సీతారాముల కళ్యాణం చూతము రారండీ

సీతారాముల కల్యాణం చూతము రారండీ పాట ఒక సంగీతభరితమైన తెలుగు సినిమా పాట.

దీనిని సీతారామ కళ్యాణం (1961) సినిమా కోసం సముద్రాల రాఘవాచార్య రచించారు. దీనిని గాలిపెంచల నరసింహారావు స్వరపరచగా, మధురగాయని పి.సుశీల బృందం గానం చేశారు. ఈ పాట ఎంతో ప్రజాదరణ పొందింది. ఇది ఇప్పటికి శ్రీరామనవమి నాడు, హిందువుల పెళ్ళి కార్యక్రమాలలో వినిపిస్తూనే ఉంటుంది. ఈ పాటను రామునిగా నటించిన హరనాథ్, సీతగా నటించిన గీతాంజలి పై చిత్రీకరించారు.

"సీతాకల్యాణ వైభోగము" అని త్యాగయ్య రచించిన ఉత్సవ సంప్రదాయ కీర్తన స్ఫూర్తితో సముద్రాల సీనియర్ ఈ పాటను రచించారు.

నేపథ్యం

శ్రీరాముడు పుట్టి, పెరిగిన పిదప విశ్వామిత్రుని యాగాన్ని సంరక్షించి ఆ తర్వాత సీతా స్వయంవరంలో గుర్వాజ్ఞ శిరసావహించి పాల్గొంటాడు. శివ ధనుర్భంగం చేసిన పిదప సీతారాముల కల్యాణం లోకంలోని జనుల హర్షాతిశయంగా మిథిలాపురిలో జరుగుతుంది. ఆ సందర్భంగా ఈ పాటను అద్భుతంగా చూపించారు. సీతారాములను వధూవరులుగా అలంకరించే తీరును, పెళ్ళిమండపంలో వివిధ కల్యాణ ఘట్టాలను ఎంతో సహజంగా, కళాత్మకంగా చిత్రించారు.

సీతా రాముల కల్యాణము చూతము రారండీ పాట

సీతా రాముల కళ్యాణము చూతము రారండీ

సీతా రాముల కల్యాణము చూతము రారండీ
శ్రీ సీతా రాముల కల్యాణము చూతము రారండి
[ మ్యూసిక్ ]
చూచు వరులకు చూడ ముచ్చటగా, పుణ్య పురుషులకు ధన్యభాగ్యమట
[చూచు వరులకు చూడ ముచ్చటగా, పుణ్య పురుషులకు ధన్య భాగ్యమట] — [ కోరస్ ]
భక్తి యుక్తులకి ముక్తి ప్రదమట..ఆ.ఆ.ఆ.ఆ.....
భక్తి యుక్తులకి ముక్తి ప్రదమట, సురులును మునులను చూడ వచ్చునట

కల్యాణము చూతము రారండి...

[ మ్యూజిక్ ]
దుర్జనకోటిని దర్పమడంచగా ..సజ్జన కోటిని సంరక్షింపగా
[దుర్జనకోటిని దర్పమడంచగా ..సజ్జన కోటిని సంరక్షింపగా] — [ కోరస్ ]
ధరణీ జాతిని స్థావన చేయగా..ఆ.ఆ.ఆ.ఆ.....
ధరణీ జాతిని స్థావన చేయగా... నరుడై పుట్టిన పురుషోత్తముని
కల్యాణము చూతము రారండి..
[ మ్యూజిక్ ]
దశరథ రాజు సుతుడై వెలసి... కౌశికు యాగము రక్షణ చేసి..
[దశరథ రాజు సుతుడై వెలసి...కౌశికు యాగము రక్షణ చేసి] — [ కోరస్ ]
జనకుని సభలో హరి విల్లుని విరిచి..ఆ.ఆ.ఆ.ఆ.....
జనకుని సభలో హరి విల్లుని విరిచి, జానకి మనసు గెలిచిన రాముని
కల్యాణము చూతము రారండి..శ్రీ సీతారాముల కల్యాణము చూతము రారండి
[ మ్యూజిక్ ]
సీతారాముల కల్యాణము చూతము రారండీ
శ్రీ సీతా రాముల కల్యాణము చూతము రారండి
[ మ్యూసిక్ ]
సిరి కల్యాణపు బొట్టును పెట్టి...
బొట్టును పెట్టి — [ కోరస్ ]
మణి బాసికమును నుదుటన గట్టి
నుదుటన గట్టి — [ కోరస్ ]
పారాణిని పాదాలకు పెట్టి..ఆ.ఆ.ఆ.ఆ.....
పారాణిని పాదాలకు పెట్టి..పెళ్లి కూతురై వెలసిన సీతా..
కల్యాణము చూతము రారండి..శ్రీ సీతారాముల కల్యాణము చూతము రారండి
[ మ్యూజిక్ ]
సంపగి నూనెను కురులను దువ్వి
కురులను దువ్వి — [ కోరస్ ]
ఒంపుగ కాపురి నామము గీసి
నామము గీసి — [ కోరస్ ]
చంపగ వాసి చుక్కను పెట్టీ..ఆ.ఆ.ఆ.ఆ.....
చంపగ వాసి చుక్కను పెట్టీ...పెండ్లీ .. కొడుకై వెలసిన రాముని..

కల్యాణము చూతము రారండి..శ్రీ సీతారాముల కల్యాణము చూతము రారండి

[ మ్యూజిక్ ]
జానకి దోసిట కెంపుల ప్రోవై
కెంపుల ప్రోవై — [ కోరస్ ]
రాముని దోసిట నీలపు రాసై
నీలపు రాసై — [ కోరస్ ]
ఆణిముత్యములు తలంబ్రాలుగా..ఆ.ఆ.ఆ.ఆ.....
ఆణిముత్యములు తలంబ్రాలుగా...శిరమున వెలసిన సీతారాముల..
కల్యాణము చూతము రారండి..శ్రీ సీతారాముల కల్యాణము చూతము రారండి
[ మ్యూజిక్ ]

1998 సినిమా

శ్రీ సీతారాముల కల్యాణం చూతము రారండి అనే పేరుతో 1998లో అక్కినేని నాగేశ్వరరావు ప్రధాన పాత్రధారిగా ఒక సినిమా నిర్మించబడింది.

బయటి లింకులు

మూలాలు

Tags:

సీతారాముల కళ్యాణం చూతము రారండీ నేపథ్యంసీతారాముల కళ్యాణం చూతము రారండీ సీతా రాముల కల్యాణము చూతము రారండీ పాటసీతారాముల కళ్యాణం చూతము రారండీ 1998 సినిమాసీతారాముల కళ్యాణం చూతము రారండీ బయటి లింకులుసీతారాముల కళ్యాణం చూతము రారండీ మూలాలుసీతారాముల కళ్యాణం చూతము రారండీగాలిపెంచల నరసింహారావుగీతాంజలి (నటి)పి.సుశీలపెళ్ళిశ్రీరామనవమిసముద్రాల రాఘవాచార్యసీతారామ కళ్యాణం (1961 సినిమా)హరనాథ్

🔥 Trending searches on Wiki తెలుగు:

దగ్గు మందుసుగ్రీవుడుఅటార్నీ జనరల్ఆరుగురు పతివ్రతలుజానపద గీతాలుభారతదేశంమూలకముఅన్నపూర్ణ (నటి)చంద్రశేఖర వేంకట రామన్కె.విజయరామారావురక్తపోటుఇక్ష్వాకులుతెలుగు పత్రికలుక్విట్ ఇండియా ఉద్యమంన్యూటన్ సూత్రాలుతెలుగు వ్యాకరణంపార్వతివినాయకుడుకాకతీయులుఇంటి పేర్లురక్త పింజరిమంచు లక్ష్మికుక్కఇత్తడిఅన్నమయ్యరామప్ప దేవాలయంభారతదేశంలో మహిళలువిద్యార్థికన్నెగంటి బ్రహ్మానందంవృశ్చిక రాశితెలంగాణా బీసీ కులాల జాబితానమాజ్మకరరాశినాని (నటుడు)లంబాడిపిట్ట కథలుతెల్ల రక్తకణాలురావణుడువేణు (హాస్యనటుడు)ఉపాధ్యాయుడుఅయ్యప్పమొదటి పేజీఅక్కినేని నాగార్జుననక్షత్రం (జ్యోతిషం)భారత రాజ్యాంగ ఆధికరణలుయూరీ గగారిన్కోణార్క సూర్య దేవాలయంఖోరాన్బైబిల్భారత రాష్ట్రపతిపవన్ కళ్యాణ్వృక్షశాస్త్రంనల్ల జీడిశ్రవణ నక్షత్రమురమణ మహర్షితెలుగు శాసనాలునిర్వహణప్రభాస్నెల్లూరుమంగళసూత్రంశైలజారెడ్డి అల్లుడుతీన్మార్ మల్లన్ననరసరావుపేటఅంగన్వాడిపుష్పంసంక్రాంతిభారతదేశ ఎన్నికల వ్యవస్థరామేశ్వరంహోళీభాస్కర్ (దర్శకుడు)చాట్‌జిపిటిసమాచార హక్కుఘంటసాల వెంకటేశ్వరరావుకార్తెధర్మపురి అరవింద్పల్లెల్లో కులవృత్తులుఅర్జున్ దాస్🡆 More