స్థూల ఆర్థిక శాస్త్రము

స్థూల ఆర్థికశాస్త్రం అనేది ఆర్థికశాస్త్రంలో ఒక శాఖ.

మొత్తం ఓ ఆర్థిక వ్యవస్థ పనితీరు, నిర్మాణం, ప్రవర్తన, నిర్ణయాలు చేసే పద్ధతులను ఇది అధ్యయనం చేస్తుంది. ఇందులో ప్రాంతీయ, జాతీయ, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు ఉంటాయి . స్థూల ఆర్థికవేత్తలు జిడిపి, నిరుద్యోగిత స్థాయి, జాతీయ ఆదాయం, ధరల సూచికలు, ఉత్పత్తి, వినియోగం, ద్రవ్యోల్బణం, పొదుపు, పెట్టుబడి, ఇంధనం, అంతర్జాతీయ వాణిజ్యం, అంతర్జాతీయ పరపతి వంటి అంశాలను అధ్యయనం చేస్తారు.

స్థూల ఆర్థిక శాస్త్రము
కార్పొరేషన్లు, ప్రభుత్వాలు, గృహాల మధ్య సంబంధాలు, ఆర్థిక మార్కెట్, కార్మిక మార్కెట్ వంటి వివిధ రకాల మార్కెట్ల యొక్క పాత్రలను, సంబంధాలను పరిశీలించడంతో సహా మొత్తం ఆర్థిక వ్యవస్థపై స్థూల ఆర్థిక శాస్త్రాన్ని ఈ చిత్రం చూస్తుంది.

అభివృద్ధి

స్థూల ఆర్థిక శాస్త్రం వ్యాపార చక్ర సిద్ధాంతం, ద్రవ్య సిద్ధాంతాల నుండి ఉద్భవించింది. రెండవ ప్రపంచ యుద్ధానికి ముందు, ధన పరిమాణ సిద్ధాంతం (క్వాంటిటీ థియరీ ఆఫ్ మనీ) ముఖ్యంగా ప్రభావవంతంగా ఉండేది. ఇది అనేక రూపాలను తీసుకుంది. ఇర్వింగ్ ఫిషర్ చెప్పిన కింది సూత్రం వాటిలో ఒకటి:

    స్థూల ఆర్థిక శాస్త్రము 

ధన పరిమాణ సిద్ధాంతం దృష్టిలో, డబ్బు వేగం (V), ఉత్పత్తి అయిన వస్తువుల పరిమాణం (Q) స్థిరంగా ఉంటాయి. కాబట్టి డబ్బు సరఫరా (M) లో ఏదైనా పెరుగుదల ఉంటే అది నేరుగా ధరల (P) పెరుగుదలకు దారితీస్తుంది. ధన పరిమాణ సిద్ధాంతం ఇరవయ్యో శతాబ్ద ప్రారంభంలో ఉన్న ఆర్థిక వ్యవస్థ సిద్ధాంతాల్లో ప్రధాన భాగం.

కీన్స్, అతని అనుచరులు

జాన్ మేనార్డ్ కీన్స్ రాసిన జనరల్ థియరీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్, ఇంట్రెస్ట్ అండ్ మనీ ప్రచురణతో స్థూల ఆర్థికశాస్త్రం, దాని ఆధునిక రూపంలో ప్రారంభమైంది. మహా మాంద్యం సంభవించిన సమయంలో వస్తువులు అమ్ముడవక పోవడం, కార్మికులు నిరుద్యోగులవడాన్ని వివరించడంలో శాస్త్రీయ ఆర్థికవేత్తలు ఇబ్బంది పడ్డారు. శాస్త్రీయ సిద్ధాంతం ప్రకారం, మార్కెట్లో అమ్మకాలు పూర్తైపోయే వరకూ, అన్ని వస్తువులూ, శ్రమలూ అమ్ముడైపోయే వరకూ ధరలు, వేతనాలూ పడిపోతూంటాయి. కీన్స్, ఆర్థికశాస్త్రానికి ఓ కొత్త సిద్ధాంతాన్ని అందించాడు. మార్కెట్లు ఎందుకు క్లియరైపోవో ఇది చెబుతుంది. ఇదే (20 వ శతాబ్దం తరువాత) కీనేసియన్ ఎకనామిక్స్ అనే స్థూల ఆర్థిక ఆలోచనా సరళిగా అభివృద్ధి చెందింది. దీనిని కీనేసియనిజం లేదా కీనేసియన్ సిద్ధాంతం అని కూడా పిలుస్తారు.

కీన్స్ సిద్ధాంతం ఆగమనంతో ధన పరిమాణ సిద్ధాంతం పతనమై పోయింది. ఎందుకంటే ప్రజలూ, వ్యాపారాలూ కఠినమైన ఆర్థిక సమయాల్లో వారి నగదు నిల్వలను జాగ్రత్త చేసుకుంటారు. ద్రవ్య ప్రాధాన్యతల పరంగా అతను వివరించిన ఒక దృగ్విషయం ఇది. వినియోగంలో గానీ, పెట్టుబడిలో గానీ చిన్న తగ్గుదల గుణకం ప్రభావం వలన ఎలా పెరిగిపోతుందో, ఆర్థిక వ్యవస్థ వ్యాప్తంగా క్షీణతకు ఎలా కారణమవుతుందో కీన్స్ వివరించాడు. అనిశ్చితి, పాశవిక ప్రవృత్తీ ఆర్థిక వ్యవస్థలో ఎలాంటి పాత్రను పోషించగలవో కీన్స్ గుర్తించాడు.

మూలాలు

Tags:

నిరుద్యోగంపొదుపుస్థూల దేశీయోత్పత్తి

🔥 Trending searches on Wiki తెలుగు:

నరేంద్ర మోదీ స్టేడియంభారతదేశ చరిత్రనందమూరి బాలకృష్ణరామాయణం (సినిమా)నీతి ఆయోగ్బ్రెజిల్సాయిపల్లవిజ్యేష్ట నక్షత్రంసూరపనేని శ్రీధర్తాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రిభారతీయ జనతా పార్టీకర్ణాటకసంస్కృతంయవలులైంగిక సంక్రమణ వ్యాధిభీష్ముడువర్షంవినాయకుడురాజ్యసభగౌతమ బుద్ధుడురఘువంశముఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థవృషణంరెండవ ప్రపంచ యుద్ధంకృష్ణా నదిచంపకమాలఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితాఅల్లరి ప్రేమికుడుడీజే టిల్లువిజయసాయి రెడ్డిశివ కార్తీకేయన్జ్యోతీరావ్ ఫులేకాజల్ అగర్వాల్విష్ణు సహస్రనామ స్తోత్రమువిమల (రచయిత్రి)అనుష్క శెట్టినవరత్నాలుపోక్సో చట్టంఅక్కినేని నాగార్జునకాకతీయులునారా లోకేశ్సాయి ధరమ్ తేజ్ఛత్రపతి శివాజీరుహానీ శర్మతెలుగుప్రీతీ జింటా20వ శతాబ్దం ముందు తెలుగు పల్లెల్లో జీవనశైలిభారత రాజ్యాంగ పరిషత్నరసింహావతారంఎస్. శంకర్శ్రీరంగనీతులు (సినిమా)సీతారామ కళ్యాణం (1961 సినిమా)పులివెందుల శాసనసభ నియోజకవర్గంఉత్పలమాలచదరంగం (ఆట)ఇండియన్ ప్రీమియర్ లీగ్త్రేతాయుగంకుక్కే సుబ్రహ్మణ్య దేవాలయంపుష్యమి నక్షత్రముసోంపుభారత జాతీయ కాంగ్రెస్నక్సలైటుతొలిప్రేమపచ్చకామెర్లునానార్థాలుయోగాసనాలుఉస్మానియా విశ్వవిద్యాలయంగోత్రాలు జాబితాతెలుగు కులాలుసిద్ధు జొన్నలగడ్డబరాక్ ఒబామాయముడువాలితెలుగు సినిమాలు డ, ఢగుండెప్రస్తుత భారత ముఖ్యమంత్రుల జాబితా🡆 More