సౌర కుటుంబం: సౌర గ్రహాల వ్యవస్థ

సూర్యుడు, దాని చుట్టూ తిరిగే గ్రహాలు, వాటి ఉపగ్రహాలు, ఇతర ఖగోళ వస్తువుల సముదాయాన్ని సౌర కుటుంబం అంటారు.

దీన్ని సౌర వ్యవస్థ (Solar system) అని కూడా అంటారు. నేరుగా సూర్యుని చుట్టూ తిరిగే వస్తువుల్లో అతి పెద్దవి గ్రహాలు. మిగతావి మరుగుజ్జు గ్రహాల వంటి చిన్న ఖగోళ వస్తువులు. సూర్యుడి చుట్టూ పరోక్షంగా తిరిగే వస్తువులు సహజ ఉపగ్రహాలు. వీటిలో రెండు, బుధ గ్రహం కంటే పెద్దవి.

సౌర కుటుంబం
సౌర కుటుంబం బొమ్మ, పరిమాణాలు స్కేలు ప్రకరాం. దూరాలు మాత్రం స్కేలుకు కాదు.
సూర్యుడు, గ్రహాలు
(దూరాలు స్కేలు ననుసరించి కాదు)
వయసు456.8 కోట్ల సంవత్సరాలు
స్థానం
  • Local Interstellar Cloud, Local Bubble,
  • Orion–Cygnus Arm, Milky Way
వ్యవస్థ ద్రవ్యరాశి1.0014 సౌరద్రవ్యరాశి
అతి దగ్గరి నక్షత్రం
  • ప్రాక్సిమా సెంటారి  (4.25 కా.సం)
  • ఆల్ఫా సెంటారి (4.37 ly)
అతి దగ్గరి గ్రహ వ్యవస్థప్రాక్సిమా సెంటారి system  (4.25 ly)
గ్రహ వ్యవస్థ
Semi-major axis of outer known planet (నెప్ట్యూన్)30.10 AU  (4.503 billion km)
కైపర్ బెల్ట్ నుండి దూరం50 AU
సంఖ్యలు
నక్షత్రాలు1  (Sun)
తెలిసిన గ్రహాలు
తెలిసిన మరుగుజ్జు గ్రహాలు
బహుశా అనేక వందలు;
five currently recognized by the IAU
తెలిసిన సహజ ఉపగ్రహాలు
525
  • (185 planetary
  • 347 minor planetary)
తెలిసిన చిన్న గ్రహాలు778,897  (as of 2018-06-21)
తెలిసిన తోకచుక్కలు4,017  (2018-06-21 నాటికి)
గుర్తించిన గుండ్రటి ఉపగ్రహాలు19
గాలక్సీ కేంద్రం చుట్టూ కక్ష్య
Invariable-to-galactic plane inclination60.19°  (ecliptic)
గాలక్సీ కేంద్రం  నుండి దూరం27,000 ± 1,000 కా.సం
కక్ష్యావేగం220 కి.మీ/సె
కక్ష్యాకాలం22.5–25 కోట్ల సంవత్సరాలు
నక్షత్ర సంబంధ లక్షణాలు
స్పెక్ట్రల్ రకంG2V
ఫ్రాస్ట్ లైన్≈5 AU
హీలియోపాజ్ నుండి దూరం≈120 AU
హిల్ స్ఫియర్ (en) వ్యాసార్థం≈1–3 కా.సం

సుమారు 460 కోట్ల సంవత్సరాల క్రితం ఖగోళంలో ఓ మహా పరమాణు మేఘం దాని గురుత్వ శక్తి కారణంగా కుంచించుకు పోయి సౌర వ్యవస్థ ఏర్పడింది. దీని మొత్తం ద్రవ్యరాశిలో అత్యధిక భాగం సూర్యుడిలోనే ఉంది. మిగతా దానిలో అత్యధిక భాగం బృహస్పతిలో ఉంది. అంతర సౌర వ్యవస్థలోని నాలుగు గ్రహాలు, రాతి గ్రహాలు (టెరెస్ట్రియల్ ప్లానెట్స్). ఈ గ్రహాలు ప్రధానంగా రాయి, లోహాలను కలిగి ఉంటాయి. ఇవి చిన్న గ్రహాలు కూడా. బాహ్య సౌర వ్యవస్థలో ఉన్న గ్రహాలు రాతి గ్రహాల కంటే చాలా పెద్దవి. వాటిలో అతి పెద్దవైన గురుడు, శని వాయువులతో కూడుకుని ఉంటాయి. ఆ వాయువుల్లో ముఖ్యమైనవి హైడ్రోజన్, హీలియమ్. అన్నిటి కంటే బయట ఉన్న గ్రహాలు - యురేనస్, నెప్ట్యూన్ లు అతిశీతల గ్రహాలు. మీథేన్, అమ్మోనియా వంటి వాయువులతో అవి కూడుకుని ఉంటాయి. ఈ గ్రహాలన్నీ కూడా దాదాపు వృత్తాకార కక్ష్యలో సూర్యుడి చుట్టూ పరిభ్రమిస్తూంటాయి.

సౌర కుటుంబంలో ఇంకా చిన్నచిన్న వస్తువులు కూడా ఉన్నాయి. అంగారకుడు, గురుడి కక్ష్యల మధ్య ఉన్న ఆస్టెరాయిడ్ పట్టీలో ఉన్న వస్తువులు కూడా రాతిగ్రహాల లాగానే చాలావరకు రయి, లోహంతో కూడుకుని ఉంటాయి. నెప్ట్యూన్ కక్ష్యకు (ట్రాన్స్ నెప్ట్యూనియన్ వస్తువులు) ఆవల కయ్‌పర్ బెల్టు, స్కాటర్డ్ డిస్క్ లు ఎక్కువగా మంచుతో కూడుకుని ఉంటాయి. వాటికి అవతల ఇటీవలే కనుక్కున్న సెడ్‌నాయిడ్స్ ఉన్నాయి. వీటన్నిటిలోనూ అనేక డజన్ల నుండి కొన్ని వేల వస్తువులు బాగానే పెద్దవి. ఎంత పెద్దవంటే అవి తమ గురుత్వ శక్తి కారణంగా అవి గుండ్రంగా మారాయి. అలాంటి వస్తువులను మరుగుజ్జు గ్రహాలు అని వర్గీకరించారు. మరుగుజ్జు గ్రహాల్లో సెరెస్ ఒకటి. ట్రాన్స్-నెప్ట్యూనియన్ వస్తువుల్లో ప్లూటో, ఐరిస్ లు ఉన్నాయి. ఈ రెండు ప్రాంతాలతో పాటు, తోకచుక్కలు, సెంటార్లు, అంతర్గ్రహ ధూళి మేఘాల వంటి అనేక చిన్న వస్తువులు వివిధ ప్రాంతాల మధ్య ప్రయాణిస్తూంటాయి. గ్రహాల్లో ఆరిటికి, మరుగుజ్జు గ్రహాల్లో కనీసం నాలుగిటికి, చిన్న వస్తువుల్లో చాలా వాటికీ సహజ ఉపగ్రహాలున్నాయి. బాహ్య సౌర వ్యవస్థ లోని గ్రహాలన్నిటి చుట్టూ ధూళి, చిన్న వస్తువులతో కూడిన వలయాలు తిరుగుతూంటాయి.

సూర్యుడి నుండి వెలువడే సౌర గాలులు (ఛార్జి పదార్థాల ప్రవాహం) ఇంటర్‌స్టెల్లార్ మీడియమ్‌లో ఒక బుడగ వంటి మండలాన్ని సృష్టిస్తాయి. దీన్ని హీలియోస్ఫియర్ అంటారు. సౌర గాలుల పీడనం, ఇంటర్‌స్టెల్లార్ మీడియమ్‌ లోని పీడనంతో ఎక్కడైతే సమానమౌతుందో ఆ బిందువును హీలియోపాజ్ అంటారు. హీలియోపాజ్ స్కాటర్డ్ డిస్క్ అంచు వరకూ ఉంటుంది. బహు దూరపు తోకచుక్కలకు మూలమని భావిస్తున్న ఊర్ట్ మేఘం హీలియోస్ఫియరుకు దాదాపు వెయ్యి రెట్ల దూరంలో ఆవల ఉంటుంది. సౌర కుటుంబం, పాలపుంత గాలక్సీలో ఓరియన్ బాహువులో గాలక్సీ కేంద్రం నుండి 26,000 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది.

సౌర కుటుంబం: గ్రహాంతర మాధ్యమం, అంతర సౌర వ్యవస్థ, బాహ్య సౌర వ్యవస్థ
సౌరమండల జోన్లు,: ఈవలి (లోతట్టు) సౌరమండలము, ఆస్టెరాయిడ్ పట్టీ, రాక్షస గ్రహాలు (జోవియన్లు) రాక్షస గ్రహాలు, క్యూపర్ బెల్ట్. ఇవన్నీ స్కేలు ప్రకరాం చూపబడలేదు.

గ్రహాంతర మాధ్యమం

సౌర కుటుంబం: గ్రహాంతర మాధ్యమం, అంతర సౌర వ్యవస్థ, బాహ్య సౌర వ్యవస్థ 
The [./https://www.duhoctrungquoc.vn/wiki/en/Heliospheric_current_sheet heliospheric current sheet

సౌరవ్యవస్థలోని అత్యధిక భాగం శూన్యమే. దీన్ని గ్రహాంతర మాధ్యమం (ఇంటర్‌ప్లానెటరీ మీడియమ్) అంటారు. కాంతితో పాటు, సూర్యుడు ఛార్జి పదార్థాల ప్రవాహాన్ని కూడా వెదజల్లుతూంటాడు. వీటిని సౌరగాలులు అంటారు. ఈ పదార్థాలు గంటకు 15 లక్షల కి.మీ. వేగంతో విస్తరిస్తూ, గ్రహాంతర మాధ్యమాన్ని దాటి కనీసం 100 AU దూరం వరకూ ఒక పల్చటి వాతావరణాన్ని సృష్టిస్తాయి. సూర్యుడి ఉపరితలంపై జరిగే సోలార్ ఫ్లేర్స్, కరోనల్ మాస్ ఇజెక్షన్లు హీలియోస్ఫియరులో కల్లోలాలు కలిగిస్తాయి. భూఅయస్కాంత తుపానులను కలిగిస్తాయి. హీలియోస్ఫియరు లోని అతి పెద్ద నిర్మాణం, హీలియోస్పెరిక్ కరెంట్ షీట్. ఈ సర్పిలాకారంలోని నిర్మాణం, గ్రహాంతర మాధ్యమంలో సూర్యుని అయస్కాంత క్షేత్రపు భ్రమణం కారణంగా ఏర్పడుతుంది.

సౌరగాలులు భూమిపైని వాతావరణాన్ని చెదరగొట్టి వలిచెయ్యకుండా దాని అయస్కాంత క్షేత్రం కాపాడుతుంది. శుక్రుడు, అంగారకులపై అయస్కాంత క్షేత్రం లేదు. అందుచేత సౌరగాలులు ఈ గ్రహాల పైని వాతావరణాన్ని వలిచేసి, అంతరిక్షంలొకి ఎగరగొట్టేస్తోంది. కరోనల్ మాస్ ఇజెక్షన్లు సూర్యుడి ఉపరితలం పైనుంచి చాల అధిక మొత్తంలో పదార్థాన్ని వెదజల్లుతుంది. సూర్యుడి ఈ అయస్కాంత క్షేత్రం, పదార్థం రెండూ భూ అయస్కాంత క్షేత్రంపై చూపే ప్రభావం కారణంగా అయస్కాంత ధ్రువాల వద్ద అరోరాలు ఏర్పడుతున్నాయి.

హీలియోస్ఫియరు, గ్రహాల అయస్కాంత శక్తులూ కలిసి నక్షత్రాంతర మాధ్యమం నుండి వచ్చే కాస్మిక్ కిరణాల నుండి సౌర వ్యవస్థను కాపాడుతాయి. నక్షత్రాంతర మాధ్యమంలో కాస్మిక్ కిరణాల సాంద్రత, సూర్యుడి అయస్కాంత శక్తి బహు దీర్ఘ కాలంలో మారుతూ ఉంటాయి. తదనుగుణంగా సౌరవ్యవస్థ లోకి కాస్మిక్ కిరణాల చొరబాటు కూడా మార్పుకు లోనౌతూంటుంది.

గ్రహాంతర మాధ్యమం కనీసం రెండు రకాల చక్రాకార ప్రాంతాలకు నెలవు. వీటిలో కాస్మిక్ ధూళి ఉంటుంది. మొదటిది, రాశిచక్రపు ధూళి మేఘం. ఇది అంతర సౌర వ్యవస్థలో ఉంటుంది. ఇది జోడియాకల్ కాంతిని కలుగజేస్తుంది. ఏస్టెరాయిడ్ పట్టీలో జరిగిన తాకిడుల కారణంగా ఇది ఏర్పడింది. రెండవది 10 AU నుండి దాఅదాపు 40 AU వరాకూ విస్తరించి ఉంది. ఇది కైపర్ బెల్టులో జరిగిన తాకిడుల కారణంగా ఇది ఏర్పడింది.

అంతర సౌర వ్యవస్థ

అంతర సౌర వ్యవస్థలో రాతి గ్రహాలు, ఏస్టెరాయిడ్ పట్టీ ఉంటాయి. సూర్యునికి దగ్గరగా ఉండే అంతర సౌర వ్యవస్థ వ్యాసార్థం, గురు, శనిల కక్ష్యల మధ్య ఉన్న దూరం కంటే తక్కువ. ఈ ప్రాంతం ఫ్రాస్ట్ లైన్‌కు (సూర్యుడి నుంచి 70 కోట్ల కి.మీ.) లోపలే ఉంటుంది.

గ్రహాలు

సౌర కుటుంబం: గ్రహాంతర మాధ్యమం, అంతర సౌర వ్యవస్థ, బాహ్య సౌర వ్యవస్థ 
అంతర సౌర వ్యవస్థ లోని గ్రహాలు ఎడమ నుండి కుడికి: భూమి, అంగారకుడు, శుక్రుడు, బుధుడు. (పరిమాణాలు స్కేలు కనుగుణంగా)
సౌర కుటుంబం: గ్రహాంతర మాధ్యమం, అంతర సౌర వ్యవస్థ, బాహ్య సౌర వ్యవస్థ 
అంతర గ్రహాలు నాలుగింటి కక్ష్యలు.

అంతర సౌర వ్యవస్థలోని గ్రహాలు సాంద్రమైన రాతితో కూడుకుని ఉంటాయి. వీటికి ఉపగ్రహాలు బాగా తక్కువగా గాని, అసలే లేకుండా గానీ ఉంటాయి. వీటి చుట్టూ వలయాలు ఉండవు. పై పొరల్లో (క్రస్ట్, మ్యాంటిల్) సిలికేట్లు, కోర్‌ లో ఇనుము, నికెల్ వంటి లోహాలూ ఉంటాయి. బుధుడు, శుక్రుడు, భూమి లకు వాతావరణం (ఎట్మాస్ఫియర్) ఉంది. వీటన్నిటి పైనా ఖగోళ వస్తువులు ఢీకొన్నపుడు ఏర్పడే గుంటలున్నాయి. చీలిక లోయలు, అగ్నిపర్వతాల వంటి విశేషాలూ ఉన్నాయి.

బుధుడు

    బుధ గ్రహాన్ని ఇంగ్లీషులో మెర్క్యురీ అంటారు. సూర్యుడికి అత్యంత దగ్గరలో, 0.4 AU దూరంలో ఉంది. దీని ద్రవ్యరాశి 0.055 M గ్రహాలన్నిటి లోకీ అతి చిన్నది. దీనికి ఉపగ్రహం లేదు. బుధుడి వాతావరణం సౌర గాలుల కారణంగా ఉపరితలం నుండి రేగిన అణువులతో కూడుకుని ఉంటుంది. ఇనుముతో కూడుకుని ఉన్న పెద్ద కోర్, పల్చని మ్యాంటిల్ ఎలా వచ్చాయనే దానికి సరైన కారణం ఇంకా తెలియలేదు. ఒక పెద్ద ఘాతం కారణంగా దాని పైపొరలు ఊడిపోయి ఉంటాయి అని ఒక సిద్ధాంతం భావిస్తోంది. లేదా సూర్యుడి గురుత్వ శక్తి కారణంగా ఎక్రీషన్ సరిగ్గా జరక్క, గ్రహం పూర్తిగా ఏర్పడి ఉండదు.

శుక్రుడు

    శుక్రుడు (సూర్యుడి నుండి 0.7 AU) పరిమాణంలో భూమికి దాదాపు సమానంగా (0.815 M) ఉంటుంది. ఇంగ్లీషులో వీనస్ అంటారు. భూమి లాగానే శుక్రుడికి ఇనుముతో కూడిన కోర్ చుట్టూ మందపాటి మ్యాంటిల్, వాతావరణం ఉంటుంది. భూమి కంటే ఇది పొడిగా ఉంటుంది. వాతావరణం భూవాతావరణం కంటే 90 రెట్లు దట్టంగా ఉంటుంది. శుక్రుడికి సహజ ఉపగ్రహాలు లేవు. ఇది గ్రహాలన్నిటిలోకీ అత్యంత వేడిగా ఉండే గ్రహం. దీని ఉపరితల ఉష్ణోగ్రత 400 °C (752 °F) పైగా ఉంటుంది. బహుశా వాతావరణంలోని గ్రీన్‌హౌస్ వాయువులు దీనికి కారణమై ఉండవచ్చు. గ్రహగర్భ (భూగర్భ లాగా) కార్యకలాపాలు ఉన్నట్టు దాఖలాలేమీ లేనప్పటికీ, అగ్నిపర్వత విస్ఫోటనాలు ఉన్నాయేమోననే అనుమానం ఉంది. ఈ అనుమానానికి కారణం- దీనికి అయస్కాంత శక్తి లేనప్పటికీ, దీని వాతావరణం తగ్గటం లేదు. బహుశా అగ్నిపర్వత విస్ఫోటనాలు వాతావరణ తగ్గుదలను పూరిస్తూ ఉండవచ్చు.

భూమి

    అంతర సౌర వ్యవస్థలోని గ్రహాల్లో భూమి (సూర్యుడి నుండి 1 AU) అతి పెద్దది. మానవుడికి తెలిసినంతలో భూగర్భ కార్యకలాపాలు ఉన్న గ్రహం భూమి ఒక్కటే, జీవం ఉన్న గ్రహం ఇదొక్కటే. ద్రవ రూపంలోని నీరు దీని ప్రత్యేకత. టెక్టోనిక్ ప్లేట్లు ఉన్నట్లు తెలిసిన గ్రహం ఇదొక్కటే. భూమి వాతావరణం ఇతర గ్రహాల వాతావరణం కంటే బాగా భిన్నంగా ఉంటుంది. జీవం కారణంగా మరే గ్రహం లోనూ లేని విధంగా వాతావరణంలోకి 21% ఆక్సిజన్ చేరింది. దీనికి ఒక సహజ ఉపగ్రహం, చంద్రుడు, ఉంది. రాతి గ్రహాలకున్న ఉపగ్రహాల్లో చంద్రుడు అతిపెద్దది.

అంగారకుడు

    అంగారకుడు (సూర్యుడి నుండి 1.5 AU) భూమి, శుక్రుడి కంటే చిన్నది. దీని ద్రవ్యరాశి 0.107 M. దీన్ని ఇంగ్లీషులో మార్స్ అంటారు. దీని వాతావరణం ఎక్కువగా కార్బన్ డయాక్సైడుతో కూడుకుని ఉంటుంది. వాతావరణ పీడనం 6.1 మిల్లీబార్ ఉంటుంది. (భూ వాతావరణ పీడనంలో సుమారు 0.6% ). దీని ఉపరితలం అగ్నిపర్వతాలతో, చీలిక లోయలతో కూడుకుని ఉంటుంది.20 లక్షల సంవత్సరాల కిందటి వరకూ భూగర్భ కార్యక్రమాలు జరిగేవని తెలుస్తోంది. మట్టిలో ఉండే ఐరన్ ఆక్సైడు కారణంగా అంగారకుడు ఎర్రగా కనిపిస్తుంది. దీనికి రెండు చిన్న ఉపగ్రహాలు -డేమోస్, ఫోబోస్- ఉన్నాయి. ఇవి అంగారకుడి ఆకర్షణకు లోబడి పోయిన గ్రహశకలాలు గానీ, ఏదైనా మహా ఘాతం జరిగినపుడు వెదజల్లబడ్డ శకలాలు గానీ అయి ఉండవచ్చు.

ఏస్టెరాయిడ్ పట్టీ

సౌర కుటుంబం: గ్రహాంతర మాధ్యమం, అంతర సౌర వ్యవస్థ, బాహ్య సౌర వ్యవస్థ 
టెన్నికాయిట్ రింగు ఆకారంలో ఉన్న ఏస్టెరాయిడ్ బెల్టు. అంగారకుడు, గురుడు కక్ష్యల మధ్య ఈ బెల్టు ఉంది.
      సూర్యుడు      గురు ట్రోజన్‌లు      గ్రహ కక్ష్య       ఏస్టెరాయిడ్ పట్టీ      హిల్డా ఏస్టెరాయిడ్స్      భూసమీప వస్తువులు (కొన్ని)

గ్రహ శకలాలను (ఏస్టెరాయిడ్లను), ఒక్క సెరెస్ ను మినహాయించి, సౌరవ్యవస్థలోని చిన్న వస్తువులు అని అంటారు. రాళ్ళు, లోహ ఖనిజాలతోను, మంచుతోనూ కూడుకుని ఉంటాయి. కొన్ని మీటర్ల నుండి కొన్ని వందల కిలోమీటర్ల దాకా వీటి పరిమాణం ఉంటుంది. ఒక మీటరు కంటే చిన్నవైన ఏస్టెరాయిడ్లను మీటరాయిడ్‌లు, మైక్రోమీటరాయిడ్‌లు అంటారు. ఏస్టెరాయిడ్ పట్టీ అంగారకుడు, బృహస్పతి గ్రహ కక్ష్యల మధ్య, సూర్యుడి నుంచి 2.3 నుండి 3.3 AU ల దూరంలో ఉంది.

గ్రహాలు రూపుదిద్దుకునే సమయంలో, గురుడి గురుత్వ శక్తి అడ్డుకోవడం వలన, అతుక్కోకుండా మిగిలిపోయిన వస్తువులు ఇవి అని భావిస్తున్నారు. కిలోమీటరుకు పైబడిన వ్యాసం గల వస్తువులు వేలాదిగా, బహుశా లక్షల్లో ఈ పట్టీలో ఉన్నాయి. అయినప్పటికీ, పట్టీలోని వస్తువులన్నిటి మొత్తం ద్రవ్యరాశి భూమి ద్రవ్యరాశిలో వెయ్యోవంతు కంటే ఎక్కువ లేదు. ఏస్టెరాయిడ్ పట్టీలో వస్తువులు చాలా తక్కువ (పట్టీలో ఏస్టెరాయిడ్ల సాంద్రత బాగా తక్కువ). అంతరిక్ష నౌకలు దేనితోనూ ఢీకొనకుండా ఈ పట్టీలో ప్రయాణిస్తూనే ఉంటాయి.

సెరెస్

సౌర కుటుంబం: గ్రహాంతర మాధ్యమం, అంతర సౌర వ్యవస్థ, బాహ్య సౌర వ్యవస్థ 
సెరెస్ – గురుత్వ క్షేత్రాల మ్యాపు: ఎరుపు ఎక్కువ, నీలం తక్కువ.
    సెరెస్ అతి పెద్ద ఏస్టెరాయిడ్, ఆదిమ గ్రహం, మరుగుజ్జు గ్రహం. దీని వ్యాసం 1000 కి.మీ. కంటే కొద్దిగా తక్కువ ఉంటుంది. దీని ద్రవ్యరాశి, తనను తాను గోళాకార వస్తువుగా మార్చుకునేంత ఎక్కువ ఉంది. 1801 లో కనుక్కున్నపుడు సెరెస్‌ను గ్రహం అని అనుకున్నారు. 1850 ల్లో ఏస్టెరాయిడ్ అని వర్గీకరించారు. 2006 లో గ్రహ నిర్వచనాన్ని సృష్టించినపుడు, దీన్ని మరుగుజ్జు గ్రహం అని అన్నారు.

ఏస్టెరాయిడ్ సమూహాలు

    ఏస్టెరాయిడ్ పట్టీ లోని ఏస్టెరాయిడ్లను వాటి పరిమాణాలను బట్టి ఏస్టెరాయిడ్ సమూహాలు, కుటుంబాలుగా విభజించారు. ఎప్దా ఏస్టెరాయిడ్లను ఏస్టెరాయిడ్ ఉపగ్రహాలు అన్నారు. వీటిలో కొన్ని గ్రహాల ఉపగ్రహాల పరిమాణంతో దాదాపు సమానంగా ఉన్నప్పటికీ వీటిని అంత విస్పష్టంగా వర్గీకరించలేం. ఈ పట్టీలో తోకచుక్కలు కూడా ఉంటాయి. భూమిపై నీటి ఉనికికి మూలం ఇవే కావచ్చు.
    గురుగ్రహపు L4 లేదా L5 పాయింట్ల (గ్రహానికి ముందూ వెనుకా ఉండే స్థిర గురుత్వ ప్రాంతాలు) వద్ద ఉన్న వాటిని గురుగ్రహ ట్రోజన్‌లు అంటారు. హిల్డా ఏస్టెరాయిడ్లు గురు గ్రహంతో 2:3 నిష్పత్తిలో అనుకంపనలో ఉంటాయి; అంటే గురుడు సూర్యుడి చుట్టూ రెండు సార్లు పరిభ్రమించే సరికి ఇవి సూర్యుడి చుట్టూ మూడు సార్లు పరిభ్రమిస్తాయి.
    అంతర సౌర వ్యవస్థలో భూ సమీప ఏస్టెరాయిడ్లు కూడా ఉన్నాయి. వీటిలో చాలా ఏస్టెరాయిడ్లు అంతర గ్రహాల కక్ష్యలను దాటుతూంటాయి. వీటిలో కొన్ని ప్రమాదకరమైనవి కూడా.

బాహ్య సౌర వ్యవస్థ

బాహ్య సౌర వ్యవస్థ పెద్ద గ్రహాలకు, వాటి ఉపగ్రహాలకూ నిలయం. సెంటార్లు, స్వల్ప కాలిక తోకచుక్కలు కూడా ఈ ప్రాంతంలో భ్రమిస్తూంటాయి. సూర్యుడి నుండి చాలా దూరంలో ఉండటాన, ఈ ప్రాంతంలోని ఘనపదార్థంతో కూడుకుని ఉన్న వస్తువుల్లో నీరు, అమ్మోనియా, మీథేన్ వంటి పదార్థాలు అంతర వ్యవస్థలోని వస్తువుల్లో కంటే ఎక్కువ మోతాదులో ఉంటాయి. ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండటం చేత ఈ పదార్థాలు ఘన స్థితిలో ఉంటాయి.

బాహ్య గ్రహాలు

సౌర కుటుంబం: గ్రహాంతర మాధ్యమం, అంతర సౌర వ్యవస్థ, బాహ్య సౌర వ్యవస్థ 
బాహ్య గ్రహాలు (వెనుక) గురుడు, శని, యురేనస్, నెప్ట్యూన్ లు - ముందున్న అంతర గ్రహాలతో పోలికలో భూమి, శుక్రుడు, అంగారకుడు, బుధుడు
సౌర కుటుంబం: గ్రహాంతర మాధ్యమం, అంతర సౌర వ్యవస్థ, బాహ్య సౌర వ్యవస్థ 
బాహ్య గ్రహాల చలనం.

బాహ్య వ్యవస్థలో ఉన్న నాలుగు గ్రహాలను పెద్ద గ్రహాలు అంటారు. జోవియన్ గ్రహాలు అని కూడా అంటారు. సూర్యుడి చుట్టూ పరిభ్రమిస్తున్న అన్ని వస్తువుల మొత్తం ద్రవ్యరాశిలో 99% ఈ నాలుగు గ్రహాలదే. గురుడు, శని గ్రహాల మొత్తం ద్రవ్యరాశి భూమి కంటే 400 రెట్లు ఉంది. హైడ్రోజన్, హీలియమ్ వీటిలో చాలా ఎక్కువగా ఉన్నాయి. యురేనస్, నెప్ట్యూన్‌లు కొద్దిగా చిన్నవి—ఒక్కొక్కటీ భూమికి 20 రెట్లుంటుంది. వీటినిండా మంచే ఉంది. ఈ కారణాన కొందరు శాస్త్రవేత్తలు వీటిని పెద్ద మంచు గ్రహాలు (ఐస్ జెయింట్స్) అంటారు. ఈ నాలుగు గ్రహాలకూ వలయాలున్నాయి. అయితే శనికి ఉన్న వలయాలు మాత్రమే భూమి నుండి తేలిగ్గా కనిపిస్తాయి. ఊర్ధ్వ గ్రహాలు (సుపీరియర్ ప్లానెట్స్) అనే మాట భూ కక్ష్యకు ఆవల ఉన్న గ్రహాలన్నిటినీ అంటారు. అంటే ఈ వర్గీకరణలో ఈ నాలుగు గ్రహాలతో పాటు అంగారకుడు కూడా ఉంటుంది.

గురుడు

    గురు గ్రహం (సూర్యుడి నుండి 5.2 AU) ద్రవ్యరాశి at 318 M, మిగతా అన్ని గ్రహాల మొత్తం ద్రవ్యరాశి కంటే 2.5 రెట్లు ఉంటుంది. ఇది హైడ్రోజన్, హీలియమ్‌లతో క్జూడుకుని ఉంటుంది. గురుడి లోని అంతర్గత ఉష్ణం దాని వాతావరణంలో మేఘాల పట్టీలు, దానిలో ఉన్న పెద్ద ఎర్రటి చుక్క వంటి అర్ధ శాశ్వత లక్షణాలను కలుగజేస్తుంది. మానవునికి తెలిసినంతలో గురు గ్రహానికి 79 ఉపగ్రహాలున్నాయి. గానిమీడ్, కాలిస్టో, అయో, యూరోపా అనేవి వీటిలో అతి పెద్దవి. రాతిగ్రహాల్లో లాగా వీటిలో అగ్నిపర్వతాలు, అంతర్గత తాపం వంటి లక్షణాలు ఈ నాలుగిట్లోనూ ఉన్నాయి. గానిమీడ్ సౌర వ్యవస్థలోని ఉపగ్రహాల్లోకెల్లా పెద్దది. ఇది బుధ గ్రహం కంటే కూడా పెద్దది.

శని

    వలయాల వ్యవస్థ శని (సూర్యుడి నుండి 9.5 AU) పత్యేకత. గురుడితో దీనికి వాతవరణ సమ్మేళనం, అయస్కాంతావరణం వంటి అనేక పోలికలున్నాయి. పరిమాణంలో ఇది గురు గ్రహంలో 60% ఉన్నప్పటికీ, ద్రవ్యరాశి - 95 M - గురుడిలో మూడోవంతు కంటే తక్కువ ఉంటుంది. నీటి కంటే తక్కువ సాంద్రత కలిగిన గ్రహం సౌర కుటుంబంలో శని ఒక్కటే. శనిగ్రహ వలయాల్లో చిన్నచిన్న మంచు, రాళ్ళ ముక్కలు ఉంటాయి. దీనికి 62 ఉపగ్రహాలున్నాయి. అన్నీ మంచుతో కూడుకుని ఉంటాయి. వీటిలో టైటన్, ఎన్‌సెలాడస్ లలో గ్రహగర్భ చైతన్యం ఉంది. టైటన్ సౌర వ్యవస్థ లోని అతిపెద్ద ఉపగ్రహాల్లో రెండవది. ఇది బుధ గ్రహం కంటే పెద్దది. గణనీయమైన స్థాయిలో వాతావరణం ఉన్న ఏకైక ఉపగ్రహం, టైటన్.

యురేనస్

    యురేనస్ (సూర్యుడి నుండి 19.2 AU దూరం) ద్రవ్యరాశి 14 M. బాహ్య వ్యవస్థలోని గ్రహాల్లో ఇది అత్యంత తేలికైనది. ఇది సూర్యుని చుట్టూ దొర్లుతూ పరిభ్రమిస్తుంది; దీని భ్రమణాక్షం పక్కకు వంపు తిరిగి దాని పరిభ్రమణ కక్ష్యకు దాదాపు సమాంతరంగా ఉంటుంది. ఇతర పెద్ద గ్రహాల కంటే దీని గర్భం (కోర్) చల్లగా ఉంటుంది. చాలా తక్కువ ఉష్ణాన్ని అంతరిక్షం లోకి పంపిస్తుంది. యురేనస్‌కు 27 ఉపగ్రహాలున్నాయి. వీటిలో టైటానియా, ఓబెరాన్, అంబ్రియెల్, ఏరియెల్, మిరాండా లు పెద్దవి.

నెప్ట్యూన్

    నెప్ట్యూన్ (సూర్యుడి నుండి 30.1 AU దూరం), యురేనస్ కంటే కొద్దిగా చిన్నదైనప్పటికీ, ద్రవ్యరాశి (17 M) దానికంటే ఎక్కువ. అంటే సాంద్రత యురేనస్ కంటే ఎక్కువ. యురేనస్ కంటే ఎక్కువ ఉష్ణాన్ని అంతరిక్షం లోకి పంపిస్తుంది. కానీ గురుడు, శనిల కంటే తక్కువ. నెప్ట్యూన్‌కు 14 ఉపగ్రహాలున్నాయి. వీటిలో అతి పెద్దదైన ట్రైటన్, ద్రవ నైట్రోజన్ బుగ్గలతో గ్రహగర్భ చైతన్యం కలిగి ఉంది. పెద్ద ఉపగ్రహాల్లో ట్రైటన్ ఒక్కటే రెట్రోగ్రేడ్ కక్ష్యలో తిరుగుతుంది. నెప్ట్యూన్ కక్ష్యలో అనేక చిన్న గ్రహాలున్నాయి వీటిని నెప్ట్యూన్ ట్రోజన్‌లు అంటారు. ఇవి నెప్ట్యూన్‌తో 1:1 అనుకంపనలో ఉంటాయి

సెంటార్లు

సెంటార్లు మంచుతో కూడుకుని ఉన్న తోకచుక్కల వంటి ఖగోళ వస్తువులు. ఇవి సూర్యుని చుట్టూ అండాకార కక్ష్యలో పరిభ్రమిస్తూ ఉంటాయి. వీటి సెమి-మేజర్ అక్షం గురుడి కంటే ఎక్కువ గాను (5.5 AU) , నెప్ట్యూన్ కంటే తక్కువ గానూ (30 AU) ఉంటుంది. అతి పెద్ద సెంటార్ ఐన 10199 చారిక్లో 250 కి.మీ. వ్యాసం కలిగి ఉంటుంది. మొట్ట మొదట కనుక్కున సెంటార్ 2060 చిరోన్‌ సూర్యుడికి దగ్గరగా వెళ్ళినపుడు తోకచుక్కలకు లాగానే తోక ఏర్పడుతుంది. అందుచేత దీన్ని తోకచుక్కగా (95P) వర్గీకరించారు.


తోకచుక్కలు

సౌర కుటుంబం: గ్రహాంతర మాధ్యమం, అంతర సౌర వ్యవస్థ, బాహ్య సౌర వ్యవస్థ 
1997 లో హేల్-బాప్ తోకచుక్క

తోకచుక్కలు సౌరవ్యవస్థ లోని చిన్న వస్తువుల్లో ఒకటి. ఇవి కొన్ని కిలోమీటర్ల పరిమాణంలో ఉంటాయి. ఎక్కువగా మంచుతో కూడుకుని ఉంటాయి. సూర్యుడి చుట్టూ ఇవి చాలా పెద్ద అండాకార కక్ష్యలో పరిభ్రమిస్తూంటాయి. ఈ కక్ష్యల పెరిహీలియన్ అంతర గ్రహాల కక్ష్యల లోపల ఉండగా, అప్‌హీలియన్ ప్లూటోకు బాగా ఆవల ఉంటుంది. ఏదైనా తోకచుక్క ఆంతర సౌర వ్యవస్థ లోకి ప్రవేశించినపుడు సూర్యుడికి దగ్గరగా ఉండటం చేత, వాటి ఉపరితలంపై ఉండే మంచు కరిగి ఘన స్థితి నుండి (ద్రవ స్థితికి రాకుండా) ఏకంగా ఆవిరౌతుంది (సబ్లిమేషన్). ఇది తోక లాగా అంతరిక్షంలోకి విస్తరిస్తుంది. ఇది ఉత్త కంటికే కనిపిస్తుంది. ఈ తోకను ఇంగ్లీషులో కోమా అంటారు.

స్వల్పకాలిక తోకచుక్కల కక్ష్యా వ్యవధి 200 సంవత్సరాల లోపే ఉంటుంది. దీర్ఘకాలిక తోకచుక్కల కక్ష్యా వ్యవధి వేల సంవాత్సరాలు ఉంటుంది. స్వల్పకాలిక తోకచుక్కలు కైపర్ పట్టీలోను, హేల్ బాప్ వంటి దీర్ఘ కాలిక తోకచుక్కలు ఊర్ట్ మేఘంలోనూ ఉద్భవిస్తాయని భావిస్తున్నారు. క్రూట్జ్ సన్‌గ్రేజర్స్ వంటి చాలా తోకచుక్కల సమూహాలు ఒకే మాతృక విచ్ఛిన్నం కావడంతో ఉద్భవించాయి. హైపర్‌బోలిక్ కక్ష్యల్లో పరిభ్రమించే తోకచుక్కలు సౌర కుటుంబానికి ఆవల ఉద్భవిస్తాయి. కానీ వాటి కక్ష్యలను కచ్చితంగా నిశ్చయించడం కష్టం. సూర్యుడి కారణంగా తమలో ఉన్న మంచునంతటినీ కోల్పోయిన తోకచుక్కలను ఏస్టెరాయిడ్లుగా వర్గీకరించారు.


ట్రాన్స్-నెప్ట్యూనియన్ ప్రాంతం

నెప్ట్యూన్‌కు ఆవల కైపర్ బెల్టు, చెదరిపోయిన వస్తువుల డిస్కు ఉన్న ప్రాంతాన్ని ట్రాన్స్-నెప్ట్యూనియన్ ప్రాంతం అంటారు. శాస్త్రవేత్తలు ఈ ప్రాంతాన్ని అంతగా పరిశోధించలేదు. అనేక వేల చిన్న చిన్న వస్తువులు ఈ ప్రాంతంలో ఉన్నట్లు తెలుస్తోంది. వీటిలో అతిపెద్ద వస్తువు వ్యాసం భూవ్యాసంలో ఐదో వంతు మాత్రమే ఉంటుంది. ద్రవ్యరాశి చంద్రుని కంటే చాలా తక్కువ. ఈ ప్రాంతాన్ని సౌరవ్యవస్థ యొక్క మూడవ మండలంగా - అంతర, బాహ్య వ్యవస్థల తరువాత - భావిస్తున్నారు.

కైపర్ బెల్ట్

సౌర కుటుంబం: గ్రహాంతర మాధ్యమం, అంతర సౌర వ్యవస్థ, బాహ్య సౌర వ్యవస్థ 
కైపర్ బెల్టులో తెలిసిన వస్తువులు
      సూర్యుడు      గురుడి ట్రోజన్లు      పెద్ద గ్రహాలు       కైపర్ బెల్టు      చెదిరిన చక్రం      నెప్ట్యూన్ ట్రోజన్లు

కైపర్ బెల్టు కూడా ఏస్టెరాయిడ్ బెల్టు లాఅంటిదే. అయితే, దీనిలోని వస్తువులు ప్రధానంగా మాంచుతో కూడుకుని ఉంటాయి. సూర్యుడి నుంఛి 30 నుండి 50 AU దూరంలో ఈ పట్టీ ఉంది. కైపర్ బెల్టులో ముఖ్యంగా చిన్నచిన్నా వాస్తువులు ఉన్నాయి. వీటిలో పెద్దవైనా కోర్, వరుణ, ఓర్కస్‌ లు మరింత సమాచారం లభిస్తే వాటిని మరుగుజ్జు గ్రహాలుగా వర్గీకరించే అవకాశం ఉంది. 50 కి.మీ. పైబడిన వ్యాసం గల కైపర్ బెల్టు వస్తువులు లక్షకు పైగా ఉన్నాయని ఒక అంచనా. కానీ కాఇపార్ పట్టీ మొత్తం ద్రవ్యరాశి భూమి ద్రవ్యరాశిలో పదో వంతో వందో వంతో ఉంటుంది. ఈ పట్టీలోని అనేక వస్తువులకు ఉపగ్రహాలున్నాయి. చాలావాటి కక్ష్యలు ఎక్లిప్టిక్‌ తలాన్ని దాటి పోతున్నాయి.

కైపర్ బెల్టును సాంప్రదాయిక, అనుకంపనిక అనే రెండు విభాగాలుగా వర్గీకారించవచ్చు. అనుకంపనలు నెప్ట్యూన్‌తో లింకై ఉన్న కక్ష్యలు. సాంప్రదాయిక బెల్టులో వస్తువులు నెప్ట్యూన్‌తో అనుకంపనలో లేవు. ఇవి 39.4 AU - 47.7 AU దూరం దాకా విస్తరించి ఉన్నాయి.

ప్లూటో, చరోన్

    మరుగుజ్జు గ్రహం, ప్లూటో (సగటు దూరం: 39 AU) కైపర్ బెల్టు లోని అతిపెద్ద వస్తువు. 1930 లో కనుగొన్నపుడు, దీన్ని తొమ్మిదో గ్రహంగా భావించారు. 2006 లో గ్రహ నిర్వచనాన్ని ప్రామాణీకరించినపుడు ప్లూటో గుర్తింపు మారింది. ప్లూటో కక్ష్య ఎక్లిప్టిక్‌ తలానికి 17 డిగ్రీల కోణంలో వాలి ఉంది. దీని కక్ష్య 29.7 AU పెరిహీలియన్‌ (నెప్ట్యూన్ కక్ష్యకు లోపలే) 49.5 AU అప్‌హీలియన్ aకలిగి ఉంది. ప్లూటో, నెప్ట్యూన్‌తో 3:2 అనుకంపన కలిగి ఉంది. ఇటువంటి అనుకంపన కలిగిన కక్ష్యల్లో తిరిగే కైపర్ బెల్టు వస్తువులను ప్లూటినో లంటారు.
    ప్లూటో ఉపగ్రహాల్లోకెల్లా వరోన్ అతి పెద్ద్దది. ఈ రెండూ ఒకదాని చుట్టూ మరొకటి తిరుగుతున్నట్లు కనిపిస్తాయి. అంచేత వీటిని ఒక బైనారీ వ్యావస్థలో ఉన్నట్లుగా భావించడం కద్దు. చరోన్‌కు ఆవల మరో నాఅలుగు చాలా చిన్న ఉపగ్రహాలు - స్టిక్స్, నిక్స్, కెర్బెరోస్, హైడ్రా - లు కూడా ఉన్నాయి.

మాకెమాకె, హామియా

    మాకెమాకె (సగటున దూరం:45.79 AU) ప్లూటో కంటే చిన్నదైనప్పటికీ, కైపర్ బెల్టులోని వస్తువుల్లోకెల్లా ఆతి పెద్దది. ప్లూటో తరువాత, కైపర్ బెల్టులోని వస్తువుల్లోకెల్లా అత్యంత వెలుగు కలిగినది. 2008 లో దీన్ని మరుగుజ్జు గ్రహంగా వర్గీకరించారు. దీని కక్ష్య వాలు 29°. ఇది ప్లూటో కక్ష్య వాలు కంటే ఎక్కువ.
    హామియా (సగటు దూరం 43.13 AU) కక్ష్య కూడా మాకెమాకె కక్ష్య లాంటిదే. అయితే ఇది నెప్ట్యూన్‌తో 7:12 కక్ష్యా అనుకంపన కలిగి ఉంది. దీని పరిమాణం మాకెమాకె అంతే ఉంది. దీనికి రెండు ఉపగ్రహాలున్నాయి. దీని భ్రమణ కాలం 3.9 గంటలు. ఈ భ్రమణ వేగం, దీన్ని సాగినట్లుగా చేస్తుంది. 2008 లో దీన్ని మరుగుజ్జు గ్రహంగా వర్గీకరించారు.

చెదిరిన చక్రం

కైపర్ బెల్టు దాటి చాలా దూరం వరకూ వ్యాపించి ఉండే చెదిరిన చక్రం (స్కాటర్డ్ డిస్క్) స్వల్పకాలిక తోకచుక్కలకు జన్మస్థానం అని భావిస్తున్నారు. సౌరావ్యవస్థలో నెప్ట్యూన్ బాహ్య ప్రాంతంలోకి వెళ్ళినపుడు ఈ చల్రం లోని వస్తువులు చెల్లాచెదురయ్యాయి. వీటి కక్ష్యల పెరిహీలియన్ కైపర్ బెల్టు లోపల ఉండగా, అప్‌హీలియన్ చాలా దూరం ఉంటుంది (కొన్ని 150 AU పైగా ఉంటాయి). వీటి కక్ష్యలు ఎక్లిప్టిక్‌కు బాగా వాలుగా ఉంటాయి. కొన్నైతే ఎక్లిప్టిక్‌కు లంబకోణంలో ఉంటాయి. ఈ చక్రం కైపర్ బెల్టు లోని ఒక ప్రాంతమేనని, ఇందులోని వస్తువులు కైపర్ బెల్టులోని చెదిరిన వస్తువులు అని భావిస్తారు.

ఎరిస్

    ఎరిస్ (సూర్యుడి నుండి సగటు దూరం: 68 AU) చెదిరిన చక్రం లోని వస్తువుల్లో అతి పెద్దది. ప్లూటో అంతటి వ్యాసమే ఉన్నప్పటికీ ద్రవ్యరాశి దాని కంటే 25% ఎక్కువ ఉండటం చర్చకు మూలమైంది. మరుగుజ్జు గ్రహాల్లోకెలా ఇది అతి పెద్దది. దీనికి డైస్నోమియా అనే ఉపగ్రహం ఉంది. ప్లూటో లగ దీని కక్ష్య కూడా బాగా ఎక్సెంట్రిక్‌గా ఉంటుంది. దీని కక్ష్య యొక్క పెరిహీలియన్ 38.2 AU (సూర్యుడి నుండి ప్లూటో కున్నంత దూరం) అప్‌హీలియన్ 97.6 AU. ఇది ఎక్లిప్టిక్‌ నుండి బాగా వాలి ఉంటుంది.

సౌర కుటుంబంలోని వస్తువుల చిత్రాలు

సౌర కుటుంబం లోని కొన్ని ఖగోళ వస్తువులు - ఘనపరిమాణాన్ని అనుసరించి పేర్చబడ్డాయి. వీటికంటే పెద్దవైన కొన్ని వస్తువుల ఫోటోలు మంచి నాణ్యతతో లేవు కాబట్టి, ఈ బొమ్మలో చేర్చలేదు.


సౌర కుటుంబం
సౌర కుటుంబం: గ్రహాంతర మాధ్యమం, అంతర సౌర వ్యవస్థ, బాహ్య సౌర వ్యవస్థ 
సౌర కుటుంబం: గ్రహాంతర మాధ్యమం, అంతర సౌర వ్యవస్థ, బాహ్య సౌర వ్యవస్థ 
సౌర కుటుంబం: గ్రహాంతర మాధ్యమం, అంతర సౌర వ్యవస్థ, బాహ్య సౌర వ్యవస్థ 
సౌర కుటుంబం: గ్రహాంతర మాధ్యమం, అంతర సౌర వ్యవస్థ, బాహ్య సౌర వ్యవస్థ 
సౌర కుటుంబం: గ్రహాంతర మాధ్యమం, అంతర సౌర వ్యవస్థ, బాహ్య సౌర వ్యవస్థ 
సౌర కుటుంబం: గ్రహాంతర మాధ్యమం, అంతర సౌర వ్యవస్థ, బాహ్య సౌర వ్యవస్థ  సౌర కుటుంబం: గ్రహాంతర మాధ్యమం, అంతర సౌర వ్యవస్థ, బాహ్య సౌర వ్యవస్థ 
సూర్యుడు
(నక్షత్రం)
గురుడు
(గ్రహం)
శని
(గ్రహం)
యురేనస్
(గ్రహం)
నెప్ట్యూన్
(గ్రహం)
భూమి
(గ్రహం)
శుక్రుడు
(గ్రహం)
సౌర కుటుంబం: గ్రహాంతర మాధ్యమం, అంతర సౌర వ్యవస్థ, బాహ్య సౌర వ్యవస్థ 
సౌర కుటుంబం: గ్రహాంతర మాధ్యమం, అంతర సౌర వ్యవస్థ, బాహ్య సౌర వ్యవస్థ 
సౌర కుటుంబం: గ్రహాంతర మాధ్యమం, అంతర సౌర వ్యవస్థ, బాహ్య సౌర వ్యవస్థ 
సౌర కుటుంబం: గ్రహాంతర మాధ్యమం, అంతర సౌర వ్యవస్థ, బాహ్య సౌర వ్యవస్థ 
సౌర కుటుంబం: గ్రహాంతర మాధ్యమం, అంతర సౌర వ్యవస్థ, బాహ్య సౌర వ్యవస్థ 
సౌర కుటుంబం: గ్రహాంతర మాధ్యమం, అంతర సౌర వ్యవస్థ, బాహ్య సౌర వ్యవస్థ 
సౌర కుటుంబం: గ్రహాంతర మాధ్యమం, అంతర సౌర వ్యవస్థ, బాహ్య సౌర వ్యవస్థ 
అంగారకుడు
(గ్రహం)
గానిమీడ్
(గురుడి ఉపగ్రహం)
టైటన్
(శని ఉపగ్రహం)
బుధుడు
(గ్రహం)
కాలిస్టో
(గురుడి ఉపగ్రహం)
అయో
(గురుడి ఉపగ్రహం)
చంద్రుడు
(భూమి ఉపగ్రహం)
సౌర కుటుంబం: గ్రహాంతర మాధ్యమం, అంతర సౌర వ్యవస్థ, బాహ్య సౌర వ్యవస్థ 
సౌర కుటుంబం: గ్రహాంతర మాధ్యమం, అంతర సౌర వ్యవస్థ, బాహ్య సౌర వ్యవస్థ 
సౌర కుటుంబం: గ్రహాంతర మాధ్యమం, అంతర సౌర వ్యవస్థ, బాహ్య సౌర వ్యవస్థ 
సౌర కుటుంబం: గ్రహాంతర మాధ్యమం, అంతర సౌర వ్యవస్థ, బాహ్య సౌర వ్యవస్థ 
సౌర కుటుంబం: గ్రహాంతర మాధ్యమం, అంతర సౌర వ్యవస్థ, బాహ్య సౌర వ్యవస్థ 
సౌర కుటుంబం: గ్రహాంతర మాధ్యమం, అంతర సౌర వ్యవస్థ, బాహ్య సౌర వ్యవస్థ 
సౌర కుటుంబం: గ్రహాంతర మాధ్యమం, అంతర సౌర వ్యవస్థ, బాహ్య సౌర వ్యవస్థ 
యూరోపా
(గురుడి ఉపగ్రహం)
ట్రైటన్
(నెప్ట్యూన్ ఉపగ్రహం)
ప్లూటో
(కైపర్ పట్టీ వస్తువు)
టైటానియా
(యురేనస్ ఉపగ్రహం)
రియా
(శని ఉపగ్రహం)
ఓబెరాన్
(యురేనస్ ఉపగ్రహం)
అయాపెటస్
(శని ఉపగ్రహం)
సౌర కుటుంబం: గ్రహాంతర మాధ్యమం, అంతర సౌర వ్యవస్థ, బాహ్య సౌర వ్యవస్థ 
సౌర కుటుంబం: గ్రహాంతర మాధ్యమం, అంతర సౌర వ్యవస్థ, బాహ్య సౌర వ్యవస్థ 
దస్త్రం:Color Image of Ariel as seen from Voyager 2.jpg
సౌర కుటుంబం: గ్రహాంతర మాధ్యమం, అంతర సౌర వ్యవస్థ, బాహ్య సౌర వ్యవస్థ 
సౌర కుటుంబం: గ్రహాంతర మాధ్యమం, అంతర సౌర వ్యవస్థ, బాహ్య సౌర వ్యవస్థ 
సౌర కుటుంబం: గ్రహాంతర మాధ్యమం, అంతర సౌర వ్యవస్థ, బాహ్య సౌర వ్యవస్థ 
సౌర కుటుంబం: గ్రహాంతర మాధ్యమం, అంతర సౌర వ్యవస్థ, బాహ్య సౌర వ్యవస్థ 
Charon
(ప్లూటో ఉపగ్రహం)
అంబ్రియెల్
(యురేనస్ ఉపగ్రహం)
ఏరియెల్
(యురేనస్ ఉపగ్రహం)
డయోన్
(శని ఉపగ్రహం)
టెథిస్
(శని ఉపగ్రహం)
సెరెస్
(పట్టీ ఏస్టెరాయిడ్)
వెస్టా
(పట్టీ ఏస్టెరాయిడ్)
సౌర కుటుంబం: గ్రహాంతర మాధ్యమం, అంతర సౌర వ్యవస్థ, బాహ్య సౌర వ్యవస్థ 
సౌర కుటుంబం: గ్రహాంతర మాధ్యమం, అంతర సౌర వ్యవస్థ, బాహ్య సౌర వ్యవస్థ 
సౌర కుటుంబం: గ్రహాంతర మాధ్యమం, అంతర సౌర వ్యవస్థ, బాహ్య సౌర వ్యవస్థ 
సౌర కుటుంబం: గ్రహాంతర మాధ్యమం, అంతర సౌర వ్యవస్థ, బాహ్య సౌర వ్యవస్థ 
సౌర కుటుంబం: గ్రహాంతర మాధ్యమం, అంతర సౌర వ్యవస్థ, బాహ్య సౌర వ్యవస్థ 
సౌర కుటుంబం: గ్రహాంతర మాధ్యమం, అంతర సౌర వ్యవస్థ, బాహ్య సౌర వ్యవస్థ 
సౌర కుటుంబం: గ్రహాంతర మాధ్యమం, అంతర సౌర వ్యవస్థ, బాహ్య సౌర వ్యవస్థ 
ఎన్సెలాడస్
(శని ఉపగ్రహం)
మిరాండా
(యురేనస్ ఉపగ్రహం)
ప్రోటియస్
(నెప్ట్యూన్ ఉపగ్రహం)
మిమాస్
(శని ఉపగ్రహం)
హైపీరియన్
(శని ఉపగ్రహం)
ఫోబ్
(శని ఉపగ్రహం)
జానస్
(శని ఉపగ్రహం)
సౌర కుటుంబం: గ్రహాంతర మాధ్యమం, అంతర సౌర వ్యవస్థ, బాహ్య సౌర వ్యవస్థ 
సౌర కుటుంబం: గ్రహాంతర మాధ్యమం, అంతర సౌర వ్యవస్థ, బాహ్య సౌర వ్యవస్థ 
సౌర కుటుంబం: గ్రహాంతర మాధ్యమం, అంతర సౌర వ్యవస్థ, బాహ్య సౌర వ్యవస్థ 
సౌర కుటుంబం: గ్రహాంతర మాధ్యమం, అంతర సౌర వ్యవస్థ, బాహ్య సౌర వ్యవస్థ 
సౌర కుటుంబం: గ్రహాంతర మాధ్యమం, అంతర సౌర వ్యవస్థ, బాహ్య సౌర వ్యవస్థ 
సౌర కుటుంబం: గ్రహాంతర మాధ్యమం, అంతర సౌర వ్యవస్థ, బాహ్య సౌర వ్యవస్థ 
సౌర కుటుంబం: గ్రహాంతర మాధ్యమం, అంతర సౌర వ్యవస్థ, బాహ్య సౌర వ్యవస్థ 
ఎపిమేథియస్
(శని ఉపగ్రహం)
ల్యుటీషియా
(పట్టీ ఏస్టెరాయిడ్)
ప్రొమేథియస్
(శని ఉపగ్రహం)
పాండోరా
(శని ఉపగ్రహం)
మథిల్డే
(పట్టీ ఏస్టెరాయిడ్)
హెలీన్
(శని ఉపగ్రహం)
ఇడా
(పట్టీ ఏస్టెరాయిడ్)
సౌర కుటుంబం: గ్రహాంతర మాధ్యమం, అంతర సౌర వ్యవస్థ, బాహ్య సౌర వ్యవస్థ 
సౌర కుటుంబం: గ్రహాంతర మాధ్యమం, అంతర సౌర వ్యవస్థ, బాహ్య సౌర వ్యవస్థ 
సౌర కుటుంబం: గ్రహాంతర మాధ్యమం, అంతర సౌర వ్యవస్థ, బాహ్య సౌర వ్యవస్థ 
సౌర కుటుంబం: గ్రహాంతర మాధ్యమం, అంతర సౌర వ్యవస్థ, బాహ్య సౌర వ్యవస్థ 
2014 MU69
(కైపర్ పట్టీ వస్తువు)
ఫోబోస్
(అంగారకుడి ఉపగ్రహం)
డేమోస్
(అంగారకుడి ఉపగ్రహం)
చుర్యుమోవ్–
గెరాసిమెంకో
(తోకచుక్క)
భూమికి 600 కోట్ల కి.మీ. దూరం నుండి వాయేజర్-1 తీసిన సౌర కుటుంబం ఫోటోలు
సౌర కుటుంబం: గ్రహాంతర మాధ్యమం, అంతర సౌర వ్యవస్థ, బాహ్య సౌర వ్యవస్థ 
శుక్రుడు, భూమి (లేత నీలపు చుక్క), గురుడు, శని, యురేనస్, నెప్ట్యూన్ (1996 సెప్టెంబరు 13)

ఇవీ చూడండి

పాదపీఠిక

మూలాలు

బయటి లింకులు

Tags:

సౌర కుటుంబం గ్రహాంతర మాధ్యమంసౌర కుటుంబం అంతర సౌర వ్యవస్థసౌర కుటుంబం బాహ్య సౌర వ్యవస్థసౌర కుటుంబం తోకచుక్కలుసౌర కుటుంబం ట్రాన్స్-నెప్ట్యూనియన్ ప్రాంతంసౌర కుటుంబం లోని వస్తువుల చిత్రాలుసౌర కుటుంబం ఇవీ చూడండిసౌర కుటుంబం పాదపీఠికసౌర కుటుంబం మూలాలుసౌర కుటుంబం బయటి లింకులుసౌర కుటుంబంఉపగ్రహాలుగ్రహాలుమరుగుజ్జు గ్రహంసూర్యుడు

🔥 Trending searches on Wiki తెలుగు:

ధనిష్ఠ నక్షత్రమువిశాఖపట్నంఏప్రిల్చదలవాడ ఉమేశ్ చంద్రఅమెరికా సంయుక్త రాష్ట్రాలుహను మాన్గౌతమ బుద్ధుడువై.యస్.అవినాష్‌రెడ్డిపూర్వ ఫల్గుణి నక్షత్రముఅంగుళంపెళ్ళి చూపులు (2016 సినిమా)దశరథుడుసింధు లోయ నాగరికతకృత్తిక నక్షత్రముకల్క్యావతారముకొండగట్టునవగ్రహాలుపాకిస్తాన్పక్షవాతంఅయోధ్య రామమందిరంఅష్ట దిక్కులుత్యాగరాజుఫేస్‌బుక్పుష్యమి నక్షత్రముపెరిక క్షత్రియులుఆశ్లేష నక్షత్రముగుంటూరు2014 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలులలితా సహస్ర నామములు- 601-700తెలంగాణలో 2024 భారత సార్వత్రిక ఎన్నికలుఎస్. జానకిఆపిల్రాయలసీమతంతిరంబమ్మెర పోతనశ్రీవారికి ప్రేమలేఖకృతి శెట్టికలువశక్తిపీఠాలురెడ్డి2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల ఫలితాలుపొట్టి శ్రీరాములుభారత రాజ్యాంగంపేర్ని వెంకటరామయ్యతేలువిజయనగర సామ్రాజ్యంఊరు పేరు భైరవకోనతెలంగాణశివ కార్తీకేయన్చంపకమాలపునర్వసు నక్షత్రముకోణార్క సూర్య దేవాలయంసలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్సర్పికమ్మవక్కజెర్రి కాటుఇరాన్దగ్గుబాటి వెంకటేష్ఘిల్లిభారత జాతీయపతాకంభారతదేశంలో బ్రిటిషు పాలననువ్వు నేనుభగత్ సింగ్మోత్కుపల్లి నర్సింహులుకొండా మురళిడీజే టిల్లుశ్రీ కృష్ణుడుకాశీమారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డిరావి చెట్టుజిల్లా కలెక్టర్ఇంద్రజప్లాస్టిక్ తో ప్రమాదాలువెంకటేశ్ అయ్యర్తెలంగాణ గవర్నర్ల జాబితాఆదిత్య హృదయం🡆 More