బెల్జియం: ఐరోపా లోని ఒక దేశం

50°50′N 4°00′E / 50.833°N 4.000°E / 50.833; 4.000

Kingdom of Belgium

  • Koninkrijk België  (Dutch)
  • Royaume de Belgique  (French)
  • Königreich Belgien  (German)
Flag of Belgium
జండా
Coat of arms of Belgium
Coat of arms
నినాదం: "Eendracht maakt macht" (Dutch)
"L'union fait la force" (French)
"Einigkeit macht stark" (German)
"Unity makes Strength"
గీతం: "La Brabançonne"
(English: "The Brabantian")
Location of  బెల్జియం  (dark green) – on the European continent  (green & dark grey) – in the European Union  (green)
Location of  బెల్జియం  (dark green)

– on the European continent  (green & dark grey)
– in the European Union  (green)

Location of Belgium
రాజధానిBrussels
50°51′N 4°21′E / 50.850°N 4.350°E / 50.850; 4.350
అధికార భాషలుDutch
French
German
జాతులు
see Demographics
మతం
(2015)
పిలుచువిధంBelgian
ప్రభుత్వంFederal parliamentary
constitutional monarchy
• Monarch
Philippe
• Prime Minister
Sophie Wilmès
శాసనవ్యవస్థFederal Parliament
• ఎగువ సభ
Senate
• దిగువ సభ
Chamber of Representatives
Independence 
(from the Netherlands)
• Declared
4 October 1830
• Recognised
19 April 1839
విస్తీర్ణం
• మొత్తం
30,689 km2 (11,849 sq mi) (136th)
• నీరు (%)
6.5
జనాభా
• 1 November 2019 census
11,515,793 Increase (80th)
• జనసాంద్రత
376/km2 (973.8/sq mi) (22nd)
GDP (PPP)2018 estimate
• Total
$550 billion (38th)
• Per capita
$48,224 (20th)
GDP (nominal)2018 estimate
• Total
$533 billion (23rd)
• Per capita
$46,724 (17th)
జినీ (2018)Positive decrease 25.6
low
హెచ్‌డిఐ (2019)Increase 0.919
very high · 17th
ద్రవ్యంEuro (€) (EUR)
కాల విభాగంUTC+1 (CET)
• Summer (DST)
UTC+2 (CEST)
Note: Although Belgium is located in Western European Time/UTC (Z) zone, since 25 February 1940, upon WW2 German occupation, Central European Time/UTC+1 was enforced as standard time,[1] with a +0:42:30 offset (and +1:42:30 during DST) from Brussels LMT (UTC+0:17:30).
వాహనాలు నడుపు వైపుright
ఫోన్ కోడ్+32
ISO 3166 codeBE
Internet TLD.be
  1. The flag's official proportions of 13:15 are rarely seen; proportions of 2:3 or similar are more common.
  2. The Brussels region is the de facto capital, but the City of Brussels municipality is the de jure capital.
  3. The .eu domain is also used, as it is shared with other European Union member states.

బెల్జియం అధికారికంగా బెల్జియం రాజ్యం అని పిలువబడుతుంది. ఇది పశ్చిమ ఐరోపాలోని ఒక దేశం. దీనికి ఉత్తర సరిహద్దులో నెదర్లాండ్స్, తూర్పు సరిహద్దులో జర్మనీ, ఆగ్నేయ సరిహద్దులో లక్సెంబర్గు, నైరుతి సరిహద్దులో ఫ్రాన్స్, ఉత్తర, వాయువ్య సరిహద్దులలో సముద్రం ఉన్నాయి. దేశవైశాల్యం 30,689 చ.కి (11,849 చదరపు మైళ్ళు). దేశజనాభా 11.5 మిలియన్లకంటే అధికంగా ఉంది. అత్యంత జనసాంద్రత కలిగిన ప్రపంచ దేశాలలో బెల్జియం 22 వ స్థానంలో ఉంది. అలాగే ఐరోపాలో 6 వ అత్యంత జనసాంద్రత కలిగిన దేశంగా ఇంది. జనసాంధ్రత చదరపుకి కి.మీ.కి 376 (970 / చదరపు మైళ్ళు) ఉంది. దేశంలో రాజధాని, అతిపెద్ద నగరంగా బ్రస్సెల్సు నగరం ఉంది. ఆంట్వెర్పు, ఘెంటు, చార్లెరోయి, లీజె నగరాలు ఇతర ప్రధాన నగరాలుగా ఉన్నాయి .

ఫెడరల్ రాజ్యాంగ రాచరికం వ్యవస్థ, పార్లమెంటరీ వ్యవస్థ కలిగిన సార్వభౌమ రాజ్యంగా ఉంది. దీని సంస్థాగత వ్యవస్థ ప్రాంతీయ, భాషా ప్రాతిపదిక ఆధారితంగా సంక్లిష్టంగా నిర్మించబడింది. ఇది మూడు అత్యంత స్వయంప్రతిపత్త ప్రాంతాలుగా విభజించబడింది: ఉత్తరాన ఫ్లెమిషు ప్రాంతం, దక్షిణాన వలోనియా, బ్రస్సెల్స్-రాజధాని ప్రాంతం ఉన్నాయి. బ్రస్సెల్సు స్వల్పమైన జనసాంద్రత కలిగిన ప్రాంతంగా ఉంది. అయినప్పటికీ తలసరి జిడిపి పరంగా ధనిక ప్రాంతంగా ఉంది.

బెల్జియంలో రెండు ప్రధాన భాషా సమూహాలు ఉన్నాయి: జనాభాలో 60% ఉన్న డచ్ మాట్లాడే ఫ్లెమిషు సమూహం, 40% ఉన్న బెల్జియన్లున్న ఫ్రెంచిభాషా వాడుకరులైన సమూహానికి చెందిన ప్రజలు ఉన్నారు. తూర్పు ఖండాలలో జర్మనుభాషా వాడుకరులైన ప్రజల చిన్న సమూహం 1% ఉంది. బ్రస్సెల్సు-రాజధాని ప్రాంతం అధికారికంగా ద్విభాషా (ఫ్రెంచి, డచ్చి), అయినప్పటికీ ఫ్రెంచి ప్రధాన భాషగా ఉంది.బెల్జియం భాషా వైవిధ్యం, సంబంధిత రాజకీయ సంఘర్షణలు దాని రాజకీయ చరిత్ర, సంక్లిష్ట పాలనా వ్యవస్థలో ప్రతిబింబిస్తాయి. ఇవి 6 వేర్వేరు ప్రభుత్వాలతో రూపొందించబడ్డాయి.

చారిత్రాత్మకంగా బెల్జియం " లో కంట్రీస్ " పిలువబడే ప్రాంతంలో భాగంగా (ప్రస్తుత బెనెలక్సు సమూహాల కంటే కొంత పెద్ద ప్రాంతం) ఉంది. ఇందులో ఉత్తర ఫ్రాన్సు, పశ్చిమ జర్మనీ భాగాలు కూడా ఉన్నాయి. దీని ఆధునిక పేరు లాటిన్ పదం 'బెల్జియం' నుండి వచ్చింది. జూలియసు సీజరు " గల్లికు వార్ " లో క్రీ.పూ 55 లో ఈ ప్రాంతాన్ని సూచించడానికి ఈ పదం ఉపయోగించబడింది. మధ్య యుగం చివరి నుండి 17 వ శతాబ్దం వరకు బెల్జియం ప్రాంతం వాణిజ్యం, సంస్కృతికి సుసంపన్న కాస్మోపాలిటను కేంద్రంగా ఉంది. 16 వ - 19 వ శతాబ్దాల మధ్య బెల్జియం అనేక ఐరోపా శక్తుల మధ్య యుద్ధభూమిగా పనిచేసి " యూరప్ యుద్దభూమి" అనే పేరు సంపాదించింది. రెండు ప్రపంచ యుద్ధాల ద్వారా ఇది ప్రత్యేకఖ్యాతి గడించింది. బెల్జియన్ విప్లవం తరువాత నెదర్లాండ్సు నుండి విడిపోయిన తరువాత 1830 లో బెల్జియం దేశంగా ఉద్భవించింది.

బెల్జియం పారిశ్రామిక విప్లవంలో పాల్గొంది. ఇది 20 వ శతాబ్దంలో ఆఫ్రికాలో అనేక కాలనీలను కలిగి ఉంది. ఫ్లాన్డర్సు - వలోనియా ప్రాంతాల మద్య నెలకొన్న ఆర్థిక అభివృద్ధికి అసమాన్యత ఉద్యమవాతావరణానికి మరింత ఆజ్యం పోశాయి. ఈ నిరంతర విరోధం తగ్గించడానికి పలు సంస్కరణలు రూపొందించబడ్డాయి. ఫలితంగా 1970 - 1993 వరకు ఈ ప్రాంతం సమైఖ్యరాజ్యం నుండి విడిపోయి పలు రాజ్యాలసమాఖ్యగా ఏర్పడడానికి దారితీసింది. సంస్కరణలు జరిగినప్పటికీ సమూహాల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. 20 వ శతాబ్దం రెండవ భాగంలో డచ్ మాట్లాడే పౌరులు, ఫ్రెంచి మాట్లాడే పౌరుల మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు భాష, సంస్కృతిలో తేడాలు (ముఖ్యంగా ఫ్లెమిష్ మధ్య గణనీయమైన వేర్పాటువాదం ఉంది) కారణంగా భాషా సౌకర్యాలతో మునిసిపాలిటీలు వంటి వివాదాస్పద చట్టాలు ఉన్నాయి; 2010 జూన్ సమాఖ్య ఎన్నికల తరువాత సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడటానికి 18 నెలలు పట్టింది. ఇది ప్రపంచ రికార్డుగా గుర్తించబడింది. యుద్ధం తరువాత ఫ్లాన్డర్సు కంటే వలోనియాలో నిరుద్యోగం రెట్టింపుగా విజృంభించింది.

ఐరోపా సమాఖ్యలోని 6 వ్యవస్థాపక దేశాలలో బెల్జియం ఒకటి. దాని రాజధాని బ్రస్సెల్సు ఐరోపా కమీషను, ఐరోపా సమాఖ్య కౌన్సిలు, ఐరోపా కౌన్సిలు అధికారిక స్థానాలను కలిగి ఉంది. అలాగే ఐరోపా పార్లమెంటు రెండు సీట్లలో ఒకటి (మరొకటి స్ట్రాస్బోర్గు). బెల్జియం యూరోజోను, నాటో, ఓఇసిడి, డబ్ల్యుటిఒ వ్యవస్థాపక సభ్యదేశంగా ఉంది. త్రైపాక్షిక బెనెలక్సు సమాఖ్య, స్కెంజెను ఏరియాలో ఒక భాగంగా ఉంది. బ్రస్సెల్సులో అనేక ఐరోపా సమాఖ్య అధికారిక సీట్లతో పాటు నాటో వంటి అనేక ప్రధాన అంతర్జాతీయ సంస్థల ప్రధాన కార్యాలయాలు ఉన్నాయి.


బెల్జియం అభివృద్ధి చెందిన దేశంగా అభివృద్ధి చెందిన అధిక ఆదాయ ఆర్థికవ్యవస్థగా ఉంది. ఇది చాలా అధునాతన జీవన ప్రమాణాలు, ఉన్నతజీవన నాణ్యత, ఆరోగ్య సంరక్షణ, విద్య, మానవ అభివృద్ధి సూచికలో "చాలా ఎక్కువ స్థాయి" లో ఉంది. ఇది ప్రపంచంలో అత్యంత సురక్షితమైన, అత్యంత ప్రశాంతమైన దేశాలలో ఒకటిగా ఉంది.

History

Pre-independent Belgium

Gaul is divided into three parts, one of which the Belgae inhabit, the Aquitani another, those who in their own language are called Celts, in ours Gauls, the third.

(...) Of all these, the Belgae are the strongest (...) .

— Julius Caesar, De Bello Gallico, Book I, Ch. 1

ఉత్తరాంత ప్రాంతం అయిన గౌలు భూభాగంలోని బెల్గే ప్రాంతం ఆధునిక బెల్జియం కంటే చాలా పెద్దది. సీజర్ ఈ ప్రాంతాన్ని సూచించడానికి "బెల్జియం" అనే పదాన్ని ఒకసారి ఉపయోగించాడు. దీనిని సాధారణంగా గల్లియా బెల్జికా అని పిలుస్తారు. ఆయన విజయాల ఫలితంగా ఇది రోమను ప్రావిన్సు అయింది. ఆధునిక బెల్జియం తూర్పు భాగంతో సహా రైన్ సరిహద్దుకు దగ్గరగా ఉన్న ప్రాంతాలు జర్మనీ ఇన్ఫిరియరు ప్రావింసులో భాగమయ్యాయి. సామ్రాజ్యం వెలుపల ఉన్న జర్మనీ తెగలతో కలిసిమెలిసి జీవించారు. పాశ్చాత్య రోమను సామ్రాజ్య కేంద్ర ప్రభుత్వం కూలిపోయిన సమయంలో బెల్జియం ప్రాంతంలో ఫ్రాంకిషు తెగలకు చెందిన రోమను జనాభా అధికంగా ఉండేది. 5 వ శతాబ్దంలో ఈ ప్రాంతం మెరోవింగియా రాజుల పాలనలో వచ్చింది. అప్పటికే వారు ఉత్తర ఫ్రాన్సులో అధికారాన్ని స్వాధీనం చేసుకున్నారు. 8 వ శతాబ్దంలో క్రమంగా ఫ్రాంక్సు రాజ్యంగా మారి తరువాత కరోలింగియా సామ్రాజ్యంగా విస్తరించింది.

బెల్జియం: History, భౌగోళికం, ఆర్ధికం 
1570 ల మధ్యలో స్పానిషు దళాలు జీతం లేకపోవడంతో తిరుగుబాటు ఆంట్వెర్పును వినాశనం చేసి 1,000 ఇళ్లను ధ్వంసం చేసి, 17,000 మందిని వధించిన తరువాత డచ్చి తిరుగుబాటు దక్షిణాన వ్యాపించింది. సైనిక భీభత్సం ఫ్లెమిషు ఉద్యమాన్ని ఓడించి బెల్జియంలో స్పానిషు పాలనను పునరుద్ధరించింది.

843 లో వెర్డును ఒప్పందం కరోలింగియా సామ్రాజ్యం మూడు రాజ్యాలుగా విభజించింది. దీని సరిహద్దులు మధ్యయుగ రాజకీయ సరిహద్దుల మీద శాశ్వత ప్రభావాన్ని చూపాయి. ఆధునిక బెల్జియంలో ఎక్కువ భాగం " మిడిల్ కింగ్డం "లో భాగంగా ఉన్నాయి. తరువాత దీనిని లోథారింగియా అని పిలిచారు. ఫ్లాన్డర్సు తీరప్రాంత కౌంటీ మాత్రమే ఫ్రాన్సుదేశం స్థాపించడానికి పూర్వం ఉనికిలో ఉన్న వెస్టు ఫ్రాన్సియాలో భాగమైంది. 870 లో మీర్సను ఒప్పందం ఆధారంగా ఆధునిక బెల్జియం భూములన్నీ పశ్చిమ రాజ్యంలో భాగమయ్యాయి. 1880 లో రిబెమోంటు ఒప్పందం ఆధారంగా లోథారింగియా పవిత్ర రోమన్ చక్రవర్తి శాశ్వత నియంత్రణలోకి వచ్చింది. అయితే సరిహద్దు వెంట ఉన్న ప్రభువులు రెండు గొప్ప రాజ్యాలతో ముఖ్యమైన సంబంధాలను కలిగి ఉంది.

14 వ - 15 వ శతాబ్దాల బుర్గుండియా నెదర్లాండ్సులోని ఈ ఫిఫ్డంలు చాలా ఐక్యమయ్యాయి. 1540 లలో ఐదవ చార్లెస్ చక్రవర్తి 17 వ ప్రావిన్సుల వ్యక్తిగత సమాఖ్యను విస్తరించాడు. ఇది " లీజ్ ప్రిన్స్-బిషోప్రిక్‌ " మీద తన ప్రభావాన్ని పెంచింది.

ఎనభై సంవత్సరాల యుద్ధం (1568-1648) దిగువ దేశాలు ఉత్తర యునైటెడు ప్రావిన్సులుగా (లాటిన్లో బెల్జికా ఫోడెరాటా, "ఫెడరేటెడ్ నెదర్లాండ్స్"), దక్షిణ నెదర్లాండ్సు (బెల్జికా రెజియా, "రాయల్ నెదర్లాండ్సు") గా విభజించబడ్డాయి. తరువాతి వాటిని స్పానిషు (స్పానిషు నెదర్లాండ్సు), ఆస్ట్రియా హబ్సబర్గుస్ (ఆస్ట్రియా నెదర్లాండ్సు) వరుసగా పాలించాయి. ఫ్రాంకో-డచి యుద్ధం (1672-1678), తొమ్మిది సంవత్సరాల యుద్ధం (1688-1697), స్పానిషు వారసత్వ యుద్ధం ( 17 వ - 18 వ శతాబ్దాలలో చాలా ఎక్కువ కాలం జరిగిన ఘర్షణలకు ఇది వేదికగా ఉంది (1701–1714)). ఆస్ట్రియా వారసత్వ యుద్ధంలో భాగం (1740–1748)గా కూడా ఉంది.

ఫ్రెంచి విప్లవాత్మక యుద్ధాలైన 1794 పోరాటం తరువాత దిగువ దేశాలు-హబ్స్బర్గు పాలనలో లేని భూభాగాలతో ప్రిన్స్-బిషోప్రిక్ ఆఫ్ లీజ్ వంటి ప్రాంతాలు ఫ్రెంచి మొదటి రిపబ్లిక్కు చేత ఆక్రమించబడడంతో ఈ ప్రాంతంలో ఆస్ట్రియా పాలన ముగిసింది. నెపోలియను పదవీచ్యుతుడై 1814 లో మొదటి ఫ్రెంచి సామ్రాజ్యం రద్దు చేయబడిన తరువాత దిగువ దేశాలు ఏకమై " యునైటెడు కింగ్డం ఆఫ్ నెదర్లాండ్సు " రూపొందించబడింది.

Independent Belgium

బెల్జియం: History, భౌగోళికం, ఆర్ధికం 
Scene of the Belgian Revolution of 1830 (1834), by Gustaf Wappers

1830 లో బెల్జియం విప్లవం నెదర్లాండ్స్ నుండి దక్షిణ ప్రొవిన్సులను వేరు చేయడానికి దారితీసింది. జాతీయ కాంగ్రెసు ఆధ్వర్యంలో తాత్కాలిక స్వతంత్ర బెల్జియం ప్రభుత్వం స్థాపించడానికి ఈ విప్లవం మూలకారణం అయింది. కాథలికు, బూర్జువా, అధికారికంగా ఫ్రెంచ్ మాట్లాడే, తటస్థ.మొదటి లియోపోల్డును రాజుగా నియమించబడిన 1831 జూలై 21 న బెల్జియం జాతీయ దినోత్సవంగా జరుపుకుంటారు. బెల్జియం నెపోలియన్ కోడ్ ఆధారంగా లైసిస్ట్ రాజ్యాంగంతో రాజ్యాంగ రాచరికం, పార్లమెంటరీ ప్రజాస్వామ్యంగా ఉంది. ప్రారంభంలో ఫ్రాంచైజేషను పరిమితం చేయబడినప్పటికీ 1893 సమ్మె తరువాత (1919 వరకు పురుషుల ఓటింగు), 1949 లో పురుషులతో మహిళలకు ఓటుహక్కు కల్పిస్తూ సార్వత్రిక ఓటు హక్కును ప్రవేశపెట్టారు.

19 వ శతాబ్దంలో ప్రధాన రాజకీయ పార్టీలుగా కాథలికు పార్టీ, లిబరలు పార్టీ ఉన్నాయి. 19 వ శతాబ్దం చివరిలో బెల్జియం లేబరు పార్టీ ఉద్భవించింది. మొదట ప్రభువులు, బర్జియోసీలు స్వీకరించబడిన ఏకైక అధికారిక భాష ఫ్రెంచి. డచ్చి కూడా గుర్తింపు పొందడంతో ఫ్రెంచి క్రమంగా తన మొత్తం ప్రాముఖ్యతను కోల్పోయింది. ఈ గుర్తింపు 1898 లో అధికార భాషగా మారడానికి దారితీసింది. 1967 లో పార్లమెంటు రాజ్యాంగం డచ్చి భాషను అధికారభాషగా అంగీకరించింది.

1885 నాటి బెర్లిన్ కాన్ఫరెన్స్ కాంగో ఫ్రీ స్టేట్ నియంత్రణను కింగ్ రెండవ లియోపోల్డుకి ప్రైవేటు స్వాధీనంగా ఇచ్చింది. 1900 నుండి రెండవ లియోపోల్డు కాంగో జనాభా పట్ల చూపించిన విపరీతమైన, క్రూరత అంతర్జాతీయంగా ఆందోళనను అధికరింపజేసింది. వీరి కోసం కాంగో ఉత్పత్తిచేసిన దంతాలు, రబ్బరు బెల్జియం ఆదాయ వనరుగా మారింది. దంతాలు, రబ్బరు కోసం ఉత్పత్తి కోటాను పూర్తిచేయడంలో విఫలమైనందుకు లియోపోల్డ్ ఏజెంట్లు చాలా మంది కాంగోలను చంపారు. లియోపోల్డు కాలంలో దాదాపు 10 మిలియన్ల కాంగోలు మరణించారని అంచనా. 1908 లో ఈ ఆగ్రహం బెల్జియం రాజ్యం కాలనీ ప్రభుత్వానికి బాధ్యత వహించేలా చేసింది. ఇకనుంచి దీనిని బెల్జియం కాంగో అని పిలుస్తారు. 1919 లో ఒక బెల్జియన్ కమిషన్ అంచనా ప్రకారం కాంగో జనాభా 1879 లో ఉన్న దానిలో సగానికి క్షీణించిందని భావిస్తున్నారు.

బెల్జియం: History, భౌగోళికం, ఆర్ధికం 
1944 సెప్టెంబరు బ్రస్సెల్సు లోకి ప్రవేశించిన బ్రిటిషు దళాలను ఉత్సాహపరుస్తూ జనం అభినందించారు

1914 ఆగస్టులో ష్లీఫెను ఫ్రాంసు మీద దాడి చేయడానికి ప్రణాళిక రూపొందించి అందులో భాగంగా బెల్జియం మీద దాడి చేసాడు. మొదటి ప్రపంచ యుద్ధం వెస్ట్రను ఫ్రంటు పోరాటం అధికంగా దేశంలోని పశ్చిమ ప్రాంతాల్లో జరిగింది. జర్మనీ అతిక్రమణ కారణంగా ప్రారంభ యుద్ధమాసాలను బెల్జియం రేప్ అని అంటారు. యుద్ధ సమయంలో బెల్జియం జర్మనీ కాలనీలైన రువాండా-ఉరుండి (ఆధునిక రువాండా, బురుండి) పై నియంత్రణను తీసుకుంది. 1924 లో లీగ్ ఆఫ్ నేషన్సు వాటిని బెల్జియంకు స్థిరపరచింది. మొదటి ప్రపంచ యుద్ధం తరువాత బెల్జియం 1925 లో ప్రష్యన్ జిల్లాలైన యుపెను, మాల్మెడీని స్వాధీనం చేసుకుంది. తద్వారా జర్మనీ మాట్లాడే మైనారిటీ ప్రజల ఉనికిని కలిగి ఉంది.

1940 మే లో జర్మనీ దళాలు మళ్లీ ఆ దేశం మీద దాడి చేశాయి. జర్మనీ ఆక్రమణ, ది హోలోకాస్టు సమయంలో 40,690 మంది బెల్జియన్లు (వారిలో సగానికి పైగా యూదులున్నారు) చంపబడ్డారు. 1944 సెప్టెంబరు నుండి 1945 ఫిబ్రవరి మద్యకాలంలో మిత్రరాజ్యాలు బెల్జియంను విముక్తి చేశాయి. 1951 లో కింగు రెండవ లియోపోల్డు యుద్ధ సమయంలో జర్మనీతో సహకరించారని బెల్జియన్లలో చాలామంది భావించి సమ్మె చేసిన కారణంగా రెండవ లియోపోల్డు పదవీ విరమణ చేయవలసి వచ్చింది. 1960 లో కాంగో సంక్షోభం సమయంలో బెల్జియం కాంగో స్వాతంత్ర్యం పొందింది. రువాండా-ఉరుండి రెండు సంవత్సరాల తరువాత స్వాతంత్ర్యం పొందాయి. బెల్జియం నాటోలో వ్యవస్థాపక సభ్యునిగా చేరి నెదర్లాండ్సు, లక్సెంబర్గులతో కలిసి బెనెలక్సు దేశాల సమూహాన్ని ఏర్పాటు చేసింది.


1951 లో ఐరోపా బొగ్గు - ఉక్కు సంఘం, 1957 లో స్థాపించబడిన యూరోపియన్ అటామిక్ ఎనర్జీ కమ్యూనిటీ, యూరోపియన్ ఎకనామిక్ కమ్యూనిటీ వ్యవస్థాపక సభ్యదేశాలలో బెల్జియం ఒకటి. రెండోది ఇప్పుడు ఐరోపా సమాఖ్యగా మారింది. దీని కోసం బెల్జియం యూరోపియన్ కమిషన్, యూరోపియన్ యూనియన్ కౌన్సిల్, యూరోపియన్ పార్లమెంటు కమిటీ సమావేశాల వంటి ప్రధాన సంస్థలను నిర్వహిస్తుంది.

భౌగోళికం

బెల్జియం: History, భౌగోళికం, ఆర్ధికం 
బెల్జియం రిలీఫ్ మ్యాప్

బెల్జియం ఫ్రాన్సు (620 కి.మీ), జర్మనీ (167 కి.మీ), లక్సెంబర్గు (148 కి.మీ), నెదర్లాండ్సు (450 కి.మీ) లతో సరిహద్దులను పంచుకుంటుంది. నీటి విస్తీర్ణంతో సహా దీని మొత్తం ఉపరితల వైశాల్యం 30,689 చ.కిమీ(3.3033 × 1011..). 2018 కి ముందు దీని మొత్తం వైశాల్యం 30,528 చ.కి.మీ. అయితే 2018 లో దేశ గణాంకాలను సేకరించడానికి కొత్త గణనావిధానం ఉపయోగించబడింది. మునుపటి గణాంకాలకు విరుద్ధంగా సముద్రతీర జలభాగ వైశాల్యం గతంలో గణించబడిన 160 చ.కిమీ కంటే అధికంగా ఉన్నట్లు వెల్లడించింది.దీని భూభాగ వైశాల్యం 30,278 చ.కిమీ.బెల్జియం 49 ° 30 '- 51 ° 30' ఉత్తర అక్షాంశం, 2 ° 33 '- 6 ° 24' తూర్పు రేఖాంశం మధ్య ఉంటుంది.

బెల్జియం: History, భౌగోళికం, ఆర్ధికం 
క్యాంపైను; ప్రకృతి దృశ్యం

బెల్జియంలో మూడు ప్రధాన భౌగోళిక ప్రాంతాలు ఉన్నాయి; వాయువ్యంలో తీర మైదానం, మధ్య పీఠభూమి ఆంగ్లో-బెల్జియం బేసిన్, ఆగ్నేయంలోని ఆర్డెన్నెసు ఎత్తైన ప్రాంతాలు హెర్సినియా ఒరోజెనికు బెల్టు వరకు ఉన్నాయి. పారిస్ బేసిను బెల్జియం దక్షిణాంతం, బెల్జియన్ లోరైన్ సమీపంలో ఉన్న ఒక చిన్న నాల్గవ ప్రాంతానికి చేరుకుంటుంది. తీర మైదానంలో ప్రధానంగా ఇసుక దిబ్బలు, దిగువ ప్రాంతాలు ఉన్నాయి. లోతట్టు ప్రాంతంలో జలమార్గాల ద్వారా సాగునీరు అందుకుంటూ వ్యవసాయ యోగ్యమైన సజల లోయలు, కాంపైన్ (కెంపెన్) ఈశాన్య ఇసుక మైదానం ఉన్నాయి. దట్టమైన అటవీ కొండలు, ఆర్డెన్నెసు పీఠభూములు, కఠినమైన శిలలు, గుహలతో కూడిన కొండలు. పశ్చిమ దిశగా ఫ్రాన్సు వరకు విస్తరించి ఉన్న ఈ ప్రాంతం తూర్పువైపు జర్మనీలోని ఈఫెలు గోపురంతో ఎత్తైన పీఠభూమి ద్వారా అనుసంధానించబడి ఉంది. ఈ పీఠభూమిలో దేశంలోని ఎత్తైన ప్రదేశంగా గుర్తించబడిన సిగ్నల్ డి బొట్రేంజు (694 మీ (2,277 అడుగులు)) వద్ద ఉంది.

బెల్జియం: History, భౌగోళికం, ఆర్ధికం 
దినెంటు, హస్తియెరు మధ్య ప్రవహిస్తున్న మీయుసు నది
బెల్జియం: History, భౌగోళికం, ఆర్ధికం 
జర్మనీ సరిహద్దుకు సమీపంలో ఎగువ భూభాగం;ప్రకృతి దృశ్యం

వాయువ్య ఐరోపాలోని చాలా ప్రాంతాల మాదిరిగా అన్ని సీజన్లలో (కొప్పెను వాతావరణ వర్గీకరణ: సి.ఎఫ్.బి) గణనీయమైన వాయువుతో సముద్రతీర సమశీతోష్ణ వాతావరణం నెలకొని ఉంటుంది. సగటు ఉష్ణోగ్రత జనవరిలో 3 ° సెం (37.4 ° ఫా), జూలైలో అత్యధికంగా 18 ° సెం (64.4 ° ఫా) ఉంటుంది. నెలకు సగటు వర్షపాతం ఫిబ్రవరి - ఏప్రిలు నెలలలో 54 మిమీ (2.1 అంగుళాలు), జూలై మాసానికి 78 మిమీ (3.1 అంగుళాలు) ఉంటుంది. 2000 నుండి 2006 సంవత్సరాల సగటులు రోజువారీ ఉష్ణోగ్రత కనిష్ట ఉష్ణోగ్రత 7 ° సెం (44.6 ° ఫా), గరిష్ట ఉష్ణోగ్రత 14 ° సెం (57.2 ° ఫా) ఉంటుంది. నెలవారీ వర్షపాతం 74 మిమీ (2.9 అంగుళాలు).

ఫైటోగోగ్రాఫికలు ఆధారంగా బెలిజియం బోరియలు కింగ్డంలోని సర్కుంబోరియలు ప్రాంతంలోని అట్లాంటికు ఐరోపా, మధ్య ఐరోపా ప్రొవిన్సుల మధ్య ఉంది. వరల్డు వైడ్ ఫండ్ ఫర్ నేచర్ ఆధారంగా బెల్జియం భూభాగం అట్లాంటికు మిశ్రమ అడవుల పర్యావరణ ప్రాంతానికి చెందినది. పశ్చిమ ఐరోపా మధ్యలో ఉన్న బెల్జియం అధిక జనసాంధ్రత, పారిశ్రామికీకరణ కారణంగా ఇప్పటికీ కొన్ని పర్యావరణ సమస్యలను ఎదుర్కొంటోంది. అయినప్పటికీ వివిధ స్థాయిలలో ప్రభుత్వ చేస్తున్న ప్రయత్నాల కారణంగా బెల్జియంలో పర్యావరణ స్థితి క్రమంగా మెరుగుపడుతోంది. 2012 లో పర్యావరణ పరిరక్షణ కృషి దృష్ట్యా బెల్జియం టాప్ 10 దేశాలలో ఒకటిగా (132 లో 9) ఉంది. పర్యావరణ పరిరక్షణలో 132 లో 24 వ దేశంగా బెల్జియం నిలిచింది. బెల్జియం ఐరోపాలో అత్యధిక వ్యర్థాల రీసైక్లింగు శాతం కలిగిన దేశాలలో ఒకటిగా ఉంది. బెల్జియంలోని ఫ్లెమిషు ప్రాంతం ప్రత్యేకంగా ఐరోపాలో అత్యధిక వ్యర్థ మళ్లింపు శాతం కలిగి ఉంది. అక్కడ ఉత్పత్తి చేయబడిన నివాస వ్యర్థాలలో దాదాపు 75% తిరిగి రీసైకిలు చేయడం లేదా కంపోస్టు చేయబడుతుంది.

ప్రొవింసులు

The territory of Belgium is divided into three Regions, two of which, the Flemish Region and Walloon Region, are in turn subdivided into provinces; the third Region, the Brussels Capital Region, is neither a province nor a part of a province.

ప్రొవింసు డచ్చి పేరు ఫ్రంచి పేరు జర్మనీ పేరు రాజధాని ప్రాంతం జనసంఖ్య
(1 జనవరి 2019)
జనసాంధ్రత ISO 3166-2:BE
ఫ్లెమిషు ప్రాంతం
ఆంట్వెర్పు ఆంట్వెర్పను అన్వర్సు ఆంట్వెర్పను ఆంట్వెర్పు 2,876 km2 (1,110 sq mi) 1,857,986 చ.కిమీ 647(చ.మై.1680) వి.ఎ.ఎన్.
తూర్పు ఫ్లెండర్లు ఊస్టు-వ్లండెరను ఫ్లెండ్రె ఓరియంట్లె ఓస్టుఫ్లెండ్రెను ఘెంటు 3,007 km2 (1,161 sq mi) 1,515,064 చ.కి.మీ 504, చ.మై 1310 504/km2 (1,310/sq mi) వి.ఒ.వి
ఫ్లెమిషు బ్రబంటు వ్లాంసు-బ్రబంటు బ్రబంటు ఫ్లామండు ఫ్లామిక్-బ్రబంటు ల్యూవెను 2,118 km2 (818 sq mi) 1,146,175 చ.కి.మీ 542, చ.మై 1400 వి.బి.ఆర్.
లింబర్గు లింబర్గు లింబర్గు లింబర్గు హస్సెల్టు 2,427 km2 (937 sq mi) 874,048 చ.కి.మీ 361, చ.మై 930 వి.ఎల్.ఐ
ఫ్లాండర్సు పడమర-వ్లాండరిను ఫ్లాండ్రె ఆక్సిడెంటలె పశ్చిమ ఫ్లాండరెను బ్రుజెసు 3,197 km2 (1,234 sq mi) 1,195,796 చ.కి.మీ 375, చ.మై. 970 వి.డబల్యూ.వి.
వలూను ప్రాంతం
హైనౌటు హెనెగౌవెను హౌనౌటు హెన్నెగౌ మోంసు 3,813 km2 (1,472 sq mi) 1,344,241 చ.కి.మీ 353, చ.మై 910 353/km2 (910/sq mi) డబల్యూ,హెచ్.టి
లీజె లుయికు లీజె లుట్టికు లీజె 3,857 km2 (1,489 sq mi) 1,106,992 చ.కి.మీ 288 చ.మై 750 డబల్యూ.ఎల్.జి.
లక్సెంబర్గు(బెల్జియం) లక్సెంబర్గు లక్సెంబర్గు లక్సెంబర్గు అర్లాను 4,459 km2 (1,722 sq mi) 284,638 చ.కి.మీ 64, చ.మై 170 64/km2 (170/sq mi) డబల్యూ.ఎల్.ఎక్సు
నమూరు నమెను నమురు నమురు నమురు 3,675 km2 (1,419 sq mi) 494,325 చ.కి.మీ 135, చ.మై. 350 డబల్యు.ఎన్.ఎ.
వలూను బ్రబంటు వాల్సు - బ్రబంటు బ్రబంటు వల్లాను వాల్సు-బ్రబంటు వవ్రె 1,097 km2 (424 sq mi) 403,599 చ.కి.మీ. 368, చ.మై 950 డబల్యూ,బి,ఆర్.
బ్రస్సెల్సు రాజధాని ప్రాంతం
బ్రస్సెల్సు రాజధాని ప్రాంతం బ్రస్సెల్సు హూఫ్డుస్టెడెలిజ్కు గివెస్టు రీజెను డీ బ్రుక్సెలెసు- కేపిటలె రీజెను బ్రుస్సెలు- హౌప్టుస్టడ్టు బ్రుస్సెల్సు నగరం 162.4 km2 (62.7 sq mi) 1,208,542 చ.కి.మీ 7442, చ.మై 19270 బి.బి.ఆర్
మొత్తం బెలిగీ బెలిక్యూ బెలిజియన్ బ్రస్సెలౌ నగరం చ.కి.మీ 30.689, చ.మై 11,849 11,431,406 చ.కి.మీ. 373, చ.మై 970

ఆర్ధికం

బెల్జియం: History, భౌగోళికం, ఆర్ధికం 
Belgium is part of a monetary union, the eurozone (dark blue), and of the EU single market.

బెల్జియం బలమైన ప్రపంచీకరణ చేయబడిన ఆర్థిక వ్యవస్థగా ఉంది. దాని రవాణా సౌకర్యాల వ్యవస్థ మిగిలిన ఐరోపా దేశాలను అనుసంధానిస్తూ ఉన్నాయి. దేశంలోని కేంద్రప్రాంతం అధిక పారిశ్రామికీకరణ చేయబడిన ప్రాంతంగా అభివృద్ధి చేయబడింది. ఇది 2007 లో బెల్జియం ప్రపంచంలో 15 వ అతిపెద్ద వాణిజ్య దేశంగా నిలవడానికి సహకరించింది. అధిక ఉత్పాదకశక్తి కలిగిన శ్రామికవర్గం, అధిక జిఎన్‌పి, తలసరి అధిక ఎగుమతులతో బెల్జియం ఆర్ధికవ్యవస్థ శక్తివంతంగా ఉంది. ముడి పదార్థాలు, యంత్రాలు, పరికరాలు, రసాయనాలు, ముడి వజ్రాలు, ఔషధాలు, ఆహార పదార్థాలు, రవాణా పరికరాలు, చమురు ఉత్పత్తులు బెల్జియం ప్రధాన దిగుమతులుగా ఉన్నాయి. యంత్రాలు, పరికరాలు, రసాయనాలు, పూర్తయిన వజ్రాలు, లోహాలు, లోహ ఉత్పత్తులు, ఆహార పదార్థాలు దీని ప్రధాన ఎగుమతులుగా ఉన్నాయి.

బెల్జియా ఆర్థిక వ్యవస్థ భారీగా సేవా-ఆధారితమైనదిగా ద్వంద్వ స్వభావాన్ని చూపిస్తుంది: డైనమికు ఫ్లెమిషు ఆర్థిక వ్యవస్థ, వెనుకబడి ఉన్న వాలూను ఆర్థిక వ్యవస్థ. ఐరోపా సమాఖ్య వ్యవస్థాపక సభ్యదేశాలలో ఒకటైన బెల్జియం సభ్యదేశాల ఆర్థిక వ్యవస్థలను ఏకీకృతం చేయడానికి బహిరంగ ఆర్థిక వ్యవస్థ, ఐరోపా సమాఖ్య సంస్థల అధికారాల విస్తరణకు మద్దతు ఇస్తుంది. 1922 నుండి బెల్జియం-లక్సెంబర్గు ఆర్ధిక సమాఖ్య ద్వారా, బెల్జియం, లక్సెంబర్గు కస్టమ్సు కరెన్సీ యూనియనుతో ఒకే వాణిజ్య మార్కెట్టుగా పనిచేస్తుంది.

బెల్జియం: History, భౌగోళికం, ఆర్ధికం 
లీజ్ సమీపంలోని ఓగ్రే వద్ద మీయుస్ నది వెంట స్టీల్ తయారీ

19 వ శతాబ్దం ప్రారంభంలో పారిశ్రామిక విప్లవానికి గురైన మొట్టమొదటి ఖండాంతర ఐరోపా దేశం బెల్జియం. ఇది 20 వ శతాబ్దం మధ్యకాలం వరకు సాంబ్రే, మీస్ లోయలో లీజ్, చార్లెరోయి మైనింగు, స్టీల్‌ తయారీని వేగంగా అభివృద్ధి చేశారు. 1830 నుండి 1910 వరకు ప్రపంచంలోని మూడు ప్రధాన పారిశ్రామిక దేశాలలో బెల్జియం ఒకటిగా నిలిచింది. 1840 ల నాటికి ఫ్లాన్డర్సు వస్త్ర పరిశ్రమ తీవ్ర సంక్షోభంలో ఉంది. ఈ ప్రాంతం 1846 నుండి 1850 వరకు కరువును ఎదుర్కొంది.

రెండవ ప్రపంచ యుద్ధం తరువాత ఘెంటు, ఆంట్వెర్పు ప్రాంతాలలో రసాయన, పెట్రోలియం పరిశ్రమల వేగవంతమైన విస్తరణను సంభవించింది. 1973 - 1979 చమురు సంక్షోభాలు (ప్రధానంగా వలోనియాలో) ఆర్థిక వ్యవస్థను మాంద్యంలోకి పంపించాయి; ఉక్కు పరిశ్రమకు పోటీ తక్కువగా ఉన్న వలోనియా ప్రాంతం తీవ్రమైన క్షీణతను ఎదుర్కొంది. 1980 - 1990 లలో దేశ ఆర్థిక కేంద్రం ఉత్తర దిశగా మారడం కొనసాగింది. తత్ఫలితంగా ఫ్లెమిషు డైమండు ప్రాంతంలో జనసాంధ్రత అఫ్హికంగా కేంద్రీకృతమై ఉంది.

1980 లో చివరినాటికి బెల్జిం స్థూల ఆర్థిక విధానాల ఫలితంగా జిడిపిలో సుమారు 120% ప్రభుత్వానికి ఋణాలు అందాయి. 2006 నాటికి బడ్జెటు సమతుల్యమైంది. ప్రజా ఋణం జిడిపిలో 90.30% కి సమానం. 2005 - 2006 లో నిజమైన జిడిపి వృద్ధి రేట్లు వరుసగా 1.5% - 3.0% ఉన్నాయి. యూరో ప్రాంత సగటు కంటే కొంచెం ఎక్కువగా ఉన్నాయి. 2005 లో 8.4%, 2006 లో 8.2% నిరుద్యోగ రేట్లు ప్రాంత సగటుకు దగ్గరగా ఉన్నాయి. 2010 అక్టోబరు నాటికి ఇది ఐరోపా సమాఖ్య మొత్తానికి సగటు 9.6% రేటుతో పోలిస్తే 8.5% కి ఉంది. 1832 నుండి 2002 వరకు బెల్జియం కరెన్సీ బెల్జియన్ ఫ్రాంక్. బెల్జియం 2002 లో యూరోకు మారిపోయింది. మొదటి యూరో నాణేలు 1999 లో ముద్రించబడ్డాయి. ప్రసరణ కోసం నియమించబడిన ప్రామాణిక బెల్జియం యూరో నాణేలు మీద చక్రవర్తి చిత్తరువు (మొదటి కింగ్ రెండవ ఆల్బర్టు, 2013 నుండి కింగ్ ఫిలిప్) ఉంటుంది.

1970 నుండి 1999 వరకు 18% తగ్గినప్పటికీ బెల్జియం 1999 లో 1 000 కిమీ 2 అభివృద్ధితో (ఐరోపా సమాఖ్య 113.8 కిమీ నుండి) అత్యధిక రైలు నెట్వర్కు సాంద్రతను సాధించింది. మరోవైపు అదే కాలం 1970-1999 మోటారువే నెట్వర్కు భారీ వృద్ధిని (+ 56%) చూసింది.

బెల్జియం: History, భౌగోళికం, ఆర్ధికం 
జీబ్రగ్జు నౌకాశ్రయం

బెల్జియంలో జీవవనరులు తక్కువ పరిమితిలో ఉన్నాయి. బెల్జియం సగటు బయో కెపాసిటీ 2016 లో 0.8 గ్లోబలు హెక్టార్లు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఒక వ్యక్తికి లభించే 1.6 ప్రపంచ హెక్టార్ల బయో కెపాసిటీలో ఇది సగం మాత్రమే ఉంది. దీనికి విరుద్ధంగా 2016 లో బెల్జియన్లు సగటున 6.3 ప్రపంచ హెక్టార్ల బయో కెపాసిటీని ఉపయోగించారు. అంటే బెల్జియంలో ఉన్నదానికంటే ఎనిమిది రెట్లు ఎక్కువ బయో కెపాసిటీ వారికి అవసరం. తత్ఫలితంగా బెల్జియం 2016 లో ఒక వ్యక్తికి 5.5 ప్రపంచ హెక్టార్ల బయో కెపాసిటీ లోటును నడుపుతోంది.

బెల్జియం ఐరోపాలో అత్యంత రద్దీగా ఉండే ట్రాఫికు రద్దీని అనుభవిస్తుంది. 2010 లో బ్రస్సెల్సు, ఆంట్వెర్పు నగరాలలో ప్రయాణికులు సంవత్సరానికి 65 - 64 గంటలు ట్రాఫికు జాంలో గడిపారు. చాలా చిన్న ఐరోపా దేశాలలో ఉన్నట్లు బెల్జియం 80% కంటే అధికంగా వాయుమార్గాల ట్రాఫికును కలిగి ఉంది. ఒకే విమానాశ్రయం అయిన బ్రస్సెల్స్ విమానాశ్రయం ద్వారా వాయుమార్గ సేవలు నిర్వహించబడుతున్నాయి. ఆంట్వెర్పు, జీబ్రగ్జు (బ్రూగెస్) నౌకాశ్రయాలు బెల్జియను సముద్ర ట్రాఫికులో 80% కంటే అధికమైన వాటాను కలిగి ఉన్నాయి. అంతకుముందు ఐదేళ్ళలో 10.9% వృద్ధి సాధించింది. 2000 లో 115 988 000 టన్నుల సరుకుల బరువుతో ఆంట్వెర్పు రెండవ ఐరోపా నౌకాశ్రయం ఉంది.2016 లో ఆంట్వెర్పు నౌకాశ్రయం సంవత్సరానికి 2.7% వృద్ధి తర్వాత 214 మిలియన్ల టన్నులను రవణాను నిర్వహించింది.

ఫ్లాన్డర్సు, వలోనియా మధ్య పెద్ద ఆర్థిక అంతరం ఉంది. ఫ్లాన్డరులతో పోలిస్తే వలోనియా చారిత్రాత్మకంగా సంపన్నమైనది. దాని భారీ పరిశ్రమల కారణంగా ఇది సాధ్యం అయింది. కానీ రెండవ ప్రపంచ యుద్ధానంతర ఉక్కు పరిశ్రమ క్షీణత ఈ ప్రాంతం వేగంగా క్షీణించడానికి దారితీసింది. అయినప్పటికీ ఫ్లాన్డర్సు తిరిగి వేగంగా పెరిగింది. అప్పటి నుండి ఐరోపాలోని సంపన్న ప్రాంతాలలో ఫ్లాన్డర్సు సంపన్నంగా ఉన్నారు. వలోనియా కొట్టుమిట్టాడుతోంది. 2007 నాటికి వలోనియా నిరుద్యోగశాతం ఫ్లాన్డర్సు కంటే రెట్టింపు ఉంది. ఇప్పటికే ఉన్న భాషా విభజన అధికరించడానికి ఫ్లెమిషు, వాలూన్ల ఉద్రిక్తతలు కీలక పాత్ర పోషించాయి. స్వాతంత్ర్య అనుకూల ఉద్యమాలు ఫ్లాన్డర్సులో అధిక ప్రజాదరణ పొందాయి. ఉదాహరణకు వేర్పాటువాద న్యూ ఫ్లెమిషు అలయన్సు పార్టీ బెల్జియంలో అతిపెద్ద పార్టీగా ఉంది.

సైంసు, సాంకేతికం

బెల్జియం: History, భౌగోళికం, ఆర్ధికం 
Gerardus Mercator

దేశ చరిత్ర అంతటా దేశం సైన్సు అండ్ టెక్నాలజీ అభివృద్ధికి సహకారం అందించింది. 16 వ శతాబ్దం ప్రారంభంలో సుసంపన్నంగా వర్ధిల్లుతున్న ఆధునిక పశ్చిమ ఐరోపాలో కార్టోగ్రాఫరు గెరార్డస్ మెర్కేటరు, శరీర నిర్మాణ శాస్త్రవేత్త ఆండ్రియాసు వెసాలియసు, మూలికా నిపుణుడు రంబెర్టు డోడోయెన్సు, గణిత శాస్త్రజ్ఞుడు సైమన్ స్టీవిన్ అత్యంత ప్రభావవంతమైన శాస్త్రవేత్తలుగా ఉద్భవించారు.

రసాయన శాస్త్రవేత్త ఎర్నెస్టు సోల్వే, ఇంజనీరు జెనోబ్ గ్రాం (ఎకోల్ ఇండస్ట్రియల్ డి లీజ్) ల పరిశోధనకు గుర్తింపుగా 1860 లలో వరుసగా సోల్వే ప్రక్రియ, గ్రాం డైనమోలకు వారి పేరు ఇవ్వబడింది. 1907 - 1909 మద్య లియో బేకెలాండ్ బేకలైటును అభివృద్ధి చేసాడు. ఎర్నెస్టు సోల్వే ఒక ప్రధాన సాంఘికసేవకుడుగా కూడా పనిచేశాడు. ఆయన పేరుతో సోల్వే ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషియాలజీ, సోల్వే బ్రస్సెల్స్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ మేనేజ్‌మెంటు, ఇంటర్నేషనల్ సోల్వే ఇన్స్టిట్యూట్ ఫర్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీకి స్థాపించబడ్డాయి. ఇవి ప్రస్తుతం యూనివర్సిటీ లిబ్రే డి బ్రక్సెల్లెస్లో భాగంగా ఉన్నాయి. 1911 లో ఆయన ప్రారంభించిన భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం సంబంధిత సాల్వే సమావేశాలు క్వాంటం ఫిజిక్సు, కెమిస్ట్రీ పరిణామం మీద లోతైన ప్రభావాన్ని చూపాయి. 1927 లో విశ్వం మూలం గురించి బిగ్ బ్యాంగ్ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన బెల్జియన్ మోన్సిగ్నోర్ జార్జెస్ లెమాట్రే (కాథలిక్ యూనివర్శిటీ ఆఫ్ లూవైన్) కూడా ప్రాథమిక శాస్త్రానికి ప్రధాన సహకారం అందించాడు.

బెల్జియన్లకు ఫిజియాలజీ లేదా మెడిసినులో మూడు నోబెల్ బహుమతులు లభించాయి: 1919 లో జూల్స్ బోర్డెటు (యూనివర్సిటీ లిబ్రే డి బ్రక్సెల్లెసు), 1938 లో కార్నెయిల్ హేమన్సు (యూనివర్శిటీ ఆఫ్ ఘెంట్), ఆల్బర్టు క్లాడ్ (యూనివర్సిటీ లిబ్రే డి బ్రక్సెల్లెస్) కలిసి క్రిస్టియన్ డి డ్యూవ్ (యూనివర్సిటీ కాథలిక్ డి) లూవైన్) 1974 లో. ఫ్రాంకోయిసు ఎంగ్లర్టు (యూనివర్సిటీ లిబ్రే డి బ్రక్సెల్లెస్) కు 2013 లో భౌతిక శాస్త్రానికి నోబెల్ బహుమతి లభించింది. ఇలియా ప్రిగోగిను (యూనివర్సిటీ లిబ్రే డి బ్రక్సెల్లెసు) కు 1977 లో కెమిస్ట్రీకి నోబెల్ బహుమతి లభించింది. ఇద్దరు బెల్జియన్ గణిత శాస్త్రవేత్తలకు ఫీల్డ్సు మెడల్ లభించింది: 1978 లో పియరీ డెలిగ్నే, 1994 లో జీన్ బౌర్గైన్.

గణాంకాలు

బెల్జియం: History, భౌగోళికం, ఆర్ధికం 
బెల్జియం రాజధాని, మహానగర బెల్జియం రాజధాని బ్రస్సెల్సు

2019 నవంబరు 1 నాటికి బెల్జియం జనాభాగణాంకాల ఆధారంగా మొత్తం జనసంఖ్య 11,515,793. 2019 జనవరి నాటికి బెల్జియం జనసాంద్రత చ.కి.మీ 376 (చదరపు మైలుకు 970). జనసాంధ్రతపరంగా బెల్జియం ప్రపంచదేశాలలో 22 వ స్థానంలో ఉంది. ఐరోపాలో అత్యధిక జనసాంద్రత కలిగిన 6 వ దేశంగా నిలిచింది. అత్యధిక జనసాంద్రత కలిగిన ప్రొవింసుగా ఆంట్వెర్పు, తక్కువ జనసాంద్రత కలిగిన ప్రొవింసుగా లక్సెంబర్గు ఉన్నాయి. 2019 జనవరి నాటికి ఫ్లెమిషు ప్రాంతం జనసంఖ్య 6,589,069 (బెల్జియంలో 57.6%). దేశంలో అత్యధిక జనాభా కలిగిన నగరాలు ఆంట్వెర్పు (5,23,248), ఘెంట్ (2,60,341), బ్రూగెస్ (1,18,284). వాలొనియా మొత్తం జనసంఖ్య 36,33,795 (బెల్జియంలో 31.8%). ఇందులో చార్లెరోయి (2,01,816), లీజు (1,97,355), నామూరు (110,939) అత్యధిక జనాభా కలిగిన నగరాలుగా ఉన్నాయి. 19 మునిసిపాలిటీలలో బ్రస్సెల్సు రాజధాని ప్రాంతం జనసంఖ్య 12,08,542 (బెల్జియంలో 10.6%). వీరిలో మూడు మునిసిపాలిటీలలో ఒక్కొకదానిలో 1,00,000 మంది నివాసితులు ఉన్నారు.

2017 లో బెల్జియంలో సగటు మొత్తం సంతానోత్పత్తి రేటు (టిఎఫ్ఆర్) స్త్రీకి 1.64 మంది పిల్లలు. పునఃస్థాపన రేటు 2.1 కన్నా తక్కువ. ఇది 1873 లో స్త్రీకి జన్మించిన 4.87 మంది పిల్లల కంటే చాలా తక్కువగా ఉంది. ప్రపంచంలోని పురాతన అత్యధిక జనాభా కలిగిన ప్రాంతాలలో బెల్జియం ఒకటి. సగటు వయోపరిమితి 41.5 సంవత్సరాలు.

వలసలు

2007 నాటికి జనాభాలో దాదాపు 92% మందికి బెల్జియం పౌరసత్వం ఉంది. ఇతర ఐరోపా సమాఖ్య సభ్యదేశాల పౌరులు 6% ఉన్నారు. విదేశీ పౌరులలో ఇటాలీ (1,71,918), ఫ్రెంచి (1,25,061), డచ్చి (1,16,970), మొరాకో (80,579), పోర్చుగీసు (43,509), స్పానిషు (42,765), టర్కిషు (39,419), జర్మనీ (37,621). 2007 లో బెల్జియంలో 1.38 మిలియన్ల విదేశీయులు ఉన్నారు. మొత్తం జనాభాలో వీరు 12.9% ఉన్నారు. వీరిలో 6,85,000 (6.4%) ఐరోపాసమాఖ్య వెలుపల జన్మించారు. 6,95,000 (6.5%) మరొక ఐరోపాసమాఖ్య సభ్య దేశంలో జన్మించిన వారున్నారు.

2012 ప్రారంభంలో విదేశీ జనాభా, వారి వారసులు మొత్తం జనాభాలో 25% ఉన్నారు. అంటే 2.8 మిలియన్ల కొత్త బెల్జియన్లు ఏర్పడినట్లు అంచనా. ఈ కొత్త బెల్జియన్లలో 12,00,000 మంది ఐరోపా వంశానికి చెందినవారు, 13,50,000 పశ్చిమదేశేతరులు (వీరిలో మొరాకో, టర్కీ, డెమొక్రటిక్ రిపబ్లిక్కు ఆఫ్ కాంగో). 1984 లో బెల్జియం జాతీయతాచట్టంలో సవరణలు జరిగినప్పటి నుండి 1.3 మిలియన్ల విదేశీవలసప్రజలు, వారి సంతతికి చెందిన వారు బెల్జియం పౌరసత్వం అందుకున్నారు. వీరిలో మొరాకో సంతతికి చెందినవారు అధికంగా ఉన్నారు.

బెల్జియం: History, భౌగోళికం, ఆర్ధికం 
చారిత్రక నగరకేంద్రం, ప్రపంచవారసత్వ సంపదగా గుర్తించబడిన బ్రూజెస్

Functional urban areas

Functional urban areas Population
2011
Brussels 2,608,000
Antwerp 1,091,000
Liège 744,000
Ghent 591,000
Charleroi 488,000

భాషలు

Estimated distribution of primary languages in Belgium
Dutch
  
59%
French
  
40%
German
  
1%
బెల్జియం: History, భౌగోళికం, ఆర్ధికం 
Bilingual signs in Brussels

బెల్జియంలో డచ్చి, ఫ్రెంచి, జర్మనీ మూడు భాషలూ అధికారిక భాషలుగా ఉన్నాయి. అనేక అధికారేతర మైనారిటీ భాషలు కూడా వాడుకభాషలుగా ఉన్నాయి. జనాభా గణాంకాలు నిర్వహించనందున, బెల్జియం మూడు అధికారిక భాషల వాడకం లేదా వాటి మాండలికాలకు సంబంధించి అధికారిక గణాంక సమాచారం లేదు. తల్లిదండ్రుల భాష (లు), విద్య లేదా విదేశీ జన్మించిన వారి రెండవ భాషా స్థితితో సహా వివిధ ప్రమాణాల గణాంకాలను అందుబాటులో ఉన్నాయి. బెల్జియం జనాభాలో 60% మంది డచ్చి మాట్లాడేవారు (తరచూ దీనిని ఫ్లెమిషు అని అంటారు), జనాభాలో 40% మందికి స్థానికంగా ఫ్రెంచి వాడుకభాషగా ఉంది. ఫ్రెంచి మాట్లాడే బెల్జియన్లను తరచుగా వాలూన్సు అని పిలుస్తారు. అయినప్పటికీ బ్రస్సెల్సులో ఫ్రెంచి మాట్లాడేవారిని వాలూన్లుగా భావించరు.

స్థానికంగా డచ్చి మాట్లాడేవారి సంఖ్య సుమారు 6.23 మిలియన్లు ఉంది. వీరు ఉత్తర ఫ్లాన్డర్సు ప్రాంతంలో కేంద్రీకృతమై ఉన్నారు. స్థానిక ఫ్రెంచి మాట్లాడేవారు వాలొనియాలో 3.32 మిలియన్లు ఉన్నారు. అధికారికంగా ద్విభాషా బ్రస్సెల్సు-రాజధాని ప్రాంతంలో 8,70,000 ( 85%) మంది ఉన్నారు. జర్మనీ మాట్లాడే సంఘం వాలూను ప్రాంతానికి తూర్పున 73,000 మంది ఉన్నారు; సుమారు 10,000 మంది జర్మనీ పౌరులతో 60,000 బెల్జియను జాతీయులు కూడా జర్మనీ మాట్లాడగలరు. రాజధాని సమీపప్రాంతాలలోని మునిసిపాలిటీలలో సుమారు 23,000 మంది జర్మనీ మాట్లాడేవారు నివసిస్తున్నారు.


బెల్జియన్ డచ్చి, బెల్జియన్ ఫ్రెంచి రెండూ నెదర్లాండ్సు, ఫ్రాంసులలో మాట్లాడే పదజాలం, అర్థసూక్ష్మ నైపుణ్యాలలో చిన్న తేడాలు ఉన్నాయి. చాలా మంది ఫ్లెమిషు ప్రజలు ఇప్పటికీ తమ స్థానిక వాతావరణంలో డచ్చి మాండలికాలను మాట్లాడతారు. వాలూన్, ఫ్రెంచి మాండలికం ప్రత్యేకమైన భాషగా పరిగణించబడుతుంది. ఇది కొంతమంది స్వల్పంగా మాత్రమే ప్రజలు అర్థం చేసుకుని మాట్లాడతారు. ఇది అధికంగా వృద్ధులు మాట్లాడుతుంటారు. వాలూన్ నాలుగు మాండలికాలుగా విభజించబడింది. ఇవి పికార్డ్‌తో పాటు, ప్రజా జీవితంలో చాలా అరుదుగా ఉపయోగించబడతాయి. దీనిని అధికంగా ఫ్రెంచి భర్తీ చేస్తుంది.

మతం

బెల్జియం: History, భౌగోళికం, ఆర్ధికం 
National Basilica of the Sacred Heart in Koekelberg, Brussels

దేశానికి స్వాతంత్ర్యం లభించినప్పటి నుండి రోమన్ కాథలిక్కులు బెల్జియం రాజకీయాల్లో ముఖ్యమైన పాత్ర పోషించారు. బెల్జియం అధికంగా లౌకిక దేశం. లౌకిక రాజ్యాంగం మత స్వేచ్ఛను అందిస్తుంది. ప్రభుత్వం సాధారణంగా ఈ హక్కును గౌరవిస్తుంది. మొదటి ఆల్బర్టు, బౌడౌయిన్ పాలనలో బెల్జియం రాజకుటుంబం కాథలిక్కుల ఖ్యాతి లోతుగా వేళ్ళూనింది.

రోమన్ కాథలిక్కులు సాంప్రదాయకంగా బెల్జియం ఆధిపత్య మతంగా ఉంది; ఫ్లాన్డర్సులో ముఖ్యంగా బలంగా ఉంది. అయినప్పటికీ 2009 నాటికి ఆదివారం చర్చి హాజరు మొత్తం బెల్జియంకు 5%; బ్రస్సెల్సులో 3%, ఫ్లాన్డర్సులో 5.4%. 2009 లో చర్చి హాజరు 1998 లో ఆదివారం చర్చి హాజరులో సగం (1998 లో మొత్తం బెల్జియంకు 11%)ఉంది. చర్చి హాజరు తగ్గినప్పటికీ, కాథలికు గుర్తింపు బెల్జియం సంస్కృతిలో ఒక ముఖ్యమైన భాగంగా ఉంది.

యూరోబరోమీటరు 2010 ఆధారంగా బెల్జియం పౌరులలో 37% మంది దేవుడు ఉన్నారని నమ్ముతున్నారని ప్రతిస్పందించారు. 31% మంది ఆత్మ లేదా ప్రాణశక్తి ఉందని నమ్ముతున్నారని సమాధానం ఇచ్చారు. 27% మంది ఆత్మ, దేవుడు లేదా ప్రాణశక్తి లేదని భావించడం లేదని సమాధానం ఇచ్చారు. 5% స్పందించలేదు. యూరోబరోమీటరు 2015 ఆధారంగా బెల్జియంలోని మొత్తం జనాభాలో 60.7% క్రైస్తవ మతానికి కట్టుబడి ఉంది. వీరిలో రోమను కాథలిక్కులు 52.9% తో అతిపెద్ద తెగగా ఉన్నారు. ప్రొటెస్టంట్లు 2.1%, ఆర్థడాక్సు క్రైస్తవులు మొత్తం 1.6% ఉన్నారు. మతేతర ప్రజలు జనాభాలో 32.0% ఉన్నారు. నాస్తికులు (14.9%), అజ్ఞేయవాదులు (17.1%) ఉన్నారు. జనాభాలో 5.2% ముస్లింలు, 2.1% ఇతర మత విశ్వాసులు ఉన్నారు. 2012 లో నిర్వహించిన అదే సర్వేలో బెల్జియంలో క్రైస్తవ మతం అతిపెద్ద మతం అని గుర్తించబడింది. బెల్జియన్లలో 65% మంది క్రైస్తవులు ఉన్నారు.

రోమను కాథలిక్కు చర్చి అనుకూలమైన స్థితిలో ఉంది. బెల్జియం అధికారికంగా మూడు మతాలను గుర్తించింది: క్రైస్తవ మతం (కాథలిక్, ప్రొటెస్టాంటిజం, ఆర్థడాక్స్ చర్చిలు, ఆంగ్లికనిజం), ఇస్లాం, జుడాయిజం.

బెల్జియం: History, భౌగోళికం, ఆర్ధికం 
Interior of the Great Synagogue of Brussels

2000 ల ప్రారంభంలో బెల్జియంలో సుమారు 42,000 మంది యూదులు ఉన్నారు. ఆంట్వెర్పు యూదు సంఘం (సుమారు 18,000 సంఖ్య) ఐరోపాలో అతిపెద్దదిగా ఉంది. ప్రపంచంలో యిడ్డిషు ప్రాధమిక భాషగా ఉన్న ఒక పెద్ద యూదు సమాజం నివసిస్తున్న చివరి ప్రదేశాలలో ఇది ఒకటి. (న్యూయార్కు, జెర్సీ, ఇజ్రాయెలు లోని కొంతమంది ఆర్థడాక్సు, హసిడికు సంఘాలకు ఇది ప్రతీకగా ఉంది). అదనంగా, ఆంట్వెర్పులోని చాలా మంది యూదు పిల్లలకు యూదు విద్య అందుబాటులో ఉంటుంది. దేశంలో అనేక యూదు వార్తాపత్రికలు ఉన్నాయి. 45 కి పైగా క్రియాశీల ప్రార్థనా మందిరాలు (వీటిలో 30 ఆంట్వెర్పులో ఉన్నాయి) ఉన్నాయి. వాలొనియా కంటే మతపరమైన ప్రాంతంగా పరిగణించబడుతున్న ఫ్లాన్డర్సులో 2006 లో జరిగిన విచారణలో 55% మంది తమను తాము మతవిశ్వాసులుగా అంగీకరించారు. 36% మంది దేవుడు విశ్వాన్నిసృష్టించాడని విశ్వసిస్తున్నారని తేలింది. మరోవైపు ఐరోపాలోని అత్యంత లౌకికవాదం తక్కువగా ఉన్న మత ప్రాంతాలలో ఒకటిగా వలోనియా మారింది. ఫ్రెంచి మాట్లాడే ప్రాంతంలో ఉన్న జనాభాలో ఎక్కువ మంది మతాన్ని వారి జీవితంలో ఒక ముఖ్యమైన భాగంగా పరిగణించరు. జనాభాలో 45% మంది మతం అసంబద్ధమైనదిగా గుర్తించారు. తూర్పు వలోనియా, ఫ్రెంచి సరిహద్దు వెంబడి ఉన్న ప్రాంతాలలో ఇది ప్రత్యేకంగా సంభవిస్తుంది.

బెల్జియం: History, భౌగోళికం, ఆర్ధికం 
బెల్జియం ఇస్లామిక్ సాంస్కృతిక కేంద్రస్థానం బ్రస్సెల్సు గ్రేట్ మసీదు

2008 అంచనా ప్రకారం బెల్జియన్ జనాభాలో సుమారు 6% (628,751 మంది) ముస్లింలు ఉన్నారు. బ్రస్సెల్సు జనాభాలో ముస్లింలు 23.6% ఉన్నారు. ముస్లింలు వలోనియాలో 4.9%, ఫ్లాన్డర్లలో 5.1% ఉన్నారు. బెల్జియం ముస్లింలలో ఎక్కువమంది ఆంట్వెర్పు, బ్రస్సెల్సు, చార్లెరోయి వంటి ప్రధాన నగరాలలో నివసిస్తున్నారు. బెల్జియానికి వలస వచ్చిన వారిలో అతిపెద్ద సమూహం మొరాకో ప్రజలు (4,00,000) మంది ఉన్నారు. రెండవ అతిపెద్ద ముస్లిం జాతి సమూహంగా టర్కులు (మూడవ అతిపెద్ద విదేశీ సమూహం) (220,000) గా ఉన్నారు.

ఆరోగ్యం

బెల్జియం: History, భౌగోళికం, ఆర్ధికం 
University Hospital of Antwerp

బెల్జియన్లు మంచి ఆరోగ్యరక్షణను అందుకుంటున్నారు. 2012 అంచనాల ఆధారంగా సగటు ఆయుర్దాయం 79.65 సంవత్సరాలు. 1960 నుండి ఆయుర్దాయం ఐరోపా సగటుకు అనుగుణంగా సంవత్సరానికి రెండు నెలలు పెరిగింది. బెల్జియంలో మరణం సంభవించడానికి ప్రధానంగా గుండె - వాస్కులరు డిజార్డర్సు, నియోప్లాజమ్సు, శ్వాసకోశ వ్యవస్థ రుగ్మతలు, అసహజ మరణాలు (ప్రమాదాలు, ఆత్మహత్య) కారణంగా ఉన్నాయి. 24 సంవత్సరాల వయస్సు గల ఆడవారు, 44 సంవత్సరాల వయస్సు గల మగవారి మరణానికి కేన్సరు అత్యంత సాధారణ వ్యాధి కారణంగా ఉంది.

బెల్జియంలోని ఆరోగ్యరక్షణకు అవసరమైన సామాజిక దాతృత్వ నిధులు, పన్నుల ద్వారా సమకూరుతాయి. దేశంలో ఆరోగ్య బీమా తప్పనిసరి. ఆరోగ్య సంరక్షణను ప్రైవేటు వైద్యలు, ప్రభుత్వ వైద్యులు, విశ్వవిద్యాలయాల పాక్షిక ప్రైవేటు ఆసుపత్రుల మిశ్రమ ప్రభుత్వ - ప్రైవేటు వ్యవస్థ ద్వారా అందజేస్తున్నారు. ఆరోగ్య సంరక్షణ సేవ రోగికి అందించిన తరువాత ఆరోగ్య భీమా సంస్థలచే తిరిగి చెల్లించబడుతుంది. కాని భీమాకు అనర్హమైన వర్గాలకు (రోగులు, సేవల) 3 వ పార్టీ చెల్లింపు వ్యవస్థలు అని పిలవబడేవి ఉన్నాయి. బెల్జియం ఆరోగ్య సంరక్షణ వ్యవస్థను ఫెడరల్ ప్రభుత్వం, ఫ్లెమిషు, వాలూను ప్రాంతీయ ప్రభుత్వాలు పర్యవేక్షించి ఆర్ధిక సహాయం చేస్తాయి. జర్మనీ కమ్యూనిటీకి పరోక్షపర్యవేక్షణ, బాధ్యతలు కూడా ఉన్నాయి.

విద్య

బెల్జియం: History, భౌగోళికం, ఆర్ధికం 
The Central Library of the KU Leuven University

బెల్జియన్లకు 6 నుండి 18 సంవత్సరాల వయస్సు వరకు నిర్బంధ విద్య అమలులో ఉంది. 2002 లో ఒ.ఇ.సి.డి దేశాలలో పోస్ట్ సెకండరీ విద్యలో చేరిన 18 నుండి 21 సంవత్సరాల వయస్సు గల వారిలో సంఖ్యాపరంగా బెల్జియం మూడవ స్థానంలో 42% ఉన్నారు. వయోజన జనాభాలో 99% అక్షరాస్యులు ఉన్నప్పటికీ, క్రియాత్మక నిరక్షరాస్యత మీద ఆందోళన అధికరిస్తుంది. ఒ.ఇ.సి.డి. చేత సమన్వయం చేయబడిన ప్రోగ్రాం ఫర్ ఇంటర్నేషనల్ స్టూడెంట్ అసెస్‌మెంట్ (పిసా) ప్రస్తుతం బెల్జియం విద్యను ప్రపంచంలో 19 వ ఉత్తమమైనదిగా పేర్కొంది. ఇది ఒ.ఇ.సి.డి. సగటు కంటే గణనీయంగా అధికంగా ఉంది.ఒక్కొక కమ్యూనిటీ చేత విడిగా నిర్వహించబడుతున్న విద్యవ్యవస్థలో ఫ్లెమిషు కమ్యూనిటీ ఫ్రెంచి, జర్మనీ మాట్లాడే కమ్యూనిటీల కంటే ఆధిఖ్యత చేస్తుంది.

19 వ శతాబ్దపు బెల్జియం రాజకీయపరిస్థితి ద్వంద్వ నిర్మాణానికి లిబరల్, కాథలికు పార్టీల భాగస్వామ్యం వహించింది. విద్యా వ్యవస్థ లౌకిక, మతపరమైన విభాగాలుగా వేరు చేయబడింది. పాఠశాల లౌకిక శాఖను సంఘాలు, ప్రావిన్సులు లేదా మునిసిపాలిటీలు నియంత్రిస్తాయి. అయితే మతపరమైన (ప్రధానంగా కాథలికు శాఖ) విద్యను మతపరమైన అధికారులు నిర్వహిస్తారు. అయినప్పటికీ సంఘాలు సబ్సిడీ, పర్యవేక్షణలో నిర్వహించబడుతూ ఉంటాయి.

సంస్కృతి

రాజకీయ, భాషా విభజనలు ఉన్నప్పటికీ ప్రస్తుత బెల్జియం ప్రాంతంలో ముఖ్యమైన కళాఉద్యమాలు వర్ధిల్లాయి. ఇది ఐరోపా కళ, సంస్కృతి మీద విపరీతమైన ప్రభావాన్ని చూపింది. ఈ రోజుల్లో కొంతవరకు భాషాప్రాతిపదిక కలిగిన సమాజాలన్నింటిలో సాంస్కృతిక జీవితం కేంద్రీకృతమై ఉంది. వివిధ రకాల అవరోధాలు సాంస్కృతిక భాగస్వామ్యాన్ని తగ్గించించాయి. 1970 ల నుండి దేశంలో రాయల్ మిలిటరీ అకాడమీ, ఆంట్వెర్పు మారిటైం అకాడమీ మినహా ద్విభాషా విశ్వవిద్యాలయాలు, కళాశాలలు, కామన్ మీడియా లేదు. రెండు ప్రధాన సమాజాలు ప్రాతినిధ్యం వహిస్తున్న ఒకే పెద్ద సాంస్కృతిక, శాస్త్రీయ సంస్థ లేదు.

ఫైన్ ఆర్ట్సు

బెల్జియం: History, భౌగోళికం, ఆర్ధికం 
The Ghent Altarpiece: The Adoration of the Mystic Lamb (interior view), painted 1432 by van Eyck

బెల్జియంలో పెయింటింగు, వాస్తుశిల్పానికి గొప్ప తోడ్పాటు అందించబడుతుంది. మోసాన్ కళ, ప్రారంభ నెదర్లాండ్, ఫ్లెమిషు పునరుజ్జీవనం, బరోకు పెయింటింగు, రోమనెస్కు, గోతికు, పునరుజ్జీవనం, బరోకు వాస్తుశిల్పం, ప్రధాన ఉదాహరణలు కళా చరిత్రలో మైలురాళ్ళు. తక్కువ దేశాలలో 15 వ శతాబ్దపు కళ జాన్ వాన్ ఐక్, రోజియర్ వాన్ డెర్ వీడెన్, మత చిత్రాలతో ఆధిపత్యం చెలాయించాయి. 16 వ శతాబ్దం పీటర్ బ్రూగెల్ ప్రకృతి చిత్రాలు, లాంబెర్ట్ లోంబార్డు పురాతన ప్రాతినిధ్యం వంటి విస్తృత శైలులలో వర్గీకరించబడ్డాయి. 17 వ శతాబ్దం ప్రారంభంలో దక్షిణ నెదర్లాండ్సులో పీటర్ పాల్ రూబెన్సు, ఆంథోనీ వాన్ డిక్ ఆఫ్ బరోకు శైలి అభివృద్ధి చెందినప్పటికీ. అది క్రమంగా క్షీణించింది.

19 వ - 20 వ శతాబ్దాలలో జేమ్స్ ఎన్సోర్, లెస్ ఎక్స్ఎక్స్ సమూహానికి చెందిన ఇతర కళాకారులు, కాన్స్టాంటు పెర్మెకే, పాల్ డెల్వాక్సు, రెనే మాగ్రిట్టేతో సహా అనేక మంది భావవ్యక్తీకరణ, వాస్తవిక బెల్జియం చిత్రకారులు ఉద్భవించారు. 1950 లలో అవాంట్-గార్డు కోబ్రా ఉద్యమం తలెత్తింది. సమకాలీన కళలో శిల్పి పనామారెంకో గొప్ప వ్యక్తిగా నిలిచారు.సమకాలీన కళా రంగంలో మల్టీడిసిప్లినరీ ఆర్టిస్టులు జాన్ ఫాబ్రే, విం డెల్వోయి, చిత్రకారుడు లూక్ తుయ్మన్సు అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందారు.

19, 20 వ శతాబ్దాలలో బెల్జియం వాస్తుశిల్పుల నిర్మాణాలు కొనసాగాయి. వీటిలో ఆర్ట్ నోయువే శైలి ప్రధాన ప్రారంభకులు అయిన విక్టర్ హోర్టా, హెన్రీ వాన్ డి వెల్డె నిర్మాణాలు కూడా ఉన్నాయి.

బెల్జియం: History, భౌగోళికం, ఆర్ధికం 
జాక్వెస్ బ్రెల్

దిగువ దేశాల దక్షిణ భాగంలో " ఫ్రాంకో-ఫ్లెమిషు స్కూల్ " సంగీతం అభివృద్ధి చెందింది. ప్రధానంగా పునరుజ్జీవనోద్యమ సంస్కృతికి ఇది సహకరించింది. 19 వ, 20 శతాబ్దాలలో హెన్రీ వియెక్సుటెంప్సు, యూజీన్ వైసే, ఆర్థర్ గ్రుమియాక్స్ వంటి ప్రధాన వయోలినిస్టుల ఆవిర్భావం ఉంది, అడోల్ఫ్ సాక్స్ 1846 లో సాక్సోఫోన్‌ను కనుగొన్నాడు. 1822 లో లీజ్‌లో స్వరకర్త సీజర్ ఫ్రాంక్ జన్మించారు. జాజ్ సంగీతకారుడు టూట్స్ థీలేమన్సు, గాయకుడు జాక్వెస్ బ్రెల్ ప్రపంచ ఖ్యాతిని సాధించారు. ప్రస్తుతం గాయకుడు స్ట్రోమే ఐరోపాలో గొప్ప విజయాన్ని సాధించాడు. రాక్, పాప్ సంగీతంలో టెలెక్సు, ఫ్రంట్ 242, కె'స్ ఛాయిస్, హూవర్‌ఫోనిక్, జాప్ మామా, సోల్‌వాక్సు, డ్యూస్ ప్రఖ్యాతి సాధించారు. హెవీ మెటల్ సంగీతంలో, మాకియవెల్, ఛానల్ జీరో, క్రౌన్ వంటి బ్యాండ్లు ప్రపంచవ్యాప్తంగా అనేకమంది అభిమానుల కలిగి ఉన్నాయి.

కవులు ఎమిలే వెర్హారెన్, రాబర్ట్ గోఫిన్, నవలా రచయితలు హెండ్రిక్ కాంషియస్, జార్జెస్ సిమెనాన్, సుజాన్ లిలార్, హ్యూగో క్లాజ్, అమీలీ నోథాంబ్ సహా బెల్జియంలో అనేక ప్రసిద్ధ రచయితలు జన్మించారు. కవి, నాటక రచయిత మౌరిసు మాటర్లింకు 1911 లో సాహిత్యంలో నోబెల్ బహుమతిని గెలుచుకున్నారు. హెర్గే రాసిన అడ్వెంచర్స్ ఆఫ్ టిన్టిన్ ఫ్రాంకో-బెల్జియన్ కామిక్సులో బాగా ప్రసిద్ది చెందింది. పేయో (ది స్మర్ఫ్సు, ఆండ్రే ఫ్రాంక్విన్ (గాస్టన్ లగాఫ్) , డుపా (క్యూబిటస్), మోరిస్ (లక్కీ లూకా), గ్రెగ్ (అచిల్లె టాలోన్), లాంబిల్ (లెస్ ట్యూనిక్స్ బ్లూస్), ఎడ్గార్ పి. జాకబ్సు, విల్లీ వాండర్‌స్టీన్ బెల్జియన్ కార్టూన్ స్ట్రిప్ పరిశ్రమకు ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతిని తెచ్చారు.అదనంగా ప్రసిద్ధ నేర రచయిత అగాథ క్రిస్టీ బెల్జియం డిటెక్టివ్ అయిన హెర్క్యులే పాయిరోట్ పాత్రను సృష్టించింది. ఆమె వ్రాసిచి ప్రశంసలు పొందిన అనేక డిటెక్టివ్ నవలలలో ఆయన కథానాయకుడుగా ఉన్నాడు.

బెల్జియం సినిమా ప్రధానంగా ఫ్లెమిషు నవలలను తెరపైకి తెచ్చింది. ఇతర బెల్జియం దర్శకులలో ఆండ్రే డెల్వాక్స్, స్టిజ్న్ కోనింక్స్, లూక్, జీన్-పియరీ డార్డెన్నే ఉన్నారు; ప్రసిద్ధ నటులలో జీన్-క్లాడ్ వాన్ డామ్, జాన్ డెక్లెయిర్, మేరీ గిల్లెయిన్ ఉన్నారు; విజయవంతమైన చిత్రాలలో బుల్‌హెడ్, మ్యాన్ బైట్స్ డాగ్, ది అల్జీమర్ ఎఫైర్ ప్రాబల్యత సాధించారు. 1980 లలో ఆంట్వెర్పు, రాయల్ అకాడమీ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ ముఖ్యమైన ఫ్యాషన్ ట్రెండ్‌ సెట్టర్లను ఉత్పత్తి చేసింది. దీనిని ఆంట్వెర్పు సిక్స్ అని పిలుస్తారు.

జానపద సాహిత్యం

బెల్జియం: History, భౌగోళికం, ఆర్ధికం 
The Gilles of Binche, in costume, wearing wax masks

బెల్జియం సాంస్కృతిక జీవితంలో జానపద కథలు ప్రధాన పాత్ర పోషిస్తాయి: దేశంలో అధిక సంఖ్యలో ఊరేగింపులు, మోటరుబైకుల విన్యాసం, పేరేడులు, 'ఓమ్మెగాంగ్సు ', 'డుకాస్', 'కెర్మెస్సే', ఇతర స్థానిక పండుగలు వాడుకలో ఉన్నాయి. వాస్తవానికి మతపరమైన లేదా పౌరాణిక నేపథ్యం ఉంటుంది. ది కార్నివాల్ ఆఫ్ బిన్చేలో ప్రదర్శించబడే ప్రసిద్ధ గిల్లెస్, అథ్, బ్రస్సెల్స్, డెండర్మోండే, మెచెలెన్, మోన్సు 'ప్రాసెషనల్ జెయింట్స్ అండ్ డ్రాగన్స్' ను యునెస్కో " మానవత్వానికి గొప్ప గాత్రరూప అద్భుతం " (మాస్టర్ పీస్ ఆఫ్ ది ఓరల్ అండ్ ఇంటాంజిబుల్ హెరిటేజ్ ఆఫ్ హ్యుమానిటీగా)గా గుర్తించింది.

ఇతర ఉదాహరణలు కార్నివాల్ ఆఫ్ ఆల్స్ట్; బ్రూగెస్‌లోని హోలీ బ్లడ్, హాసెల్ట్‌లోని విర్గా జెస్సీ బసిలికా, మెచెలెన్‌లోని అవర్ లేడీ ఆఫ్ హన్స్విజ్కు బాసిలికా ఇప్పటికీ మతపరమైన ఊరేగింపులు నిర్వహిస్తున్నాయి; 15 ఆగస్టులో లిజ్‌లో పండుగ; నామూర్‌లో వాలూన్ పండుగ. 1832 లో ఉద్భవించి 1960 లలో పునరుద్ధరించబడింది. జెంట్సే ఫీస్టెన్ ఆధునిక సంప్రదాయంగా మారింది. ఒక ప్రధాన అధికారికేతర సెలవుదినం సెయింట్ నికోలస్ డే, పిల్లలకు పండుగ (లీజ్‌లో విద్యార్థులకు).

ఆహారం

బెల్జియం: History, భౌగోళికం, ఆర్ధికం 
Moules-frites or mosselen met friet is a representative dish of Belgium.

మిచెలిన్ గైడ్ వంటి అత్యంత ప్రభావవంతమైన రెస్టారెంట్ గైడ్‌లలో బెల్జియన్ రెస్టారెంట్లు చాలా ఉన్నత స్థానంలో ఉన్నాయి. బెల్జియం మయోన్నైస్తో బీర్, చాక్లెట్, వాఫ్ఫల్సు, ఫ్రెంచ్ ఫ్రైస్‌లకు ప్రసిద్ధి చెందింది. ఫ్రెంచ్ ఫ్రైస్ వారి పేరుకు విరుద్ధంగా బెల్జియంలో ఉద్భవించినట్లు పేర్కొనబడుతుంది. అయినప్పటికీ వాటి ఖచ్చితమైన స్థలం అనిశ్చితంగా ఉంది. జాతీయ వంటకాలు "స్టీక్ & ఫ్రైస్ విత్ సలాడ్", "మస్సెల్స్ విత్ ఫ్రైస్".


కోట్ డి ఓర్, న్యూహాస్, లియోనిడాసు, గోడివా వంటి బెల్జియం చాక్లెట్, ప్రాలైన్సు బ్రాండ్లు ప్రసిద్ధి చెందాయి. అలాగే ఆంట్వెర్పులోని బ్యూరీ, డెల్ రే, బ్రస్సెల్సులోని మేరీస్ వంటి సంస్థలకు ప్రైవేటు యజమానులుగా ఉన్నారు. బెల్జియం 1100 రకాల బీర్లను ఉత్పత్తి చేస్తుంది. వెస్ట్‌వెలెటెరెన్ అబ్బే ట్రాపిస్టు బీరు తరచుగా ప్రపంచంలోని ఉత్తమ బీరుగా ఎన్నికచేయబడింది. చేయబడింది. ల్యూవెను లోని " అంహ్యూసర్ - బచ్ " ఉత్పత్తి ఆధారంగా ప్రపంచంలోనే అతిపెద్ద బ్రూవర్ లెవెన్లో ఒకటిగా ఉంది.

క్రీడలు

బెల్జియం: History, భౌగోళికం, ఆర్ధికం 
Eddy Merckx, regarded as one of the greatest cyclists of all time

1970 ల నుండి స్పోర్ట్సు క్లబ్బులు, సమాఖ్యలు భాషాసమాజం ఒక్కొకదానిలో విడివిడిగా నిర్వహించబడతాయి. బెల్జియంలోని రెండు ప్రాంతాలలో అత్యంత ప్రాచుర్యం పొందిన క్రీడగా అసోసియేషన్ ఫుట్‌బాల్ ఉంది. అలాగే బెల్జియంలో సైక్లింగు, టెన్నిసు, స్విమ్మింగు, జూడో, బాస్కెట్బాలు కూడా బాగా ప్రాచుర్యం పొందాయి.

బెల్జియన్లు ఫ్రాన్సు మినహా మిగిలిన దేశాలలో " అత్యధిక టూర్ డి ఫ్రాన్సు " విజయాలు సాధించారు. వారు యుసిఐ రోడ్ వరల్డ్ ఛాంపియన్షిప్పులో కూడా అత్యధిక విజయాలు సాధించారు. ఫిలిప్పె గిల్బర్టు 2012 ప్రపంచ ఛాంపియంషిప్పు సాధించాడు. మరో ఆధునిక ప్రసిద్ధ బెల్జియం సైక్లిస్టు టాం బూనెన్. టూర్ డి ఫ్రాంసులో ఐదు విజయాలు, అనేక ఇతర సైక్లింగు రికార్డులతో, బెల్జియం సైక్లిస్టు ఎడ్డీ మెర్క్సు గొప్ప సైక్లిస్టులలో ఒకరిగా పరిగణించబడ్డాడు. మాజీ బెల్జియం గోల్ కీపర్ అయిన జీన్-మేరీ ప్ఫాఫ్ అసోసియేషన్ ఫుట్‌బాల్ చరిత్రలో గొప్పవారిలో ఒకరిగా పరిగణించబడ్డాడు.

బెల్జియం 1972 యూరోపియన్ ఫుట్బాల్ ఛాంపియన్షిప్పుకు ఆతిథ్యం ఇచ్చింది. బెల్జియం, నెదర్లాండ్సుతో కలిసి 2000 యూరోపియన్ ఛాంపియన్షిప్పులను నిర్వహించింది. 2015 నవంబరులో బెల్జియం జాతీయ ఫుట్బాల్ జట్టు ఫిఫా ప్రపంచ ర్యాంకింగ్సులో మొదటిసారి మొదటి స్థానానికి చేరుకుంది.

మహిళల టెన్నిస్ అసోసియేషన్లో కిం క్లిజ్స్టర్సు, జస్టిన్ హెనిన్ ఇద్దరూ ప్లేయర్ ఆఫ్ ది ఇయరుగా నిలిచారు. స్పా-ఫ్రాంకోర్చాంప్స్ మోటారు-రేసింగ్ సర్క్యూటు " ఫార్ములా వన్ వరల్డ్ ఛాంపియన్షిప్ బెల్జియం గ్రాండ్ ప్రిక్సు " కు ఆతిథ్యం ఇచ్చింది. బెల్జియం డ్రైవర్, జాకీ ఐక్స్, ఎనిమిది గ్రాండ్స్ ప్రిక్స్, ఆరు 24 అవర్సు లే మాన్స్ గెలుచుకున్నాడు. ఫార్ములా వన్ వరల్డ్ ఛాంపియన్షిప్పులో రన్నరుగా రెండుసార్లు నిలిచాడు. బెల్జియం కూడా మోటోక్రాసులో రైడర్సు జోయెల్ రాబర్ట్, రోజర్ డి కోస్టర్, జార్జెస్ జాబే, ఎరిక్ జిబోర్సు, స్టీఫన్ ఎవర్ట్స్, మైకొతమంది క్రీడాకారులు ప్రఖ్యాతిని కలిగి ఉన్నారు. బెల్జియంలో ఏటా జరిగే క్రీడా కార్యక్రమాలలో మెమోరియల్ వాన్ డామ్ అథ్లెటిక్స్ పోటీ, బెల్జియన్ గ్రాండ్ ప్రిక్స్ ఫార్ములా వన్, టూర్ ఆఫ్ ఫ్లాన్డర్సు, లీజ్-బాస్టోగ్నే-లీజ్ వంటి అనేక క్లాసిక్ సైకిల్ రేసులు ఉన్నాయి. 1920 సమ్మర్ ఒలింపిక్స్ ఆంట్వెర్ప్‌లో జరిగాయి. 1977 యూరోపియన్ బాస్కెట్‌బాల్ ఛాంపియన్‌షిప్ లీజ్, ఓస్టెండ్‌లో జరిగింది.

గమనికలు

మూలాలు

Tags:

బెల్జియం Historyబెల్జియం భౌగోళికంబెల్జియం ఆర్ధికంబెల్జియం గణాంకాలుబెల్జియం సంస్కృతిబెల్జియం గమనికలుబెల్జియం మూలాలుబెల్జియం

🔥 Trending searches on Wiki తెలుగు:

యవలురుద్రమ దేవిశివ పురాణంగాలి జనార్ధన్ రెడ్డిజనాభాసిమ్రాన్అభినందన్ వర్థమాన్రైతుగౌడబరాక్ ఒబామామదర్ థెరీసారాయప్రోలు సుబ్బారావుమధుమేహంసుమ కనకాలయానిమల్ (2023 సినిమా)వసంత ఋతువుసాయిపల్లవిపసుపు గణపతి పూజరతన్ టాటాహేతువుగుంటకలగరఅడవికాకతీయులునమాజ్కొణతాల రామకృష్ణప్రియా వడ్లమానిమహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పధకంత్రిఫల చూర్ణంజయలలితమాదిగఆంధ్రప్రదేశ్భాషా భాగాలుతెలంగాణ ఉద్యమంఎస్. ఎస్. రాజమౌళితిరుమల చరిత్రనితిన్తామర వ్యాధిభీమా (2024 సినిమా)భారతదేశ రాజకీయ పార్టీల జాబితాధరణి పోర్టల్ తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వంకాజల్ అగర్వాల్పరిటాల రవిరజాకార్లుమాధవీ లతసింధు లోయ నాగరికతతన్నీరు హరీశ్ రావురావుల శ్రీధర్ రెడ్డికల్వకుంట్ల చంద్రశేఖరరావుకాకినాడనువ్వు నాకు నచ్చావ్పావని గంగిరెడ్డిసోంపుఉత్తరాషాఢ నక్షత్రముశ్రీ కృష్ణదేవ రాయలుద్వాదశ జ్యోతిర్లింగాలుసాక్షి (దినపత్రిక)గంగా నదినవధాన్యాలుబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిశుభాకాంక్షలు (సినిమా)దాశరథి కృష్ణమాచార్యఅక్కినేని నాగార్జున నటించిన చిత్రాలుసచిన్ టెండుల్కర్పరశురాముడుఘట్టమనేని కృష్ణభారతీయ శిక్షాస్మృతిమహానటి (2018 సినిమా)కేరళభారతదేశంలో బ్రిటిషు పాలనపిఠాపురంపచ్చకామెర్లుగేమ్ ఛేంజర్భూమివరలక్ష్మి శరత్ కుమార్భారతదేశ పంచవర్ష ప్రణాళికలుసామెతల జాబితా🡆 More