మార్షల్ దీవులు: ఓశియానియాలో ఒక దేశం

మర్షల్ ఐలాండ్స్ పసిఫిక్ మహా సముద్రం లోని ద్వీప దేశం.

ఇది అమెరికాకు అనుబంధంగా ఉన్న దేశం. ఇది భూమధ్య రేఖకు దగ్గరగా, అంతర్జాతీయ డేట్ లైనుకు కొద్దిగా పశ్చిమంగా ఉంటుంది. 2018 ప్రపంచ బ్యంకు జనగణన ప్రకారం దేశ జనాభా 58,413 ఈ జనాభా 1,156 దీవులు, లంకల్లో ఉన్నారు. దేశ రాజధాని మజురో. దేశం లోని అతిపెద్ద పట్టణం కూడా. 52.3% ప్రజలు రాజధాని మజురోలో నివసిస్తారు.

మార్శల్ ఐలాండ్స్
Flag of మార్శల్ ఐలాండ్స్ మార్శల్ ఐలాండ్స్ యొక్క
జాతీయగీతం
ఫరెవర్ మార్షల్ ఐలాండ్స్
మార్శల్ ఐలాండ్స్ యొక్క స్థానం
మార్శల్ ఐలాండ్స్ యొక్క స్థానం
ఇంగ్లీషు, Marshallese

ఈ దీవులకు సాగర సరిహద్దులుగా - ఉత్తరాన వేక్ ఐలాండ్, ఆగ్నేయంలో కిరిబాటి, దక్షిణాన నౌరు, పశ్చిమాన ఫెడరేటెడ్ స్టేట్స్ ఆఫ్ మైక్రొనేసియాలు ఉన్నాయి. ఐరస ప్రకారం జనసాంద్రత చ.కి.మీ.కు 295, 2020 జనాభా అంచనా 59,190.

1592 లో స్పెయిన్ ఈ దీవులను స్వంతం చేసుకుంది. అవి 1528 నుండి స్పానిష్ ఈస్ట్ ఇండీస్‌లో భాగంగానే ఉన్నాయి. 1885 లో స్పెయిన్ ఈ దీవుల్లో కొన్నిటిని జర్మను సామ్రాజ్యానికి అమ్మేసింది. అవి జర్మన్ న్యూ గినియాలో భాగమయ్యాయి. మొదటి ప్రపంచ యుద్ధంలో జపాను సామ్రాజ్యం ఈ దీవులను ఆక్రమించుకుంది. రెండవ ప్రపంచ యుద్ధంలో 1944 లో అమెరికా ఈ దీవులను నియంత్రణ లోకి తీసుకుంది. 1946 లో ఇక్కడి బికిని అటాల్‌పై అణు పరీక్షలను మొదలు పెట్టింది. 1958 వరకూ ఇవి సాగాయి.

రాజకీయంగా, మార్శల్ దీవుల్లో అధ్యక్ష ప్రజాస్వామ్య రిపబ్లిక్ వ్యవస్థ ఉంది. ఇది అమెరికాకు అనుబంధంగా ఉంటుంది. అమెరికా దీని రక్షణ వ్యవహారాలు చూసుకుంటుంది. ఈ దీవుల ఆర్థిక వ్యవస్థ సేవల రంగంపై ఆధారపడి ఉంది. మత్స్య పరిశ్రమ, వ్యవసాయం కూడా కొంతవరకు ఉంది. అమెరికా నుండి అందే ఆర్థిక సహాయం ఈ దీవుల జిడిపిలో అత్యధిక భాగం ఉంటుంది. అమెరికా డాలరునే తన ద్రవ్యంగా వాడుతుంది. క్రిప్టో కరెన్సీని కూడా వాడేందుకు ప్రణాళిక చేస్తున్నామని 2018 లో ప్రకటించింది.

దేశ పౌరుల్లో ఎక్కువ మంది మార్షలీస్ కు చెందినవారు. కొంతమంది అమెరికా, చైనా, ఫిలిప్పీన్ల నుండి వలస వచ్చి స్థిరపడిన వారు కూడా ఉన్నారు. మార్షలీస్, ఇంగ్లీషులు ఇక్కడి అధికార భాషలు.

మూలాలు

Tags:

🔥 Trending searches on Wiki తెలుగు:

యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీతీన్మార్ మల్లన్నసుగ్రీవుడునువ్వొస్తానంటే నేనొద్దంటానాతెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్శ్రీ కృష్ణ జన్మభూమిచేతబడిరమ్య పసుపులేటి2014 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుఅమెజాన్ ప్రైమ్ వీడియోభారత రాజ్యాంగం - ప్రాథమిక హక్కులువంగవీటి రంగాఈనాడుకలియుగంపరకాల ప్రభాకర్జూనియర్ ఎన్.టి.ఆర్శ్రీధూర్జటిజన సాంద్రతతెలుగు కులాలుఒంటిమిట్టరాజమండ్రిఅంతర్జాతీయ చారిత్రిక కట్టడాల దినోత్సవంకనకదుర్గ ఆలయంసౌందర్యబండారు సత్యనారాయణ మూర్తిఅలంకారంరోజా సెల్వమణిరూప మాగంటిమేరీ ఆంటోనిట్టేప్లీహముస్వదేశీ ఉద్యమంH (అక్షరం)సోంపుసజ్జల రామకృష్ణా రెడ్డిరాధిక ఆప్టేభారతదేశంలో మహిళలుప్రకృతి - వికృతిపసుపు గణపతి పూజవై.యస్. రాజశేఖరరెడ్డిధనూరాశితాంతియా తోపేకడప లోక్‌సభ నియోజకవర్గంతెలంగాణ లోక్‌సభ నియోజకవర్గాల జాబితాప్రజాస్వామ్యంకన్యాదానంవసంత వెంకట కృష్ణ ప్రసాద్మల్కాజ్‌గిరి లోక్‌సభ నియోజకవర్గంశాతవాహనులుచార్మినార్కస్తూరి రంగ రంగా (పాట)కామాక్షి భాస్కర్లయాదవవల్లభనేని బాలశౌరిశ్రీ సీతారాముల కల్యాణం చూతము రారండిఆంధ్రప్రదేశ్హస్తప్రయోగంశ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం (భద్రాచలం)ఎయిడ్స్పురుష లైంగికతబేతా సుధాకర్హైదరాబాదు లోక్‌సభ నియోజకవర్గంసునయనతెలుగు సినిమాలు 2024సూర్య నమస్కారాలుపొడుపు కథలుదక్షిణ భారతదేశంహలం (నటి)ఆదిపురుష్సామజవరగమనవందేమాతరంతిక్కనమర్రికృష్ణా నదిఇంగ్లీషు-తెలుగు అనువాద సమస్యలుక్షత్రియులుదగ్గుబాటి వెంకటేష్సీ.ఎం.రమేష్🡆 More