సర్ జోసెఫ్ జాన్ థామ్సన్

సర్ జోసఫ్ జాన్ థాంసన్ (18 డిశెంబరు 1856 - 1940 ఆగస్టు 30) అనే వ్యక్తి అంగ్ల భౌతిక శాస్త్రవేత్త.  ఇతను లండన్ లోని రాయల్ సొసైటీకి ఎన్నికయ్యారు.1884 లో కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయ గ్రంథాలయానికి కావెండిష్ భౌతిక శాస్త్ర ప్రయోగాత్మక ఆచార్యునిగా నియమించబడ్డారు.

సర్ జోసెఫ్ జాన్ థామ్సన్
జేజే థామ్సన్‌

జేజే థామ్సన్‌, ఎలక్ట్రాన్‌ ఉనికిని కనుక్కున్న బ్రిటిష్‌ శాస్త్రవేత్త. ఎలక్ట్రాన్‌ శాస్త్ర సాంకేతిక రంగాల్లో అద్భుతమైన విప్లవాన్ని తీసుకొచ్చింది. 'ఎలక్ట్రానిక్స్‌' అనే శాస్త్రాన్ని మన ముందుకు తెచ్చింది. ఇతని పూర్తి పేరు సర్‌ జోసెఫ్‌ జాన్‌ థామ్సన్‌. విజ్ఞానశాస్త్రంలో అత్యున్నతమైన 'నోబెల్‌'ను తాను అందుకోవడమే కాకుండా, తన మార్గదర్శకత్వంలో కుమారుడికి, మరో ఎనిమిది మంది శాస్త్రవేత్తలకు నోబెల్‌ లభించేలా చేసిన ఘనత ఈయనదే.

థామ్సన్‌ 1856లో డిసెంబర్‌ 18న ఇంగ్లాండులోని మాంచెస్టర్‌లో పుట్టాడు. నాన్న పాత గ్రంథాల వ్యాపారి అవడంతో చిన్నప్పటి నుంచే దొరికిన పుస్తకమల్లా చదివేవాడు. తండ్రి కోరికపై ఇంజనీరింగ్‌ కళాశాలలో చేరాడు. పదహారేళ్ళ వయసులోనే తండ్రిని కోల్పోయినా స్కాలర్‌షిప్‌లతో దాన్ని పూర్తిచేశాడు. ఆపై భౌతిక శాస్త్రంపై ఇష్టం పెంచుకున్నాడు. పరిశోధనలే ధ్యేయంగా లండన్‌లోని కేవిండిష్‌ లాబోరేటరీలో పరిశోధకునిగా చేరాడు. చేరిన కొన్నాళ్లకే ఆ సంస్థ హెడ్‌గా మారాడు. అప్పటికి అతడి వయస్సు కేవలం 24 ఏళ్లు. ఆ పదవిలో 34 ఏళ్ల పాటు కొనసాగాడు.

పదార్థంలో పరమాణువే విభజించలేని కణమని భావించే ఆ కాలంలో పరమాణువులో ఎలక్ట్రాన్‌ అనే కణం ఉంటుందని చెప్పి సంచలనం సృష్టించాడు. క్రీస్తుకు పూర్వమే గ్రీకు శాస్త్రవేత్తలు విద్యుచ్ఛక్తిని ఊహించి రుణావేశం, ధనావేశం అనే రెండు విద్యుదావేశాలు ఉంటాయని చెప్పారు. అంతకు మించి దాని గురించి ఎవరికీ తెలియదు. 19వ శతాబ్దంలో విలియమ్‌ క్రూక్‌ అనే శాస్త్రజ్ఞుడు కేథోడ్‌ కిరణాలను కనుక్కున్నాడు. ఆ కేథోడ్‌ కిరణాలకు విద్యుత్‌, అయస్కాంత క్షేత్రాలను అన్వయించి ఆ కిరణాలు రుణావేశముండే అతి తేలికైన కణాల ప్రవాహమని థామ్సన్‌ నిర్ధారించాడు. విశ్వంలోని ద్రవ్యంలో రుణ విద్యుదావేశముండే అతి తేలికైన ప్రాథమిక కణం అదేనని ప్రకటించి థామ్సన్‌ దానికి ఎలక్ట్రాన్‌ అని పేరు పెట్టాడు. ఎలక్ట్రాన్‌ను కనుగొన్నందుకు 1906లో థామ్సన్‌కు నోబెల్‌ వచ్చింది. థామ్సన్‌ కుమారుడు జె.పి.థామ్సన్‌ ఎలక్ట్రాన్‌కి తరంగ స్వభావాన్ని ఆపాదించి, 1937లో నోబెల్‌ అందుకున్నాడు.

మార్పు

మూలాలు

Tags:

కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంభౌతిక శాస్త్రము

🔥 Trending searches on Wiki తెలుగు:

పంచభూతలింగ క్షేత్రాలుఅయోధ్యవిడదల రజినిసింహంఅష్ట దిక్కులురాప్తాడు శాసనసభ నియోజకవర్గంకంప్యూటరురాకేష్ మాస్టర్తెలంగాణ ఉద్యమంక్రిక్‌బజ్సోనియా గాంధీనాగార్జునకొండమామిడికామసూత్రమరణానంతర కర్మలువైఫ్ ఆఫ్ రణసింగంజే.సీ. ప్రభాకర రెడ్డిశాసనసభ సభ్యుడుజెర్రి కాటుభారత రాజ్యాంగం - ప్రాథమిక విధులుమేషరాశితామర పువ్వుపురుష లైంగికతచాట్‌జిపిటికాపు, తెలగ, బలిజబలగంఅమెరికా సంయుక్త రాష్ట్రాలుభారత రాజ్యాంగ సవరణల జాబితాఋతువులు (భారతీయ కాలం)కల్వకుంట్ల చంద్రశేఖరరావుమొహమ్మద్ రఫీ ( ప్రొఫెసర్ )యవలుకొమురం భీమ్గజము (పొడవు)అక్కినేని నాగేశ్వరరావు నటించిన సినిమాలుఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీవ్యాసుడుసావిత్రి (నటి)రాజ్యసభమారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డిపోషకాహార లోపందాశరథి కృష్ణమాచార్యసింగిరెడ్డి నారాయణరెడ్డిఆంధ్రప్రదేశ్ శాసనసభ నియోజకవర్గాల జాబితానవధాన్యాలుఉగాదిశెట్టిబలిజఇత్తడికీర్తి రెడ్డిభారత రాజ్యాంగ ఆధికరణలుతెలుగు భాష చరిత్రలావు శ్రీకృష్ణ దేవరాయలుపేర్ని వెంకటరామయ్యమానవ హక్కులుధనిష్ఠ నక్షత్రముపది ఆజ్ఞలుకుతుబ్ షాహీ సమాధులుఆల్ఫోన్సో మామిడితెలంగాణ జాతరలుకుతుబ్ మీనార్రంగనాథస్వామి దేవాలయం (శ్రీరంగం)భారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులుశతభిష నక్షత్రముతీన్మార్ సావిత్రి (జ్యోతి)సంధ్యావందనంనయన తారకబడ్డీహైదరాబాదువస్తు, సేవల పన్ను (జీఎస్టీ)ఎఱ్రాప్రగడమానవ శరీరమురైలునేనే మొనగాణ్ణిదాశరథి రంగాచార్యచేవెళ్ళ లోక్‌సభ నియోజకవర్గంభీష్ముడునువ్వులుకామినేని శ్రీనివాసరావు🡆 More