తాడేపల్లిగూడెం శాసనసభ నియోజకవర్గం

తాడేపల్లిగూడెం శాసనసభ నియోజకవర్గం పశ్చిమ గోదావరి జిల్లాలో గలదు.

ఇది నరసాపురం లోక్‌సభ నియోజకవర్గంలో భాగం.

తాడేపల్లిగూడెం
—  శాసనసభ నియోజకవర్గం  —
తాడేపల్లిగూడెం శాసనసభ నియోజకవర్గం
తాడేపల్లిగూడెం is located in Andhra Pradesh
తాడేపల్లిగూడెం
తాడేపల్లిగూడెం
అక్షాంశరేఖాంశాలు: Coordinates: Unknown argument format
దేశము భారత దేశం
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా పశ్చిమ గోదావరి
ప్రభుత్వం
 - శాసనసభ సభ్యులు

నియోజకవర్గంలోని మండలాలు

నియోజకవర్గం నుండి గెలుపొందిన శాసనసభ్యులు

ఇంతవరకు సంవత్సరాల వారీగా నియోజకవర్గంలో గెలుపొందిన సభ్యుల పూర్తి వివరాలు ఈ క్రింది పట్టికలో నుదహరించబడినవి.

1955 ఎన్నికలు

1955లో నిర్వహించిన శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నంబూరి శ్రీనివాసరావు తన సమీప అభ్యర్థి శ్రీమత్‌ కిళాంబి వెంకట కృష్ణావతారంపై 2745 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. నంబూరి శ్రీనివాసరావు 43157 ఓట్లు సాధించగా వెంకటకృష్ణావతారం 40412 ఓట్లు పొందారు.

1962 ఎన్నికలు

1962 ఎన్నికల్లో తాడేపల్లిగూడెం నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి అల్లూరి కృష్ణారావు తన సమీప ప్రత్యర్థి స్వతంత్ర అభ్యర్థి గాదె రఘునాయకులుపై 2135 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఈ ఎన్నికల్లో అల్లూరి కృష్ణారావు 16,847 ఓట్లు, గాదె రఘునాయకులు 14712 ఓట్లు పొందారు.

1967 ఎన్నికలు

1967లో నిర్వహించిన శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి అల్లూరి కృష్ణారావు తన సమీప ప్రత్యర్థి స్వతంత్ర అభ్యర్థి ఈలి ఆంజనేయులుపై 3600 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఈ ఎన్నికల్లో కృష్ణారావుకు 24129 ఓట్లు, ఈలి ఆంజనేయులుకు 20529 ఓట్లు నమోదయ్యాయి.

1972 ఎన్నికల్లో

1972లో నిర్వహించిన ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థి ఈలి ఆంజనేయులు తన సమీప ప్రత్యర్థి అభ్యర్థిని కోసూరి కనకలక్ష్మిపై 4200 ఓట్ల మెజారిటీతో గెలుపొంది శాసనసభ్యునిగా ఎన్నికయ్యారు. ఎన్నికలో ఈలి ఆంజనేయులు 36604 ఓట్లు, కోసూరి కనకలక్ష్మి 32404 ఓట్లు సాధించారు.

1978 ఎన్నికలు

1978 ఎన్నికల్లో కాంగ్రెస్ (ఐ) అభ్యర్థిగా పోటీచేసిన చింతలపాటి సీతా రామచంద్ర వరప్రసాద మూర్తిరాజు తన సమీప ప్రత్యర్థియైన కాంగ్రెస్ అభ్యర్థి ఈలి ఆంజనేయులు 7673 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఈ ఎన్నికల్లో చింతలపాటి వరప్రసాదమూర్తిరాజు (కాంగ్రెస్ (ఐ) కు 39,128 ఓట్లు, ఈలి ఆంజనేయులు (కాంగ్రెస్) కు 31455 ఓట్లు నమోదయ్యాయి.

1983 ఎన్నికలు

1985 ఎన్నికలు

1985 శాసనసభ ఎన్నికల్లో తెదేపా అభ్యర్థి యర్రా నారాయణస్వామి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థిని ఈలి వరలక్ష్మిపై 20వేల పైచిలుకు ఓట్ల ఆధిక్యతతో గెలుపొందారు.

1987 ఉప ఎన్నికలు

1987లో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థినిగా పోటీచేసిన ఈలి వరలక్ష్మి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీకి చెందిన పసల కనకసుందరరావుపై 31 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. 1985లో గెలుపొంది శాసనసభ్యునిగా కొనసాగుతూ ఉన్న యర్రా నారాయణస్వామి (తెదేపా) 1987లో తన పదవికి రాజీనామా చేసి జిల్లాపరిషత్ ఎన్నికల్లో పోటీచేయడంతో ఉప ఎన్నిక నిర్వహించారు. ప్రత్యక్ష పద్ధతిలో నిర్వహించిన ఎన్నికలో నారాయణస్వామి గెలుపొంది జిల్లాపరిషత్ అధ్యక్ష పదవి చేపట్టారు. సాధారణంగా జిల్లాపరిషత్ ఎన్నికల్లో పరోక్ష పద్ధతిలో జిల్లా చైర్మన్‌ని ఎన్నుకుంటారు. ప్రత్యక్ష పద్ధతిలో పశ్చిమగోదావరిజిల్లాకు ఎన్నికైన ఏకైక జిల్లా పరిషత్ చైర్మన్‌గా యర్రా నారాయణస్వామి నిలిచారు.

1989 ఎన్నికలు

1989లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో తెదేపా అభ్యర్థి పసల కనకసుందరరావు తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీకి చెందిన ఈలి వరలక్ష్మిపై గెలుపొంది శాసనసభ్యునిగా ఎన్నికయ్యారు.

1994 ఎన్నికలు

1994లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో తాడేపల్లిగూడెం శాసనసభ నియోజకవర్గం నుంచి తెదేపా అభ్యర్థిగా పోటీచేసిన పసల కనకసుందరరావు తన సమీప ప్రత్యర్థి ఐన కాంగ్రెస్ అభ్యర్థి కొట్టు సత్యనారాయణపై గెలుపొందారు.

1999 ఎన్నికలు

1999 శాసనసభ ఎన్నికల్లో తాడేపల్లిగూడెం నియోజకవర్గం నుంచి తెదేపా అభ్యర్థి యర్రా నారాయణస్వామి సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొట్టు సత్యనారాయణపై గెలుపొంది ఎన్నికయ్యారు. యర్రా నారాయణస్వామి ఈ విజయంతో రెండవసారి తాడేపల్లిగూడెం నియోజకవర్గం నుంచి శాసనసభకు ఎన్నికయ్యారు.

2004 ఎన్నికలు

2004లో జరిగిన శాసనసభ ఎన్నికలలో రాడేపల్లిగూడెం శాసనసభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొట్టు సత్యనారాయణ తన సమీప ప్రత్యర్థి అయిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కనక సుందరరావుపై 24933 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించాడు. సత్యనారాయణకు 72477 ఓట్లు లభించగా, సుందరరావు 47544 ఓట్లు పొందినాడు.

2009 ఎన్నికలు

2009 శాసనసభ ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుండి ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థిగా పోటీచేసిన యీలి వెంకట మధుసూదనరావు (నాని) కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొట్టు సత్యనారాయణపై గెలుపొందారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ముళ్ళపూడి బాపిరాజు, భారతీయ జనతా పార్టీ తరఫున కైరం అప్పారావు, లోక్‌సత్తా పార్టీ అభ్యర్థిగా కె.ఎస్.రామచంద్రారావు పోటీచేశారు.

ఇవి కూడా చూడండి

ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుల జాబితాలు 2009 ఎన్నికలలో ప్రజారాజ్యం అభ్యర్థి యీలి వెంకట మధుసూదనరావు (నాని) తన ప్రత్యర్థి కె.సత్యనారాయణ పై విజయం సాధించారు.

మూలాలు

Tags:

తాడేపల్లిగూడెం శాసనసభ నియోజకవర్గం నియోజకవర్గంలోని మండలాలుతాడేపల్లిగూడెం శాసనసభ నియోజకవర్గం నియోజకవర్గం నుండి గెలుపొందిన శాసనసభ్యులుతాడేపల్లిగూడెం శాసనసభ నియోజకవర్గం 1955 ఎన్నికలుతాడేపల్లిగూడెం శాసనసభ నియోజకవర్గం 1962 ఎన్నికలుతాడేపల్లిగూడెం శాసనసభ నియోజకవర్గం 1967 ఎన్నికలుతాడేపల్లిగూడెం శాసనసభ నియోజకవర్గం 1972 ఎన్నికల్లోతాడేపల్లిగూడెం శాసనసభ నియోజకవర్గం 1978 ఎన్నికలుతాడేపల్లిగూడెం శాసనసభ నియోజకవర్గం 1983 ఎన్నికలుతాడేపల్లిగూడెం శాసనసభ నియోజకవర్గం 1985 ఎన్నికలుతాడేపల్లిగూడెం శాసనసభ నియోజకవర్గం 1987 ఉప ఎన్నికలుతాడేపల్లిగూడెం శాసనసభ నియోజకవర్గం 1989 ఎన్నికలుతాడేపల్లిగూడెం శాసనసభ నియోజకవర్గం 1994 ఎన్నికలుతాడేపల్లిగూడెం శాసనసభ నియోజకవర్గం 1999 ఎన్నికలుతాడేపల్లిగూడెం శాసనసభ నియోజకవర్గం 2004 ఎన్నికలుతాడేపల్లిగూడెం శాసనసభ నియోజకవర్గం 2009 ఎన్నికలుతాడేపల్లిగూడెం శాసనసభ నియోజకవర్గం ఇవి కూడా చూడండితాడేపల్లిగూడెం శాసనసభ నియోజకవర్గం మూలాలుతాడేపల్లిగూడెం శాసనసభ నియోజకవర్గంనరసాపురం లోక్‌సభ నియోజకవర్గంపశ్చిమ గోదావరి జిల్లా

🔥 Trending searches on Wiki తెలుగు:

వేములవాడశాకుంతలంవృషణంఆటలమ్మశరత్ బాబుగురుడుఆలంపూర్ జోగులాంబ దేవాలయంరజియా సుల్తానాఘట్టమనేని మహేశ్ ‌బాబుసంఖ్యకృత్రిమ మేధస్సుఏప్రిల్ 30వావిలికంప్యూటరుదశావతారములుపునర్వసు నక్షత్రముద్వారకా తిరుమలప్రభాస్మహేంద్రసింగ్ ధోనిఆశ్లేష నక్షత్రముబోదకాలుశ్రీ కృష్ణుడుబంతిపువ్వుభారత రాష్ట్రపతిగవర్నరుమీనరాశిగుప్త సామ్రాజ్యంజాతీయములుదశదిశలుసూడాన్పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామిదశరథుడుకృత్తిక నక్షత్రముతెలుగు సినిమాయుద్ధకాండతులసియువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీరమాప్రభన్యుమోనియారబీ పంటస్వర్ణ దేవాలయం, శ్రీపురంతెలుగు శాసనాలుతెలంగాణ తల్లిరంజాన్కుమ్మరి (కులం)పిట్ట కథలుహెబియస్ కార్పస్భారత రాజ్యాంగంమే 1పక్షవాతంసర్పంచిలక్ష్మిప్రకృతి - వికృతిగుంటకలగరబలగంగురువు (జ్యోతిషం)రాం చరణ్ తేజకుతుబ్ షాహీ వంశంవిరూపాక్షభారత క్రికెట్ జట్టుఘట్టమనేని కృష్ణగ్రంథాలయందీపావళినిఖత్ జరీన్సంస్కృతంపిత్తాశయముఅనాసతెలంగాణా బీసీ కులాల జాబితాచతుర్వేదాలుహస్తప్రయోగంశ్రీనాథుడుతిరుమలశక్తిపీఠాలుశ్రీశ్రీసన్ రైజర్స్ హైదరాబాద్కర్ణాటకవిష్ణుకుండినులు🡆 More