నంది నాటక పరిషత్తు - 2022

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలనచిత్ర, టెలివిజన్, నాటకరంగ అభివృద్ధి సంస్ధ ప్రతి సంవత్సరం సినిమా, టెలివిజన్ రంగాలతోపాటు నాటకరంగానికి కూడా నంది పురస్కారాలను అందజేస్తుంది.

వివిధ విభాగాల్లో ఉత్తమమైన వాటిని ఎంపిక చేసి బహుమతులు అందజేస్తారు. దీనినే నంది నాటక పరిషత్తు అంటారు.

2022 నంది నాటకోత్సవానికి సంబంధించి 2023 జూలై 5వ తేదీన నోటిఫికేషన్ వెలువడింది. 5 విభాగాల్లో మొత్తం 73 నంది అవార్డులు ఇస్తారు.

నాటకోత్సవం

రాష్ట్ర స్థాయి నంది నాటకోత్సవాలు 2023 డిసెంబరు 23 (శనివారం) నుండి డిసెంబరు 29 (శుక్రవారం) వరకు గుంటూరులోని శ్రీ వేంకటేశ్వర విజ్ఞాన మందిరంలో జరిగాయి. 73 అవార్డుల కోసం 38 నాటక సమాజాలు 1200 మంది నటీనటులు పోటీపడ్డారు. నాటక ప్రదర్శనలు పరిశీలించి వాటికి స్వర్ణ, రజత, కాంస్య నందుల విజేతలను ఎంపిక చేయడానికి 15 మంది న్యాయ నిర్ణేతలు హాజరయ్యారు.

ఎంపికైనవి

5 విభాగాల్లో మొత్తం 115 ఎంట్రీలు వచ్చాయి. తుదిపోటీలకు 10 పద్యనాటకాలు, 6 సాంఘిక నాటకాలు, 12 సాంఘిక నాటికలు, 5 బాలల నాటికలు, 5 కళాశాల లేదా విశ్వవిద్యాలయ నాటికలను ఎంపిక చేశారు. ఎంపికైన వాటిల్లో పద్య నాటకానికి రూ.50 వేలు, సాంఘిక నాటకానికి రూ.40 వేలు, సాంఘిక నాటికకు, బాలల నాటికల విభాగం, కళాశాల/విశ్వవిద్యాలయ విభాగంలో రూ.25 వేలు బహుమతిగా అందించారు.

పద్యనాటకాలు

క్రమసంఖ్య నాటకం పేరు సంస్థ పేరు రచయిత పేరు దర్శకుడి పేరు
1 శ్రీ కృష్ణ కమల పాలిక లలిత కళాసమితి (కర్నూలు) పల్లేటి లక్ష్మీకులశేఖర్ పత్తి ఓబులయ్య
2 ఆనంద నిలయం కళాకారుల సంక్షేమ సంఘం (కర్నూలు) పల్లేటి లక్ష్మీకులశేఖర్ వి.వి. రమణారెడ్డి
3 వసంత రాజీయం శ్రీ కళానికేతన్‌ (హైదరాబాదు) తడకమళ్ళ రామచంద్రారావు డా. మారంరాజు రామచంద్రరావు
4 నర్తనశాల నవక్రాంతి కల్చరల్‌ అసోసియేషన్‌, కేపీహెచ్‌బీ కాలనీ, హైదరాబాదు) రంగకవి-జి.వి. కృష్ణామూర్తి అర్జునరావు
5 శ్రీరామ పాదుకలు సవేరా ఆర్ట్స్‌ (ప్రొద్దుటూరు) పల్లేటి లక్ష్మీకులశేఖర్ ఆళ్ళూరి వెంకటయ్య
6 శ్రీరామ భక్త తులసీదాసు దుర్గా భవాని నాట్యమండలి (తెనాలి) డా. ఐ. మల్లేశ్వరరావు ఆదినారాయణ
7 శ్రీమాధవ వర్మ సంస్కార భారతి (విజయవాడ) డా. పి.వి.ఎన్. కృష్ణ డా. పి.వి.ఎన్. కృష్ణ
8 సీతాకల్యాణం శ్రీ సీతారామాంజనేయ నాట్యమండలి (కాకినాడ) నాగశ్రీ అన్నెపు దక్షిణామూర్తి
9 శ్రీకాళహస్తీశ్వర మహాత్మ్యం (భక్తకవి నక్కీర) కళాసాగర్‌ నాటక సంక్షేమ సంఘం (రాజాం, విజయనగరం జిల్లా) డా. మీగడ రామలింగస్వామి మీగడ మల్లికార్జునస్వామి
10 శ్రీకాంత కృష్ణమాచార్య జయకళానికేతన్‌ (విశాఖపట్నం) విరియాల లక్ష్మీపతి కె. వెంకటేశ్వరరావు

సాంఘీక నాటకాలు

క్రమసంఖ్య నాటకం పేరు సంస్థ పేరు రచయిత పేరు దర్శకుడి పేరు
1 ఝనక్‌ ఝనక్‌ పాయల్‌ భాజే కళల కాణాచి (తెనాలి) ఎం.ఎస్. చౌదరి ఎం.ఎస్. చౌదరి
2 విజ్ఞాన భారతం డాక్టర్‌ రామన్‌ ఫౌండేషన్, శ్రీ సాయిబాబా నాట్య మండలి (విజయవాడ) డా. పి.వి.ఎన్. కృష్ణ డా. పి.వి.ఎన్. కృష్ణ
3 ఇంద్రప్రస్థం అభినయ ఆర్ట్స్‌ (గుంటూరు) స్నిగ్ధ ఎన్. రవీంద్రరెడ్డి
4 ఎర్ర కలువ శ్రీ కళానికేతన్‌ (హైదరాబాదు) ఆకురాతి భాస్కర్ చంద్ర వెంకట్ గోవాడ
5 ద ఇంపోస్టర్స్‌ మిత్రా క్రియేషన్స్ (హైదరాబాదు) రచన: జె.బి. ప్రీష్ట్లీ

స్వేచ్ఛానుశరణ: ఆకురాతి భాస్కర్ చంద్ర

ఎస్.ఎం. బాషా
6 కలనేత విశ్వశాంతి కల్చరల్‌ అసోసియేషన్‌ (హైదరాబాదు) ఆకెళ్ళ బి.యం. రెడ్డి

సాంఘీక నాటికలు

క్రమసంఖ్య నాటిక పేరు సంస్థ పేరు రచయిత పేరు దర్శకుడి పేరు
1 పక్కింటి మొగుడు పండు క్రియేషన్స్‌ (కొప్పోలు, ప్రకాశం జిల్లా) గోవిందరాజుల నాగేశ్వరరావు బాలినేని శ్రీనివాసరావు
2 గమ్యస్థానాల వైపు శ్రీ సాయి ఆర్ట్స్‌ (కొలకలూరు, గుంటూరు జిల్లా) మూలకథ: రావు కృష్ణారావు

నాటకీకరణ: స్నిగ్ధ

గోపరాజు విజయ్
3 అస్థికలు గంగోత్రి (పెదకాకాని, గుంటూరు జిల్లా) మూలకథ: రమణ

నాటకీకరణ: పిన్నమనేని మృత్యుంజయరావు

నాయుడు గోపి
4 అతీతం అభినయ ఆర్ట్స్‌ (గుంటూరు) మూలకథ: రామా చంద్రమౌళి

నాటకీకరణ: శిష్ట్లా చంద్రశేఖర్

ఎన్. రవీంద్ర రెడ్డి
5 కమనీయం శ్రీ సద్గురు కళానిలయం (గుంటూరు) విద్యాధర్ మునిపల్లె బసవరాజు జయశంకర్
6 త్రిజుడు రసఝురి (పొన్నూరు, గుంటూరు జిల్లా) మూలకథ: పి.వి.వి. సత్యనారాయణ

నాటకీకరణ: వై. భాస్కరరావు

వై.ఎస్. కృష్ణేశ్వరరావు
7 నాన్నా నేనొచ్చేస్తా అమృతలహరి థియేటర్‌ ఆర్ట్స్‌ (గుంటూరు) మూలకథ: గంటి రాజేశ్వరి

నాటకీకరణ: తాళాబత్తుల వెంకటేశ్వరరావు

అమృతలహరి
8 జరుగుతున్న కథ అరవింద ఆర్ట్స్‌ (తాడేపల్లి, గుంటూరు జిల్లా) వల్లూరి శివప్రసాద్ గంగోత్రి సాయి
9 చీకటి పువ్వు చైతన్య కళాభారతి (కరీంనగర్) పరమాత్ముని శివరాం మంచాల రమేష్
10 రాతిలో తేమ యంగ్‌ థియేటర్‌ ఆర్గనైజేషన్స్‌ (విజయవాడ) మూలకథ: మధురాంతకం రాజారాం

నాటకీకరణ: పిన్నమనేని మృత్యుంజయరావు

ఆర్. వాసుదేవరావు
11 కొత్త పరిమళం శర్వాణి గ్రామీణ్, గిరిజన సాంస్కృతిక సేవా సంఘం (బోరివంక, శ్రీకాకుళం జిల్లా) మూలకథ: కాండ్రేగుల శ్రీనివాసరావు

నాటకీకరణ: కెకెఎల్. స్వామి

కెకెఎల్. స్వామి
12 నిశబ్దమా నీ ఖరీదెంత? తెలుగు కళాసమితి (విశాఖపట్నం) పి.టి. మాధవ్ చలసాని కృష్ణప్రసాద్

బాలల నాటికలు

క్రమసంఖ్య నాటిక పేరు సంస్థ పేరు రచయిత పేరు దర్శకుడి పేరు
1 బాధ్యత అరభి యూత్‌ కల్చరల్‌ అసోసియేషన్‌ (అనంతపురం) ఆముదాల సుబ్రహ్మణ్యం ఆముదాల సుబ్రహ్మణ్యం
2 తథా బాల్యం కథనం క్రియేషన్స్‌, డీఏవీ పబ్లిక్‌ స్కూల్‌ (ఇబ్రహీంపట్నం, ఎన్టీఆర్‌ జిల్లా) కవి పి.ఎన్.ఎమ్. కవి పి.ఎన్.ఎమ్.
3 మూడు ప్రశ్నలు యంగ్‌ థియేటర్‌ ఆర్గనైజేషన్‌ (విజయవాడ) ఆకురాతి భాస్కర్ చంద్ర ఆర్. వాసుదేవరావు
4 ప్రపంచ తంత్రం న్యూస్టార్‌ మోడరన్‌ థియేటర్‌ ఆర్ట్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ (విజయవాడ) విన్నకోట రాజేశ్వరి ఎం.ఎస్. చౌదరి
5 మంచి గుణపాఠం శ్రీరాం ఇంగ్లిష్‌ మీడియం హైస్కూల్ (విజయవాడ) డా. పి.వి.ఎన్. కృష్ణ పి. సాయి శంకర్

కళాశాల లేదా విశ్వవిద్యాలయ నాటికలు

క్రమసంఖ్య నాటిక పేరు సంస్థ పేరు రచయిత పేరు దర్శకుడి పేరు
1 కపిరాజు న్యూస్టార్‌ మోడరన్‌ థియేటర్‌ ఆర్ట్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ (విజయవాడ) ఎం.ఎస్. చౌదరి పి. దివాకర్ ఫణీంద్ర
2 ఇంకానా శ్రీ దుర్గామల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాల (విజయవాడ) ఎన్.ఎస్. నారాయణబాబు ఆర్. వాసువాసుదేవరావు
3 మహాభినిష్క్రమణ ప్రఖ్య చిల్డ్రన్స్‌ ఆర్ట్స్‌ థియేటర్‌ అండ్‌ అంబేద్కర్‌ మెమోరియల్‌ (తెనాలి) ఎ. తేజశ్వి ప్రఖ్య ఎ. లక్ష్మణ శాస్త్రి
4 ఉద్ధమ్ సింగ్‌ నందనం అకాడమీ (తిరుపతి) డా. పి. వివేక్ డా. పి. వివేక్
5 ఇంకెన్నాళ్లు ఎస్‌ఎస్బీఎన్‌ డిగ్రీ కళాశాల (అనంతపురం) ఆముదాల సుబ్రహ్మణ్యం ఆముదాల సుబ్రహ్మణ్యం

బహుమతుల వివరాలు

2023 డిసెంబరు 29న జరిగిన నంది నాటకోత్సవ ముగింపు కార్యక్రమం జరిగింది. ముగింపు కార్యక్రమానికి రాష్ట్ర మంత్రి అంబటి రాంబాబు ముఖ్య అతిథిగా హాజరు కాగా, సంస్థ చైర్మన్‌ పోసాని కృష్ణమురళి, ఎండీ టి.విజయకుమార్‌ రెడ్డి తదితరులు పాల్గొని విజేతలకు బహుమతులు అందజేశారు.

నందమూరి తారక రామారావు రంగస్థల పురస్కారం

వైయస్సార్ రంగస్థలం పురస్కారం

  • యంగ్ మెన్స్ హ్యాపీ క్లబ్, కాకినాడ (నాటక నిర్వహణ)

ఉత్తమ గ్రంథం

  • రాయలసీమ నాటకరంగం (డాక్టర్ మూల మల్లికార్జునరెడ్డి, విశ్రాంత ఆచార్యులు యోగివేమన విశ్వవిద్యాలయం కడప)

పద్య నాటకం

  • ఉత్తమ తొలి ప్రదర్శన - శ్రీ మాధవ వర్మ
  • ఉత్తమ ద్వితీయ ప్రదర్శన - శ్రీకాంత కృష్ణమాచార్య
  • ఉత్తమ తృతీయ ప్రదర్శన - వసంత రాజీయం
  • ఉత్తమ రచయిత - డా. మీగడ రామలింగస్వామి (శ్రీకాళహస్తీశ్వర మహాత్మ్యం)
  • ఉత్తమ ద్వితీయ రచయిత - పల్లేటి లక్ష్మీకులశేఖర్ (శ్రీరామ పాదుకలు)
  • ఉత్తమ దర్శకుడు - డా. పి.వి.ఎన్. కృష్ణ (శ్రీ మాధవ వర్మ)
  • ఉత్తమ నటుడు - అంజిరెడ్డి (వసంత రాజీయం)
  • ఉత్తమ నటి - సురభి వెంగమాంబ (నర్తనశాల)
  • ఉత్తమ బాలనటులు - జి. జగన్, రంజిత్ రాజీవ (శ్రీ మాధవ వర్మ)
  • ఉత్తమ ప్రతినాయకుడు - వైఎస్ కుమార్ బాబు (సీతా కళ్యాణం)
  • ఉత్తమ సహాయ నటుడు - భాస్కర్
  • ఉత్తమ హాస్య నటుడు - ఎస్. డేవిడ్ రాజు (శ్రీకాంత కృష్ణమాచార్య)
  • ఉత్తమ సంగీతం - డి. మురళీధర్ (శ్రీకాంత కృష్ణమాచార్య)
  • ఉత్తమ రంగాలంకరణ - సురభి సంతోష్ (ఆనంద నిలయం)
  • ఉత్తమ లైటింగ్ - సురభి నిరుపమ (శ్రీకృష్ణ కమలపాలిక)
  • ఉత్తమ మేకప్ - ఎస్. శ్రీనివాసులు (శ్రీకృష్ణ కమలపాలిక)
  • జ్యూరీ బహుమతి - సిహెచ్.వి.వి.ఎస్. ఫణికుమార్ (శ్రీరామ భక్త తులసీదాసు)

సాంఘీక నాటకం

  • ఉత్తమ తొలి ప్రదర్శన - ఇంద్రప్రస్థం
  • ఉత్తమ ద్వితీయ ప్రదర్శన - ద ఇంపోస్టర్స్
  • ఉత్తమ తృతీయ ప్రదర్శన - కలనేత
  • ఉత్తమ దర్శకుడు - ఎం. రవీంద్రరెడ్డి (ఇంద్రప్రస్థం)
  • ఉత్తమ రచయిత - ఆకురాతి భాస్కరచంద్ర (ద ఇంపోస్టర్స్)
  • ఉత్తమ ద్వితీయ రచయిత - ఆకెళ్ళ (కలనేత)
  • ఉత్తమ నటుడు - గోవాడ వెంకట్ (ఎర్రకలువ)
  • ఉత్తమ నటి - ఎం. అనూష (ద ఇంపోస్టర్స్)
  • ఉత్తమప్రతి నాయకుడు - ఎమ్మెస్ చౌదరి (ఝనక్ ఝనక్ పాయల్ బాజే)
  • ఉత్తమ బాల నటి - ఆరాధ్య (ఝనక్ ఝనక్ పాయల్ భాజే)
  • ఉత్తమ సహాయ నటుడు - నాగేశ్వరరావు (విజ్ఞాన భారతం)
  • ఉత్తమ హాస్య నటుడు -
  • ఉత్తమ సంగీతం - సురభి నాగరాజ్ (ఎర్ర కలువ)
  • ఉత్తమ రంగాలంకరణ - పరబ్రహ్మాచార్య, శ్రావణకుమార్ (విజ్ఞాన భారతం)
  • ఉత్తమ లైటింగ్ - శివాబృందం (ఇంద్రప్రస్థం)
  • ఉత్తమ మేకప్ - వెంకట్ (ఝనక్ ఝనక్ పాయల్ భాజే)
  • జ్యూరీ ప్రదర్శన - ఎర్రకలువ

సాంఘీక నాటిక

  • ఉత్తమ ప్రదర్శన - ఆస్తికలు
  • ఉత్తమ ద్వితీయ ప్రదర్శన - కమనీయం
  • ఉత్తమ తృతీయ ప్రదర్శన - చీకటి పువ్వు
  • ఉత్తమ నాటిక రచయిత - పి. మృత్యుంజయరావు (ఆస్తికలు)
  • ఉత్తమ ద్వితీయ నాటిక రచయిత - మునిపల్లె విద్యాధర్ (కమనీయం)
  • ఉత్తమ తృతీయ నాటిక రచయిత - వై. భాస్కరరావు (త్రిజుడు)
  • ఉత్తమ దర్శకుడు - నాయుడు గోపి (ఆస్తికలు)
  • ఉత్తమ నటుడు - ఎం. రవీంద్రరెడ్డి (అతీతం)
  • ఉత్తమ నటి - గుడివాడ లహరి (చీకటి పువ్వు)
  • ఉత్తమ ప్రతినాయకుడు - ఎ.వి. నాగరాజు (రాతిలో తేమ)
  • ఉత్తమ బాలు నటుడు - చిరంజీవి విగ్నేష్ (రాతిలో తేమ)
  • ఉత్తమ హాస్యనటుడు - యు.వి. శేషయ్య (పక్కింటి మొగుడు)
  • ఉత్తమ సహాయ నటుడు - వెంకటపతి రాజు (కొత్త పరిమళం)
  • ఉత్తమ సంగీతం - లీలా మోహన్ (అతీతం)
  • ఉత్తమ మేకప్ - కె. నూకరాజు (గమ్యస్థానాల వైపు)
  • ఉత్తమ లైటింగ్ - పీడీ ఫణీంద్ర (రాతిలో తేమ)
  • ఉత్తమ రంగాలంకరణ - థామస్ (నిశ్శబ్దమా నీ ఖరీదు ఎంత?)
  • జూరీ ప్రదర్శన: అతీతం

బాలల నాటికలు

  • ఉత్తమ ప్రదర్శన - ప్రపంచ తంత్రం
  • ద్వితీయ ఉత్తమ ప్రదర్శన - బాధ్యత
  • తృతీయ ఉత్తమ ప్రదర్శన - మూడు ప్రశ్నలు

కళాశాలల/ విశ్వవిద్యాలయాల నాటిక

  • ఉత్తమ ప్రదర్శన - ఇంకానా..?
  • ద్వితీయ ఉత్తమ ప్రదర్శన - కపిరాజు
  • తృతీయ ఉత్తమ ప్రదర్శన - ఉద్ధం సింగ్
  • ఉత్తమ రచయిత - డాక్టర్ పి. వివేక్ (ఉద్ధం సింగ్)
  • ఉత్తమ దర్శకుడు - ఆర్. వాసుదేవరావు (ఇంకానా)
  • ఉత్తమ యువ కళాకారుడు/ కళాకారిణి - ఎం. అనుషా (ఇంకెన్నాళ్లు)

మూలాలు

ఇతర లంకెలు

Tags:

నంది నాటక పరిషత్తు - 2022 నాటకోత్సవంనంది నాటక పరిషత్తు - 2022 ఎంపికైనవినంది నాటక పరిషత్తు - 2022 బహుమతుల వివరాలునంది నాటక పరిషత్తు - 2022 మూలాలునంది నాటక పరిషత్తు - 2022 ఇతర లంకెలునంది నాటక పరిషత్తు - 2022టెలివిజన్నంది నాటక పరిషత్తుసినిమా

🔥 Trending searches on Wiki తెలుగు:

పూర్వాభాద్ర నక్షత్రమురామాయణంలో స్త్రీ పాత్రలుఆఫ్రికాఆశ్లేష నక్షత్రముభాస్కర్ (దర్శకుడు)పాల కూరనందమూరి తారకరత్నమంగ్లీ (సత్యవతి)హనీ రోజ్గ్యాస్ ట్రబుల్క్షత్రియులునాగార్జునసాగర్సల్మాన్ ఖాన్సౌందర్యలహరిబి.ఆర్. అంబేడ్కర్ఆనందవర్ధనుడుఆంధ్రప్రదేశ్ నదులు, ఉపనదులుపాల్కురికి సోమనాథుడుకరక్కాయనరేంద్ర మోదీఉత్తరాభాద్ర నక్షత్రముకృత్తిక నక్షత్రముమక్కాప్రజాస్వామ్యంచంద్రశేఖర వేంకట రామన్సమతామూర్తిఊపిరితిత్తులుశాసనసభగూండాకార్తెపాండవులుఆర్టికల్ 370వై.యస్.రాజారెడ్డిపునర్వసు నక్షత్రముమహారాష్ట్రదురదజాతీయ సమైక్యతనువ్వులుతెలంగాణ జాతరలురాం చరణ్ తేజఇంద్రుడుఇంగ్లీషు-తెలుగు అనువాద సమస్యలుయూట్యూబ్సింగిరెడ్డి నారాయణరెడ్డిమహాభాగవతంజన్యుశాస్త్రంచిత్త నక్షత్రముకాళోజీ నారాయణరావుబొల్లినువ్వు లేక నేను లేనుభారతదేశంలో మహిళలుపోషణఎస్. ఎస్. రాజమౌళిశతభిష నక్షత్రముసుగ్రీవుడుతెలుగు నెలలుదసరా (2023 సినిమా)భారతదేశంలో బ్రిటిషు పాలనపోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామిరాజనీతి శాస్త్రమురాజ్యాంగంభారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థమేరీ క్యూరీమూత్రపిండమువడ్రంగిరంగస్థలం (సినిమా)దూదేకులపొడుపు కథలుహరికథరస స్వరూపంభీష్ముడుచాకలిజూనియర్ ఎన్.టి.ఆర్తాజ్ మహల్వేయి శుభములు కలుగు నీకుపురాణాలురోజా సెల్వమణితెలుగు సంవత్సరాలు🡆 More