బిస్మత్

బిస్మత్ ఒక రసాయనిక మూలకం.

Bismuth, 00Bi
బిస్మత్
Bismuth
Pronunciation/ˈbɪzməθ/ (BIZ-məth)
Appearancelustrous silver
Standard atomic weight Ar°(Bi)
  • 208.98040±0.00001
  • 208.98±0.01 (abridged)
Bismuth in the periodic table
Hydrogen Helium
Lithium Beryllium Boron Carbon Nitrogen Oxygen Fluorine Neon
Sodium Magnesium Aluminium Silicon Phosphorus Sulfur Chlorine Argon
Potassium Calcium Scandium Titanium Vanadium Chromium Manganese Iron Cobalt Nickel Copper Zinc Gallium Germanium Arsenic Selenium Bromine Krypton
Rubidium Strontium Yttrium Zirconium Niobium Molybdenum Technetium Ruthenium Rhodium Palladium Silver Cadmium Indium Tin Antimony Tellurium Iodine Xenon
Caesium Barium Lanthanum Cerium Praseodymium Neodymium Promethium Samarium Europium Gadolinium Terbium Dysprosium Holmium Erbium Thulium Ytterbium Lutetium Hafnium Tantalum Tungsten Rhenium Osmium Iridium Platinum Gold Mercury (element) Thallium Lead Bismuth Polonium Astatine Radon
Francium Radium Actinium Thorium Protactinium Uranium Neptunium Plutonium Americium Curium Berkelium Californium Einsteinium Fermium Mendelevium Nobelium Lawrencium Rutherfordium Dubnium Seaborgium Bohrium Hassium Meitnerium Darmstadtium Roentgenium Copernicium Ununtrium Flerovium Ununpentium Livermorium Ununseptium Ununoctium
Sb

Bi

Uup
leadbismuthpolonium
Groupమూస:Infobox element/symbol-to-group/format
Periodperiod 6
Block  p-block
Electron configuration[Xe] 4f14 5d10 6s2 6p3
Electrons per shell2, 8, 18, 32, 18, 5
Physical properties
Phase at STPsolid
Melting point544.7 K ​(271.5 °C, ​520.7 °F)
Boiling point1837 K ​(1564 °C, ​2847 °F)
Density (near r.t.)9.78 g/cm3
when liquid (at m.p.)10.05 g/cm3
Heat of fusion11.30 kJ/mol
Heat of vaporization179 kJ/mol
Molar heat capacity25.52 J/(mol·K)
Vapor pressure
P (Pa) 1 10 100 1 k 10 k 100 k
at T (K) 941 1041 1165 1325 1538 1835
Atomic properties
Oxidation states−3, −2, −1, 0, +1, +2, +3, +4, +5 (a mildly acidic oxide)
ElectronegativityPauling scale: 2.02
Ionization energies
  • 1st: 703 kJ/mol
  • 2nd: 1610 kJ/mol
  • 3rd: 2466 kJ/mol
  • (more)
Atomic radiusempirical: 156 pm
Covalent radius148±4 pm
Van der Waals radius207 pm
Color lines in a spectral range
Spectral lines of bismuth
Other properties
Natural occurrenceprimordial
Crystal structure ​rhombohedral
Rhombohedral crystal structure for bismuth
Speed of sound thin rod1790 m/s (at 20 °C)
Thermal expansion13.4 µm/(m⋅K) (at 25 °C)
Thermal conductivity7.97 W/(m⋅K)
Electrical resistivity1.29 µΩ⋅m (at 20 °C)
Magnetic orderingdiamagnetic
Young's modulus32 GPa
Shear modulus12 GPa
Bulk modulus31 GPa
Poisson ratio0.33
Mohs hardness2.25
Brinell hardness94.2 MPa
CAS Number7440-69-9
History
DiscoveryClaude François Geoffroy (1753)
Isotopes of bismuth
బిస్మత్ Category: Bismuth
| references

మౌలిక సమాచారం

బిస్మత్ మూలకాల ఆవర్తన పట్టికలో 15 సమూహము, p- బ్లాకు, 6వ అవధి/పీరియడ్‌నకు చెందిన లోహం.మూలకం యొక్క సంకేత అక్షరంBi. బిస్మత్ ఒక పెంటవాలెంట్ పోస్ట్ ట్రాన్సిసన్ లోహం. బిస్మత్ రసాయనికంగా ఆర్సెనిక్, ఆంటిమొని మూలకాలను పోలివున్నది. బిస్మత్ మూలకరూపంలో ప్రకృతిలో లభించినప్పటికీ, ఎక్కువగా సల్పైడ్, ఆక్సైడ్ ముడిఖనిజ రూపంలో లభిస్తుంది.

చరిత్ర

బిస్మత్ అనాదిగా మానవునికి పరిచయముండుట వలన దీనిని మొదట ఎవరు లోహంగా గుర్తించినది చెప్పటం కష్టం. సా.శ.1546 లో "De Natura Fossilium" అనే గ్రంథంలో ఈ లోహం సీసం, తగరం కన్న భిన్నమైన లోహంగా అగ్రికోలా పేర్కొన్నాడు. 1738 లో జోహన్ హేన్రిచ్ పాట్ (Johann Heinrich Pott ), కార్ల్ విల్హెం స్కిలే (Carl Wilhelm Scheele, టి.ఒ.బెర్గమాన్ (Torbern Olof Bergman) తదితరులుసీసము (మూలకము), తగరం కన్న బిస్మత్తు భిన్నమైన లోహమని గుర్తించారు.1753 లో క్లాడ్ ఫ్రాన్కిస్ జియోఫ్రాయ్ (Claude Françంis Geoffroy ) బిస్మత్ లోహం, సీసం, తగరం లకన్నా భిన్నమైనదని ప్రత్యక్షంగా ప్రదర్శించి చూపాడు. కత్తులను తయారు చేయుటలో కంచుమిశ్రమ దాతువుతో కలిపి ఉపయోగిస్తారు.

వనరులు –ఉత్పత్తి

భూమిలో బిస్మత్ బంగారానికి రెండింతలు పరిమాణంలో లభిస్తుంది. బిస్మత్ యొక్క ముఖ్యమైన ఖనిజాలు బిస్మథైనైట్ (bismuthinite ), బిస్మైట్ (bismite) లు. దేశియ వనరులు ఆస్ట్రేలియా , బొలీవియా, చైనా దేశాలు. సంయుక్త రాష్ట్రాల జియోలోజికల్ సర్వే ప్రకారం 2010 లో ప్రంపంచ వ్యాప్తంగా 8,900 టన్నులు ఉత్పత్తి జరిగినది . అందులో సింహభాగం చైనా (6,500 టన్నులు, పెరు (1,100 టన్నులు ), మెక్సికో (850 టన్నులు ) దేశాలది. సీసం, రాగి, తగరం, మోల్బిడెనం, టంగ్‌స్టన్ లోహాల ఉత్పత్తిలో బిస్మత్ ఉప ఉత్పత్తి (by product ) గా లభిస్తుంది.

భౌతిక గుణాలు

బిస్మత్ పెలుసైన లోహం. రంగు వెండిలా తెల్లగా ఉండును. ఉత్పత్తి అయిన వెంటనే వెండిలా తెల్లని రంగు కలిగి ఉన్నప్పటికీ, లోహం ఉపరితలం ఆక్సిజన్ తో ఆక్సీకరణ ఫలితంగా కొద్దిగా పింకు రంగుగా కనిపించును. బిస్మత్ ఒక డైయమగ్నేటిక్ మూలకం.అనగా దీనిపై ప్రయోగించిన అయస్కాంత క్షేత్రానికి 180° కోణంలో అయస్కాంత గుణము ప్రదర్శించును. ఇది పాదరసం మినహాయించి మిగతా అన్ని లోహాలకన్న తక్కువ ఉష్ణవాహక విలువ కలిగిన లోహం. మూలకం యొక్క పరమాణు సంఖ్య 83. పరమాణు భారం :208.98040.

బిస్మత్ మూలకానికి కూడా నీటికున్న ఒక ప్రత్యేక లక్షణం కలిగి ఉంది. నీరు ఉష్ణోగ్రత తగ్గుతున్నప్పుడు 4 °C వరకు సంకోచిస్తుంది, అంతకన్న తగ్గేకొలది వ్యాకోచించును. బిస్మత్ కూడా తన గ్రూప్/సమూహంలోని సిలికాన్, gallium, ఆంటిమొని, జెర్మెనియం లకు భిన్నంగా, ఇది మాత్రం ఘనీభవించు ఉష్ణోగ్రత వద్ద వ్యాకోచించును బిస్మత్‌ను ఆక్సిజన్‌తో మండించిన బిస్మత్ నీలిమంటతో మండగా, దీని ఆక్సైడ్‌ పూత పసుపురంగు పొగలను వెలువరించును. దీని విష ప్రభావాన్నిఆవర్తన పట్టికలో పొరుగు ములకాలైన సీసం, అంటిమోని, పొలోనియం లతో పోల్చిన, వాటికన్న బాగా తక్కువ. బిస్మత్ యొక్క విద్యత్‌ప్రవాహ నిరోధతత్త్వం చాలా అధికం. దీనిని పలుచని పొరలుగా ఆధారం మీద వుంచిన సెమి కండక్టరుగా పనిచేయును.

బిస్మత్ మూలకం భౌతిక ధర్మాల పట్టిక

భౌతిక ధర్మం విలువ
రంగు వెండిలా తెలుపు
భౌతికస్థితి ఘనస్థితి
పరమాణుభారం 208.9804
ద్రవీభవన స్థానం 271.4 °C, 544.5 K
మరుగు స్థానం 1564 °C, 1837 K
ఎలక్ట్రాన్‌లసంఖ్య 83
ప్రోటాన్‌ల సంఖ్య 83
సాంద్రత @ 20 °C 9.807 గ్రాం/సెం.మీ3

రసాయనిక చర్యలు

సాధారణగది ఉష్ణోగ్రత వద్ద పొడి లేదా తడిగాలితో బిస్మత్ ఎటువంటి రసాయనిక చర్యకు లోను కాదు. ఎరుపెక్కునట్లు వేడిచేసిన నీటితో రసాయనచర్యలో పాల్గొని బిస్మత్ (iii ) ఆక్సైడ్‌ను ఏర్పరచును.

2Bi + 3H2O → Bi2O3 + 3H2

బిస్మత్ ప్లోరైడ్‌తో తక్కువ, ఎక్కువ (500 °C) ఉష్ణోగ్రత వద్ద చర్య జరుపును.500 °C వద్ద చర్య వలన బిస్మత్ (V ) ప్లోరైడ్, తక్కువ ఉష్ణోగ్రతవద్ద చర్యవలన బిస్మత్ (iii) ప్లోరైడ్ ఏర్పడును.100°Cపైన బిస్మథ్ ఫ్లోరైడ్ (BiF3) కు అదనంగా ఒక ఫ్ళోరైడ్ అణువు చేర్చబడిBiF5) ఏర్పడును. హలోజనులతో చర్య జరుపుట వలన బిస్మత్ (iii) హెలాయిడులు ఏర్పడును. ట్రై హెలాయిడులు లోహాలను క్షయింపచేయు లక్షణం (corrosive) కలవి, తేమతో త్వరితంగా చర్యలో పాల్గొని ఆక్సి హెలాయిడులను ఏర్పరచును.వీటి సంకేతం: BiOX

2Bi + 3X2 → 2BiX3 (X = F, Cl, Br, I)

బిస్మత్ గాఢ సల్పురిక్ ఆమ్లంలో కరిగి బిస్మత్ (iii) సల్పేట్, సల్పర్ డైఆక్సైడ్‌లను ఏర్పరచును.

6H2SO4 + 2Bi → 6H2O + Bi2 (SO4) 3 + 3SO2

నత్రికామ్లంతో రసాయనిక చర్య వలన బిస్మత్ (iii) నైట్రేట్ ఏర్పరచును.

Bi + 6HNO3 → 3H2O + 3NO2 + Bi (NO3) 3

ఆక్సిజన్ సమక్షములో హైడ్రోక్లోరిక్ ఆమ్లంలో కరిగి చర్య జరుపుట వలన బిస్మత్ క్లోరైట్ ఏర్పరచును.

4Bi + 3O2 + 12HCl → 4BiCl3 + 6H2O

క్షారమృత్తిక లోహ సంయోగపదార్థసమూహాలను (complexes) ఏర్పరచుటకు బిస్మత్‌ నులోహ పరివర్తన కారకం ( transmetalating) గా ఉపయోగించడం జరుగుతుంది.

3Ba + 2BiPh3 → 3BaPh2 + 2Bi

బిస్మత్ రసాయనిక సమ్మేళనాలు

బిస్మత్ ట్రై వాలెంట్, పెంటా వాలెంట్ సమ్మేళనాలను ఏర్పరచును.ముఖ్యంగా ట్రై వాలెంట్ సమ్మేళన పదార్థాలను ఏర్పరచడం ఎక్కువ. బిస్మత్ యొక్క చాలా రసాయనిక లక్షణాలు ఆర్సెనిక్, అంటిమోని లను పోలి ఉండును.

ఆక్సైడులు ,సల్పైడులు

  • ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద బిస్మత్ లోహపు ఆవిరులు వేగంగా చురుకుగా అక్సిజనుతో సమ్మేళనం చెందటం వలన పసుపువర్ణపు బిస్మత్ ట్రైఆక్సైడ్ ఏర్పడును (Bi2O3). ఈ ఆక్సైడ్ 710 °C వద్ద ద్రవస్థితిలో ఉండగా ఎటువంటి లోహఆక్సైడ్‌నైన హరించి వేయును (Corrosive, ప్లాటినంఆక్సైడ్‌ను కూడా క్షయింపజేయును.
  • క్షారాలతో చర్య వలన ఆక్సి ఆనయానులను విడుదల చేయును. BiO2 అనేది బహుజాతీయము (polymeric}, ఇది నిడువైన గొలుసాకృతి BiO3−3ను సృష్టించును. Li3BiO3 అనేది ఘనాకృతి ఆక్టామెరిక్ /అష్టరూప ఆనయాను. Na3BiO3 etrameric. ముదురు/చిక్కని ఎరుపు బిస్మత్ (v) ఆక్సైడ్ (BiO5, అస్థిరమైనది, వేడి చేసినచో ఆక్సిజన్‌ను విడుదల చేయును .
  • NaBiO3 సమ్మేళనం ఒకఆమ్లజనీకరణ పదార్థము (oxidising agent). బిస్మత్ సల్పైడ్ Bi2S3స్వాభావికంగా బిస్మత్ ముడిఖనిజంతో పాటు లభిస్తుంది.ద్రవబిస్మత్, సల్ఫరుల మిళనం వలన బిస్మత్ సల్పైడ్‌ను ఉత్పత్తి చేయవచ్చును.

బిస్మథైన్ , బిస్మథైడ్

బిస్మత్ యొక్క హైడ్రైడ్‌లు స్థిరమైనవి కావు. బిస్మత్‌ హైడ్రైడ్, బిస్మథైన్ (bismuthine (BiH3) ఏర్పడునప్పుడు జరుగు రసాయనికచర్య ఉష్ణగ్రాహక (endothermic) ప్రతి చర్య.అనగా చర్యాకాలంలో ఉష్ణం గ్రహింపబడుతుంది, ఇలా ఏర్పడిన సమ్మేళనం గది ఉష్ణోగ్రత వద్ద ఉభయవియోగం చెందుతుంది. ఇది - (minus )60C వద్ద మాత్రమే స్థిరంగా ఉండును. బిస్మథైడ్ (bismuthide) లు బిస్మత్, ఇతర లోహాల అంతర్లోహ (intermetallic) సమ్మేళనాలు.

ఐసోటోపులు(isotopes)

మొదట Bi -209 ని భారమైన స్థిరమైన ఐసోటోపుగా తలంచారు.కాని 2003 లో పూర్తిగా స్థిరమైనది కాదని ఇది అల్పా కిరణాలను వెలువరించడం వలన గుర్తించారు.Bi-209 ఆల్పా కిరణాల క్షయికరణ అర్ధజీవితకాలము 1.9X1019సంవత్సారాలని తేలినది.ఈ సమయం విశ్వంవయస్సు కన్న బిలియనురెట్లు ఎక్కువ.

బిస్మత్-209 అతి ఎక్కువ అర్ధజీవితకాలం కలిగిన స్థిరమైన భారలోహం, రేడియో ధార్మికతరహితం అగుట మూలాన, దీనిని వైద్య, పారిశ్రామిక రంగంలో బిస్మత్-209 ను విస్తృతంగా వాడెదరు.

బిస్మత్ మూలకం యొక్క ఐసోటోపుల అర్ధజీవిత కాలపట్టిక

ఐసోటోపులు అర్ధజీవితకాలం ఐసోటోపులు అర్ధజీవితకాలం
Bi-202 1.7గంటలు Bi-210 5.0రోజులు
Bi-204 11.2గంటలు Bi-21m 3000000 ఏండ్లు
Bi-205 15.3రోజులు Bi-211 2.1నిమిషాలు
Bi-206 6.24రోజులు Bi-212 1.0గంట
Bi-207 32.0ఏండ్లు Bi-213 45.6నిమిషాలు
Bi-208 368000ఏండ్లు Bi-214 19.9 నిమిషాలు
Bi-209 స్థిరం Bi-215 7.0నిమిషాలు

రేడియాన్ని లీనియరు పార్టికిల్ అక్సిలేటరు నుండి వెలువడిన bremsstrahlung ప్రోటానులతో బలంగా ఢీకొట్టింఛడం/తాటించడం వలన bismuth-213ను సృష్టించవచ్చును.దీని అర్ధజీవితకాలం 45 నిమిషాలు.అల్ఫాకణాలు మెటీరియల నుండి వెలువడగానే నశించును. దీనిని ల్యూకేమియ (leukemia) చికిత్సలోవాడెదరు.అంతేకాదు కాన్సరు చికిత్సలోTAT (targeted alpha therapy ) పొగ్రామ్లో వాడిచూసారు

ఉపయోగాలు

బిస్మత్ సమ్మేళనాలను ఎక్కువగా సౌందర్య సాధనాలలో, రంగులలో, స్వల్ప ప్రమాణంలో ఔషదాల తయారీ పరిశ్రమలలో వినియోగించుచున్నారు. ముఖ్యంగా పెప్టో –బిస్మోల్‌ను అతిసారం నిరోదినిగా వాడెదరు. బిస్మత్ తక్కువ విషకారక గుణం కల్గి ఉన్నందున, ముద్రణ అచ్చులను చేయుటకు (casting of printing type ) సీసం బదులుగా బిస్మత్తును ఉపయోగించం పెరిగింది. బిస్మత్తు ఉత్పత్తిలో మూడులో ఒకటవ వంతును ఈ అచ్చుల తయారీలో ఉపయోగిస్తున్నారు .

ఇవికూడా చూడండి

మూలాలు

Tags:

బిస్మత్ మౌలిక సమాచారంబిస్మత్ చరిత్రబిస్మత్ వనరులు –ఉత్పత్తిబిస్మత్ భౌతిక గుణాలుబిస్మత్ రసాయనిక చర్యలుబిస్మత్ రసాయనిక సమ్మేళనాలుబిస్మత్ ఐసోటోపులు(isotopes)బిస్మత్ ఉపయోగాలుబిస్మత్ ఇవికూడా చూడండిబిస్మత్ మూలాలుబిస్మత్ఆంటిమొనిఆర్సెనిక్మూలకం

🔥 Trending searches on Wiki తెలుగు:

ఉగాదినిమ్మగడ్డ రమేష్ కుమార్హృదయం (2022 సినిమా)షికారు (2022 సినిమా)మంత్రాలయంశతభిష నక్షత్రముఅంగారకుడు (జ్యోతిషం)సీమ చింతవిశ్వనాథ సత్యనారాయణఅంజలి (నటి)భారత రాష్ట్రపతిమ్యాడ్ (2023 తెలుగు సినిమా)భారతీయ రిజర్వ్ బ్యాంక్ఉద్దమ్ సింగ్పత్తిఉండేలునువ్వులుకేతిక శర్మయూట్యూబ్భారత స్వాతంత్ర్యోద్యమంమోక్షగుండం విశ్వేశ్వరయ్యహైదరాబాదు మెట్రో స్టేషన్ల జాబితాచిరంజీవితెలుగు పద్యముభారత జాతీయ ఎస్సీ కమిషన్బర్రెలక్కదేవదాసితెలంగాణా సాయుధ పోరాటంధనూరాశివై.ఎస్.వివేకానందరెడ్డిభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులువిభక్తిఉపనయనముఆలంపూర్ జోగులాంబ దేవాలయంలోక్‌సభ నియోజకవర్గాల జాబితాహను మాన్రాజులు (కులం)మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పధకంఅయేషా ఖాన్లలితా సహస్ర నామములు- 1-100ఏప్రిల్కామాక్షి అమ్మవారి దేవాలయం (కంచి)రావణుడుఆవారాడాక్టరేట్అక్కినేని నాగ చైతన్యజ్యేష్ట నక్షత్రంవరిసూర్య గ్రహణంసంధ్యావందనంపాండవులుగోత్రాలు జాబితామహాసముద్రంరష్మి గౌతమ్అయోధ్యక్షయజోల పాటలుఅడుగు (కొలమానం)నువ్వుల నూనెవావిలిజలియన్ వాలాబాగ్ దురంతంతెలుగు సినిమాలు 2023విద్యదుద్దిళ్ళ శ్రీధర్ బాబుతొలిప్రేమగుద మైథునంఏనుగుతెలుగు నాటకరంగంధనసరి అనసూయతెలంగాణ శాసనసభ నియోజకవర్గాల జాబితాఇరాన్అహోబిలంరాశి (నటి)పాల కూరవందేమాతరంపెరిక క్షత్రియులుసమాసంతాటిఅధిక ఉమ్మనీరు🡆 More