రచ్చబండ | వార్తలు | పాలసీలు | సాంకేతికము | ప్రతిపాదనలు | ఆలోచనలు | పత్రికా సంబంధాలు | ఇతరత్రా.. |
1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50 51, 52, 53, 54, 55, 56, 57, 58, 59, 60 61, 62, 63, 64, 65, 66, 67, 68, 69, 70 71, 72, 73, 74, 75, 76, 77, 78, 79, 80 81, 82, 83, 84, 85, 86, 87, 88, 89, 90 |
|
(సహాయం ఎలా కోరాలో చూడండి) |
26-28 జనవరి 2024 తేదీలలో విశాఖపట్నంలో జరగబోయే తెవికీ 20వ వార్షికోత్సవ కార్యక్రమ వివరాలు కార్యక్రమ ప్రణాళిక పేజీ లో స్థూలంగా తెలియచేయడమైనది. సభ్యులు గమనించగలరు. ధన్యవాదాలు.- తెవికి ప్రోగ్రాం కమిటీ - VJS (చర్చ) 09:18, 19 జనవరి 2024 (UTC)
26-28 జనవరి 2024 తేదీలలో విశాఖపట్నంలో జరగబోయే తెవికీ 20వ వార్షికోత్సవ కార్యక్రమం పూర్తి వివరాలు కార్యక్రమ ప్రణాళిక పేజీ లో తెలియచేయడమైనది. సభ్యులు గమనించగలరు. ధన్యవాదాలు.- తెవికి ప్రోగ్రాం కమిటీ -
Hello all,
I am reaching out to you today to announce that the voting period for the Universal Code of Conduct Coordinating Committee (U4C) Charter is now open. Community members may cast their vote and provide comments about the charter via SecurePoll now through 2 February 2024. Those of you who voiced your opinions during the development of the UCoC Enforcement Guidelines will find this process familiar.
The current version of the U4C Charter is on Meta-wiki with translations available.
Read the charter, go vote and share this note with others in your community. I can confidently say the U4C Building Committee looks forward to your participation.
On behalf of the UCoC Project team,
కొన్ని రోజుల క్రితం జరిగిన తెవికీ వార్షికోత్సవాల్లో కొన్ని ఐపీ అడ్రసులు నిరోధించడం వలన, లాగిన్ కాలేకవడం, కొత్త ఖాతాలు సృష్టించుకోలేకపోవడం, వ్యాసాలు రాయలేకపోవడం లాంటి సమస్యలు ఎదురవుతున్నాయని చెప్పారు. ఇది చాలా ముఖ్యమైన సమస్య అని నేను భావిస్తున్నాను. ఈ సమస్య ఎదుర్కొన్న వారు ముందుకు వచ్చి ఆ ఐపీ అడ్రసులు ఏమిటో ఇక్కడ తెలియజేస్తే, నిర్వహక హోదాలో వాటిని పరిశీలించి అవి ఎందుకు నిరోధించబడ్డాయో, ఇప్పుడు వాటిని అలాగే ఉంచాల్సిన అవసరం ఉందా లేదా అని పరిశీలించి ఒకవేళ నిరోధం అవసరం లేకపోతే వెంటనే నిరోధం తొలగించడానికి ప్రయత్నిస్తాను. ఈ సమస్య మనకు హెచ్చరిస్తున్న మరో విషయం ఏమిటంటే ఐపీ అడ్రసుల నిరోధం విధించేటపుడు, మనం కొంత ఓపికగా వ్యవహరించాలి. ముఖ్యంగా నిరవధికంగా నిషేధం, ఐపీ అడ్రసుల రేంజిని నిషేధం చేసే ముందు జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే ఎవరైనా ఆకతాయిలు, ట్రోల్స్ చేసే పనికి నిజమైన కంట్రిబ్యూటర్లు ఇబ్బందిని ఎదుర్కొనే ఆస్కారం ఉంది. నిర్వహకులందరూ ఇది గమనించాలి. ఐపీఅడ్రసు నిరోధం విధించే ముందు రచ్చబండలోనూ, నిర్వాహకుల నోటీసు బోర్డులోనూ ఒక సందేశం ఉంచండి. - రవిచంద్ర (చర్చ) 14:22, 29 జనవరి 2024 (UTC)
అయితే సమస్య ఎదుర్కొంటున్న వారు నన్ను సంప్రదిస్తే అధికారి హోదాలో నేనేమైనా చేయగలనా? అభిలాష్ గారూ మీ సమస్య చెప్పండి. - రవిచంద్ర (చర్చ) 07:50, 30 జనవరి 2024 (UTC)
@ప్రణయ్ తెవికీ ద్విశతాబ్ది పండగ కార్యక్రమంలో భాగంగా జరిగిన వికీపీడియా భవిష్యత్తు చర్చలో(చర్చ గురించిన నివేదిక, చర్చలో వచ్చిన ప్రతిపాదనలు, సూచనల గురించి @చదువరి గారు త్వరలో వివరాలు అందిస్తారు.) పలు అంశాలను సూచిస్తూ ఆన్లైన్లో ప్రత్యక్ష శిక్షణ, పరస్పర సహకారంపై చర్చ గురించి ప్రస్తావించారు. ఈ సమావేశానికి అనువైన వేదిక ఏది ఉంటే బావుంటుంది?(గూగుల్ మీట్, జిట్సి మీట్, వాట్సాప్ గ్రూప్ చాట్, టెలిగ్రాము గ్రూపు చాట్, వగైరా.) మొదటి సమావేశం ఎప్పుడు పెట్టుకోవచ్చు(ఈ వచ్చే ఆదివారమే మొదలుపెట్టుకోవచ్చని నా అభిప్రాయం)? వచ్చే రెండు నెలలలో నేను కాస్త తీరికగా ఉంటాను కనుక, నేను ఈ విషయంలో చొరవ తీసుకోగలను. ఇందుకు కావాల్సిన వికీ పేజీలను, నిబంధనలను రూపొందించేందుకు ఇతర సభ్యుల సహాయం కావాలి. -- రహ్మానుద్దీన్ (చర్చ) 14:30, 29 జనవరి 2024 (UTC)
మొదటగా నాకూ ఒక సందేహం ఉండేది, అసలు వంద రోజుల్లో వంద వ్యాసాలూ అంటే ఏంటి అని.. ఆ అంశానికి సంబందించిన వికీపీడియా:రోజుకో వ్యాసం ఈ పేజీ చూస్తే నాకు అవగతమైనది రోజుకో వ్యాసం చొప్పున వంద రోజుల్లో వంద వ్యాసాలూ రాయాలని.
అయితే ఎందరో వికీమీడియన్లు పుస్తకంలో ఈ వంద రోజుల్లో వంద వ్యాసాలూ రాసిన తొలి మహిళగా మీనా గాయత్రి గారిని ప్రస్తావించడం జరిగింది, అయితే పైన ప్రస్తావించిన రోజుకో వ్యాసం పేజీలో గమనిస్తే ఆమె రాసిన వ్యాసాల జాబితాను పొందు పరచలేదు. ఆ జాబితాని నేను చేరుద్దామని చూడగా గ్రహించిన విషయం ఏమిటంటే ఆమె పూర్తిగా రోజుకో వ్యాసం చొప్పున వంద రోజుల్లో వంద వ్యాసాలూ రాసిన జాబితా నాకు దొరకలేదు. దాన్ని వెతకగా నేను గమనించింది ఆమె అసలు ఈ ఛాలెంజి ని పూర్తి చేయలేదు.
ఆలా వంద రోజుల పోటీ పూర్తి చేయకుండానే ఆమెని తెలుగు వికీలో ఛాలెంజి పూర్తి చేసిన మొదటి మహిళగా అభివర్ణించండం తప్పు అని నా అభిప్రాయం. ఇంకా లెక్కకు చూస్తే ఆ ఛాలెంజి పూర్తి చేసిన నేను మొదటి మహిళను అవుతాను.
ఇంకా విషయానికి వస్తే పవన్ సంతోష్ గారు కూడా ఈ వంద రోజుల ఛాలెంజిని పూర్తి చేయలేదు అన్నట్లు తోస్తుంది, ఒకవేళ చేసుంటే వారి జాబితాని వందరోజల్లో రోజుకో వ్యాసం పేజీలో చేర్చాల్సిందిగా కోరుతున్నాను.
నిర్వాహకులు వాడుకరి:Arjunaraoc , వాడుకరి:B.K.Viswanadh, User:K.Venkataramana, వాడుకరి:Pavan santhosh.s, వాడుకరి:Pranayraj1985, వాడుకరి:Rajasekhar1961, వాడుకరి:T.sujatha, వాడుకరి:Veeven, వాడుకరి:యర్రా రామారావు, వాడుకరి:రవిచంద్ర, వాడుకరి:రహ్మానుద్దీన్ ఇతర చురుకైన వికీమీడియన్లు అందరు ఈ విషయంపై స్పందించాలని కోరుతున్నాను.--Tmamatha (చర్చ) 13:51, 31 జనవరి 2024 (UTC)
Hello all,
I am reaching out to you today to remind you that the voting period for the Universal Code of Conduct Coordinating Committee (U4C) charter will close on 2 February 2024. Community members may cast their vote and provide comments about the charter via SecurePoll. Those of you who voiced your opinions during the development of the UCoC Enforcement Guidelines will find this process familiar.
The current version of the U4C charter is on Meta-wiki with translations available.
Read the charter, go vote and share this note with others in your community. I can confidently say the U4C Building Committee looks forward to your participation.
On behalf of the UCoC Project team,
తెలుగు వికీలో ఇటీవల మహిళల భాగస్వామ్యం పెరగడంపై నాకు చాల ఆనందంగా ఉంది. దీన్ని ఇంకా ముందుకు తీసుకువెళ్లే ప్రయ్నతంలో నేను పాలుపంచుకోవాలనుకుంటున్నాను. దీనిలో భాగంగాలోనే కశ్యప్ గారు వాట్సాప్ లో పెట్టిన ఫెమినిజం, ఫోక్లోర్ - 2024 ప్రాజెక్టు నేను చేయాలనుకుంటున్నాను. నాకు ఎవరైనా సహాయం అందించగలరా...--Tmamatha (చర్చ) 08:12, 1 ఫిబ్రవరి 2024 (UTC)
తెవికీ యువ ప్రాజెక్టు తెలుగు వికీలో యువత, మహిళలు, అన్య లింగాల భాగస్వామ్యం అలాగే అభివృద్దిని దృష్టిలో ఉంచుకొని స్థాపించిన ఒక ప్రాజెక్టు. మరిన్ని వివరాలకు తెవికీ యువ చర్చా పేజీ ద్వారా సంప్రదించగలరు. నేతి సాయి కిరణ్ (చర్చ) 09:44, 1 ఫిబ్రవరి 2024 (UTC)
అందరికీ నమస్కారం, నేను వికీ లవ్స్ ఫోక్లోర్ ప్రాజెక్టు పేజీని తెలుగులోకి అనువాదించాను, దానిని మీరు ఇక్కడ చూడవచ్చు. ఏమైన తప్పులు ఉంటే సరిచేయగలరు. --IM3847 (చర్చ) 14:35, 5 ఫిబ్రవరి 2024 (UTC)
తెలుగు వికీపీడియా సముదాయ సభ్యులకు నమస్కారం. తెలుగు వికీపీడియా గురించి ప్రజల్లో అవగాహన కలిగించడం, తెలుగులో సమాచారం పెంపొందిపచేయడంలో మరింత ఎక్కువమందిని భాగస్వాములుగా చేయడమనే లక్ష్యాలతో తెలుగు వికీపీడియా సముదాయం తరపున గత కొన్ని సంవత్సరాలుగా హైదరాబాద్ బుక్ ఫెయిర్ లో తెలుగు వికీపీడియా కోసం ప్రత్యేకంగా ఒక స్టాల్ ఏర్పాటుచేసి, అందరి సహకారంతో విజయవంతంగా నిర్వహించడం జరిగుతోంది.
గతంలో మాదిరిగానే ఈ సంవత్సరం ఫిబ్రవరి 9 నుండి 19 వరకు జరుగబోతున్న 36వ హైదరాబాద్ బుక్ ఫెయిర్ లో కూడా తెలుగు వికీపీడియా కోసం ఒక స్టాల్ అందజేస్తామని తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు డా. మామిడి హరికృష్ణ గారు ముందుకొచ్చారు. అలాగే, స్టాల్ నిర్వహణకు కావాల్సిన ఇతర (ప్రచార సామగ్రి) అవసరాల కోసం సిఐఎస్ (సెంటర్ ఫర్ ఇంటర్నెట్ అండ్ సొసైటీ) వారు ఆర్థిక సహాయాన్ని అందజేస్తామని తెలిపారు.
పుస్తక ప్రదర్శనకి వచ్చేవారిలో చదివే ఆసక్తి ఉన్నవారు ఎక్కువ శాతం ఉంటారు కాబట్టి, స్టాలులో ఉండటానికి ఔత్సాహికులు కావాలి. ఈ బృహత్తర కార్యక్రమంలో సముదాయ సభ్యులు పాల్గొనవలసిందిగా ఆహ్వానిస్తున్నాను. ఈ బుక్ ఫెయిర్ సోమవారం నుండి శుక్రవారం వరకు మధ్యాహ్నం 2 గంటల నుండి రాత్రి 8.30 వరకు, శని-ఆదివారాల్లో మధ్యాహ్నం 12 నుండి రాత్రి 9 గంటల వరకు ఉంటుంది. అన్ని రోజులు పూర్తి సమయం ఉండాలన్న నియమమేది లేదు. ఎవరికి వీలున్న రోజులలో, వీలున్న సమయంలో తెవికీ స్టాల్ నిర్వహణలో పాల్గొనవచ్చు. సభ్యులు తమ వీలును తెలియజేయగలరు, ధన్యవాదాలు.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 05:49, 6 ఫిబ్రవరి 2024 (UTC)
భారత సార్వత్రిక ఎన్నికలు 2024 ఏప్రిల్- మే లో జరుగునున్నవి. అలాగే కొన్ని రాష్ట్రాలకు శాసనసభ ఎన్నికలు జరుగనున్నవి. తెవికీనందు గతంలో రెండు తెలుగు రాష్ట్రాలలో కేవలం శాసనసభ నియోజకవర్గాలకు, లోకసభ నియోజకవర్గాలుకు, మరికొన్ని ఇతర వ్యాసాలు మాత్రమే ఉన్నవి.వినయ్ కుమార్ గౌడ్ గారు దాదాపుగా అన్ని రాష్ట్రాల శాసనసభ నియోజకవర్గాలకు, లోకసభ నియోజకవర్గాలకు పేజీలు సృష్టించే పనిలో ఉన్నారు. అయితే ఇంకా భారత ఎన్నికల వ్యవస్థకింద తెవికీలో ఉండాల్సిన అనేక వ్యాసాలుకు పేజీలు సృష్టించాల్సిఉంది. అలాంటి ముఖ్యమైన అన్ని వ్యాసాలును ఈ ప్రాజెక్టులో గుర్తించి వ్యాసాలు సృష్టించటం, అలాగే గతంలో సృష్టించిన వ్యాసాలు అభివృద్ధి, తాజా పర్చటం, అవసరమైనమేరకు సవరణలు చేయటం ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశ్యం. ఈ విషయం గతంలో భారత సార్వత్రిక ఎన్నికల వ్యాసాల ప్రాజెక్టు - 2024 అనే విభాగంలో 2023 డిసెంబరు 21 చర్చకు ప్రవేశపెట్టబడింది.వికీపీడియా:వికీప్రాజెక్టు/ఎన్నికలు ప్రాజెక్టులో భాగంగా సృష్టించవలసిన వ్యాసాలు జాబితా -2024 అనే పేజీ నొకదానిని తయారుచేయబడింది. ఈ ప్రాజెక్టులో ఆసక్టి ఉన్న వాడుకరులు ఆ పేజీలో సంతకం చేసి మరిన్ని వ్యాసాలు సృష్టించగలరని ఆశించుచున్నాను. ధన్యవాదాలు. యర్రా రామారావు (చర్చ) 14:29, 6 ఫిబ్రవరి 2024 (UTC) రోజు
Feel free to translate into your language.
Dear Wikimedians,
In January, CIS-A2K successfully concluded several initiatives, and we are pleased to present a comprehensive monthly newsletter summarizing the events and activities of the past month. This newsletter provides an extensive overview of key information, highlighting our diverse range of endeavors.
You can access the newsletter here.
To subscribe or unsubscribe to this newsletter, click here.
Regards MediaWiki message delivery (చర్చ) 19:17, 9 ఫిబ్రవరి 2024 (UTC)
Dear all,
Thank you everyone for following the progress of the Universal Code of Conduct. I am writing to you today to announce the outcome of the ratification vote on the Universal Code of Conduct Coordinating Committee Charter. 1746 contributors voted in this ratification vote with 1249 voters supporting the Charter and 420 voters not. The ratification vote process allowed for voters to provide comments about the Charter.
A report of voting statistics and a summary of voter comments will be published on Meta-wiki in the coming weeks.
Please look forward to hearing about the next steps soon.
On behalf of the UCoC Project team,
సభ్యులకు నమస్కారం తెలుగు వికీపీడియా 20వ వార్షికోత్సవం సందర్భంగా కొంత సమాచారంతో మెటావికీలో పేజీ ఏర్పరచడం జరిగింది. దీనిని వికీపీడియా:తెవికీ 20 వ వార్షికోత్సవం ప్రాజెక్ట్ పేజీకి లింక్ చేయడమైనది పరిశీలించగలరు. కామన్స్ లో ఈ కార్యక్రమం సందర్భంగా తీసిన ఫోటోలు అప్లోడ్ చేయడానికి ఒక వర్గం చేర్చడమైనది. సభ్యులు తాము తీసిన ఫోటోలు ఇక్కడ అప్లోడ్ చేయగలరు. - ధన్యవాదాలు VJS (చర్చ) 15:58, 14 ఫిబ్రవరి 2024 (UTC)
నమస్కారం, మూస:documentని మూస:Cite journal నుండి దారిమార్పు తొలగించగలరు. యునెస్కో వారి వెబ్ సైట్లొ మూలాలుగ వాడటానికి చాల డాక్యుమెంట్లు వాడవచును. మూసాల జాబిత ఎకడ లభిస్తాయి? Id,Ik'+(&sZP4^m (చర్చ) 13:53, 16 ఫిబ్రవరి 2024 (UTC)
సభ్యులకు నమస్కారం వికీవ్యాఖ్య కు సంబంధించి 2023 అక్టోబర్-జనవరి 15, 2024 వరకు "వికీ లవ్స్ ఉమెన్/#ఆమె చెప్పింది (షీ సెడ్ 2023)ప్రాజెక్ట్" క్రింద వివిధ రంగాలకు చెందిన 166 మహిళల వ్యాఖ్యలు తెలుగులో చేర్చడమైనది. పాల్గొన్న 15 భాషలలో తెలుగు వికీవ్యాఖ్య 7వ స్థానంలో నిలిచింది. వికీకోట్ గణాంకాల ప్రకారం ఒక సంవత్సరంలో 4% నుండి 32 % వరకు ఈ పెరుగుదల కనిపించింది. వికీడేటా లింకులు పూర్తిగా ఇస్తే ఈపెరుగుదల ఇంకొంత కనిపించవచ్చు అనుకుంటున్నాను, ఆ పని జరుగుతోంది. పూర్తి వివరాలు ఇక్కడ ఇచ్చాను వికీ లవ్స్ ఉమెన్/#షీసెడ్ 2023 (#ఆమె చెప్పింది 2023). ధన్యవాదాలు. VJS (చర్చ) 10:02, 23 ఫిబ్రవరి 2024 (UTC)
23 జూన్ 2023 నాడు @యర్రా రామారావు గారు గుర్తించి చర్చించిన మండలపేజీ మూలాల దోషాలు చాలావరకు పరిష్కరించాను. అలాగే ప్రస్తుత మండలాల జాబితాలు, క్వెరీలు తాజాపరచాను. (చూడండి పాతచర్చ :వికీపీడియా:రచ్చబండ/పాత_చర్చ_88#ఆంధ్రప్రదేశ్_736_మండల_పేజీలలో_మూలాలు_లోపాలు) దీనికొరకు వికీడేటాలో సమాచారం చేర్చటంలో జరిగిన దోషాలు (నేను చేసినవే) సరిదిద్దాను. కొన్ని చోట్ల దోషానికి సంబంధించి ఆంగ్లవికీలో చర్చ (పేజీ శాశ్వతలింకు) ప్రారంభించాను. మీకు ఇంకా దోషాలు కనబడితే తెలియచేయండి.-- అర్జున (చర్చ) 13:16, 25 ఫిబ్రవరి 2024 (UTC)
సభ్యులకు నమస్కారం, ఈ సరికే తెవికీలో కృషి చేస్తూ కొంత అనుభవం సంపాదించిన వాడుకరుల కోసం కూడా కొన్ని ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలు ఉండాలని పలువురు సభ్యులు కోరిన విధంగా తెలుగు వికీమీడియన్స్ యూజర్ గ్రూపు తరపున ఆన్లైన్ ద్వారా వికీపాఠాల శిక్షణ అందించే కార్యక్రమానికి తెవికీ బడి అని నామకరణం చేసి, ఒక ప్రత్యేక పేజీని పెట్టాము.
ధన్యవాదాలు.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 13:41, 28 ఫిబ్రవరి 2024 (UTC)
అత్యధికంగా కొత్త వ్యాసాలు వచ్చిన మొదటి 10 నెలల జాబితాను కింది పట్టికలో చూడవచ్చు. ఇవ్వాళ్టితో ముగియనున్న ఫిబ్రవరి, ప్రస్తుతం 6 వ స్థానంలో ఉంది. ఇవ్వాళ ఇంకో 43 వ్యాసాలు రాస్తే 2000 కు చేరతాం. మరో రెండు రాస్తే 5 వ స్థానానికి చేరుతుంది. అది ఎలాగూ జరుగుతుంది. అయితే ఇక్కడొక విశేషం ఉంది:
ఈ ఫిబ్రవరిలో ఆ ఐదింటికంటే ఎక్కువ ఈసరికే రాసేసాం. ఒక రకంగా 2024 ఫిబ్రవరి నెల, వ్యాసాల విప్లవం వచ్చిన నెల. మార్చి దాన్ని మించుతుందా..?
సం. | నెల | కొత్త వ్యాసాల సంఖ్య |
---|---|---|
1 | 2006-09 | 10127 |
2 | 2006-10 | 6652 |
3 | 2007-06 | 4714 |
4 | 2007-08 | 2492 |
5 | 2006-11 | 2001 |
6 | 2024-02 | 1957 |
7 | 2006-08 | 1928 |
8 | 2023-08 | 1364 |
9 | 2023-09 | 1118 |
10 | 2006-12 | 1111 |
__ చదువరి (చర్చ • రచనలు) 04:26, 29 ఫిబ్రవరి 2024 (UTC)
Please help translate to your language
Hello, dear Wikipedians!
Wiki Ukraine, in cooperation with the MFA of Ukraine and Ukrainian Institute, has launched the forth edition of writing challenge "Ukraine's Cultural Diplomacy Month", which lasts from 1st until 31st March 2024. The campaign is dedicated to famous Ukrainian artists of cinema, music, literature, architecture, design and cultural phenomena of Ukraine that are now part of world heritage. We accept contribution in every language! The most active contesters will receive prizes.
We invite you to take part and help us improve the coverage of Ukrainian culture on Wikipedia in your language! Also, we plan to set up a banner to notify users of the possibility to participate in such a challenge! ValentynNefedov (WMUA) (talk)
మహిళా సభ్యులకు CIS/A2K వారి ప్రత్యేక ఆహ్వానం, ఇతరులు కూడా పరిశీలించండి, మద్దతు ఇవ్వండి.
మార్చి నెలలోకి వచ్చిన సందర్భంగా మహిళా సభ్యులందరికి అభినందనలు ఈ సందర్భంగా మహిళా సభ్యుల కోసం CIS/A2K నుంచి ఈ రోజు అందిన 'టెలిగ్రామ్' సందేశం ఈ క్రింద ఇస్తున్నాను
మహిళా వికీమీడియన్లు నాయకత్వం వహించేందుకు, వారి ఆలోచనలకు జీవం పోయడానికి, వారికి సాధికారత కల్పించే లక్ష్యంతో "షీ లీడ్స్" అనే కార్యక్రమం ప్రారంభిస్తున్నాము. "షీ లీడ్స్"తో మా కమ్యూనిటీలో అభివృద్ధి చెందుతున్న మహిళా నాయకులకు బలమైన మద్దతు అందిస్తున్నాము. మీ సంఘాల్లోని నాయకత్వ సామర్థ్యాన్ని ప్రదర్శించే మహిళా వికీమీడియన్లకు సహాయక వాతావరణాన్ని పెంపొందించడానికి మాతో చేరండి. "షీ లీడ్స్" అనేది కేవలం ఆరంభం కాదు; మహిళలకు నాయకత్వం వహించడానికి, సాధికారత కల్పించడానికి ఇది ఒక ప్రయాణానికి ప్రారంభం మాత్రమే.
"షీ లీడ్స్" మద్దతు మార్చి 1న ప్రారంభమై మే15 వరకు కొనసాగుతుంది.
మీరు CIS-A2K రూపొందించిన మెటాపేజీ లింక్ సందర్శించడం ద్వారా మరిన్ని వివరాలు తాజాగా తెలుసుకోవచ్చు. ఈ కార్యక్రమంలో ఉత్సాహం, సృజనాత్మకత తో ముందుకు వచ్చే మహిళా నాయకుల మద్దతు కోసం ఎదురుచూస్తున్నాము.
- CIS-A2K
ధన్యవాదాలు VJS (చర్చ) 09:33, 2 మార్చి 2024 (UTC)
అందరికీ శుభోదయం, వికీ లవ్స్ వైజాగ్ పోటీ ఈ రోజుతో ముగుస్తుంది. ఇప్పటి వరకు ఈ పోటీలో విశాఖపట్నం, చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన 1200కు పైగా ఫోటోలు వచ్చాయి. కానీ వాటిలో చాలా వాటికి వర్గాలు చేర్చలేదు, ఒకవేళ చేర్చినా అవి సబబుగా లేవు. మనమంతా కలిసి ఫోటోకు తగిన వర్గాలను చేరిస్తే ఈ పని చాలా సులువుగా అయిపొతుంది. అంతేకాకుండా ఉన్న చిత్రాలు అన్నీటిని 5 వర్గాలుగా విభజించాలి:
పోటీ పేజీలో మనం పేర్కొన్నట్లు ఇక్కడ ఉన్న చిత్రాలకు Images from Wiki Loves Vizag 2024 (to review) వర్గాన్ని తీసేసి, పైన ఉన్న 5 వర్గాలలో ఏదో ఒకటి జోడించాలి. ఇది పూర్తయిన తరువాతే ఈ కార్యక్రమానికి Jury మొదలుపెడతారు. కావున ఒక పది రోజులలో మనం ఈ పనిని పూర్తిచేస్తే 15వ తేదీ తరువాత నుంచి Jury Members వారి పనిని ప్రారంభిస్తారు. దీనిలో పాల్గొనేవారు క్రింద వారి సంతకాన్ని చేర్చండి.--IM3847 (చర్చ) 03:06, 5 మార్చి 2024 (UTC)
IM3847 గారూ, స్పష్టత కోసం కొన్ని ప్రశ్నలు సార్..
__చదువరి (చర్చ • రచనలు) 10:43, 5 మార్చి 2024 (UTC)
Hello all,
I am writing to you today with two important pieces of information. First, the report of the comments from the Universal Code of Conduct Coordinating Committee (U4C) Charter ratification is now available. Secondly, the call for candidates for the U4C is open now through April 1, 2024.
The Universal Code of Conduct Coordinating Committee (U4C) is a global group dedicated to providing an equitable and consistent implementation of the UCoC. Community members are invited to submit their applications for the U4C. For more information and the responsibilities of the U4C, please review the U4C Charter.
Per the charter, there are 16 seats on the U4C: eight community-at-large seats and eight regional seats to ensure the U4C represents the diversity of the movement.
Read more and submit your application on Meta-wiki.
On behalf of the UCoC project team,
ఉనికిలోనే లేని పేజీలకు లింకులు ఇస్తే అవి ఎర్రలింకులు అవుతాయని మనకు తెలుసు. అలా ఇవ్వడానికి కొన్ని కారణాలు:
ఇలా అనేకానేక కారణాలుంటై.
ఇలా, ఇన్‌కమింగు లింకులు ఉండి, అసలు ఉనికిలో లేని పేజీలను వికీపీడియా "ఆవశ్యక పేజీలు" అంటుంది. వీటిని ప్రత్యేక పేజీల్లో ప్రత్యేక:అవసరమైనపేజీలు అనే పేజీలో చూపిస్తుంది. అయితే ఇక్కడ, అన్ని పేరుబరుల్లోని పేజీలనూ చూపిస్తుంది. పైగా 5 వేలు మాత్రమే చూపిస్తుంది. అసలు అలాంటి - ఇన్‌కమింగు లింకులు ఉండీ ఉనికిలో లేని వ్యాస శీర్షికలు తెవికీలో మొత్తం ఎన్ని ఉన్నాయి అని డేటాబేసులో చూస్తే -
2 కంటే ఎక్కువ లింకులున్న పేజీల జాబితాను క్వారీలో చూడవచ్చు (క్వెరీ నడవడానికి కాస్త సమయం తీసుకుంటుంది.). అన్ని పేజీల జాబితా కావాలంటే ఈ క్వెరీ చూడవచ్చు (క్వెరీ నడవడానికి చాలాసేపు తీసుకుంటుంది.)
(పై క్వెరీలను సవరించి వాటిని మరింత ఎఫిషియెంట్‌గా చేస్తే, వారికి ముందుగా ధన్యవాదాలు)
కొత్తవ్యాసాలు సృష్టించేవారికి పై లింకులు ఒక ఉపయోగకరమైన వనరు. అయితే ఈ ఆవశ్యక పేజీలన్నీ ఆవశ్యకమైనవి కావు. ఎంచేతంటే:
అంచేత ఆవశ్యక పేజీలను సృష్టించే ముందు మనం పై అంశాలను దృష్టిలో పెట్టుకోవాలి.
మరొక సంగతి ఏంటంటే-
వీటిలో ఎక్కువ శాతం బహుశా మూసల (సమాచారపెట్టె, నేవిగేషను మూసలు వగైరా) నుండే వచ్చి ఉంటాయి. ఎన్నికలు 2024 ప్రాజెక్టు ముగిసేసరికి బహుశా చాలావరకు ఈ పేజీలు ఉనికి లోకి వస్తాయి. __ చదువరి (చర్చ • రచనలు) 11:21, 8 మార్చి 2024 (UTC)
2024 మార్చి నెలలో మనం 19,000 వ్యాసాలను చేరుకున్న శుభ సందర్భంలో ఇందులో పనిచేస్తున్న వికీసోర్సు వాడుకరులకు అందరికీ శుభాకాంక్షలు మరియు ధన్యవాదాలు. ముఖ్యంగా దేవీశ్రీప్రసాద్, శ్రీరామమూర్తి, రామేశం, అర్జునరావు, సుశీలమ్మ, మురళీకృష్ణ గార్లకు నాయొక్క విశేషమైన శుభాకాంక్షలు. మనం చేయాల్సిన మరెంతో కృషికి ఇది మంచి పునాది. ఇండిక్ భాషలలో మొదటిస్థానానికి మనం చేరాలను కాంక్షిద్దాము. Rajasekhar1961 (చర్చ) 19:01, 9 మార్చి 2024 (UTC)
జనవరి 26,27,28 తేదీల్లో విశాఖపట్నంలో జరిగిన తెవికీ పండగలో తీసిన ఫొటోలను కామన్సులో TeWiki Pandaga 2024 అనే వర్గంలో చేర్చారు. అన్నీ కలిపి 60 కి మించి ఫొటోల్లేవక్కడ. చివరి రోజుది ఒకే ఒక్క ఫొటో ఉంది. అక్కడ హాజరైన వాడుకరుల్లో ఎవరైనా ఫొటోలు ఎక్కించనివారుంటే వాటిని ఎక్కించవలసినది. @Pavan santhosh.s గారూ, మీ సంస్థ ప్రతినిధులు తీసిన ఫొటోలు, ఇంకా ఎక్కించవలసినవి ఉంటే అవి కూడా ఎక్కించవలసినది. __ చదువరి (చర్చ • రచనలు) 03:04, 10 మార్చి 2024 (UTC)
విక్షనరీ - మొదటి పేజీ చెదిరినట్లుగా అనిపించింది. సరిచేయగలరు. సాంకేతికంలో 2 రోజుల క్రితమే ఈ ప్రస్తావన పెట్టాను. ధన్యవాదాలు VJS (చర్చ) 14:29, 10 మార్చి 2024 (UTC)
తెవికీలో మహిళల జీవిత చరిత్ర వ్యాసాలు మామూలు గానే తక్కువగా ఉంటాయి. అయితే ఈమధ్య కాలంలో వివిధ వాడుకరులు తెవికీలో మహిళల వ్యాసాలపై శ్రద్ధ పెడుతున్నందున, వివిధ ప్రాజెక్టుల ద్వారానూ వీటి సంఖ్య బాగా పెరిగింది. ఒక సంవత్సరం కిందట మహిళా జీవిత చరిత్ర వ్యాసాలు మొత్తం జీవిత చరిత్ర వ్యాసాల్లో సుమారు 11% మాత్రమే ఉండేవి. ఈ వ్యాసాలను ఇవ్వాళ పరిశీలించాను.
మహిళలపై వ్యాసాలు రాయడం ఒక ఎత్తైతే, రాసే వ్యాసాలను మహిళ వర్గం లోకి వర్గీకరించడం మరొక ఎత్తు. అలాగే పాత వ్యాసాల్లో మహిళలుగా వర్గీకరించని వ్యాసాలు ఇంకా అనేకం ఉంటాయి; వాటన్నిటినీ కూడా సరిగ్గా వర్గీకరించుకోవాలి. అసలు "ప్రజలు" వ్యాసాలుగా వర్గీకరణ కాని వ్యాసాలను కూడా వెతికి పట్టుకుని వాటిని కూడా సరిగ్గా వర్గీకరించాలి.__చదువరి (చర్చ • రచనలు) 10:51, 12 మార్చి 2024 (UTC)
Dear all,
This year, the term of 4 (four) Community- and Affiliate-selected Trustees on the Wiki Foundation Board of Trustees will come to an end [1]. The Board invites the whole movement to participate in this year’s selection process and vote to fill those seats.
The Elections Committee will oversee this process with support from Foundation staff [2]. The Board Governance Committee created a Board Selection Working Group from Trustees who cannot be candidates in the 2024 community- and affiliate-selected trustee selection process composed of Dariusz Jemielniak, Nataliia Tymkiv, Esra'a Al Shafei, Kathy Collins, and Shani Evenstein Sigalov [3]. The group is tasked with providing Board oversight for the 2024 trustee selection process, and for keeping the Board informed. More details on the roles of the Elections Committee, Board, and staff are here [4].
Here are the key planned dates:
Learn more about the 2024 selection process - including the detailed timeline, the candidacy process, the campaign rules, and the voter eligibility criteria - on this Meta-wiki page, and make your plan.
Election Volunteers
Another way to be involved with the 2024 selection process is to be an Election Volunteer. Election Volunteers are a bridge between the Elections Committee and their respective community. They help ensure their community is represented and mobilize them to vote. Learn more about the program and how to join on this Meta-wiki page.
Best regards,
Dariusz Jemielniak (Governance Committee Chair, Board Selection Working Group)
[2] https://foundation.wikimedia.org/wiki/Committee:Elections_Committee_Charter
[3] https://foundation.wikimedia.org/wiki/Minutes:2023-08-15#Governance_Committee
[4] https://meta.wikimedia.org/wiki/Wikimedia_Foundation_elections_committee/Roles
[5] Even though the ideal number is 12 candidates for 4 open seats, the shortlisting process will be triggered if there are more than 15 candidates because the 1-3 candidates that are removed might feel ostracized and it would be a lot of work for affiliates to carry out the shortlisting process to only eliminate 1-3 candidates from the candidate list.
MPossoupe_(WMF)19:57, 12 మార్చి 2024 (UTC)
Hello. This is to notify the community that there is an ongoing global ban proposal for User:Slowking4 who has been active on this wiki. You are invited to participate at m:Requests for comment/Global ban for Slowking4 (2). Thank you. Seawolf35 (చర్చ) 04:27, 15 మార్చి 2024 (UTC)
విశాఖపట్నంలో జరిగిన ఫోటోగ్రఫీ పోటీ అందరికి తెలిసినదే, దానిలో జరిగిన Photo-Walkలో నేను Vizag Photowalkers Club ప్రెసిడెంటును కలిసాను. ఆయనతో వికీమీడియా కామన్స్ ఎలాగ పనిచేస్తుంది, ఫోటోగ్రఫీ మీద ఆసక్తి ఉన్నవారు వికీపీడియాకు ఏ విధంగా సహాయపడగలరని మాట్లాడుకున్నాం. అంతేకాక వికీమీడియా కామన్స్ ద్వారా వివిధ దేశాల వికీమీడియన్ల నుంచి ఫోటోగ్రఫీ నైపుణ్యాన్ని నేర్చుకునే అవకాశాలను, వికీపీడియాలో చిత్రాలను చేర్చడం ద్వారా వాటిని ఎంతమంది చూస్తారు అని చర్చించాము. దీనికి ఆయన సుముఖంగా అంగీకరించి వచ్చే శనివారం, ఆదివారం (మార్చి 23 & 24) వైజాగ్‌లో ఒక ఫోటోగ్రాఫీ ప్రదర్శన ఉందని, అక్కడకు ఫోటోగ్రఫీ నేర్చుకునే కాలేజీ పిల్లలు వస్తున్నారని, మనం అక్కడకు వచ్చిన వారికి కామన్స్ గురించి తెలియజేయవచ్చు అని అన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రణాలిక (Draft 01):
తెలుగు వికీపీడియా నుంచి కూడా ఎవరైనా ఈ కార్యక్రమానికి హాజారయ్యి మన వ్యాసాలకు చిత్రాల అవసరం ఎంత ఉన్నది, కామన్స్ ఫోటోగ్రఫీలో భారతదేశం ఎంత వెనుకబడిపోయింది అని చెప్తే బాగుంటుందని అనుకుంటున్నాను. ఈ కార్యక్రమం, దాని ప్రణాలికపై మీ విలువైన సూచనలు, సలహాలు ఉంటే తెలియజేయగలరు. --IM3847 (చర్చ) 15:55, 17 మార్చి 2024 (UTC)
Feel free to translate into your language.
Dear Wikimedians,
In February, CIS-A2K effectively completed numerous initiatives, and we are delighted to share a detailed monthly newsletter encapsulating the events and activities from the previous month. This newsletter offers a thorough glimpse into significant updates, showcasing the breadth of our varied undertakings.
You can access the newsletter here.
To subscribe or unsubscribe to this newsletter, click here.
Regards MediaWiki message delivery (చర్చ) 14:12, 18 మార్చి 2024 (UTC)
Please feel free to translate this into your preferred language.
Dear Wikimedians,
Exciting news from A2K! We're thrilled to announce that CIS-A2K is now seeking proposals for collaborative projects and activities to advance Indic Wiki projects. If you've got some interesting ideas and are keen on co-organizing projects or activities with A2K, we'd love to hear from you.
Check out all the details about requirements, process, timelines, and proposal drafting guidelines right here.
We're looking forward to seeing your proposals and collaborating to boost Indic Wiki projects and contribute even more to the open knowledge movement.
Regards MediaWiki message delivery (చర్చ) 14:25, 18 మార్చి 2024 (UTC)
తెలుగు వికీపీడియా గురించి ఆంధ్రప్రదేశ్‌లో డిగ్రీ స్థాయిలో తెలుగు పాఠ్యపుస్తకంలోని "తెలుగు - సాంకేతిక" అన్న అంశంలో భాగంగా కొంత పాఠం ఉంది. విద్యార్థులకు ఈ పాఠాన్ని బోధించే తెలుగు అధ్యాపకులకు తెలుగు వికీపీడియా గురించి సవివరంగా తెలియజేయడమూ, తెలుగు వికీమీడియా ప్రాజెక్టుల్లో ఈ అధ్యాపకుల్లో కొందరు వాడుకరులుగా పాల్గొనేందుకు ఉత్సాహం చూపిస్తారేమో ప్రయత్నించేందుకు ప్రయోగాత్మకంగా ఒక శిక్షణా శిబిరాన్ని నిర్వహించదలిచాము. పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడుకు చెందిన డి.ఆర్.గోయెంకా డిగ్రీ కళాశాల తెలుగు అధ్యాపక బృందం ఈ అంశంపై ఉత్సాహం చూపించడంతో ఆ కళాశాలతో కలసి సీఐఎస్-ఎ2కె ఆధ్వర్యంలో రెండు రోజుల తెలుగు వికీపీడియా శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించనున్నాము. ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలకు చెందిన ప్రభుత్వ కళాశాలల్లో పనిచేస్తున్న ప్రభుత్వ అధ్యాపకులందిరినీ ఈ కార్యక్రమానికి ఆహ్వానించి నిర్వహిస్తున్నాము. కళాశాలతో చర్చించిన మీదట ఈ కార్యక్రమాన్ని ఏప్రిల్ మూడో వారంలో నిర్వహించాలని ప్రణాళిక. ఈ కార్యక్రమంలో బోధించే అంశాల గురించి, పాల్గొనే శిక్షకుల గురించి మరిన్ని వివరాలను త్వరలో తెలియజేస్తాము. దీనిపై మీ సలహా, సూచనలు ఏమైనా ఉంటే తెలియజేయగలరు. ధన్యవాదాలతో పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) (చర్చ) 08:39, 21 మార్చి 2024 (UTC)
సభ్యులకు నమస్కారం, గత ఎనిమిదేళ్ళుగా తెలుగు వికీపీడియా అభివృద్ధికి తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ అందిస్తున్న సహకారం గురించి, సాంస్కృతిక శాఖ సంచాలకులు డా. మామిడి హరికృష్ణ గారి సహకారంతో నిర్వహించిన పలు తెవికీ కార్యక్రమాల గురించి సభ్యులందరికి తెలిసిందే. అంతేకాకుండా రవీంద్రభారతితో నాకున్న అనుబంధం రీత్యా భాషా సాంస్కృతిక శాఖ నిర్వహించిన వివిధ కార్యక్రమాలలో పాల్గొన్నప్పుడు వ్యక్తిగతంగా నేను తీసిన ఫోటోలు-వీడియోలను వికీకామన్స్ లో కూడా ఎక్కించి వాటిని తెవికీలోని పలు వ్యాసాలలో చేర్చాను. అయితే, ఇలా కొన్ని ఫోటోలు మాత్రమే కాకుండా రవీంద్రభారతి కార్యక్రమాల్లో భాషా సాంస్కృతిక శాఖ తీసిన వీలైనన్ని ఎక్కువ ఫోటోలు-వీడియోలను పబ్లిక్ డొమైన్‌లోకి విడుదల చేయించాలని 2017 సుండి పవన్ సంతోష్ గారు, నేను ప్రయత్నం చేస్తున్నాం.
రవీంద్రభారతి హైదరాబాద్‌కి సాంస్కృతిక కేంద్రం కావడంతో అక్కడ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లే కాక భారతదేశంలోనూ, కొన్ని సందర్భాల్లో ప్రపంచవ్యాప్తంగానూ ప్రసిద్ధి చెందిన కళాకారులు, కళారూపాలు, ప్రముఖులు పాల్గొన్న కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఈ కార్యక్రమాలకు సంబంధించి వికీమీడియా ప్రాజెక్టులకు చాలా విలువైన ఫోటోలు, వీడియోలు ఉంటాయి. ఈ ఫోటోలను కామన్స్లోకి విడుదల చేయడం వల్ల వికీమీడియా ప్రాజెక్టులకు చాలా ప్రయోజనం ఉంటుందని మా ఆలోచన.
గత సంవత్సరం వికీ కాన్ఫిరెన్స్ ఇండియా కార్యక్రమం జరిగినపుడు నేను, వికీమీడియా ఫౌండేషన్ సీనియర్ ప్రోగ్రామ్స్ మేనేజర్ ప్రవీణ్ దాస్, సీఐస్-ఎ2కె ప్రోగ్రాం మేనేజర్ పవన్ సంతోష్, వికీమీడియా ఫౌండేషన్ పార్టనర్షిప్స్ డైరెక్టర్ హొర్గే వర్గేస్ రవీంద్రభారతిలోని శాఖ కార్యాలయంలో హరికృష్ణ గారిని కలిసి, ఫోటోలు-వీడియోల విడుదల గురించి ప్రస్తావించగా ఆయన సుముఖత వ్యక్తం చేశారు. కాని, కొన్ని కారణాల వల్ల ఆ ప్రతిపాదన కార్యరూపం దాల్చలేదు.
ఈ మార్చి రెండవ వారంలో పవన్ సంతోష్ హైదరాబాద్‌లో మామిడి హరికృష్ణ గారిని కలసినప్పుడు ఈ అంశాన్ని తిరిగి లేవనెత్తగా హరికృష్ణ గారు తమ మద్దతును, ఈ ప్రాజెక్టు విషయమై తమ సుముఖతను తిరిగి వ్యక్తం చేశారు. ఈ ఫోటోలను, వీడియోలను సీసీ-బై-ఎస్ఎ లైసెన్సులోకి విడుదల చేసి, కామన్స్లోకి అప్లోడ్ చేయడం విషయమై సాంకేతికంగా, కాపీహక్కుల పరంగా ఎలా చేయాలి, అది భాషా సాంస్కృతిక శాఖలో దీనిపై ప్రాసెస్ ఎలా రూపొందించాలి వంటివి ప్రస్తుతం సీఐఎస్-ఎ2కె, వికీమీడియా ఫౌండేషన్ల సహకారంతో ఏర్పాటుచేస్తున్నాం. దీన్ని కార్యరూపంలోకి తీసుకురావడానికి వికీమీడియన్ ఆఫ్ ద రెసిడెన్స్‌గా నేను పనిచేయనున్నాను.
ఈ అంశంపై ఇంతకుముందు పలుమార్లు రచ్చబండలో చర్చకు పెట్టాము. ఇక దీన్ని కార్యరూపంలోకి తీసుకురావడానికి కృషిచేస్తున్నాం. మార్చి 28వ తేదీన మధ్యాహ్నం రవీంద్రభారతిలోని శాఖ కార్యాలయంలో వికీపీడియా ఫౌండేషన్, సిఐస్-ఎ2కె ప్రతినిధుల సమక్షంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నాం. ఆసక్తి, అవకాశం ఉన్న సభ్యులు ఈ కార్యక్రమానికి రావలసిందిగా ఆహ్వానిస్తున్నాం. ధన్యవాదాలు.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 16:02, 25 మార్చి 2024 (UTC)
అందరికీ నమస్కారం, ఈ సంవత్సరం జరిగే శ్రీరామ నవమి కార్యక్రమాలను CISతో కలిసి వికీమీడియాలో డాక్యుమెంట్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాము. మొన్న జరిగిన శివరాత్రి సంభరాలను విజయవాడ, అమరావతిలో నేను చిత్రీకరించాను, వాటి నుంచి చాలా Quality Images వచ్చాయి. వాటిని మీరు ఈ వర్గాలలో చూడవచ్చు: Shivaratri in Vijayawada, Sri Amaralingeswara Swamy Rath Yatra. కేవలం శివరాత్రికి చేసినట్లు చిత్రాలు మాత్రమే కాకుండా; శ్రీరామ నవమికి ఒకటి, రెండు రోజుల ముందు నుంచే, అక్కడ జరిగే ఏర్పాట్లను, ఆ ప్రాంతం చుట్టుపక్కల ఉన్న సందర్శక స్థలాలను కూడా చిత్రీకరిస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. దీనికి తగిన అనుమతులను తెలంగాణ ప్రభుత్వం నుంచి ఏవిధంగా తీసుకోవాలి అనే విషయాన్ని ఈరోజు మధ్యాహ్నం ప్రణయ్‌రాజ్ వంగరి గారితో చెర్చించాను. ఈ కార్యక్రమ ప్రణాళిక తయారు చేయడానికి, చిత్రీకరణలో పాలుపంచుకోవడానికి ఎవరైనా సభ్యులు ముందుకు వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసినదిగా కోరుతున్నారు. ఈ అంశం మీ సలహాలు సూచనలు ఉంటే తెలియజేయండి. --IM3847 (చర్చ) 15:13, 30 మార్చి 2024 (UTC)
గత 365 రోజుల్లో నిర్వహణ పరంగా జరిగిన పనుల వివరాలను వికీపీడియా:భారతీయ భాషా వికీపీడియాల గణాంకాలు/2023-24 నిర్వహణ గణాంకాలు పేజీలో చూపించాను. దాన్లోనే ఇతర భారతీయ భాషా వికీపీడియాల గణాంకాలను కూడా చూపించాను.
నిర్వాహకత్వ హోదా లేకుండానే నాణ్యత పరంగా చేపట్టగలిగే కొన్ని నిర్వాహక చర్యలు ఉన్నాయి. అలాంటి పనులు చేసేందుకు ప్రత్యేకించిన వాడుకరిగుంపులు కూడా ఉన్నాయి. అలాంటి వాడుకరి గుంపులను తెవికీలో స్థాపించమని కోరుతూ నిర్వాహకుల నోటీసుబోర్డులో అభ్యర్థించాను.
వాడుకరులు పరిశీలించవలసినది.__ చదువరి (చర్చ • రచనలు) 06:18, 31 మార్చి 2024 (UTC)
విలీనం చేయవలసిన వ్యాసాలు వర్గంలో 116 పేజీలు ఉన్నాయి. వీటిలో కొన్ని చాలాకాలంగా అలాగే ఉన్నాయి. నిర్వాహకులెవరైనా వీటిపై దృష్టి సారించగలరు. - స్వరలాసిక (చర్చ) 02:34, 1 ఏప్రిల్ 2024 (UTC)
భారతదేశంలో ఎన్నికల సంఘం 2024లో సార్వత్రిక ఎన్నికలు జరపటానికి తగిన షెడ్యూలు ప్రకటించినది. ఈ సందర్బంగా వీక్షకులు ఎన్నికల సమాచారం కొరకు వెతుకుట సహజం. అయితే మొదటి పేజీలో ఎన్నికలు, రాజకీయాలకు సమాచారానికి సంబంధించిన వర్గాలకు అంత ప్రాతినిద్యం లేదు.కేవలం భాష, సమాజం అనే ఉపవిభాగంలో రాజకీయాలు వర్గం గురించి మాత్రమే ఉంది.దానిలో అన్నీ ఉన్నప్పటికీ, ప్రస్తుత పరిస్థితులలో విపులంగా సమాచారం విస్తరించిఉంటే బాగుంటుందని నా అభిప్రాయం. కావున మార్గదర్శి విభాగంలో రాజకీయాలు, ఎన్నికలు అనే రెండు ఉప విభాగాలుచేర్చి, రాజకీయాలు ఉపవిభాగంలో రాజకీయ నాయకులు , రాష్ట్రాల ముఖ్యమంత్రులు, రాజ్యసభ సభ్యులు , రాష్ట్ర శాసనసభలు, లోక్‌సభ సభ్యులు, రాజకీయ పార్టీలు చేర్చుటకు, అలాగే ఎన్నికలు ఉప విభాగం కింద సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసనసభ ఎన్నికలు లోక్‌సభ నియోజకవర్గాలు, శాసనసభ నియోజకవర్గాలు, రాష్ట్ర శాసనసభల సభ్యులు కూర్పు చేయుటకు సముదాయసభ్యుల అభిప్రాయాలు తెలుపగలందులకు కోరుచున్నాను. యర్రా రామారావు (చర్చ) 16:47, 1 ఏప్రిల్ 2024 (UTC)
సభ్యులందరకు నమస్కారం
తెలుగు వికీమీడియన్స్ యూజర్ గ్రూపు ద్వారా నిర్వహిస్తున్న వికీపీడియా:తెవికీ బడి/శిక్షణా కార్యక్రమాలకు స్వాగతం. ఇది తెలుగు వికీమీడియన్స్ యూజర్ గ్రూపు మొదటి కార్యక్రమం. శిక్షణా కార్యక్రమం-1 తేదీ: 07.04.2024 ఆదివారం. సమయం: ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 12.00 వరకు శిక్షణాంశం: "తెలుగు వికీపీడియా వ్యాసానికి ఉండవలసిన హంగులు"
జనవరి 26-28 మధ్య మనం విశాఖపట్నంలో జరుపుకున్న తెవికీ పండగ 2024 సందర్భంగా CIS/A2K ఇంకా తెలుగు కోరా బృందంవారు నిర్వహించి నివేదించిన సమీక్షలతో మన తెలుగు వికీమీడియన్లు తెవికీ వ్యాసాలలో నాణ్యత మెరుగుపరచాలనేది పూర్తిగా ఏకీభవించిన అంశం. ఈ నేపథ్యంలో మొదటగా "తెలుగు వికీపీడియా వ్యాసానికి ఉండవలసిన హంగులు" అనే విషయాన్ని శిక్షణాంశాలలో చేర్చడం జరిగింది. అందుకని సభ్యులందరు పాల్గొని తమ సందేహాలు తీర్చుకొని, తమ అనుభవాల నేపధ్యంలో చర్చించి అందరకు అవగాహన పెంపొందించాలని కోరుతున్నాము. పాల్గొను సభ్యులు ఇక్కడ నమోదు చేసికోవలసినది. ధన్యవాదాలు. VJS (చర్చ) 18:52, 2 ఏప్రిల్ 2024 (UTC)
ఈ ఏడు తొలి త్రైమాసికంలో తెవికీలో కొత్త వ్యాసాల గణాంకాలు ఇలా ఉన్నాయి:
జనవరి | ఫిబ్రవరి | మార్చి | మూడు నెలలకు | |
---|---|---|---|---|
వ్యాసాల సంఖ్య | 800 | 1,999 | 1,200 | 3,999 |
సగటున రోజుకు | 25.8 | 68.9 | 38.7 | 43.9 |
మూణ్ణెల్లలో 4 వేలు! స్త్రీవాదము - జానపదము, 2024 ఎన్నికల వ్యాసాలు ప్రాజెక్టుల పాత్ర ఇందులో ప్రధానంగా ఉంది. ఈ రెండు ప్రాజెక్టులలోనూ కలిపి 2500 పైచిలుకు వ్యాసాలు వచ్చాయి.
మరికొన్ని గణాంకాలు:
ఇందులో పాలుపంచుకున్న వాడుకరులందరికీ అభినందనలు!
ఇంకొక 6200 వ్యాసాలు రాస్తే లక్ష వ్యాసాలకు చేరతాం. ఈ ఏటి వార్షికోత్సవం నాటికి అక్షరాలా లక్ష ఖాయం! __ చదువరి (చర్చ • రచనలు) 12:13, 3 ఏప్రిల్ 2024 (UTC)
2023 అక్టోబరు 1 నుండి 2024 మార్చి 31 తో ముగిసిన 6 నెలల కాలంలో నిర్వాహకులైన B.K.Viswanadh గారు చేసిన నిర్బ్వాహక కృషిని నేణు సమీక్షించాను. ఆ సమీక్షను వికీపీడియా:నిర్వాహకుల చురుకుదనపు సమీక్ష/B.K.Viswanadh వద్ద చూడవచ్చు.
వికీపీడియా:నిర్వాహకత్వ హక్కుల ఉపసంహరణ విధానం ప్రకారం, 6 నెలల కాలంలో తెవికీలో కనీసం ఒక్కటైనా (1) దిద్దుబాటు చేసి ఉండి, కనీసం 20 నిర్వాహక దిద్దుబాట్లు చేసి ఉండకపోతే, వారిని నిర్వాహకత్వం నుండి తొలగించవచ్చు. నా సమీక్షలో, విశ్వనాధ్ గారు 20 నిర్వాహక దిద్దుబాట్లు చెయ్యలేదని తేలింది. అందుచేత, ఆ విధానం ప్రకారం, ఆయన్ను నిర్వాహకత్వం నుండి తొలగించేందుకు స్టీవార్డులను అభ్యర్థించవలసి ఉంది. ఒక వారం రోజుల తరువాత - 2014 ఏప్రిల్ 11 న - స్టీవార్డులను అభ్యర్థించాలను నేను ప్రతిపాదిస్తున్నాను. ఈ లోగా ఈ అంశంపై అభిప్రాయాలేమైనా ఉంటే పై సమీక్షా పేజీలో రాయవలసినదిగా సముదాయ సభ్యులను కోరుతున్నాను. __ చదువరి (చర్చ • రచనలు) 03:20, 4 ఏప్రిల్ 2024 (UTC)
చదువరి గారు. "విశ్వనాధ్ గారు నిర్వాహకత్వంలో గత కొన్నేళ్ళుగా నిష్క్రియగా ఉన్నారు కాబట్టి ఆయనకు తెలిసి ఉండకపోవచ్చు" అన్నారు. రాస్తూ ఉంటేనే ఎక్టివ్ గా ఉన్నట్టు అనుకొనే మీ ఆలోచన సరైనదేనా ?, ఇక్కడ లేదా మరెక్కడైనా మీ అభిప్రాయానికి వ్యతిరేకంగా లేదా ఒక సమూహానికి వ్యతిరేకంగా ఎవరైనా అభిప్రాయాన్ని వ్యక్త పరిస్తే వారిపై ఎక్కువ ఆసక్తి కనబరచడం (లేదా వారిపై ఫోకస్ చేయడం) దేని కిందికి వస్తుందని అనుకుంటారు?, కొత్త వాడుకరులకు అనూకూలంగా మీ నిర్ణయాలు లేదా పాలసీలు లేవు, సులభతరంగా చేయడం కాక కష్టతరంగా మారుస్తున్నారు అని ఎవరైనా అంటే మీకెమైనా ఇబ్బంది అనిపిస్తుందా?, ఇప్పుడు ఎక్టివ్ గా ఉన్న వాడుకరులు వంద మంది ఉన్నారా?, ఉన్న 20 మంది వాడూకరుల ద్వారా పాలసీల రూప కల్పన కాక, వాడుకరులను పెంచుకొనే పాలసీలు, పధకాలు, వర్క్ షాప్స్, ప్రాజెక్టులు పై పని తీరు సమీక్షిస్తున్నారా?, అసలు అలాంటి ప్రాజెక్టూల రూప కల్పన ఎమైనా జరిగిందా?, దీనిపై ఒకపేజీ చేసి చర్చను ప్రారంభించగలమా?.. అక్కడ అసలు అభిప్రాయాలను దాడి లేకుండా, ఇబ్బంది లేకుండా నిర్భయంగా వ్యక్తపరచగలమా?, వాటీ ద్వారా మూస దోరణి నుండి బయటాకు వచ్చే ప్రయత్నం చేయగలమా?,. నిర్వహణా పరమైన అన్ని సమస్యలు ఇక్కడ ఎలా తెలుస్తాయి. అవి తెలియాలంటే ఒక కొత్త విధ్యార్ధి సమూహం వద్ద మన వికీ ఎంత వరకూ వాళ్ళకు అర్ధం అయ్యింది చూడాలి. మనం కూర్చుండాం. మీకు ఎప్పుడు సాధ్యమో తెలియచేయండి. ఇద్దరం వెళదాం. అప్పుడైనా అసలు విషయాలు మీకు తెలుస్తాయేమో బహూశా.. ధన్యవాదాలు..--B.K.Viswanadh (చర్చ) 06:36, 10 ఏప్రిల్ 2024 (UTC)
పైన మొదటి త్రైమాసిక గణాంకాలకు కొనసాగింపు ఇది. దీన్ని చూడడం ఎవరూ మిస్సవకూడదని విడిగా రాస్తున్నాను. ఈ మూడునెలల్లో మనం సృష్టించిన వ్యాసాల్లో 1779 వ్యాసాలు (44%) అనాథలే. వెబ్‌లో "లీంకు" ప్రాశస్త్యం మనకు తెలియనిదేమీ కాదు. ఈ వ్యాసాల కిప్పుడు ఇన్‌కమింగు లింకులు ఇస్తూ వీటిని వికీ జీవన స్రవంతి లోకి తీసుకురావాలి. వాడుకరులు ఆలోచించవలసినది. __ చదువరి (చర్చ • రచనలు) 12:17, 4 ఏప్రిల్ 2024 (UTC)
తెలుగు వికీమీడియా ప్రాజెక్టులు, సముదాయాలు అభివృద్ధి చేసే కార్యకలాపాలు చేపట్టేందుకు పలు చర్చల అనంతరం గత ఏడాది ఏర్పడిన తెలుగు వికీమీడియన్స్ యూజర్ గ్రూప్‌ను వికీమీడియా ఫౌండేషన్ వారి అఫ్లియేషన్స్ కమిటీ (AffCom) ఇటీవల వికీమీడియా ఫౌండేషన్‌కు అఫ్లియేట్ (అనుబంధ సమూహం)గా గుర్తించింది. ఈ మేరకు గత మార్చిలో అంతర్గతంగా తీర్మానం చేయగా, నిన్న (ఏప్రిల్ 5న) బహిరంగంగా ప్రకటన వెలువడింది. గత ఏడాది ఆగస్టులో మనం ఈ గుర్తింపు కోసం దరఖాస్తు చేసుకున్నాం. AffCom వారి అంతర్గత కారణాల వల్ల ప్రక్రియ ఆలస్యం అయినా మొత్తానికి గుర్తింపు లభించింది. ఈ అంశంపై నాతో కలసి పనిచేసిన @రవిచంద్ర, @Vjsuseela గార్లకు అనేక ధన్యవాదాలు.
ప్రస్తుత పాలసీ ప్రకారం ఈ గుర్తింపు తిరిగి ప్రతీ ఏడాది పునస్సమీక్షిస్తూ ఉంటారు. మన కార్యకలాపాలను గురించి వికీమీడియా సముదాయానికి ఏడాదికొక నివేదిక చొప్పున సమర్పించాల్సి ఉంటుంది. భవిష్యత్తులో వికీమీడియాలో జరిగే పరిపాలనా సంబంధమైన వివిధ కార్యక్రమాల గురించి ప్రపంచంలోని అనేక యూజర్ గ్రూపులతో పాటుగా మన గ్రూపును కూడా సంప్రదిస్తూ, ఆలోచనలు స్వీకరిస్తూ ఉండే అవకాశం ఉంటుంది.
తెలుగు వికీమీడియా ప్రాజెక్టుల విస్తరణ, నాణ్యత, వైవిధ్యం, సముదాయ అభివృద్ధి, నాయకత్వం, వనరులు వంటి అనేక అంశాలపై మనం యూజర్ గ్రూప్ ద్వారా చురుకుగా పనిచేసి వికీమీడియా ప్రపంచంలోనూ, తెలుగు సమాజంలోనూ విశిష్టమైన స్థానాన్ని సంపాదిస్తామని నమ్ముతున్నాను. పవన్ సంతోష్ (చర్చ) 09:34, 6 ఏప్రిల్ 2024 (UTC)
సభ్యులకు నమస్కారం వికీమీడియా ఫౌండేషన్ వారు అన్ని వికీమీడియా ప్రాజెక్టులు, ప్రదేశాలకు ఇంకా ఫౌండేషన్ కార్యకలాపాలకు వర్తించే విధంగా సార్వత్రిక ప్రవర్తనా నియమావళి విధానం, మార్గదర్శకాల అమలు ప్రక్రియలను ఆంగ్లం లో రూపొందించారు. తెలుగుతో సహా అనేక ఇతర భాషలలో అనువదించే అవకాశాన్ని కలిగించారు. తెవికీ పండగ సందర్భంలో వీటి గురించి కొంత తెలుసుకోవడము జరిగింది. మనకు ఉపయోగపడుతుందని వీలయినంతవరకు అనువాదం చేసి లింకులు ఈ క్రింద ఇచ్చాను. తప్పులుండవచ్చు. సూచించండి లేదా సరిచేయండి.
ఇప్పటికే మనకు ఉన్న వికీపీడియా:విధానాలు,_మార్గదర్శకాలు పేజీలో ఈ లింకులను చేర్చాను. ధన్యవాదాలు. VJS (చర్చ) 14:49, 6 ఏప్రిల్ 2024 (UTC)
సమాచారపెట్టె లేని పేజీలు 4 వేలకు పైబడి ఉన్నాయి. వాటిని సమాచారపెట్టె లేని పేజీలు వర్గంలో చూడొచ్చు.__ చదువరి (చర్చ • రచనలు) 01:17, 7 ఏప్రిల్ 2024 (UTC)
అనేక పేజీల్లో అక్షాంశ-రేఖాంశ వివరాలు తప్పుగా ఉన్నాయి. ఉదాహరణకు ఈ కింది వ్యాసాలన్నిటికీ ఒకే అక్షాంశ రేఖాంశ వివరాలు ఉన్నాయి:
ఆ అక్షాంశ రేఖాంశాలు వాస్తవానికి దేనికి సంబంధించినవయ్యా అని మ్యాపులో వెతికి చూస్తే అది నిజానికి విజయవాడ జంక్షన్ రైల్వే స్టేషను ఉన్న స్థలానికి చెందినది. ఈ విధమైన సమస్యలు మన వ్యాసాల్లో ఉన్నాయి.
అసలు ఈ సమస్య ఏ ఎడిట్ల వల్ల వచ్చిందో గమనించి చెప్పగలరా? నేను అనుకోవడం ఎవరో ఒకరో, లేక ఒక బాటో ఒక పొరబాటు సోర్సును బట్టి ఈ పనిచేసి ఉండాలి. అది తెలిస్తే ఆ సోర్సేమిటో, ఆ పని ఎలా జరుగుతోందో గమనించి భవిష్యత్తులో జరగకుండా చూసుకోవచ్చు. ఆ వాడుకరికి తదనుగుణంగా సూచించవచ్చు.
అలాగే, క్వైరీ వాడి ఒకే అక్షాంశ రేఖాంశాలున్న పేజీలన్నిటినీ జాబితాలు వేయొచ్చు కదా? ఎవరైనా ఆ విషయంలో సాయం చేయగలరా?
ఒకసారి అలా క్వైరీ వాడి చేశాకా సులువుగా దీన్ని సరిదిద్దడానికి ఏమైనా మార్గాలున్నాయోమో వెతుకుదామా? పవన్ సంతోష్ (చర్చ) 07:26, 7 ఏప్రిల్ 2024 (UTC)
"మోడల్" అనే పేరుతో ఉన్న విషయాల పేజీలకు (కళాకారులు కార్లు వగైరాలు) వర్గాలను సృష్టించేందుకు ఏ పేర్లను వాడాలనేది చర్చకు తెస్తున్నాను. మోడల్స్/మోడళ్ళు - వీటిలో ఏది వాడాలనేది చర్చ.
"మోడల్" అనే నామవాచకాన్ని ఇంగ్లీషు నుండి తెచ్చుకున్నాం. మనకు లేని మాటలను ఇతర భాషల నుండి తెచ్చుకోవడం మామూలే. ఏ భాషకైనా అది మామూలే. కానీ బహువచన రూపాన్ని కూడా తెచ్చుకోవాల్క్సిన అవసరం లేదు. పందికొక్కును బండికూట్ అని ఇంగ్లీషు లోకి తీసుకెళ్ళారు. పందికొక్కులు అనేది తీసుకుపోలేదు, బాండికూట్స్ అని వాడుతున్నారు. మనం కూడా బస్, బసెస్ లను బస్సు బస్సులు అని వాడుతున్నాం, కార్ కార్స్ లను కారు కార్లు అని వాడుతున్నాం.
ఇది భాష రూపానికి, నిర్మాణానికీ సంబంధించిన సంగతి, వాడుకలో ఎలా ఉంది అనేది కాదు.
అలాగే, మోడల్ అనే మాటకు మోడళ్ళు అని తెలుక్కు సహజమైన బహువచనాన్ని చేర్చాలి. అంచేత "భారతీయ మోడళ్ళు", "హైదరాబాదు మోడళ్ళు", "20 వ శతాబ్దపు కారు మోడళ్ళు" అనే పేర్లను వర్గాలకు వాడాలి అని నా అభిప్రాయం. మీమీ అభిప్రాయాలు చెప్పగలరు. __ చదువరి (చర్చ • రచనలు) 04:20, 8 ఏప్రిల్ 2024 (UTC)
Hi, sorry if it is not appropriate page because the community portal was in Telugu and it was very much difficult to navigate for non-Telugu Speaker like me. I have applied for a new bot here. Please have a look at it. Nokib Sarkar (చర్చ) 20:30, 8 ఏప్రిల్ 2024 (UTC)
Dear Wikimedians,
A2K is pleased to present its monthly newsletter for March, highlighting the impactful initiatives undertaken by CIS-A2K during the month. This newsletter provides a comprehensive overview of the events and activities conducted, giving you insight into our collaborative efforts and engagements.
You can access the newsletter here.
To subscribe or unsubscribe to this newsletter, click here.
Regards MediaWiki message delivery (చర్చ) 12:17, 11 ఏప్రిల్ 2024 (UTC)
This article uses material from the Wikipedia తెలుగు article వికీపీడియా:రచ్చబండ, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). అదనంగా సూచించని పక్షంలో పాఠ్యం CC BY-SA 4.0 క్రింద లభ్యం Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki తెలుగు (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.