నైజర్

నైజర్ ది నైజర్ French: )అధికారికంగా నైజర్ రిపబ్లికు పశ్చిమ ఆఫ్రికాలో నైగర్ నది పేరు దేశానికి పెట్టబడింది.

నైజర్ ఈశాన్యసరిహద్దులో లిబియా, తూర్పుసరిహద్దులో చాద్, దక్షిణసరిహద్దులో నైజీరియా, నైరుతిసరిహద్దులో బెనిన్, పశ్చిమసరిహద్దులో బుర్కినా ఫాసో, మాలి, వాయువ్య సరిహద్దులో అల్జీరియా ఉన్నాయి. నైజర్ దాదాపు 1,270,000 k మీ 2 (1.37 × 1013 చ.) వైశాల్యం కలిగి ఉంది. ఇది పశ్చిమ ఆఫ్రికాలో ఇది అతిపెద్ద దేశం. దేశ భూభాగం 80% పైగా సహారా ఎడారిలో ఉంది. దేశజనాభాలో సంఖ్యాపరంగా ముస్లిములు21మిలియన్లు దేశంలోని ఇస్లామిక్ జనాభా ప్రధానంగా దేశంలోని దక్షిణ, పశ్చిమ ప్రాంతాలలో అధికంగా నివసిస్తున్నారు. నైజర్ రాజధాని నగరం నియోమీ నైరుతి మూలన ఉంది.

Republic of the Niger

  • République du Niger  (French)
Flag of Niger
జండా
Coat of arms of Niger
Coat of arms
నినాదం: 
  • "Fraternité, Travail, Progrès" (French)
  • "Fraternity, Work, Progress"
గీతం: La Nigérienne
Location of  నైజర్  (dark green)
Location of  నైజర్  (dark green)
Location of Niger
రాజధాని
and largest city
Niamey
13°32′N 2°05′E / 13.533°N 2.083°E / 13.533; 2.083
అధికార భాషలుFrench
National languages
  • Fulfulde
  • Gourmanchéma
  • Hausa
  • Kanuri
  • Zarma & Songhai
  • Tamasheq
  • Tassawaq
  • Tebu
పిలుచువిధంNigerien (/nˈʒɛəriən/  or /nˌɪəriˈɛn/ )
ప్రభుత్వంUnitary semi-presidential republic
• President
Mohamed Bazoum
• Prime Minister
Brigi Rafini
శాసనవ్యవస్థNational Assembly
Independence 
from France
• Declared
3 August 1960
విస్తీర్ణం
• మొత్తం
1,267,000 km2 (489,000 sq mi) (21st)
• నీరు (%)
0.02
జనాభా
• 2016 estimate
20,672,987 (61st)
• 2012 census
17,138,707
• జనసాంద్రత
12.1/km2 (31.3/sq mi)
GDP (PPP)2018 estimate
• Total
$23.475 billion (140th)
• Per capita
$1,213 (183rd)
GDP (nominal)2018 estimate
• Total
$9.869 billion (136th)
• Per capita
$510 (179th)
జినీ (2014)Negative increase 34.0
medium · 70th
హెచ్‌డిఐ (2018)Increase 0.354
low · 189th
ద్రవ్యంWest African CFA franc (XOF)
కాల విభాగంUTC+1 (WAT)
వాహనాలు నడుపు వైపుright
ఫోన్ కోడ్+227
ISO 3166 codeNE
Internet TLD.ne
  1. Lowest ranked.

నైజర్ ఒక అభివృద్ధి చెందుతున్న దేశం. ఇది స్థిరంగా ఐక్యరాజ్యసమితి మానవ అభివృద్ధి సూచికలో దిగువ స్థానంలో ఉంది. 2015- 2018 నివేదికలలో 189 వ దేశాలలో 188 వ స్థానంలో నిలిచింది. దేశంలోని ఎడారి భాగాలలో ఎక్కువ భాగం కాలానుగుణ కరువు, ఎడారీకరణ వలన బెదిరించబడుతున్నాయి. ఆర్థిక వ్యవస్థ జీవనాధారం మీద కేంద్రీకృతమై ఉంది. దక్షిణప్రాంతాలలో ఉన్న కొన్ని సారవంతమైన వ్యవసాయక్షేత్రాలలో పండించబడుతున్న కొన్ని ఉత్పత్తులు ఎగుమతి చేయబడుతున్నాయి. యురేనియం ముడి పదార్ధాలు ఎగుమతి చేయబడుతున్నాయి. భూబంధిత దేశంగా నైగర్ ఎడారి భూభాగం, అసమర్థమైన వ్యవసాయం, జనన నియంత్రణ లేకుండా అధిక సంతానోత్పత్తి శాతం ఫలితంగా అధిక జనాభా వంటి సవాళ్ళను ఎదుర్కొంటున్నది. అదనంగా పేలవమైన విద్య స్థాయి, ప్రజల పేదరికం, మౌలికసౌకర్యాల లోపం, పేలవమైన ఆరోగ్య సంరక్షణ, పర్యావరణ క్షీణత వంటి సమస్యలను ఎదుర్కొంటుంది.

నైగర్ సమాజం అనేక జాతి సమూహాలు, ప్రాంతాల దీర్ఘకాల స్వతంత్ర చరిత్రల నుండి తీసుకున్న వైవిధ్యాలను ప్రతిబింబిస్తుంది. నైగర్ రాజ్యంగా స్వల్ప కాలం మాత్రమే ఉన్నాయి. చారిత్రకపరంగా, ప్రస్తుతం నైగర్ అనేక పెద్ద రాజ్యాల అంచులలో ఉంది. స్వాతంత్ర్యం తరువాత నైగర్ ప్రజలు ఐదు రాజ్యాంగాల ఆధ్వర్యంలో మూడు కాలాల సైనిక పాలనలో నివసించారు. 2010 లో సైనిక తిరుగుబాటు తరువాత నైగర్ ఒక ప్రజాస్వామ్య, బహు-పార్టీ రాజ్యం అయ్యింది. జనాభాలో చాలామంది గ్రామీణ ప్రాంతాలలో నివసిస్తున్నారు. ఆధునిక విద్యకు తక్కువ ప్రాప్తిని కలిగి ఉన్నారు. 2015 నాటికి 71.3% మంది నైజర్ జనాభా విద్యాహీనత కలిగి ఉన్నారు. ప్రపంచంలోని అత్యధిక నిరక్షరాస్యత శాతం కలిగిన దేశాలలో నైగర్ ఒకటి.

చరిత్ర

చరిత్రకు పూర్వం

నైజర్ 
Ancient rock engraving showing herds of giraffe, ibex, and other animals in the southern Sahara near Tiguidit, Niger.

నైగరులో పురావస్తు అవశేషాలు ద్వారా ప్రారంభ మానవ నివాస ఆవాసాలు ఉన్నట్లు అనేక ఆధారాలతో నిరూపించబడింది. పూర్వ చారిత్రక కాలంలో సహారా వాతావరణం (నైగర్లోని టెనెరే ఎడారి) తడిగా ఉండేది. ఐదు వేల సంవత్సరాల క్రితం సారవంతమైన గడ్డిమైదానాలు, వ్యవసాయ, పశుపోషణకు అనుకూలవాతావరణం ఉండేది.2005-06లో చికాగో విశ్వవిద్యాలయం నుండి పాలిటాలోజిస్టు అయిన పాలు సెరెనో టెరెన్రే ఎడారిలో ఒక స్మశానాన్ని కనుగొన్నాడు. అతని బృందం టెన్నెరే ఎడారిలో ఒక మహిళ, ఇద్దరు పిల్లల 5,000 సంవత్సరాల పూర్వ అవశేషాలను కనుగొన్నారు. సాధారణంగా ఎడారిలో నివసించలేని జంతువుల అవశేషాలు లభించడం నైగర్లోని 'ఆకుపచ్చ' సహారాకు బలమైన సాక్ష్యంగా ఉంది. క్రీ.పూ. 5000 సమయంలో ప్రగతిశీల ఎడారీకరణ దక్షిణ, ఆగ్నేయ (చాద్ సరోవరం) ప్రాంతాలలో నిశ్చల జనాభాను అభివృద్ధి చేసిందని విశ్వసిస్తున్నారు.

నైజర్ 
Overlooking the town of Zinder and the Sultan's Palace from the French fort (1906). The arrival of the French spelled a sudden end for precolonial states like the Sultanate of Damagaram, which carried on only as ceremonial "chiefs" appointed by the colonial government.

వలసపాలనకు ముందు సాంరాజ్యాలు, రాజ్యాలు

కనీసం క్రీ.పూ 5 వ శతాబ్దం నాటికి నైగర్ ఉత్తరాన ఉన్న బెర్బెరు తెగల నాయకుల నాయకత్వంలో నైగర్ ఒక ట్రాన్స్-సహారన్ వాణిజ్యం ప్రాంతంగా మారింది. వీరు ఎడారి రవాణా కొరకు ఒంటెలను బాగా అనువైన మార్గంగా ఉపయోగించింది. ఈ ప్రాంతం అరాడెజ్ ట్రాన్స్-సహారన్ వర్తకంలో కీలకమైన ప్రదేశంగా ఉంది. ఈ కదలిక అనేక శతాబ్దాలుగా కొనసాగింది. ఇది దక్షిణాన మరింత వలసలతో దక్షిణ ప్రాంతం నలుపు, తెల్లజాతీయుల జనాభా మధ్య సంయోగం చెందింది. 7 వ శతాబ్దం చివరలో ఈ ప్రాంతానికి ఇస్లాం పరిచయం చేయబడానికి ఇది సహకరించింది. ఈ యుగంలో అనేక సామ్రాజ్యాలు, రాజ్యాలు కూడా వృద్ధి చెందాయి. అలాగే ఆఫ్రికాలో వలసరాజ్య స్థాపన ప్రారంభమైంది.

సంఘై సాంరాజ్యం (600–1591)

పశ్చిమ ఆఫ్రికాలో ఉన్న ప్రధాన జాతి సమూహం, సంఘై (సోరాయ్) పేరుతో సొంఘై సామ్రాజ్యం స్థాపించబడింది. నైగర్ నదీ వంపులో ప్రస్తుత నైగర్, మాలి, బుర్కినా ఫాసోలో ప్రాంతాలను కలుపుకుని పాలన సాగించింది. 7 వ శతాబ్దంలో ప్రస్తుత నైమీ ప్రాంతంలో స్థిరపడిన సంఘై ప్రజలు కౌకీయా, గావో మొదలైన నగర రాజ్యాలను స్థాపించారు. 11 వ శతాబ్దం నాటికి గావో సంఘై సామ్రాజ్య రాజధానిగా మారింది.

1000 నుంచి 1325 వరకు సంఘై సామ్రాజ్యం మాలి సామ్రాజ్యంతో సహా పొరుగు సామ్రాజ్యాలతో శాంతిని కొనసాగించగలిగింది. 1325 లో సంఘై సామ్రాజ్యాన్ని మాలి సామ్రాజ్యం స్వాధీనం చేసుకుంది. కానీ 1335 లో రాకుమారుడు ఆలీ కోలెన్, అతని సోదరుడు ఝుర్జి రాకుమారులు మాలి సామ్రాజ్య పాలకుడు మౌసా కంకనుకు బందీగా ఉన్నారు.ఇది 15 వ శతాబ్దం మధ్యకాలం నుండి 16 వ శతాబ్దం వరకు, చరిత్రలో అతిపెద్ద ఇస్లామిక్ సామ్రాజ్యాలలో ఒకటిగా ఉంది.

నైజర్ 
The Kaouar escarpment, forming an oasis in the Ténéré desert.

హౌసా రాజ్యాలు (14 వ శతాబ్ధం మధ్య నుండి – 1808)

నైగర్ నది చాదు సరస్సు మధ్య హౌసా రాజ్యాలు, సారవంతమైన ప్రాంతాలు ఉన్నాయి. ఈ రాజ్యాలు 14 వ శతాబ్దం మధ్యకాలం నుంచి 19 వ శతాబ్దం మద్యకాలంలో స్థాపించబడ్డాయి. తరువాత వీటిని సోకోటో సామ్రాజ్యం స్థాపకుడైన ఉస్మాన్ డాన్ ఫోడియో జయించాడు. హౌసా రాజ్యాలు ఒకే సమాఖ్యగా ఏర్పడలేదు. ఒకదానితో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ స్వతంత్ర రాజ్యాలకు చెందిన అనేక సమాఖ్యలు ఉన్నాయి. వారి సంస్థలు కొంతవరకు ప్రజాస్వామ్యంగా ఉంది: హౌసా రాజులు దేశంలోని ప్రముఖులు ఎన్నుకోబడడం, అలాగే వారిచే తొలగించబడడం సాధ్యమౌతుంది.

బయాజిదా పురాణం ఆధారంగా బవోయి రాజు ఆరు కుమారులు స్థాపించిన ఏడు రాజ్యాలు హౌసా రాజ్యాలు ప్రారంభమయ్యాయి. హౌసా రాణి దౌరామ, బయాజిద్దా (అబు యాజిదు)ల ఏకైక కుమారుడు బావదు. నైగరియన్ చరిత్రకారుల కథనం ప్రకారం వారు బాగ్దాదు నుండి వచ్చారని భావిస్తున్నారు. ఏడు హౌసా రాష్ట్రాలు: దౌరా (రాణి దర్రామ రాష్ట్ర), కానో, రానో, జరియా, గోబీరు, కట్సేనా, బిరం.

మాలి సాంరాజ్యం

1230 లో సామ్రాజ్యం సుండియాట కీటా సిర్కా ద్వారా స్థాపించబడిన ఒక మండిన్కా సామ్రాజ్యమే మాలి సాంరాజ్యం. ఇది 1600 వరకు ఉనికిలో ఉంది. ఇది శిఖరాగ్రం స్థాయికి చేరుకున్న 1350 నాటికి సామ్రాజ్యం పశ్చిమంలో సెనెగలు, తూర్పున గినియా కొనాకు వరకు విస్తరించింది.

కనెం- బొర్ను సాంరాజ్యం

కనెం- బొర్ను సాంరాజ్యం ప్రస్తుత చాదు, నైజీరియా, కామెరూన్, నైగర్, లిబియా కలుకుని పాలన సాగించింది. మొట్టమొదట ఈ సామ్రాజ్యం 9 వ శతాబ్దం ప్రారంభంలో కనెం సాంరాజ్యంగా స్థాపించబడింది. తరువాత బొర్ను రాజ్యంగా 1900 వరకు ఉనికిలో ఉంది.

ఫ్రెంచి నైగర్ (1900–58)

19 వ శతాబ్దంలో నైగర్ చేరుకున్న మొట్టమొదటి ఐరోపా అన్వేషకులతో-(ముఖ్యంగా మోంటెయిల్ (ఫ్రెంచ్), బార్త్ (జర్మన్) -తో) నైగరుతో ఐరోపా సంబంధాలు ప్రారంభమైయ్యాయి.

1885 లో జరిగిన బెర్లిను సదస్సు తరువాత కాలనీల శక్తులు ఆఫ్రికాలో వలస రాజ్యాలను వివరించాయి. ప్రస్తుత ఆఫ్రికన్ దేశాలను జయించేందుకు ఫ్రెంచి సైనిక ప్రయత్నాలు నైగరుతో సహా అన్ని ఫ్రెంచి కాలనీలలో తీవ్రతరం అయ్యాయి. వౌలేట్ చానోయిన్ మిషను వంటి పలు సైనిక దండయాత్రలు జరిగాయి. ఇది అనేక స్థానిక పౌరులను హింసించడం, కొల్లగొట్టడం, అత్యాచారం చేయడం, చంపడం వంటి హింసాత్మక చర్యలకు ప్రసిద్ధి చెందింది. 1899 మే 8 న రాణి సారావునియా ప్రతిఘటించినందుకు ప్రతిస్పందనగా కెప్టెన్ వోలెటు, అతని మనుషులందరూ బిర్ని-ఎన్కోని గ్రామంలోని నివాసులను హత్య చేసారు. ఇవి ఫ్రెంచి వలస చరిత్రలో అత్యంత ఘోరమైన హత్యలుగా పరిగణించబడుతున్నాయి. ఫ్రెంచి సైనిక దండయాత్రలలో ఫ్రెంచి సైనికులు అనేక జాతుల సమూహాలు, ముఖ్యంగా హౌసా, టువరెగు సమూహాల నుండి గొప్ప ప్రతిఘటనను ఎదుర్కొన్నాయి. అత్యంత ముఖ్యమైనవి టువరెగు తిరుగుబాటు కాకోను తిరుగుబాటు. ఫ్రెంచి అధికారులు టువరెగు సమాజాల మధ్య విస్తృతంగా ఉన్న బానిసత్వాన్ని కూడా రద్దు చేశారు.

1922 నాటికి కాలనీల పాలనకు వ్యతిరేకంగా ప్రతిఘటన తొలగించబడి, నైగర్ ఫ్రెంచ్ కాలనీగా మారింది. నైగరు వలస చరిత్ర, అభివృద్ధి ఇతర ఫ్రెంచి పశ్చిమ ఆఫ్రికా ప్రాంతాలకు సమాంతరంగా ఉంది. ఫ్రాంసు డకార్, సెనెగలు, నైగరు వంటి పశ్చిమాఫ్రికా కాలనీ భూభాగాలను గవర్నరు జనరలు ద్వారా నిర్వహించింది. భూభాగాల నివాసితులపై పరిమితమైన ఫ్రెంచి పౌరసత్వ సమావేశం నిర్వహించారు. 1946 ఫ్రెంచి రాజ్యాంగం అధికార వికేంద్రీకరణకు, స్థానిక సలహా సమావేశాలకు రాజకీయంగా పరిమిత భాగస్వామ్యం అందించింది.

వలసరాజ్య యుగం చివరలో ఫ్రెంచి పశ్చిమ ఆఫ్రికా, నైగరులో రాజకీయ వాతావరణం రూపాంతరం చెందింది. 1946 మే లో నైజీరియన్ ప్రోగ్రెసివ్ పార్టీ, ఆఫ్రికన్ డెమొక్రాటిక్ ర్యాలీ పార్టీలోని నైజీరియా విభాగం స్థాపించబడి నైజీరియన్ ప్రజలు వివిధ రూపాలలో జాతీయ స్వాతంత్ర్యం కొరకు పోరాడారు. ప్రగతిశీల ఫ్రెంచి శక్తులు, ఇతర ఆఫ్రికా స్వాతంత్ర్య ఉద్యమాలతో కూడిన కూటమిలో నిర్బంధిత కార్మికుల అణచివేత, ఏకపక్ష కోరికలు, అలాగే ఆఫ్రికా, ఫ్రెంచి పౌరులకు చట్టబద్ధమైన సమానత్వం కొరకు పోరాటం సాగించారు.

స్వతంత్రం (1958)

1956 జూలై 23 నాటి ఓవర్సీస్ సంస్కరణల చట్టం (లోయి కేడర్). 1958 డిసెంబరు 4 లో ఐదవ ఫ్రెంచి రిపబ్లిక్ స్థాపన తరువాత నైజర్ ఫ్రెంచి కమ్యూనిటీలో ఒక స్వతంత్ర రాజ్యంగా మారింది. 1958 డిసెంబరు 18 న రిపబ్లిక్ ఆఫ్ నైజరు అధికారికంగా హమాని డియోరిని నైజరు రిపబ్లికు మంత్రిమండలి నాయకునిగా నియమించింది. 1960 జూలై 11 న, నైజరు ఫ్రెంచి కమ్యూనిటీని విడిచిపెట్టి ఆగష్టు 3, 1960 ఆగస్టు 3 న తన మొదటి అధ్యక్షుడిగా డియోరిని నియమించి పూర్తి స్వాతంత్ర్యం పొందాలని నిర్ణయించుకుంది.

నైజర్ 
President Hamani Diori and visiting German President Dr. Heinrich Lübke greet crowds on a state visit to Niamey, 1969. Diori's single party rule was characterized by good relations with the west and a preoccupation with foreign affairs.

అధ్యక్షుడు హమాని డియోరి, జర్మనీ అధ్యక్షుడు డాక్టర్ హెన్రిచ్ లుబ్కే సందర్శించడం నియోమీ, 1969 కు రాష్ట్ర సందర్శనలో అభిమానులకు స్వాగతం పలికారు. డియోరి యొక్క సింగిల్ పార్టీ పాలన పశ్చిమాన మంచి సంబంధాలు, విదేశాంగ వ్యవహారాలతో సంబంధాలు కలిగి ఉంది.

ఒక స్వతంత్ర రాజ్యంగా మొట్టమొదటి పద్నాలుగు సంవత్సరాల్లో నైజరును డియోరి అధ్యక్ష పదవిలో ఏక-పార్టీ పౌర పాలన నిర్వహించింది. 1974 లో విధ్వంసకర కరువు, ప్రబలమైన అవినీతి ఆరోపణలు కలయిక ఫలితంగా డియోరి పాలన పడగొట్టబడింది.

మొదటి సైనిక పాలన 1974–1991

కల్నల్ సెనీ కూంట్చీ " సుప్రీం మిలిటరీ కౌన్సిలు " అనే పేరుతో ఒక చిన్న సైనిక బృందం 1974 ఏప్రెలులో ఒక సైనిక తిరుగుబాటు తరువాత డియోరిని తొలగించింది. నైజరు వలసపాలన తరువాత చరిత్రలో ఇది మొదటి తిరుగుబాటు. తరువాత అధ్యక్షుడైన కంట్చె 1987 లో మరణం వరకు దేశాన్ని పాలించాడు. సైనిక తిరుగుబాటు ప్రేరణగా ఉన్న ఆహార సంక్షోభాన్ని పరిష్కరించడం కౌంట్చె మిలిటరీ ప్రభుత్వం మొదటి బాధ్యతగా స్వీకరించింది. తిరుగుబాటు తరువాత డియోరి పాలనలో ఖైదుచేయబడిన రాజకీయ ఖైదీలు విడుదలచేయబడ్డారు. రాజకీయ పార్టీలు రద్దు చేయబడ్డాయి. ఈ కాలంలో రాజకీయ వ్యక్తిగత స్వేచ్ఛ సాధారణంగా క్షీణించింది. రాజకీయ పార్టీలు నిషేధించబడ్డాయి. అనేక తిరుగుబాటు ప్రయత్నాలు (1975, 1976, 1983) అడ్డుకొనబడి, తిరుగుబాటు వ్యూహకర్తలు, సహచరులు తీవ్రంగా శిక్షించబడ్డారు.

స్వేచ్ఛలో పరిమితులు ఉన్నప్పటికీ దేశం నూతన సంస్థలను సృష్టించడం, ప్రధాన మౌలికవసతుల నిర్మాణం (ప్రభుత్వభవనాలు, కొత్త రహదారులు, పాఠశాలలు, ఆరోగ్య కేంద్రాలు) చేయడం, ప్రభుత్వ సంస్థలలో తక్కువ అవినీతి, మెరుగైన ఆర్థిక అభివృద్ధిని సాధించింది. .

ఈ ఆర్థిక అభివృద్ధి యురేనియం బూం, ఖ్చ్ఛితమైన ప్రజా నిధులు వాడకంతో సాధ్యపడింది. కంట్చే తరువాత చీఫ్ ఆఫ్ స్టాఫ్ " కల్నలు అలీ సాయిబో " అధికారం చేపట్టాడు. కంట్చె మరణించిన నాలుగు రోజుల తరువాత 1987 నవంబరు 14 న అలీ సైబౌ సుప్రీం మిలిటరీ కౌన్సిలు చీఫ్గా నిర్ధారించబడింది. ఆయన రాజకీయ సంస్కరణలను ప్రవేశపెట్టి, ఒకే పార్టీని సృష్టించడానికి వీలుగా ఒక కొత్త రాజ్యాంగాన్ని రూపొందించాడు. దేశం సుప్రీం మిలిటరీ కౌన్సిలు చీఫ్గా దేశాన్ని పాలించాడు.

1989 ప్రజాభిప్రాయ సేకరణ నూతన రాజ్యాంగం " రెండో రిపబ్లిక్ ఆఫ్ నైజర్ " సృష్టించడానికి దారితీసింది. జనరల్ సాయిబో రెండవ అధ్యక్షునిగా నియమితుడయ్యాడు. తరువాత 1989 డిసెంబరు 10 న అధ్యక్ష ఎన్నికలలో విజయం సాధించాడు. అధ్యక్షుడుగా రెండవ గణతంత్రం ప్రారంభం నుండి బాధ్యతలు ప్రారంభించాడు. ఇది మునుపటి సైనిక పాలన ముగింపు తరువాత ఆయన అధ్యక్షుడుగా రాజకీయ ఖైదీలను విడుదల చేయడం, చట్టాలు, విధానాలను సరళీకరణ చేయడం ప్రారంభించాడు.

బహుళ సంస్కరణ ప్రజాస్వామ్య వ్యవస్థను స్థాపించడానికి వాణిజ్య సంఘం, విద్యార్థి డిమాండ్ల నేపథ్యంలో రాజకీయ సంస్కరణలను నియంత్రించడానికి అధ్యక్షుడు సాయిబో చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. 1990 ఫిబ్రవరి 9 న హింసాత్మకంగా అణచివేతకు గురైన విద్యార్ధుల ప్రదర్శన ముగ్గురు విద్యార్ధుల మరణానికి దారి తీసింది. జాతీయ, అంతర్జాతీయ ఒత్తిడి కారణంగా నేషనల్ కాన్ఫరెన్సు ఏర్పాటుకు దారితీసింది. 1990 చివరి నాటికి ఈ డిమాండ్లకు సాయిబు పాలన అంగీకరించింది.

నేషనల్ కాంఫరెంసు మరితు మూడవ రిపబ్లికు 1991–1997

1991 నాటి జాతీయ సార్వభౌమ సమావేశం నైజరు స్వాతంత్ర్య శకంలో మలుపు తిరిగి బహుళ-పార్టీ ప్రజాస్వామ్యం గురించి చర్చించేలా చేసింది. జూలై 29 నుండి నవంబరు 3 వరకు దేశంలోని రాజకీయ, ఆర్థిక, సాంఘిక పరిస్థితిని పరిశీలించే సమావేశానికి జాతీయ సదస్సును ఏర్పాటు చేసింది. దేశానికి భవిష్యత్ దిశానిర్ధేశానికి సిఫారసులను చేకూరుస్తుంది. ఈ సమావేశానికి ప్రొఫెసర్ ఆండ్రే సాలిఫౌ అధ్యక్షత వహించాడు. ఒక తాత్కాలిక మద్యకాల ప్రభుత్వానికి ప్రణాళిక సిద్ధం చేశారు. 1993 ఏప్రెలులో థర్డు రిపబ్లిక్క సంస్థలను స్థాపించబడే వరకు దేశవ్యవహారాలను నిర్వహించడానికి 1991 నవంబరులో ఈ వ్యవస్ధ స్థాపించబడింది.

పరివర్తన పాలన కాలంలో ఆర్థిక వ్యవస్థ క్షీణించినప్పటికీ ప్రజాభిప్రాయసేకరణ, కొన్ని ముఖ్యమైన సాధనలు ఉన్నాయి; ఎన్నికల, గ్రామీణ సంస్కరణలు వంటి కీలక శాసనం దత్తతగా స్వీకరించడం, స్వేచ్ఛాయుతమైన, న్యాయమైన, అహింసాయుతమైన ఎన్నికల దేశవ్యాప్తంగా నిర్వహించడం వంటి కొన్ని ముఖ్యమైన సాధనలు ఉన్నాయి. అనేక కొత్త స్వతంత్ర వార్తాపత్రికల ప్రదర్శనతో మీడియా ప్రెస్ ఫ్రీడమ్ వృద్ధి చెందింది.

జాతీయ సార్వభౌమాధికార సమావేశం తరువాత మధ్యకాల ప్రభుత్వం ఒక నూతన రాజ్యాంగంను రూపొందించింది. అది 1989 నాటి మునుపటి ఏక-పార్టీ వ్యవస్థను తొలగించి మరింత స్వేచ్ఛను హామీ ఇచ్చింది. 1992 డిసెంబరు 26 న ప్రజాభిప్రాయ సేకరణ ద్వారా నూతన రాజ్యాంగం ఆమోదించబడింది. దీని తరువాత అధ్యక్ష ఎన్నికలు నిర్వహించబడ్డాయి. 1993 మార్చి 27 న " మహ్మనే ఉస్మానే " మూడో రిపబ్లిక్కు మొదటి అధ్యక్షుడయ్యాడు. అధ్యక్షుడు మహామానే ఓస్మానే పాలనలో తలెత్తిన రాజకీయ సంక్షోభం ద్వారా నాలుగు ప్రభుత్వపరమైన మార్పులు, గడువు ముగియడానికి ముందే 1995 లో శాసన ఎన్నికలు నిర్వహించాలని పిలుపు ఇచ్చారు.

పార్లమెంటరీ ఎన్నికలు అధ్యక్షుడు, ప్రధానమంత్రి ప్రత్యర్ధిత్వాన్ని అభివృద్ధి చేసి చివరకు ప్రభుత్వం బలహీనపడడానికి దారితీసింది. జాతీయ సార్వభౌమాధికార సదస్సులో ప్రారంభించిన చొరవలో భాగంగా 1995 ఏప్రెలులో ప్రభుత్వం తురాకు, టౌబౌ సమూహాలు 1990 నుండి జరిగిన తిరుగుబాటుకు ముగింపు పలుకుతూ శాంతి ఒప్పందంపై సంతకం చేసాయి. ఈ బృందాలు కేంద్ర ప్రభుత్వం నుండి శ్రద్ధకు, వనరులకు తాము దూరంగా ఉన్నామని వాదించాయి. మాజీ తిరుగుబాటుదారులను కొంతమంది సైన్యంలోకి తీసుకునేందుకు, ఫ్రెంచి సహాయంతో ఇతరులు ఉత్తేజకరమైన పౌర జీవితానికి తిరిగి రావడానికి సహాయం చేయడానికి ప్రభుత్వం అంగీకరించింది.

రెండ సైనిక పాలన, నాలుగవ రిపబ్లికు, మూడవ సైనిక పాలన 1997–1999

ప్రభుత్వ పక్షవాతం, రాజకీయ ఉద్రిక్తత రెండో సైనిక తిరుగుబాటుకు ప్రేరణగా ఉపయోగించబడింది. 1996 జనవరి 27 న కల్నలు ఇబ్రహీం బరే మాయన్నస్సా సైనిక తిరుగుబాటుకు నాయకత్వం వహించి అధ్యక్షుడు ఓస్మానేను తొలగించి రిపబ్లికును రద్దు చేసాడు. తరువాత కల్నలు మాయన్నస్రా సైనికాధికారులతో కూడిన నేషనల్ సాల్వేషన్ కౌన్సిలును సృష్టించి దానికి ఆయన నాయకత్వం వహించాడు. ఈ కౌన్సిలు 6 నెలల పరివర్తనపాలనా వ్యవధిని చేపట్టింది. ఈ సమయంలో 1996 మే 12 న కొత్త రాజ్యాంగం రూపొందించి స్వీకరించింది.

తరువాతి నెలలో అధ్యక్ష ఎన్నికల ప్రచారాలు నిర్వహించబడ్డాయి. జనరల్ మాయాన్నస్రా ప్రచారంలోకి స్వతంత్ర అభ్యర్ధిగా ప్రవేశించి 1996 జూలై 8 న ఎన్నికలలో విజయం సాధించారు. ప్రచార సమయంలో ఎన్నికల కమిషను మార్చబడింది. ఎన్నికలు జాతీయ, అంతర్జాతీయ పర్యవేక్షణలో క్రమరహితమైనవిగా పరిగణించబడ్డాయి.


ఇబ్రహీం బారే మాయన్నస్రా నాలుగవ రిపబ్లిక్కు మొదటి అధ్యక్షుడు అయ్యాడు. ప్రశ్నార్థకమైన ఎన్నికలను సమర్థిస్తూ బహుముఖ, ద్వైపాక్షిక ఆర్థిక సహాయాన్ని పునరుద్ధరించడానికి దాతలను ఒప్పించడంలో ఆయన చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి; నిరాశ చెందిన మాయన్నస్రా లిబియాకు వ్యతిరేకంగా ఒక అంతర్జాతీయ నిషేధాన్ని నిర్లక్ష్యం చేస్తూ నైజరు ఆర్ధికవ్యవస్థను పునరుద్ధరించడానికి లిబియా నుండి నిధులను కోరింది. ప్రాథమిక పౌర హక్కుల ఉల్లంఘిస్తూ ప్రతిపక్ష నాయకులు, పాత్రికేయులు తరచూ ఖైదుచేయబడి పోలీసు, సైనిక దళాలతో కూడిన అనధికారిక సైన్యం ద్వారా బహిష్కరించబడ్డారు.

1999 ఏప్రెలు 9 న మాజ్ దావుడా మాలం వంకే నేతృత్వంలో ఒక సైనిక తిరుగుబాటు సమయంలో మాయన్నస్రా హత్య చేయబడ్డాడు. ఆయన ఫ్రెంచ్-శైలి సెమీ-ప్రెసిడెంట్ వ్యవస్థతో ఐదవ గణతంత్ర రాజ్యాంగం ముసాయిదాను పర్యవేక్షించడానికి " నేషనల్ రీకాంసిలేషన్ కౌంసిలు " స్థాపించాడు. 1999 ఆగస్టు 9 న కొత్త రాజ్యాంగం దత్తత చేసుకొనబడింది. అదే సంవత్సరం అక్టోబరు, నవంబరులో అధ్యక్ష, శాసనసభ ఎన్నికలు నిర్వహించబడ్డాయి. ఎన్నికలు సాధారణంగా అంతర్జాతీయ పరిశీలకులచే స్వేచ్ఛగా, న్యాయమైనవిగా గుర్తించబడ్డాయి. నూతన, ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత వాంకే ప్రభుత్వ వ్యవహారాల నుండి తనను తాను ఉపసంహరించుకుంది.

ఐదవ రిపబ్లికు 1999–2009

1999 నవంబరులో ఎన్నికల్లో విజయం సాధించిన తరువాత అధ్యక్షుడు టాంజా మమడౌ 1999 డిసెంబరు 22 న ఐదవరిపబ్లికు అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. తండజా మమడొ మొదటి చర్యగా మూడవ పాలనా కాలం నుంచి సైనిక తిరుగుబాట్లు కారణంగా అడ్డుకోబడిన పలు పరిపాలనా, ఆర్థిక సంస్కరణలను తీసుకువచ్చింది. 2002 ఆగస్టులో నియమీ, డిపె, న్యుగైమిలలో సైనిక శిబిరాలలో తీవ్రమైన అశాంతి చోటు చేసుకుంది. ప్రభుత్వం పలు రోజులు శ్రమించి పరిస్థితిని చక్కదిద్దింది. 2004 జులై 24 న నైజరు చరిత్రలో మొట్టమొదటి పురపాలక ఎన్నికలు స్థానిక ప్రభుత్వ ప్రతినిధులను ఎన్నుకోవడం జరిగింది. ఈ ఎన్నికలు తరువాత అధ్యక్ష ఎన్నికలు జరిగాయి. అధ్యక్షుడు టాంజా మమడో రెండోసారి తిరిగి ఎన్నికయ్యారు. అందువలన సైనిక తిరుగుబాట్లు తొలగించబడకుండా వరుసగా ఎన్నికలను గెలుచుకున్న రిపబ్లిక్కు మొదటి అధ్యక్షుడు అయ్యారు. శాసన, కార్యనిర్వాహక ఆకృతి ప్రెసిడెంటు మొదటి పదవికి సమానంగా ఉంది: హమా అమడౌ ప్రధానమంత్రిగా నియమించబడ్డారు. సి.డి.ఎస్. పార్టీ అధిపతి అయిన మహమనేన్ ఊస్మానే జాతీయ అసెంబ్లీ (పార్లమెంట్) అధ్యక్షుడిగా తిరిగి ఎన్నికయ్యారు.


2007 నాటికి ప్రెసిడెంట్ టాంజా మమడోయు, అతని ప్రధానమంత్రి మధ్య సంబంధాలు క్షీణించాయి. అసెంబ్లీలో అవిశ్వాసతీర్మానం విజయం సాధించిన తరువాత 2007 జూన్ లో సెనీ ఒమార్మా అధ్యక్షపదవిని చేపట్టాడు.2007 నుండి 2008 వరకు ఉత్తర నైజరులో రెండో టువరెగులో జరిగింది. ఇది రాజకీయ పురోగతి సమయంలో ఆర్థిక అవకాశాలను మరింత దిగజార్చింది. నైజరులో అధ్యక్ష పదవిని పరిమితం చేసే రాజ్యాంగ సవరణ ద్వారా అధ్యక్షుడు టాంజామా మమదు తన అధ్యక్ష పదవిని విస్తరించాలని భావించాడు. తరువాతి సంవత్సరంలో రాజకీయ వాతావరణం మరింత దిగజారింది. అధ్యక్ష పదవి పొడగింపును సమర్ధిస్తూ మద్దతుదారులు ప్రదర్శించిన టాజార్చు ఉద్యమాన్ని వ్యతిరేకిస్తూ ప్రత్యర్ధులు యాంటీ - టాజార్చ్ ఉద్యమానికి తెరతీసి తిరుగుబాటు చేశారు. ప్రతిపక్ష పార్టీ తీవ్రవాదులు, పౌర సమాజం కార్యకర్తలతో కూడిన ప్రత్యర్థులు (యాంటీ-టాజార్చ్) ఉద్యమంలో పాల్గొన్నారు.

ఆరవ రిపబ్లికు, నాలుగవ సైనిక పాలన 2009–2010

2009 లో అధ్యక్షుడు టాంజామా మమదు తన అధ్యక్షతను విస్తరించాలని కోరుతూ రాజ్యాంగబద్ధంగా ప్రజాభిప్రాయాన్ని నిర్వహించాలని నిర్ణయించుకున్నాడు. ప్రతిపక్ష రాజకీయ పార్టీల నుండి వ్యతిరేకత ఉన్నందున ప్రజాభిప్రాయసేకరణ రాజ్యాంగ విరుద్ధమని నిర్ణయించిన రాజ్యాంగ న్యాయస్థానం నిర్ణయానికి వ్యతిరేకంగా అధ్యక్షుడు టాంజామా మమడౌ ప్రజాభిప్రాయ సేకరణ ద్వారా రాజ్యాంగసవరణ చేసాడు. ఇది రాజ్యాంగ న్యాయస్థానం చట్టవిరుద్ధంగా ప్రకటించింది. అధ్యక్షుడు కోర్టు రద్దు వంటి అత్యవసర అధికారాలు పొందాడు. ప్రతిపక్షాలు ప్రజాభిప్రాయాన్ని బహిష్కరించాయి. అధికారిక ఫలితాల ప్రకారం కొత్త రాజ్యాంగం 92.5% ఓటర్లు పాల్గొన్న 68% ఓట్లతో నూతన రాజ్యాంగాన్ని దత్తత తీసుకుంది. నూతన రాజ్యాంగం స్వీకరణ ఒక అధ్యక్షుడి వ్యవస్థ, 1999 రాజ్యాంగం సస్పెన్షన్, అధ్యక్షుడిగా టాంజా మామాడోతో మూడు సంవత్సరాల తాత్కాలిక ప్రభుత్వంగా ఆరవ రిపబ్లిక్కు సృష్టించింది. ప్రజాభిప్రాయ సేకరణకు ముందు తరువాత సామాజిక అశాంతి అధికరించి 2010 లో సైనిక తిరుగుబాటు ద్వారా చివరకు 6 వ రిపబ్లిక్కు ఉనికిను క్లుప్తంగా ముగింపుకు తీసుకుని వచ్చింది.

టాంజా రాజకీయ పదవిని పొడిగించటానికి ప్రతిస్పందనగా 2010 ఫిబ్రవరిలో డిజోబో నేతృత్వంలో సైనిక పాలన స్థాపించబడింది. స్థాపించబడింది. జనరల్ సాలో జిబో నేతృత్వంలో ప్రజాస్వామ్యం పునరుద్ధరణ సుప్రీం కౌన్సిల్ ఒక సంవత్సరం పరివర్తనపాలన ప్రణాళిక నిర్వహించారు. ఒక కొత్త రాజ్యాంగం రూపొందించి 2011 లో నిర్వహించబడిన ఎన్నికలను అంతర్జాతీయంగా స్వేచ్ఛాయుతమైనవిగా, న్యాయమైనవిగా అంగీకరించబడ్డాయి.

ఏడవ రిపబ్లికు 2010–ప్రస్తుతం

అధ్యక్ష ఎన్నికలలో మహమదు ఇష్యుఫౌ ఏడవ రిపబ్లిక్కు మొట్టమొదటి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.

భౌగోళికం, వాతావరణం, వాతావరణం

నైజర్ 
A map of Niger

నైజరు అనేది పశ్చిమ ఆఫ్రికాలో సహారా సబ్-సహారా ప్రాంతాల మధ్య సరిహద్దులో ఉన్న ఒక భూబంధిత దేశం. దేశ పశ్చిమసరిహద్దులో నైజీరియా, బెనిన్, దక్షిణసరిహద్దులో బుర్కినా ఫాసో, మాలి, ఉత్తరసరిహద్దులో అల్జీరియా, లిబియా తూర్పు సరిహద్దులో చాద్ ఉన్నాయి.

నైజరు 11 ° నుండి 24 ° ఉత్తర అక్షాంశం 0 ° నుండి 16 ° రేఖాంశంలో ఉంటుంది. నైజరు ప్రాంతంలో 12,67,000 చదరపు కిలో మీటర్లు ఉంటుంది (489,191 చదరపు మైళ్లు). 300 చదరపు కిలో మీటర్లు (116 చదరపు మైళ్ళు) జలభాగం ఉంది. ఇది ఫ్రాన్సు వైశాల్యంలో రెండు రెట్లు కంటే కొంచెం తక్కువగా ఉంటుంది. వైశాల్యపరంగా నైజరు ప్రపంచంలోని ఇరవై రెండవ అతిపెద్ద దేశంగా ఉంది.

నైజరు ఏడు దేశాలు కలిగి ఉంది. 5,697 కిలోమీటర్ల (3,540 మై) పొడవైన చుట్టుకొలత కలిగి ఉంది. దక్షిణ సరిహద్దులో ఉన్న నైజీరియాతో (1,497 కి.మీ. లేక 930 మై) ఉన్న సరిహద్దు అతి పెద్ద సరుహద్దుగా గుర్తించబడుతుంది. దీని తరువాత తూర్పున చాద్ సరిహద్దు 1,175 కి.మీ.(730 మై) పొడవు, ఉత్తర, వాయువ్యంలో ఉన్న అల్జీరియా సరిహద్దు (956 కిమీ లేదా 594 మై), మాలి సరిహద్దు (821కి.మీ 510 మై) పొడవు, నైరుతిలో బుర్కినా ఫాసోతో (628 కిమీ 390 మైళ్ళు) పొడవు, బెనిన్ సరిహద్దు (266 కిమీ 165 మై) పొడవు, ఉత్తర-ఈశాన్యంలో లిబియా సరిహద్దు 354 కిలోమీటర్ల (220 మైళ్ళు) పొడవు ఉన్నాయి.


నైగరు నది దేశంలో 200 మీటర్ల (656 అడుగులు) లోతైన ప్రాంతంగా గుర్తించబడుతుంది. " ఎయిర్ పర్వతాలలో ఉన్న మోంట్ ఇడోకల్-ఎన్-టాగెస్ 2,000 మీ (6,634 అ) ఎత్తుతో అత్యున్నత స్థానంగా గుర్తించబడుతుంది.

వాతావరణం

నైజర్ 
Niger map of Köppen climate classification.

నైజరు ఉపఉష్ణమండల వాతావరణం కలిగి ఉంటుంది. ఎడారి ప్రాంతంతో చాలా వేడిగా, చాలా పొడిగా ఉంటుంది. దక్షిణాన నైగరు నది ముఖద్వారం అంచులలో ఉష్ణ మండలీయ వాతావరణం ఉంది. ఈ భూభాగం ప్రధానంగా ఎడారి మైదానాలు, ఇసుక దిబ్బలు, దక్షిణాన సవన్నా, ఉత్తరాన కొండలు ఉంటాయి.

పర్యావరణం

నైజర్ 
An elephant in the W National Park.

నైజరు ఉత్తరాన పెద్ద ఎడారులు, సెమీ ఎడారులు ఉన్నాయి. సాధారణ క్షీరద జంతుజాలం ​​అడాక్సు యాంటెలోప్సు, సిమిటార్-హార్న్డ్ ఒరిక్సు, గెజెల్లు, బార్బరీ గొర్రెలు ఉన్నాయి. ఈ అరుదైన జాతులను రక్షించడానికి దేశం ఉత్తర భాగంలో ప్రపంచంలో అతి పెద్ద రిజర్వులలో ఒకటైన " ఎయిర్ అండు టెనెరె నేషనల్ నేచుర్ రిజర్వు " స్థాపించబడింది.

నైజరు దక్షిణ భూభాగాలలో సహజంగా సవన్నాలు ఆధిపత్యం చేస్తాయి. బుర్కినా ఫాసో, బెనిన్లకు సరిహద్దు ప్రాంతంలో ఉన్న డబల్యూ నేషనల్ పార్కు, డబల్యూ.ఎ.పి. కాంప్లెక్సు పశ్చిమ ఆఫ్రికాలోని వన్యప్రాణుల కోసం అత్యంత ముఖ్యమైన ప్రాంతాల్లో ఒకటిగా గుర్తించబడుతుంది. ఇది అరుదైన పశ్చిమ ఆఫ్రికన్ సింహాలు సంఖ్యాపరంగా అధికంగా ఉంటాయి. అలాగే అంతరించిపోతున్న వాయువ్య ఆఫ్రికన్ చిరుతలు ఉన్నాయి.

ఇతర వన్యప్రాణిలో ఏనుగులు, గేదెలు, రోన్ జింకలు, కోబ్ యాంటెలోప్సు, వర్తాగులు ఉన్నాయి. వెస్టు ఆఫ్రికన్ జిరాఫీ ప్రస్తుతం డబల్యూ నేషనల్ పార్కులో కనుగొనబడనప్పటికీ నైగరు ఉత్తరప్రాంతంలో ఉన్నది. ఇక్కడ అవి అంతరించిపోతున్న దశలో ఉన్నాయి.

నైజరులో అధికరించిన జనాభా ఒత్తిడి ఫలితంగా వినాశకరమైన వ్యవసాయ పద్ధతులతో పర్యావరణానికి హాని కలిగిస్తూ ఉంది. అక్రమ వేట, పొదలను కాల్చడం, వరి సాగు కోసం నైగర్ నది వరద మైదానాల్లో వరి సాగు కొరకు పర్యావరణానికి హాని కలిగిస్తున్న సమస్యలలో ప్రాధాన్యత వహిస్తున్నాయి. మాలి, గినియా పొరుగు దేశాలలో నైగరు నదిపై నిర్మించిన ఆనకట్టలు, నైగరు నదిలో నీటి ప్రవాహాన్ని తగ్గించడానికి కారణాలుగా పేర్కొనబడ్డాయి. ఇది పర్యావరణంపై ప్రత్యక్ష ప్రభావాన్ని కలిగి ఉంటుంది. ఉద్యానవనాలు, నిల్వలలో వన్యప్రాణులను కాపాడటానికి తగినంత సిబ్బంది లేకపోవడం వన్యప్రాణిని కోల్పోవడానికి మరొక కారణంగా ఉంది.

నిర్వహణా విభాగాలు

నైజర్ 
Administrative divisions of Niger

నైజరు 7 ప్రాంతాలుగా విభజించబడింది. ఒక రాజధాని జిల్లా. ఈ ప్రాంతాలు 36 విభాగాలుగా ఉపవిభజన చేయబడ్డాయి. 36 విభాగాలు ప్రస్తుతం విభిన్న రకాల కమ్యూన్లుగా విభజించబడుతున్నాయి. 2006 లో 2628 కమ్యూనియన్లు ఉన్నాయి. వాటిలో కమ్యూన్ అర్బైన్లు (పట్టణ కమ్యూన్లు: ప్రధాన నగరాల ఉపవిభాగాలుగా), కమ్యూన్ గ్రామీణ (గ్రామీణ కమ్యూన్లు) తక్కువ జనావాసాలు ఉన్న ప్రాంతాలు, ఎక్కువగా జనావాసాలులేని ఎడారి ప్రాంతాలు, నిర్వహణా మండలాలు (అడ్మినిస్ట్రేటివ్ పోస్ట్లు) ఉన్నాయి.

గ్రామీణ కమ్యూన్లలో అధికారిక గ్రామాలు, స్థావరాలు ఉండవచ్చు. అర్బన్ కమ్యూన్లు క్వార్టర్లుగా విభజించబడ్డాయి. 2002 లో నైగరు ఉపవిభాగాలు పేరు మార్చబడ్డాయి. 1998 లో వికేంద్రీకరణ ప్రాజెక్టు అమలు మొదలైంది. ముందుగా నైగరును 7 డిపార్టుమెంటులు, 36 ఆర్రోండిస్మెంట్లు, కమ్యూన్లుగా విభజించారు. ఈ ఉపవిభాగాలు జాతీయ ప్రభుత్వం నియమించిన అధికారులచే నిర్వహించబడుతున్నాయి. ఈ కార్యాలయాలు ప్రతి స్థాయిలో ప్రజాస్వామ్యయుతంగా ఎన్నుకోబడిన కౌన్సిలర్లతో భర్తీ చేయబడతాయి.

2002 పూర్వపు విభాగాలు (ప్రాంతాలుగా మార్చబడ్డాయి), రాజధాని జిల్లా:

  • అగాడెజ్ ప్రాంతం
  • డిఫ్ఫా ప్రాంతం
  • డాస్సో ప్రాంతం
  • మారిడి ప్రాంతం
  • తహుౌ రీజియన్
  • టిల్లబరీ ప్రాంతం
  • జిందర్ రీజియన్
  • నియోమీ (రాజధాని జిల్లా)

ఆర్ధికం

నైజర్ 
Niamey, Niger's capital and economic hub.

నైజరు ఆర్ధికరంగంలో పంటలు, పశుసంపద, ప్రపంచంలోని అతిపెద్ద యురేనియం డిపాజిట్లు అధికంగా భాగస్వామ్యం వహిస్తున్నాయి. కరువు చక్రబ్రమణం, ఎడారీకరణ, 2.9% జనాభా పెరుగుదల, యురేనియం కొరకు ప్రపంచ డిమాండు పతనం కావడం ఆర్థిక వ్యవస్థను బాధిస్తుంది.

పశ్చిమ ఆఫ్రికన్ ద్రవ్య యూనియనులో ఏడుగురు ఇతర సభ్యదేశాలతో కలిసి నైజరు సాధారణ కరెన్సీగా " సి.ఎఫ్.ఎ. ఫ్రాంకు " ను ఉపయోగిస్తుంది. సాధారణ కేంద్ర బ్యాంకుగా " సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ వెస్ట్ ఆఫ్రికన్ స్టేట్సు " సేవలను అందుకుంటుంది. నైజరు " ఆఫ్రికాలో ఆర్గనైజేషన్ ఫర్ ది హార్మోనిజేషన్ ఆఫ్ బిజినెస్ లా " లో సభ్యదేశంగా ఉంది.

2000 డిసెంబరులో నైజరు అంతర్జాతీయ ద్రవ్య నిధి కార్యక్రమంలో " హెవీలీ ఇండెబ్టెడ్ పూర్ కంట్రీస్ (హెచ్ఐపిసి)" భాగంగా మెరుగైన రుణ విముక్తికి అర్హత సాధించింది. అలాగే పేదరికం తగ్గింపు, సౌకర్యాల వృద్ధి (పిఆర్జిఎఫ్) కొరకు ఒక ఒప్పందం మీద సంతకం చేసింది. హెచ్.ఐ.పి.సి. చొరవతో అందించిన నిధులతో నైజరు గణనీయంగా రుణ విముక్తి సాధించింది. ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ, ప్రాథమిక విద్య, ఎయిడ్సు నివారణ, గ్రామీణ మౌలిక సౌకర్యాల అభివృద్ధి, పేదరికం తగ్గింపుకు సంబంధించిన ఇతర కార్యక్రమాలపై ఉచిత నిధులను విడుదల చేస్తుంది.

2005 డిసెంబరులో ఐ.ఎం.ఎఫ్. నుండి 100% బహుపాక్షిక రుణ విముక్తి పొందిందని ప్రకటించబడింది. ఇది ఐ.ఎం.ఎఫ్.కు సుమారు $ 86 మిలియన్ల క్షమాపణ కింద అందించింది. మిగిలిన మొత్తం హెచ్.ఐ.పి.ఎస్. అందించింది. ప్రభుత్వ ఆర్ధికప్రణాళికలో దాదాపు సగం విదేశీ దాతల వనరుల నుండి తీసుకోబడుతుంది. చమురు, బంగారం, బొగ్గు, ఇతర ఖనిజ వనరులను అత్యుపయోగం ద్వారా భవిష్యత్తులో వృద్ధి కొనసాగవచ్చు. యురేనియం ధరలు గత కొన్ని సంవత్సరాలలో కొంతవరకు కోలుకున్నాయి. 2005 లో ఒక కరువు, మిడుతల ముట్టడి కారణంగా 2.5 మిలియన్ నైజరు ప్రజలకు ఆహార కొరత ఏర్పడింది.


గణాంకాలు

నైజర్ 
Fulani women with traditional facial tattoos.

2016 నాటికి నైజరు జనాభా 20,672,987 గా ఉంది. 1960 లో 1.7 మిలియన్ల జనాభా ఉండేది. నైజర్ జనాభా ప్రస్తుతం 3.3% (తల్లికి 7.1 పిల్లలు ).) తో అతివేగంగా వృద్ధిచెందుతూ ఉంది.

ఈ పెరుగుదల రేటు ప్రపంచంలోనే అత్యధికంగా ఉండి ప్రభుత్వం, అంతర్జాతీయ సంస్థలకు ఆందోళన కలిగిస్తుంది. జనాభాలో యువత ఎక్కువగా ఉంది. నైజరు ప్రజలలో 49.2% 15 సంవత్సరాల కంటే తక్కువ వయస్కులు, 65 సంవత్సరాల కంటే అధిక వయస్కులు 2.7% ఉన్నారు. పట్టణ ప్రాంతాల్లో 21% మంది మాత్రమే నివసిస్తున్నారు.

నైజరులో 8,00,000 మంది (జనాభాలో 8% మంది) బానిసలుగా ఉన్నారని 2005 అధ్యయనం పేర్కొంది.

సంప్రదాయ సమూహాలు

పశ్చిమ ఆఫ్రికన్ దేశాలలో ఉన్నట్లు నైజరులో కూడా విభిన్న జాతుల సమూహాలను కలిగి ఉంది. నైజరు జాతిపరమైన వివరణ: హౌసా ప్రజలు (53.0%), జర్మ-సంఘై ప్రజలు (21.2%), టువరెగు ప్రజలు (10.4%), ఫులా ప్రజలు (9.9%), కానురి మాంగా ప్రజలు (4.4%), తుబు ప్రజలు (0.4%), అరబు ప్రజలు (0.3%), గౌర్మంటు ప్రజలు (0.3%), ఇతర ప్రజలు (0.2%).

భాషలు

వలసరాజ్య పాలన ఫలితంగా ఫ్రెంచి అధికారభాషగా ఉంది. పాశ్చాత్య విద్యావిధానంలో విద్యాభ్యాసం చేసిన వారికి ఇది ప్రధానంగా రెండవ భాషగా వాడుకలో ఉంది. ఫ్రెంచి పాలనానిర్వహణ భాషగా కూడా ఉంది. 1970 నుండి " ఆర్గనైజేషన్ ఇంటర్నేషనల్ డి లా ఫ్రాంకోఫోను " లో నైజరు సభ్యదేశంగా ఉంది.


నైజరులో పది అధికారిక జాతీయ భాషలు ఉన్నాయి: అవి అరబికు, బుడుమా, ఫుల్ఫుల్డే, గౌర్మంచెమె, హౌసా, కానురి, జర్మా & సంఘై, తామషెక్, తస్సావక్, తెబు. ప్రతీభాషా సమూహంగా అనుబంధంగా ఉన్న మొదటి భాషగా ఉంటుంది. హౌసా, జర్మ-సోన్రాయి భాషలు రెండూ దేశవ్యాప్తంగా విస్తారంగా వాడుకలో ఉన్నాయి.

పెద్ద నగరాలు

నగరం గణాంక విభాగం జనసంఖ్య
2001
ఉపస్థితి
అగడెజు అగడెజు ప్రాంతం 78,289 16°58′26″N 7°59′27″E / 16.9738889°N 7.9908333°E / 16.9738889; 7.9908333
అర్లితు అగడెజు ప్రాంతం 69,435 18°43′57″N 7°22′05″E / 18.7325°N 7.3680556°E / 18.7325; 7.3680556
బిరిని కొన్నీ తహౌయా ప్రాంతం 44,663 13°48′N 5°15′E / 13.8°N 5.25°E / 13.8; 5.25
డొగాండౌత్చి [Dogondoutchi]] డాసో 29,244 13°38′46″N 4°01′44″E / 13.6461111°N 4.0288889°E / 13.6461111; 4.0288889
డాసో డాసో ప్రాంతం 43,561 13°02′40″N 3°11′41″E / 13.0444444°N 3.1947222°E / 13.0444444; 3.1947222
మరాడీ మరాడీ ప్రాంతం 148,017 13°29′30″N 7°05′47″E / 13.4916667°N 7.0963889°E / 13.4916667; 7.0963889
నియామీ నియామీ ప్రాంతం 707,951 13°31′00″N 2°07′00″E / 13.5166667°N 2.1166667°E / 13.5166667; 2.1166667
తహౌయా తహౌయా ప్రాంతం 73,002 14°53′25″N 5°16′04″E / 14.8902778°N 5.2677778°E / 14.8902778; 5.2677778
తెసౌయా మరాడీ ప్రాంతం 31,667 13°45′12″N 7°59′11″E / 13.7533333°N 7.9863889°E / 13.7533333; 7.9863889
జిండరు జిండరు ప్రాంతం 170,575 13°48′00″N 8°59′00″E / 13.8°N 8.9833333°E / 13.8; 8.9833333

మతం

Religion in Niger
religion percent
Islam
  
99%
Christianity and Animism
  
0.5%

నైజరు ఒక లౌకిక దేశం 2010 రాజ్యాంగంలోని 3 ఆర్టికలు 175 ఆధారంగా మతస్వేచ్ఛకు హామీ ఇవ్వబడింది. భవిష్యత్తు సవరణలు నైజరు రిపబ్లిక్కు లౌకిక స్వభావాన్ని మార్చలేవు. మత స్వేచ్ఛ అనేది అదే రాజ్యాంగంలోని ఆర్టికల్ 30 ద్వారా రక్షించబడుతుంది. 10 వ శతాబ్దం నుంచి ఈ ప్రాంతంలో విస్తృతంగా వ్యాపించిన ఇస్లాం నైజరు ప్రజల సంస్కృతి, కట్టుబాట్లను బాగా ఆకట్టుకుంది. 2012 జనాభా లెక్కల ప్రకారం జనాభాలో 99% మంది ఇస్లాం మతాన్ని అనుసరిస్తున్నారు.


నైజరు ఇతర రెండు ప్రధాన మతాలలో క్రైస్తవ మతాన్ని జనాభాలో 0.3% ఆచరిస్తుమ్న్నారు. యానిమిజం (సాంప్రదాయ స్థానిక మత విశ్వాసాలు) జనాభాలో 0.2% మంది ఆచరిస్తున్నారు. ఫ్రెంచి వలసరాజ్యం కాలంలో మిషనరీలు దేశంలో క్రైస్తవమతాన్ని మొదటిసారిగా ప్రవేశపెట్టారు. ఐరోపా, పశ్చిమ ఆఫ్రికా నుండి వచ్చిన క్రైస్తవుల బహిష్కృత వర్గాలు కూడా పట్టణప్రాంతాలలో కనిపిస్తుంటాయి. మతపరమైన హింసను వివరించే " వరల్డ్ వాచ్ " జాబితాలో నైజరు చివరి (50) ర్యాంకులో ఉండడం నైజరులో మతపరమైన హింస అరుదని సూచిస్తుంది.

యానిమిస్టు అభ్యాసకుల సంఖ్య వివాదాస్పదంగా ఉంది. 19 వ శతాబ్దం చివరి నాటికి దేశంలోని దక్షిణప్రాంతంలో ఇస్లాం మతం అధికంగా ప్రభావితం చేయలేదు. కొన్ని గ్రామీణ ప్రాంతాల మార్పిడి పాక్షికంగా ఉంది. ఇప్పటికీ అనేకమంది చిన్న వర్గాలకు అనిమిస్టు ఆధారిత పండుగలు, సంప్రదాయాలు (బోరి మతం వంటివి) వాడుకలో ఉన్నాయి. సిక్రిటిక్ ముస్లిం సమూహాలు (హౌసా ప్రాంతంలోని టౌబౌ, వాడాబె పాస్టోరలిస్టులు) వీటిని ఆచరిస్తున్నారు. దీనిని ముస్లిం మతానికి మతాలను ఆచరించే ప్రజలు వ్యతిరేకిస్తుంటారు. వీరిలో దక్షిణ, నైరుతీ ప్రాంతంలోని డొగొండౌట్చి లోని హౌసా భాషా వాడుకరులైన మౌరీప్రజలు (అజ్నా), జిందరు సమీపంలోని మాంగా భాషావాడుకరులు ఇద్దరూ ఇస్లాం పూర్వ వైవిధ్యంతో కూడిన హౌసా మగజవా మతాన్ని ఆచరిస్తున్నారు. నైరుతీప్రాంతంలో బౌడౌమా, సొంఘే ఆనిమిస్టుకు చెందిన కొన్ని చిన్న సమూహాలు కూడా ఉన్నాయి.

ఇస్లాం

నైజర్లో ముస్లింలలో ఎక్కువమంది సున్నీ మతావలంబలకులు ఉన్నారు. 7% మంది షియా, 5% అహ్మదీయ, 20% ఏ శాఖకు చెందని వారు ఉన్నారు. 15 వ శతాబ్ధంలో పశ్చిమ ప్రాంతంలో సంఘై సామ్రాజ్యనిస్తరణలో భాగంగా, అలాగే ఈజిప్టు, మాఘ్రెబు మద్య సాగిన " ట్రాంసు సహరన్ ట్రేడు " ప్రభావంతో ప్రస్తుత నైజరు ప్రాంతంలో ఇస్లాం మతం ప్రవేశించింది. 17 వ శతాబ్ధంలో ఉత్తరప్రాంతం నుండి టౌరెగు విస్తరణలో కానెం బొర్ను సాంరాజ్యం ఆక్రమించబడడంతో బర్బరు మతాచరణ వ్యాపించింది.

18 - 19 వ శతాబ్దపు ఫులా సారథ్యంలోని సుఫీ సహోదత్వం సోకోటో కాలిఫేట్ (నేటి నైజీరియాలో) జర్మా, హౌసా ప్రాంతాల్లో బాగా ప్రభావం చూపింది. నైజరులో ఆధునిక ముస్లిం అభ్యాసం తరచుగా టిజనియ సుఫీ సహోదరత్వంతో ముడిపడివుంది. అయితే పశ్చిమప్రాంతంలో హమాల్లిజం న్యాసిస్టు సూఫీ మతంతో ముడిపడిన చిన్న అల్పసంఖ్యాక సమూహాలు, ఈశాన్యప్రాంతంలో సనుసియా ఆచరణలో ఉన్నాయి.

గత ముప్పై సంవత్సరాలలో రాజధాని, మరాడిలలో సున్ని ఇస్లాం మతంలో స్వల్పసంఖ్యలో సలాఫి ఉద్యమ అనుచరులు కేంద్రీకరించి ఉన్నారు. ఈ చిన్న సమూహాలు జోసు (నైజీయాలో)తో అనుసంధానితమై ఉన్నాయి. 1990 లలో మతపరమైన అల్లర్లు జరిగినతరువాత ప్రజల దృష్టిలోకి వచ్చింది.

అయినప్పటికీ నైజరు చట్టం ద్వారా రక్షించబడిన ఒక లౌకిక దేశంగా ఉంది. మతాలమద్య చాలా చకిఅటి సంబంధాలు ఉన్నాయి. దేశంలో సాంప్రదాయకంగా పాటిస్తున్న ఇస్లాం రూపాలు ఇతర విశ్వాసాల పట్ల సహనంతో, పరిమితి లేని వ్యక్తిగత స్వేచ్ఛతో ఉన్నట్లు గుర్తించబడ్డాయి. విడాకులు, బహుభార్యాత్వం గమనించబడడం లేదు. మహిళలు తలమీద ముసుగువేయడం తప్పనిసరి కాదు. పట్టణ ప్రాంతాలలో అవి అరుదుగా ఉంటాయి. స్థానికంగా ఉత్పత్తి అయిన బయేర్ నైజరు వంటి ఆల్కాహాలు దేశంలో చాలా వరకు దేశమంతటా బహిరంగంగా విక్రయించబడుతుంది.

.

విద్య

నైజర్ 
A primary classroom in Niger.

నైజరు అక్షరాస్యత శాతం ప్రపంచంలో అతి తక్కువగా ఉంది. 2005 లో 28.7% (42.9% మగ, 15.1% స్త్రీ) మాత్రమే ఉంది.నైజరులో ఆరు సంవత్సరాల ప్రాథమిక నిర్బంధ విద్య అమలులో ఉంది. ప్రాధమిక పాఠశాల నమోదు, హాజరు శాతం (ప్రత్యేకించి బాలికలకు) ఉంది. 1997 లో ప్రాధమిక నమోదు 29.3% ఉంది. 1996 లో నికర ప్రాథమిక నమోదు 24.5% ఉంది.


ప్రాధమిక పాఠశాలలు పూర్తిచేసిన పిల్లలలో బాలురు 60% ఉన్నారు. ఎందుకంటే చాలామంది బాలికలు పాఠశాలలో చాలా అరుదుగా హాజరవుతారు. పిల్లలు తరచూ పాఠశాలకు హాజరు కంటే పని చేయవలసిన వత్తిడికి (ప్రధానంగా నాటు నాటడం, వంట చేయడం) గురౌతుంటారు. దేశంలోని ఉత్తరప్రాంతంలో ఉన్న సంచారజాతి పిల్లల తరచూ పాఠశాలలు అందుబాటులో ఉండడం లేదు.

ఆరోగ్యం

నైజరు 1 - 4 సంవత్సరాల మద్య వయస్సు ఉన్న పిల్లల మరణాల సంఖ్య చాలా అధికంగా ఉన్నాయి. దేశంలో పిల్లలు పోషకాహారం లోపం కారణంగా అధిక సంఖ్య (1,000 కు 248) మరణిస్తున్నారు. " సేవ్ ది చిల్డ్రన్ " సేవాసంస్థ నివేదిక ఆధారంగా నైజరు ప్రపంచంలో అత్యధిక శిశు మరణాల రేటును కలిగి ఉంది.

నైజరు ప్రపంచంలోని అత్యధిక ఫలదీకరణ శాతం కలిగి ఉంది (2017 అంచనాల ప్రకారం మహిళకు 6.49 జననాలు)). నైజరు జనాభాలో దాదాపు సగం (49%) 15 సంవత్సరాల లోపు వయస్కులు ఉన్నారు. ప్రసవసమయంలో తల్లి మరణాల శాతం ప్రపంచంలో 11 వ స్థానంలో ఉంది. ప్రతి 1,00,000 మందిలో 820 మంది మరణిస్తున్నారు. 2006 గణాంకాల ఆధారంగా 1,00,000 మంది వ్యక్తులకు 3 వైద్యులు, 22 నర్సులు ఉన్నారని భావిస్తున్నారు.

సంస్కృతి

నైజర్ 
Horsemen at the traditional Ramadan festival at the Sultan's Palace in the Hausa city of Zinder.
నైజర్ 
A traditional home in Zinder.

నైజరు సంస్కృతి వైవిధ్యభరితమైనదిగా గుర్తించబడుతుంది. సంస్కృతిక కేంద్రంగా ఉన్న నైజరు ప్రాంతం ఫ్రెంచి వలసపాలనలో 20 వ ప్రారంభానికి సమైఖ్యరూపం సంతరించుకుంది. వలసరాజ్యాల పూర్వ కాలంలో నాలుగు ప్రత్యేకమైన సాంస్కృతిక ప్రాంతాల నుండి వచ్చిన ప్రజలతో ప్రస్తుత నైజరు ప్రాంతం సృష్టించబడింది. నైరుతి ప్రాంతంలోని నైజరు లోయాప్రాంతంలో జర్మాప్రజలు సంఖ్యాపరంగా ఆధిపత్యంలో ఉండేవారు. ఉత్తరతీరంలో ఉన్న హౌసాల్యాండులో ప్రజలు సోకోటో కాలిఫేటును ప్రతిఘటించారు. వీరు నైజరు సుదీర్ఘ దక్షిణ సరిహద్దు వెంట విస్తరించారు. తూర్పు ప్రాంతంలో చాద్ సరోవరప్రాంతం, కవౌరు ప్రాంతంలో కనౌరీ ప్రజలు (రైతులు, తౌబౌ పాస్టోరలిస్టులు) ఒకప్పుడు కానెం-బోర్ను సామ్రాజ్యంలో భాగంగా ఉన్నారు. ఉత్తరప్రాంతంలోని ఆయిరు పర్వతాలు, సహారా ఎడారి ప్రాంతాలలో టువరెగ్ సంచారప్రజలు నివసిస్తున్నారు.

ఈ కమ్యూనిటీలలో ప్రతి ఒక్కటి, మతసంబంధమైన వోడాబే, ఫూలా వంటి చిన్న జాతి సమూహాలతో కొత్త రాజ్యమైన నైజరుకు వారి సాంస్కృతిక సంప్రదాయాలను తఇసుకువచ్చారు. స్వాతంత్ర్యం తరువాత వచ్చిన ప్రభుత్వాలు ఒక భాగస్వామ్య జాతీయ సంస్కృతిమూస తయారు చేయటానికి ప్రయత్నించాయి. ఇది నెమ్మదిగా రూపొందించబడింది. ప్రధాన నైజరు సంప్రదాయ సమూహాలు తమ సొంత సాంస్కృతిక చరిత్రలు కలిగి ఉన్నారు. హుసా, టువరెగు, కానురి వంటి నైజరు జాతి సమూహాలు పెద్ద జాతి సమూహాలలో భాగంగా ఇది వలసరాజ్యాల పరిధిలోకి ప్రవేశించాయి.

1990 ల వరకు ప్రభుత్వాలు, రాజకీయాలను నియోమీ, జర్మ ప్రజలు ఆధిపత్యం చెలాయించారు. అదే సమయంలో బిర్నీ-ఎన్కోనీ, మైనే-సోరోల మధ్య ఉన్న హౌసా సరిహద్దులలో ప్రజలు నీయమీ కంటే సాంస్కృతికంగా ఉన్నత స్థితిలో ఉన్నారు. 1996 - 2003 మధ్యకాలంలో వీరి ప్రాథమిక పాఠశాల హాజరు సుమారుగా 30% ఉంది. ఇందులో 36% పురుషులు, 25% స్త్రీలు ఉన్నారు. అదనపు విద్య మదరసాల ద్వారా జరుగుతుంది.

పండుగలు, సంస్కృతిక సంఘటనలు

గ్యురెవొల్ ఉత్సవం

నైజర్ 
Participants in the Guérewol perform the Guérewol dance, 1997.

గ్యురెవోలు ఉత్సవం అనే సాంప్రదాయ వొడాబె సాంస్కృతిక కార్యక్రమం తహౌయా ప్రాంతంలోని అబాలలో, అగడెజు ప్రాంతంలోని ఇన్,గాలులో జరుగుతుంది. ఇది నైడార్లోని వాడాబే (ఫులా) ప్రజల చేత నిర్వహించబడిన వార్షిక సంప్రదాయ కర్మగా నిర్వహించబడుతుంది. ఈ ఉత్సవ సమయంలో యువత పురుషులు విస్తృతమైన అలంకరించబడ్డ దుస్తులు ధరించి, సాంప్రదాయ ముఖచిత్రాలు వేసుకుని పాటలు పాడుతూ, నృత్యం చేస్తూ వివాహవయస్కులైన యువతుల దృష్టిని ఆకర్షించడానికి పోటీ పడతారు. గ్యురెరోల్ ఉత్సవం అంతర్జాతీయంగా ఆకర్షణీయంగా ఉంటూ నేషనల్ జియోగ్రాఫిక్ వంటి ప్రముఖమైన చలనచిత్రాలు, మేగజైన్లలో ప్రదర్శించబడింది.

క్యూర్ సాలీ ఉత్సవం

"లా క్యూర్ సలీ" (ఇంగ్లీష్: సాల్ట్ క్యూర్) వర్షాకాలం ముగింపును జరుపుకోవడానికి సాంప్రదాయకంగా అగాడెజ్ ప్రాంతంలోని ఇన్'గలులో టువరెగు, వాడాబే సంచారప్రజల వార్షిక ఉత్సవం. మూడు రోజులు ఈ ఉత్సవంలో టువరెగు ఒంటె స్వారీ ఊరేగింపు, ఒంటె, గుర్రపు పందాలు, పాటలు, నృత్యాలు, కధా కథనాల ప్రదర్శనలు ఉన్నాయి.

మాధ్యమం

1990 ల చివరలో నైజరు వైవిధ్యమైన మాధ్యమాన్ని అభివృద్ధి చేయటం ప్రారంభించింది. మూడవ రిపబ్లిక్కు ముందు నైజరుప్రజలకు కఠిన నియంత్రణలో ప్రభుత్వ మాధ్యమం మాత్రమే అందుబాటులో ఉండేది. ఇప్పుడు నీయమీలో వార్తాపత్రికలు, మ్యాగజైన్లు అందుబాటులో ఉన్నాయి; లే సహేల్ వంటి కొన్ని ప్రభుత్వ నిర్వహణలో పనిచేస్తున్నాయి. టెలివిజన్ సెట్లు చాలామంది గ్రామీణ పేదలకు కొనుగోలు చేయడానికి అవసరమైన ఆర్ధికస్థితికి దూరంగా ఉన్నారు. నిరక్షరాస్యత ముద్రణ మాధ్యమాలు సామూహిక మాధ్యమంగా అభివృద్ధి చెందడాన్ని నిరోధిస్తుంది.

ప్రభుత్వ బ్రాడ్కాస్టరు ఒ.ఆర్.టి.ఎన్. సంస్థ జాతీయ, ప్రాంతీయ రేడియో సేవలకు అదనంగా నాలుగు ప్రైవేటు యాజమాన్య రేడియో నెట్వర్కులు ఉన్నాయి. ఇవి మొత్తం 100 స్టేషన్లకంటే అధికంగా ఉన్నాయి. వాటిలో మూడు-అంఫనీ గ్రూప్, సార్వోనియా, టెనెరే-ప్రధాన పట్టణాలలో పట్టణ ఆధారిత వాణిజ్య-ఫార్మాట్ ఎఫ్.ఎం. నెట్వర్కులు ప్రాధాన్యత వహిస్తున్నాయి. దేశంలోని ఏడు ప్రాంతాలలో 80 సంవత్సరాల కాలానికి ముందుగా స్థాపించబడిన కమ్యూనిటీ రేడియో స్టేషన్లు వ్యాపించాయి. కామిటే డి పైలోటేజ్ డి రేడియోస్ డి ప్రోక్సిటే (సిపిఆర్పి) అనబడే వీటిని పౌర సమాజ సంస్థలు నిర్వహిస్తున్నాయి. ప్రైవేటు రంగ రేడియో నెట్వర్కులు సి.పి.ఆర్.పి. సుమారు 7.6 మిలియన్ల ప్రజలకు (73% జనాభా (2005)) ప్రసారసేవలను అందిస్తున్నాయి.

నైజరు రేడియో స్టేషన్ల నుండి బి.బి.సి. హుసా సేవ దేశంలోని విస్తృత భాగాలలో ఎఫ్.ఎం. రిపీటర్లపై ముఖ్యంగా దక్షిణంలో నైజరు సరిహద్దుకు దగ్గరగా ఉంది. రేడియో ఫ్రాన్సు ఇంటర్నేషనలు కొన్ని వాణిజ్య కేంద్రాల ద్వారా ఉపగ్రహం ద్వారా ఫ్రెంచిభాషలో పునఃప్రసారం చేస్తుంది. టెనెరే ఎఫ్.ఎం. అదే పేరు గల జాతీయ స్వతంత్ర టెలివిజన్ స్టేషన్ కూడా నడుస్తుంది.


జాతీయస్థాయిలో స్వాతంత్రం ఉన్నప్పటికీ నైజరు పాత్రికేయులు స్థానిక అధికారులచే తరచూ ఒత్తిడికి గురౌతూ ఉన్నారు. ప్రభుత్వ ఒ.ఆర్.టి.ఎన్. నెట్వర్కు ప్రభుత్వం మీద ఆర్ధికంగా ఆధారపడి ఉంటుంది. ఇవి విద్యుత్తు బిల్లులపై సర్ఛార్జు ద్వారా, పాక్షికంగా ప్రత్యక్ష రాయితీ ద్వారా నిర్వహించబడుతున్నాయి. ఈ రంగం కౌన్సిల్ సుపీరియర్ డి కమ్యునికేషన్స్ చేత నిర్వహించబడుతుంది, ఇది 1990 ల ప్రారంభంలో స్వతంత్ర సంస్థగా స్థాపించబడింది. 2007 నుండి దౌడా డియాలో నాయకత్వంలో ఉంది. ప్రభుత్వం మీద విమర్శలను శిక్షించేందుకు రెగ్యులేషను, పోలీసులను ఉపయోగించినట్లు 1996 నుండి మానవ హక్కుల సంఘాలు ప్రభుత్వాన్ని విమర్శించాయి.

మూలాలు


Tags:

నైజర్ చరిత్రనైజర్ భౌగోళికం, వాతావరణం, వాతావరణంనైజర్ ఆర్ధికంనైజర్ గణాంకాలునైజర్ సంస్కృతినైజర్ మూలాలునైజర్అల్జీరియాచాద్నైజీరియాబుర్కినా ఫాసోబెనిన్మాలిలిబియా

🔥 Trending searches on Wiki తెలుగు:

మండల ప్రజాపరిషత్పది ఆజ్ఞలువర్ధమాన మహావీరుడుగజేంద్ర మోక్షంబుధుడు (జ్యోతిషం)వాసుకిపూర్ణిమ (నటి)విరాట పర్వముముళ్ళపందిభారత పార్లమెంట్రామావతారంయాదవనవరత్నాలుగోదావరితిథిపునర్వసు నక్షత్రముమోత్కుపల్లి నర్సింహులుమాల (కులం)ఆపిల్వై.యస్.అవినాష్‌రెడ్డిలిగ్నైట్యేసుభీమసేనుడుభారత జాతీయ ఎస్సీ కమిషన్బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిప్రభాస్జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రుల జాబితాభారత రాజ్యాంగ సవరణల జాబితాభారతదేశ ప్రధానమంత్రిరెడ్డిపూర్వ ఫల్గుణి నక్షత్రములలితా సహస్ర నామములు- 501-600అమెరికా సంయుక్త రాష్ట్రాలుమహాభాగవతంఫ్యామిలీ స్టార్ప్రకటనసూర్య నమస్కారాలుయవలుదిల్ రాజుసపోటాతొలిప్రేమభారతదేశ జిల్లాల జాబితాన్యుమోనియానితీశ్ కుమార్ రెడ్డివ్యావహారిక భాషోద్యమంసింహంచార్లెస్ ఫిలిప్ బ్రౌన్అక్కినేని నాగేశ్వరరావువార్త (న్యూస్)డీజే టిల్లుఎస్. జానకి2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల ఫలితాలుఆలీ (నటుడు)కరోనా వైరస్ 2019విజయ్ (నటుడు)పాడేరు శాసనసభ నియోజకవర్గంనవగ్రహాలుపాట్ కమ్మిన్స్వేంకటేశ్వరుడుసర్పంచివృశ్చిక రాశివారాహినవలా సాహిత్యముశ్రియా రెడ్డివిష్ణువుఏప్రిల్ 22లలితా సహస్ర నామములు- 801-900క్రిక్‌బజ్దర్శి శాసనసభ నియోజకవర్గంకల్వకుంట్ల కవితభారత స్వాతంత్ర్యోద్యమంయునైటెడ్ అరబ్ ఎమిరేట్స్పాలపిట్టఅక్కినేని నాగార్జునజూనియర్ ఎన్.టి.ఆర్స్వామి వివేకానందఊపిరితిత్తులుతెనాలి రామకృష్ణుడు🡆 More