వింధ్య పర్వతాలు: మధ్య భారతంలో ఉన్న పర్వతాలు

వింధ్య పర్వతాలు లేదా వింధ్య పర్వత శ్రేణి (ఆంగ్లం : Vindhya Range), (సంస్కృతం विन्‍ध्य ) పశ్చిమ మధ్య భారత ఉపఖండంలో గల పర్వతశ్రేణులు.

ఈ పర్వత శ్రేణులు ఉత్తరభారత్, దక్షిణ భారత్ విడదీస్తున్నాయి. ఇవి అతి ప్రాచీన ముడుత పర్వతా శ్రేణులు.

వింధ్య పర్వతాలు: పేరు వెనుక చరిత్ర, విస్తరణ, ఎత్తు
వింధ్య పర్వత శ్రేణులు

ఈ పర్వతశ్రేణులు ప్రధానంగా మధ్యప్రదేశ్లో గలవు. వీటి పశ్చిమ భాగాలు గుజరాత్ లోనికి తూర్పుభాగాలలో (గుజరాత్ ద్వీపకల్పంలో) చొచ్చుకుపోయి ఉన్నాయి. వీటి తూర్పు భాగాలు మిర్జాపూర్ వద్దగల గంగానది వరకూ వ్యాపించియున్నాయి.

వీటి దక్షిణ వాలులు నర్మదా నది, అరేబియా సముద్రం వరకూ వ్యాపించియున్నవి.

పేరు వెనుక చరిత్ర

అమరకోశం రచయిత చేసిన ఒక వ్యాఖ్యానం ఆధారంగా వింధ్య అనే పదానికి సంస్కృత పదం వింధ్ (అడ్డుకోవడం) మూలం అని భావిస్తున్నారు. ఒక పౌరాణిక కథలో (క్రింద చూడండి) వింధ్య ఒకసారి సూర్యుడు మార్గానికి ఆటంకంగా ఉందని వివరిస్తుంది. నిరంతరం పెరుగుతూ సూర్యుడి మార్గాన్ని అడ్డగిస్తున్న గొప్పపర్వతం అయిన వింధ్య అగస్త్యుడికి ఇచ్చిన మాటకు విధేయత చూపి ఆగిపోయిందని వాల్మీకి రామాయణం సూచిస్తుంది. మరొక సిద్ధాంతం ఆధారంగా సంస్కృతంలో "వింధ్య" అంటే "వేట" ఈ ప్రాంతంలో నివసించే గిరిజన వేట - సేకరణ విధానంలో జీవించిన వేటగాళ్ళు నివసించారు కనుక ఈ ప్రాంతానికి ఈ పేరు సూచించబడి ఉండవచ్చు.

వింధ్యపర్వత ప్రాంతాన్ని "వింధ్యాచల" లేదా "వింధ్యాచల్" అంటారు. అచల (సంస్కృతం), లేదా అచలే (హిందీ)అంటే చలించనిది అని అర్ధం. పర్వతం చలించనిది కనుక దీనికి అచలం అనే పేరును సూచిస్తుంది. మహాభారతంలో కూడా ఇది వింధ్యపర్వతంగా సూచించబడింది. గ్రీకు భౌగోళికశాస్త్రవేత్త టోలెమీ విధియస్ (ఔండియన్) వింధ్యపర్వతాలు నర్మదోస్ (నర్మదా), ననగౌండా (తపతి) నదులకు మూలంగా ఉన్నాయని అభివర్ణించాడు. కౌషితాకి వీటిని " దక్షిణపర్వత" ఉపనియాహద్ పేర్కొన్నాడు. వింధ్యపర్వతం ( "దక్షిణ మౌంటైన్") కూడా గుర్తించబడుతుంది.

విస్తరణ

వింధ్య భౌగోళికంగా విభిన్న పర్వతావళిగా విస్తరించి ఉంది. ఈ పర్వతావళిని సామూహికంగా వింధ్య అని పిలుస్తారు. వింధ్యపర్వతాలు నిజానికి పర్వత చీలికలతో, కొండలతో, పర్వతాలతో, పీఠభూములతో ఏర్పడిన పర్వతాల గొలుసు. "వింధ్య" అనే పేరుతో సాంప్రదాయకంగా పిలువబడుతుంది. వింధ్యపర్వతాల ఖచ్చితమైన ఎత్తు వివిధ సమయాలలో మారుతూ ఉంది.

చారిత్రక వివరణ

వింధ్య పర్వతాలు: పేరు వెనుక చరిత్ర, విస్తరణ, ఎత్తు 
వింధ్య శ్రేణి - మండవ్, మధ్యప్రదేశ్‌

గతంలో "వింధ్య" అనే పదం విస్తృత అర్ధంలో ఉపయోగించారు. ఇండో-గంగా మైదానాలు, దక్కన్ పీఠభూమి మధ్య కొండల సరిహద్దుగా భావించినట్లు పాత గ్రంధాలలో పేర్కొన్న వివిధ వివరణలు తెలియజేస్తున్నాయి. వింధ్యపర్వతాలు ఉత్తరంగా గంగా నుండి దక్షిణంగా గోదావరి వరకు విస్తరించాయి.

కొన్ని పురాణంలో ప్రత్యేకించి వింధ్య అనే పదం నర్మదా, తపతి నదుల మధ్య ఉన్న పర్వత శ్రేణిగా వివరించబడింది. ఇప్పుడు ఆప్రాంతం సాత్పూరా శ్రేణులు అని పిలువబడుతుంది. వరాహ పురాణం సాత్పురా శ్రేణిని వింధ్య అనే పదం ( "వింధ్య పాదాల") ఉపయోగించింది.

అనేక పురాతన భారతీయ గ్రంథాలు, శాసనాలు (ఉదాహరణకు గౌతమీపుత్ర శాతకర్ణి (నాసిక్ ప్రశాంతి)) మద్య భారతదేశాన్ని వింధ్య, క్సా (క్సావత్ లేదా రిక్షా), పరియాత్ర (పరిపత్ర)లో అనే మూడు పర్వత శ్రేణులుగా పేర్కొన్నాడు. మూడు శ్రేణుల ప్రాంతం భరతవర్షగా పిలువడింది. అనగా ఇవి ఏడు కుల పర్వతాల ( "క్లాన్ పర్వతాలు") లో చేర్చబడ్డాయి భారతదేశం. ఈ మూడు శ్రేణుల ఖచ్చితమైన గుర్తింపు కారణంగా పలు వివరణలో వైవిధ్యం లేదు . ఉదాహరణకు కూర్మ, మత్స్య, వింధ్య బ్రహ్మాండ పురాణాలు తపతినది మూలంగా ఈ పర్వతాలను పేర్కొన్నాయి; బ్రహ్మా, విష్ణు పురాణాలలో అయితే దాని మూలంగా క్సా పేర్కొనబడలేదు. కొన్ని పురాణ గ్రంధాలు భారతదేశం కేంద్రంలో వింధ్యపర్వతాలు ఉన్నట్లు పేర్కొన్నాయి.

వాల్మీకి రామాయణం ప్రస్తుత కర్ణాటక భూభాగాన్ని వింధ్యగా వివరించింది. ఇందులో వింధ్య కిష్కిందకు దక్షిణాన (రామాయణ 4-46. 17)ఉన్నట్లు పేర్కొన్నది. వింధ్యపర్వతాలకు దక్షిణంగా విస్తరించిన సముద్రంలో లంక ఉన్నట్లు పేర్కొకొన్నది. చాలా మంది మేధావులు వివిధ మార్గాలలో ఈ సిద్ధాంతాన్ని వివరించడానికి ప్రయత్నించారు. ఒక సిద్ధాంతం రామాయణం వ్రాసిన సమయంలో వింధ్యపర్వతప్రాంతాలు ఇండో-ఆర్యన్ ప్రజలనివాసిత ప్రాంతంగా వివరించబడింది. ఫ్రెడెరిక్ ఈడెన్, ఫార్గిటార్ వంటి ఇతరులు అదే పేరోతో దక్షిణ భారతదేశంలో మరో పర్వతం ఉందని అని విశ్వసిస్తున్నారు. మాధవ్ వినాయక్ కైబ్ మద్యభారతదేశంలో లంక ఉన్నట్లు సూచించాడు.

బరాబర్ మౌఖారి అనంతవర్మన్ శాసనం బీహార్ నాగార్జున కొండను వింధ్యపర్వతశ్రేణిలో ఒక భాగంగా పేర్కొన్నాడు.

ప్రస్తుతకాల వివరణ

వింధ్య పర్వతాలు: పేరు వెనుక చరిత్ర, విస్తరణ, ఎత్తు 
భారతదేశంలోని ప్రముఖ పర్వత శ్రేణుల మ్యాప్, మధ్య భారతదేశంలోని వింధ్య పర్వతాలను చూడవచ్చు

వింధ్య ప్రధానంగా నర్మదా నది ఉత్తరాన ఉన్న మద్యభారత పర్వతశ్రేణులకు, కొండలు, పర్వతాలకు నెలవై ఉంది. వీటిలో కొన్ని ప్రత్యేకమైన కొండలశ్రేణిగా ఉన్నాయి.


వింధ్యపర్వతశ్రేణి పశ్చిమం నుండి తూర్పుగా రాజస్థాన్, మధ్యప్రదేశ్ గుజరాత్ రాష్ట్రం సరిహద్దు వరకు విస్తరించి ఉంది. కొండల శ్రేణి చంపానెస్ సమీపంలోని ఆరావళి పర్వతశ్రేణి వరకు వింధ్య విస్తరించింది. వింధ్యపర్వతశ్రేణి ఎత్తు చోటా ఉదయపూర్ తూర్పున శిఖరాగ్రానికి చేరుకుంటుంది.

ప్రధాన వింధ్యపర్వతశ్రేణి మద్యభారతంలో దక్షిణంగా ఎత్తైన ఏటవాలు ఏర్పరుస్తుంది. ఇది సుమారు మధ్యప్రదేశులో నర్మదానదికి సమంతరంగా తూర్పు-పడమర దిశలో మాల్వా పీఠభూమి, దక్షిణ కుడ్యగా విస్తరించింది.

వింధ్యతూర్పు భాగం పలు పర్వతశ్రేణులుగా విభజితమై ఉంది. అమరకాంతక్ సమీపంలో మైకల్ కొండలలో సాత్పురా శ్రేణి సంగమిస్తున్న, సాన్,నర్మదా నదుల సంగమస్థానానికి ఎగువన వింధ్య ఒక దక్షిణ శ్రేణి విస్తరించి ఉంది. ఉత్తర పర్వతశ్రేణి వింధ్య పీఠభూమి, భాండర్ పీఠభూమి, కైమూర్ పర్వతశ్రేణి పేర్లతో సాన్ నది ఉత్తరంగా విస్తరించి ఉంది. ఈ విస్తృత శ్రేణి బీహారులోని కైమూర్ జిల్లా వరకు విస్తరించి ఉంది. బుందేల్ఖండు అంతటా వింధ్యపర్వతశ్రేణి విస్తరించి ఉంది. ఉత్తరంగా విస్తరించిన వింధ్యాచల్, చునార్ (మిర్జాపూర్ జిల్లా), వారణాసి సమీపంలో పలుప్రాంతాలలో విస్తరించి ఉంది.

విధ్య పీఠభూమి ఈ పర్వతశ్రేణి కేంద్రభాగానికి ఉత్తరంగా విస్తరించి ఉంది. రేవా-పన్నే పీఠమూమి కూడా సమిష్టిగా వింధ్య పీఠభూమిగా పిలువబడింది.

ఎత్తు

వింధ్యపర్వతాల ఎత్తు గురించి వైవిధ్యమైన వివిధ మూలాలు ఉన్నాయి. ఎం.సి చతుర్వేది సరాసరి ఎత్తు 300 మీటర్ల ఉన్నట్లుగా పేర్కొన్నాడు. ప్రదీప్ శర్మ వింధ్య "సరాసరి ఎత్తు" 350-650 ఉంటుందని సూచించాడు. 1200 కిలోమీటర్ల ప్రాంతంలో ఎత్తు 700 మీటర్లకు చేరుకుంటుందని పేర్కొన్నాడు.

సముద్ర మట్టానికి 2,467 అడుగులు (752 మీ) ఎత్తులో ఉన్న సద్భావనా శిఖరం (గుడ్ విల్ పీక్) విధ్యపర్వతశ్రేణిలో అత్యంత ఎత్తైన ప్రాంతంగా భావిస్తున్నారు. అలాగే సింగ్రామపూర్ సమీపంలో ఉన్న కలుమార్ కలుంబె శిఖరాన్ని ఈ ప్రాంతంలోని ప్రజలు భాన్రర్ (లేక పన్నా) కొండలు అని పిలుస్తారు. చారిత్రక గ్రంధాలు వింధ్యలో ఉన్నట్లు పేర్కొన్న అమరకాంతక్ (1000 మీ) శిఖరం ప్రస్తుతం సాత్పూరా పొడిగింపుగా పరిగణించబడుతుంది. ఇది మైఖేల్ శ్రేణిలో ఒక భాగంగా పరిగణిస్తారు.

భీంబేట్కా వద్ద వింధ్య పర్వతాలు

సంస్కృతి

వింధ్య పర్వతాలు: పేరు వెనుక చరిత్ర, విస్తరణ, ఎత్తు 
ఆర్యావత్రానికి దక్షిణ సరిహద్దుగా ఉన్న విధ్యపర్వతాల భౌగోళిక వివరణా చిత్రం

వింధ్యపర్వతశ్రేణిని ఉత్తర, దక్షిణ భారతదేశం మధ్య భారతీయసాంప్రదాయ భౌగోళిక సరిహద్దుగా భావిస్తారు. భారతదేశంలోని పురాణాలలో భౌగోళికంగానూ రెండింటిలోనూ వింధ్యపర్వతాలు ప్రముఖ స్థానం కలిగి ఉంది. ప్రాచీన భారతీయ గ్రంధాలలో వింధ్య ఇండో-ఆర్యన్ భూభాగాల మధ్య నిర్మించని సరిహద్దుగా పరిగణిస్తారు. అత్యంత పురాతన హిందూ మతం రచనలలో ఆర్యావతానికి దక్షిణ సరిహద్దు భావిస్తారు.వింధ్యపర్వతశ్రేణులలోని అరణ్యాలలో నిషాదులు, ఇతర మ్లేచ్చతెగలు వంటి ఆటవీ తెగలకు చెందిన ప్రజలు నివసించారని మహాభారతంలో పేర్కొనబడింది. తరువాత మరాఠీ, కొంకణి వంటి భాషలు విస్తరించిన కాలంలో ఇండో-ఆర్యన్ భాషలు వింధ్య దక్షిణాన విస్తరించాయి. ఉత్తర, దక్షిణ భారత దేశాల మధ్య సాంప్రదాయ సరిహద్దులో ఈ భాషల ఉనికిని చూడవచ్చు.

విధ్యపర్వతాలు భారత పౌరాణిక కథలలో ప్రస్పుటంగా కనిపిస్తాయి. వింధ్యపర్వతాలు చాలా ఎత్తైనవి కానప్పటికీ చారిత్రాత్మకంగా దట్టమైన అరణ్యాలు, నూతనవ్యక్తుల మీద దాడిచేసి చంపే ప్రమాదకరమైన ఆటవీ తెగల ప్రజలకు అవి నివాసితప్రాంతాలుగా ఉన్న కారణంగా అవి సాధారణ ప్రజలు చేరుకోలేని ప్రమాదకరమైన ప్రదేశాలుగా ఉండేవి. రామాయణం వంటి పాత సంస్కృత రచనలలో అవి నరమాంస భక్షకులు, రాక్షసుల స్థావరాలుగా వర్ణించబడ్డాయి. తరువాత రచనలు రాక్షసులను సంహారం చేసిన శక్తి (దేవత కాళి లేదా దుర్గ)నివాసప్రాంతంగా విధ్యపర్వతప్రాంతాలను వర్ణించాయి. ఆమె వింధ్యవాసినిగా వర్ణించబడింది. విధ్యపర్వత ప్రాంతంలోని ఉజ్జయినిలో ఆమె కొరకు అంకితం చేయబడిన ఆలయం నిర్మించబడింది. మహాభారతం వింధ్యపర్వతప్రాంతం కాళి "శాశ్వతమైన నివాసం" గా పేర్కొన్నది.

ఒక పురాణంలో వింధ్య పర్వతం ఒకసారి మేరు పర్వతంతో పోటీగా సూర్యునికి ఆటంకంగా పెరుగుతున్నట్లు వర్ణించబడింది. తరువాత మునీశ్వరుడైన అగస్త్యుడు దక్షిణదేశంలో ప్రయాణించడానికి మార్గం సులభతరం చేయటానికి పెరగడం ఆపమని వింధ్యపర్వతాన్ని కోరాడు. అగస్త్యుడు పట్ల ఉన్న గౌరవం కారణంగా వింధ్య దాని ఎత్తు తగ్గించి అగస్త్యుడు ఉత్తరప్రాంతానికి తిరిగి వెళ్ళేవరకు పెరగడం ఆపివేస్తానని వాగ్దానం చేసింది. అగస్త్యుడు దక్షిణప్రాంతంలో స్థిరపడ్డారు. వింధ్య పర్వతాలు ఇచ్చినమాటను నిలుపుకుంటూ తిరిగి మరింత ఎదుగలేదు.వాల్మీకి రామాయణ కిష్కిందకాండలో మయాసురుడు వింధ్యలో ఒక ఇంటిని నిర్మించినట్లు పేర్కొనబడింది. దక్షకుమారచరిత్ర మగధ రాజు రాజహంస ఆయన మంత్రులు యుద్ధంలో పరాజయం పొందిన తరువాత వారి రాజ్యం నుండి బలవంతంగా పంపబడిన తరువాత వింధ్యపర్వత అడవిలో ఒక కొత్త కాలనీ సృష్టించాడని పేర్కొన్నది.

వింధ్య పర్వతాలు: పేరు వెనుక చరిత్ర, విస్తరణ, ఎత్తు 
భారతదేశం జియోలాజికల్ సర్వే నుండి వింధ్యపర్వతావళి పటం (1871)

భారతదేశం జాతీయ గీతంలో పేర్కొన్న రెండు పర్వత శ్రేణులలో హిమాలయాల పర్వతాలతో వింధ్యపర్వతం కూడా చేర్చబడింది.

నదులు

గంగా-యమునా వ్యవస్థలోని అనేక ఉపనదులు వింధ్య నుండి ఉద్భవించి గంగానదిలో సంగమిస్తున్నాయి. వీటిలో చంబల్, బెత్వా, ధాసన్, కెన్, దంసా, కాళి సింధు, ప్రభాతి నదులు ఉన్నాయి. వింధ్య ఉత్తర వాలులో ప్రవహిస్తూ ఈ నదులు ప్రజావసారాలకు తగినంత నీటిని సరఫరా చేస్తున్నాయి.

నర్మదా, సాన్ నదులు వింధ్య దక్షిణ వాలులో ప్రవహిస్తున్నాయి. ఈ రెండు నదులు ఇప్పుడు సాత్పూరా విస్తరణగా గుర్తించబడుతున్న మైఖల్ కొండలలో జన్మించాయని భావిస్తున్నారు. అయినప్పటికీ పాత రచనలు ఈ ప్రాంతాన్ని వింధ్యాపర్వతప్రాంతంగా పేర్కొంటున్నాయి.

భౌగోళికం

" విధ్యన్ సూపర్ గ్రూఫ్ " ప్రపంచంలో అతిపెద్ద, దట్టమైన సెడిమెంటరీ సక్సెషనుగా గుర్తించబడుతుంది.

విధ్యపర్వతాలలో ప్రాంరభకాలంలో కనుగొనబడిన బహుకణ శిలాజం యుకర్యోటె (ఫిలమెంటస్ ఆల్గే) 1.6 బిలియన్ సంవత్సరాల పూర్వం ఏర్పడిందని భావించబడుతుంది. జీవ ఆవిర్భావంలో భాగంగా నమోదుచేయబడిన షెల్డ్ ప్రాణులు 550 మిలియన్ల సంవత్సరాల పూర్వకాలానికి చెందినవని భావిస్తున్నారు.

ఇవీ చూడండి

మూలాలు

బయటి లింకులు

24°37′N 82°00′E / 24.617°N 82.000°E / 24.617; 82.000

Tags:

వింధ్య పర్వతాలు పేరు వెనుక చరిత్రవింధ్య పర్వతాలు విస్తరణవింధ్య పర్వతాలు ఎత్తువింధ్య పర్వతాలు సంస్కృతివింధ్య పర్వతాలు నదులువింధ్య పర్వతాలు భౌగోళికంవింధ్య పర్వతాలు ఇవీ చూడండివింధ్య పర్వతాలు మూలాలువింధ్య పర్వతాలు బయటి లింకులువింధ్య పర్వతాలుen:Vindhya Rangeఆంగ్లంసంస్కృతం

🔥 Trending searches on Wiki తెలుగు:

మహాభారతంశతభిష నక్షత్రమురాజనీతి శాస్త్రముమహాభాగవతంమహామృత్యుంజయ మంత్రంమామిడికరోనా వైరస్ 2019తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలువిశ్వనాథ సత్యనారాయణమెరుపువెబ్‌సైటుభలే మంచి రోజుస్టూడెంట్ నంబర్ 1ఋతువులు (భారతీయ కాలం)తిరుమల శ్రీవారి ఆభరణాలువర్ధమాన మహావీరుడుభారతదేశంలో సెక్యులరిజంనరేంద్ర మోదీఆల్ఫోన్సో మామిడిరామాయణంవంగవీటి రంగాసత్తెనపల్లి శాసనసభ నియోజకవర్గంఅయలాన్కల్లుపంచభూతాలుశుభ్‌మ‌న్ గిల్పొంగూరు నారాయణసాక్షి (దినపత్రిక)నవధాన్యాలుఫిరోజ్ గాంధీమారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డిచంద్రయాన్-3పార్లమెంటు సభ్యుడుధరిత్రి దినోత్సవంతోట త్రిమూర్తులురజాకార్లుదశావతారములుసజ్జా తేజకొండా విశ్వేశ్వర్ రెడ్డివిశ్వనాథ సత్యనారాయణ రచనల జాబితారక్తపోటుహైదరాబాదు మెట్రో స్టేషన్ల జాబితాఓం భీమ్ బుష్ఏలూరు లోక్‌సభ నియోజకవర్గంనాగ్ అశ్విన్అక్కినేని అఖిల్ఎస్. జానకిహనుమంతుడుగంజాయి మొక్కతిరుమల చరిత్రఋగ్వేదంఅక్కినేని నాగార్జుననరసింహ శతకముశ్రీకాళహస్తీశ్వర దేవస్థానంభగత్ సింగ్పి.సుశీలసెక్యులరిజంనరసింహ (సినిమా)కురుక్షేత్ర సంగ్రామంఅమ్మశుభాకాంక్షలు (సినిమా)కిరణజన్య సంయోగ క్రియకార్తెచంద్రుడు జ్యోతిషంపూరీ జగన్నాథ దేవాలయంప్రీతీ జింటామన ఊరు - మన బడి (పథకం)సిద్ధు జొన్నలగడ్డజాతీయ అర్హత, ప్రవేశ పరీక్షజొన్నలగడ్డ సత్యనారాయణమూర్తిశ్రీ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రముఉత్పలమాలకలువదుబాయ్భారత రాజ్యాంగం - ఆదేశిక సూత్రాలుభారత జాతీయగీతంవిభక్తిఅగ్నికులక్షత్రియులు🡆 More