1911 ఢిల్లీ దర్బారు పతకం

భారతదేశానికి కొత్త చక్రవర్తిని ప్రకటించినపుడు ఢిల్లీ దర్బారు జ్ఞాపకార్థం యునైటెడ్ కింగ్‌డమ్ నెలకొల్పిన పతకాలను ఢిల్లీ దర్బారు పతకాలు అంటారు.

వీటిని రెండు సందర్భాలలో - 1903 లో ఎడ్వర్డ్ VII రాజైనపుడు ఒకసారి, మళ్ళీ 1911 లో జార్జ్ V రాజైన సందర్భంలో రెండోసారి ఈ పతకాలను ప్రదానం చేసారు. ఇవి ఒకటిన్నర అంగుళాల వ్యాసం కలిగి, బంగారు, వెండి రెండింటి తోనూ ప్రదానం చేసారు. వీటిని ఎడమ ఛాతీపై పట్టాభిషేకం, జూబ్లీ పతకాలతో పాటు తేదీ క్రమంలో ధరిస్తారు. దీన్ని ఒకటిన్నర అంగుళాల వెడల్పు ఉన్న రిబ్బనుకు తగిలిస్తారు. ఈ రాయల్ స్మారక పతకాలు 1918 నవంబరు వరకు ప్రచార పతకాల కంటే ముందు ధరించారు. ఆ తర్వాత ధరించే క్రమాన్ని మార్చి, ప్రచార పతకాల తర్వాత, సుదీర్ఘ సేవా పురస్కారాలకు ముందూ ఈ దర్బారు పతకాలను ధరించారు.

Delhi Durbar Medal, 1911
1911 ఢిల్లీ దర్బారు పతకం 1911 ఢిల్లీ దర్బారు పతకం
Obverse and reverse of 1911 Durbar Medal
TypeCommemoration medal
Awarded forParticipation in Durbar or broader service to the Indian Empire
అందజేసినవారుUnited Kingdom and British Raj
Established1911
Total200 gold and 26,800 silver medals
1911 ఢిల్లీ దర్బారు పతకం
Ribbon bar
ఢిల్లీ దర్బారు పతకం 1911
1911 ఢిల్లీ దర్బారు పతకం 1911 ఢిల్లీ దర్బారు పతకం
1911 దర్బారు పతకం ముందూ వెనుకా
Typeస్మారక పతకం
Awarded forదర్బారులో ఉండడం లేదా భారత సామ్రాజ్యానికి విస్తృతమైన సేవ
అందజేసినవారుయునైటెడ్ కింగ్‌డమ్, బ్రిటిష్ రాజ్
Established1911
Total200 బంగారు, 26,800 వెండి పతకాలు
1911 ఢిల్లీ దర్బారు పతకం
రిబ్బన్ పట్టీ

ఢిల్లీ దర్బారు పతకం, 1911

బొమ్మ వైపు: కిరీటంతో ఉన్న కింగ్ జార్జ్ V, క్వీన్ మేరీ ముఖాలు గులాబీల పూల దండలో ఎడమ వైపున ఉంటాయి.వెనక వైపు: పర్షియన్ భాషలో ఒక లెజెండ్ ఉంటుంది. దీని అర్థం - బ్రిటిష్ సామ్రాజ్య ప్రభువు, భారత చక్రవర్తి అయిన జార్జ్ V దర్బారు. ఈ పతకంపై పేరేమీ లేకుండా ప్రదానం చేయబడింది.

పాలక అధిపతులు, ఉన్నత స్థాయి అధికారులకు బహూకరించేందుకు రెండు వందల బంగారు పతకాలను తయారు చేసారు. 30,000 వెండి పతకాలు ముద్రించగా, వాటిలో 26,800 పౌర ప్రముఖులకు, ప్రభుత్వ అధికారులకు ప్రదానం చేసారు. వీటిలో 10,000 పతకాలను బ్రిటిషు, భారతీయ సైనికాధికారులకు, సైనికులకూ ఇచ్చారు. దర్బారులో ఉన్నవారికి మాత్రమే కాకుండా, భారతదేశానికి రాజ్‌కు సహకరించిన ఇతరులకు కూడా పతకాన్ని ప్రదానం చేసాదు.

కింగ్ జార్జ్ పట్టాభిషేక పతకం కోసం వాడిన రిబ్బన్నే దీనికీ వాడారు. బొమ్మ వైపు డిజైను రెంటికీ ఒకే విధంగా ఉంటుంది. అయితే, పట్టాభిషేక పతకం 1¼ అంగుళాల వ్యాసం ఉండగా, దర్బారు పతకం 1½ అంగుళాల వ్యాసంతో పెద్దదిగా ఉంటుంది. రెండు పతకాలు కలిసి ధరించలేరు. రెండింటినీ పొందినవారు తమ పట్టాభిషేక పతకపు రిబ్బన్‌పై 'ఢిల్లీ' అనే పదం ఉన్న పట్టీని ధరిస్తారు.

1911 ఢిల్లీ దర్బారు పతకం 

పట్టాభిషేక పతకం రిబ్బన్ కోసం దర్బారు పట్టీ

ఇవి కూడా చూడండి

మూలాలు

 

Tags:

భారతదేశంలో బ్రిటిషు పాలన

🔥 Trending searches on Wiki తెలుగు:

నవరత్నాలు (పథకం)ముదిరాజు క్షత్రియులువేంకటేశ్వరుడుజిల్లెళ్ళమూడి అమ్మతెలంగాణా బీసీ కులాల జాబితాఆంధ్రప్రదేశ్ మండలాలువయ్యారిభామ (కలుపుమొక్క)మామిడికాళిదాసుమల్లియ రేచనరిపబ్లిక్ ఆఫ్ ఐర్లాండ్భారత రాజ్యాంగ ఆధికరణలుఎఱ్రాప్రగడకాకి మాధవరావుశతక సాహిత్యమురామ్ మిరియాలఆత్మకూరు శాసనసభ నియోజకవర్గందగ్గు మందుభారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులుతెలంగాణ జాతరలుతరిగొండ వెంగమాంబయోగాఆనం చెంచుసుబ్బారెడ్డిరైతుదీక్షిత్ శెట్టిఅకాడమీ పురస్కారాలుకింజరాపు అచ్చెన్నాయుడుసిరివెన్నెల సీతారామశాస్త్రిస్వాతి నక్షత్రముఅంగన్వాడిధర్మంవస్తు, సేవల పన్ను (జీఎస్టీ)పడమటి కనుమలుఅవకాడోట్యూబెక్టమీఎన్నికలుమధుమేహంతోలుబొమ్మలాటతెనాలి రామకృష్ణుడుజాతీయములుఅండమాన్ నికోబార్ దీవులుమలబద్దకంచంద్రగుప్త మౌర్యుడుఅంగారకుడు (జ్యోతిషం)ఖలిస్తాన్ ఉద్యమంరక్త పింజరిసి.హెచ్. మల్లారెడ్డిభీమ్స్ సిసిరోలియోఆర్టికల్ 370శుక్రుడుసెక్యులరిజంభారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుల జాబితాభారతదేశ పేరు పుట్టుపూర్వోత్తరాలుక్షయవ్యాధి చికిత్సభారత జాతీయగీతంభారత రాజ్యాంగం - ప్రాథమిక విధులువాల్మీకిరక్తంఊపిరితిత్తులుమొదటి భారత స్వాతంత్ర్య యుద్ధంశైలజారెడ్డి అల్లుడుపాల్కురికి సోమనాథుడుక్వినోవాదసరారాజీవ్ గాంధీవిద్యబీడీ ఆకు చెట్టుజూనియర్ ఎన్.టి.ఆర్కేంద్రపాలిత ప్రాంతంభారతీయ స్టేట్ బ్యాంకుచాకలిసోరియాసిస్తిరుమల తిరుపతి దేవస్థానంబుధుడు (జ్యోతిషం)గరుడ పురాణం🡆 More