముఖ చిత్రకారుడు, శిల్పి.

అంట్యాకుల పైడిరాజు
అంట్యాకుల పైడిరాజు: జీవిత చరిత్ర, పైడిరాజు చిత్రపటాలు, పైడిరాజు చెక్కిన శిల్పాలు
అంట్యాకుల పైడిరాజు చిత్రకారుడు, శిల్పి
జననంనవంబర్ 1, 1919
మరణం1986 డిసెంబరు 26
విశాఖపట్నం
నివాస ప్రాంతంవిజయనగరం జిల్లా
ప్రసిద్ధిచిత్రకారుడు , శిల్పి.
తండ్రిరాజయ్య,
తల్లినరసమ్మ

జీవిత చరిత్ర

ఇతడు నవంబర్ 1, 1919న బొబ్బిలిలో రాజయ్య, నరసమ్మ దంపతులకు జన్మించాడు. అన్నయ్య అప్పారావు చిత్రకారుడు కావడం వల్ల పైడిరాజు అతడిని అనుకరించి చిన్నప్పటి నుండే సుద్దముక్కతో చూసిన ప్రతి బొమ్మనీ నేలమీద చిత్రించడం అలవాటయింది.

విజయనగరం మహారాజా కళాశాలలో ప్రాథమిక విద్యనభ్యసించాడు. అక్కడి నాటక లలిత సంగీత పోటీలలో వివిధ బహుమతులు గెలుచుకున్నాడు. 1940-1944లో మద్ర్రాసు ప్రభుత్వ చిత్రకళాశాలలో డిప్లమా పొందాడు. ప్రముఖ బెంగాలీ చిత్రకారుడు, శిల్పి, దేవీప్రసాద్ రాయ్ చౌదరి పైడిరాజు గురువు.

పైడిరాజు 1949లో విజయనగరములో చిత్రకళాశాలను నెలకొల్పాడు. పైడిరాజు చిత్రాలు లండన్, పోలెండ్, ఆఫ్ఘనిస్తాన్, రష్యా, అమెరికా, సింగపూర్ లకు చెందిన ప్రభుత్వ, ప్రయివేటు ఆర్ట్ గ్యాలరీలలో వెలుగులీనుతున్నాయి. విజయనగరంలో బొడ్డు పైడన్న, పి.ఎల్.ఎన్. రాజు విగ్రహాలు, వైజాగ్ బస్ స్టాండు దగ్గర వున్న గురజాడ అప్పారావు విగ్రహం మొదల్గునవి పైడిరాజు చేసినవే.

అనాటమీ స్కెచెస్ వేయడంలో పైడిరాజు అందెవేసిన చేయి. తైలవర్ణ చిత్రరచనలో ఇతనిది ఒక ప్రత్యేకశైలి. ఇతడు చిత్రించిన 'పేరంటం', 'అలంకరణ', 'బొట్టు' మున్నగు అద్భుత కళాఖండాలు కేంద్ర లలితకళా అకాడమీ బహుమతులు గెల్చుకున్నాయి.

భారతీయత, ఆంధ్రత్వం, అధివాస్తవికత, క్యూబిజం ఇతని చిత్రాలలో జీవకళగా ఉట్టిపడుతూ ఉంటాయి.

1977లో ఆంధ్ర విశ్వ కళాపరిషత్ ఆహ్వానాన్ని మన్నించి లలితకళా విభాగ ఆచార్యులయ్యారు. చిత్రకళా శిరోవిభూషణ, కళా ప్రపూర్ణ గౌరవాలందుకున్నారు. బోగి జగన్నాధరాజు, అబ్బూరి గోపాలకృష్ణ, కేతినీడి, వేదుల రాజ్యలక్ష్మి, శ్యామా కౌండిన్య, ద్వివేదుల సోమనాథశాస్త్రి మొదలగు వారెందరో పైడిరాజు శిష్యులు.

కవిత్వంలో కూడా చక్కని అభినివేశం గల పైడిరాజు 1986 సంవత్సరంలో డిసెంబరు 26న విశాఖపట్నంలో మరణించాడు.

పైడిరాజు చిత్రపటాలు

  • పేరంటం,
  • అలంకరణ,
  • బొట్టు,
  • స్నానానంతరం,
  • తిలకం,
  • అలంకరణ,
  • సంతకు

పైడిరాజు చెక్కిన శిల్పాలు

ఇతర విశేషాలు

  • "ఆకాశ శిల్పాలు" - అనేది పైడిరాజు రచించిన పుస్తకం.
  • "పిపాస - అంట్యాకుల పైడిరాజుగారి జీవిత చరిత్ర" - అనే పుస్తకాన్ని ద్వివేదుల సోమనాథశాస్త్రి రచించాడు.
  • పైడిరాజు జీవితము, చిత్రాల గురించి సంజీవ్‌దేవ్ "A. Paidiraju" అనే ఆంగ్ల రచన చేశాడు.
  • పైడిరాజు కొడుకు అంట్యాకుల రాజేశ్వరరావు కూడా ఒక ప్రసిద్ధ చిత్రకారుడు

మూలాలు

Tags:

అంట్యాకుల పైడిరాజు జీవిత చరిత్రఅంట్యాకుల పైడిరాజు పైడిరాజు చిత్రపటాలుఅంట్యాకుల పైడిరాజు పైడిరాజు చెక్కిన శిల్పాలుఅంట్యాకుల పైడిరాజు ఇతర విశేషాలుఅంట్యాకుల పైడిరాజు మూలాలుఅంట్యాకుల పైడిరాజుచిత్రకారుడువిజయనగరం

🔥 Trending searches on Wiki తెలుగు:

ప్రస్తుత భారత ముఖ్యమంత్రుల జాబితాగోవిందుడు అందరివాడేలేఅక్కినేని నాగ చైతన్యసలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్బమ్మెర పోతనతెలంగాణకాకతీయులుభీమా (2024 సినిమా)గరుడ పురాణంరామావతారంలావు రత్తయ్యతెలంగాణ శాసనమండలిబోయ వారి గోత్రాలుఅణాగురజాల శాసనసభ నియోజకవర్గంసిద్ధార్థ్కేదార్‌నాథ్ ఆలయంనువ్వు నాకు నచ్చావ్ఆర్టికల్ 370చాట్‌జిపిటిలలితా సహస్రనామ స్తోత్రంవడదెబ్బధనూరాశిహనుమంతుడుతెలంగాణ గవర్నర్ల జాబితామాధవియువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీప్రియురాలు పిలిచిందిఆవేశం (1994 సినిమా)ఘట్టమనేని కృష్ణసజ్జల రామకృష్ణా రెడ్డిఊరు పేరు భైరవకోనవేంకటేశ్వరుడునక్షత్రం (జ్యోతిషం)వాయు కాలుష్యంషిర్డీ సాయిబాబాకె. అన్నామలైఆత్మకూరు శాసనసభ నియోజకవర్గంవిష్ణువు వేయి నామములు- 1-1000అగ్నికులక్షత్రియులురావి చెట్టుఅనుపమ పరమేశ్వరన్ప్లీహమువిశ్వామిత్రుడుపండుఅమిత్ షాద్వారకా తిరుమలగజేంద్ర మోక్షంతిక్కనసెక్స్ (అయోమయ నివృత్తి)తిరుపతిఅక్షయ తృతీయఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితాబతుకమ్మబాలకాండపరశురాముడుప్రేమమ్శ్రీ తిరుపతమ్మ అమ్మవారి దేవస్థానం (పెనుగంచిప్రోలు)కన్యారాశిఎస్. జానకిహైదరాబాదు మెట్రో స్టేషన్ల జాబితారాజంపేట లోక్‌సభ నియోజకవర్గంబ్రహ్మంగారి కాలజ్ఞానంహిందూపురం లోక్‌సభ నియోజకవర్గంగుంటూరుపెద్దమ్మ ఆలయం (జూబ్లీహిల్స్)తెలంగాణ ఉన్నత న్యాయస్థానంభారత ఆర్ధిక వ్యవస్థశ్రీలలిత (గాయని)కె. జె. ఏసుదాసుతొలిప్రేమకీర్తి సురేష్రజాకార్లుయన్టీ రామారావు నటించిన సినిమాల జాబితాచేతబడితెలుగు సినిమాలు 2023రక్తందినేష్ కార్తీక్🡆 More