పంజాబ్ ప్రాంతం

పంజాబ్ (/pʌndʒˈɑːb/ ( listen), /ˈpʌndʒɑːb/, /pʌndʒˈæb/, /ˈpʌndʒæb/) (ఐదు నదుల ప్రాంతంగా సుప్రసిద్ధం) (పంజాబీ: پنجاب, ਪੰਜਾਬ; హిందీ: पंजाब), అన్నది భారత ఉపఖండం లేదా దక్షిణాసియాలోని వాయువ్యపు చివరి ప్రదేశాలు కల ప్రాంతం.

ఉత్తర భారతదేశంలో, తూర్పు పాకిస్తాన్ లోని భూభాగాల్లో ఇది విస్తరించింది.

పంజాబ్
پنجاب
ਪੰਜਾਬ
पंजाब
పంజాబ్ ప్రాంతం
అతిపెద్ద నగరాలు ఢిల్లీ
లాహోర్
ఫైసలాబాద్
దేశాలు
Official languages
Area 445,007 km2 (171,818 sq mi)
జనాభా (2011) ~200 కోట్లు
జన సాంద్రత 449/km2
మతాలు
Demonym పంజాబీ

ఈ ప్రాంతంలో సింధు లోయ నాగరికత, వేద సంస్కృతి విలసిల్లాయి, అచేమెనిద్ సామ్రాజ్యం, గ్రీకులు, కుషాణులు, గజ్నవీదులు, తైమూరులు, మొగలులు, ఆఫ్ఘాన్లు, బ్రిటీష్ వారు మొదలైన విదేశీయులెందరో సాగించిన అసంఖ్యాకమైన, మేరలేని దండయాత్రలను చారిత్రికంగా చూస్తూనేవుంది. పంజాబ్కు చెందిన ప్రజల్ని పంజాబీలు అని, వారి భాషను పంజాబీ భాష అని పిలుస్తున్నారు. పంజాబ్ ప్రాంతంలోని ప్రధానమైన మతాలు ఇస్లాం, హిందూ మతం, సిక్ఖు మతాలు. ఇతర మత సమూహాల్లో క్రైస్తవం, జైన మతం, బౌద్ధం కూడా ఉన్నాయి.

1947లో బ్రిటీష్ ఇండియా పరిపాలన నుంచి భారత ఉపఖండం స్వతంత్రం కావడంతోటే ఈ ప్రాంతం భారత, పాకిస్తాన్ దేశాల మధ్య విభజితమైంది.

పాకిస్తాన్ లో పంజాబ్ ప్రాంతంలో పాకిస్తానీ పంజాబ్, ఇస్లామాబాద్ రాజధాని ప్రాంతం, భీంబెర్, మీర్ పూర్ వంటి ప్రాంతాల చుట్టూ ఉన్న ఆజాద్ కాశ్మీర్ లోని దక్షిణ ప్రాంతాలు, ఖైబర్ పఖ్తూన్ఖ్వా లోని కొన్ని ప్రాంతాలు (పెషావర్ వంటివి పంజాబ్ ప్రాంతాలుగా అక్కడ పిషోర్ గా పేరొందాయి).

భారతదేశంలో ఈ ప్రాంతంలో పంజాబ్ రాష్ట్రం, చండీగఢ్, జమ్ము డివిజన్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్లో కొన్ని ప్రాంతాలు, ఢిల్లీలోని కొన్ని భాగాలు, రాజస్థాన్ లోని కొంత భాగం, ప్రధానంగా గంగానగర్ జిల్లా, హనుమాన్‌గర్ జిల్లా వంటివి ఉన్నాయి.

పదవ్యుత్పత్తి

ఈ ప్రాంతాన్ని మొదట్లో సప్త సింధు అని పిలిచేవారు, ఆ పదం ఏడు నదులు సముద్రంలోకి కలిసే వేదభూమిని సూచిస్తుంది. రామాయణం, మహాభారతాల్లో సంస్కృతంలో ప్రస్తావించిన సంస్కృత పదం - "పంచనద" అంటే ఐదు నదుల భూమి. ఇదే పదం ముస్లిం దండయాత్రల అనంతరం పర్షియన్‌లోకి "పంజాబ్"గా అనువదించారు. పంజాబ్ అన్న పదం రెండు పర్షియన్ పదాల కలయికతో ఏర్పడింది, పంజ్ (ఐదు), అబ్ (నీరు). ఈ పదం ఈ ప్రాంతాన్ని జయించిన టర్కో-పర్షియన్ దండయాత్రికులు పంజాబ్ అన్న పదానికి వ్యాప్తి కల్పించారు, మరీ ముఖ్యంగా, ముఘల్ సామ్రాజ్య పరిపాలనా కాలంలో ఈ పదం స్థిరపడింది. ఝేలం, చీనాబ్, సట్లెజ్, బియాస్ నదులను ఉద్దేశించే పంజాబ్ లేక పంచనద అని పిలిచారు. ఇవన్నీ సింధు నదికి ఉపనదులు.

రాజకీయ భూగోళం

పంజాబ్ ప్రాంతానికి ప్రధానంగా రెండు నిర్వచనాలు ఉన్నాయి: 1947 నాటి నిర్వచనం, 1846-1849 నాటి నిర్వచనం. మూడవ నిర్వచనం 1947 నాటి నిర్వచనం, 1946-49 నాటి నిర్వచనం కలుపుకుంటూ, దానితో పాటుగా భాషాపరంగానూ, ప్రాచీన నదుల గమనాన్ని అనుసరిస్తూ ఉత్తర రాజస్థాన్ ప్రాంతాలను కూడా కలుపుకుంటుంది.

1947 నిర్వచనం

1947 నిర్వచనం పంజాబ్ ప్రాంతాన్ని అప్పటికి విలీనమౌతూన్న బ్రిటీష్ ఇండియాలోని నాటి బ్రిటీష్ పంజాబ్ ప్రావిన్సుగా నిర్వచిస్తోంది. ఈ పంజాబ్ ప్రావిన్సు భారత విభజనలో భారత, పాకిస్తాన్‌ల నడుమ విభజితమైంది. ఇది పాకిస్తాన్‌లో పంజాబ్ ప్రావిన్సు, ఇస్లామాబాద్ రాజధాని ప్రాంతాల్లోనూ, భారతదేశంలో పంజాబ్ రాష్ట్రం, ఛండీగఢ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో విస్తరించింది.

కాలరేఖ

  • క్రీ.పూ.3300–1500: సింధు లోయ నాగరికత - పంజాబ్ ప్రధాన కేంద్రం
  • క్రీ.పూ.1500–1000: (రుగ్వేద) వేద సంస్కృతికి పంజాబ్ ముఖ్య కేంద్రమైంది
  • క్రీ.పూ.1000–500: మధ్య, తుది వేద సంస్కృతిలో పంజాబ్
  • క్రీ.పూ.599: మహావీర జైనుని జననం
  • క్రీ.పూ.567–487: గౌతమ బుద్ధుని కాలం
  • క్రీ.పూ.550 – 600 CE: బౌద్ధం ప్రాచుర్యంలో ఉంది
  • క్రీ.పూ.326: అలెగ్జాండర్ పంజాబ్ దండయాత్ర
  • క్రీ.పూ.322–298: చంద్రగుప్త మౌర్యుడు, మౌర్య కాలం
  • క్రీ.పూ.273–232: అశోకుని పాలన
  • క్రీ.పూ.125–160: శకుల వృద్ధి
  • క్రీ.పూ.2: శకుల పాలన ప్రారంభం
  • 45–180: కుషాణుల పరిపాలన
  • 320–550: గుప్త సామ్రాజ్యం
  • 500: పంజాబ్ ప్రాంతంలో హూణుల దండయాత్ర
  • 510–650: హర్షవర్థనుడి యుగం
  • 711–713: మహమ్మద్ బిన్ ఖాసిం సింధ్ ప్రాంతాన్ని, పంజాబ్ లో కొద్ది భాగాన్ని ఆక్రమించి పరిపాలించారు.
  • 713–1200: రాజపుత్రులు రాజ్యాలు, కాబూల్ షాహీలు, చిన్న చిన్న ముస్లిం రాజ్యాలు పంజాబ్ ప్రాంతాన్ని పాలించాయి.
  • 1206–1290: మామ్లుక్ సుల్తానుల రాజ్యాన్ని మహమ్మద్ ఘోరీ స్థాపించారు.
  • 1290–1320: ఖిల్జీ సామ్రాజ్యాన్ని జలాలుద్దీన్ ఫిరోజ్ ఖిల్జీ స్థాపించారు.
  • 1320–1413: తుగ్లక్ వంశ పాలన గియాసుద్దీన్ తుగ్లక్ స్థాపించారు.
  • 1414–1451: సయ్యద్ వంశ పాలన ఖిజ్ర్ ఖాన్ స్థాపించారు.
  • 1451–1526: లోఢీ వంశ పాలన బాహ్లుల్ ఖాన్ లోఢీ స్థాపించారు.
  • 1469–1539: గురు నానక్
  • 1526–1707: మొఘల్ సామ్రాజ్యం పరిపాలన
  • 1539–1675: గురు అంగద్ దేవ్ నుంచి గురు తేజ్ బహదూర్ వరకూ 8మంది సిక్ఖు గురువుల కాలం
  • 1675–1708: గురు గోవింద సింగ్ (10వ సిక్ఖు గురువు)
  • 1699: ఖల్సా జననం
  • 1708–1713: బందా సింగ్ బహదూర్ యుద్ధాలు, పరిపాలన
  • 1722: ముల్తాన్, పంజాబ్ లో కానీ, హేరత్, ఆఫ్ఘనిస్తాన్ లో కానీ అహ్మద్ షా దురానీ జననం
  • 1714–1759: సిక్ఖు సర్దార్లు ఆఫ్ఘాన్లు, మొఘల్ గవర్నర్లకు వ్యతిరేకంగా పోరాటం
  • 1739: నాదిర్షా దండయాత్ర, బలహీనమైన మొఘల్ సామ్రాజ్యం ఓటమి
  • 1747–1772: అహ్మద్ షా దురానీ నేతృత్వంలో దురానీ సామ్రాజ్యం
  • 1756–1759: పంజాబ్ వరకూ మరాఠాల దండయాత్ర, విజయం. సిక్ఖు, మరాఠా సామ్రాజ్యాల సమన్వయం
  • 1761: మూడవ పానిపట్టు యుద్ధంలో ఆఫ్ఘాన్ దురానీ సైన్యాల చేతిలో మరాఠాల ఓటమి.
  • 1762: అహ్మద్ షా అబ్దాలీ 2వ దండయాత్రలో 2వ ఊచకోత
  • 1765–1801: పంజాబ్ ప్రాంతంలో చెప్పుకోదగ్గ ప్రాంతాలను సిక్ఖు మిస్ల్ లు నియంత్రణ సాధించారు.
  • 1801–1839: సర్కార్ ఖల్సాగా పేరొందిన సిక్ఖు సామ్రాజ్యం స్థాపన, మహారాజా రంజీత్ సింగ్ పరిపాలన
  • 1845–1846: మొదటి ఆంగ్లో-సిక్ఖు యుద్ధం
  • 1846: జమ్ము డివిజన్ సరికొత్త జమ్ము కాశ్మీర్ రాష్ట్రంలో చేరిక
  • 1848–1849: రెండవ ఆంగ్లో-సిక్ఖు యుద్ధం
  • 1849: పంజాబ్ పూర్తిగా బ్రిటీష్ ఇండియాలో చేరిక
  • 1849–1947: బ్రిటీష్ పాలన
  • 1901: పెషావర్, దాన్ని చేరిన ఇతర జిల్లాలు పంజాబ్ ప్రావిన్సు నుంచి విడిపోయాయి.
  • 1911: పంజాబ్ ప్రావిన్సు నుంచి కొన్ని ప్రాంతాలు ఢిల్లీలో చేరిక
  • 1947: భారత విభజనలో భాగంగా పంజాబ్ ను రెండుగా విభజించారు. తూర్పు భాగం (రెండు నదులతో) భారతీయ పంజాబ్, పశ్చిమ భాగం (మూడు నదులతో) పాకిస్తానీ పంజాబ్ ఏర్పడ్డాయి.
  • 1947: పాకిస్తానీ పంజాబ్ ప్రావిన్సు నుంచి ఇస్లామాబాద్ విడిపోయింది.
  • 1955: పాకిస్తానీ పంజాబ్ కు ప్రావిన్సు హోదా రద్దు
  • 1966: భారతీయ పంజాబ్ మూడుగా విడిపోయి పంజాబ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్ ప్రాంతాల్లో చేరిక
  • 1971: పాకిస్తానీ పంజాబ్ కు తిరిగి ప్రావిన్సు హోదా

చిత్రాలు

మూలాలు

Tags:

పంజాబ్ ప్రాంతం పదవ్యుత్పత్తిపంజాబ్ ప్రాంతం రాజకీయ భూగోళంపంజాబ్ ప్రాంతం కాలరేఖపంజాబ్ ప్రాంతం చిత్రాలుపంజాబ్ ప్రాంతం మూలాలుపంజాబ్ ప్రాంతంPunjab.oggఉత్తర భారతదేశముదక్షిణాసియాదస్త్రం:Punjab.oggపంజాబీ భాషపాకిస్తాన్భారత ఉపఖండంహిందీ భాష

🔥 Trending searches on Wiki తెలుగు:

భారత ప్రధానమంత్రుల జాబితామహాభారతంమర్రికాశీభారత జాతీయ కాంగ్రెస్రుహానీ శర్మనిర్మలా సీతారామన్తొలిప్రేమమారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డితెలంగాణవర్షం (సినిమా)నరసింహ శతకముఅక్బర్మదర్ థెరీసాజైన మతంభారతదేశ రాజకీయ పార్టీల జాబితాతెలుగు రామాయణాల జాబితామంగళసూత్రంపూర్వ ఫల్గుణి నక్షత్రముమహామృత్యుంజయ మంత్రంఎన్నికలుచెక్ (2021 సినిమా)బైబిల్పంచభూతలింగ క్షేత్రాలునవమిఅరణ్యకాండLవై. ఎస్. విజయమ్మస్వామియే శరణం అయ్యప్పహిమాలయాలుబాలగంగాధర తిలక్మీనాక్షి అమ్మవారి ఆలయంఆంధ్రప్రదేశ్ శాసనమండలిమిథునరాశిహనుమంతుడుబ్రాహ్మణ గోత్రాల జాబితాపొట్టి శ్రీరాములుబమ్మెర పోతనఅనసూయ భరధ్వాజ్ఓం భీమ్ బుష్ఇక్ష్వాకు వంశంతెలంగాణలో 2024 భారత సార్వత్రిక ఎన్నికలుదృశ్యం 2వై.ఎస్.వివేకానందరెడ్డి హత్యసినిమాషడ్రుచులుసివిల్ సర్వీస్బి.ఆర్. అంబేద్కర్మంగళవారం (2023 సినిమా)చాకలి ఐలమ్మసర్వేపల్లి రాధాకృష్ణన్తీన్మార్ మల్లన్నఆవర్తన పట్టికసోనియా గాంధీసోంపుమూలా నక్షత్రంప్రకటనప్రియా వడ్లమానిరామావతారంత్యాగరాజు కీర్తనలుగౌతమ బుద్ధుడువిశాఖపట్నంNవై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపార్వతికైకేయితాటిపులివెందుల శాసనసభ నియోజకవర్గంబండారు సత్యనారాయణ మూర్తిఢిల్లీతెలుగుదేశం పార్టీఆటలమ్మతెలుగు సినిమాలు డ, ఢపోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామిశుక్రుడుఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్విమల (రచయిత్రి)భారతీయుడు (సినిమా)🡆 More