ప్రతిభా రాయ్

ప్రతిభా రాయ్ ఒరియా సాహిత్యవేత్త.

ఆమె అత్యుత్తమ భారతీయ సాహిత్య పురస్కారాల్లో ఒకటిగా పేరొందిన జ్ఞానపీఠ పురస్కారాన్ని పొందింది.

ప్రతిభా రాయ్
ప్రతిభా రాయ్
ప్రతిభా రాయ్
పుట్టిన తేదీ, స్థలం (1943-01-21) 1943 జనవరి 21 (వయసు 81)
అలబొల్, బలికుడా, జగత్ సింగ్ పూర్ జిల్లా, ఒడిశా
భాషఒరియా
జాతీయతభారతీయత
విద్యఎం.ఎ.(విద్య), పిహెచ్.డి.(విద్యా మానసికశాస్త్రం)
పూర్వవిద్యార్థిరవెన్ షా కళాశాల
గుర్తింపునిచ్చిన రచనలుయాజ్ఞసేని
పురస్కారాలుజ్ఞానపీఠ్ పురస్కారం
మూర్తిదేవి పురస్కారం
Website
http://www.pratibharay.org/

జీవిత విశేషాలు

ఆమె 1943 జనవరి 21 న ఒడిషా రాష్ట్రంలోని కటక్ జిల్లా లోని పూర్వపు ప్రాంతమైన జగత్సింగపూర్ నకు చెందిన బలికుడ లోని మారుమూల గ్రామమైన ఆలబాల్ లో జన్మించింది. మూర్తిదేవి పురస్కారం అందుకున్న మహిళలలో ఆమె ప్రథమురాలు. ఆమెకు ఈ పురస్కారం 1991లో వచ్చింది.

ఆమె సమకాలీన భారతదేశంలో ఒక ప్రముఖ కాల్పనిక రచనల కర్త. ఆమె తన మాతృభాష ఒడియాలో నవలలు, చిన్న కథలను రాస్తుంది. ఆమె రాసిన నవలలలో మొదటి నవల "బర్షా బసంత బైశాఖ (1974)" అత్యధికంగా అమ్ముడయింది.

తొమ్మిదేళ్ల వయస్సులో ఆమె సాహితీ రంగంలో అడుగుపెట్టిన నాటి నుండి "సమానత్వం ఆధారంగా సామాజిక క్రమం, ప్రేమ, శాంతి, సమైక్యత" వంటి అంశాలపై శోధిస్తూ వాటిని కొనసాగిస్తూ ఉంది. సమానత్వం ఆధారంగా కుల, మత, లేదా లింగ వివక్ష లేకుండా సామాజిక అంశాలపై రాస్తూంటే, ఆమె విమర్శకులలో కొందరు ఆమెను కమ్యూనిస్టుగా, మరికొందరు స్త్రీవాదిగా చిత్రీకరించారు. కానీ ఆమె తనను తాను మానవతా వాదిగా అభివర్ణించుకుంటుంది.

సమాజ ఆరోగ్యకరమైన పనితీరు కోసం పురుషులు, మహిళలు విభిన్నంగా సృష్టించబడ్డారు. మహిళలకు గల ప్రత్యేకతలను వారు మరింత పెంచుకోవాలి. ఒక మానవునిగా స్త్రీ, పురుషుడు సమానమే. ఆమె తన వివాహం అయిన తరువాత కూడా రచనా ప్రస్థానాన్ని కొనసాగించింది. ఆమెకు ముగ్గురు పిల్లలు. ఆమె మాస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్, పి.హెచ్.డి (విద్యా మనోవిజ్ఞానశాస్త్రం) లను పూర్తిచేసింది. ఆమె ఒడిశాలోని ఆదిమ గిరిజన తెగల గూర్చి పరిశోధించి "ట్రైబలిజం, క్రిమినాలజీ ఆఫ్ మాండో హైలాండర్" అనే అంశంపై పోస్టు డాక్టరల్ పరిశోధనను చేసింది.

జీవితం

ఆమె వృత్తిజీవితాన్ని పాఠశాల ఉపాధ్యాయినిగా ప్రారంభించింది. తరువాత 30 సంవత్సారాల పాటు ఒడిశా రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ కళాశాలలలో బోధించింది. ఆమె డాక్టరల్ పరిశోధనలకు మార్గనిర్దేశం చేసి, అనేక పరిశోధనా పత్రాలను ప్రచురించింది. ఆమె రాష్ట్రప్రభుత్వ సేవల నుండి విద్యారంగ ప్రొఫెసరుగా స్వచ్ఛంద పదవీ విరమణ చేసింది. తరువాత ఒడిశాలోని పబ్లిక్ సర్వీసు కమిషనులో సభ్యురాలిగా చేరింది..

ఇతర సేవలు

ఆమెకు సంఘ సంస్కరన అంటే ఆసక్తి ఎక్కువ. ఆమె అనేక సందర్భాలలో సామాజిక అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడింది. అందులో ముఖ్యమైన సంఘటన పూరీ జగన్నాథ దేవాలయంలో జరిగింది. ఆమె ఆ దేవాలయంలోని పూజారులు దేవాలయ ప్రవేశంలో వర్ణ వివక్ష (కుల/మత) పాటిస్తున్నందున దానికి వ్యతిరేకంగా పోరాడింది. పూజారుల అవాంఛనీయ ప్రవర్తనకు వ్యతిరేకంగా వార్తా పత్రికలో "ద కలర్ ఆఫ్ రెలిజియన్ ఈస్ బ్లాక్" (ధర్మార రంగ కళ) శీర్షికతో కథనాన్ని ప్రచురించింది. ఇప్పుడు ఆమె ఆ కథనానికి వ్యతిరేకంగా పూజారులు వేసిన పరువు నష్టం కేసుపై పోరాడుతోంది. 1999 అక్టోబరులో ఒడీశాలో సంభవించిన తుఫానుకు గురైన ప్రాంతాలను ఆమె సందర్శించింది. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో అనాథల, వితంతువుల పునరావాసం కోసం కృషి చేస్తోంది.

యాత్రలు

ఆమె భారతదేశంలో వివిధ జాతీయ సాహితీ కార్యక్రమాలలో , విద్యా సమావేశాలలో పాల్గొంది. ఆమె 1986లో పూర్వపు USSR లో గల ఐదు రిపబ్లిక్ దేశాలను సందర్శించి, ISCUS చే నిర్వహింపబడుతున్న సాంస్కృతిక మార్పిడి కార్యక్రమాలలో పాల్గొన్నది. 1994 లో న్యూఢిల్లీ లోని ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్ సంస్థ నిర్వహించిన "ఇండియా టుడే 94" కార్యక్రమంలో భారతీయ రచయితగా ప్రాతినిధ్యం వహించింది. ఆమె ఆస్ట్రేలియాలోని వివిధ విశ్వవిద్యాలయాలలో భారతీయ సాహిత్యం , భాషల గూర్చి చర్చలు, ఉపన్యాసాలు చేసింది. ఆమె అమెరికా సంయుక్త రాష్ట్రాలు, యునైటెడ్ కింగ్‌డం, ఫ్రాన్స్ దేశాలను సందర్శించి ఉపన్యాసాలిచ్చింది. 1996 లో బంగ్లాదేశ్లో జరిగిన "ఇండియన్ ఫెస్టివల్"లో భారతీయ రచయితగా ప్రాతినిధ్యం వహించింది. 1999 జూన్ లో నార్వే లోని ట్రామ్సో విశ్వవిద్యాలయంలో జరిగిన 7వ అంతర్జాతీయ మహిళా అంతఃక్రమశిక్షణ కాంగ్రెస్" సభలకు అతిధిగా హాజరయింది. 1999లో నార్వే, స్వీడన్, ఫిన్‌లాండ్, డెన్మార్క్ దేశాలకు ఉపన్యాస పర్యటన చేసింది. 2000లో జూరిచ్, స్విడ్జర్లాండ్ దేశాలలో జరిగిన సెమినార్ లలో "ధర్డ్ యూరోపియన్ కాన్ఫరెన్స్ ఆన్ జెండర్ ఈక్వాలిటీ ఇన్ హయ్యర్ ఎడ్యుకేషన్" అంశంపై పత్రాలను సమర్పించడానికి సందర్శించింది.

సభ్యత్వాలు

ఆమె అనేక అధ్యయన సమాజాలలో సభ్యురాలిగా ఉంది. ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చురల్ రిలేషన్స్, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, ఇండియా ఇంటర్నేషనల్ సెంటర్, నేషనల్ బుక్ ట్రస్టు ఆఫ్ ఇండియా, సెంట్రల్ అకాడమీ ఆఫ్ లెటర్స్ మొదలైన సంస్థలతో సంబంధం కలిగి ఉంది. ఆమె దేశ విదేశాలలో పర్యటనను చేసి వివిధ విద్యా సదస్సులలో పాల్గొంది. ఆమె రాసిన సృజనత్మక రచనలకు గాను అనేక జాతీయ, స్టేట్ పురస్కారాలు పొందింది.

కొన్ని రచనలు

నవలలు

  • బర్షా బసంత బైశాఖ 1974
  • అరణ్య, 1977
  • నిషిద్ధ పృధివి, 1978
  • పరిచయ, 1979
  • అపరిచిత, 1979 (ఈ కథతో తీసిన చలన చిత్రం ఉత్తమ కథగా ఒడిశా రాష్ట్ర ప్రభుత్వంచే పురస్కారం పొందింది)
  • పుణ్యతోయ (గ్రామ బాలిక మేఘీ కథ), 1979 (హిందీలోఅనువాదమయినది)
  • మేఘమెదుర, 1980
  • ఆషాబరి, 1980
  • అయామారంభ, 1981
  • నిలతృష్ణ, 1981 (హిందీలో అనువాదం జరిగింది)
  • సముద్ర స్వర, 1982 (హిందీలో అనువాదం జరిగింది)
  • శిలాపద్మ, 1983 (ఒడిశా సాహిత్య అకాడమీ పురస్కార< 1985; అస్సామీ, హిందీ, మరాఠీ, మలయాళం, పంజాబీ, ఆంగ్ల భాషల లోనికి అనువాదం) )
  • యాజ్ఞసేని, 1984 (మూర్తిదేవి పురస్కారం, 1991, సరళ పురస్కారం, 1990. ఆంగ్ల, హిందీ, మలయాళం, మరాఠీ, అస్సామీ, బెంగాళీ, గుజరాతీ, హంగేరియన్ భాషలలోనికి అనువాదం) )
  • దేహాతీత, 1986
  • ఉత్తరమార్గ్, 1988 (హిందీ, పంజాబీ భాషలలోనికి అనువాదం)
  • ఆదిభూమి (హిందీ, ఆంగ్ల భాషలలోనికి అనువాదం)
  • మహామోహ, 1998 (హిందీ, బెంగాళీ, మలయాళం భాషలలో ప్రచురితం కానున్నవి)
  • మగ్నమాటి, 2004

'యాత్రా చరిత వర్ణనా

  • మైత్రీ పదపర శాఖ ప్రశాఖ (USSR), 1990
  • దూర ద్వివిధ (యు.కె. ఫ్రాన్స్), 1999
  • అపరధీర శ్వేద (ఆస్ట్రేలియా), 2000

లఘు కథలు

  • సామాన్య కథన – 1978
  • గంగా శివ్లి – 1979
  • అసామప్టా – 1980
  • ఐకతన – 1981
  • అనబాన – 1983
  • హటబక్ష – 1983
  • ఘాస్ ఓ ఆకాశ
  • చంద్రభాగ ఓ చంద్రకళ – 1984
  • శ్రేష్ట గల్ప – 1984
  • అభ్యక్త (టెలిఫిల్మ్‌గా రూపొందినది) – 1986
  • ఇతిబత్ – 1987
  • హరిపత్ర – 1989
  • ప్రతక్ ఈశ్వర – 1991
  • భగవానర దేశ – 1991
  • మనుష్య స్వర – 1992
  • స్వ-నిర్వచిత శ్రేష్టగల్ప – 1994
  • శష్టసతి – 1996
  • మోక్ష ( చలన చిత్రంగా రూపొందినది. ఉత్తమ ప్రాంతీయ భాషా చలన చిత్ర పురస్కారం ) – 1996
  • ఉల్లఘ్న (సాహిత్య అకాడమీ పురస్కారం,2000) – 1998
  • నివేదనం ఇదం – 2000
  • గంధింక – 2002
  • జ్యోతిపాక కంథ – 2006

దత్తతలు

  • యాజ్ఞసేని (నాటకం) - రాయ్ నవల "యాజ్ఞసేని"ని నేపాలీలో సోలో నాటకంగా సుమన్ పుఖ్రేల్ కి యివ్వబడింది

పురస్కారాలు, గుర్తింపులు

  • 1985 – 'ఒడిశా సాహిత్య అకాడమీ పురస్కారం ' - శీలా పద్మ నవలకు
  • 1990 – 'సరళ పురస్కారం' - యాజ్ఞసేని నవలకు
  • 1991 – 'మూర్తిదేవి పురస్కారం' - యాజ్ఞసేని నవలకు
  • 2000 – 'సాహిత్య అకాడమీ పురస్కారం ' - ఉల్లంఘ కథా సంపుటికి
  • 2006 – 'అమృత కీర్తి పురస్కారం '
  • 2007 – 'పద్మశ్రీ పురస్కారం' - భారత ప్రభుత్వంచే సాహిత్య, విద్య విభాగంలో.
  • 2011 – 'జ్ఞానపీఠ పురస్కారం'
  • 2013 – ఒడిశా లివింగ్ లెజెండ్ పురస్కారం (సాహిత్యం)

మూలాలు



Tags:

ప్రతిభా రాయ్ జీవిత విశేషాలుప్రతిభా రాయ్ జీవితంప్రతిభా రాయ్ ఇతర సేవలుప్రతిభా రాయ్ యాత్రలుప్రతిభా రాయ్ సభ్యత్వాలుప్రతిభా రాయ్ కొన్ని రచనలుప్రతిభా రాయ్ దత్తతలుప్రతిభా రాయ్ పురస్కారాలు, గుర్తింపులుప్రతిభా రాయ్ మూలాలుప్రతిభా రాయ్ బయటి లింకులుప్రతిభా రాయ్జ్ఞానపీఠ పురస్కారం

🔥 Trending searches on Wiki తెలుగు:

అయ్యప్పరోహిత్ శర్మరామతీర్థం (నెల్లిమర్ల)జ్యేష్ట నక్షత్రంహనుమాన్ చాలీసాగ్రామ పంచాయతీభారత రాజ్యాంగ సవరణల జాబితాఇందిరా గాంధీలోక్‌సభరక్తపోటుఆంధ్రప్రదేశ్‌లో 2024 భారత సార్వత్రిక ఎన్నికలుపెడన శాసనసభ నియోజకవర్గంబారసాలఅక్కినేని నాగార్జునఇంగువపమేలా సత్పతిసరస్వతిరోహిణి నక్షత్రంమఖ నక్షత్రముభగవద్గీతబాలగంగాధర తిలక్ఎయిడ్స్పాల కూరదాశరథి కృష్ణమాచార్యభారత రాజ్యాంగంఅరటికాట ఆమ్రపాలిపొట్టి శ్రీరాములువిక్రమ్ఆంధ్రప్రదేశ్ శాసనసభ నియోజకవర్గాల జాబితావిశాఖపట్నంరామప్ప దేవాలయంవంగవీటి రాధాకృష్ణఅశ్వమేధ యాగంభద్రాచలంపంచభూతాలుహోళీరావు గోపాలరావుశ్రీకాళహస్తిమోత్కుపల్లి నర్సింహులుఆల్బర్ట్ ఐన్‌స్టీన్పులివెందుల శాసనసభ నియోజకవర్గంఇందుకూరి సునీల్ వర్మసీతా రామంజోస్ బట్లర్వై.ఎస్.వివేకానందరెడ్డి హత్యపూర్వాభాద్ర నక్షత్రముహరే కృష్ణ (మంత్రం)దక్షిణ భారతదేశంసీతారామ కళ్యాణంభారతీయ రిజర్వ్ బ్యాంక్రవితేజకృత్రిమ మేధస్సుశ్రీరామ పట్టాభిషేకంకాప్చాకుంభరాశిరఘుబాబుదృశ్యం 2అంజలీదేవియువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీసలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుమధుమేహంవాల్మీకిరఘుపతి రాఘవ రాజారామ్బుధుడు (జ్యోతిషం)సంగీత వాయిద్యందాశరథీ శతకమువిజయనగర సామ్రాజ్యంఔరంగజేబుస్వాతి నక్షత్రముదివ్యభారతిభువనగిరి లోక్‌సభ నియోజకవర్గంచరవాణి (సెల్ ఫోన్)జగ్జీవన్ రాంమరణానంతర కర్మలుసప్త చిరంజీవులు🡆 More