నికోలా టెస్లా

నికోలా టెస్లా (ఆంగ్లం : Nikola Tesla) (1856 జూలై 10 - 1943 జనవరి 7) ఆవిష్కర్త, మెకానికల్ ఇంజనీర్, ఎలక్ట్రికల్ ఇంజనీర్.

నికోలా, ప్రస్తుతము క్రొయేషియాలో ఉన్న స్మిల్యాన్ అనే గ్రామంలో జన్మించాడు. ఇతడు పుట్టుకతో సెర్బియన్. తర్వాత కాలంలో అమెరికా పౌరుడు అయ్యాడు. ఇతడు తరచూ 'ధరణిపై కాంతిని విరజిమ్మిన' ఆధునిక యుగానికి చెందిన గొప్ప శాస్త్రవేత్తగా, ఆవిష్కర్తగా కీర్తించబడ్డాడు. 19వ శతాబ్దాంతంలో, 20వ శతాబ్దపు ఆరంభంలో విద్యుత్, అయస్కాంతత్వాలకు సంబంధించిన పరిశోధనలలో విప్లవాత్మకమైన విషయాలను అందించిన శాస్త్రవేత్త. నికోలా టెస్లా పేటెంట్లు, పరిశోధనా విషయాలు ఆధునిక విద్యుచ్ఛక్తి, ఎలక్ట్రిక్ మోటార్లు వంటి విషయాల అభివృద్ధికి దోహదపడడం ద్వారా రెండవ పారిశ్రామిక విప్లవానికి నాంది పలికాయి.

నికోలా టెస్లా
నికోలా టెస్లా
నికోలా (1856-1943), సుమారు 1893.
జననం(1856-07-10)1856 జూలై 10
స్మిల్యాన్, ఆస్ట్రియా సామ్రాజ్యం
(en:Military Frontier), ప్రస్తుతపు క్రొయేషియా
మరణం1943 జనవరి 7(1943-01-07) (వయసు 86)
న్యూయార్క్, న్యూయార్క్, అ.సం.రా
నివాసంఆస్ట్రియా సామ్రాజ్యం
హంగేరీ సామ్రాజ్యం
ఫ్రాన్స్
USA
పౌరసత్వంఆస్ట్రియా సామ్రాజ్యం (pre-1891)
అమెరికన్ (post-1891)
జాతిసెర్బియన్
రంగములుమెకానికల్ and ఎలక్ట్ర్రికల్ ఇంజనీరింగ్
వృత్తిసంస్థలుEdison Machine Works
en:Tesla Electric Light & Manufacturing
Westinghouse Electric & Manufacturing Co.
ప్రసిద్ధిటెస్లా కాయిల్
టెస్లా టర్బైన్
టెలిఫోర్స్
en:Tesla's oscillator
en:Tesla electric car
en:Tesla principle
en:Tesla's Egg of Columbus
ఆల్టర్నేటింగ్ కరెంట్
ఇండక్షన్ మోటార్
రొటేటింగ్ మాగ్నెటిక్ ఫీల్డ్
వైర్లెస్ టెక్నాలజీ
పార్టికల్ బీమ్ వెపన్
డెత్ రే
en:Terrestrial stationary waves
en:Bifilar coil
en:Telegeodynamics
en:Electrogravitics
ప్రభావితం చేసినవారుఎర్నెస్ట్ మాష్
ప్రభావితులుగనో డన్
ముఖ్యమైన పురస్కారాలుఎడిసన్ మెడల్ (1916)
en:Elliott Cresson Gold Medal (1893)
en:John Scott Medal (1934)
సంతకం
నికోలా టెస్లా

1894లో వైర్‌లెస్ కమ్మ్యూనికేషన్ (రేడియో) ప్రదర్శన వల్ల అమెరికాలోని ఎలక్ట్రికల్ ఇంజనీర్లలో గొప్ప వ్యక్తిగా గుర్తించబడ్డాడు. టెస్లా ఆవిష్కరణలు ఆధునిక ఎలక్టికల్ ఇంజనీరింగ్ విభాగానికి మార్గదర్శకాలయ్యాయి.

ఈ కాలంలో అమెరికా సంయుక్త రాష్ట్రాలలో టెస్లా కీర్తి చరిత్రలో మరే ఇతర ఆవిష్కర్త లేదా శాస్త్రవేత్తతో పోల్చదగ్గదిగా ఉన్నప్పటికీ అతని అసాధారణ వ్యక్తిత్వం, సాధ్యమైన శాస్త్రీయ, సాంకేతిక పరిణామాల గురించి నమ్మశక్యం కాని, కొన్నిసార్లు వికారమైన వాదనలు కారణంగా, టెస్లా చివరికి బహిష్కరించబడ్డాడు. అతను పిచ్చి శాస్త్రవేత్తగా పరిగణించబడ్డాడు. తన ఆర్థిక విషయాలపై ఎప్పుడూ ఎక్కువ దృష్టి పెట్టని టెస్లా 86 సంవత్సరాల వయసులో పేదరికంతో మరణించాడు.

అతస్కాత అభివాహ సాంద్రత లేదా అయస్కాంత ప్రేరణ (సాధారణంగా అయస్కాత క్షేత్రం "B" గా సుపరిచితం) ఎస్.ఐ ప్రమాణం నకు అతని గౌరవార్థం "టెస్లా" గా నామకరణం చేసారు. అదే విధంగా టెస్లా 1893 లోనే తక్కువ స్థాయిలో (లైట్‌బల్బులు) ప్రదర్శించాడు. అసంపూర్తిగా ఉన్న తన వార్డెన్‌క్లిఫ్ టవర్ ప్రాజెక్టులో పారిశ్రామిక శక్తి స్థాయిలను ఖండాంతరాలకు ప్రసారం చేయాలని ఆకాంక్షించాడు. దీని ఫలితంగా ఎలక్ట్రానిక్ పరికరాలకు వైర్‌లెస్ శక్తి బదిలీ టెస్లా ప్రభావం మూలంగా జరుగుతుంది.

అతను విద్యుదయస్కాంతత్వం, విద్యుత్ యాంత్రిక ఇంజనీరింగ్ విభాగాల్లో చేసిన కృషి ఫలితంగా రోబోటిక్స్, రిమోట్ కంట్రోల్, రాడార్, కంప్యూటర్ విజ్ఞానం, బాలిస్టిక్స్, కేంద్రక భౌతిక శాస్త్ర రంగాలలో పురోగతి సాధించగలిగింది. 1943 లో యునైటెడ్ స్టేట్స్ లోని సుప్రీంకోర్టు అతన్ని రేడియో ఆవిష్కర్తగా పేర్కొంది.

జీవితం

ఆరంభం

నికోలా టెస్లా 
నికోలా టెస్లా పుట్టిన ఇల్లు, క్రొయేషియాలోని స్మిల్యాన్ గ్రామంలో నికోలా విగ్రహం.
నికోలా టెస్లా 
23 సం. వయస్సులో టెస్లా (సిర్కా.1879)

నికోలా సెర్బియన్ దంపతులకు క్రొయేషియాలోని స్మిల్యాన్ గ్రామంలో జన్మించాడు. అతను సరిగ్గా ఉరుములు మెరుపులతో వర్షం పడుతున్నప్పుడు అర్ధరాత్రి జన్మించాడని ఒక కథనం ఉంది. ఇతని బాప్తిస్మపు ధ్రువీకరణ పత్రం ప్రకారం 28 జూన్ (N.S. 10, జూలై), 1856 న జన్మించినట్టు, ఈయన తండ్రి మిలుటిన్ టెస్లా, స్రెమ్స్కీ కార్లోవ్చీ పట్టణప్రాంతంలోని సెర్బియన్ ఆర్తోడాక్స్ చర్చిలో మతప్రచారకుడు, తల్లి, డూకా మాండిక్ గా పేర్కొనబడినది. ఈయన తండ్రి తరఫు వంశం వారు తారా లోయ లోని స్థానిక సెర్బు తెగకు చెందిన వారైనా లేదా హెర్జిగీవ్నియన్ నోబుల్ పావ్లే ఓర్లొవిక్ సంతతికి చెందిన వారైనా అయ్యుంటారని భావన. టెస్లా తల్లి డూకా, కోసావో ప్రాంతం నుండి వచ్చి లీకా, బంజియా ప్రాంతాలలో స్థిరపడిన కుటుంబానికి చెందినది. ఈమె తండ్రి సెర్బియన్ ఆర్తోడాక్స్ చర్చిలో మతప్రచారకుడు. ఈమె గృహాలంకారణ పనిముట్లు తయారు చేయటంలో ప్రావీణ్యం కలది. ఈమె అనేక సెర్బియా పౌరాణిక గేయాలను కూడా కంఠతా వల్లించేది కానీ ఎప్పుడూ చదవటం, వ్రాయటం నేర్చుకోలేదు.

నికోలా ఐదుగురు సంతానంలో నాలుగవవాడు. ఈయనకు ఒక అన్న (డేన్, నికోలాకు ఐదేళ్లున్నప్పుడు గుర్రపుస్వారీ ప్రమాదంలో మరణించాడు), ముగ్గురు సోదరీమణులు (మిల్కా, ఆంజెలీనా,మరికా).: 3  ఈయన కుటుంబం 1862లో గాస్పిక్‌కు తరలివెళ్ళింది. టెస్లా కార్లొవాక్ లో చదువుకున్నాడు. నాలుగేళ్ళలో పూర్తి చేయాల్సిన విద్యను మూడేళ్ళలోనే పూర్తిచేశాడు.

టెస్లా ఆ తర్వాత 1875లో గ్రాజ్ లోని ఆస్ట్రియన్ పాలిటెక్నిక్ (ఇప్పుడది గ్రాజ్ సాంకేతిక విశ్వవిద్యాలయం) లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగు పూర్తిచేశాడు అక్కడుండగా ఆల్టర్నేటింగు కరెంటు యొక్క ఉపయోగాలను అధ్యయనం చేశాడు. కొన్ని మూలాలు ఈయన గ్రాజ్ విశ్వవిద్యాలయం నుండి బాచిలరేట్ పట్టా పొందాడని చెబుతున్నవి. అయితే, విశ్వవిద్యాలయం మాత్రం టెస్లా పట్టభద్రుడు కాలేదని, మూడో సంవత్సరపు మొదటి అర్ధభాగంలో తరగతి గదిలో జరిగే పాఠాలకు హాజరవటం మానేశాడని, ఆ తరువాత చదువు కొనసాగించలేదని చెబుతున్నది. 1878 డిసెంబరులో తన కుటుంబంతో తెగతెంపులు చేసుకొని గ్రాజ్ వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. స్నేహితులు ఈయన ముర్ నదిలో మునిగిపోయాడని భావించారు. మారిబోర్ (ప్రస్తుతం స్లొవేనియాలో ఉన్నది) కు వెళ్ళి తొలుత ఒక సంవత్సరం పాటు సహాయ ఇంజనీరుగా ఉద్యోగం చేశాడు. ఈ సమయంలోనే మనోవ్యధకు గురయ్యాడు. ఆ తరువత టెస్లా తండ్రి ప్రోద్బలంతో ప్రాగ్ లోని చార్లెస్ ఫెర్డినాండ్ విశ్వవిద్యాలయంలో చేరి, అక్కడ 1880 వేసవిలో చదువుకున్నాడు. అక్కడ ఎర్నెస్ట్ మాక్ చే ప్రభావితుడయ్యాడు. కానీ, తండ్రి మరణించిన తర్వాత, కేవలం ఒకే టర్ము పూర్తి చేసిన తర్వాత విశ్వవిద్యాలయాన్ని వదిలిపెట్టాడు.

టెస్లా అనేక పుస్తకాలు, శాస్త్రీయ రచనలు చదవటం ప్రారంభించాడు. తన ఏకసంథాగ్రాహ్యంతో అమాంతం పుస్తకాలు పుస్తకాలనే వళ్ళెవేయటం ప్రారంభించాడు.

మరింత చదవటానికి

ప్రచురణలు

పుస్తకాలు

  • Anderson, Leland I., "Dr. Nikola Tesla (1856–1943)", 2d enl. ed., Minneapolis, Tesla Society. 1956.
  • Auster, Paul, "Moon Palace", 1989. Tells Tesla's story - among other's - within the history of the United States.
  • Cheney, Margaret, "Tesla: Man Out of Time", 1981. ISBN 0-13-906859-7.
  • Childress, David H., "The Fantastic Inventions of Nikola Tesla," 1993. ISBN
  • Glenn, Jim, "The Complete Patents of Nikola Tesla," 1994. ISBN
  • Jonnes, Jill "Empires of Light: Edison, Tesla, Westinghouse, and the Race to Electrify the World". New York: Random House, 2003. ISBN
  • Martin, Thomas C., "The Inventions, Researches, and Writings of Nikola Tesla," 1894 .
  • O'Neill, John Jacob,"Prodigal Genius," 1944. Paperback reprint 1994, ISBN 978-0-914732-33-4. (ed. Prodigal Genius is available online)
  • Lomas, Robert,"The man who invented the twentieth century : Nikola Tesla, forgotten genius of electricity," 1999. ISBN
  • Ratzlaff, John and Leland Anderson, "Dr. Nikola Tesla Bibliography", Ragusan Press, Palo Alto, California, 1979, 237 pages. Extensive listing of articles about and by Nikola Tesla.
  • Seifer, Marc J., "Wizard, the Life and Times of Nikola Tesla," 1998. ISBN (HC), ISBN (SC)
  • Tesla, Nikola, "Colorado Springs Notes, 1899–1900"
  • Tesla, Nikola, "My Inventions" Parts I through V published in the Electrical Experimenter monthly magazine from February through June, 1919. Part VI published October, 1919. Reprint edition with introductory notes by Ben Johnson, New York: Barnes and Noble,1982, ISBN; also online at "Lucid Cafe Archived 2016-02-02 at the Wayback Machine, et cetera as "The Strange Life of Nikola Tesla", 1919. ISBN
  • Trinkaus, George "TESLA: The Lost Inventions", High Voltage Press, 2002. ISBN 0-9709618-2-0
  • Valone, Thomas, "Harnessing the Wheelwork of Nature: Tesla's Science of Energy," 2002. ISBN

పత్రికలు

  • Carlson, W. Bernard, "Inventor of dreams". Scientific American, March 2005 Vol. 292 Issue 3 p. 78(7).
  • Jatras, Stella L., "The genius of Nikola Tesla". The New American, 28 July 2003 Vol. 19 Issue 15 p. 9(1)
  • Rybak, James P., "Nikola Tesla: Scientific Savant". Popular Electronics, 1042170X, November 1999, Vol. 16, Issue 11.
  • Lawren, B., "Rediscovering Tesla". Omni, March 1988, Vol. 10 Issue 6.

చిత్రసమాహారం

  • టెస్లా జీవితాన్ని ఆధారంగా కనీసం రెండు చలనచిత్రాలు నిర్మించబడ్డాయి. In the first, filmed in 1977, arranged for TV, Tesla was portrayed by Rade Šerbedžija. In 1980, Orson Welles produced a Yugoslav film named Tajna Nikole Tesle (The Secret of Nikola Tesla), in which Welles himself played the part of Tesla's patron, J.P. Morgan. Film was directed by Krsto Papić, and Nikola Tesla was portrayed by Petar Božović.
  • "Tesla: Master of Lightning". 1999. ISBN (Book) ISBN (PBS Video)
  • Lost Lightning: The Missing Secrets of Nikola Tesla (at Google Video) - Phenomenon: the Lost Archives documentary about Tesla's designs for free energy and defensive weapons systems.
  • David Bowie portrayed Tesla in the 2006 film "The Prestige". Tesla's time in Colorado Springs was the focus of several scenes in the film, which featured speculations on the explosive power of Tesla's electrical experiments.
  • In The Bucket List, the character Carter Chambers, played by Morgan Freeman, tells his co-worker about how Tesla invented radio years before Guglielmo Marconi.
  • Tesla: Master of Lightning, produced by Robert Uth for New Voyage Communications in 2003, tapped Stacy Keach to supply the voice of Tesla.

పాదపీఠికలు

మూలాలు

బయటి లింకులు

Tags:

నికోలా టెస్లా జీవితంనికోలా టెస్లా మరింత చదవటానికినికోలా టెస్లా పాదపీఠికలునికోలా టెస్లా మూలాలునికోలా టెస్లా బయటి లింకులునికోలా టెస్లాఆంగ్లంక్రొయేషియా

🔥 Trending searches on Wiki తెలుగు:

జాంబవంతుడుశోభితా ధూళిపాళ్లYసంగీత వాయిద్యంకుర్రాళ్ళ రాజ్యంశుక్రుడు జ్యోతిషంతెలుగు అక్షరాలునాయీ బ్రాహ్మణులుజే.సీ. ప్రభాకర రెడ్డివంగవీటి రంగాతరగతి (జీవశాస్త్రం)పులివెందుల శాసనసభ నియోజకవర్గంతోట త్రిమూర్తులుసున్నపక్షవాతంగీతాంజలి (1989 సినిమా)పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిభగవద్గీతనన్నయ్యసప్త చిరంజీవులులగ్నంనవధాన్యాలునయన తారచిలుకూరు బాలాజీ దేవాలయంప్రత్యూషపి.సుశీలరాజ్యసభదగ్గుబాటి పురంధేశ్వరిసమంతఅశ్వత్థామక్రికెట్బి.ఆర్. అంబేద్కర్అనువాదంకె. అన్నామలైఆంధ్రప్రదేశ్వరిబీజంఆంధ్రప్రదేశ్ చరిత్రనాగార్జునసాగర్బంగారు బుల్లోడుమ్యాడ్ (2023 తెలుగు సినిమా)వై.యస్.అవినాష్‌రెడ్డిఅనుష్క శెట్టిసింహరాశికన్నెగంటి బ్రహ్మానందంశ్రీ తిరుపతమ్మ అమ్మవారి దేవస్థానం (పెనుగంచిప్రోలు)శ్రీశైల క్షేత్రంభారత ఆర్ధిక వ్యవస్థమెదక్ లోక్‌సభ నియోజకవర్గంమీనరాశివాసుకి (నటి)కుక్కవంగ‌ల‌పూడి అనితకర్ర పెండలంసుబ్రహ్మణ్యపురం (2018 సినిమా)ఏలకులుపాముతమిళ భాషషష్టిపూర్తిపూర్వాభాద్ర నక్షత్రములలితా సహస్రనామ స్తోత్రంభారతదేశ పేరు పుట్టుపూర్వోత్తరాలుఏనుగు లక్ష్మణ కవిజాతీయ ప్రజాస్వామ్య కూటమిభారతీయుడు (సినిమా)లోకేష్ కనగరాజ్ఉత్తరాభాద్ర నక్షత్రముఆవర్తన పట్టికఆర్టికల్ 370 రద్దుగూగుల్గరుడ పురాణంబారిష్టర్ పార్వతీశం (నవల)ఉండి శాసనసభ నియోజకవర్గంభూమన కరుణాకర్ రెడ్డిపేరుమురుడేశ్వర ఆలయంధనూరాశిఅమెరికా రాజ్యాంగంసామజవరగమనవ్యవసాయం🡆 More