మమ్మల్ని కలవండి

వికీపీడియా లో వివిధ విషయాలకు సంబంధించి మమ్మల్ని కలవడం కొరకు అవసరమైన సమాచారం ఈ పేజీ లో లభిస్తుంది.

వ్యాస పాఠం

కొత్త వ్యాసాలను సూచించడం, మొదలు పెట్టడం

కొత్త వ్యాసం ఎవరైనా రాయవచ్చు. ముందుగా, దిద్దుబాటు యొక్క ప్రాధమిక అంశాలు తెలుసుకోవాలి. ఎటువంటి వ్యాసాలు రాయకూడదో కూడా తెలుసుకోవాలి. ఇవన్నీ తెలుసుకున్న తరువాత, కొత్త పేజీని ఎలా ప్రారంభించాలి తో కొత్త పేజీని మొదలు పెట్టవచ్చు. ఇంకా సహాయం కావాలంటే, వికీపీడియా పాఠం ఉండనే ఉంది.

వికీపీడియా కు ఒక కొత్త వ్యాస విషయాన్ని సూచించ దలస్తే, అభ్యర్ధించిన వ్యాసాలు పేజీ లో చెయ్యవచ్చు. ఆ పేజీ లో విషయ సూచిక ఉంది, మీ సూచనను అక్కడ చేర్చవచ్చు.

వ్యాసాలను సరిదిద్దటం, మెరుగు పరచడం

వికీపీడియా వ్యాసాలను ఎవరైనా సరిదిద్దవచ్చు. పేజీ లో తప్పు గమనిస్తే ఆ పేజీ కి పైన ఉన్న మార్చు లింకును నొక్కండి. అప్పుడు వచ్చే దిద్దుబాటు పేజీ లోని టెక్స్ట్‌ బాక్స్‌ లో తప్పును సరిదిద్దండి. దిద్దుబాట్లు చేసేటపుడు,దిద్దుబాటు సారాంశం ను కూడా జత చేయండి. దిద్దుబాటు పై సహాయం కావాలంటే, వికీపీడియా పాఠం చదవండి.

వ్యాసాన్ని మెరుగు పరచడం పై చర్చించడానికి చర్చా పేజీకి వెళ్ళ్ళండి. వ్యాసం పేజీ కి వెళ్ళి, అక్కడ "చర్చ" ను నొక్కితే చర్చా పేజీ కి వెళ్ళవచ్చు. సభ్యులతో విడిగా మాట్లాడాలంటే, వారి చర్చా పేజీ కి వెళ్ళాలి. సభ్యుని పేరును నొక్కితే, సదరు సభ్యుని పేజీ కి వెళ్తారు, అక్కడ "చర్చ" నొక్కితే, ఆ సభ్యుని చర్చా పేజీ కి వెళ్తారు. అక్కడ మీరు చేసే మార్పు చేర్పులు, ఆ సభ్యుడు లాగిన్‌ కాగానే కనిపిస్తాయి.

దుశ్చర్య (విఛ్ఛిత్తి లేదా విఛ్ఛిన్నకర చర్య)

వికీపీడియా లో ఎవరైనా రాయవచ్చు కాబట్టి, ఇక్కడ దుశ్చర్యలు జరగటం సహజమే. వికీపీడియా లో దుశ్చర్య అంటే, వ్యాసాన్ని చెడగొట్టే ఉద్దేశ్యంతో పనికిరాని చెత్తను పేజీల్లో పెట్టడం. మీరు ఏ పేజీ లో నైనా దుశ్చర్య ను గమనిస్తే ఈ సూచనలను పాటించి, వ్యాసాన్ని పూర్వపు కూర్పుకు తీసుకొని పోవచ్చు. తరువాత కూడా ఆ సభ్యుడు అటువంటి దుశ్చర్యలు చేస్తూ ఉంటే, ఇతర సభ్యులను ఈ విషయమ్పై అప్రమత్తం చెయ్యండి. దీని కొరకు మీరు ఈ పేజీ లను చూడండి:దుశ్చర్య జరుగుతూనే ఉంది దుశ్చర్య పై నిర్వాహకుని జోక్యం

అప్పుడు, అవసరమైతే, వికీపీడియా నిర్వాహకుడు ఆ దుష్టుని IP address, సభ్యత్వాన్ని నిషేధించుతారు.

పేజీ ల తొలగింపు, పునరుజ్జీవం

ఒక పేజీ ని పూర్తిగా తొలగించవలసి ఉందని మీరు భావిస్తే, పైగా అది వికీపీడియా తొలగింపు విధానానికి అనుగుణంగా ఉందని అనుకుంటే, తొలగింపుకై వోట్లు పేజీ లో ప్రతిపాదించండి. ఆ పేజీలో, అడుగున, తొలగింపు కొరకు ఎలా ప్రతిపాదించాలో వివరణ ఉంది. ఏదైనా పేజీని అన్యాయంగా తొలగించారని మీరు భావిస్తే, తొలగింపుకు వ్యతిరేకంగా వోట్లు లో మీ వాదనను వినిపించండి.

వికీపీడియా సభ్యులు

వికీపీడియా సభ్యుని గురించి తెలుసుకోవడానికి, ఆ సభ్యుని పేరును నొక్కండి; వారి సభ్యుని పేజీ కి వెళ్తారు. ఏ సభ్యుని తోనైనా చర్చించాలంటే, ఆ సబ్యుని పేజీలో చర్చ ను నొక్కండి. కొంతమంది సభ్యులు వికీపీడియా ద్వారా ఈ-మెయిల్స్‌ ను అనుమతిస్తారు. అటువంటి సభ్యుని పేజీ లో, తెరకు ఎడమ అడుగు భాగంలో "E-mail this user" అనే లింకు కనిపిస్తుంది. కొంత మంది సభ్యులు ఇంకొంత సమాచారం కూడా (ఈ-మెయిల్‌, తక్షణ సందేశం, ఫోను మొదలైనవి) తమ పేజీలో ఇస్తారు.

చాలా మంది సభ్యులను ఒకేసారి సంప్రదించాలనుకుంటే, మీరు మెయిలింగు జాబితా లలో సభ్యత్వం తీసుకుని అక్కడ సందేశం ఇవ్వవచ్చు, లేదా రచ్చబండ వద్ద చర్చించవచ్చు. సందేశాల సంగ్రహం నుండి పాత సందేశాలను చూడవచ్చు కూడా.


వికీపీడియా గురించి సాధారణ ప్రశ్నలు

వికీపీడియా గురించిన సమాచారం కొరకు వికీపీడియా లో తరచూ అడిగే ప్రశ్నలు ఒక మంచి వనరు. ప్రతీ పేజీ కి (వ్యాసం పేజీలు, విధాన పేజీలు, సభ్యుని పేజీలు) కూడా దాని చర్చా పేజీ ఉంది. ఒక విషయానికి లేదా సభ్యునికి సంబంధించిన సమాచారం కొరకు, ఈ చర్చా పేజీయే సరియైన స్థానం.

ఇది కాకుండా, సాధారణ ప్రశ్నలకు 4 ప్రదేశాలు ఉన్నాయి:

  • పేరుకు తగినట్టే రచ్చబండ సముదాయానికంతటికీ ఒక సమావేశ స్థలం. ప్రశ్నలకు, చర్చలకు, సిధ్ధాంత ప్రతిపాదనలకు, ప్రణాళికలకు, ఇంకా ఎన్నిటికో ఇది ఒక స్థావరం. మీకు ఏమైనా సందేహాలుంటే, ముందు రచ్చబండ వద్ద పెట్టండి; రచ్చబండ కు సంబంధించని ప్రశ్నలను తీసివేసి, సరైన చోట పెట్టి, అక్కడికి దారి కూడా చూప్స్తారు.
  • వికీపీడియా ఆకృతీ, అమరికల గురించిన ప్రశ్నలకు, ముఖ్యంగా "ఎలా", "ఎందుకు", "అలా ఎందుకు చేయాలి" వంటి ప్రశ్నల సమాధానాలకై సహాయ కేంద్రం చూడండి.
  • ఏదైనా విషయంపై వికీపీడియా సముదాయాన్ని అడిగి తెలుసుకోవాలంటే సంప్రదింపుల కేంద్రం చూడండి. ఒక గ్రంధాలయం లాగా ఇక్కడి ఔత్సాహికులు మీ ప్రశ్నలకు సమాధానా లివ్వడమే గాక ఆ విషయంపై చక్కని సమాచార వనరులను కూడా మీకు సూచిస్తారు. (ఒక్క మాట!, మీ హోమ్‌ వర్కు చెయ్యటానికి మమ్మల్ని వాడుకోవద్దు సుమా!!).

పై స్థలాల్లో మీ ప్రశ్నను అడిగిన తరువత కొన్ని రోజుల పాటు, క్రమం తప్పకుండా ఆ పేజీని సమాధానాల కొరకు చూస్తూండండి.

వికీమీడియా ఫౌండేషన్‌ కూ సంనంధించిన వివరాలకై (వాటి కొరకు మాత్రమే) [email protected] కు ఈ-మెయిల్‌ చెయ్యండి.

పత్రికా విచారణలు

విలేకరులు మరియు ఇతర ఆసక్తి పరులు మెయిలింగు జాబితాకు ఈ-మెయిల్‌ పంపవచ్చు. మీరు ఈ జాబితాలో సభ్యులు కాకపోతే మీ ఈ-మెయిల్‌ ను నిర్వాహకుడు అనుమతించవలసి ఉంటుంది. మీరు చాలా ఈ-మెయిల్‌ లు పంపాలనుకుంటే సభ్యత్వ వివరాల కొరకు మెయిలింగు జాబితా ను చూడండి.

వికీపీడియన్లను సంప్రదించదలిస్తే, వికీపీడియన్లు మరియు నిర్వాహకుల జాబితా లను చూడండి.

మీకు పత్రికా సమాచార సేకరణ అవసరమైతే, పైగా మీరు విలేకరి అయితేనే , మీరు టెర్రీ ఫూట్‌ ను +1 727 231 0101 లో సంప్రదిస్తే ఆయన మిమ్మల్ని జిమ్మీ వేల్స్‌ కు కలుపుతారు. లేదా మీరు జిమ్మీ కి సరాసరి వికీ.చొమ వద్ద ఈ-మెయిల్‌ పంపవచ్చు. ఆ ఫోనును కేవలం పత్రికా విచారణలకే వాడండి. వేరే వటికి దానిని వాడ రాదు.

వికీమీడియా ఫౌండేషన్‌ పత్రికా అధికారి వివరాలకై meta: Press Officer చూడండి.

విధానం

వికీపీడియా విధానాల పై చర్చ మెయిలింగు జాబితా వద్ద చెయ్యవచ్చు.

దిద్దుబాట్ల నుండి నిషేధం

కొన్నిసార్లు దుశ్చర్యల కారణంగా IP address ను నిషేధించ వలసి రావచ్చు (పైన చూడండి). అయితే, ఒక్కోసారి, వేరే వాళ్ళు కూడా అదే అడ్రసును వాడుతూ ఉండవచ్చు.

ఒకవేళ అదే మీరయితే, మీరు దిద్దుబాట్లు జరపబోయినపుడు ఎదురైన సందేశం లోని సూచనలను పాటించండి. లేదా నిర్వాహకుల జాబితా లోని నిర్వాహకులను సంప్రదించవచ్చు.(ఈ-మెయిల్‌ లింకు ఉన్న నిర్వాహకులకు ఈ-మెయిల్‌ పంపవచ్చు). లేదా మీ సభ్యుని చర్చా పేజీలో సందేశం పెట్టండి (సాధారణంగా మీ సభ్యుని చర్చా పేజీ పనిచేస్తూనే ఉంటుంది).

కాపీ హక్కు ప్రశ్నలు

మీకు కాపీ హక్కు ఉన్న వ్యాసం మీ అనుమతి లేకుండా వికీపీడియా లో వాడితే వెంటనే తొలగించడానికి విగ్జ్నప్తి చెయ్యవచ్చు. మరింత సమాచారానికై Wikipedia:కాపిహక్కు చూడండి.

కాపీ హక్కుల అతిక్రమణ అని మీరు అనుమానిస్తే ఇక్కడ ఉన్న సూచనలను పాటించండి.

వికీపీడియా లోని వ్యాసాలను వాడుకోవడానికి అనుమతి కావాలా? (GNU ఫ్రీ డాక్యుమెంటేషన్‌ లైసెన్సు) ఇప్పటికే మీకా అనుమతి - వ్యాపార ప్రయోజనాల కోసం కూడా - ఇచ్చేసింది. అయితే, మీరు లైసెన్సు నిబంధనలను పాటించాలి. వివరాలకు కాపీహక్కులు చూడండి.

ఇవీ చూడండి

Tags:

మమ్మల్ని కలవండి వ్యాస పాఠంమమ్మల్ని కలవండి వికీపీడియా సభ్యులుమమ్మల్ని కలవండి వికీపీడియా గురించి సాధారణ ప్రశ్నలుమమ్మల్ని కలవండి పత్రికా విచారణలుమమ్మల్ని కలవండి విధానంమమ్మల్ని కలవండి ఇవీ చూడండిమమ్మల్ని కలవండివికీపీడియా

🔥 Trending searches on Wiki తెలుగు:

ఖండంతెలుగు పద్యముషర్మిలారెడ్డిఛందస్సుమేషరాశికొమురవెల్లి మల్లన్న స్వామి దేవాలయంఆత్రం సక్కుఒడ్డెరభాగ్యశ్రీ బోర్సేకానుగదానిమ్మస్వాతి నక్షత్రముకందుకూరి వీరేశలింగం పంతులుధనిష్ఠ నక్షత్రముతామర వ్యాధిహస్త నక్షత్రముత్రిష కృష్ణన్భారతదేశంలోని ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితాకేతిరెడ్డి పెద్దారెడ్డిశ్రీ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రముసలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్విజయశాంతిచిరంజీవిభాషా భాగాలుమండల ప్రజాపరిషత్పిఠాపురం శాసనసభ నియోజకవర్గంరాజ్యసభఆంధ్రప్రదేశ్‌లో 2024 భారత సార్వత్రిక ఎన్నికలుతెలంగాణా సాయుధ పోరాటంపురాణాలుదశరథుడురంగనాథస్వామి దేవాలయం (శ్రీరంగం)ఓజోన్ క్షీణతఆంధ్రప్రదేశ్ రాష్ట్రీయ చిహ్నాలు.సత్య సాయి బాబాలలితా సహస్ర నామములు- 201-300మరణానంతర కర్మలుబిల్లాతులారాశిషడ్రుచులుఅల్లు అర్జున్2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుభారతీయుడు (సినిమా)విశ్వనాథ సత్యనారాయణసిరికిం జెప్పడు (పద్యం)హృతిక్ రోషన్కల్వకుంట్ల తారక రామారావుగర్భాశయముబారసాలభారతీయ రిజర్వ్ బ్యాంక్భారత జాతీయ కాంగ్రెస్దేవదాసికోమటిరెడ్డి వెంకటరెడ్డిజాషువాశ్రీ కృష్ణదేవ రాయలునిశ్చితార్థంమహువా మోయిత్రాభారత రాజ్యాంగం - ప్రాథమిక హక్కులుఅంగచూషణప్రియమణికర్కట రేఖమహాభారతంఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్శ్రవణ నక్షత్రముఅష్ట దిక్కులుదశావతారములుమర్రిరమ్యకృష్ణగిరిబాబువేమనయూట్యూబ్పేర్ని వెంకటరామయ్యవిభక్తిదశదిశలుమృణాల్ ఠాకూర్సన్ రైజర్స్ హైదరాబాద్నరసింహ శతకమునక్షత్రం (జ్యోతిషం)ఆర్యవైశ్య కుల జాబితా🡆 More