బంగ్లాదేశ్: ఆసియాలోని ఒక దేశం

బంగ్లాదేశ్ , (అధికారికంగా బంగ్లాదేశ్ ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యం) భారతదేశ సరిహద్దుల్లోని దేశం.

ఇది సారవంతమైన గంగా-బ్రహ్మపుత్ర మైదాన ప్రాంతంలో ఉన్న దేశము. చారిత్రకంగా బెంగాల్ భాషా ప్రాంతంలోని భాగము. దీనికి దక్షిణాన బంగాళాఖాతము, ఉత్తర, తూర్పు, పడమరల భారతదేశము, ఆగ్నేయాన బర్మా సరిహద్దులుగా ఉన్నాయి. హిమాలయ దేశాలైన నేపాల్, భూటాన్ లను భారతదేశ సిల్గురి కారిడార్ వేరు చేస్తుంది. ప్రాదేశికంగా చైనాకు దగ్గరగా ఉంది.

গণপ্রজাতন্ত্রী বাংলাদেশ
గొణోప్రజాతొంత్రి బాంగ్లాదేశ్
బంగ్లాదేశ్ ప్రజా గణతంత్రం
Flag of బంగ్లాదేశ్ బంగ్లాదేశ్ యొక్క చిహ్నం
నినాదం
ఏమీ లేదు
జాతీయగీతం
అమర్ షోనార్ బాంగ్లా
నా బంగారు బెంగాల్

బంగ్లాదేశ్ యొక్క స్థానం
బంగ్లాదేశ్ యొక్క స్థానం
రాజధాని
అతి పెద్ద నగరం
ఢాకా
23°42′N 90°22′E / 23.700°N 90.367°E / 23.700; 90.367
అధికార భాషలు బెంగాలీ భాష
ప్రభుత్వం పార్లమెంటరీ రిపబ్లిక్
 -  అధ్యక్షుడు ఇయాజుద్దిన్ అహ్మద్
 -  ప్రధానమంత్రి శ్రీమతి షేక్ హసీనా
 -  Chief Adviser (Interim Caretaker Government)
ఫఖ్రుద్దిన్ అహ్మద్
స్వాతంత్ర్యం పాకిస్తాన్ నుండి 
 -  ప్రకటిత మార్చి 26 1971 
 -  విజయ దినం డిసెంబరు 16 1971 
విస్తీర్ణం
 -  మొత్తం 144,000 కి.మీ² (94వది)
55,599 చ.మై 
 -  జలాలు (%) 7.0
జనాభా
 -  2007 అంచనా 150,448,340 (7th)
 -  2001 జన గణన 129,247,2331 
 -  జన సాంద్రత 1045 /కి.మీ² (11వది)
2706 /చ.మై
జీడీపీ (PPP) 2006 అంచనా
 -  మొత్తం $330.8 బిలియన్ (31వది)
 -  తలసరి $2200 (138వది)
జినీ? (2000) 31.8 (medium
మా.సూ (హెచ్.డి.ఐ) (2004) Increase 0.530 (medium) (137వది)
కరెన్సీ టాకా (BDT)
కాలాంశం BDT (UTC+6)
 -  వేసవి (DST) not observed (UTC+6)
ఇంటర్నెట్ డొమైన్ కోడ్ .bd
కాలింగ్ కోడ్ +880
1 Adjusted population, p.4, "Population Census 2001, Preliminary Report". Bangladesh Bureau of Statistics. Archived from the original on 2011-07-06. Retrieved 2007-09-03.

పేరు వెనుక చరిత్ర

బంగ్లాదేశ్‌లోని బంగ్లా అనే పదం ప్రపంచంలో నలుమూలలా నివసించే బెంగాలీ ప్రజలందరికీ వర్తిస్తుంది. బంగ్లాదేశీ అనే పదం బంగ్లాదేశ్‌లో నివసించే ప్రజలందరికీ (బెంగాలీ ప్రజలు కానివారికి కూడా) వర్తిస్తుంది. బెంగాల్ పదానికి మూలం బంగ్లా, బొంగొ (బెంగాలీ భాషలో దీనిని సరైన అర్ధం లభించలేదు). క్రీ.పూ 1000 సంవత్సరాల క్రితం ఇక్కడ స్థిరపడిన ద్రావిడ సంస్కృతికి చెందిన బాంగ్ గిరిజన ప్రజల వలన దీనికి ఈ ప్రాంతానికి ఈ పేరు వచ్చిందని భావిస్తున్నారు. పురాతన వంగ, బంగ అనే పదంగా రూపాంతరం చెంది ఉండవచ్చని చరిత్రకారులు భావిస్తున్నారు. పురాతన బొంగ పదం రూపాంతరం చెంది బంగ అయిందని మరికొందరు భావిస్తున్నారు. పురాతన కాలంలో బొంగ పదానికి సూర్యుడు అని అర్ధం. ఇండో- ఆర్యన్ పదం దేశ్ అనే పదానికి మూలం సంస్కృతం. సంస్కృతంలో దేశ్ అంటే ప్రదేశం, భూభాగం, ప్రాంతం, దేశం అని అర్ధం. బెంగాలీ భాషలో దేశీ అంటే భూమి లేక దేశం అని అర్ధం. బంగ్లాదేశ్ అంటే బెంగాలీ భూమి అని అర్ధం.

వంగ అనే పదం మొదటిసారిగా రాష్ట్రకూటులకు చెందిన మూడవ గోవిందా కాలంనాటి (సా.శ. 805 ) నెసరి ఫలకం మీద లభించింది. అందులో బెంగాల్‌కు చెందిన ధర్మపాలా (వంగ దేశపు రాజు) అని ఉంది. చోళ వంశానికి చెందిన మొదటి రాజేంద్ర చోళ కాలంనాటి దస్తావేజులలో చోళులు 11వ శతాబ్దంలో బెంగాల్ మీద చేసిన దాడి గురించిన వివరాలు ఉన్నాయి. ఆసమయంలో వంగదేశాన్ని గోవిందచంద్రా పాలిస్తూ ఉన్నాడు.

చరిత్ర

ప్రాచీనం

బంగ్లాదేశ్ లోని చిటగాంగ్ అరణ్యాలలో నవీన శిలా యుగం నాటి శిలాజాలు, పనిముట్లు లభించాయి. ప్రస్తుతం లభ్యమవుతున్న ఆధారాలు బెంగాల్ ప్రాంతంలో క్రీ.పూ 3000 సంవత్సరాల నాటి రాతి యుగపు నివాసాలను సూచిస్తున్నాయి. బెంగాల్ ప్రాంతంలో ఆస్ట్రోయాసియాటిక్, ద్రవిడ, ఇండో - ఆర్యన్, టిబెటో - బర్మన్ ప్రజలు నివసించారని తెలుస్తుంది. బెంగాల్ మైదానం (గ్రీక్, రోమన్ భాషలలో గంగారిడై) మీద క్రీ.పూ 325 లో అలెగ్జాండర్ దండెత్తినట్లు చారిత్రక ఆధారాలు లభిస్తున్నాయి. బంగ్లాదేశ్ లోని వారి- బతేశ్వర్ శిథిలాలు పురాతన నగరప్రాంతంగా భావిస్తున్నారు. అలాగే రోమన్ సామ్రాజ్యం, ఆగ్నేయాసియ దేశాలతో వ్యాపార సంబంధాలు ఉన్నట్లు తెలుస్తుంది. బెంగాల్ పురాతన చరిత్ర పురాతన నగరనిర్మాణం, సముద్రతీర రాజ్యాలతో, పురాతన భారతీయ సామ్రాజ్యాలతో సంబంధం ఉంది. తూర్పు బెంగాలులో క్రీ.పూ 232 బౌద్ధుల సామాతత సామ్రాజ్యం స్థాపించబడింది. సా.శ. 200-550 మద్య కాలంలో మౌర్య, గుప్త సామ్రాజ్యాలు తూర్పు బెంగాలులోని అధికభాగాన్ని పాలించాయి. 7వ శతాబ్దంలో తూర్పు బెంగాలులోని వాయవ్య భూభాగాన్ని కొంతకాలం పుంద్రవర్ధనా పాలించాడు. హరికేలా వంశం తూర్పు బెంగాల్ వాయవ్య, సముద్రతీర ప్రాంతాలను పాలించారు. హిందూ నాయకుడు శశాంక గౌడ సామ్రాజ్యం స్థాపించాడు. తరువాత బౌద్ధమతానికి చెందిన చంద్రరాజవంశం అధికారపీఠాన్ని అధిష్ఠించింది.

సా.శ. 750 లో అంతర్యుద్ధం తరువాత బెంగాలీ బౌద్ధమతస్థుల పాలా సామ్రాజ్యం స్థాపించబడింది. పాలా సామ్రాజ్య పాలకులు బౌద్ధమతంలో మహాయాన అనుయాయులు. పాలాలు స్థిరమైన సామ్రాజ్యం స్థాపించారు. పలు ఆలయాలు, విశ్వవిద్యాలయాలను స్థాపించి పోషించారు. పాలా శిల్పకళ, చిత్రకళలు చాలా అందమైన ఆసియన్ కళగా గుర్తించబడుతున్నాయి. సామ్రాజ్య సాంస్కృతిక, నిర్మాణకళ ప్రభావం టిబెట్, ఆగ్నేయాసియా వరకు ప్రాకింది. పాలా సామ్రాజ్యం ఈ ప్రాంతాన్ని 400 సంవత్సరాలు పాలించింది. ధర్మపాలా, దేవపాలా కాలం నాటికి పాలా సామ్రాజ్యం ఉన్నత స్థితికి చేరుకుంది. బ్రాహ్మణికల్ యోధులు దేవా సామ్రాజ్యం, సేనా సామ్రాజ్యాన్ని స్థాపించారు. సేనా సామ్రాజ్యాలు బెంగాల్‌లో జాతి ఆధారితంగా ప్రజలను సమైక్యపరిచారు. వారు ఈ ప్రాంతాన్ని 150 సంవత్సరాల కాలం పాలించారు.

ఇస్లామిక్ బెంగాల్

బంగ్లాదేశ్: పేరు వెనుక చరిత్ర, చరిత్ర, భౌగోళికం 
The Mughal conquest of Bengal in Akbarnama
బంగ్లాదేశ్: పేరు వెనుక చరిత్ర, చరిత్ర, భౌగోళికం 
The Sultanate of Bengal during the reign of Alauddin Hussain Shah in 1500
బంగ్లాదేశ్: పేరు వెనుక చరిత్ర, చరిత్ర, భౌగోళికం 
The Sixty Dome Mosque, a UNESCO World Heritage Site

7వ శతాబ్దం ఆరంభంలో బెంగాలు ప్రాంతంలో ఇస్లాం ప్రవేశించింది. బెంగాలులో పురాతత్వపరిశోధన శాఖ నిర్వహించిన త్రవ్వకాలలో లభించిన అబ్బాసిద్ కాలిఫతే నాణేలు పాలా సామ్రాజ్యానికి మద్య ఆసియా మద్య ఉన్న వ్యాపార సంబంధాలను తెలియజేస్తున్నాయి. బెంగాల్ ప్రాంతంలో ఇస్లాం వ్యాపించడానికి సూఫీయిజం ప్రధాన పాత్ర పోషించింది. 13వ శతబ్ధం ఆరంభంలో ముస్లిములు బెంగాలును ఆక్రమించిన తరువాత బెంగాలు చరిత్ర ఒక ప్రత్యేక మలుపు తిరిగింది.

పురాతన నాగరికతలు సాధించిన విజయాలు సరికొత్త ఇస్లామిక్ రాజ్యాంగం ఏర్పడడానికి, సాంస్కృతిక మార్పులకు, ముస్లిం నాగరికత ప్రారంభానికి దారితీసాయి. 1204 లో ఢిల్లీ సుల్తానేట్‌కు చెందిన బఖ్తియార్ సేనా సామ్రాజ్యానికి చెందిన ఖిల్జి లక్ష్మణ్ సేనను ఓడించాడు. ఢిల్లీకి చెందిన మమ్లక్ సుల్తానేట్, ఖిల్జీ రాజవంశం, తుగ్లక్ రాజవంశాలు ఈ ప్రాంతాన్ని ఒక శతాబ్దం కంటే అధికంగా పాలించారు. 1328 లో ఫకురుద్దీన్ ముబారక్ షా సోనార్ గావ్ అనే నగరాన్ని స్థాపించాడు. 1342 లో బెంగాల్ సుల్తానేట్ ప్రకటించబడింది. ఇలియాషాహి రాజవంశం బెంగాల్‌ను 123 సంవత్సరాలు పాలించింది. సుల్తానేట్ ఆసియా భూభాగంలో ఆధిక్యత సాధించారు. సుల్తానులు మింగ్ చైనా, పర్షియా, హెజాజ్, ఇండోనేషియా, ఓట్టామన్ సామ్రాజ్యంతో సత్సంబంధాలను ఏర్పరుచుకున్నారు.

రాజా గణేశ్ కుటుంబం ఇస్లాం మతానికి మతమార్పిడి చేసుకుంది. 1415, 1435లో రాజా గణేశ్ రాజ్యస్థాపన చేసాడు. 1487లో రెండవ దఫా ఇలియాస్‌ షాహిని రాజభవంలో నిర్భంధించి హబేషా సైనికాధిపతులు ఇలియాస్‌ షాహి పాలనకు ముగింపు పలికారు. 1497లో హుస్సేన్ షాహీ రాజవంశం రాజ్యాధికారం చేపట్టగానే అల్లావుద్దీన్ హుస్సేన్ షా (మక్కా షరీఫ్ కుమారుడు) బెంగాల్ సుల్తాన్ పదవిని అలంకరించాడు. అలావుద్దీన్ పాలన సమృద్ధి, విభిన్న సంస్కృతులకు తెరతీసింది. బెంగాల్ వ్యాపారులు హిందూ మహాసముద్ర తీర దేశాలతో వ్యాపార సంబంధాలు ఏర్పరుచుకున్నారు. సుల్తాన్ రాజ్యసభను పలువురు సాహస యాత్రీకులు (ఇబ్న్ బటుటా, నిక్కోలో డీ కొంటి, రాల్ఫ్ ఫిట్చ్, అడ్మిరల్ జెంగ్ హె) సందర్శించారు.

1517లో పోర్చుగీసు ప్రజలు వ్యాపారులు మలక్కా, గోవా సముద్రం మీద ప్రయాణించి బెంగాల్‌లో ప్రవేశించారు. 1528లో పోర్చుగీసు వ్యాపారులకు చిట్టగాంగ్‌లో కార్మాగారాలు, కస్టమ్స్ హౌసులు నిర్మించుకోడానికి అనుమతి లభించింది. తరువాత అది పొర్టో గ్రాండే డీ బెంగలా కాలనీ స్థాపించే వరకు అభివృద్ధి చెందింది. 1538లో షేర్ షా సూరి బెంగాల్ మీద విజయం సాధించాడు. ఆయన కాబూల్ నుండి చిట్టగాంగ్ వరకు గ్రాండ్ ట్రంక్ రోడ్డు నిర్మించాడు. 1564లో సూర్ రాజవంశం స్థానంలో ఆఫ్ఘన్‌కు చెందిన కర్రానీ రాజవంశం బెంగాల్ ను వశపరచుకుంది. బెంగాల్ సుల్తానుల పతనం బారో - బూయాన్ భూస్వాముల ఆధికారాన్ని అధికం చేసింది. 16వ శతాబ్ధానికి ఇసా ఖాన్ నాయకత్వంలో, ది బారో - భుయాన్లు బెంగాల్ తూర్పు భూభాగం అంతటి మీద ఆధిపత్యం సాధించారు. వారు అహోం రాజ్యం, కొచ్ సామ్రాజ్యంతో కలిసి మొఘల్ సామ్రాజ్య విస్తరణకు గట్టిగా ఎదురు నిలిచారు. 1530లో మారుక్ యు రాజ్యం స్థాపించబడింది. తరువాత చిటగాంగ్ భూభాగం అరకనెసే పాలనలోకి మారింది. మద్యయుగంలో బెంగాల్ సాహిత్యానికి మరుక్ యు ఒక ప్రముఖ కేంద్రంగా మారింది. అరాకన్ రాజ్యసభ ముస్లిం సాహిత్యకారులకు, భూస్వాములకు స్వర్గదామంగా మారింది.

16వ శతాబ్దంలో మొఘల్ సామ్రాజ్యం బెంగాల్ మీద ఆధిపత్యం సాధించింది. ఢాకా నగరానికి జహంగీర్ నగర్ అని నామాంతరం చేయబడింది. తరువాత బెంగాల్ మొఘల్ సామ్రాజ్యంలో ప్రధాన కేంద్రంగా మారింది. తరువాత మొఘల్ పాలకులు ఈ ప్రాంతంలో వ్యవసాయ సంస్కరణలు చేపట్టారు.అక్బర్ పాలనలో బెంగాల్ కేలండర్లో మార్పులు తీసుకురాబడ్డాయి. బెంగాల్ వ్యవసాయంలో అత్యున్నతి సాధించి వ్యవసాయ ఉత్పత్తులను ఎగుమతి చేసే దశకు చేరుకుంది. 1666లో షైస్తా ఖాన్ అర్కానీస్సును ఓడించి చిట్టగాంగ్ మీద ఆధిపత్యం సాధించాడు. 18వ శతాబ్దంలో మొఘల్ సామ్రాజ్యం పతనం తరువాత బెంగాల్ ప్రిన్సిపాలిటీ రూపొందించబడింది. బెంగాల్ నవాబులు ఆధిపత్యం త్రోసివేసి యురోపియన్ వ్యాపారులు ఈ భూభాగం మీద ఆధిపత్యం సాధించారు. 18వ శతాబ్దంలో బెంగాల్ సంపన్న ప్రాంతంగా మారింది.

బ్రిటిష్ పాలన

బంగ్లాదేశ్: పేరు వెనుక చరిత్ర, చరిత్ర, భౌగోళికం 
British rule began with Robert Clive's victory at the Battle of Plassey in 1757

1757లో బెంగాల్ చివరి నవాబు " సిరాజ్ ఉద్ దౌలా "ను జయించిన తరువాత బ్రిటిష్ ఈస్టిండియా కంపెనీ బెంగాల్ మీద ఆధిపత్యం సాధించారు. బ్రిటిష్ రాజ్ పాలనలో బెంగాల్ ప్రెసిడెన్సీ రూపొందించబడింది. 1793లో కంపెనీ శాస్వత కాలనీలు ఏర్పాటు చేసుకున్నది. కంపెనీ పాలన ఉన్నత స్థాయికి చేరుకున్న సమయంలో ఉత్తర భారతం, బర్మా , మలక్కా స్ట్రైట్ లోని అత్యధిక భాగం ప్రెసిడెన్సీ న్యాయాధికార పరిధిలోకి చేరింది. 1857 సిపాయీల తిరుగుబాటు ఫలితంగా ఈ భూభాగం మీద అధికారం పూర్తిగా బ్రిటిష్ ప్రభుత్వపరం అయింది. బ్రిటిష్ ఇండియన్ ఎంపైర్ స్థాపన తరువాత బెంగాల్ ప్రాంతంలో బ్రిటిష్ సంస్కృతిక ప్రభావం అధికం అయింది. నిర్మాణాలు, విద్య , కళల మీద ఈ ప్రభావం మరింత అధికంగా ఉంది. బెంగాల్ ప్రాంతం తిరుగుబాటుకు , బ్రిటిష్ వ్యతిరేక ఉద్యమాలకు కేంద్రంగా ఉండేది. 1905 , 1911 మద్యకాలంలో బెంగాల్ విభజన తరువాత ఇది అధికంగా ఈస్టిండియా నివాసిత ప్రాంతంగా ఉంది.

1937లో ఈ భూభాగంలో స్వంతత్రంగా ఎన్నికలు నిర్వహించబడ్డాయి. తరువాత మొదటిసారిగా ఈ ప్రాంతంలో స్వతంత్రంగా ఎన్నిక చేయబడిన ప్రభుత్వం ఏర్పడింది. క్రిషక్ ప్రజా పార్టీ నాయకుడున్ ఎ.కె. ఫహ్లుల్ హుక్ ప్రధానమంత్రిగా ఈ ప్రాంతంలో మొదటిసారిగా ప్రభుత్వం ఏర్పాటు చేసాడు. 1942 లాహోర్ రిసొల్యూషన్ స్వీకరించబడింది. బ్రిటిష్ ఇండియా వాయవ్య , తూర్పు భూభాగాలు కలిపి స్వతంత్రదేశంగా రూపొందించబడింది. 1943లో ముస్లిం లీగ్ " సర్. ఖవాజా నజీరుద్దీన్ " నాయకత్వంలో కూటమి ప్రభుత్వం స్థాపించింది.

రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో ఇంపీరియల్ జపాన్ సైన్యం ఎయిర్ ఫోర్స్ చిట్టగాంగ్ మీద వాయుమార్గ దాడిచేసింది. కూటమి సైన్యాలు భూభాగం అంతా భూభాగం నుండి బర్మా యుద్ధాన్ని ఎదుర్కొన్నది. రెండవ ప్రపంచ యుద్ధం తరువాత బ్రిటిష్ ఇండియా ప్రభుత్వం భారతీయ ద్వీపకల్పం నుండి వైదొలగాలని నిర్ణయించుకుంది. తరువాత ముస్లిం లీగ్, కాంగ్రెస్ మద్య రాజీ సమావేశాలు దేశవిభజనకు దారితీసాయి. సమైక్య బెంగాల్ ప్రతిపాదన తిరస్కరించబడింది.

బెంగాల్‌ను పలుమార్లు ( 1770 బెంగాల్ క్షామం, 1943 బెంగాల్ క్షామం) కరువు బాధించింది.

తూర్పు పాకిస్థాన్

1947లో బ్రిటిష్ సామ్రాజ్యం భారతదేశం నుండి వైదొలగిన తరువాత బెంగాల్ మతప్రాతిపదిక మీద విభజించబడింది. పశ్చిమ బెంగాల్ కొత్తగా రూపొందిన భారతదేశంలోకి విలీనం చేయబడింది. తూర్పు బెంగాల్ (ముస్లిం ఆధిక్యత కలిగి ఉంది) పాకిస్థాన్లో విలీనం చేయబడింది. ముందు దీనిని ఢాకా రాజధానిగా తూర్పు బెంగాల్ భూభాగంగా పిలిచేవారు తరువాత తూర్పు పాకిస్థాన్‌గా నామాంతరం చెందింది.

బంగ్లాదేశ్: పేరు వెనుక చరిత్ర, చరిత్ర, భౌగోళికం 
The Bengali Language Movement catalysed the assertion of Bengali national identity in East Bengal and later East Pakistan.

జమీందారీ విధానం

1950లో తూర్పు బెంగాల్‌లో భూసంస్కరణలు అమలుకు రావడంతో జమిందారీ వ్యవస్థకు ముగింపు వచ్చింది. తూర్పు బెంగాల్ లోని ఆర్థిక రంగం, గణాంక ఆధిక్యత వహించగా పశ్చిమ పాకిస్థాన్ సైనిక పరంగా ఆధిక్యత కలిగి ఉండేది. 1952లో బెంగాలీ భాషోద్యమం పాకిస్థాన్ రెండు విభాగాల మధ్య చీలికకు దారితీసింది. కేంద్ర ప్రభుత్వం మీద కలిగిన అసంతృప్తి తరువాత దశాబ్ధంలో ఆర్థిక, సాంస్కృతిక వివాదాలకు అధికం కావడానికి కూడా దారితీసాయి. బెంగాలీ ప్రజలకు నాయకత్వం వహిస్తూ అవామీ లీగ్ రాజకీయ పార్టీ అవతరించింది. అవామీ లీగ్ ఉద్యమ ఫలితంగా అవామీ లీగ్ నాయకుడు షేక్ ముజబూర్ రహమాన్ 1960, 1966 లలో ఖైదు చేయబడ్డాడు. 1969లో ఖైదు నుండి విడుదల చేయబడ్డాడు. 1970లో బంగ్లాదేశ్‌ను భోలా తుఫాన్ ధ్వంసంచేసింది. ఈ తుఫాన్ తూర్పు బెంగాల్‌లో 5లక్షల మంది ప్రాణాలను బలిగొన్నది. అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం నుండి సరైన స్పందన లభించలేదు. బెంగాలీప్రజల ఆగ్రహం అధికం అయింది. 1970లో షేక్ ముజబూర్ రహమాన్ అమోఘ మెజారిటీతో విజయం సాధించాడు. అయినప్పటికీ ఆయన అధికారం స్వీకరించడానికి అవరోధం ఎదురైంది.

రాజీ ప్రయత్నాలు

షేక్ ముజబూర్ రహమాన్‌తో రాజీ ప్రయత్నాలు మొదలైన తరువాత అధ్యక్షుడు యాహ్యాఖాన్, సైనిక అధికారులు ఆపరేషన్ సెర్చ్ లైటు ఏర్పాటు చేసి తూర్పు పాకిస్థాన్ మీద సైనికచర్య తీసుకుని 1971 మార్చి 26 తెల్లవారు ఝామున షేక్ ముజబూర్ రహ్మాన్‌ను ఖైదు చేసారు. యాహ్యా మెథడ్స్ హింసాత్మకం, దౌర్జన్య పూరిత విధానాలకు పలువురు పౌరులు ప్రాణాలు కోల్పోయారు. యాహ్యాస్ చీఫ్ హిందువులను, మేధావులను లక్ష్యంగా చేసుకుని దాడి సాగించారు. దాదాపు 10 లక్షల శరణార్ధులు భారతదేశంలోకి ప్రవేశించారు. 1971లో తూర్పు బెంగాల్ అంతర్యుద్ధంలో 30 వేలమంది ప్రాణాలు కోల్పోయారని అంచనా. ముజీబుర్ రహ్మాన్ చివరికి US ప్రత్యక్ష జోక్యం ఫలితంగా 1972 జనవరి 8 న విడుదలయ్యారు.

అవామీ లీగ్

అవామీ లీగ్ నాయకులు భారతదేశంలో కలకత్తాలో ఉంటూనే తూర్పు బెంగాల్‌లో ప్రభుత్వం రూపొందించారు. 1971 ఏప్రిల్ 17న అజ్ఞాతంలో ఏర్పాటైన ప్రభుత్వం మెహర్‌పూర్ వద్ద ప్రమాణ స్వీకారం చేసారు. తిజుద్దీన్ అహ్మద్ మొదటి ప్రధానిగా, సయ్యద్ నజ్రుల్ ఇస్లాం తాత్కాలిక అధ్యక్షునిగా ప్రమాణస్వీకారం చేసారు. 9 సంవత్సరాల పోరాటం తరువాత బంగ్లాదేశ్ స్వతంత్ర పోరాటం ముగింపుకు వచ్చింది. ముల్కీ బహ్ని కాదర్ బహ్ని, హెమయత్ బహ్ని నాయకత్వంలో సైన్యం బంగ్లాదేశ్ సైన్యంగా రూపొందింది. జనరల్ ఎం.ఎ.జి ఒస్మని ఆధ్వర్యంలో పాకిస్థాన్ సౌన్యం ఒకవైపు నిలిచింది. ముల్కీ బహ్ని సైన్యం పాకిస్థాన్ సైన్యాలను ఎదుర్కొంటూ గొరిల్లా పోరు సాగించింది. 1971 బంగ్లాదేశ్ మారణహోమంలో పాకిస్థాన్ సైన్యం, మతపరమైన సహాయ సైన్యాలు బెంగాలీ పౌరులు, మేధావులు, యువకులు, విద్యార్థులు, రాజకీయ వాదులు, ఉద్యమకారులు, మత సంబంధిత అల్పసంఖ్యాకులను లక్ష్యంగా చేసుకుని దాడులు సాగించారు. శీతాకాలంలో మైత్రో బహినిల్ బంగ్లాదేశ్ - ఇండియా అలైయ్డ్ సైన్యం పాకిస్థాన్ సైన్యాలను ఓడించారు. పాకిస్థాన్ లొంగిపోయిన తరువాత 1971 డిసెంబరు 16న స్వతంత్ర బంగ్లాదేశ్ అవతరించింది.

బంగ్లాదేశ్

దస్త్రం:Sheikh Mujib Bangladesh Constitution.jpg
Prime Minister Sheikh Mujibur Rahman signs the Constitution of Bangladesh into law on 16 December 1972

స్వతంత్రం తరువాత బంగ్లాదేశ్ రాజ్యాంగం లౌకిక బహుళ పార్టీ విధానం స్వతత్ర విధానం అమలుచేసారు. 1973లో అవామీ లీగ్ విజయం సాధించింది. 1973, 1974 లో దేశంలో క్షామం సంభవించింది. 1975లో ముజిబ్ ఒక పార్టీ సోషలిస్ట్ రూల్ విధానాన్ని అమలు చేసాడు. 1975 ఆగస్టు 15న ముజిబ్, ఆయన కుటుంబ సభ్యులను మిడ్- లెవల్ మిలటరీ అధికారులు కాల్చి వేసారు. ఉపాధ్యక్షుడు ఖండేకర్ ముస్తగ్ అహ్మద్ అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేసాడు. 1975 నవంబరు 7లో దేశంలో సైనికాధికారం వచ్చింది. దేశంలో శాంతి నెలకొనడానికి అత్యవసర పరిస్థితి అమలుచేసారు. మస్తగ్ రాజీనామా చేసాడు. దేశంలో తాత్కాలికంగా మార్షల్ లా ప్రవేశపెట్టబడింది. కొత్త అధ్యక్షుడికి సహాయంగా ముగ్గురు సర్వీస్ చీఫ్స్ నియమించబడ్డారు. జస్టిస్ అబు సయెం కూడా చీఫ్ మార్షల్ లా అడ్మినిస్ట్రేటర్‌లలో ఒకరు. జస్టిస్ సయెం రాజీనామా చేసిన తరువాత 1977లో లెఫ్టినెంట్ జనరల్ జియార్ రహ్మన్ అధ్యక్షపదవి చేపట్టాడు. అధూక్షుడు జియా తిరుగి బహుళ పార్టీ విధానం, ఫ్రీ మార్కెట్ ప్రవేశపెట్టాడు. తరువాత బంగ్లాదేశ్ నేషనల్ పార్టీని స్థాపించాడు. 1981లో జియాను కాల్చివేయడంతో జియా పాలన ముగింపుకు వచ్చింది. బంగ్లాదేశ్ తరువాత ప్రధానపాలకుడుగా లెఫ్టినెంటు జనరల్ హొస్సైన్ మొహనద్ ఎర్షద్ 1982 మార్చి‌లో పదవిని చేపట్టాడు. 1990 డిసెంబరు 6 వరకు హొస్సైన్ మొహనద్ ఎర్షద్ పాలన సాగింది. తరువాత రాజకీయ పార్టీలన్నీ సమైక్యంగా (ప్రజలు కూడా) తిరుగుబాటు చేసి హొస్సైన్ మొహనద్ ఎర్షద్ రాజానామా కొరకు వత్తిడి తీసుకురావడంతో రాజీనామా చేసాడు.

ఖలేడా జియా

బంగ్లాదేశ్: పేరు వెనుక చరిత్ర, చరిత్ర, భౌగోళికం 
Lt General Ziaur Rahman served as President (1977–1981) and CMLA (1977–1979)

బంగ్లాదేశ్ తిరిగి పార్లమెంటరీ డెమాక్రసీకి మారింది. గతించిన జియాస్ భార్య ఖలేడా జియా బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీకి నాయకత్వం వహించి 1991 ఎన్నికలలో విజయం సాధించింది. తరువాత మొదటి ప్రధానమంత్రి పదవిని చేపట్టి బంగ్లాదేశ్ చరిత్రలో మొదటి మహిళా ప్రధానిగా చరిత్రలో నిలిచింది. అవామీ లీగ్‌కు జీవించి ఉన్న ముజిబూర్ కుమార్తె షేక్ హసీనా నాయకత్వం వహించింది. తరువాత 1996 ఎన్నికలలో షేక్ హసీనా నాయకత్వంలో అవామీ లీగ్ అధికారానికి వచ్చింది. 2001లో బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ అధికారానికి వచ్చింది. 2006 అక్టోబరు బి.ఎన్.పి రాజీనామా చేయడంతో దేశంలో రాజకీయ అనిశ్చితి చోటు చేసుకుంది. మద్యలో అధికారబాధ్యతలు వహించిన ప్రభుత్వం 90 రోజుల గడువు తరువాత రాజకీయ పార్టీలను సమైక్యం చేసి దేశంలో ఎన్నికలు జరగేలా పరిస్థితులు చక్కదిద్దింది.

జనవరి మాసంలో చివరి క్షణంలో అవామీ లీగ్ ఎన్నికల నుండి వైదొలగింది. 2007 జనవరి 11 న బంగ్లాదేశ్‌లో తిరిగి సైనిక ఆధిక్యం మొదలైంది. తరువాత కొన్ని దశాబ్ధాల కాలం బంగ్లాదేశ్‌లో లంచం సమస్య, రాజకీయ హింస అధికమైంది. కేర్ టేకర్ ప్రభుత్వం ప్రభుత్వం అన్ని స్థాయిలలోని లంచం మూలాలతో తొలగించడానికి కృషి చేసింది. ప్రభుత్వం లంచం తీసుకున్నందుకు 160 మందిని (రాజకీయ నాయకులు, సివిల్ సర్వెంట్స్, వ్యాపారులు) ఖైదుచేసింది. ఖైదు చేయబడిన వారిలో రెండు ప్రధాన పార్టీ సిబ్బంది ఉన్నారు. వారిలో ఖలేడా జియా కుమారులిద్దరు కూడా ఉన్నారు.

ప్రక్షాళన కార్యక్రమం తరువాత కేర్ టేకర్ ప్రభుత్వం 2008 డిసెంబరు 29న ఎన్నికలు నిర్వహించింది. . అవామీ లీగ్ షేక్ హసీనా ఎన్నికలలో విజయం సాధించాడు. 2009 జనవరి 6న షేక్ హసీనా ప్రధానమంత్రిగా పదవీ స్వీకారం చేసింది.

భౌగోళికం

బంగ్లాదేశ్: పేరు వెనుక చరిత్ర, చరిత్ర, భౌగోళికం 
Satellite image of Bangladesh from space, including Ganges Delta, the world's largest delta with its three distributaries- Padma, Meghna and Jamuna

బంగ్లాదేశ్ భౌగోళికంగా మూడు భాగాలుగా విభజించబడింది. దేశం అత్యధిక భాగం గంగా- బ్రహ్మపుత్ర మైదానంలో ఉంది. అందు వలన దేశంలో అత్యధిక భూభాగాలు వ్యవసాయ యోగ్యంగా ఉన్నాయి. వాయవ్య, మద్య భూభాగాలు మధుపూర్ భూభాగంగా రూపొందాయి. బరింద్ భూభాగం పీఠభూమిగా ఉంది. ఆగ్నేయం, ఈశాన్య భూభాలు సతతహరితారణ్యాలకు నిలయంగా ఉన్నాయి. బ్రహ్మపుత్రా, పద్మా నదుల (గంగా నది) సంగమంలో గంగా మైదానం ఏర్పడింది. ఇంకా దేశంలో జమునా, మెఘనా, వాటి ఉపనదులు ప్రవహిస్తున్నాయి. గంగా జమునా నదితో సంగమించి తరువాత మేఘనా నదితో సంగమించి చివరగా బంగాళాఖాతంలో సంగమిస్తుంది. నదులు తీసుకువస్తున్న సారవంతమైన మట్టి బంగ్లాదేశ్ భూభాగాన్ని ప్రంపంచంలో అత్యధిక సారవంతమైన వ్యవసాయ భూములుగా మారుస్తుంది. బంగ్లాదేశ్‌లో పవహిస్తున్న నదులు 57 సరిహద్దులను ఏర్పరుస్తున్నాయి. అందువలన నీటిసమస్యలు రాజకీయంగా వివాదాలకు దారితీస్తున్నాయి.

బంగ్లాదేశ్‌లో సారవంతమైన వ్యవసాయ మైదానాలు ఉన్నాయి. బంగ్లాదేశ్ అత్యధికంగా సముద్రమట్టానికి 12మీ ఎత్తులో ఉంది. సముద్రజాలాల ఎత్తు 2 అడులు పెరిగినటైతే దేశంలో 10% భూభాగం జలమయం ఔతుందని అంచనా. బంగ్లాదేశ్ భూభాగంలో 17% అరణ్యాలు, 12% కొండలు ఉన్నాయి. దేశంలోని చిత్తడి భూములు పర్యావరణ వైరుధ్యానికి అంతర్జాతీయ ప్రాముఖ్యత కలిగి ఉన్నాయి.

1960 నుండి ఆగ్నేయ బంగ్లాదేశ్‌లో సహజ ప్రకృతి పరిరక్షణ కొరకు ప్రయోగాలు మొదలయ్యాయి. క్రాన్ డాములు నిర్మాణం కారణంగా జలప్రవాహాలు తీసుకువస్తున్న సారవంతమైన మట్టి పరిమాణం అధికం చేసి సరికొత్త భూమిని తయారుచేసింది. 1970 నుండి డచ్ నిధిసహాయంతో బంగ్లాదేశ్ ప్రభుత్వం ఈ సరికొత్త భూముల అభివృద్ధికి కృషి చేస్తుంది. ఈ ప్రయత్నం రోడ్లు, కల్వర్టులు, నదీతీరాలను బలపరచడం, తుఫాను ఆశ్రయాలను, మరుగుదొడ్లు, చెరువులు నిర్మించడం మొదలైన పనులు చేపట్టబడ్డాయి. అలాగే భూములను నివాసప్రాంతాలుగా కూడా మార్చబడుతూ ఉంది. 2010 నాటికి ఈ ప్రణాళిక ద్వారా 21,000 కుటుంబాలకు భూమి మంజూరు చేయబడింది. బంగ్లాదేశ్‌లోని 1280 మీటర్ల ఎత్తైన తహ్జిందాంగ్ శిఖరం (బిజయ్) దేశంలో అత్యంత ఎత్తైనదిగా గుర్తించబడుతుంది. ఇది బందన్ జిల్లాలో ఉంది.

వాతావరణం

బంగ్లాదేశ్: పేరు వెనుక చరిత్ర, చరిత్ర, భౌగోళికం 
Sundarbans, the largest single block of tidal halophytic mangrove forest in the world and a UNESCO World Heritage Site

బంగ్లాదేశ్ వాతావరణంలో అక్టోబరు నుండి మార్చి వరకు స్వల్పంగా చలి ఉంటుంది. మార్చి- జూన్ వరకు వేడి, ఆర్ధ్రతతో కూడిన వేసవి ఉంటుంది. దేశంలో ఎప్పుడు 0 కంటే తక్కువ ఉష్ణోగ్రత నమోదుకాలేదు. దేశంలో అతి తక్కువగా వాయవ్యంలో ఉన్న దినాపూర్ జిల్లాలో 1905 ఫిబ్రవరి 3న 1.1 సెంటీ గ్రేడ్ ఉష్ణోగ్రత నమోదు చేయబడింది. వెచ్చని, ఆర్ధ్రతతో కూడిన వర్షాకాలం జూన్- అక్టోబరు దేశానికి అవసరమైన వర్షాన్ని విస్తారంగా అందిస్తుంది. వరదలు, తుఫానుకు, టొర్నాడోలు, టైడల్ బోర్ (ఉప్పెన) మొదలైన జాతీయ విపత్తులు తరచుగా సంభవిస్తుంటాయి. అరణ్యాల నరికివేత ఫలితంగా మట్టిలో సారహీనత, భూక్షయం మొదలైన వంటి నష్టం సంభవిస్తుంది. 1970, 1991 బంగ్లాదేశ్‌లో సంభవించిన తుఫానులు దేశానికి అధిక నష్టాన్ని కలుగజేసాయి. 1991 బంగ్లాదేశ్‌లో సంభవించిన తుఫాన్ 1,40,000 వేల మంది ప్రాణాలను బలిగొన్నది.

వరదలు

1998 సెప్టెంబరులో బంగ్లాదేశ్ వరదలు ఆధునిక ప్రపంచ చరిత్రలో అతి తీవ్రమైన వరదగా గుర్తించబడింది. బ్రహ్మపుత్ర, గంగా, మేఘనా నదులు పొంగి తన జలాలతో 3,00,000 కుటుంబాలను ముంచెత్తి, 9700 కి.మీ రహదారి, 2700 నదీతీరాలను చిధ్రం చేసాయి. ఈ వరదలు అదనంగా 1000 మంది ప్రాణాలను బలితీసుకుని, 3,00,000 మందిని నిరాశ్రయులను చేసాయి. వరదలలో 1,35,000 పశుసంపద నశించింది, 50 చ.కి.మీ భూమి ధ్వంసం అయింది, 11,000 కి.మీ పొడవైన రహదారి అస్థవ్యస్థం అయింది. దేశంలో మూడింట రెండు వంతులు భూభాగం నీటిలో మునిగింది. వరదలు తీవ్రతకు పలు కారణాలు ఉన్నాయని భావించారు. అసాధారణ వర్షపాతం ఒక కారణం, హిమాలయాల నుండి స్రవించిన అధిక జలాలు మరొక కారణం, వంటచెరకు, జతువుల కొరకు మార్గం సుగమం చేయడానికి అధికంగా నరకబడిన వృక్షాలు ఇందుకు కారణాలని భావించారు.

వాతావరణ బాధిత దేశం

బంగ్లాదేశ్: పేరు వెనుక చరిత్ర, చరిత్ర, భౌగోళికం 
Bangladesh-Burma maritime border off the coast of St. Martin's Island and coral reef

ప్రస్తుతం బంగ్లాదేశ్ వాతావరణ మార్పుల కారణంగా అధికంగా బాధించబడుతున్న దేశాలలో ఒకటిగా గుర్తించబడుతుంది. జాతీయ విపత్తులకు అధిక వర్షపాతం, సముద్రమట్టం అధికం కావడం, ఉష్ణమండల తుఫానుల కారణంగా వాతావరణంలో సంభవించే మార్పులు కారణమని భావించబడుతుంది. విపత్తుల కారణంగా వ్యవసాయం బాధించబడుతుందని, మంచి నీరు కలుషితం కావడం, ఆహారం కొరత, మానవ ఆరోగ్యం క్షీణించడం, నివాసగృహాల నష్టం సంభవిస్తాయి. రాబోయే దశాబ్దాలలో సముద్రమట్టం అధికం కావడం వలన 2,00,00,000 మంది ప్రాణాలు కోపడగలరని అంచనా వేస్తున్నారు. వాతావరణ శరణార్ధులు బంగ్లాదేశ్ నదీజలాలు ఆర్సెనిక్ రసాయనంతో కలుషితం అయ్యాయి. ఇక్కడి మట్టిలో ఆర్సెనిక్ నిల్వలు అధికంగా ఉండడం ఇందుకు కారణం. ఆర్సెనిక్ రసాయనం కలిగిన మంచినీరు 77 మిలియన్ల ప్రజల ఆరోగ్యం మీద ప్రభావం చూపుతుంది.

బంగ్లాదేశ్ ప్రకృతి సహజ వరదలు, సుడిగాలులు, తుఫానులతో పీడిత దేశాలలో ఒకటి. బంగ్లాదేశ్ భూకంప ప్రమాదం ఉన్న ప్రాంతంగా గుర్తించబడుతుంది. సాక్ష్యంగా టెక్టోనిక్స్ కారణంగా నలిగిన నదులు అకస్మాత్తుగా తమ మార్గాన్ని మార్చుకున్నాయి. నదులు మార్గాన్ని మార్చుకోవడం ఆ సంవత్సరం దేశంలో కురిసిన వర్షాల కారణంగా తెలిసింది.

పర్యావరణం

బంగ్లాదేశ్: పేరు వెనుక చరిత్ర, చరిత్ర, భౌగోళికం 
The Bengal tiger is the national animal of Bangladesh

1994 మే 3న బంగ్లాదేశ్ రియో " కన్వెన్షన్ ఆన్ బయొలాజికల్ డైవర్శిటీ "కి అంగీకారం తెలియజేసింది.2014 గణాంకాలను అనుసరించి బంగ్లాదేశ్ 2014లో సరికొత్తగా " బయోడైవర్శిటీ యాక్షన్ ప్లాన్ " విధానాన్ని రూపొందించింది.

బంగ్లాదేశ్ ఇండోమలయా జోన్‌లో ఉంది. బంగ్లాదేశ్ పర్యావరణంలో పొడవైన సముద్రతీరం కూడా కలిసి ఉంటుంది. పలు నదులు, సరసులు, చిత్తడి నేలలు, సతతహతారణ్యాలు, కొండలలోని అరణ్యాలు, వర్షాధార అరణ్యాలు, మంచినీటి చిత్తడి అరణ్యాలు, పొడవైన గడ్డితో కూడిన చదునైన మైదానాలు ఉన్నాయి. బంగ్లాదేశ్ మైదానాలు సారవంతమైన మట్టికి ప్రఖ్యాతి చెంది ఉన్నాయి. సారవంతమైన భూభాగం విస్తారమైన పంటలు పండడానికి సహకరిస్తుంది. బంగ్లాదేశ్ పుష్కలమైన వృక్షజాలంతో నిండి ఉంటుంది. తరచుగా గ్రామాలు మామిడి, పనస, వెదురు, పోక, కొబ్బరి, ఖర్జూరపు చెట్ల మద్య దృశ్యాదృశ్యంగా ఉంటాయి. బంగ్లాదేశ్‌లో 6,000 జాతుల వృక్షజాతులు ఉంటాయి. వీటిలో 5000 జాతులు పుష్పించే జాతి వృక్షజాలం ఉంటుంది. జలాశయాలు, చిత్తడి భూములు పలు నీటి మొక్కలు పెరగడానికి సహకరిస్తున్నాయి. వర్షాకాలంలో నీటి సంపంగి, తామర విస్తారంగా పూస్తుంటాయి. బల్ంగాదేశ్‌లో 50 అభయారణ్యాలు ఉన్నాయి.

సుందర్బన్ అరణ్యాలు

బంగ్లాదేశ్ సుందర్బన్ అరణ్యాలకు, ప్రపంచంలోని అతిపెద్ద మాంగ్రోవ్ ఫారెస్టుకు నిలయం. మాంగ్రోవ్ ఫారెస్ వైశాల్యం 6,000 చ.కి.మీ. ఇది ఆగ్నేయ సముద్రతీరంలో ఉంది. ఇది మూడు భాగాలుగా (సుందర్బన్ సౌత్ వన్యప్రాణి అభయారణ్యం, సుందర్బన్ ఈస్ట్ వన్యప్రాణి అభయారణ్యం, సుందర్బన్ నైరుతి వన్యప్రాణి అభయారణ్యం) ఉన్నాయి. ఈ అరణ్యం యునెస్కో ప్రపంచ వారసత్వపు సంపదగా గుర్తించబడుతుంది. ఈశాన్య సిల్హెట్ డివిషన్ హయోర్ చిత్తడి భూములకు నిలయం. ఇది అసమానమైన పర్యావరణానికి ప్రతీకగా ఉంది. బంగ్లాదేశ్‌లో ట్రాపికల్ అండ్ సబ్ ట్రాపికల్ కొనిఫిరస్ ఫారెస్ట్, ఫ్రెష్ వాటర్ స్వాంప్ ఫారెస్ట్, మిశ్రిత వర్షాధార అరణ్యాలు ఉన్నాయి. ఆగ్నేయ చిటగాంగ్ డివిషన్‌లో సతతహరితారణ్యం, అర్ధ సతతహరితారణ్యం ఉన్నాయి. మద్య బంగ్లాదేశ్‌లో సాల వృక్షాల అరణ్యం ఉన్నాయి. ఇవి గాజీపూర్ జిల్లా, తంగై, మైమెంసింగ్ జిల్లాలలో విస్తరించి ఉంది. ఎస్.టి మర్టింస్ ఐలాండ్‌లో పగడాల దిబ్బలు మాత్రమే ఉన్నాయి.

జంతుజాలం

బంగ్లాదేశ్ అరణ్యాలు, చిత్తడినేలలు, వుడ్లాండ్స్, కొండలలో విస్తారమైన జంతుజాలం ఉంది. The vast majority of animals dwell within a habitat of 150,000 km2. బెంగాల్ పులి, క్లౌడెడ్ లెపర్డ్, ఉప్పునీటి మొసలి, నల్ల చిరుత, చేపలు పట్టే పిల్లి మొదలైన కౄర జంతువులు సుందర్బన్లలో ఉన్నాయి. . ఉత్తర, తూర్పు బంగ్లాదేశ్ ఆసియన్ ఏనుగులు, హూలాక్ గిబ్బన్, ఆసియన్ నల్ల ఎలుగు, ఓరియంటల్ పియడ్ హార్న్‌బిల్ మొదలైన జంతుజాలానికి పుట్టినిల్లు. నైరుతీ ప్రాంతంలోని వుడ్లాండ్స్‌లో చితల్ జింకలు అధికంగా ఉన్నాయి. బ్లాక్ జెయింట్ ఉడుత, కేప్డ్ లాంగూర్, బెగాల్ నక్క, సాంబార్ జింక, అడవి పిల్లి, రాజ నాగం, విల్డ్ బోయర్, మంగూస్, పంగొలింస్, పైథాన్, వాటర్ మొనిటర్ మొదలైన ఇతర జంతువులు కూడా ఉన్నాయి. ఇరావడి డాల్ఫిన్లు, దక్షిణాసియ నదీ డాల్ఫిన్లు అధికంగ ఉన్న ప్రాంతాలలో బంగ్లాదేశ్ ఒకటి. 2009 గణాంకాలు బంగ్లాదేశ్ సముద్రతీర నదులలో 6000 ఇరావడి డాల్ఫిన్లు నివసిస్తున్నాయని తెలియజేస్తున్నాయి. బంగ్లాదేశ్‌లో పలు జాతుల ఉభయచరాలు, 139 జాతుల సరీసృపాలు, 19 జాతుల సముద్ర సరీసృపాలు, 5 జాతుల సముద్ర క్షీరదాలు ఉన్నాయి. బంగ్లాదేశ్‌లో 628 జాతుల పక్షులు ఉన్నాయి..[ఆధారం చూపాలి]

బంగ్లాదేశ్‌లో గతశతాబ్దంలో పలు జంతువులు అంతరించిపోతున్న దశలో ఉన్నాయి. ఒంటి కొమ్ము ఖడ్గమృగం, రెండు కొమ్ముల ఖడ్గమృగాలు, కామన్ పీఫౌల్ అంతరించి పోతున్న జంతువుల జాబితాలో చేరాయి. మానవులు అధికంగా నగరప్రాంతాలలో కేంద్రీకృతమై ఉన్నారు. అరణ్యాల నరికివేత పరిమితం చేసి జంతులు అంతరించి పోవడాన్ని నివారించడానికి ప్రయత్నిస్తున్నారు. అయినప్పటికీ జనసంఖ్య అధికమౌతూ నగరాలు విస్తరిస్తూ పోవడం పర్యావరణ కాలుష్యానికీ, జంగువుల మనుగడ ఆటంకానికి కారణం ఔతుంది. అందువలన బంగ్లాదేశ్ లోని పలు ప్రాంతాలు చట్టబద్ధంగా రక్షించబడుతున్నాయి. నగరాల అభివృద్ధి వలన బంగ్లాదేశీ జంతుజాలం బెదిరింపుకు గురౌతున్నాయి.1995లో బంగ్లాదేశ్ ఎంవిరాన్మెంట్ యాక్ట్ అమలు చేయబడింది. ప్రభుత్వం గుర్తించిన పలు ప్రాంతాలు పర్యావరణ పరంగా క్లిష్టపరిస్థితిలో ఉన్నట్లు గుర్తించబడ్డాయి. గుర్తించబడిన ప్రాంతాలలో చిత్తడి నేలలు, అరణ్యాలు, నదులు కూడా ఉన్నాయి. జంతుజాల రక్షణార్ధం బెంగాల్ ఎలుగు, సుందర్బన్ పులి ప్రణాళిక చేపట్టబడింది.

రాజకీయాలు

బంగ్లాదేశ్: పేరు వెనుక చరిత్ర, చరిత్ర, భౌగోళికం 
Jatiyo Sangsad Bhaban, seat of the National Parliament

బంగ్లాదేశ్‌కు స్వతంత్రం వచ్చిన తరువాత బంగ్లాదేశ్ వెస్ట్ మినిస్టర్ విధానాన్ని (1972 కాన్ స్టిట్యూషన్) స్వీకరించింది. తరువాత బంగ్లాదేశ్ యూనిటరీ స్టేట్‌గా అవతరించింది. 1975లో దేశం అధ్యక్షుని పాలనలోకి వచ్చింది. 1990 లో అధ్యక్షపాలన ముగింపుకు తీసుకువచ్చి ఎర్షద్ పాలనాధికారం చేజిక్కించుకున్నాడు. తరువాత 1991 నుండి బంగ్లాదేశ్‌లో పార్లమెంటరీ విధానం అమలులోకి వచ్చింది. ది జతియో సంగ్షద్ బంగ్లాదేశ్‌లో యూనికేమరల్ పార్లమెంటరీ విధానం ప్రవేశపెట్టాడు. తరువాత జతియో సంగ్షద్ బంగ్లాదేశ్ ప్రధానమంత్రిగా ప్రభుత్వానికి నాయకత్వం వహించాడు. తరువాత అధ్యక్షుని నియమించాడు. ప్రధానమంత్రి క్యాబినెట్‌కు నాయకత్వం వహించి పాలనా బాధ్యత వహిస్తాడు. అధ్యక్షుడు అలంకారపదవి వహిస్తాడు. ప్రభుత్వసంబంధిత కార్యక్రమాలకు అధ్యక్షత వహిస్తాడు. అధ్యక్షుడు పార్లమెంటరీ సభ్యులు ఎన్నికచేయబడతాడు. జతియో సంగ్షద్‌కు పార్లమెంటులో 350 సభ్యుల మెజారిటీ సాధించాడు. అధ్యక్షుని ఎన్నిక తరువాత పార్లమెంటు స్పీకర్ ఎన్నిక చేయబడతాడు. తరువాత ప్రతిపక్ష నాయకుడు ఎన్నిక చేయబడతాడు. 50% పార్లమెంటు స్థానాలు స్త్రీల కొరకు కేటాయించబడ్డాయి. ప్రస్తుతం అవామీ లీగ్‌కు పార్లమెంటులో 273 స్థానాలు ఉన్నాయి. జతియా పార్టీ 42 స్థానాలతో ప్రతిపక్షాలకు నాయకత్వం వహించింది. 2009లో షేక్ హసీనా ప్రధానమంత్రి పదవిని వహించింది. ప్రస్తుతం అబ్దుల్ హమీద్ బంగ్లాదేశ్ అధ్యక్షపీఠం అధిష్టించాడు. ప్రస్తుత పార్లమెంటు స్పీకర్ షిరిన్ షర్మిన్ చౌదురి.

ఫ్రీడం హౌస్

ఫ్రీడం హౌస్ తన " ఫ్రీడం ఇన్ ది వరల్డ్ " నివేదికలో బంగ్లాదేశ్‌ను " పార్ట్లీ ఫ్రీ " (అర్ధ స్వాతంత్ర్యం) దేశంగా పేత్కొన్నది. ది ఎకనామిస్ట్ ఇంటలిజెంటు యూనిట్ బంగ్లాదేశ్‌ పాలనను హైబ్రీడ్ పాలనగా పేర్కొన్నది. అత్యున్నత స్వతంత్ర దేశాలు నాల్గింటిలో బంగ్లాదేశ్‌కు 3వ స్థానం లభించింది. 2014 బంగ్లాదేశీ ఎన్నికలు వివాదాద్పదంగా ముగిసాయి. వీటిని ఖలేడా జియా నాయకత్వం వహించిన బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ, లిబరల్ డెమొక్రటిక్ పార్టీ, ది బికల్ప ధారా బంగ్లాదేశ్, గానో ఫొరం పార్టీలు బాయ్‌కాట్ చేసాయి. 300 ఎం.పి లలో 153 మంది ఏకపక్షంగా ఎన్నిక చేయబడ్డారు. ప్రతిపక్ష సభ్యులు చివరిక్షణంలో నామినేషన్లు వెనక్కు తీసుకున్నారు. ఎన్నికలను అంతర్జాతీయ పర్యవేక్షకులు నిరసుంచారు. ప్రయిపక్షాలు బంగ్లాదేశ్ కేర్‌టేకర్ ప్రభుత్వాన్ని నిలదీసారు. 1996 నుండి న్యూట్రల్ అడ్మినిస్ట్రేషన్ విధానం అమలులో ఉంది. సరికొత్తగా ఎన్నికలు నిర్వహించి ప్ప్రభుత్వం ఏర్పాటు చేసేవరకు కేర్ టేకర్ ప్రభుత్వం పాలనా బాధ్యత వహిస్తుంది. బంగ్లాదేశ్‌లో 3 కేర్ టేకర్ ప్రభుత్వాలు ఎన్నికలు నిర్వహించాయి. 1996 ఎన్నికలు, బంగ్లాదేశీ జనరల్ ఎలెక్షన్ 2001, బంగ్లాదేశీ జనరల్ ఎలెక్షన్ 2008.

చట్టం

బంగ్లాదేశ్ న్యాయవ్యవస్థ ప్రధానంగా ఇంగ్లీష్ కామన్ లా ఆధారితమైనది. సుప్రీం కోర్ట్ అత్యున్నత న్యాయవ్యవస్థగా పనిచేస్తుంది. అందులో పునర్విచారణ విభాగం, బంగ్లాదేశ్ హైకోర్ట్ అంతర్భాగంగా ఉంటాయి. 1972లో 15 చట్టసవరణలు జరిగాయి.

విదేశీ సంబంధాలు

బంగ్లాదేశ్: పేరు వెనుక చరిత్ర, చరిత్ర, భౌగోళికం 
Prime Minister Sheikh Hasina with President Vladimir Putin

బంగ్లాదేశ్ సుహృద్భావంతో కూడిన విదేశీవిధానం అనుసరిస్తుంది. బంగ్లాదేశ్ విదేశాలతో అసూయ, శతృత్వ రహిత స్నేహసంబంధాలను మాత్రమే కోరుకుంటుంది. బంగ్లాదేశ్ బహుళపాక్షిక సిద్ధాంతం ఆధారితంగా విదేశీ దౌత్యసంబంధాలను అభివృద్ధి చేసుకుంది. ప్రత్యేకంగా యునైటెడ్ స్టేట్స్‌తో దౌత్య సంబంధాలు మెరుగుపరచుకున్నది. స్వతంత్రం లభించిన తరువాత బంగ్లాదేశ్ కామన్వెల్త్ దేశాలు, అలీన ఉద్యమం, ఆర్గనైజ్ ఆఫ్ ది ఇస్లామిక్ కాన్ఫరెన్స్‌లతో సభ్యత్వం తీసుకుంది. ఐక్యరాజ్యసమితి సెక్యూరిటీ కౌన్సిల్‌కు బంగ్లాదేశ్ రెండుమార్లు ఎన్నిక (1978-1979, 2000-2001) చేయబడింది. 1980లో బంగ్లాదేశ్ "సౌత్ ఆసియన్ అసోసేషన్ ఆఫ్ రీజనల్ కోపరేషన్"కు మార్గదర్శకం వహించింది. 1985లో సార్క్ స్థాపించిన తరువాత బంగ్లాదేశీయుడు రెండు మార్లు సెక్రటరీ- జనరల్ పదవిని అధిష్టించాడు. "డెవెలెపింగ్ 8 కంట్రీస్ ", " బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్స్" ల స్థాపనలో బంగ్లాదేశ్ భాగస్వామ్యం వహించింది. బంగ్లాదేశ్ ఆసియా ఐరోపా మీటింగ్, ఆసియన్ రీజనల్ ఫోరం, ఆసియన్ కార్పొరేషన్ డైలాగ్, బి.సి.ఎం, ది గ్రూప్ ఆఫ్ 77జి, ది ఇండియన్ ఓషన్ రిం అసోసేషన్, ది వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్‌లలో సభ్యత్వం కలిగి ఉంది.

విదేశీవిధానాలు

బంగ్లాదేశ్ విదేశీవిధానాలు బహుళపాక్షిక సిద్ధాంతం, ప్రాంతీయ రక్షణ, సహకారం, తీవ్రవాదం అణిచివేత, పెట్టుబడులు, వ్యాపారం విస్తరణలను ప్రోత్సహిస్తుంది. బంగ్లాదేశ్ ప్రంపంచ శాంతిపరిరక్షణ దళాలలో అధికంగా భాగస్వామ్యం వహిస్తుంది. 2014లో బంగ్లాదేశ్ 54 ఐక్యరాజ్యసమితి శాంతిస్థాపన కార్యక్రమాలలో (పీస్ కీపింగ్ మిషన్) భాగస్వామ్యం వహిస్తూ ఆఫ్రికా, బల్కన్స్, మిడిల్ ఈస్ట్, కరేబియన్ దేశాలలో పనిచేసింది. ఈ కార్యక్రమాలలో 1,13,000 మంది పాల్గొన్నారు. బంగ్లాదేశ్ 1991లో జరిగిన గల్ఫ్ యుద్ధంలో ఆపరేషన్ డిసర్ట్ స్టార్మ్ లో భాగస్వామ్యం వహించింది. ఆఫ్ఘనిస్థాన్ డెవెలెప్మెంట్ ఏజెన్సీ ద్వారా ప్రాథమిక మాధ్యమిక విద్య, మహిళల స్వయంశక్తి సాధన, సూక్ష్మ రుణ (మైక్రో ఫైనాన్స్) రంగాలలో 1.2 కోట్ల మందికి సహకరించింది.

యునైటెడ్ స్టేట్స్‌తో సంబంధాలు

బంగ్లాదేశ్: పేరు వెనుక చరిత్ర, చరిత్ర, భౌగోళికం 
Bangladesh is the world's largest contributor of UN peacekeeping forces

యునైటెడ్ స్టేట్స్‌ దక్షిణాసియా దేశాలలోని బంగ్లాదేశ్ మద్య సంబంధాలు వ్యూహాత్మకమైనవి. ప్రస్తుత అవామీ లీగ్ ప్రభుత్వం వివాదాలు, వివాదాస్పదమైన జనవరి 5 ఎన్నికల వంటి కలుషితాలు ఉన్నప్పటికీ యునైటెడ్ స్టేట్స్‌ - బంగ్లాదేశ్ మద్య సంబంధాలు స్వతంత్రభావాల సమైక్యతతో సాగుతుంటాయి. 2014 పరిశోధనలు 76% బంగ్లాదేశీయులు యునైటెడ్ స్టేట్స్‌కు అనుకూలంగా స్పందించారు. బంగ్లాదేశ్‌లో అత్యధికంగా పెట్టుబడులు పెట్టిన దేశాలలో అమెరికన్ కంపెనీలు ప్రథమస్థానంలో ఉన్నాయి. యు.ఎస్ సైన్యం బంగ్లాదేశ్ సైనిక దళాలకు విస్తృత సహకారం అందిస్తున్నాయి.

జపాన్‌తో సంబంధాలు

జపాన్, బంగ్లాదేశ్‌లు సమైక్య రాజకీయ లక్ష్యాలు, వ్యూహాత్మక సత్సంబంధాలు కలిగి ఉన్నాయి. స్వతంత్రం లభించినప్పటి నుండి బంగ్లాదేశ్ అభివృద్ధిలో జపాన్ భాగస్వామ్యం వహిస్తుంది. 1972 నుండి జపాన్ బంగ్లాదేశ్‌కు 11 బిలియన్ల అమెరికన్ డాలర్ల సహాయం అందించింది. 2014 లో జపాన్ ప్రధానమంత్రి షింజో అబే బంగ్లాదేశ్‌కు 6 బిలియన్ల అమెరికన్ డాలర్ల సహాయ ప్యాకేజ్‌ను ప్రకటించాడు.

యురోపియన్ యూనియన్

యురేపియన్ యూనియన్ బంగ్లాదేశ్‌కు ప్రధాన వాణిజ్య భాగస్వామిగా ఉంది. యునైటెడ్ కింగ్డం బంగ్లాదేశ్‌కు రక్షణ కలిగిస్తూ రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక సంబంధాలు కలిగి ఉంది.

భారతదేశంతో సంబంధాలు

బంగ్లాదేశ్ పొరుగున ఉన్న భారతదేశంతో అత్యధికంగా అత్యంత సన్నిహిత సంబంధాలను కలిగి ఉంది. బంగ్లాదేశ్ భారతదేశ సంబంధాలు చారిత్రక, సాంస్కృతిక నేపథ్యం కలిగి ఉన్నాయి. ఇవి 1971 స్వాతంత్ర్య సమరంలో బంగ్లాదేశ్‌కు భారత్ అందించిన సహాయం ఇరుదేశాల సంబంధాలను మరింతగా బలపరిచింది. భారత్‌ వ్యాపారభాస్వామ్యంలో దక్షిణాసియా దేశాలలో బంగ్లాదేశ్ ముఖ్యమైనది. భారత్‌తో వ్యాపార సంబంధాలలో బంగ్లాదేశ్ 5 వ స్థానంలో ఉంది. అయినప్పటికీ సరిహద్దు వివాదాలు, వ్యాపార సంబంధాలు, వ్యాపార సరిహద్దులు, 54 నదులతో జలాలను పంచుకోవడంలో వివాదాలు సంబంధాలను కొంత బాధిస్తున్నాయి. ఇటీవలి కాలంలో తీవ్రవాదంతో పోరాడడానికి రెండు దేశాలు సమైక్యంగా ప్రయత్నిస్తున్నాయి.

బర్మా

బంగ్లాదేశ్‌కు బర్మాతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. రోహింగ్యా శరణార్ధుల విషయంలో కొన్ని వివాదాలు కూడా ఉన్నాయి. బంగ్లాదేశ్ ఆసియన్ డైలాగ్ భాగస్వామ్యం కావాలని కోరుకుంటుంది.

ఇతర దేశాలు

లావోస్, కంబోడియా దేశాలు బంగ్లాదేశ్ ఆసియన్ సభ్యత్వం కొరకు చేసిన అభర్ధనను ముందుగా సమర్ధించాయి.

చైనాతో సంబంధాలు

బంగ్లాదేశ్ - చైనాతో కూడా సత్సంబంధాలు కలిగి ఉంది. చైనాతో వాణిజ్య సంబంధాలు కలిగిన దక్షిణాసియా దేశాలలో బంగ్లాదేశ్ 3 వ స్థానంలో ఉంది. బంగ్లాదేశ్ సైనికదళానికి ఆయుధ సరఫరా చేస్తున్న దేశాలలో చైనా ప్రథమ స్థానంలో ఉంది. ముస్లింలు అధికంగా ఉన్న దేశాలలో బంగ్లాదేశ్ ముడవ దేశంగా ఉంది. బంగ్లాదేశ్ తరచుగా నిబద్ధత కలిగిన దేశంగా ప్రశంశించబడుతుంది. ఇరాన్- ఇరాక్ యుద్ధాన్ని నివారించడానికి బంగ్లాదేశ్ కూడా కృషిచేసింది.

ఇజ్రాయేలుతో సంబంధాలు

పాలస్తీనా సమస్యకు ప్రధాన మద్దతుదారుగా ఉంది. ఇజ్రాయేలును గుర్తించని దేశాలలో (ఐక్యరాజ్యసమితి సభ్యత్వం ఉన్న 29 దేశాలు) బంగ్లాదేశ్ ఒకటి. అంతేకాక పూర్తిస్తాయిలో ఆర్థికంగా బహిష్కరించిన దేశాలలో బంగ్లాదేశ్ ఒకటి. బంగ్లాదేశ్ తమపౌరులను ఇజ్రాయేలుకు వెళ్ళడానికి పాస్‌పోర్ట్‌లో అనుమతి నిరాకరిస్తుంది.

రష్యాతో సంబంధాలు

బంగ్లాదేశ్ రష్యా దేశాలమద్య చారిత్రక సంబంధాలు ఉన్నాయి. దేశానికి రష్యాకు మద్య స్వతంత్ర సమరానికి ముందు నుండి ఉన్నాయి. బంగ్లాదేశ్ లోని 20% ఎలెక్ట్రిసిటీ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ సోవియట్ రష్యా, రష్యా సహకారంతో నిర్మించబడింది. 2013 లో రష్యా, బంగ్లాదేశ్ రప్పర్ న్యూక్లియర్ ప్లాంట్ నిర్మాణంలో పాల్గొన్నాయి. బంగ్లాదేశ్ బ్రెజిల్ దేశంతో సంబంధాలు అభివృద్ధి చేయడానికి కృషిచేసింది. 2013 లో బంగ్లాదేశ్ - బ్రెజిల్ మద్య 700 మిలియన్ అమెరికన్ డాలర్ల వాణిజ్యం జరిగింది.

సముద్రతీరం

2012 లో " ది ఇంటర్నేషనల్ ట్రిబ్యూనల్ ఫర్ ది లా ఆఫ్ ది సీ " బంగాళాఖాతంలోని బంగ్లాదేశ్, బర్మా మద్య సరిహద్దును రద్ధు చేస్తున్నట్లు ప్రకటించింది. 2008 బంగ్లాదేశ్- బర్మాల మద్య సముద్రతీర ఉపయోగం సంబంధిత వివాదాలు తలెత్తాయి. బర్మా వివాదాస్పదమైన ప్రాంతంలో చమురు, గ్యాస్ త్రవ్వకాలకు ప్రయత్నించింది. తరువాత బ్యాక్- చానల్ డిప్లొమసీ ద్వారా ఇరుదేశాల మద్య సమస్యను పరిష్కరించుకున్నాయి. 2014లో " ది పార్లమెంటు కోర్ట్ ఆఫ్ ఆరిబిటరేషన్ " బంగ్లాదేశ్ - భారతదేశం మద్య సముద్ర సరిహద్దును రద్దు చేసింది.

సైన్యం

2012 గణాంకాలను అనుసరించి బంగ్లాదేశ్ కాల్బలం 3,00,000, వాయుసేన 22,000,, నావికాదళం 24,000 . అదనంగా సంప్రదాయ రక్షణ సిబ్బంది సివిల్ అధికారుల ఆదేశాల మీద డిశాస్టర్ రిలీఫ్, రాజకీయ అనిశ్చితి సమయాలలో ఇంటర్నల్ సెక్యూరిటీ బాధ్యతలను నిర్వహిస్తుంటారు. బంగ్లాదేశ్ స్థిరంగా ఐక్యరాజ్యసమితి సైనికదళానికి మద్దతు ఇస్తుంది.

దౌత్యసంబంధాలు

2015 ఫిబ్రవరిలో డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కౌంసిల్, లిబెరియా, డాఫౌర్, కోట్ డి ఐవొరి, హాతి, సౌత్ సుడాన్, లెబనాన్, సైప్రస్, గోలంహైట్స్ దేశాలలో దౌత్యసిబ్వందిని నియమించింది. .

నిర్వహణా విభాగాలు

బంగ్లాదేశ్ 7 విభాగాలుగా వుభజించబడింది.త్ డివిషన్ కేంద్రం పేరు డివిషన్ పేరుగా నిర్ణయించబడింది: బరిసల్ డివిషన్, చిటగాంగ్ డివిషన్, ఢాకా డివిషన్, ఖుల్నా డివిషన్, రాజ్షాహి డివిషన్, సిల్హెట్ డివిషన్, రంగ్పూర్ డివిషన్. డివిషన్లు జిల్లాలుగా విభజించబడతాయి. జిల్లాలు ఉపజిల్లాలుగా (సబ్ డివిషన్) లేక తానాలుగా విభజించబడతాయి.

పోలీస్ స్టేషన్

మెట్రో పాలిటన్ ప్రాంతాలు కాక మొగిలిన పోలీస్ స్టేషన్లు యూనియన్లుగా విభజించబడతాయి. యూనియన్లు పలు గ్రామాలుగా విభజించబడతాయి. మెట్రోపాలిటన్ పోలీస్ స్టేషన్లు వార్డులుగా విభజించబడతాయి. వార్డులు మహల్స్‌గా విభజించబడతాయి. డివిషన్, జిల్లా స్థాయిలో ఎన్నిక చేయబడిన అధికారులు ఉండరు. పాలనా నిర్వహణను ప్రభుత్వం నియమించిబ అధికారులు నిర్వహిస్తారు. యూనియన్లకు నేరుగా ఎన్నికలు నిర్వహించబడయాయి. యూనియన్లకు చైర్ పర్సన్, మెంబర్లను ఎన్నుకుంటారు. 1997 లో పార్లమెంటరీ చట్టం ద్వారా ప్రతియూనియన్లో మూడు స్థానాలు మహిళల కొరకు కేటాయించబడుతున్నాయి..

విభాగం బెంగాలీ భాష 2011 గణాంకాలు! వైశాల్యం (km2) జనసాంధ్రత
2011 (people/km2)
అతిపెద్ద నగరం
బరిసల్ বরিশাল 8,325,666 13,297 626 బరిసల్ (328,278)
చిటగాంగ్ চট্টগ্রাম 28,423,019 33,771 841 చిటగాంగ్ (2,592,439)
ఢాకా ঢাকা 47,424,418 31,120 1,523 ఢాకా (7,033,075)
ఖుల్నా খুলনা 15,687,759 22,272 704 ఖుల్నా (663,342)
రాజ్షాహి রাজশাহী 18,484,858 18,197 1,015 రాజ్షాహ్ (449,756)
రంగ్పూర్ রংপুর 15,787,758 16,317 960 రంగ్పూర్ (బంగ్లాదేశ్) (343,122)
సిల్హెట్ সিলেট 9,910,219 12,596 780 సిల్హెట్ (479,837)
బంగ్లాదేశ్ বাংলাদেশ 144,043,697 147,570 976 ఢాకా (7,033,075)

గణాంకాలు

2011 మార్చి 15 నాటికి బంగ్లాదేశ్ జనాభా 142.3 మిలియన్లు (14.23 కోట్లు), 2007-2010 బంగ్లాదేశ్ గణాంకాలు జనసంఖ్య 15 - 17 కోట్లు ఉంది. జనసాంద్రత పరంగా బంగ్లాదేశ్ ప్రపంచంలో 8వ స్థానంలో ఉంది. 1951 లో జనాభా 4.4 కోట్లు ఉంది. ఇది ప్రపంచంలో అత్యధిక జసాంధ్రత కలిగిన దేశంగా గుర్తించబడింది. ఇది చిన్న దేశాలు, నగరాలు, రాష్ట్రాలను పరిగణలోకి తీసుకుంటే ఆ సమయంలో బంగ్లాదేశ్ ప్రపంచంలో 11వ స్థానంలో ఉంది.

Historical populations in millions
సంవత్సరంజనాభా±% p.a.
1971 67.8—    
1980 80.6+1.94%
1990 105.3+2.71%
2000 129.6+2.10%
2010148.7+1.38%
2012161.1+4.09%
Source: OECD/World Bank

జనాభా పెరుగుదల

1960, 1970 లలో బంగ్లాదేశ్ జనసంఖ్య అభివృద్ధి శాతం ప్రపంచంలో అత్యధికంగా గుర్తించబడింది. 1960-1970 మధ్య కాలంలో జసంఖ్య 6.5 నుండి 11 కోట్లకు చేరుకుంది. 1980 నుండి కుటుంబ నియంత్రణ అమలు చేసినందున జనసంఖ్య అభివృద్ధి శాతం తగ్గుముఖం పట్టింది. ప్రస్తుతం ఫర్టిలిటీ శాతం 2.55 % ఉంది. ఇది భారతదేశం (2.8%), పాకిస్థాన్ (3.7%) కంటే తక్కువ. జనసంఖ్యాపరంగా 15 సంవత్సరాలకంటే తక్కువ వయసున్నవారు 34%, 65 సంవత్సరాల పైబడిన వారు 5% ఉన్నారు. 2012 గణాంకాలను అనుసరించి స్త్రీ, పురుషుల ప్రజల ఆయుఃప్రమాణం 70 సంవత్సరాలు. ఆర్థికరంగం 26% అభివృద్ధి చెందింది. అయినప్పటికీ 26% ప్రజలు అంతర్జాతీయ దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నారు. బంగ్లాదేశ్ ప్రజల జీవనవ్యయం ఒకరోజుకు 1.25 అమెరికన్ డాలర్లు. బంగ్లాదేశ్ ప్రజలలో బెంగాలీ ప్రజలు 98% ఉన్నారు.

అల్ప సంఖ్యాకులు

చిట్టగాంగ్ ప్రాంతంలో ఉన్న అల్పసంఖ్యాక వర్గానికి చెందినవారిలో స్థానికులు, ఉత్తర బంగ్లాదేశ్ లోని ఇతర ప్రాంతాలలోని ప్రజలు ఉన్నారు. కొండప్రాంతాలలో 11 గిరిజన జాతులకు చెందిన ప్రజలు (చక్మా, మర్మా, తంచంగ్యా, త్రిపురి, కుకి, బాన్) ఉన్నారు. సిల్హెట్ ప్రాంతం బిస్నుప్రియ మణిపురి గిరిజనులకు స్వస్థానం. గారో ప్రజలు అధికంగా మైమెంసింగ్ ప్రాంతంలో ఉన్నారు. శాంతల్ ఆదిమానవ సంతతికి చెందిన వారు ఉత్తర బంగ్లాదేశ్‌లో అధికంగా ఉన్నారు. బంగ్లాదేశ్‌లో ఇస్మైలి కమ్యూనిటీకి చెందిన ప్రజలు చెప్పుకోదగిన సంఖ్యలో ఉన్నారు.

శరణార్ధులు

బంగ్లాదేశ్ ఆగ్నేయ ప్రాంతం బర్మా నుండి ప్రవాహంలా వచ్చిన రోహింగ్యా ప్రజలకు ఆశ్రయం ఇచ్చింది. 1978, 1991 బర్మాలో సైనిక చర్యల సమయంలో శరణార్ధులు బంగ్లాదేశ్‌లో ప్రవేశించారు. 2012లో రాకినే తిరుగుబాటు సమయంలో బంగ్లాదేశ్ తన సరిహద్దులను మూసివేసింది. బర్మా నుండి మూడవ సారి శరణార్ధుల ప్రవహాన్ని అడ్డగించడానికి ఇలా చేసింది. చిక్కుకుపోయిన పాకిస్థానీల గురించిన వివాదాలు బంగ్లాదేశ్, పాకిస్థాన్ మద్య నిరంతరంగా కొనసాగుతూనే ఉన్నాయి. 2008లో బంగ్లాదేశ్ హై కోర్ట్ రెండవ తరం చిక్కుకుపోయిన పాకిస్థానీలకు (1971 తరువాత పుట్టిన వారికి) పూర్తి స్థాయి పౌరసత్వం ఇవ్వలని ఆదేశించింది. 1975- 1997 మద్య స్థానికులు స్వతంత్రం కొరకు సాగించిన ఉద్యమ కాలంలో కొండ ప్రాంతాలలో అశాంతి, చిటగాంగ్ కలహాలు చెలరేగాయి. 1997లో చిటగాంగ్ కొండ ప్రజలు శాంతి ఒప్పందం మీద సంతకం చేసారు. అయినప్పటికీ ఈ ప్రాంతం అత్యధికంగా సైనిక పర్యవేక్షణలో ఉంచబడింది.

నగరీకరణ

బంగ్లాదేశ్ రాజధాని నగరం ఢాకా. ఇది కార్పొరేషన్ చేయబడింది. నగరంలో మేయర్ ఎన్నికలు నిర్వహిస్తారు. బంగ్లాదేశ్‌లో ఢాకా దక్షిణం, ఢాకా ఉత్తరం, చిట్టగాంగ్, ఖుల్న, సిల్హెట్, రాజ్షాహి, బారిసల్, రంగ్పూర్, గజిపూర్ మొదలైన నగరాలు ఉన్నాయి. ఇతర ప్రధాన నగరాలలో మైమెంసింగ్, గోపాల్గంజ్, జెసోర్, బోగ్రా, దినాజ్పూర్, సైద్పూర్, నారాయణ్గంజ్, రంగమతి మొదలైన పురపాలక పట్టణాలు ఉన్నాయి. పురపాలకాలకు చైర్మన్ విధానంలో ఎన్నికలు నిర్వహించబడతాయి. పురపాలక ఎన్నికలు 5 సంవత్సరాలకు ఒక మారు నిర్వహించబడతాయి.

భాషలు

బంగ్లాదేశ్ ప్రజలలో బెంగాలీ 98% ప్రజలకు వాడుకలో ఉన్న భాష బెంగాలీ. ఇది వారి స్థానిక భాష. బెంగాలీ బంగ్లాదేశ్ అధికార భాష. ఆంగ్లభాష పాఠశాలలలో మాధ్యమిక, ఉన్నత పాఠశాల పాఠ్యాంశంలో రెండవ భాషగా ఉంది. ఉన్నత విద్య, లీగల్ విధానాలలో ఆంగ్లభాష ఆధిక్యత వహిస్తుంది. 1987 వరకు చట్టాలు ఆంగ్లభాషలో వ్రాయబడి ఉన్నాయి. అప్పటి వరకు బెంగాలీ అనువాదం లేదు. తరువాత బంగ్లాదేశ్ రాజ్యాంగం చట్టాన్ని బెంగాలీలో అనువదించింది. ప్రస్తుతం చట్టం ఆగ్లం, బెంగాలీ భాషలలో లభిస్తుంది. బంగ్లాదేశ్‌లో స్థానిక అల్పసంఖ్యాక ప్రజలకు వాడుకలో ఉన్న పలు భాషలు ఉన్నాయి.

మతం

Religions in Bangladesh
Religion Percent
Muslim
  
86.6%
Hindu
  
12.1%
Buddhist
  
1%
Christian
  
0.4%
Others
  
0.3%

బంగ్లాదేశ్లోని అత్యధికులు ఆచరిస్తున్న మతం ఇస్లాం. దేశంలో 86.6% ఇస్లాం మతస్థులు ఉన్నారు. హిందువులు 12.1% ఉన్నారు. బౌద్ధులు 1%, క్రైస్తవులు 0.4% ఉన్నారు. ముస్లిములలో అత్యధికులు సున్నీ ముస్లిములు ఉన్నారు. 04% సర్వజనీన ముస్లిములు (శాఖావిభేధం లేని ముస్లిములు) ఉన్నారు. స్వల్పంగా షియా ముస్లిములు ఉన్నారు. 1,00,000 మంది అహ్మదీయ ముస్లిములు ఉన్నారు. బంగ్లాదేశ్ ముస్లిం దేశాల వరుసలో 4వ స్థానంలో ఉంది. మిగిలిన మూడు స్థానంలో ఇండోనేషియా, పాకిస్థాన్, భారతదేశం ఉన్నాయి. బంగ్లాదేశ్‌లో హిందువులు రెండవ స్థానంలో ఉన్నారు. హిందువులు అధికంగా ఉన్న దేశాలలలో బంగ్లాదేశ్ మూడవ స్థానంలో ఉంది. మొదటి రెండు స్థానాలలో భారతదేశం, నేపాల్ ఉన్నాయి. బౌద్ధులు ఆగ్నేయంలో ఉన్నారు. క్రైస్తవులు నగరప్రాంతాలలో ఉన్నారు.

లౌకికవాదం

పాకిస్థాన్ నుండి స్వతంత్రం లభించగానే 1972 లో బంగ్లాదేశ్ లౌకికవాద దేశంగా ప్రకటించుకుంది. దక్షిణాసియాలో లౌకికవాదదేశంగా ప్రకటించుకున్న మొదటి దేశంగా బంగ్లాదేశ్ గుర్తించబడింది. రెండవ దేశం భారతదేశం (1976 లో లౌకిక వాద దేశంగా ప్రకటించుకుంది). జియార్ రహ్మాన్ నాయకత్వంలో మిలటరీ ప్రభుత్వం 1977లో మార్షల్ లా ఆర్డినెన్స్ ద్వారా సెక్యులరిజం విధానం తొలగించబడింది.1988 అధ్యక్షుడు హుస్సైన్ మహ్మూద్ ఎర్షద్ (మరొక సైనిక పాలకుడు) పార్లమెంటరీ సవరణ ద్వారా ఇస్లాం మతాన్ని రాజ్యాంగ మతంగా చేసాడు. 2010 లో హైకోర్ట్ జియాస్ మార్పులు చెల్లవని ప్రకటించి 1972 నాటి లౌకవాదదేశంగా కొనసాగాలని ప్రకటించింది. అయినప్పటికీ ఇస్లాం మతం రాజ్యాంగ మతంగా ఉంటుందని ప్రకటించింది. బంగ్లాదేశ్ లౌకిక వాద చట్టం, పర్సనల్ రిలీజియస్ చట్టం రెండు చట్టవిధానాలను అనుసరిస్తుంది.

సూఫీయిజం

బంగ్లాదేశ్‌లో అనేజమంది ప్రజలు సూఫీయిజం అనుసరిస్తున్నారు. చారిత్రకంగా సుఫీయిజం సుఫీ సన్యాసుల చేత ఇక్కడకు తీసుకురాబడింది. సూఫీ ప్రభావం ఈ ప్రాంతం మీద కొన్ని శతాబ్దాలుగా ఉంది. ముస్లిములు అత్యధికంగా బిష్వా ఇజ్తెమా పర్వదినం జరుపుకుంటారు. ప్రతి సంవత్సరం దీనిని ||తబ్లిగి జమాత్|| నిర్వహిస్తుంది. హజ్ తరువాత ముస్లిములు అధికంగా జరుపుకునే ముస్లిం పర్వదింగా ఇజ్తెమా గుర్తించబడుతుంది.

విద్య

బంగ్లాదేశ్: పేరు వెనుక చరిత్ర, చరిత్ర, భౌగోళికం 
The University of Dhaka is the country's largest public university

బంగ్లాదేశ్ అక్షరాస్యత శాతం తక్కువ. 2010 గణాంకాలను అనుసరించి పురుషుల అక్షరాస్యత 61.3%, స్త్రీల అక్షరాస్యత 52.2%,. బంగ్లాదేశ్‌లో మూడంచెల విద్యావిధానం అమలులో ఉంది. బంగ్లాదేశ్ ప్రభుత్వం ప్రాథమిక, మాధ్యమిక, హైయ్యర్ సెకండరీ పాఠశాలలను నిర్వహిస్తుంది. పలు ప్రైవేట్ పాఠశాలలకు కూడా ప్రభుత్వం నుండి కొంతవరకు నిధులు లభిస్తుంటాయి. యూనివర్శిటీ గ్రాంటు కమిషన్ ద్వారా ప్రభుత్వం 15 విశ్వవిద్యాలయాలకు నిధులు సమకూరుస్తుంది.

విద్యావిధానం

విద్యావిధానం 5 స్థాయిలుగా విభజించబడింది.

  • ప్రాథమిక (1-5)
  • జూనియర్ సెకండరీ (6-8)
  • సెకండరీ (9-19)
  • హైయ్యర్ సెకండరీ (11-12)
  • డిగ్రీ

లోయర్ సెకండరీ స్కూల్ విద్యతో సెకండరీ స్కూల్ సర్టిఫికేట్‌తో ముగిస్తుంది. 2009 నుండి విద్యార్థులు ప్రాథమికంగా పి. ఇ. సి పరీక్ష తరువాత 4 సంవత్సరాల సెకండరీ విద్య లేక మెట్రిక్యులేషన్ విద్య పూర్తి చేసి ఎస్. ఎస్. సి సర్టిఫికేషన్ పొందాలి. 2010 నుండి పి. ఇ. సి సర్టిఫికేట్ పొందిన విద్యార్థులు మూడు సంవత్సరాల సెకండరీ పూర్తిచేసి జె.ఎస్.సి (జూనియర్ స్కూల్ సర్టిఫికేట్) సర్టిఫికేట్ పొందాలి. తరువాత విద్యార్థులు 2 సంవత్సరాల సెకండరీ లేక మెట్రిక్యులేషన్ విద్య పూర్తిచేసి ఎస్.ఎస్.సి సర్టిఫికేట్ పొందాలి. తరువాత విద్యార్థులు 2 సంవత్సరాల హైయ్యర్ సెకండరీ లేక ఇంటర్ మీడియట్ విద్య పూర్తిచేసి హైయ్యర్ సెకండరీ సర్టిఫికేట్ పొందాలి.

మాధ్యమం

బంగ్లాదేశ్‌లో సాధారణంగా బెంగాలీ మాధ్యమంలో విద్యను బోధిస్తుంటారు. అయినప్పటికీ ఆంగ్లం కూడా విద్యాబోధన చేస్తున్నారు. ఆగ్లం అధికంగా వాడుకలో ఉంది. ముస్లిం కుటుంబాలలో అత్యధిక సంఖ్యలో వారి పిల్లలను షార్ట్ టైం కోర్సులకు పంపుతుంటారు. అలాగే బెంగాలీ, అరబిక్ భాషలో మతసంబంధిత విద్యకూడా బోధించబడుతుంది. వీటిని మదరసా అంటారు.

అక్షరాస్యత

బంగ్లాదేశ్ అందరికీ విద్యను అందించాలని నిర్ణయించింది .

విశ్వవిద్యాలయాలు

బంగ్లాదేశ్ యూనివర్శిటీలు మూడు కేటగిరీలుగా విభజించబడ్డాయి: పబ్లిక్ యూనివర్శిటీ, ప్రైవేట్ యూనివర్శిటీ, ఇంటర్నేషనల్ యూనివర్శిటీ. బంగ్లాదేశ్‌లో 34 పబ్లిక్ యూనివర్శిటీ, 64 ప్రైవేట్ యూనివర్శిటీలు, 2 ఇంటర్నేషనల్ యూనివర్శిటీలు ఉన్నాయి. వీటిలో బంగ్లాదేశ్ ఇంటర్నేషనల్ యూనివర్శిటీ అత్యధిక సంఖ్యలో విద్యార్థులకు విద్యను అందిస్తుంది.

1921లో ఢాకా యూనివర్శిటీ స్థాపించబడింది. ఇది అతిపురాతన యూనివర్శిటీగా గుర్తించబడుతుంది. ఇస్లామిక్ యూనివర్శిటీ ఆఫ్ టెక్నాలజీకి ఆసియా, ఆఫ్రికా, ఐరోపా దక్షిణ అమెరికా, మద్యప్రాచ్య దేశాలకు చెందిన 57 దేశాలు ప్రాతినిధ్యం వహిసున్నాయి. చిట్టగాంగ్ వద్ద ఉన్న" ప్రీమినెంట్ లిబరల్ ఆర్ట్స్ యూనివర్శిటీ అఫ్ ఉమన్ " ఆసియా ఖండంలోని 14 దేశాలు ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. ఉత్తర అమెరికా, ఐరోపా, ఆసియా, ఆస్ట్రేలియా, మిడిల్ ఈస్ట్ నుండి ప్రఖ్యాత సంస్థలకు చెందిన ఉపాధ్యాయులు ఇక్కడ విద్యను బోధిస్తున్నారు. బి.ఇ.యు.టి, సి.యి.ఇ.టి, బి.యి.టెక్స్, డి,ఇ.యు.టి మొదలైన 6 విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. ఎస్.యు.ఎస్.టి మిలటరీ ఇంస్టిట్యూట్ ఆఫ్ సైన్సు, టెక్నాలజీ, పబ్నా యూనివర్శిటీ, ఆఫ్ సైన్సు & టెక్నాలజీ మొదలైన సైన్సు, టెక్నాలజీ విశ్వవిద్యాలయాలు కూడా ఉన్నాయి. బంగ్లాదేశ్ విశ్వవిద్యాలయాలకు యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ నుండి నిధులు అందుతుంటాయి. బంగ్లాదేశ్‌లో 29 ప్రభుత్వ, ప్రైవేట్ వైద్యకళాశాలలు ఉన్నాయి. వైద్యకళాశాలలు "మినిస్టరీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ "తో అనుసంధానించబడి ఉన్నాయి.

ఆరోగ్యం

బంగ్లాదేశ్ లో ఆరోగ్యం, విద్యారంగంలో తక్కువ స్థానంలో ఉన్నాయి. అయినప్పటికీ ఇటీవలి కాలంలో కొంత పురోగతి సాధించింది. 2012 లో 26% ఉన్న దారిద్ర్యం స్థాయి తగ్గుముఖం పట్టింది. గ్రామీణ ప్రాంతాలలో వైద్యులలో 62% సరైన శిక్షణ లేని వారు ఉన్నారు. ఆరోగ్య సంరక్షణ శాఖలో శిక్షణ పొందిన సిబ్బంది 4% మాత్రమే ఉన్నారు. భవిష్యత్తు ఆరోగ్యసంరక్షణా విధానం సంబంధిత సర్వేలో లభించిన వివరణలు గ్రామీణ వైద్యుల కొరత, అత్యధికంగా హానికలిగించే ఔషధాలు ఉపయోగించబడుతున్నాయని తెలియజేస్తున్నాయి.

బంగ్లాదేశ్: పేరు వెనుక చరిత్ర, చరిత్ర, భౌగోళికం 
Community health workers form the backbone of rural health services

2007

బంగ్లాదేశ్‌లో 2007లో 1000 గ్రామీణ కుటుంబాలలో జరిపిన సర్వేలో గ్రామీణులు సవ్యాపసవ్యాలుగా ఆరోగ్యకారణంగా నష్టపోతున్నారని వెల్లడైంది. గ్రామీణులు చికిత్సకు ఖర్చుచేయడం, అనారోగ్యకారణంగా పని దినాలు తగ్గి వేతన కోతకు గురౌతున్నారు. బంగ్లాదేశ్‌లో 6183 మందిని వ్యక్తిగతంగా జరపిన సర్వేలో పురుషుల కంటే స్త్రీలు తక్కువగా ఆరోగ్యపరమైన చికిత్స తీసుకుంటూఉన్నారని వెల్లడైంది. ప్రసవకాల వైద్యసేవల కొరత 2005-2007 మద్య తగ్గుముఖం పట్టింది, హెల్త్ వాచ్ ప్రణాళిక ద్వారా ఆగ్నేయ బంగ్లాదేశ్‌లో నిర్వహించిన ప్రయోగాత్మక ఆరోగ్యాభివృద్ధి ప్రణాళిక విజయవంతం అయింది. ఈ ప్రణాళిక తరువాత ప్రజల ఆరోగ్య పరిస్థితి మెరుగైంది.

ఆరోగ్య పరిరక్షణ నిధులు

ఆరోగ్యసంరక్షణా కార్యక్రమాల కొరత కారణంగా బంగ్లాదేశ్‌లో ఆరోగ్యస్థితి బలహీనంగా ఉంది. 2010లో వరల్డ్ బ్యాంక్ నిర్వహించిన సర్వే అనుసరించి 2009లో బంగ్లాదేశ్ జి.డి.పి నుండి ఆరోగ్యసంరక్షణ 3.35% మాత్రమే వ్యయం చేయబడిందని తెలుస్తుంది. దేశంలో ప్రతి 10,000 మందికి 4 ఆసుపత్రులు ఉన్నాయని తెలుస్తుంది. 2009 బంగ్లాదేశ్ ప్రభుత్వ ఆర్థిక ప్రణాళికలో ఆరోగ్యసంరక్షణ కొరకు 7.9% మంజూరు చేయబడింది. ప్రజలు అధికంగా తమస్వంత ధనం (95%) వెచ్చిస్తుంటారు.

పోషకాహార లోపం

పోషకాహార లోపం బంగ్లాదేశ్‌ను నిరంతరం వేధిస్తూనే ఉంది. ప్రపంచ బ్యాంక్ అంచనాలను అనుసరించి పోషకాహార లోపం అధికంగా ఉన్న పిల్లలు అధికంగా ఉన్న దేశాలలో బంగ్లాదేశ్ మొదటి స్థానంలో ఉంది. బంగ్లాదేశ్‌లో పోషహాకారలోప బాధితుల శాతం 26% తక్కువ బరువున్న పిల్లల శాతం 46% ఉన్నారు. 5 సంవత్సరాల లోపు వయసున్న పిల్లలలో 43% మందికి పెరుగుదల తక్కువగా ఉంది. ప్రాథమిక స్థాయి పిల్లలలో ప్రతి 5 మందిలో ఒకరు ఏ విటమిన్ లోపంతోనూ ప్రతి ఇద్దరిలో ఒకరు రక్తహీనతతో బాధపడుతున్నారు. బంగ్లాదేశ్‌లో ప్రపంచదేశాలన్నింటికంటే అధికంగా పోషకాహార లోపం ఉన్న పిల్లలు ఉన్నారు. 5 సంవత్సరాల లోపు వయసున్న పిల్లలలో మూడింట రెండు వంతుల మంది పోషకాహార లోపం ఉండగా వారిలో 60% పిల్లలలో పెరుగుదల తక్కువగా ఉంది. గ్రామీణ కుటుంబాలలో 45% నగర ప్రాంతాలలో 75% తక్కువ కాలరీస్ కలిగిన ఆహారం తీసుకుంటున్నారు.

సంస్కృతి

Reflecting the long history of the region, Bangladesh has a culture that encompasses elements both old and new.

సాహిత్యం

బంగ్లాదేశ్: పేరు వెనుక చరిత్ర, చరిత్ర, భౌగోళికం 
Late 19th and early 20th century polymaths Rabindranath Tagore and Kazi Nazrul Islam

బెంగాలీ భాషకు సంపన్నమైన సాహిత్యసంస్కృతి ఉంది. బంగ్లాదేశ్ సాహిత్య వారసత్వం పొరుగున ఉన్న భారతదేశంలోని పశ్చిమ బెంగాల్ రాష్ట్రంతో ముడిపడి ఉంది. 8వ శతాబ్దంలో బెంగాలీ భాషలో రచించబడిన చర్యపాద మొదటి బెంగాలీ రచనగా గుర్తించబడుతుంది. మద్యయుగ బెంగాలీ సాహిత్యంలో మతసంబంధమై (చండీదాస్ రచనలు) లేక ఇతర భాషా అనువాదాలుగా (అలాయోల్) ఉన్నాయి. 19వ శతాబ్దం నాటికి బెంగాలీ సాహిత్యం పరిపూర్ణత సాధించింది. 19వ శతాబ్ధానికి బెగాలీ భాషా రచయితలు (కాజీ నజ్రుల్ ఇస్మాల్, రబీంద్రనాథ్ ఠాకూర్, శరత్ చంద్ర చఠోపాద్యాయ, జసిం ఉద్దిన్, జిబనందా దాస్, షంసుర్ రహ్మాన్ (కవి), అల్ మహ్ముద్, సుకంత భట్టాచార్య, ఈశ్వ చంద్ర విద్యాసాగర్, మైకేల్ మధుసూదన దత్, ప్రస్తుత కాలం నాటి హనుమాన్ అహ్మద్, ముహమ్మద్ జాఫర్ ఇక్బాల్) ప్రాముఖ్యత సంతరించికున్నారు. బగ్లాదేశ్ దీర్ఘకాల జానపద సాహిత్య సంస్కృతిని (మైమంసింగ గీతిక), తకుమార్ ఝులి, గోపాల్ భార్, బీర్బల్, మొల్ల నశీరుద్దీన్ సంబంధిత కథలు) కలిగి ఉంది.

సంగీతం , కళలు

బంగ్లాదేశ్: పేరు వెనుక చరిత్ర, చరిత్ర, భౌగోళికం 
The one string ektara is often played by Baul folk minstrels

బంగ్లాదేశ్ సంగీత సంప్రదాయం సాహిత్య (బాణిప్రధానితం) ఆధారితమై ఉంది. సంగీతానికి తోడుగా మితమైన వాద్యసంగీతాన్ని జతచేస్తారు. బంగ్లాదేశ్‌లో గొంభిర, భటియ, భవైయా మొదలైన ప్రాంతీయ వైవిధ్యం కలిగిన సంగీతరీతులు ఉన్నాయి. జానపద సంగీతంలో ఏకతార (ఒకేఒక తీగ కలిగిన వాయిద్యం) వాయిద్యం చోటుచేసుకుంటుంది. బంగ్లాదేశ్‌లో దోతర, డోలు, వేణువు, తబల మొదలైన సంగీత వాద్యాలు వాడుకలో ఉన్నాయి. బంగ్లాదేశ్ నృత్యంలో పలు జానపద రీతులు ఉంటాయి. ప్రత్యేకంగా గిరిజన నృత్యాలు, పొరుగున ఉన్న భారతీయ నృత్య రీతులు ఉంటాయి. . బంగ్లాదేశ్ నృత్యాలలో బౌల్ నృత్యం ప్రజాదరణ, యునెస్కో వరసత్వ సంపదగా గుర్తింపు కలిగి ఉంది.

చలనచిత్రాలు

బంగ్లాదేశ్ చలనచిత్ర రంగం బంగ్లాదేశ్ రాజధాని ఢాకా మీద ఆధారపడి ఉంది. 1956 నుండి 2004 వరకు బంగ్లాదేశ్‌లో వార్షికంగా 100 చిత్రాలకంటే అధికంగా చిత్రీకరించబడ్డాయి. సరాసరి చిత్రనిర్మాణ వ్యయం 2,00,00,000 తకా (బంగ్లాదేశ్ రూపాయి). బంగ్లాదేశ్ చిత్రరంగాన్ని ధాలీ వుడ్ (ఢాకా హాలీవుడ్) అంటారు. బంగ్లాదేశ్‌లో సరాసరి వార్షికంగా 80 చిత్రాలు నిర్మించబడుతున్నాయి.

మాధ్యమం

బంగ్లాదేశ్‌లో దాదాపు 200 వార్తాపత్రికలు, 500 పీరియాడికల్స్ అచ్చువేయబడుతున్నాయి. అయినప్పటికీ ప్రజలలో పఠనాశక్తి తక్కువగానే (15%) ఉంది. బంగ్లాదేశీయులు వైవిధ్యమైన రేడియో కార్యక్రమాలను (బంగ్లాదేశ్ బెటర్) వింటూ ఉంటారు. బంగ్లాదేశ్‌లో రేడియో ఫూటీ, ఎ.బి.సి. రేడియో, రేడియో టుడే, రేడియో అమర్ మొదలైన ఎఫ్.ఎం ప్రాసారాలు నగరప్రాంత యువతకు అందుబాటులో ఉన్నాయి. అంతర్జాతీయంగా బెంగాలీ భాషా ప్రసారాలలో బి.బి.సి బంగ్లా, వాయిస్ ఆఫ్ అమెరికా ప్రధానమైనవి. బంగ్లాదేశ్‌లో ప్రభుత్వానికి స్వంతమైన బంగ్లాదేశ్ టెలివిజన్ దూరదర్శన్ ప్రసారాలను అందిస్తుంది. సమీపకాలంలో కొన్ని సంవత్సరాలుగా ఎ.టి.ఎన్, బంగ్లా, చానెల్ ఐ, ఎన్.టి.వి. బంగ్లాదేశ్, ఎకుషే టెలివిజన్, దేష్ టి.వి, ఆర్.టి.వి బంగ్లాదేశ్, బంగ్లావిషన్, ఇస్లామిక్ టి.వి, బొయిషఖి టి.వి, మొహనా టి.వి, ఎ.టి.ఎన్ న్యూస్, ప్రైవేట్ టి.వి, సొమీ టి.వి, ఇండిపెండెంట్ టి.వి, చానెల్ 9 బంగ్లాదేశ్ మొదలైన టి.వి చానల్స్ ప్రాసారాలను అందిస్తున్నాయి.

ఆహార సంస్కృతి

బంగ్లాదేశ్: పేరు వెనుక చరిత్ర, చరిత్ర, భౌగోళికం 
Cham cham, a traditional sweet in Bangladeshi cuisine

బంగ్లాదేశ్ ఆహార సంస్కృతి మీద పరిసరాలలో ఉన్న బెంగాలీ, ఈశాన్య భారతదేశంలోని ఆహారసంస్కృతి ప్రభావం ఉంది. అలాగే బంగ్లాదేశ్ ఆహారసంస్కృతిలో వారికే ప్రత్యేకమైన బాణి మిశ్రితమై ఉంటుంది. బంగ్లాదేశీయులకు చేపలు, అన్నం ప్రధాన ఆహారంగా ఉన్నాయి. చేపలు, కూరగాయలు, పప్పుధాన్యాలు అన్నం మొదలైన ప్రధాన ఆహారంతో కలిపి తీస్సుకుంటారు. బిర్యానీ బంగ్లాదేశీయుల అభిమాన ఆహారాలలో ఒకటి. ఎగ్ బిర్యానీ, మట్టన్ బిర్యానీ, బీఫ్ బిర్యానీ మొదలైన బిర్యానీ సంబంధిత ఆహారాలు బంగ్లాదేశ్ ప్రజల ఆహారంలో భాగమై ఉన్నాయి. ఆహారంలో మితమైన మసాలాలు, విస్తారమైన మిఠాయీ రకాలు, భోజనాంతర ఆహారాలు చోటు చేసుకుంటాయి. బంగ్లాదేశీయులు రసగుల్లా, రసమలాయ్, రొషొమలాయ్, కలోజం మొదలైన పాలసంబంధిత ఆహారాలను కూడా అభిమానిస్తారు.

హస్తకళలు

బంగ్లాదేశీ స్త్రీలు సాధారణంగా చీరె (బెంగాలీ:শাড়ি) ధరిస్తారు. బంగ్లాదేశ్‌లో పలువురు నేతవారు జందాని, మస్లిన్ చీరెలను తయారుచేస్తున్నారు.యువతులలో సల్వార్ కమీజ్ ప్రాముఖ్యత సంతరించుకుంది. నగర ప్రాంతాలలో కొంతమంది స్త్రీలు పశ్చిమ దేశాలబాణి వస్త్రాలను ధరిస్తుంటారు. పురుషులు సాధారణంగా పశ్చిమ దేశాలబాణి వస్త్రాలను ధరిస్తుంటారు. పురుషులు కుర్తా పైజమా కూడా ధరిస్తుంటారు. పురుషులు లుంగీ కూడా అధికంగా ధరిస్తుంటారు.

పండుగలు

బంగ్లాదేశ్: పేరు వెనుక చరిత్ర, చరిత్ర, భౌగోళికం 
Shaheed Minar, as displayed on the annual anniversary of Bengali Language Movement Day (International Mother Language Day)

ముస్లిం పండుగలు ఈద్- అల్ - ఫితర్, ఈద్- అల్- అధా, పొహేలా బొయిషాకి (బెంగాలీ కొత్త సంవత్సరం) స్వతంత్రదినం, విక్టరీ డే ఆఫ్ బంగ్లాదేశ్, హిందువుల పండుగలైన దుర్గాపూజ, కృష్ణ జన్మాష్టమి మొదలైన పడుగలు జరుపుకుటూ ఉంటారు. అంతేకాక బుద్ధపూర్ణిమ (వెసక్) కూడా కొతమంది జరుపుకుంటుంటారు. క్రైస్తవులు ది గ్రేట్ డే (బొరొదిన్) పండుగ జరుపుకుంటారు. ఈ దినాలు ప్రభుత్వ శలవు దినాలుగా ఉన్నాయి.

పొహేలా బొయిషఖి

బెంగాలీ కొత్త సంవత్సరం పండుగ బంగాలీ ప్రధాన సంప్రదాయ పండుగగా జరుపుకుంటారు. ఇది దేశం అంతటా జరుపుకుంటారు. ఇది కులమత బేధరహితంగా జర్పుకుంటారు. ప్రజలు ఖరీదైన దుస్తులు ధరిస్తారు. క్రైస్తవులు పరస్పరం బహుమానాలు ఇచ్చిపుచ్చుకుంటారు. పొహేలా బొయిషఖి నిరాడంబరమైన పద్ధతిలో జరుపుకునే బెంగాలీ గ్రామీణ మూలాలను కలిగిన పడుగ.

వ్యవసాయ సంబంధిత పండుగలు

నబన్న, పౌష్ పొర్బన్ అనే రెండు బెంగాలీ పద్ధతిలు వ్యవసాయసంబధిత పండుగలు. .

జాతీయ పర్వదినాలు

1952 ఫిబ్రవరి 21 భాషోధ్యమ దినం (అంతర్జాతీయ మాతృ భాషా దినం). స్వతంత్ర దినం, విక్టరీ ఆఫ్ బెంగాల్ మొదలైన జాతీయ పండుగలను బంగ్లాదేశీయులు జరుపుకుంటున్నారు. భాషోధ్యమ దినం రోజున ప్రజలు ఢాకా లోని షాహీద్ మీనార్ వద్ద కూడుతుంటారు.

నిర్మాణకళ

బంగ్లాదేశ్‌కు చరిత్రాత్మక ప్రత్యేకత కలిగిన ఆకర్ష్ణీయమైన నిర్మాణ సంపద ఉంది. ఇవి సమకాలీన బంగ్లాదేశ్ చిహ్నాలుగా ఉన్నాయి. బంగ్లాదేశ్‌లోని నిర్మాణాలకు మతసంబంధిత, సాంస్కృతిక సంబంధిత, చారిత్రాత్మకమైన మూలాలున్న దీర్ఘకాలిక చరిత్ర ఉంది. బంగ్లాదేశ్ నిర్మాణాల మీద పలు శతాబ్ధాల నుండి సాంఘిక, మతపరమైన, విదేశీ సమూహాల ప్రభావం ఉంది. బంగ్లాదేశ్ నిర్మాణకళలో జీవనశైలి, సంప్రదాయం, బంగ్లదేశ్ ప్రజల సంస్కృతి ప్రతిబింబిస్తుంది.

బంగ్లాదేశ్ ప్రాంతీయత చెరగని ఆధునికత కలిగిన సంప్రదాయం ఉంది. బెంగాల్ డెల్టాలో సాంస్కృతిక, పర్యావరణ మిశ్రిత వారసత్వంతో కూడిన సమకాలీన ఆధునికత కలిగి ఉంది. బంగ్లాదేశ్‌లో పలు ప్రముఖ విదేశీ నిర్మాణకళా నిపుణులు (లూయిస్ కాహ్, కొస్టాంటినొస్, అపోస్టోల్స్ డోక్సియాడిస్, రిచర్డ్ న్యూత్రా, స్టాన్లీ టిగర్మన్, పౌల్ రుడోల్ఫ్, రాబర్ట్ బౌఘే ) పనిచేస్తున్నారు. బంగ్లాదేశ్ నిర్మాణకళా నిపుణులలో ఫజలూర్ రహ్మాన్ ఖాన్, ముఝరుల్ ఇస్లాం, రఫ్గి అజం, కషెఫ్ మహ్బూబ్ చౌదరీ, బషిరుల్ హాక్వి, ఎహ్సన్ ఖాన్ మొదలైన వారు అత్యంత ప్రాధాన్యత కలిగి ఉన్నారు.

క్రీడలు

బంగ్లాదేశ్: పేరు వెనుక చరిత్ర, చరిత్ర, భౌగోళికం 
The Bangladesh cricket team at the Mirpur Stadium

బంగ్లాదేశ్‌లో అత్యంత అధికంగా ప్రజాదరణ కలిగిన క్రీడలలో క్రికెట్ ప్రథమస్థానంలో ఉంది. తరువాత స్థానంలో ఫుట్‌బాల్ క్రీడ ఉంది. " బంగ్లాదేశ్ నేషనల్ క్రికెట్ టీం " 1999లో మొదటి సారిగా క్రికెట్ వరల్డ్ కప్ పోటీలలో పాల్గొన్నది. తరువాత సంవత్సరం టెస్ట్ క్రికెట్ టీంలలో బగ్లాదేశ్‌కు సముచిత స్థానం లభించింది. బంగ్లాదేశ్ క్రికెట్ టీం 10 టెస్ట్ మ్యాచ్ విజయాలను సాధించింది: వీటిలో జింబావేకు ఎదురుగా 2005లో 5 మ్యాచులు, 2014లో 3 మ్యాచులలో విజయం సాధించింది. 2009లో వెస్ట్ ఇండీస్‌కు ఎదురుగా 2 టెస్ట్ మ్యాచులలో విజయం సాధించింది. బంగ్లాదేశ్ క్రికెట్ టీం ఒన్ డే మ్యాచులలో అధిక విజయవంతంగా ఆడుతూఉంది. 2010లో వారు మొదటిసారిగా ఇంగ్లాండ్ టీం మీద విజయం సాధించి ఆనందించారు. తరువాత వారు మొదటిసారిగా జింబావే మీద విజయం సాధించారు. 2012లో స్వదేశంలో 5 విజయాలు సాధించింది. 2011 ఐ.సి.సి క్రికెట్ వరల్డ్ కప్ పోటీలకు భారతదేశం, శ్రీలంకలతో కలిసి విజయవంతంగా ఆతిథ్యం ఇచ్చింది. 2012లో ఆసియా కప్‌ పోటీలకు ఆతిథ్యం ఇచ్చింది. బంగ్లాదేశ్ టీం ఇండియా, శ్రీలంకల మీద విజయం సాధించి ఫైనల్స్‌లో పాకిస్థాన్‌కు ఎదురుగా ఓటమిని పొందింది. అయినప్పటికీ ప్రధాన క్రికెట్ మ్యాచ్ ఫైనల్‌కు చేరి బంగ్లాదేశ్ టీం ప్రత్యేకత చాటుకుంది.

ఆసియన్ క్రీడలు

బంగ్లాదేశ్ గౌంగ్ఝౌ నిర్వహించవడిన " 2010 ఆసియన్ గేంస్ " పాల్గొని ఆసియన్ గేంస్‌లో మొదటిసారిగా స్థానం పొందిన క్రికెట్ క్రీడలో ఆఫ్ఘన్‌స్థాన్ మీద విజయం సాధించి బంగారుపతకం సాధించింది. ఆసియన్ క్రీడలలో నిర్వహించబడిన మూడు టోర్నమెంటులలో పాల్గొన్న బంగ్లాదేశ్ క్రికెటర్ సకిబ్ ఏ (హాసన్) ( " ఇంటర్నేషనల్ క్రికెట్ కౌంసిల్ " వర్గీకరణలో ) మొదటి స్థానం సంపాదించాడు. .

కబడ్డీ

బంగ్లాదేశ్‌లో ప్రాముఖ్యత సంతరించికున్న క్రీడలలో కబడ్డీ ఒకటి.

ఇతర క్రీడలు

ఇతర ప్రజాదరణ పొందిన క్రీడలలో ఫీల్డ్ హాకీ, టెన్నిస్, బ్యాడ్‌మింటన్, టీం హ్యాండ్ బాల్, బాస్కెట్ బాల్, వాలీ బాల్, చెస్, షూటింగ్ క్రీడలు, అంగ్లింగ్ మొదలైన క్రీడలు ప్రధానమైనవి. ది నేషనల్ స్పోర్ట్స్ కౌంసిల్ 42 వైవిధ్యమైన స్పోర్ట్స్ ఫెడరేషన్లను క్రమబద్ధీకరించింది.

  • బంగ్లాదేశ్‌లో 5 గురు చెస్ మాస్టర్లు ఉన్నారు. వారిలో నిజాం ముర్షెద్ దక్షిణాసియా చెస్ క్రీడలలో మొదటి గ్రాండ్ మాస్టర్‌గా గుర్తించబడ్డాడు.
  • 2013, 2014లో ప్రపమచ చాంపియన్ షిప్ పొందిన రిథమిక్ జిమ్నాస్ట్ మార్గరిటా మామున్ (బంగ్లాదేశ్ పూర్వికత కలిగిన వాడు).

ప్రముఖులు

ఇవి కూడ చూడండి

ద్వారకానాథ్ గంగూలీ

మూలాలు

వెలుపలి లింకులు

Tags:

బంగ్లాదేశ్ పేరు వెనుక చరిత్రబంగ్లాదేశ్ చరిత్రబంగ్లాదేశ్ భౌగోళికంబంగ్లాదేశ్ పర్యావరణంబంగ్లాదేశ్ రాజకీయాలుబంగ్లాదేశ్ చట్టంబంగ్లాదేశ్ విదేశీ సంబంధాలుబంగ్లాదేశ్ సైన్యంబంగ్లాదేశ్ దౌత్యసంబంధాలుబంగ్లాదేశ్ నిర్వహణా విభాగాలుబంగ్లాదేశ్ గణాంకాలుబంగ్లాదేశ్ విద్యబంగ్లాదేశ్ ఆరోగ్యంబంగ్లాదేశ్ సంస్కృతిబంగ్లాదేశ్ నిర్మాణకళబంగ్లాదేశ్ క్రీడలుబంగ్లాదేశ్ ప్రముఖులుబంగ్లాదేశ్ ఇవి కూడ చూడండిబంగ్లాదేశ్ మూలాలుబంగ్లాదేశ్ వెలుపలి లింకులుబంగ్లాదేశ్

🔥 Trending searches on Wiki తెలుగు:

ఫేస్‌బుక్టమాటోనువ్వు లేక నేను లేనుఉత్పలమాలపాడ్కాస్ట్తామర పువ్వుకర్ణుడుపచ్చకామెర్లువిశాల్ కృష్ణనల్లారి కిరణ్ కుమార్ రెడ్డిపది ఆజ్ఞలుకాట ఆమ్రపాలిసుభాష్ చంద్రబోస్భారత రాజ్యాంగం - ప్రాథమిక హక్కులుతోట త్రిమూర్తులుఅక్క మహాదేవికస్తూరి రంగ రంగా (పాట)అలెగ్జాండర్మహాత్మా గాంధీపూరీ జగన్నాథ దేవాలయంరాహువు జ్యోతిషంకె. అన్నామలైభారత రాజ్యాంగం - ఆదేశిక సూత్రాలువిద్యఆరూరి రమేష్లగ్నంభారతీయ జనతా పార్టీభారతదేశ పేరు పుట్టుపూర్వోత్తరాలుPHసీ.ఎం.రమేష్కొణతాల రామకృష్ణపసుపు గణపతి పూజరావణుడుఆరోగ్యంమంతెన సత్యనారాయణ రాజుఉష్ణోగ్రతదొమ్మరాజు గుకేష్క్రిస్టమస్భువనగిరి లోక్‌సభ నియోజకవర్గంపేర్ల వారీగా తెలుగు సినిమాల జాబితాభారత ప్రధానమంత్రుల జాబితాజ్ఞానపీఠ పురస్కారంభారత ఆర్ధిక వ్యవస్థపురాణాలుభారత స్వాతంత్ర్యోద్యమంన్యుమోనియాఅలంకారంరజినీకాంత్సజ్జల రామకృష్ణా రెడ్డిపక్షవాతంశుభాకాంక్షలు (సినిమా)మహామృత్యుంజయ మంత్రంక్రికెట్రాజ్యసభతెలంగాణా బీసీ కులాల జాబితాసంధిసీతాదేవిమెరుపుఆంధ్రప్రదేశ్ శాసనసభ నియోజకవర్గాల జాబితాకృపాచార్యుడుభారత రాజ్యాంగంవర్షం (సినిమా)పూర్వాభాద్ర నక్షత్రముబగళాముఖీ దేవిశాంతికుమారికొండా విశ్వేశ్వర్ రెడ్డిమొదటి పేజీఉప రాష్ట్రపతిసజ్జా తేజకమ్మకందుకూరి వీరేశలింగం పంతులుభూమన కరుణాకర్ రెడ్డిలోక్‌సభకాన్సర్స్వామి వివేకానందపూర్వ ఫల్గుణి నక్షత్రముసింహరాశి🡆 More