మోల్డోవా

మోల్డోవా /mɒlˈdoʊvə/ (help·info), అధికారకంగా రిపబ్లిక్ అఫ్ మోల్డోవా అని పిలవబడే ఈ దేశం, తూర్పు ఐరోపా లోని భూపరివేష్టిత దేశం.

ఈ దేశము పశ్చిమలో రోమేనియా కు , ఉత్తరము, తూర్పు, దక్షిణములో ఉక్రెయిన్ కు మధ్యలో ఉంది. సోవియట్ యూనియన్ రద్ధయినప్పుడు, 1991లో అప్పుడు ఉన్న మోల్దోవన్ SSR కు ఉన్న అదే సరిహద్దులతో మాల్డోవ ఒక స్వతంత్ర దేశముగా తనకు తానుగా ప్రకటించుకున్నది. అంతర్జాతీయంగా గుర్తించబడిన మోల్డోవా లోని డ్నిస్టర్ నదికి తూర్పు తీరములో ఉన్న ఒక ప్రదేశం, 1990 నుండి విడిపోయిన ట్రాన్స్నిస్ట్రియ ప్రభుత్వ అధీనంలో ఉంది.

మొల్దోవా రిపబ్లిక్
Republic of Moldova
Flag of Moldova Coat of arms of Moldova
Anthem

Location of Moldova
Location of Moldova
ఐరోపా ఖండంలో (green + dark grey)
మొల్దోవా స్థానం(green)
రాజధానిచిసినావ్
47°0′N 28°55′E / 47.000°N 28.917°E / 47.000; 28.917
Largest city రాజధాని
Official languages మోల్దోవన్, రోమేనియన్
ప్రాంతీయ భాషలు Gagauz, రష్యన్, ఉక్రేనియన్ and బల్గేరియన్
Demonym మోల్దోవన్, మొల్దావియన్
ప్రభుత్వం Parliamentary republic
 -  అధ్యక్షుడు Mihai Ghimpu
 -  ప్రధాన మంత్రి
 -  Speaker of the Parliament
ఏకీకరణ
 -  సార్వభౌమాధికార ప్రకటన 1990 జూన్ 23 
 -  సోవియట్ యూనియన్ నుండి స్వాతంత్ర్య ప్రకటన
1991 ఆగస్టు 272 
Area
 -  Total 33,846 km² (139th)
13,067 sq mi 
 -  Water (%) 1.4
జనాభా
 -  January 1, 2009 estimate 3,567,500 (does not include Transnistria and Bender) (129st3)
 -  2004 census 3,383,3324 
 -  జనసాంద్రత 121,9/km² (87th)
316/sq mi
జి.డి.పి. (పి.పి.పి.) 2009 estimate
 -  Total $10.141 billion 
 -  Per capita $2,842 
జి.డి.పి. (nominal) 2009 estimate
 -  Total $5.403 billion 
 -  Per capita $1,514 
Gini? (2007) 37.1 (medium
మానవ అభివృద్ధి సూచిక (2007) Increase 0.708 (medium) (111th)
కరెన్సీ Moldovan leu (MDL)
టైమ్ జోన్ EET (యు.టి.సి.+2)
 -  Summer (డి.ఎస్.టి.) EEST (యు.టి.సి.+3)
Internet TLD .md
Calling code [[+373]]
1 "Moldovan" used as formal official name; in fact Romanian.
2 Proclaimed. Finalized along with the dissolution of the USSR in December 1991.
3 Ranking based on 2009 UN figure
4 2004 census data from the National Bureau of Statistics. Figure does not include Transnistria and Bender.

ఈ దేశము శాసనసభా ప్రజాస్వామ్యాన్ని పాటిస్తుంది. దేశ అధిపతిగా రాష్ట్రపతి ఉంటే, ప్రభుత్వ అధిపతిగా ప్రధాన మంత్రి ఉంటారు. యునైటడ్ నేషన్స్, కౌన్సిల్ అఫ్ యూరోప్, WTఒ, OSCE, GUAM, CIS, BSE , ఇతర అంతర్జాతీయ సంస్థలల మాల్డోవ సభ్య దేశముగా ఉంది. ప్రస్తుతం మోల్డోవా యురోపియన్ యూనియన్లో సభ్యత్వం కొరకు ప్రయత్నిస్తూ ఉంది. యూరోపియన్ పరిసరాలకు సంబంధించిన పాలసీ (ENP) కు అనుగుణంగా మోల్డోవా మొదటి మూడు-సంవత్సరాల కార్యాచరణని అమలు చేసింది.

దేశ జనాభాలో నాల్గవ భాగం మంది జనం రోజుకు US$2 కంటే తక్కువ తోనే జీవిస్తున్నారు.

పద చరిత్ర

మాల్డోవా అనబడు పేరు మాల్డోవా నది యొక్క పేరు నుండి గ్రహించబడింది.ఈ నది యొక్క లోయ ప్రాంతము మాల్డేవియా ప్రిన్సిపాలిటీ 1359 లో స్థాపించబడినప్పుడు దాని యొక్క రాజకీయ కేంద్రముగా భాసిల్లింది. ఆ నది పేరు యొక్క మూలము ఇంకా పూర్తిగా వివరంగా తెలియదు. ఆరోక్స్ ను వేటాడిన తరువాత రాజకుమారుడు డ్రాగోస్ ఆ నదికి ఆ పేరును పెట్టినట్లు ఒక పౌరాణిక కథలో చెపుతారు. వేటాడి అలసిపోయిన అతని వేట కుక్క మోల్డా ఆ నదిలో మునిగిపోయిందని చెపుతారు. ఆ కుక్క పేరు ఆ నదికి పెట్టబడి ఉంటుంది. దానినే ప్రిన్సిపాలిటీకి కూడా అన్వయించి ఉంటారని డిమిట్రీ కాన్టమిర్ , గ్రిగోర్ ఉరేక్‌ల ఉద్ద్యేశం.

చరిత్ర

నియోలితిక్ రాతి యుగంలో మోల్డోవా సంస్థానం విస్తారమైన కుకుటేని-ట్రిపిల్లియన్ సంస్కృతికి కేంద్రంగా ఉండేది. ఈ సంస్కృతి తూర్పున యూక్రైన్ లోని డ్నీస్టర్ నదికి ఆవలి వైపు నుండి పశ్చిమాన రొమేనియాలోని కార్పాతియన్ పర్వతాలదాక ఇంకా అవతలకు కూడా వ్యాపించి ఉంది. సుమారుగా 5500 నుండి 2750 BC వరకు నెలకొన్న ఈ నాగరిక జనము వ్యవసాయం, పశుసంపదను సాకటం, వేటాడడం , నిశితంగా రూపొందించబడిన కుండల తయారి వంటి పనులు చేసేవారు. అతి పెద్ద స్థావరాలు నిర్మించబడటం ఈ నాగరికతలో మరొక అధ్బుత విషయం. కొన్ని స్థావరాలలో, 15,000 కంటే ఎక్కువ మంది నివసించేవారు.

పురాతనత్వము లో, మోల్డోవా ప్రాంతంలో డేసియన్ తెగలకు చెందినవారు నివసించేవారు. AD 1వ , 7వ శతాబ్దాల మధ్యకాలములో దక్షిణ భాగము అప్పుడప్పుడు రోమన్‌ ల క్రింద తరువాత బైజాంటైన్ రాజ్యా ల క్రింద ఉండేది. ఆసియా, ఐరోపా మధ్య దారిలో ముఖ్యమైన ప్రాంతము అయినందువలన, యాంటిక్విటి కాలము ఆఖరిలో , మధ్య యుగము యొక్క ప్రారంభములో ఆధునిక మోల్డోవా మీద అనేక సార్లు దాడి జరిగింది. గొత్,హన్, అవర్, మగ్యర్, పెచేనేగ్, క్యుమన్, మొంగోల్స్ వారు దాడి చేసినవారిలో ఉన్నారు.

1359లో ప్రిన్సిపాలిటి అఫ్ మొల్డావియ ఏర్పడిన తరువాత కూడా, టాటార్ ఆక్రమణలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రిన్సిపాలిటి అఫ్ మొల్డావియకు పశ్చిమములో కార్పాతియన్ పర్వతాలు, తూర్పులో డ్నియస్టర్ నది, దక్షిణములో డానుబే, నల్ల సముద్రం సరిహద్దులు. దీని భూభాగంలో ప్రస్తుతం ఉన్న రిపబ్లిక్ అఫ్ మోల్డోవా, 41 రోమానియా లోని కౌంటీలలో తూర్పున ఉన్న 8 , ఉక్రెయిన్ లోని చేర్నివ్ట్సి ఒబ్లాస్ట్ , బుడ్జక్ ప్రదేశాలు ఉండేవి. ప్రస్తుతం ఉన్న గణతంత్రములాగే, దీనిని స్థానికులు మోల్డోవా అని పిలిచేవారు. 1538లో, ఈ ప్రిన్సిపాలిటి, ఒట్టోమన్ రాజ్యంలో ఉపభూభాగముగా అయింది. అయితే అంతర్గత , పాక్షికమగు బాహ్య సర్వస్వతంత్రతను మిగుల్చుకుంది.

మోల్డోవా 
1457 - 1504 మధ్య కాలములో మోల్దవియా యువరాజుగా ఉన్న స్టీఫన్ ది గ్రేట్ ను ప్రదర్శిస్తున్న చర్చి ఫ్రెస్కో. ఇతను మోల్దావియలో అతి ప్రాముఖ్యత చారిత్రాత్మిక వ్యక్తి.
మోల్డోవా 
1483లో మోల్దవియన్ ప్రిన్సిపాలిటి
మోల్డోవా 
పూర్వపు జినోవన్ కోట అయిన ఒలిహోనియా (అల్సోనియా) యొక్క స్థలములో సోరొక నిర్మితమయింది.
మోల్డోవా 
మోల్దవియా లోని మధ్య యుగవు ప్రిన్సిపాలిటీలోని భూభాగాలు ప్రస్తుతం రొమేనియా (పశ్చిమ మోల్దేవియాతో దక్షిణ బ్యుకోవినా)- నీలి రంగులో, మోల్డోవా (బెస్సరేబియా కేంద్ర ప్రాంతము)-ఆకు పచ్చలో , యూక్రైన్ (దక్షిణ బెస్సరేబియా , చేర్న్విస్టి ఓబ్లాస్ట్)-ఎరుపులో మధ్య విభజించబడింది.
మోల్డోవా 
మోల్దావియా లోని కాప్రియానా అత్యంత పురాతనమైన మోనాస్ట్రీలలో ఒకటి
మోల్డోవా 
1990 ఏప్రిల్ 27 న ఒక ఉపాధికారి సోవియట్ ఝండాకు బదులుగా జాతీయ పతాకాన్ని శాసనసభ మీద పెట్టారు.
మోల్డోవా 
డౌన్ టౌన్ చిసినాలో ఉన్న st.టియోడోరా డి లా సిహ్లా చర్చ్

1812లో ఒట్టోమన్ రాజ్యానికి (దీంట్లో మోల్దోవియ ఒక సామంత రాజ్యం) రష్యన్ రాజ్యానికి మధ్య కుదిరిన బుచారెస్ట్ ఒప్పందం ప్రకారం, ఒట్టోమన్ రాజ్యము, ప్రిన్సిపాలిటి అఫ్ మోల్డావియ కు తూర్పులో ఉన్న సగభాగాన్ని , ఖోటైన్, పాతనాటి బెస్సరబియ (ప్రస్తుతం బుడ్జాక్) ప్రదేశాలని, మోల్దావియన్ లు నిరసన వ్యక్తపరిచినప్పటికీ, రష్యన్ రాజ్యానికి, అప్పగించేసింది.

మొదట్లో, రష్యన్ లు "ఒబ్లాస్ట్ అఫ్ మోల్దవియా , బెస్సరెబియా" అనే పేరుని వాడి, ఎక్కువ స్వయంప్రతిపత్తి కలుగచేశారు. కాని తరువాత (1828లో), స్వయంప్రతిపత్తిని నిలిపివేసి, దీనిని గూబర్నియ అఫ్ బెస్సరబియా లేదా కేవలం బెస్సరెబియా అని పిలిచారు. ఈ విధముగా, రష్యీకరణ మొదలయింది.

బెస్సరేబియాలో పాటించిన జార్ విధానాలకు కొంత వరకు కారణము, రోమేనియన్ జాతీయ వ్యవహారాలని సమానపరచడము. 1860ల అనంతరం రోమేనియన్ భాషలో విద్య , మత ప్రార్థనలను నిషేధించారు; దీని మూలాన, అక్షరాస్యత శాతం బాగా తగ్గిపోయింది (1897లో పురుషులలో సుమారు 18% , మహిళలలో 4%).

మోల్డావియ యొక్క పశ్చిమ ప్రాంతం (ప్రస్తుత మోల్డవలో భాగం కాదు) స్వయంప్రతిపత్తి కలిగి ఉండి, 1859లో వాల్లాచియతో ఐక్యమై, రోమేనియా రాజ్యం స్థాపించబడింది.

పారిస్ ఒప్పందం (1856) అనంతరం, బెస్సర్బియకు చెందిన మూడు కౌంటీలు -కహుల్, బోల్గ్రాడ్, ఇస్మాయిల్ - తిరిగి మోల్దేవియా కలిశాయి. కాని బెర్లిన్ ఒప్పొంధం (1878) ప్రకారం, రోమేనియా రాజ్యం వీటిని రష్యన్ రాజ్యానికి తిరిగి ఇచ్చేసింది. 19వ శతాబ్ద సమయములో, రష్యన్ అధికారులు కొన్ని ప్రాంతాలలో ఇతర ప్రాంత వాసులు ఆక్రమించి స్థిరపడే విధముగా ప్రోత్సాహించారు. ముఖ్యంగా ఉక్రైనియన్ లు, లిపోవన్ ల, కొస్సాక్ లు, బల్గేరియన్ లు, జర్మన్ లు, గగుజ్ లు ఈ విధముగా ఈ ప్రాంతములో స్థిరపడ్డారు. యూదులు ఇక్కడ స్థిరపడటానికి కూడా అనుమతించారు; దీని వల్ల మోల్దోవన్ ల జనాభా 1816లో 86% నుండి 1905లో 52% కు తగ్గింది.

20వ శతాబ్దం

మొదటి ప్రపంచ యుద్ధం రాజకీయంగా , సాంస్కృతికముగానూ జాతీయత గురించి స్థానికులలో అవగాహన కలిగించటంతో, 300,000 బెస్సారబియన్లు 1917 లో ఏర్పరచబడిన రష్యా సైన్యంలో నియుక్తులయారు.పెద్ద విభాగాలలో పలు "మోల్డివియన్ సైనికుల కమిటీలు" ఏర్పాటు చేయబడినాయి. 1917 లో జరిగిన రష్యా విప్లవము తరువాత అక్టోబరు-నవంబరు 1917 లో ఎన్నుకోబడి, ఆవిష్కరించబడిన December 3 [O.S. November 21] 1917, ఒక బెస్సరేబియాన్ శాసనసభ స్ఫటుల్ టార్లి, ఫెడరల్ రష్యా రాష్ట్రంలో మోల్దావియాన్ ప్రజాస్వామ్యపు గణతంత్రంగా (December 15 [O.S. December 2] 1917) ప్రకటించుకుని ప్రభుత్వాన్ని (December 21 [O.S. December 8] 1917) ఏర్పాటు చేసింది.

1917 లో రష్యా సామ్రాజ్యం విచ్ఛిన్నం అయిపోయాక, ఒక స్వయం ప్రతిపత్తి , స్వతంత్రత కలిగిన మోల్డివియన్ డెమోక్రటిక్ రిపబ్లిక్ ఏర్పరచబడింది.ఈ రిపబ్లిక్ గ్రేటర్ రొమేనియాలో 1918 లో విలీనం అయింది. 1940లో సోవియట్ యూనియన్ బెస్సరేబియాని ఆక్రమించి ఉక్రేనియన్ SSR క్రొత్తగా ఏర్పరిచిన మోల్దేవియాన్ SSR మధ్య విభజించబడింది. రెండవ ప్రపంచ యుద్ధ సమయములో 1941 , 1944 లలో చేతులు మారిన తరువాత, ఆధునిక దేశము యొక్క ప్రాంతాలు సోవియట్ యూనియన్ క్రిందకు వచ్చింది. తరువాత 1991 ఆగస్టు 27 నాడు ఈ దేశానికి స్వాతంత్రం వచ్చింది. మోల్డోవా యునైటెడ్ నేషన్స్లో మార్చి 1992లో చేరింది.

బెస్సరేబియా రష్యా నుండి స్వాతంత్రం ప్రకటించింది. నాడు బోల్షేవిక్ ఆక్రమణ ప్రయత్నాన్ని త్రిప్పికొట్టడానికి జనవరి ప్రారంభములో ఈ ప్రదేశములో ప్రవేశించిన రోమేనియన్ సైన్యం సమక్షములో స్ఫటుల్ టారి రోమేనియా రాజ్యంతో విలీనం కావటానికి నిర్ణయించింది. దీనికి అనుకూలంగా 86 ఓటులు రాగా, వ్యతిరేకంగా 3 ఓటులు రాగా, 36 మంది బహిష్కరించారు. అయితే రోమేనియాతో విలీనం కావడానికి కొన్ని షరతులు విధించింది. అవి, వ్యవసాయ సంస్కరణలు, స్థానిక స్వయంపతిపత్తి, సార్వజనిక మానవ హక్కులను పాటించడం. బుకోవిన, ట్రాన్సిల్వానియ కూడా రోమేనియా రాజ్యంలో విలీనం కావటంతో, ఈ షరతులు ఉపసంహరించుకోబడ్డాయి.

ప్రధాన అలైడ్ శక్తులు పారిస్ ఒప్పంధం (1920)లో ఈ విలీనానికి గుర్తింపు ఇచ్చాయి. కాని క్రొత్తగా ఏర్పడిన కమ్యునిస్ట్ రష్యా బెస్సరేబియా మీద రోమేనియా పాలనకు గుర్తింపు ఇవ్వలేదు. మే 1919లో బెస్సరేబియన్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్ ని దేశము బయట ఉన్న బహిష్కరించబడిన ప్రభుత్వముగా ప్రకటించింది. 1924లో జరిగిన టాటార్బ్యునరి అప్రైసింగ్ విఫలమయిన తరువాత మోల్డవియన్ ASSR స్థాపించబడింది.

ఆగస్టు 1939లో మోలోటోవ్-రిబ్బెంట్రోప్ పాక్ట్ , దానియొక్క రహస్య అదనపు ప్రోటోకోల్ సంతకం చేయబడ్డాయి. దీని ప్రకారం, బెస్సరేబియా సోవియట్ ప్రభావిత ప్రాంతమని నాజి జర్మనీ గుర్తించడంతో, సోవియట్ యూనియన్ ఈ ప్రాంతం మీద తన హక్కుని మరల సాధించుకోవటానికి ప్రయత్నించింది. 1928 నాటి కేల్లోగ్-బ్రియండ్ ఒప్పందం, జూలై 1933 నాటి లండన్ ఒప్పందం ప్రకారం USSR, రోమేనియా ఇరు దేశాలు తమ మధ్య భూభాగాల గురించి ఏర్పడే వివాదాలని శాంతియుతంగా పరిష్కరించుకుంటామని ఒప్పుకున్నప్పటికీ, 1940 జూన్ 28 నాడు, రోమేనియాకు ఒక తుది హెచ్చరిక జారి చేసిన అనంతరం, నాజి జర్మనీ నైతిక సహాయంతో, బెస్సరేబియా , బుకోవిన యొక్క ఉత్తర ప్రాంతాలని సోవియట్ యూనియన్ ఆక్రమించి, మోల్డావియన్ SSR, ను స్థాపించింది. దీంట్లో బెస్సరేబియాలో సుమారు 70% భాగము, ఇప్పుడు లేని మోల్డావియన్ ASSR లో 50% భాగము ఉంది.

ఈ సంఘటన రొమేనియాలో రాజకీయంగా ఒక పెనుమార్పు సృష్టించింది. దీని వలన ఫ్రాన్సు , బ్రిటన్ లతో సత్సంబంధాలకు భంగం వాటిల్లి, ఆ దేశం నాజీల జర్మనీకి చేరువయ్యింది. తద్వారా ప్రో-ఫాసిస్ట్ విధానాలు స్థాపించటానికి ఆస్కారం కుదిరింది. 1941 లో సోవియట్ యూనియన్ పై ఆక్సిస్ దండయాత్రలో పాలుపంచుకున్న రొమేనియా బెస్సరేబియా , ఉత్తర బ్యుకోవినాలో తాను కోల్పోయిన భూభాగాలను తిరిగి వశపరచుకుంది. కానీ ఆ దేశపు సైన్య విధానాలు యుద్ధాన్ని మరింత ముందుకు అనగా సోవియట్ భూభాగంలోనికి విస్తరించాయి. ఆధీనములోనున్న ట్రాన్స్నిస్ట్రియాలో రొమేనియా సేనలు జేర్మనులతో కలసి 300,000 మంది యూదులను బహిష్కరించటం కానీ అంతమొందించటం కానీ చేయటం జరిగింది. వారిలో 147,000 మంది యూదులు బెస్సరబియా , బ్యుకోవినా నుండి వచ్చినవారు (వీరిలో 90,000 మంది మరణించారు). సోవియట్ సైన్యము ఫిబ్రవరి-ఆగస్టు 1944 లో ఈ ప్రాంతాన్ని తిరిగి స్వాధీనపరచుకుని మోల్దవియాన్ SSRలో మరల వారి ఆధిపత్యాన్ని పునరుద్ఘాటించారు. WWII సమయములో దాదాపుగా 150,000 మంది మోల్డోవా సైనికులు మరణించారు. వీరిలో 50,000 మంది రొమేనియా సైనికులు కాగా (POWలతో కలిపి), 100,000 మంది సోవియట్ సైన్యము.

స్టాలినిస్ట్ కాలంలో (1940–1941, 1944–1953), ఉత్తర యూరల్స్ ప్రాంతంలోని స్థానికులను సైబీరియాకు, ఉత్తర కజఖస్థాన్ కు బహిష్కరించటాలు సర్వసాధారణంగా జరుగుతుండేది.జూన్ 1941 లో 12-13 తారీఖులలో MSSR నుండి 18,392 మంది, జూలై 5-6 తారీఖులలోనూ అత్యధికంగా 35,796 మంది బహిష్కరించబడ్డారు. సోవియట్ లో ప్రజలకు విధించిన ఇతర రకాల శిక్షలలో 32,433 రాజకీయ నిర్బంధాలు, ఆ పై గులాగ్ లేక మరణశిక్ష (8,360 కేసులలో), కల్లక్టివైజేషణ్, వ్యక్తిగత ఆర్ధిక వ్యవస్థను, దాని మౌలిక వ్యవస్థను ధ్వంసం చేయటం (ముఖ్యంగా 1941లో వెనుకకు మళ్ళినపుడు) వంటివి ఉన్నాయి.

1946 లో తీవ్రమైన అనావృష్టితోపాటు సోవియట్ ప్రభుత్వము సరఫరా వాటాలలో అతిశయోక్తించిన నిర్బంధాలు, ఆజ్ఞలు విధించటంతో, USSR లోని నైరుతి ప్రాంతము మొత్తము కరువు విస్తరించింది. 1946-1947 మధ్య కాలంలో మోల్దవియా SSR లోనే కనీసం 216,000 మరణాలు , 350,000 రుగ్మతలు సంభవించినట్లు చరిత్రకారులు పేర్కొన్నారు. మోల్దవియా ASSR లో 1930 లలో ఇటువంటి సంఘటనలే జరిగాయి. 1944-53లో మోల్డోవాలో అనేక సోవియట్ వ్యతిరేక వర్గాలు ఉండేవి; అయితే NKVD, తరువాత MGB ఈ వర్గాల సభ్యులని అదుపులో తీసుకోవడం, దేశమునుండి పంపించేయడం లేక ఉరి తీయడమో చేశారు.

యుద్ధ అనంతర కాలములో, రష్యా, ఉక్రెయిన్ జాతీయులు , ఇతర జాతీయులు అనేక మంది భారి సంఖ్యలో క్రొత్తగా ఏర్పడిన సోవియట్ గణతంత్ర దేశానికి ముఖ్యంగా నగర ప్రాంతాలలో వలస వెళ్లారు. 1940 , 1944 లో సోవియట్ యూనియన్ నుండి వలస వెళ్లినప్పుడు జరిగిన నష్టాన్ని భర్తీ చేయడమే దీనికి కొంత మేరకు కారణం. మోల్డోవా యొక్క జాతీయ గుర్తింపు, రోమేనియా జాతీయలకంటే భిన్నమైనదని సోవియట్ ప్రభుత్వం ఒక ప్రచారం నిర్వహించింది. దీనికి మోల్డావియన్ ASSR కాలములో రూపొందించబడిన ఒక సిద్ధాంతాన్ని మూలంగా తీసుకున్నారు. మోల్దోవన్లు మాట్లాడే భాష, రోమేనియన్ భాషకంటే వేరైనదని అధికార సోవియట్ విధానము ఉద్ఘాటించింది (మోల్డోవేనిసం చూడండి). ఈ రెండు భాషలను విడిగా గుర్తించటానికి సోవియట్ కాలములో మొల్డోవన్ భాషను సిరిలిక్ అక్షరాలలోను, రోమేనియన్ భాషను 1860 నుండి లాటిన్ అక్షరాలలోను వ్రాసేవారు.

అయితే సోవియట్ల హయాంలో అన్ని విషయాలు చెడుగా లేవు. స్టాలిన్ మరణాంతరం, రాజకీయ హింసలు రూపు మారి, సామాహికముగా కాకుండా వ్యక్తిగతంగా మారింది. పైగా, 1970ల, 1980ల కాలములో పారిశ్రామిక , శాస్త్రీయ సదుపాయాల కొరకు , గృహ నిర్మాణాల కొరకు మొల్డోవియన్ SSR కు USSR నిధులు అందించింది. 1971లో "కిషినేవ్ (ప్రస్తుతం చిసినావ్) నగరాన్ని ఇంకా అభివృద్ధి చేయడానికి అవసరమైన చర్యలు" గురించి USSR మంత్రిమండలి ఒక నిర్ణయం తీసుకుంది. దీని ప్రకారం, ఒక బిలియను సోవియట్ రూబిల్ల కంటే ఎక్కువ నిధిని పధకాల నిర్మాణాల కొరకు USSR తన బడ్జెట్ నుండి కేటాయించింది; తరువాత కూడా గణనీయంగా నిధులు ఇవ్వడం జరిగింది. మోల్డోవా యొక్క పారిశ్రామిక రంగాన్ని అభివృద్ధి చెయ్యడానికి USSR లోని ఇతర ప్రాంతాలనుండి అర్హతకలిగిన నిపుణులని రప్పించింది. అయితే, స్వతంత్ర సంస్థలు అన్ని గట్టిగా మందలించబడి, 1972లో నేషనల్ పేట్రియాటిక్ ఫ్రంట్ నేతలకు భారి జైలు శిక్ష విధించబడింది. మోల్డోవాలో కమ్యునిస్ట్ నిరంకుశత్వం గురించిన అధ్యయనం కొరకు ఏర్పడిన ఒక కమిషన్ కమ్యునిస్ట్కం ఏకాధిపత్య పాలన గురించి అద్యయనం చేస్తుంది.

గ్లాస్నోస్ట్, పెరెస్ట్రోయిక మూలంగా మారిన రాజకీయ పరిస్థితులలో డెమోక్రాటిక్ మూవ్మెంట్ అఫ్ మోల్డోవా స్థాపించబడింది. 1989లో ఇది పొపులర్ ఫ్రంట్ అఫ్ మోల్డోవా (FPM), అని రూపాంతరం చెంది, రొమాంటిక్ దేశీయవాదం అనే సిద్ధాంతాన్ని పాటించింది. అనేక ఇతర సోవియట్ గణతంత్రాల మాదిరిగానే, 1989 నుండిమ మోల్డోవా కూడా స్వాతంత్రం వైపు అడుగులు వేసింది. 1989 ఆగస్టు 27 నాడు FPM చిసినావులో ఒక అతిపెద్ద ప్రదర్శనా కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఇది గ్రాండ్ నేషనల్ అసెంబ్లీ అని తరువాత పిలవబడింది. లాటిన్ అక్షరాలలో వ్రాయబడే మోల్దోవన్ భాషని MSSR యొక్క అధికార దేశీయ భాషగా ప్రకటించే ఒక భాషా చట్టాన్ని 1989 ఆగస్టు 31 నాడు అమలుచేయడానికి ఈ సభ మోల్డావియన్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్ అధికారుల మీద ఈ సభ ఒత్తిడి తెచ్చింది. దీని మూలంగా రోమేనియన్ భాషను పోలి ఉండడాన్ని కూడా నెలకొల్పింది.

స్వాతంత్రము

స్థానిక శాసన సభకు మొదటి ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు ఫిబ్రవరి , మార్చి 1990లో జరిగాయి. మిర్సీ స్నేగుర్ శాసన సభాధ్యక్షుడు గానూ, మిర్సీ డ్రుక్ ప్రధాన మంత్రిగానూ ఎన్నికయ్యారు. 1990 జూన్ 23లో "సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్ మోల్డోవా" దేశము తీర్మానాన్ని శాసన సభ ఆమోదించింది. దీని ప్రకారం రష్యన్ చట్టాలకంటే మోల్దోవన్ చట్టాలకే ప్రాముఖ్యత ఎక్కువ అని తీర్మానించడం జరిగింది. 1991లో సోవియట్ మోల్డోవాని ఆక్రమించడానికి చేసిన ప్రయత్నం విఫలమయిన తరువాత, 1991 ఆగస్టు 27 నాడు మోల్డోవా స్వాతంత్రాన్ని ప్రకటించింది.

అదే సంవత్సరం డిసెంబరు 21 నాడు, ఇతర సోవియట్ రిపబ్లిక్ లతో కలిసి, మోల్డోవా కూడా సోవియట్-అనంతరం కామన్వెల్త్ అఫ్ ఇండిపెండేంట్ స్టేట్స్ (CIS) ని స్థాపించింది. డిసెంబరు 25 నాడు మోల్డోవా అధికారిక గుర్తింపు పొందింది. 1991 డిసెంబరు 26 నాడు సోవియట్ యూనియన్ రద్దయింది. తనను ఒక తటస్థ దేశముగా పేర్కొంటూ, మోల్డోవా CIS యొక్క సైన్య విభాగములో చేరలేదు. మూడు నెలలు తరువాత 1992 మార్చి 2 నాడు ఒక స్వతంత్ర దేశముగా యునైటడ్ నేషన్స్ యొక్క గుర్తింపు పొందింది. 1994లో మోల్డోవా నాటో వారి పార్ట్నేర్షిప్ ఫర్ పీస్ కార్యక్రమంలోనూ 1995 జూన్ 29 నాడు ఐరోపా మండలిలోనూ సభ్యత్వం పొందింది.

డ్నియెస్టర్ నదికి తూర్పు ప్రాంతములో ఉన్న ట్రాన్స్నిస్ట్రియలో ఎక్కువగా ఉక్రెయిన్‌కు (28%) , రష్యా (26%) చెందిన రాస్సోఫోన్ ఈస్ట్ స్లావ్ లు (మొత్తం 1989 నాటికి 54%) ఉన్నారు. అయితే మాల్దోవన్ లు (40%) అతి పెద్ద జాతిగా ఉన్నారు. సోవియట్ 14వ గార్డ్స్ అర్మి ప్రధాన స్థావరము , విభాగాలు ఉన్న స్థలాలలో ఒక స్వతంత్ర "ట్రాన్స్ డ్నేస్ట్రియాన్ మొల్డోవన్ రిపబ్లిక్" (TMR) ని టిరస్పోల్ రాజధానిగా కలిగి, 1990 ఆగస్టు 16 నాడు ప్రకటించారు. మోల్డోవాలో జాతీయవాదం పెరగవచ్చనే భయం, USSR నుండి విడిపోయిన తరువాత తిరిగి దేశము రొమేనియాతో విలీనం కావచ్చనే భయం వంటి అంశాలే ఈ చర్యకు కారణం. 1991-1992 శీతాకాలములో 14వ సైన్యం యొక్క సహకారము కలిగిన ట్రాన్స్నిస్ట్రియన్ బలగాలకు మోల్దోవన్ పోలీసు లకు మధ్య ఘర్షణలు జరిగాయి. మార్చి 2-1992 జూలై 26 మధ్య కాలములో, ఈ ఘర్షణలు సైన్య పోరాట స్థాయికి పెరిగాయి.

1992 జనవరి 2 నాడు మోల్డోవా ధరలు సరళీకరణ చేసి ఒక మార్కెట్ పై ఆధారపడిన ఆర్ధిక వ్యవస్థని ప్రవేశపెట్టడంతో ద్రవ్యోల్బణం భారీగా పెరిగింది. 1992 నుండి 2001 వరకు, ఈ యువ దేశం ఒక భారీ ఆర్ధిక సంక్షోభాన్ని ఎదుర్కొంది. జనాభాలో అత్యధిక మంది దారిద్ర్య రేఖకు దిగువున మిగిలిపోయారు. 1993లో తాత్కాలికంగా కూపన్‌కు బదులుగా మోల్దోవన్ ల్యు అనే ఒక దేశీయ నాణెమును ప్రవేశ పెట్టింది. మోల్డోవా ఆర్ధిక వ్యవస్థ 2001లో మారడం మొదలయింది; 2008 వరకు 5% - 10% మధ్య దేశములో క్రమమైన వార్షిక అభివృద్ధి సాధించింది. 2000 ప్రారంభములో మోల్దోవన్ లు పనికోసం రష్యా (ముఖ్యంగా మాస్కో ప్రాంతానికి), ఇటలీ, పోర్చుగల్, స్పెయిన్, గ్రీస్, సైప్రస్, టర్కీ , ఇతర దేశాలకు వలస పోయారు (చాలా వరకు చట్టవిరుద్ధంగా); విదేశాలలో ఉన్న మోల్దోవన్ లు చేసే చెల్లింపులు దేశము జి.డి.పి.లో సుమారు 38%గా ఉంది. ఇది ప్రపంచములోనే రెండవ అత్యధిక శాతం.

1994 శాసన సభా ఎన్నికలలో డెమాక్రటిక్ అగ్రరియన్ పార్టీ అఫ్ మోల్డోవా అత్యధిక స్థానాలు గెలవడంతో మోల్డోవా రాజకీయం ఒక మలుపు తిరిగింది. దేశీయ పక్షమైన పాపులర్ ఫ్రంట్ ఇప్పుడు మైనారిటీగా కావటంతో, దేశములో జాతుల మధ్య నెలకొన్న ఉద్రిక్తతను తగ్గించడానికి చర్యలు తీసుకోవడం సాధ్యమయింది. రోమేనియాతో విలీనం అయ్యే ఆలోచనలు విరమించబడ్డాయి. క్రొత్త రాజ్యాంగం ప్రకారం విడిపోయిన ట్రాన్స్నిస్ట్రియ , గగవుజియకు స్వయంప్రతిపత్తి ఇవ్వబడింది. 1994 డిసెంబరు 23 నాడు మోల్డోవా శాసన సభా "గగవుజియ కు ప్రత్యేక చట్టపరమైన హొదా ఇచ్చే చట్టం" ను అంగీకరించి, 1995లో అది అమలు చేయబడింది.

1996 అధ్యక్షుడు ఎన్నికలలో గెలిచిన అనంతరం, 1997 జనవరి 15 నాడు 1989-91 లో మోల్డావియన్ కమ్యునిస్ట్ పార్టీ గతంలోని ప్రథమ కార్యదర్శి అయిన పెట్రు లుషిన్షి దేశానికి రెండవ అధ్యక్షుడు (1997-2001) అయ్యాడు. మిర్సీ స్నేగుర్ (1991–1996) మొదటి అధ్యక్షుడు.

2000లో రాజ్యాంగం సవరించబడి, మోల్డోవా ఒక శాసన సభా కలిగిన గణతంత్ర దేశముగా మార్చబడింది. దీని ప్రకారం, రాష్ట్రపతి ప్రత్యక్షంగా ఎన్నుకోబడకుండా పరోక్ష ఎన్నిక ద్వారా ఎన్నుకోబడుతాడు.

పార్టీ అఫ్ కమ్యునిస్ట్స్ అఫ్ ది రిపబ్లిక్ అఫ్ మోల్డోవా (1991 లో నిషేధించబడిన తరువాత 1993లొ పునఃస్థాపించబడింది) 49.9% ఓట్లు గెలిచి, మొత్తం 101 MP లను 71 స్థానాలు పొందింది. 2001 ఏప్రిల్ 4 నాడు వ్లాడిమిర్ వోరోనిన్ దేశానికి మూడవ అధ్యక్షుడుగా ఎన్నుకోబడ్డారు (2005లో మళ్ళీ ఎన్నికయ్యారు).

సంస్కరించబడని కమ్యునిస్ట్ పార్టీ తిరిగి అధికారంలోకి వచ్చిన మొదటి సోవియట్-అనంతరం ఏర్పడిన దేశముగా మోల్డోవా చరిత్రకు ఎక్కింది. వాసిలి టార్లెవ్ (2001 ఏప్రిల్ 19 - 2008 మార్చి 31), జినైడ గ్రేషియని (2008 మార్చి 31 - 2009 సెప్టెంబరు 14) క్రొత్త ప్రభుత్వాలు ఏర్పాటు చేశారు. 2001-2003 లో మోల్డోవా, రష్యా మధ్య సంబంధాలు మెరుగుపడ్డాయి. అయితే 2003-2006లో కోజాక్ మెమోరండం విఫలమవ్వడంతో తాత్కాలికంగా రెండు దేశాల మధ్య సంబంధాలు క్షీణించి, 2006 వైన్ ఎగుమతి సంక్షోభం ఏర్పడింది.

మోల్డోవా 
శాసనసభా భవనం వద్ద 2009 లో మోల్డోవాలో అలజడి
మోల్డోవా 
తాత్కాలిక రాష్ట్రపతి అయిన మిహాయి ఘింపు

ఏప్రిల్ 2009 శాసన సభ ఎన్నికలలో కమ్యునిస్ట్ పార్టీ 49.48% ఓట్లు గెలుచుకుంది. 13.14% ఓట్లు గెలుచుకుని లిబరల్ పార్టీ రెండవ స్థానములోను, 12.43% ఓట్లు గెలుచుకొని లిబరల్ డెమోక్రటిక్ పార్టీ మూడవ స్థానములోను, 9.77% ఓట్లు గెలుచుకుని అలయన్స్ "మోల్డోవా నోవాస్ట్రా" తరువాత స్థానములోను ఉన్నాయి. ప్రతిపక్ష నేతలు ఈ ఎన్నికల ఫలితాన్ని వ్యతిరేకించి ఇది బూటకమని చెప్పి మరొకసారి ఎన్నికలు జరపాలని కోరారు. 2009 ఏప్రిల్ 6 నాడు అనేక NGO లు, ప్రతిపక్షాలు శాంతియుతంగా ఒక నిరసన కార్యక్రమాన్ని చిసినావ్ లో ఏర్పాటు చేసింది. దీనికి ట్విట్టర్ , ఫేస్బుక్ వంటి సోషల్ నెట్వర్క్ సైట్ ల ద్వారా సుమారు 15,000 మంది ప్రజలను చేర్చారు. కమ్యునిస్ట్ లకు వ్యతిరేకంగా, రోమెనియాకు సానుకూలంగా నివాదాలు చేశారు. ఏప్రిల్ 7 నాడు, ఈ ప్రదర్శన నియంత్రణ కోల్పోయి, ఒక పెద్ద అలజడి ఏర్పడింది. కొంత మంది జనం రాష్ట్రపతి కార్యాలయాల మీద దాడి చేశారు. శాసన సభ భవనము లోపలకి వెళ్లి, దోపిడులు , పలు అంతస్తులుకు నిప్పు అంటించటాలు చేశారు. ఏప్రిల్ 7-8 రాత్రి పోలీసులు పరిస్థితిని అదుపు చేయగలిగారు. కొన్ని వందల మంది నిరసనకారులను అదుపులోకి తీసుకున్నారు. తమని పోలీసులు కొట్టారని వారిలో అనేక మంది విడుదల అయిన తరువాత చెప్పారు.

ఆ తిరుగుబాటు జరిగిన రోజున ముగ్గురు యుక్తవయస్కులు మరణించారు. ప్రతిపక్షం ఈ మరణాలకు పోలీసుల దుశ్చర్యే కారణమని వారిని నిందించింది.కానీ ప్రభుత్వము ఆ మరణాలకు ప్రమాదాలుగానీ ఘర్షణలుగానీ కారణం కాదని నివేదించింది.

రాష్ట్రపతి వ్లాడిమిర్ వోరోనిన్ తో సహా ప్రభుత్వ అధికారులు ఈ నిరసనలని తిరుగుబాటు ప్రయత్నమని, దీనిని రోమెనియానే నిర్వహించిందని ఆరోపించారు. నిరసనకారులలో కావాలనే రెచ్చగొట్టేవారిని ప్రభుత్వమే చేర్చి ఈ కలహాలని సృష్టించిందని ప్రతిపక్షం ఆరోపించింది.

శాసనసభ క్రొత్త రాష్ట్రపతిని ఎన్నుకోవడంలో విఫలమయిన తరువాత, శాసన సభ రద్దు చేయబడి, 2009 జూలై 29 నాడు హటాత్తుగా సాధారణ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికలలో కమ్యునిస్ట్ లు ప్రజాభిమాన ఓటులలోను, శాసనసభా స్థానాలలోనూ మళ్ళీ ఆధిక్యత సాధించింది; అయితే ఈ ఆధిక్యత పూర్వముకంటే తక్కువ. మొత్తం 101 స్థానాలకు గాను, పార్టీ అఫ్ కమ్యునిస్ట్స్ కు 48 స్థానాలు, లిబరల్ డెమోక్రాటిక్ పార్టీ కు 18 స్థానాలు, లిబరల్ పార్టీ కు 18 స్థానాలు, డెమోక్రాటిక్ పార్టీ కు 13 స్థానాలు , అవర్ మోల్డోవా అలయన్స్ కు 7 స్థానాలు లభించాయి. ఆగస్టులో చివరి నాలుగు పార్టీలు ఒక పొత్తు ఏర్పరుచుకుని, వ్లాడ్ ఫిలాట్ కాబినెట్ కు శాసన సభలో అంగీకారం తెలిపాయి. సెప్టెంబరు 2009లో వోరోనిన్ రాజీనామా అనంతరం, మోల్దోవన్ శాసన సభాధ్యక్షుడైన మిహై ఘింపు మోల్డోవా కు తాత్కాలిక రాష్ట్రపతి అయ్యారు.

ప్రభుత్వం , రాజకీయాలు

మోల్డోవా శాసనసభా ప్రాతినిధ్యం కలిగిన ప్రజాస్వామ్యపు గణతంత్ర వ్యవస్థ కలిగిన ఏకత్వం కలిగిన దేశం. 1994 మోల్డోవా రాజ్యాంగం దేశాన్ని పరిపాలించే విధానాన్ని పొందుపరచింది. మోల్డోవా రాజ్యాంగాన్ని సవరించడానికి శాసనసభలో మూడులో-రెండు వంతులు ఆధిపత్యం ఉండాలి. రాజ్యాంగాన్ని యుద్ధ సమయములో కాని, అత్యావసర పరిస్థితులలో కానీ సవరించడానికి వీలు లేదు. దేశము యొక్క సర్వాధికారము, స్వాతంత్రం, ఐక్యత వంటి అంశాల మీద ప్రభావం చూపే రాజ్యాంగ సవరణలు చేసే ముందు, ప్రజా అభిప్రాయ సేకరణ జరిపించి అత్యధిక ఓటర్లు దానిని సమర్ధించాలి. రాజ్యాంగంలో చెప్పబడిన ప్రజల ప్రాథమిక హక్కులని నియంత్రణలకు ఏ సవరణలను రాజ్యాంగములో చేయడానికి వీలు కాదు.

ఒకే సభ కలిగి ఉన్న మోల్దోవన్ శాసనసభParlament నే దేశము యొక్క కేంద్ర చట్ట సభ. దీంట్లో 101 స్థానాలు ఉంటాయి. నాలుగు సంవత్సరాలకు ఒక సారి పక్షాల ఆధారంగా ప్రజాభిమాన ఓటుల ద్వారా ఈ స్థానాలకు సభ్యులు ఎన్నుకోబడుతారు.

మోల్డోవా రాష్ట్రపతి యే దేశ అధ్యక్షుడు. రాష్ట్రపతిని మోల్డోవా శాసనసభ ఇందులో మూడు వంతు సభ్యుల మద్దతు కలిగి ఉండాలి (కనీసం 61 ఒటులు). 2001 నుండి మోల్డోవా రాష్ట్రపతి శాసనసభ ద్వారానే ఎన్నుకోబడుతున్నారు. చట్ట సభకు అధికారం పెంచడానికే ఈ మార్పు చేయబడింది. రాష్ట్రపతి ప్రధాన మంత్రి ని నియమిస్తారు. ప్రధాన మంత్రి ప్రభుత్వానికి అధ్యక్షుడుగా వ్యవహరిస్తారు. అతను తరువాత ఒక మంత్రిమండలి ని ఏర్పాటు చేస్తారు. ఈ రెండూ కూడా శాసనసభ ఆమోదం పొంది ఉండాలి.

స్వతంత్రంగా వ్యవహరించే ఒక రాజ్యాంగ న్యాయస్థానాన్ని కూడా రాజ్యాంగం ప్రకారం ఏర్పాటు చేయబడుతుంది. ఈ న్యాయస్థానానికి ఆరుగురు న్యాయమూర్తులు (ఇద్దరిని రాష్ట్రపతి నియమిస్తారు, ఇద్దరిని శాసనసభ నియమిస్తుంది, ఇద్దరిని సుప్రీం కౌన్సిల్ యొక్క మాజిస్ట్రేచర్ నియమిస్తారు.) నియమించబడుతారు. ఈ న్యాయమూర్తులు ఆరు సంవత్సరాలు పాటు పదవీ కాలంలో ఉంటారు. వారి పదవీ కాలములో వారిని పదవినుండి తొలగించడానికి వీలు లేదు. వారు మరెవరికీ లోబడి ఉండరు. శాసన సభా ఆమోదించే అన్ని చట్టాలు, రాష్ట్రపతి ఆదేశాలు , దేశం అంగీకరించిన అంతర్జాతీయ ఒప్పందాలని న్యాయ సమీక్ష చేసే అధికారము ఈ న్యాయస్థానానికి ఉంది.

1998 శాసనసభా ఎన్నికలు, 2001 శాసనసభా ఎన్నికలు, 2005 శాసనసభా ఎన్నికలు, April 2009 శాసనసభా ఎన్నికలు , July 2009 శాసనసభా ఎన్నికలలో పార్టీ అఫ్ కమ్యునిస్ట్స్ అఫ్ ది రిపబ్లిక్ అఫ్ మోల్డోవా అత్యధిక స్థానాలు గెలిచి విజయం సాధించింది.

2005 శాసనసభా ఎన్నికల అనంతరం శాసనసభలో ప్రాతినిధ్యం సంపాదించిన ఇతర పార్టీలు ఇవే: అవర్ మోల్డోవా అలయన్స్ (13 స్థానాలు), the డెమోక్రాటిక్ పార్టీ (మోల్డోవా) (11 స్థానాలు), క్రిస్టియన్-డెమోక్రాటిక్ పీపుల్స్ పార్టీ (7 స్థానాలు), ఏ పక్షానికి చెందని సభ్యులు 15 మంది. April 2009 శాసనసభా ఎన్నికలలో పార్టీ అఫ్ కమ్యునిస్ట్స్ వీటిని కూడా గెలిచి మొత్తం 60 స్థానాలు గెలిచింది.

PCRM ఆధిపత్యం కలిగి ఉండటం వల్ల, ప్రపంచంలోనే ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నుకోబడిన కమ్యూనిస్ట్ నేతలు ఉన్న మూడే మూడు దేశాలలో మోల్డోవా ఒకటి. ఇతర రెండు దేశాలు సైప్రస్ , నేపాల్. లిబరల్ పార్టీ (PL, 15 స్థానాలు), లిబరల్ డెమోక్రాటిక్ పార్టీ అఫ్ మోల్డోవా (PLDM, 15 స్థానాలు) , పార్టీ అలయన్స్ అవర్ మోల్డోవా (AMN, 11 స్థానాలు) ప్రతిపక్షంలో ఉన్నాయి.

2009 ఆగస్టు 8 నాడు నాలుగు మోల్డోవా పక్షాలు - లిబరల్ డెమోక్రేటిక్ పార్టీ, లిబరల్ పార్టీ, డెమోక్రేటిక్ పార్టీ, అవర్ మోల్డోవా అలయన్స్ - ఒక సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయటానికి అంగీకారం కుదుర్చుకుని కమ్యునిస్ట్ పార్టీ ని ప్రతిపక్షంలోకి నెట్టి వేశాయి. 2009 ఆగస్టు 28 నాడు మోల్డోవా యొక్క ప్రాశ్చాత్య దేశాలకు సానుకూలంగా ఉండే సంకీర్ణం ఒక క్రొత్త శాసనసభాపతిని (అనగా మిహై ఘింపు)) ఎన్నుకుంది. ఈ ఎన్నికల సమయములో, కమ్యునిస్ట్ సభ్యులు సభని బహిష్కరించారు. 2001 నుండి మోల్డోవా రాష్ట్రపతి పదవిని చేపట్టిన వ్లాడిమిర్ వోరోనిన్ 2009 సెప్టెంబరు 11 నాడు పదవికి రాజీనామా చేశారు. అయితే శాసనసభ క్రొత్త రాష్ట్రపతిని ఎన్నుకోవడంలో విఫలమయింది.

తాత్కాలిక రాష్ట్రపతి మిహై ఘింపు, మోల్డోవా రాజ్యాంగానికి (1994) ఒక క్రొత్త రూపం రూపొందించడానికి మోల్డోవాలో రాజ్యాంగ సంస్కరణకు కమిషన్ ను ఏర్పాటు చేశారు.

విదేశీ సంబంధాలు

మోల్డోవా 
వాషింగ్టన్, D.C. లోని మోల్డోవా దౌత్యాలయం

సోవియట్ యూనియన్ నుండి స్వాతంత్ర్యం సాధించినాక మోల్డోవా ఐరోపాలోని ఇతర దేశాలతో సంబంధాలను ఏర్పరచుకుంది. ఆ దేశం యొక్క విదేశీ విధానం యూరోపియన్ యూనియన్ ఏకీకరణ , తటస్థ వైఖరిని సమర్ధించటం ఫై ఆధారపడి ఉంటుంది. 1995 లో ఆ దేశం కౌన్సిల్ ఆఫ్ యూరోప్లో సభ్యత్వం పొందిన మొట్టమొదటి సోవియట్ అనంతరపు రాష్ట్రం అయింది. NATO యొక్క ప్రక్రియ అయిన శాంతి స్థాపనలో భాగస్వామ్యంలో పాలుపంచుకోవటమేకాక, మోల్డోవా యునైటెడ్ నేషన్స్ లోనూ, OSCE లోనూ, ఉత్తర అట్లాంటిక్ కోఆపరేషన్ కౌన్సిల్ లోనూ, ప్రపంచ వర్తక సంస్థలోనూ, ఇంటర్నేషనల్ మోనిటరీ ఫండ్ లోనూ, ప్రపంచ బ్యాంకులోనూ, ఫ్రాన్కోఫోనీ , యూరోపియన్ బాంక్ ఫర్ రేకన్స్త్రక్షన్ అండ్ డెవెలప్మెంట్ లోనూ సభ్యత్వం కలిగిన రాష్ట్రం.

2005 సంవత్సరములో మోల్డోవా , EU లు ఆ రెండు సమీప వ్యవస్థలకు మధ్య క్రియాశీల సంబంధం ఏర్పడటానికి వీలుగా ఒక ఆచరణా విధానాన్ని ప్రవేశ పెట్టారు. జూన్ 2007 లో మోల్డోవా శాసనసభ యొక్క రాష్ట్రపతి కి ఉపసహాధ్యాయుడైన అయూరీ రోస్కా, ఇటలీలో నెలకొన్న పరస్పర ప్రభుత్వ సహకారాలతో నిర్వహించే ఒక ప్రపంచ శాంతి పరిరక్షణ సంస్థ అయిన ఇంటర్నేషనల్ పార్లమెంట్ ఫర్ సేఫ్టీ ఎండ్ పీస్తో ఒక ద్వైపాక్షిక అంగీకార పత్రం మీద సంతకం చేశారు.

ట్రాన్స్నిస్ట్రియ యుద్ధం అనంతరం, రోమానియా, ఉక్రెయిన్, రష్యా లతో కలిసి, ట్రాన్స్నిస్ట్రియ ప్రాంతములో పోరాటానికి పరిష్కారం కొరకు మాల్డోవ ప్రయతినించింది. దీనికి అంతర్జాతీయ మధ్యస్థం కొరకు పిలుపు ఇచ్చి, OSCE, UN నిజ-నిర్ధారణ , పరిశీలకులు బృందాలకు సహకరించింది. మోల్డోవా యొక్క విదేశీశాఖ మంత్రి అయిన యాండ్రీ స్ట్రాటాన్ ప్రమాదకరమైన ప్రాంతంలో స్థావరం ఏర్పరచుకున్న రష్యా సేనలు అక్కడ మోల్డోవా ప్రభుత్వ అనుమతికి వ్యతిరేకంగా ఉన్నాయని పదే పదే చెపుతూ, వారు సంపూర్ణంగా , ఏ షరతులు లేకుండా వదిలి వెళ్ళాలని చెపుతూ వచ్చారు.

క్రొత్తగా వచ్చిన మోల్డోవా యొక్క ప్రీమియర్ వ్లాద్ ఫైలట్ ప్రీమియర్ గా తన యొక్క మొట్టమొదటి అధికారస్థాయి పర్యటన బ్రస్సెల్స్ కు ఉంటుందని, అంతే కాక తొలి అధికారిక సమావేశాలు పారిస్ లో, బెర్లిన్ లో, బుఖారెస్ట్లో , కీవ్లో పర్యటనల సందర్భంగా జరుగుతాయని తెలిపారు. అక్టోబరు 21 న 2009 లో జరిగిన ఒక పాత్రికేయ సమావేశంలో మోల్డోవా యొక్క విదేశీశాఖ మంత్రి యూరీ లియాంకా మోల్డోవా-EU మధ్య సాహచార్యపు ఒప్పందం గురించిన అధికారిక సంప్రదింపులు 2010 జనవరి 12 న మొదలవుతాయని తెలిపారు.

సైన్యం

మోల్డోవా 
సోఫియాలో మోల్దోవన్ పెరేడింగ్ యూనిట్

మోల్డోవా యొక్క సాయుధ బలగాలలో పదాతి దళాలు , వాయు , వాయు రక్షణ సేనలు ఉన్నాయి. మోల్డోవా పూర్వ సోవియట్ యూనియన్ యొక్క అన్ని సముచితమైన ఆయుధ నియంత్రణ షరతులను ఒప్పుకుంది. 1992 అక్టోబరు 30 న మోల్డోవా ఐరోపాలోని సాంప్రదాయక సాయుధ దళాలకు సంబంధించిన ఒప్పందముపై సంతకము చేసింది. ఈ ఒప్పందము ప్రకారం నిర్ణీత విభాగాలలోని సాంప్రదాయ సైనిక ఆయుధసామగ్రి యొక్క పరిమితులు నిర్దేశించి, అవి దాటితే ఆ ఆయుధ సామగ్రిని నాశనం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. వాషింగ్టన్, DCలో అక్టోబరు 1994 లో రూపొందించిన అణుపరికరాలకు సంబంధించిన నాన్-ప్రోలిఫరేషన్ ఒడంబడిక లోని ఆచరణయోగ్యమైన విధివిధానాలకు అది కట్టుబడింది. ఆ ఒడంబడికలో అణు, జీవసంబంధమైన లేక రసాయనిక ఆయుధాల ప్రస్తావన లేదు. మాల్డోవా 1994 మార్చి 16 నాడు నార్త్ అట్లాంటిక్ ట్రీటి ఆర్గనైజేషన్ యొక్క శాంతి కోసం సహచర్యంలో జత కలిపింది.

ఆయుధ విధానాల నియంత్రణా పద్ధతులైన UN ఫైరార్మ్స్ ప్రోటోకోల్, స్టెబిలిటీ పాక్ట్ రీజనల్ ఇంప్లిమెంటేషన్ ప్లాన్, UN ప్రోగ్రాం ఆఫ్ యాక్షన్ (PoA) , సాంప్రదాయ ఆయుధాలపై స్టాక్ పైల్స్ OSCE పత్రాలు వంటి అనేక అంతర్జాతీయ , స్థానిక నియంత్రణల వైపు మోల్డోవా కట్టుబడి ఉంది.

పరిపాలన విభాగాలు

మోల్డోవా 
మోల్డోవాలోని పరిపాలనా విభాగాలు

మోల్డోవా ముప్పైరెండు జిల్లాలుగా (రైవోన్, ఏకవచనము రైయోన్ ; మూడు మునిసిపాలిటీలు బాల్టీ,చిసినావ్,బెండర్; , రెండు స్వతంత్ర ప్రాంతాలు (గగౌజియా , ట్రాన్స్నిస్ట్రియా) గా విభజించబడింది. రెండు స్వయంప్రతిపత్తి కలిగిన పరిపాలనావిభాగపు స్థానాలైన కొమ్రాట్ , టిరస్పోల్ నగరాలకు మునిసిపాలిటీ హొదా ఉంది. మొత్తం 32 జిల్లాలు ఉన్నాయి.

కేంద్ర ప్రభుత్వానికి ఆ భూభాగంపై నియంత్రణ లేని కారణాన ట్రాన్స్నిస్ట్రియా యొక్క అంతిమ పరిస్థితి ఇంకా వివాదాస్పదం గానే ఉంది.

మోల్డోవాలో 65 నగరాలు (పట్టణాలు) ఉన్నాయి. వాటిలో 5 మునిసిపాలిటీ హొదా కలిగినవి అయితే 917 కమ్యూన్ లు. కొన్ని ఇతర 699 గ్రామాలు చాలా చిన్నవి కావడంతో వాటికి విడిగా పరిపాలన యంత్రాంగం లేదు. వీటిని నగరాలతో (40 ఉన్నాయి) లేక కంమ్యూన్ లతో పాటు (659 ఉన్నాయి) కానీ పాలనాపరంగా కలుపుతారు. తద్వారా మోల్దోవాలో ఉన్న మొత్తం 1,681 ప్రాంతాలు ఉన్నాయి. వీటిలో రెండిటిలో తప్ప మిగిలిన అన్ని ప్రాంతాలలోనూ జనం నివసిస్తున్నారు.

భౌగోళిక స్థితి

మోల్డోవా 
డ్నీస్టర్ లోయ దృశ్యము

దేశములోని అత్యధిక భాగము రెండు నదుల మధ్యనున్న డ్నీస్టర్ , ప్రాట్ లలో ఉంది. మోల్డోవా యొక్క పశ్చిమ సరిహద్దున ఉన్న ప్రట్ నది డానుబేలో కలిసి నల్ల సముద్రంలో కలుస్తుంది. మోల్దోవాకు కేవలం 480 m (1,575 ft) మాత్రమే డానుబే అందుబాటులో వుంటుంది. అందువలన డానుబే యొక్క ఒక్క రేవు అయిన గియుర్గియులేస్టి మాత్రమే మోల్దోవాకు అందుబాటులో ఉంటుంది. తూర్పున డ్నీస్టర్ ప్రధాన నదిగా దేశంలోని ఉత్తర భాగం నుండి దక్షిణ భాగం దాక ప్రవహిస్తూ రూట్,బాక్,ఇచల్ , బొట్నాల నుండి నీరు అందుకుంటుంది. డానుబే లిమాన్స్ లో ఒకదానిలోనికి ఇయాల్పగ్ ప్రవహించగా,కోగాల్నిక్ నల్ల సముద్రం యొక లిమాన్స్ శ్రేణిలోకి ప్రవహిస్తుంది.

ఆ దేశం నల్ల సముద్రానికి అతి చేరువలో ఉన్న కూడా భూపరివేష్ఠితమై అయి ఉంటుంది. దేశంలో చాలా కొండ ప్రాంతం ఉన్నా కూడా, ఎగువ ప్రాంతాల ఎత్తు ఎప్పుడూ 430 m (1,411 ft) ను మించలేదు. అతి ఎత్తైన ప్రదేశము బాలనేస్టి కొండగా నమోదు అయింది. కార్పాతియన్ పర్వతాల నుండి భౌగోళికంగా ఆవిర్భవించిన మోల్డోవా కొండలు మోల్డోవా పీఠభూమికి చెందుతాయి. మోల్దోవాలోని ఈ కొండచరియలలోని కొన్ని ఉపశ్రేణులు డ్నీస్టర్ కొండలు (ఉత్తర మోల్డివియాన్ కొండలు , డ్నీస్టర్ కొండచరియ, మోల్దవియాన్ మైదానము (మధ్య ప్రాట్ లోయ , బాల్టి స్తేప్పే), , మధ్య మోల్దవియాన్ పీఠభూమి (సియులుక్-సోలోనేట్ కొండలు, కోర్నేస్టి కొండలు (కొడ్రి మాస్సివ్)-కొడ్రి, అంటే "అరణ్యాలు" -, దిగువ డ్నీస్టర్ కొండలు, దిగువ ప్రాట్ లోయ , టిఘేసి కొండలు). దక్షిణంలో ఆ దేశంలో చిన్న చదునైన ప్రదేశము, బ్యుగియాక్ మైదానము ఉంది.ద్నీస్టార్ నదికి తూర్పున ఉన్న మోల్డోవా యొక్క భూభాగము పోడోలియన్ పీఠభూమి , యూరేషియన్ స్తేప్పి లోని భాగాలుగా విభజించబడింది.

రాజధాని చిసినావ్, దేశ మధ్యభాగములో ఉన్న టిరాస్పోల్ (ట్రాన్స్నిస్ట్రియకు తూర్పున ఉన్నది), బాల్టి (ఉత్తరములో) , టిఘినా (ఆగ్నేయదిశలో) ఈ దేశములోని ముఖ్య నగారాలు.

ఆర్థిక వ్యవస్థ

మోల్డోవా 
ప్రతి లేయు బ్యాంక్ నోట్ ముందు భాగము మీద స్టీఫెన్ III చిత్రం ఉంటుంది.
మోల్డోవా 
1,5,10,25 , 50 బని నాణాలు ఉన్నాయి.
మోల్డోవా 
మిలేసేట్టి మిసి - ప్రపంచంలో అతి పెద్ద వైన్ అమ్మకందారులు
మోల్డోవా 
చిసినావులోని వైన్ తయారిదారులు, సుమారు 1900

మోల్డోవాలో అనుకూలమైన వాతావరణం ఉండి, దేశము మంచి వ్యవసాయ పొలాలు కలిగి ఉంది. అయితే పెద్దగా ఖనిజ వనరులు లేవు. అందువల్ల దేశము యొక్క ఆర్ధిక వ్యవస్థ ఎక్కువగా వ్యవసాయం మీద, ముఖ్యంగా పండ్లు, కూరగాయలు, వైన్, , పొగాకు సాగు మీద ఆధారపడి ఉంది. సోవియట్ యూనియన్ రద్దయిన తరువాత, ఆర్ధిక వ్యవస్థ గణనీయంగా కృసించింది. As of 2009GDP ప్రకారం, మోల్డోవానే ఐరోపాలో అతి పేద దేశముగా యూరోపియన్ పార్లమెంట్ వివరించింది.

శక్తి

ముడి చమరు, బొగ్గు, సహజ వాయువు వంటి వస్తువులని మోల్డోవా పూర్తిగా దిగిమతి చేసుకోవలసినదే. ఎక్కువగా రష్యా నుండి దిగుమతి చేసుకుంటుంది. మోల్డోవా EU INOGATE వారి శక్తి కార్యక్రమాలలో నాలుగు ముఖ్య అంశాలు ఉన్నాయి: ఇంధనశక్తి భద్రతను పెంచడం

EU అంతర్గత ఇంధనశక్తి మార్కెట్ సూత్రాల ఆధారంగా సభ్య దేశాల ఇంధనశక్తి మార్కెట్ ల సంగమం,

భరించగల ఇంధనశక్తిని అభివృద్ధి చేయడానికి సహకరించడం, ఉమ్మడి , ప్రాంతీయ ప్రయోజనాలని దృష్టిలో పెట్టుకొని ఇంధనశక్తి పథకాలకు పెట్టుబడి ని ఆకర్షించడం.

ఆర్ధిక సంస్కరణలు

సోవియట్ యూనియన్ 1991లో రద్దయిన తరువాత, ఇంధన శక్తి కొరత ఏర్పడి ఉత్పత్తి భారీగా తగ్గింది. ఆర్ధిక సరళీకరణ కృషిలో భాగంగా మోల్డోవా ఒక మార్పిడి చేయుగలిగిన కరన్సి ని ప్రవేశపెట్టింది. ధరలు సరళీకరించబడ్డాయి. ప్రభుత్వ సంస్థలకు ఇస్తున్న అనుకూలమైన రుణాలని ఆపేసింది. క్రమంగా భూముల ప్రైవేటీకరణ చేపట్టింది. ఎగుమతి నియంత్రణలను తొలగించింది. వడ్డీ రేటులని సరళీకరించింది. అభివృద్ధిని ప్రోత్సాహించడానికి ప్రపంచ బ్యాంకు, IMF లతో ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకుంది.

కమ్యునిస్ట్ ప్రభుత్వం ఈ విధానాలలో కొన్నిటిని తిరగవ్రాయాలని, భూమిని మళ్లి సామాజిక పరిధిలోకి తీసుకురావాలని, ప్రైవేట్ వ్యాపారాలను నియంత్రించాలని అనుకున్నట్లు ఇటీవల సూచనలు తెలియచేస్తున్నాయి. ఆర్ధిక వ్యవస్థ మళ్ళీ ఆర్ధిక అభివృద్ధి సాధించి, 2000లో 2.1%, 2001లో 6.1% నమోదు చేసింది. 2007లో మంచి అభివృద్ధి (6%) సాధించింది. దీనికి సంస్కరణలు కొంత మేరకు కారణమైతే, చిన్న పరిధి నుండి మొదలవటము మరొక కారణము. అధిక ఇందన ధరలు, వ్యవసాయానికి అనుకూలంగాలేని వాతావరణ పరిస్థితి , విదేశీ మధుపరుల యొక్క అపనమ్మకం వంటి అంశాలు మూలాన ఆర్ధిక వ్యవస్థ క్షీణించే అవకాశం ఇంకా ఉంది.

1998 లో ప్రాంతీయ ఆర్ధిక సంక్షోభం తరువాత మోల్డోవా ఆర్ధిక , రాబడివ్యయాల స్థిరత్వం సంపాదించుకుని, నిలబెట్టుకోవటంలో తగింత అభివృద్ధి కనపరిచింది. మార్కెట్ యొక్క ఆర్ధిక స్థితి సజావుగా సాగటానికి అవసరమైన అనేక రూపాత్మక , సంస్థాగత సంస్కరణలు ఆచరణలోకి తెచ్చారు. ఈ ప్రయత్నాలు కష్టతరమైన బాహ్య పరిస్థితులలో స్థూలమైన ఆర్ధిక , ఆదాయపు నిలకడను స్థాపించడానికి ఎంతగానో ఉపయోగపడినవి. అంతే కాక అవి ఆర్ధిక ఎదుగుదలను నిలుపుకోవటానికి, అటువంటి వాతావరణాన్ని సృష్టించి ఆర్ధిక స్థితి మధ్య కాలంలో మరింత పెరగడానికి, ఎదగడానికి దోహదపడింది.

ఈ ప్రయత్నాలు చేసినా , ఆర్ధిక పురోగతి ఉన్నా కూడా, మోల్డోవా ఇతర మారుతుండే ఆర్ధిక స్థితులతో పోలిస్తే, సాధారణ జీవన ప్రమాణాలలో , మానవ వికాసములో అతి తక్కువ స్థాయిని నమోదు చేసింది. 2000 అనంతరం ఆర్ధిక వ్యవస్థ నిలకడగా అభివృద్ధి సాధించినప్పటికీ: 2000 - 2003 సంవత్సరాలలో 2.1%, 6.1%, 7.8% , 6.3% (2004లో 8% అని అంచనాతో), ఇటీవలి పరిణామాలు 1994 నాటి స్థాయిని అందుకోవడం లేదు. GDPలో సుమారు 40% 1990లో నమోదయింది. ఈ విధముగా గత దశాబ్దములో దేశము యొక్క బలహీనతని తగ్గించడానికి సరైన చర్యలేమీ తీసుకోబడలేదు. తీవ్రమైన ఆర్ధిక తిరోగమనము, సామాజిక , ఆర్ధిక సవాళ్లు, ఇంధన శక్తి మీద ఆధారపడటం వంటి అంశాల మూలాన, తలసరి ఆదాయరీత్యా మోల్డోవా ఐరోపా దేశాలలో ఆఖరి స్థానములో నిలిచింది.

2005లో (హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్ 2008), దేశము యొక్క తలసరి GDP US $ 2,100 PPPగా ఉంది. ఇది ప్రపంచ సగటు కంటే (US $ 9,543) 4.5 రెట్లు తక్కువ. పైగా, ఈ ప్రాంతీయ గణాంకాల తలసరి GDP కంటే (US $ 9,527 PPP) కూడా తక్కువే. 2005లో జనాభాలో సుమారు 20.8% మంది, రోజుకు US $ 2.15 (PPP) కంటే తక్కువ సంపాదన కలిగి ఉండి, సంపూర్ణ దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నారు. మానవ అభివృద్ధిలో మోల్డోవా మధ్యస్థముగా గుర్తించబడి, 177 దేశాలలో 111వ స్థానములో ఉంది. మానవ అభివృద్ధి సూచిక (0.708), ప్రపంచ సగటు కంటే తక్కువ ఉంది. మోల్డోవా అధికారికంగా (బ్లాక్ , గ్రే ఆదాయం కలపకుండా) ఐరోపాలోని అత్యంత పేద దేశంగా నిలిచింది. దాని ప్రస్తుత తలసరి ఆదాయము $1,808.729.

2007 లోని GDP $4.104 బిలియన్లగా నమోదు అయింది. 2006 నుండి 3% అభివృద్ధి ఉన్నట్లు స్పష్టమయింది.

వైన్ పరిశ్రమ

మోల్డోవా వైన్ లకు ప్రసిద్ధము. అనేక సంవత్సరాలగా, ద్రాక్ష సాగు, వైన్ తయారి నే మోల్డోవా ప్రజల సాధారణ వృత్తిగా ఉంటుంది. చారిత్రాత్మిక స్మారక చిహ్నాలు, దస్తావేజులు, జనపదాలు , మోల్దోవన్ వాడుక భాషలో దీనికి తగిన ఆధారాలు ఉన్నాయి.

దేశములో వైన్ పరిశ్రమ స్థిరంగా స్థాపించబడి ఉంది. దేశములో ద్రాక్షతోట విస్తీర్ణం 147,000 hectares (360,000 acres)గా ఉండగా, దాంట్లో 102,500 ha (253,000 acres) మేరకు వాణిజ్య ఉత్పత్తికి వాడబడుతుంది. దేశములో ఉత్పత్తి అయ్యే వైన్ లో ప్రధాన భాగం ఎగుమతి కొరకే తయారు చేయబడుతుంది. పలు కుటుంబాలు వారి యొక్క స్వంత తయారి విధానాలు , వారి స్వంత ద్రాక్ష రకాలు కలిగి ఉన్నాయి. ఈ పరిజ్ఞానం ఎన్నో తరాలనుండి వారసత్వంగా నేర్పబడుతుంది.

వ్యవసాయం

మోల్డోవా యొక్క సారవంతమైన మట్టి, ఇక్కడ నెలకొన్న సమశీతోష్ణ ఖండాంతర వాతావరణం (వెచ్చని వేసవికాలం, తేలికపాటి శీతాకాలం) వల్ల పురాతన కాలమునుండే ఈ దేశము మంచి ఉత్పత్తి ఇచ్చే వ్యవసాయ ప్రాంతముగాను, ఆగ్నేయ ఐరోపాకు వ్యవసాయ ఉత్పత్తులు సమకూర్చే ప్రధాన కేంద్రంగా మోల్డోవా పేరొందింది. భూమి కడాస్టర్ సంస్కరణతో వ్యవసాయంలో ఆర్ధిక సంస్కరణ మొదలయింది.

పర్యాటకం

దేశములోని ప్రకృతి దృశ్యాలు, దేశ చరిత్ర మీద పర్యాటక రంగం కేంద్రీకరిస్తుంది. పర్యాటకులకు కొరకు దేశవ్యాప్తంగా వైన్ పర్యటనలు ఏర్పాటు చేయబడుతాయి. ద్రాక్షతోటలు/సెల్లార్ లలో క్రికోవ, పుర్కారి, సియుమై, రోమనేస్టి, కోజుస్న, మిలేస్టి మిసి ఉన్నాయి.

రవాణా

మోల్డోవాలో ముఖ్య రవాణా వ్యవస్థలు, రైళ్లు1,138 km (707 mi) , రహదారులు12,730 km (7,910 mi)*, 10,937 km (6,796 mi)*చదును చేయబడిన స్థలాలతో కలిపి. మోల్డోవాలో ఉన్న ఏకైక విమానాశ్రయం, చిసినావ్ అంతర్జాతీయ విమానాశ్రయం. డానూబేలో ఉన్న గియుర్గియులెస్టి టెర్మినల్ నుండి చిన్నపాటి సముద్ర ఓడలు రాకపోకలు చేపట్టొచ్చు. ప్రుట్, నిస్ట్రు నదులను ఓడల రాకపోకలు దేశము యొక్క రవాణా వ్యవస్థలో చిన్న పాత్రే పోషిస్తుంది.

టెలికమ్యూనికేషన్స్

మొబైల్ టెలిఫోన్ వాడుకదారుల సంఖ్య సెప్టెంబరు 2005లో మొదటి మిలియనుని దాటింది. క్రిందట ఏడాదితో పోల్చుకుంటే, 2008 యొక్క మొదటి త్రైమాసికంలో మోల్దోవాలోని మొబైల్ ఫోను వాడకందారుల సంఖ్య 47.3% పెరుగుదల నమోదు చేసి, 2 మిలియను 88.6 వేలకు చేరింది.

2008 ఆఖరిలో, మోల్డోవాలో 1,151,000 ఇంటర్నెట్ వాడుకదారుల ఉన్నారు. మొత్తము ఇంటర్నెట్ ప్రవేశం 30.1%గా ఉంది.

సెప్టెంబరు 2009లో మొబైల్ ఫోనులకు (HD వాయిస్) అనే హై-డేఫెనిషన్ వాయిస్ సేవలు ప్రపంచములోనే మొదటి సారిగా ప్రవేశపెట్టిన దేశం మోల్డోవా. , దేశీయ స్థాయిలో 40% జనాభాకు అందుబాటులో ఉండే విధముగా 14.4 Mbps బ్రాడ్ బాండ్ సేవలని జాతీయ స్థాయిలో ఐరోపా లోనే మొదటి సారిగా ప్రవేశపెట్టిన దేశము కూడా మోల్డోవానే.

జనాభా వివరాలు

మోల్డోవా 
2004 సంవత్సరపు ఎత్నో-లింగ్విస్టిక్ రచన

సాంస్కృతిక , జాతీయుల వివరాలు

2004 మోల్దోవా జనాభా గణన (కేంద్ర ప్రభుత్వ ఆధీనములో ఉన్న ప్రాంతాలు) , 2004 ట్రాన్స్నిస్త్రియ జనాభా గణన (తిరుగుబాటువాదుల ఆధీనములో ఉన్న ప్రాంతాలు, ట్రాన్స్నిస్త్రియ, బెండేర్/టిగినా , పొరుగున ఉన్న నాలుగు కంయూన్ లు) ప్రకారం జనాభా వివరాలు ఈ విధంగా ఉన్నాయి:

స్వీయ-గుర్తింపు మోల్డోవన్
జనాభా గణన
% కోర్
మోల్డోవా
ట్రాన్స్నిస్ట్రియన్
జనాభా గణన
% ట్రాన్స్నిస్ట్రియ
+ బెండర్
మొత్తం %
మొల్డోవన్లు1 2,564,849 75.81% 177,382 31.94% 2,742,231 69.62%
యుక్రేనియన్లు 282,406 8.35% 160,069 28.82% 442,475 11.23%
రష్యన్లు 201,218 5.95% 168,678 30.37% 369,896 9.39%
గగాజ్ 147,500 4.36% 4,096 0.74% 151,596 3.85%
రోమేనియన్లు1 73,276 2.17% 253 0.05% 73,529 1.87%
బల్గేరియన్లు 65,662 1.94% 13,858 2.50% 79,520 2.02%
రోమా 12,271 0.36% 507 0.09% 12,778 0.32%
యూదులు 2 3,608 0.11% 1,259 0.23% 4,867 0.12%
పోల్ లు 2,383 0.07% 1,791 0.32% 4,174 0.11%
ఇతరులు/

ప్రకటించనివారు

30,159 0.89% 27,454 4.94% 57,613 1.46%
మొత్తం   3,383,332   100%   555,347   100%   3,938,679   100%

1 రోమేనియన్లు , మొల్డోవన్లు ఒకే జాతికి చెందిన వారనే విషయం మీద ఒక వివాదం జరుగుతూ ఉంది. మొల్డోవన్ల స్వీయ-గుర్తింపు, రోమేనియన్లకంటే బిన్నమైనదా లేక రోమేనియన్లలో ఒక భాగమా అని వివాదం జరుగుతూ ఉంది.

జనాభా గణనలో ప్రజలు ఒక దేశీయతనే నమోదు చేసుకోవాలి. అందువలన ఎవరు కూడా తమని మోల్దోవన్ గానో రోమేనియన్ గానో నమోదు చేసుకోలేరు.

2 అల్పసంఖ్యాక వర్గమైన యూదుల జనాభా గతములో ఎక్కువగా ఉండేది. (1897లో బెస్సరేబియలో 225,637 యూదులు అనగా, జనాభాలో 11.65%).

భాషలు

"మోల్డోవా రిపబ్లిక్ యొక్క దేశీయ భాష మొల్డోవన్ అని , వ్రాత లాటిన్ అక్షరాల మీద ఆధారపడి ఉంటుంది" అని 1994 రాజ్యాంగం చెపుతుంది. అయితే 1991 లోని స్వాతంత్ర ప్రకటన రోమేనియన్ భాషని అధికార భాషగా ప్రకటిస్తుంది. 1989 దేశీయ భాషా చట్టం మోల్డో-రోమేనియన్ భాషల యొక్క గుర్తింపు గురించి ప్రస్తావిస్తుంది.

మొల్డోవా రిపబ్లిక్ యొక్క ముఖ్య జాతి పేరు గురించి ఒక రాజకీయ వివాదం నెలకొంది. 2003-2009లో కమ్యునిస్ట్ ప్రభుత్వం ఒక దేశవ్యాప్త రాజకీయ సూత్రాన్ని ఆమోదించింది. దీని ముఖ్య ఉద్ధ్యేశము మోల్డోవా రిపబ్లిక్ యొక్క దేశీయ రాజకీయములో ముఖ్య అంశాలలో ఒకటి అయిన మోల్దోవన్ భాష కొనసాగేలా చూడటమే. మోల్దోవన్, రోమేనియన్ భాషలు ఒకటేనని పండితులు అభిప్రాయపడినా, భాష పేరుని "మోల్దోవన్"గా కొన్ని రాజకీయ సందర్భాలలో వాడబడింది. ఈ అభిప్రాయాన్ని కొందరు మోల్దోవన్ రాజకీయవేత్తలు కూడా ఆమోదిస్తున్నారు. అయితే, సెప్టెంబర్ 29, 2009 నాడు, మోల్డోవా ప్రధానమంత్రి వ్లాడ్ ఫిలాట్, ఒక దశాబ్దములోనె బహిరంగంగా తన భాష రోమేనియన్ అని విదేశములో ప్రకటించిన మొదటి మోల్దోవన్ నేత.

"వివిధ జాతుల మధ్య సంభాషణలకు (అధికార భాషతో పాటు) వాడే భాష" అనే హొదా రష్యన్ భాషకు ఇవ్వబడింది. అయితే సమాజములోను దేశములోను అన్ని రంగాలలో రష్యన్ భాష వాడబడుతుంది. రష్యన్-మోల్దోవన్ ద్విభాషిత విధానం మోల్డోవా యొక్క ప్రత్యేక లక్షణం అని పైన చెప్పిన దేశవ్యాప్త రాజకీయ సూత్రం చెపుతుంది.

గగాజ్ , యుక్రేయిన్ భాషలని చాలా అధిక సంఖ్యలో కొన్ని ప్రాంతాలలో మాట్లాడుతారు. కనుక, గగాజియ , ట్రాన్స్నిస్ట్రియ ప్రాంతాలలో ఈ రెండు భాషలని కూడా రష్యన్ భాషతో పాటు అధికార భాష అనే హొదా ఇవ్వబడింది.

మోల్డోవా జనాభా మొల్డోవన్ (రోమేనియన్) రష్యన్ ఉక్రైయిన్ గగాజ్ బల్గేరియన్ ఇతర భాషలు,
ప్రకటించినవి
మాతృ భాష ప్రకారం 2,588,355
76.51%
380,796
11.26%
186,394
5.51%
137,774
4.07%
54,401
1.61%
35,612
1.04%
మొదటి భాషా వాడకం బట్టి 2,543,354
75.17%
540,990
15.99%
130,114
3.85%
104,890
3.10%
38,565
1.14%
25,419
0.75%

1996 నుండి ఈ గణతంత్రం రోమాన్స్-మాట్లాడే దేశము కూడా కాబట్టి, ఫ్రాంకోఫోనియ యొక్క పూర్తి స్థాయి సభ్య దేశము. అందువల్ల, విదేశీ భాషలలో ఫ్రెంచ్ భాష ప్రధానంగా ఉంటుంది. 2009/10లో L1గా 52% పాఠశాల విద్యార్దులకు, L2గా 7% విద్యార్ధులకు బోధించబడుతుంది. ఆంగ్ల భాష 48% , 6% విద్యార్ధులకు బోధించబడుతుంటే, జర్మన్ భాష మొత్తం 3% విద్యార్ధులకు బోధించబడుతుంది.

మతం

మోల్డోవా 
నేటివిటీ కాథెడ్రల్, చిసినావు
మోల్డోవా 
మోల్డోవా దేశీయ లైబ్రరి

2004 జనాభా గణనకు, తూర్పు ఛాందస క్రిస్టియన్లు మోల్డోవా జనాభాలో 93.3% ఉన్నారు. వీరు తాము ఏ రెండు ముఖ్య చర్చ్ లకు చెందిన వారని చెప్పవలసిన అవసరము లేదు. రష్యన్ ఛాందస చర్చి క్రింద స్వాధికారం పొంది ఉన్న మొల్డోవన్ ఛాందస చర్చి , రోమేనియన్ ఛాందస చర్చి క్రింద స్వాధికారం పొంది ఉన్న ఛాందస చర్చి అఫ్ బెస్సరబియ రెండూ కూడా దేశము యొక్క దేశీయ చుర్చిలుగా పేర్కొంటున్నాయి. దేశములో 2% జనాభా ప్రోటేస్టెంట్స్ అయితే, 1.2% మంది ఇతర మతాలకు చెందిన వారు. 0.9% జనము ఏ మతానికీ చెందని వారైతే, 0.4% మంది మత నమ్మకం లేని వారు. 2.2% జనము మతము గురించిన ప్రశ్నకు జనాభాలెక్కలలో ఏ సమాధానమూ ఇవ్వలేదు.

విద్య

మోల్డోవాలో 16 ప్రభుత్వరంగ , 15 ప్రైవేట్ సంస్థలు ఉన్నత విద్యకు ఉన్నాయి. ప్రభుత్వారంగ సంస్థలలో 104,300 మంది విద్యార్ధులు , ప్రైవేట్ సంస్థలలో 21,700 మందితో కలిపి మొత్తం 126,100 మంది విద్యార్ధులు చదువుతున్నారు. మోల్డోవాలో 10,000 మంది జనాభాకు విద్యార్ధుల సంఖ్య, సోవియట్ యూనియన్ రద్దు తరువాత, క్రమంగా పెరుగుతూ ఉంది. ఈ సంఖ్య 2000-2001lలో 217 గాను 2005-2006లో 351 గానూ ఉంది.

మోల్డోవా దేశీయ గ్రంథాలయం 1832 స్థాపించబడింది. మోల్డోవా యొక్క ముఖ్య శాస్త్రీయ సంస్థలైన మోల్డోవా స్టేట్ యూనివర్సిటీ , అకాడమీ అఫ్ సైన్సస్ అఫ్ మోల్డోవా 1946లో స్థాపించబడ్డాయి.

నేరం

మోల్డోవాలో ప్రధాన నేరాలు విస్త్రుతమైన నేరాలు , రహస్య ఆర్ధిక నేరాలు అని CIA వరల్డ్ ఫాక్ట్బుక్ విశదీకరించింది.

ఆరోగ్యం

జననాల సంఖ్య ఒక మహిళకు ఒకటిన్నర పిల్లలు చొప్పున లెక్కించబడింది. ఆరోగ్యం మీద ప్రభుత్వరంగ ఖర్చు GDP లో 4.2% కాగా ప్రైవేట్ రంగ ఖర్చు 3.2%గా ఉంది. 100,000 జనాభాకు సుమారుగా 264 మంది వైద్యులు ఉన్నారు. 2004లో ఆరోగ్యం మీద తలసరి (PPP) ఖర్చు 138 US$గా ఉంది.

సంస్కృతి

మోల్డోవా 
మిహై ఏమినేస్కు, మోల్డోవా , రోమేనియా యొక్క జాతీయ కవి

భూగోళపరంగా లాటిన్, స్లావిక్ , ఇతర సంసృతుల కలిసే ప్రదేశములో ఉన్న మాల్డోవా, పరిసర ప్రాంతాల సంస్కృతులు , ఇతర ప్రభావిత సంస్కృతులలో కొన్ని పద్ధతులని గ్రహించి తనకు ఒక ప్రత్యేక సంస్కృతిని సృష్టించుకుంది.

ఈ దేశము యొక్క సాంస్కృతిక వారసత్వం వల్ల, 15 వ శతాబ్దములో మోల్డవ పాలకుడైన స్టీఫన్ ది గ్రేట్ నిర్మించిన అనేక చర్చీలు, మొనాస్ట్రీలు , రేనైసన్స్ మెట్రోపాలిటన్లైన వర్లాం , డోసోఫ్టీ వారి సృష్టిలు , గ్రిగోర్ యురేచ్, మిరోన్ కోస్టిన్, నికోలే మిలేస్కు, డిమిట్రీ కన్టేమిర్, అయాన్ నేకుల్స్ వంటి పండితుల సృష్టిలు ఉన్నాయి. 19వ శతాబ్దములో, ఆనాటి మోల్డావియా ప్రిన్సిపాలిటికి చెందిన అనేక మాల్డోవియన్లు ఆధునిక రోమేనియన్ సంస్కృతి ఏర్పడటములో అతి పెద్ద పాత్ర వహించారు. ఆనాటి మోల్డావియా ప్రిన్సిపాలిటి, ఆస్ట్రియా, రష్యా, ఒట్టోమన్-క్రింద ఉన్న మోల్దవియ (1859 అనంతరం రోమేనియా) దేశాలలో ఉండేది. ఆలెక్షన్ద్రు డోనిచి, ఆలెక్షన్ద్రు హజ్డ్యు, బొగ్డన్ పెట్రిసికు హసడ్యు, కాంస్టాన్టిన్ స్టమటి, కాంస్టాన్టిన్ స్టమటి-సియురియ, కాస్టచ్ నేగ్రుజి, అలేకు రస్సో, కాంస్టాన్టిన్ స్టర్ వంటి అనేక బెస్సరేబియన్లు వీరిలో ఉన్నారు.

రొమాంటిక్ కవి మిహై ఏమినేస్కు , రచయిత అయాన్ క్రేంగా లు అత్యుత్తమ ప్రభావము కలిగిన రోమేనియన్ భాష కళాకారులు. వీరిని దేశీయ రచయితలుగా రోమేనియా , మోల్డోవాలో గుర్తించారు.

జనాభాలో 78.3% మోల్దోవన్ జాతీయులు ఉన్నారు. వీరు రోమేనియన్ భాష మాట్లాడి రోమేనియన్ సంస్కృతిని పాటిస్తున్నారు. బైజంటైన్ సంస్కృతి (తూర్పు ఛాందసపు ద్వారా) కూడా వీరి సంస్కృతి మీద ప్రభావం చూపింది.

దేశములో ముఖ్యమైన అల్ఫసంఖ్య జాతి సమాజాలు కూడా ఉన్నాయి. జనాభాలో 4.4% ఉన్న గగాజ్ లు దేశములోని ఏకైక క్రైస్తవ టుర్కిక్ ప్రజలు. 17వ శతాబ్ద ప్రారంభాము నుండి గ్రీక్కులు, అర్మేనియన్లు, పోలాండ్ వారు, యూదులు, ఉక్రైనియన్లు ఈ దేశములో ఉండి తమ తమ సాంసృతిక ముద్రలని విడిచి వెళ్లారు. 19 వ శతాబ్దములో ఎక్కువ సంఖ్యలో పోడోలియ, గలిషియ నుండి ఉక్రేనియన్లు , యూదులు దేశానికి వచ్చారు. వీరే కాక, లైపోవన్లు, [[బల్గేరియన్లు{/౦ {0}జర్మన్లు]] వంటి క్రొత్త వారు కూడా వచ్చారు.

20వ శతాబ్ద రెండవ భాగములో అతి పెద్ద సంఖ్యలో సోవియట్ జనము మోల్డోవా కు వలస వచ్చారు. వీరు సోవియట్ సంస్కృతి యొక్క అనేక అంశాలని దేశములో ప్రేవేశ పెట్టారు. ఇప్పుడు దేశములో ముఖ్య రష్యన్ (6%) , ఉక్రేనియన్ (8.4%) జనాభా ఉన్నారు. ఉక్రేనియన్ జాతీయులలో 50% మంది, గగాజియన్లలో 27% మంది, బల్గేరియన్లలో 35% మంది , చిన్నపాటి జాతీయులలో 54% మంది జనం రష్యన్ భాషని మొదటి భాషగా మాట్లాడుతున్నారు. మోల్డోవాలో రష్యన్ భాషని మొదటి భాషగా వాడేవారు మొత్తం 541,000 (అనగా జనాభాలో 16%) మంది ఉన్నారు, 130,000 మోల్దోవన్ జాతీయులతో కలిపి. అయితే, రోమేనియన్ భాషని మొదటి భాషగా వాడేవారి సంఖ్య 47,000 మందిగా ఉంది.

చారిత్రాత్మిక అల్పసంఖ్యావర్గీయుల సమాజము నుండి కొన్ని ప్రభావాలు, బెస్సరబియాన్ జర్మనులు,బెస్సరేబియాన్ యూదులు వంటి కొందరు వలస పోయిన ప్రజల యొక్క కొన్ని ప్రభావాలు కూడా ఉన్నాయి.

ప్రజాదరణ కలిగిన మాధ్యమాలు

అక్టోబరు 1939లో, రోమేనియన్ రేడియో బ్రాడ్కాస్టింగ్ కంపెనీ రేడియో బసార్బియ అనే స్థానిక స్టేషను ను చిసినావ్ లో ప్రారంభించింది.

ఏప్రిల్ 1958లో మోల్డోవాలో సోవియట్ టెలివిజన్ ఆధ్వర్యంలో టెలివిజన్ ప్రవేశపెట్టబడింది. అనేక రష్యన్ చానెల్ లు, కొన్ని రోమేనియన్ చానెల్ లు, అంతరాతీయ చానెల్ ల రష్యన్ భాష వర్షన్ లు , అనేక స్థానిక చానెల్ లు కేబుల్ ద్వారా మోల్డోవ ప్రేక్షకులు చూడగలరు. ఒక రష్యన్ , రెండు స్థానిక చానల్ లు ప్రసారణ చేయబడుతున్నాయి.

ఆహారం , పానీయాలు

మోల్డోవా 
సవేర్క్రాట్ , మమలిగాతో కలిపి కూరలతో నింపబడిన కేబేజీ చుట్టలు (సర్మేల్)
మోల్డోవా 
చిసినావ్ రోమేనియన్ ఆర్కెస్ట్రా సుమారు 1900

మోల్డోవన్ వంటకాలలో ముఖ్యంగా సాంప్రదాయ ఐరోపా ఆహారాలైన గొడ్డు మాంసం, పంది మాంసం, బంగాళాదుంపలు, క్యాబేజీ , అనేక రకాల ధాన్యాలు ఉన్నాయి. డివిన్ (మోల్దోవన్ బ్రాందీ), వోడ్కా , స్థానిక మధ్యాలు కూడా ప్రాచుర్యంలో ఉన్న మత్తు పానీయాలు.

సంగీతం

మోల్డోవా ప్రపంచ ప్రఖ్యాతి సాధించిన స్వరకల్పన రచయిత లైన గావ్రియిల్ మ్యుసిసేస్కు, స్టీఫేన్ నేయాగా , యుజన్ డోగా లకు జన్మస్థలము.

ప్రజాదరణ పొందిన సంగీతంలో మోల్డోవా బాయ్ బాండ్ ఓ-జోన్ ను సృష్టించగా, అది 2004 సంవత్సరములో "థ నుమా నుమా సాంగ్" అని కూడా పిలువబడే తమ విజయవంతమైన పాట డ్రాగోస్టియా డిన్ టే ద్వారా ప్రాముఖ్యతను సంపాదించుకుంది. మోల్డోవాలో మరొక ప్రజాదారణ పొందిన స్కా రాక్ బృందం అయిన జ్దోబ్ సి జ్డుబ్ ఆ దేశానికి 2005 సంవత్సరపు యురోవిషన్ పాటల పోటీలో ప్రాతినిధ్యం వహించింది.

క్రీడలు

భవన నిర్మాణ శాస్త్రం

మూలాలు

ప్రభుత్వం

సాధారణ సమాచారం

మోల్డోవా, ఆల్కంత్రీస్.eu (మోల్డోవా గురించిన సమాచారము)

  • మోల్డోవా అందలి యూదులు
  • ఓపెన్ డైరెక్టరీ ప్రాజెక్టులో మోల్డోవా
  • మోల్డోవా  Wiki Atlas of Moldova

అంతర్జాతీయ ర్యాంకింగ్స్

న్యూస్ మీడియా

Geographic locale

Tags:

మోల్డోవా పద చరిత్రమోల్డోవా చరిత్రమోల్డోవా స్వాతంత్రముమోల్డోవా ప్రభుత్వం , రాజకీయాలుమోల్డోవా పరిపాలన విభాగాలుమోల్డోవా భౌగోళిక స్థితిమోల్డోవా శక్తిమోల్డోవా జనాభా వివరాలుమోల్డోవా సంస్కృతిమోల్డోవా మూలాలుమోల్డోవా బాహ్య లింకులుమోల్డోవాEn-us-Moldova.oggen-us-Moldova.oggఉక్రెయిన్దస్త్రం:En-us-Moldova.oggభూపరివేష్టిత దేశంసోవియట్ యూనియన్

🔥 Trending searches on Wiki తెలుగు:

రమణ మహర్షినువ్వులుఆమ్నెస్టీ ఇంటర్నేషనల్సోనియా గాంధీపూరీ జగన్నాథ దేవాలయంఆదిత్య హృదయంహెప్టేన్యముడుఇన్‌స్టాగ్రామ్ఇంటి పేర్లుఎయిడ్స్విష్ణుకుండినులుగుండెభారత ప్రభుత్వంనవధాన్యాలురమ్య పసుపులేటిఆంధ్రప్రదేశ్ జిల్లాల జాబితాపద్మశాలీలుకామాక్షి భాస్కర్లనవరత్నాలురామదాసునయన తారమారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డిఅరటివరాహ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం (సింహాచలం)తెలుగు వికీపీడియాకేంద్రపాలిత ప్రాంతంఅమ్మల గన్నయమ్మ (పద్యం)బొల్లిపోక్సో చట్టంప్రజా రాజ్యం పార్టీఉలవలుకోదండ రామాలయం, ఒంటిమిట్టఒంటెశని (జ్యోతిషం)ఉమ్మెత్తఅంగచూషణసోంపుసన్ రైజర్స్ హైదరాబాద్భరణి నక్షత్రముకుటుంబంరామాయణంమహామృత్యుంజయ మంత్రంపుష్పబి.ఆర్. అంబేద్కర్తెలంగాణఅంతర్జాతీయ చారిత్రిక కట్టడాల దినోత్సవంతెలుగు సినిమాలు 2023ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్సంజు శాంసన్మచిలీపట్నం శాసనసభ నియోజకవర్గంక్షత్రియులుఅనూరాధ నక్షత్రంవశిష్ఠ మహర్షికరక్కాయఫేస్‌బుక్నువ్వు నాకు నచ్చావ్వర్షం (సినిమా)ఇంగ్లీషు-తెలుగు అనువాద సమస్యలునువ్వొస్తానంటే నేనొద్దంటానారంజాన్పెడన శాసనసభ నియోజకవర్గంభారత జాతీయగీతంసూర్యుడు (జ్యోతిషం)గోత్రాలుమహాత్మా గాంధీవామనావతారముదత్తాత్రేయశ్రీముఖివంగవీటి రాధాకృష్ణయోగాప్రజాస్వామ్యండీజే టిల్లుహైదరాబాదు మెట్రో స్టేషన్ల జాబితాప్రియా వడ్లమానిలలితా సహస్రనామ స్తోత్రంనాన్న (సినిమా)🡆 More