గౌతముడు

గౌతముడు సప్తర్షులలో ఒకడు.

వేదకాలానికి చెందిన మహర్షులలో ఒకడు. మంత్రాల సృష్టికర్తగా (మంత్ర ధృష్ట) సుప్రసిద్ధుడు. ఋగ్వేదంలో ఈయన పేరు మీదుగా అనేక సూక్తులు ఉన్నాయి. ఈయన అంగీరస వంశానికి చెందిన రాహుగణుడి కొడుకు. దేవీ భాగవత పురాణం ప్రకారమ్, గోదావరి నది గౌతముడి పేరు మీదుగా వచ్చింది. ఈయనకు వామదేవుడు, నోధసుడు అని ఇరువురు పుత్రులు కలరు. వీరు కూడా మంత్ర ధృష్టలే.

వ్యక్తిగత జీవితం

గౌతముడు 
అమరావతిలో గౌతమ బుద్ధుని విగ్రహము

ఈయన భార్య పేరు అహల్య ఈమె బ్రహ్మ యొక్క మానసపుత్రిక. పురాణాల ప్రకారం, బ్రహ్మ ఎవరైతే భూమిని మొత్తం ముందుగా చుట్టి వస్తారో వారికే అహల్య దక్కుతుందని ప్రకటిస్తాడు. అప్పుడు గౌతముడు కామధేనువు చుట్టూ ప్రదక్షిణ చేయడం ద్వారా ఆమెను గెలుచుకుంటాడు. మిథిలా నగరానికి రాజుయైన జనకుడి కొలువులో ప్రధాన ఆచార్యుడైన శతానంద మహర్షి ఈయన పుత్రుడు. గౌతముడు ఆచరించిన 60 సంవత్సరాల తపస్సు మహాభారతంలోని శాంతి పర్వములో ప్రస్తావించబడింది. నారదపురాణంలో ప్రస్తావించబడినట్లు ఒకసారి ఏకథాటిగా 12 ఏళ్ళు కరువు ఏర్పడగా గౌతముడు ఋషులందరినీ పోషించి వారిని రక్షించాడు. హిందూ సాంప్రదాయంలో అత్యంత ప్రాధాన్యత కలిగిన సప్తర్షులలో ఒకడు. గౌతమ గోత్రానికి మూలపురుషుడు. భరధ్వాజుడు, ఈయన అంగీరస మూలానికి చెందిన వారే.

పురాణం

గౌతముడు 
అహల్యను చంపనందుకు క్షమించమని అడుగుతున్న అతని కుమారుడు - రాజ్మానామా నుండి ఒక దృశ్యం

రామాయణం ప్రకారం ఒకసారి గౌతముడు సూర్యోదయాన్నే గంగానదిలో స్నానమాచరించడానికి వెళ్ళగా దేవతల రాజైన దేవేంద్రుడు గౌతముడి భార్యయైన అహల్యను మోహించి మారు వేషంలో వెళ్ళి ఆమెను అనుభవించాడు. జరిగింది దివ్యదృష్టితో తెలుసుకున్న గౌతముడు ఆ ఇద్దరికీ శాపమిచ్చాడు. ఈ శాపం ప్రకారం అహల్య రాయిగా మారిపోయింది. ఇంద్రుడి శరీరం వేయి యోనిలతో నిండిపోయింది. తరువాత వారిద్దరిమీదా జాలిపడిన గౌతముడు కొంచెం ఊరట కలిగించేందుకు ఆ శాపాలనే వరాలుగా మార్చాడు. ఇంద్రుడి శరీరంపై ఉన్న యోనులు కళ్ళు లాగా కనబడేటట్లుగా, రాయిగా మారిన అహల్య శ్రీరాముని పాదస్పర్శతో పూర్వ రూపం సంతరించుకుని తనను కలుసుకునేటట్లుగా అనుగ్రహించాడు.

ధర్మ సూత్రాలకు ఆద్యుడు

గౌతముడు రచించిన ధర్మసూత్రాలు ఆయన పేరు మీదుగా గౌతమ ధర్మ సూత్రాలుగా ప్రఖ్యాతిచెందాయి.. ఇవే మొట్టమొదటి ధర్మ సూత్రాలు అంటారు. మనువు రాసిన ధర్మ శాస్త్రాన్నే మొదటి మానవ జాతి ధర్మ శాస్త్రం అనికూడా అంటున్నారు. గౌతముడు రాసిన ధర్మసూత్ర గ్రంథంలో ఇందులో 28 అధ్యాయాలు, 1000 సూత్రాలూ ఉన్నాయి. నాలుగు ఆశ్రమాలూ, నలభై సంస్కారాలూ, చాతుర్వర్ణాలు, రాజధర్మాలు, శిక్షాస్మృతులు, స్త్రీ పాటించాల్సిన ధర్మాలు, ఆహార నియమాలు, ప్రాయశ్చిత్తానికి నియమాలు మొదలైన హింధూ ధర్మ శాస్త్రంలోని అన్ని దృక్కోణాలు ఇందులో ఉన్నాయి. ఈ విధంగా గౌతమ ధర్మ శాస్త్రమనేది అత్యంత పురాతనమైన న్యాయశాస్త్ర గ్రంథంగా చెప్పవచ్చు.గౌతముడు అహల్యల పెద్ద కుమారుడు శతానందుడు

మూలాలు

బయటి లింకులు

Tags:

గౌతముడు వ్యక్తిగత జీవితంగౌతముడు పురాణంగౌతముడు ధర్మ సూత్రాలకు ఆద్యుడుగౌతముడు మూలాలుగౌతముడు బయటి లింకులుగౌతముడుసప్తర్షులు

🔥 Trending searches on Wiki తెలుగు:

రక్త సింధూరంకొణతాల రామకృష్ణతమన్నా భాటియారతన్ టాటాభగవద్గీతరుక్మిణీ కళ్యాణంవైఫ్ ఆఫ్ రణసింగంజాంబవంతుడురాజనీతి శాస్త్రముడి. కె. అరుణవర్షం (సినిమా)పాలకొల్లు శాసనసభ నియోజకవర్గంఒక చిన్న ఫ్యామిలీ స్టోరీయువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీరామప్ప దేవాలయంకర్ణుడుశాసనసభ సభ్యుడుబాలకాండతాటి2024 భారతదేశ ఎన్నికలుపరిటాల రవివాల్మీకిభారత జాతీయ క్రికెట్ జట్టుఆహారంలలితా సహస్రనామ స్తోత్రంకుంభరాశిభూమా శోభా నాగిరెడ్డిమహాత్మా గాంధీపిఠాపురంపాండవులుబర్రెలక్కపరశురామ్ (దర్శకుడు)కంప్యూటరుజ్యేష్ట నక్షత్రంశుక్రుడుభారతదేశ పేరు పుట్టుపూర్వోత్తరాలుబ్రహ్మంగారి కాలజ్ఞానంమాళవిక శర్మత్రిఫల చూర్ణంఅవకాడోతెలుగు అక్షరాలుబంగారు బుల్లోడుఆవర్తన పట్టికసీసము (పద్యం)శ్రీకాంత్ (నటుడు)కాశీసూర్య నమస్కారాలుదువ్వూరి రామిరెడ్డిఅల్లసాని పెద్దనఉలవలుపుష్యమి నక్షత్రముమారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డితీన్మార్ సావిత్రి (జ్యోతి)కల్వకుంట్ల కవితక్రికెట్ఎలక్ట్రానిక్ వోటింగ్ మిషన్ధనూరాశిఒగ్గు కథద్విపదఆంధ్రప్రదేశ్‌లో 2024 భారత సార్వత్రిక ఎన్నికలుగంగా నదిభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులురోహిణి నక్షత్రంభారతదేశపు పట్టణ పరిపాలననీ మనసు నాకు తెలుసుకొడాలి శ్రీ వెంకటేశ్వరరావుభువనగిరి లోక్‌సభ నియోజకవర్గంతెలంగాణ ఉద్యమంగర్భిణి స్త్రీలు తీసుకోవలసిన జాగ్రత్తలుజహీరాబాదు లోక్‌సభ నియోజకవర్గంనాయట్టుసౌందర్యనన్నెచోడుడుతెలంగాణ పుణ్యక్షేత్రాల జాబితాతాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రిగురువు (జ్యోతిషం)🡆 More