సత్తిరాజు సీతారామయ్య

సత్తిరాజు సీతారామయ్య ప్రముఖ పాత్రికేయుడు, రచయిత.

సత్తిరాజు సీతారామయ్య
సత్తిరాజు సీతారామయ్య
జననం(1864-12-11)1864 డిసెంబరు 11
మరణం1945 మార్చి 17
వృత్తిన్యాయవాది
సుపరిచితుడు/
సుపరిచితురాలు
సంపాదకుడు దేశోపకారి, హిందూసుందరి, లా వర్తమాని
తల్లిదండ్రులు
  • సత్తిరాజు రామన్న (తండ్రి)
  • సీతమ్మ (తల్లి)

విశేషాలు

ఇతడు పశ్చిమ గోదావరి జిల్లా, ఇరగవరం మండలం (నాటి తణుకు తాలూకా) కంతేరు గ్రామంలో సత్తిరాజు రామన్న, సీతమ్మ దంపతులకు 1864, డిసెంబరు 11వ తేదీన జన్మించాడు. ఇతడు ఆరువేల నియోగి. హరితస గోత్రీకుడు. పత్రికల ప్రచురణ ద్వారా దేశానికి ఎంతో సేవ చేయవచ్చని ఇతడు భావించాడు. 1891లో మద్రాసు నుండి ఎ.సి.పార్థసారథి నాయుడు నడిపిన ఆంధ్ర ప్రకాశికలో జర్నలిస్టుగా అడుగుపెట్టాడు. 1893లో దేశోపకారి వారపత్రికను, 1902లో హిందూ సుందరి మాసపత్రికను ప్రారంభించాడు. ఇతడు న్యాయవాద వృత్తిని చేపట్టి బాగా సంపాదిస్తున్న సమయంలో పత్రికలను నడపాలన్న ధ్యేయంతో తన వృత్తిని సైతం వదిలివేశాడు. దేశోపకారి, హిందూసుందరి, లా వర్తమాని పత్రికల సంపాదకునిగా రోజుకు 18 గంటలు పనిచేసేవాడు. ఆ రోజులలో హిందూసుందరి పత్రికకు 800 మంది చందాదారులు ఉండేవారు. ఒక దశాబ్దానికి పైగా తన జీవితాన్ని ఈ పత్రికలు నడపడానికి ధారపోశాడు. ఇతడు ఏలూరు మునిసిపల్ కౌన్సిలర్‌గా, కంతేరు గ్రామ పంచాయితీ ప్రెసిడెంటుగా, తాలూకా బోర్డు మెంబరుగా వివిధ హోదాలలో తన సేవలను అందించాడు. ఇతడు కంతేరు గ్రామపంచాయితీ ప్రెసిడెంటుగా చేసిన సేవలను అప్పటి కలెక్టర్ రూథర్‌ఫర్డు, లోకల్ బోర్డుల రిజిస్ట్రారు గోపాలస్వామి అయ్యంగార్లు గుర్తించి ఆ గ్రామం సందర్శించి దానిని మోడల్ గ్రామపంచాయితీగా తీసుకుని బులెటిన్‌లో ప్రకటించారు. ఇతడు అనేక తాళపత్ర గ్రంథాలను, శాసనాలను, వ్రాతప్రతులను సేకరించి మద్రాసు మ్యూజియంకు ఇచ్చాడు.

రచనలు

రచయితగా ఇతడు అనేక గ్రంథాలను ప్రకటించాడు. వాటిలో ముఖ్యమైనవి:

  • వంటలక్క
  • విప్రకులదర్పణం
  • వినోదవాహిని మొదలైనవి.

మరణం

ఇతడు 1945, మార్చి 17వ తేదీ కంతేరులో మరణించాడు.

మూలాలు

Tags:

సత్తిరాజు సీతారామయ్య విశేషాలుసత్తిరాజు సీతారామయ్య రచనలుసత్తిరాజు సీతారామయ్య మరణంసత్తిరాజు సీతారామయ్య మూలాలుసత్తిరాజు సీతారామయ్య

🔥 Trending searches on Wiki తెలుగు:

శక్తిపీఠాలుఆంధ్రప్రదేశ్ శాసనసభ నియోజకవర్గాల జాబితాపసుపు గణపతి పూజవాట్స్‌యాప్హనుమంతుడురాజోలు శాసనసభ నియోజకవర్గంవస్తు, సేవల పన్ను (జీఎస్టీ)కృష్ణా నదినరేంద్ర మోదీపంచతంత్రంమర్రితంగేడుగూండాకంప్యూటరుఆనందవర్ధనుడుపూర్వాభాద్ర నక్షత్రముపనసరాం చరణ్ తేజకె.విశ్వనాథ్క్లోమమువిజయవాడసర్వాయి పాపన్నరాహుల్ గాంధీఅంగారకుడు (జ్యోతిషం)రవితేజపూజా హెగ్డేఉత్తర ఫల్గుణి నక్షత్రముహిందూధర్మంసర్వ శిక్షా అభియాన్దేవదాసిగూగుల్కె.విజయరామారావుదశ రూపకాలుఘంటసాల వెంకటేశ్వరరావుశ్రీనివాస రామానుజన్డొక్కా మాణిక్యవరప్రసాద్కింజరాపు అచ్చెన్నాయుడుఆనం వివేకానంద రెడ్డిఅండమాన్ నికోబార్ దీవులువేపఆటలమ్మసర్పంచిలైంగిక విద్యసత్యనారాయణ వ్రతంఇజ్రాయిల్నెల్లూరుపెళ్ళి చూపులు (2016 సినిమా)వై.యస్. రాజశేఖరరెడ్డిశ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం (భద్రాచలం)అలెగ్జాండర్లంబాడిసర్వేపల్లి రాధాకృష్ణన్పేరుశివలింగంనెల్లూరు చరిత్రనువ్వులుజూనియర్ ఎన్.టి.ఆర్మధుమేహంఎస్. ఎస్. రాజమౌళిఛత్రపతి శివాజీనల్ల జీడితెలంగాణ శాసనసభ నియోజకవర్గాలు జాబితాపక్షవాతంరాజశేఖర చరిత్రమునోటి పుండురాజ్యసభమార్చితెలుగుదేశం పార్టీసామెతలురాశిదత్తాత్రేయశ్రీనాథుడుఆంధ్రప్రదేశ్ చరిత్రవచన కవితతెలుగు సాహిత్యంపూర్వాషాఢ నక్షత్రముభారత రాజ్యాంగ పీఠికచెరువుభారతదేశం🡆 More